Spirit: చిన్న సినిమాని తొక్కేయడం కాదు... దమ్ముంటే 'స్పిరిట్'ని ఆపండి: విమర్శకులకిప్రణయ్ వంగా సవాల్
Spirit: చిన్న సినిమాని తొక్కేయడం కాదు... దమ్ముంటే 'స్పిరిట్'ని ఆపండి: విమర్శకులకి ప్రణయ్ వంగా సవాల్
© 2026 nimisham.in
Spirit: చిన్న సినిమాని తొక్కేయడం కాదు... దమ్ముంటే 'స్పిరిట్'ని ఆపండి: విమర్శకులకి ప్రణయ్ వంగా సవాల్

Spirit: చేతనైతే ‘స్పిరిట్’ను అటాక్ చేయండి.. చూసుకుందాం: నిర్మాత ప్రణయ్ వంగా ఓపెన్ ఛాలెంజ్

Prabhas KTR: ప్రభాస్‌కు కేటీఆర్ ప్రాంక్ కాల్.. సోషల్ మీడియాలో సరదా వీడియో వైరల్

వరుణ్ తేజ్(Varun Tej Son) తన ముద్దుల కొడుకును సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పంచుకున్న అరుదైన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న ఉత్కంఠ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)సీఎల్పీ భేటీలో అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.
Tomorrow Telugu Movies in TV Channels : గురువారం టీవీలో రానున్న చిత్రాలు.. లిస్ట్‌లోని మూవీస్ చూశారా?

Sandeep Reddy Vanga | శేఖర్ కమ్ముల హీరోలంటే నాకు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: ‘నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు’.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ వైరల్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్ కి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ గెస్టులుగా హాజరయి సందడి చేశారు.

Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Spiritual Tips: గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ పనులు చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది!
Telugu Movies List in TV: బుధవారం టీవీలో రానున్న చిత్రాలు.. ఈ సినిమాలపై లుక్కేయండి?

Prabhas | ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్ .. వైరల్‌గా చైనా డ్యాన్సర్ వీడియో!

అటు ఫౌజీ.. ఇటు స్పిరిట్! ఒత్తిడిలో ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్‌ను రోమాంచకం సినిమా బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న సుమంత్ ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ప్రభాస్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా తన ఆశీర్వాదాలను అందించారు. యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ధరించిన షర్ట్‌పై ప్రభాస్ స్వయంగా తన చేతులతో ఒక సందేశాన్ని రాసి చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ప్రచారం వేగవంతం చేశారు. రొమాంటిక్, కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ సరసన అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రభాస్ తన షర్ట్‌పై "లైవ్ విత్ ప్రభాస్" అని రాయడంతో సుమంత్ ప్రభాస్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆల్ ది బెస్ట్, ఇరగదీసేయ్, ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావాలని ప్రభాస్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇదిలా ఉండగా, భవిష్యత్తులో రాబోయే స్పిరిట్ సినిమా రికార్డులను కూడా ఈ రోమాంచకం చిత్రం దాటేయాలంటూ ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానిస్తూ ఆశీర్వదించారు. ఈ ప్రత్యేక క్షణంలో ప్రభాస్ చూపించిన అభిమానానికి సుమంత్ ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫలితంగా ఈ కనువిందు చేసే సన్నివేశానికి సంబంధించిన వార్త ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ఇచ్చిన ప్రోత్సాహంతో చిత్ర యూనిట్ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇచ్చిన ఈ గ్రాండ్ సపోర్ట్ సినిమా ప్రచారానికి మరింత ప్లస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక చిన్న సినిమాకు తన మద్దతు తెలిపి ప్రమోషన్స్‌లో కొత్త జోష్ నింపారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న ‘రోమాంచకం’ చిత్ర బృందానికి ఆయన తన శుభాకాంక్షలు అందజేశారు. సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాలని, తన ‘స్పిరిట్’ చిత్రాన్ని కూడా దాటిపోవాలని సరదాగా వ్యాఖ్యానించారు.సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటిస్తున్న ‘రోమాంచకం’ సినిమా రేపు (సెప్టెంబర్ 3న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హీరో సుమంత్ ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభాస్, సుమంత్ షర్ట్‌పై సంతకం చేసి.. "ఆల్ ది బెస్ట్.. ఇరగదీసేయ్. 'రోమాంచకం' బ్లాక్ బస్టర్ అయిపోవాలి. ‘స్పిరిట్’ని కూడా దాటెయ్యాలి" అంటూ చిత్ర బృందానికి విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది.ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌తో కలిసి సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తన భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పుడు అదే బ్యానర్లో, సందీప్ వంగా సమర్పణలో ‘రోమాంచకం’ వస్తుండటంతో ప్రభాస్ తన వంతు సపోర్ట్ అందిస్తున్నారు. గతంలో ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రశంసించారు.వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ ‘రోమాంచకం’ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ వంటి స్టార్
చేపలకు ఆహారం వేస్తామని చెప్పి ఇంటికే టోకరా.. 6 ఏళ్ల తర్వాత బయటపడ్డ మోసం హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎం. నవీన్ కుమార్ కుటుంబం నివసిస్తోంది. మార్చి 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో వీరు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదనుగా భావించిన.. రామశర్మ, అతని భార్య ప్రమీలారాణి దంపతులు రంగంలోకి దిగారు. మీరు ఊరికి వెళ్తే ఇంట్లోని అక్వేరియం ఉంది కదా.. మరి ఆ చేపలకు ఫుడ్ ఎవరు వేస్తారు? అవి చనిపోతాయి కదా.. అంటూ అమాయకపు కన్నీరు కార్చారు. తాము ఎంతో నమ్మకంగా ఉంటామని చెప్పి బాధితుల ఇంటి తాళాలు తీసుకున్నారు. తాళాలు చేతికి చిక్కగానే ఆ దంపతులు తమ అసలు రంగు బయటపెట్టారు. ఇంట్లోని బీరువాలో ఉన్న బాధితురాలి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్లులను దొంగిలించారు. ఆమె భర్తే తన సొంత ఇంటిని భార్యకు అద్దెకు ఇచ్చినట్లుగా ఫేక్ రెంటల్ అగ్రిమెంట్లు సృష్టించి.. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ పత్రాలతో ఆన్లైన్ పోర్టల్‌లో ఏకంగా శ్రీ గురుదత్త లక్ష్మీనరసింహ గురువాంబిక శక్తిపీఠం పేరుతో ఓ ఆధ్యాత్మిక పీఠాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వార్తకు సంబంధించిన

సివిల్ సొసైటీ, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు విలువలు లేని వికసిత్ భారత్.. వికసిత్ భారత్ కాదు విశాఖ అభివృద్ధి మన బాధ్యత.. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయబోం హరే కృష్ణ గోకుల్ ట్రస్ట్, ప్రేమ ఉదయం, ఏజ్ కేర్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి లోకేష్ విశాఖపట్నం, ఆనందపురం: ప్రేమ ఉదయం & ఏజ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం వద్ద నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా హరే కృష్ణ మూవ్మెంట్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్‌కు నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కిచెన్‌ను పరిశీలించారు. హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణాని భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఆలయానికి సంబంధించిన ప్రత్యేక ఏవీనీ మంత్రి లోకేష్ తిలకించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి లోకేష్ ను నిర్వాహకులు సత్కరించారు. అనంతరం ప్రేమ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ నూతన కాలేజీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, నూతన కాలేజీ భవనాలను పరిశీలించారు. అనంతరం ఏజ్ కేర్ ఫౌండేషన్/స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ జెరియాట్రిక్ & పాలియేటివ్ కేర్ సెంటర్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డోనర్ గ్యాలరీని సందర్శించారు. ఏజ్ కేర్ ఫౌండేషన్ భవనంలోని 4వ అంతస్తు, 5వ అంతస్తును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం సంస్థకు సహకరిస్తున్న ముఖ్య దాతలతో బోర్డ్‌రూమ్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… దివంగత పద్మశ్రీ డాక్టర్ ఎస్.వి. ఆదినారాయణరావు గారు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని ఆయన తెలిపారు. ప్రభాస్ తన ఇతర సినిమా కమిట్మెంట్లు పూర్తి చేసుకుని ఫ్రీ అయిన వెంటనే తర్వాతి షెడ్యూల్స్‌ను వేగంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తతో కల్కి 2 సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రొడక్షన్ పురోగతిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇంతకుముందు జూన్ నెలలో వచ్చిన నివేదికలతో పోలిస్తే ఈ ప్రకటన కొంత మార్పును సూచిస్తోంది. ఆ సమయంలో రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మొదలవుతుందని, రైటింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులు ఎక్కువగా పూర్తయ్యాయని నాగ్ అశ్విన్ వెల్లడించారు. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా సెప్టెంబర్ ప్లాన్ వాయిదా పడిందని ఆగస్టు నివేదికలు స్పష్టం చేశాయి. ఫౌజీ మరియు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ప్రభాస్‌ను బిజీగా ఉంచడంతో కల్కి 2 సెట్స్‌కు ఆయన రావడం ఆలస్యమైంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ భాగాలు ఇప్పటికే కొంతవరకు పూర్తయినట్లు సమాచారం అందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ భైరవ లేదా కర్ణ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. మరోవైపు సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొనే సెప్టెంబర్ 2025లో అధికారికంగా బయటకు రావడంతో ఆ ముఖ్యమైన పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ స్కేల్ చాలా పెద్దది కావడం వల్ల సినిమా నిర్మాణం మరింత సమయం తీసుకోనుంది. హెవీ VFX

సినిమా ఇండస్ట్రీలో రిస్క్‌తో కూడుకున్న స్టంట్ సీన్స్ లేదా భౌతికంగా కష్టమైన ఘట్టాల కోసం బాడీ డబుల్స్ (డూప్స్) వాడటం సాధారణమైన విషయమే. ఎక్కువగా బాడీ డబల్స్ ని బాలీవుడ్ లో వాడుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో రిస్క్‌తో కూడుకున్న స్టంట్ సీన్స్ లేదా భౌతికంగా కష్టమైన ఘట్టాల కోసం బాడీ డబుల్స్ (డూప్స్) వాడటం సాధారణమైన విషయమే. ఎక్కువగా బాడీ డబల్స్ ని బాలీవుడ్ లో వాడుతుంటారు. ఈమధ్యనే ఈ ట్రెండ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ప్రభాస్ (Prabhas) నటించిన కొన్ని సినిమాల్లో కూడా ఆయన బాడీ డబుల్స్‌పై ఎక్కువగా ఆధారపడ్డారంటూ పలు వార్తలు, రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ డూప్స్ కి పనిచెప్పలేదని సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ చిత్రంలో మాత్రం ప్రభాస్ ఎలాంటి డూప్‌ను వాడటం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కి బదులుగా ఒక్క షాట్లో కూడా బాడీ డబుల్ కనిపించరని ఆయన ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో ప్రణయ్ మాట్లాడుతూ.. సాధారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో బాడీ డబుల్స్‌ను ఉపయోగించరని, స్పిరిట్ లోని ప్రతి సన్నివేశాన్ని, రిస్కీ యాక్షన్ సీక్వెన్సులను ప్రభాస్ స్వయంగా చేస్తున్నట్లు ప్రణయ్ రెడ్డి తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రభాస్ చూపిస్తున్న అంకితభావాన్ని ఆయన కొనియాడడమే కాకుండా అవసరమైనప్పుడు ప్రభాస్ ఏకంగా రోజుకు 18 గంటల పాటు షూటింగ్లో పాల్గొంటూ కష్టపడుతున్నాడని వెల్లడించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయిందని, అనుకున్న ప్రణాళిక ప్రకారమే వచ్చే ఏడాది మార్చి 5 న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు

ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ వివాదం మరోసారి చర్చకు దారితీసింది. చిత్రం నుంచి తప్పుకున్న దీపికా పదుకొణెపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇటీవల పలు ఆరోపణలు చేశారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వని దీపికా, పాత్రికేయురాలు జాన్వి మంచందా పెట్టిన సామాజిక మాధ్యమ పోస్టును లైక్ చేశారు. మహిళా నటుల డిమాండ్లపై పరిశ్రమలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో దీపికా లైక్‌ను వంగా బ్రదర్స్ ఆరోపణలకు పరోక్ష కౌంటర్‌గా పలువురు భావిస్తున్నారు. అయితే దీనిని ఆమె అధికారిక స్పందనగా పరిగణించలేమన్న విషయం కూడా గమనించాలి. 2025లో దీపికా పదుకొణె స్పిరిట్ నుంచి తప్పుకోవడంతో పని గంటలు, పారితోషికంపై భిన్నమైన కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త తల్లిగా రోజుకు 8 గంటల పని షెడ్యూల్ కావాలని ఆమె కోరినట్లు అప్పట్లో నివేదికలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనంతరం పేరును ప్రస్తావించకుండా అసభ్య ప్రచార ఎత్తుగడలు, చెప్పని గోప్యతా ఒప్పందం అంటూ స్పందించారు. ఆ వ్యాఖ్యలు దీపికాను ఉద్దేశించినవేనని సినీ వర్గాల్లో విస్తృతంగా భావించారు. తరువాత ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఎంపిక చేయడంతో స్పిరిట్ వివాదం కొంతకాలం సద్దుమణిగింది. తాజాగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో పాత అంశాలు మరోసారి ముందుకొచ్చాయి. ప్రణయ్ రెడ్డి వంగా కథనం ప్రకారం పారితోషికం, చిత్రీకరణ సమయాలతోపాటు మరికొన్ని అంశాల్లో ఒప్పందం కుదరలేదు. ముఖ్యంగా సినిమా నికర లాభాల్లో దీపికా 10 శాతం వాటా కోరినట్లు ఆయన వెల్లడించారు. ఆమె ఏదైనా అడగవచ్చని, కానీ చిత్ర ఆర్థిక లెక్కలకు సరిపడితేనే ఇవ్వగలమని వివరించారు. దీంతో ఆ ప్రతిపాదన అనుకూలంగా లేదని భావించి ఇతర అవకాశాలను పరిశీలించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, సినిమా కథతోపాటు పాత్రకు సంబంధించిన అంతర్గత సమాచారం బయటకు వెళ్లిందని కూడా ఆరోపించారు. దీపికాతో ముందుకు వెళ్లకూడదనే నిర్ణయం దర్శకుడు సందీప్ రెడ్డి

ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతో మరింత బలపడింది. దేశవ్యాప్తంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న ప్రభాస్‌కు ఇప్పుడు మరో కొత్త బిరుదు దక్కింది. అదే ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ (Indias Biggest superstar). సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ ప్రమోషనల్ కంటెంట్‌లో ఈ ట్యాగ్‌ను ఉపయోగించడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్లో ఈ బిరుదుపై చర్చ మొదలైంది. కొందరు అభిమానులు, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ ట్యాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విమర్శలతో చిత్రబృందం వెనక్కి తగ్గలేదు. తదుపరి విడుదల చేసిన పోస్టర్లలోనూ ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్‌ను కొనసాగించింది. దీంతో అసలు ఈ బిరుదును ప్రభాస్ ఎలా తీసుకున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయంపై ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడైన ప్రణయ్.. ‘రొమాంచకం’ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రభాస్ రియాక్షన్‌ను బయటపెట్టారు. “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్” అనే ట్యాగ్ గురించి ప్రభాస్‌కు చెప్పినప్పుడు.. ‘మీ ఇష్టం డార్లింగ్’ అని ఆయన అన్నారు అని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. ప్రభాస్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. తనకు ఇచ్చిన బిరుదుపై ప్రభాస్ ఎలాంటి హైప్ లేకుండా చాలా కూల్‌గా స్పందించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తనను తాను స్టార్‌గా చెప్పుకోవడం కంటే.. తన సినిమాలే తన స్థాయిని నిర్ణయిస్తాయన్నట్లుగా ప్రభాస్ రియాక్షన్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

కరీనా కపూర్ (Kareena Kapoor)కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ కి మొదటి భార్య వల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరూ నటులుగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు కరీనా, సైఫ్ మరోసారి తల్లితండ్రులు కాబోతున్నారు అనే రూమర్ వచ్చింది. దీనికి కారణం…ఇటీవల కరీనా జిమ్ నుంచి బయటికి వస్తుండగా పాపారాజి ఆమెని కెమెరాలో బంధించింది. ఆ వీడియోలో ఆమె భారీగా పొట్టతో కనిపించింది. దాంతో, ఆ బంప్ ‘గర్భం’ అని భావించి ఆమె మూడోసారి తల్లి కాబోతుంది అనే టాక్ వచ్చింది. ఆ వెంటనే కరీనా పీఆర్ టీం స్పందించింది. ఆమె గర్భవతి కాదని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల వెకేషన్ కి వెళ్లి అక్కడ ఏది పడితే అది తిని, ఎక్సర్ సైజు చెయ్యకపోవడంతో ఆమె బరువు పెరిగింది. అందుకే ఆమె మళ్ళీ జిమ్ లో కసరత్తులు చేస్తోందని ఆమె టీం తెలిపింది. మరోవైపు, ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి తీస్తున్న “స్పిరిట్” సినిమాలో కరీనా కపూర్ నటించబోతుంది అనే వార్తలపై కూడా క్లారిటీ వచ్చింది. ఆమె ఏ పాత్ర పోషించడం లేదు ఈ సినిమాలో

ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు. అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని. – యామిజాల జగదీశ్ బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రత్యేక పాత్రలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ఒక కీలక పాత్ర గురించి వస్తున్న వార్తలకు నిర్మాతల వైపు నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. గతంలో వచ్చిన టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ వినిపించడంతో, ఈ భారీ కాప్ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కథనంలో ఉన్న ఒక పవర్ ఫుల్ జైలర్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ను సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని ప్రణయ్ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా బలం చేకూరినట్లయింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో చేయనున్నారని సాగుతున్న ప్రచారానికి కూడా ప్రణయ్ ముగింపు పలికారు. 'స్పిరిట్' లో చిరంజీవి ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని తేల్చి చెప్పారు. కాస్టింగ్ పరంగా క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారిగా పూర్తిస్థాయి రోషకలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండడం మెగా మాస్ ఎలిమెంట్స్‌ని పెంచేస్తోంది. నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ ప్రతీ చిన్న వార్త నెట్టింట సంచలనమే సృష్టిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అసలు సందీప్, దీపికా మధ్య ఏం జరిగింది? ఆమెను ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సంచలన విషయాలు బయటపెట్టారు. 'స్పిరిట్' నుంచి దీపికా పదుకొనేను తీసేయడంపై ఇన్నాళ్లూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ, రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి షాకింగ్ నిజాలు వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ ఏదైనా ఒక సినిమా అనుకున్నారంటే.. పాత్రల విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్పిరిట్' కథ రాసుకుంటున్న సమయంలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆయన మొదట అనుకున్నది దీపికా పదుకొనేనే. సుమారు సంవత్సరంన్నర పాటు సందీప్, దీపికా ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్‌లో ట్రావెల్ చేశారు. ఆమె టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే అంత సమయం కేటాయించారు. అయితే, ఆ సమయానికి దీపికా నటించిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లుగా నిలిచాయి. దాంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ హిట్ల తర్వాత దీపికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. కేవలం భారీ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా.. సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం ప్రాఫిట్ షేర్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందట. దాంతో పాటు షూటింగ్ డేట్స్, రోజువారీ కాల్షీట్ టైమింగ్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానని కండీషన్స్ పెట్టింది. సరే, ఒక స్టార్ హీరోయిన్ అంత డిమాండ్ చేసినా బిజినెస్ పరంగా ఓకే అనుకోవచ్చు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ ప్రేక్షకులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది. దాంతో ఈసారి రెబల్ స్టార్ కు సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే వరుసగా సినిమాలను లైనప్ చేసిన ప్రభాస్ ఆయా షూటింగ్స్ లో యమా బిజీగా ఉన్నాడు. వాటిలో ముందుగా వచ్చేది మాత్రం స్పిరిట్ సినిమానే.. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లో ఆసక్తి రెట్టింపైంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను నెక్ట్స్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు స్పిరిట్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు ప్రభాస్ ను స్పిరిట్ లో ఎలా చూపించబోతున్నడో అంటూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇప్పటికే హింట్ ఇచ్చాడు సందీప్.. స్పిరిట్ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్ ఇక ఈ మూవీలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా నుంచి ఓ స్టార్ నటుడు తప్పుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు ప్రకాష్ రాజ్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రాజ్ కీలక పాత్రలో ఎంపిక చేశారట. అయితేఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఓ సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడంతో ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు

ప్రభాస్ 'స్పిరిట్' మూవీ కాస్టింగ్‌పై బిగ్ అప్డేట్పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపుదిద్దుకుంటున్న స్పిరిట్ చిత్రంపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించి ఒక కీలకమైన ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. ఈ మూవీలో వర్సటైల్ నటుడు ప్రకాశ్ రాజ్ భాగం కావడం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. స్పిరిట్ టీజర్లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ వినిపించడంతో ఆయన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అందరూ భావించారు. జైలర్ పాత్ర కోసం ముందుగా ఆయన పేరునే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదని వార్తలు వచ్చాయి. నిర్మాత ప్రణయ్ వంగా అధికారిక క్లారిటీఈ వ్యవహారంపై స్పిరిట్ చిత్ర నిర్మాత ప్రణయ్ వంగా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్‌లో నటించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది. ఫలితంగా జైలర్ పాత్రలో వేరొక నటుడు కనిపించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. చిరంజీవి క్యామియో రోల్‌పై స్పష్టత ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలను కూడా నిర్మాత ప్రణయ్ వంగా ఖండించారు. ఈ నేపథ్యంలో సినిమాలో చిరంజీవి ఎలాంటి క్యామియో రోల్ చేయడం లేదని తేలిపోయింది. షూటింగ్ మరియు ఇతర నటీనటుల వివరాలు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల ఎంపికపై దృష్టి సారించింది. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీ నుంచి దీపికను తీసేయడానికి గల అసలు కారణం నిర్మాత రివీల్ చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందంటూ గతంలో ప్రచారం సాగడం, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణానికి ఈ రకమైన షరతులు సమంజసంగా అనిపించకపోవడంతోనే పరస్పర అంగీకారంతో ఆమె
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ తో కలిసి సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. ప్రభాస్ మూవీ నుంచి దీపిక తప్పుకుందనే వార్త జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పందించారు.‘స్పిరిట్’ నుంచి దీపిక పదుకునే తప్పుకుందా? తప్పించారా? అని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అదే సమయంలో ‘రోజుకు 8 పని గంటలు’ అంశం తెర మీదకు వచ్చింది. ఈ నియమ నిబంధనల కారణంగానే దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అందరూ అనుకున్నారు. అప్పుడే దీపికాను ఉద్దేశించి సందీప్ వంగా పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కేవలం పని గంటలు మాత్రమే కాదు, రెమ్యూనరేషన్ విషయంలోనూ దీపిక పెట్టిన కండిషన్ వల్లే ఆమెను తప్పించినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు.ప్రణయ్ వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకునే తప్పుకోవడం గురించి మాట్లాడారు. “వెబ్ సైట్లలో ఏమి రాశారో అదే రీజన్. ఒకటి రెమ్యునరేషన్, రెండు టైమింగ్. అవి కాకుండా వేరే రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆమెను తీసేయాలనేది సందీప్ తీసుకున్న నిర్ణయమే. ఆమెతో సందీప్ ఒక ఏడాదిన్నరపాటు టచ్ లో ఉన్నాడు. ఆమె పర్ఫార్మెన్స్ నచ్చి, సినిమాలో ఉంటే బెటర్ గా ఉంటుందని ఆలోచించాము. ప్రాజెక్టులోకి తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆ ఏడాదిన్నరలో చాలా మారాయి. ఆమెవి ఓ రెండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది”“నెట్ ఇన్ కమ్ నుంచి 10 శాతం కావాలని డిమాండ్ చేసింది. అంటే లాభాల్లో పది శాతం అడిగింది. అన్నీ హద్దులు దాటిపోయాయి

దేవుని పూజలో దీపంతో పాటు అగరబత్తులు (ధూపం) వెలిగించడం మన సనాతన ధర్మంలో పూర్వకాలం నుండి వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం. పూజా సమయాల్లో అగరబత్తి నుంచి వచ్చే పరిమళభరితమైన సువాసన ఇల్లంతా వ్యాపించి, పూజా గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని నింపుతుంది. అంతేకాకుండా మనస్సులోని ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు. అయితే, దేవుని ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.. రోజువారీ పూజలో ఒకటి లేదా రెండు అగరబత్తులు వెలిగిస్తే సరిపోతుంది. పూజలో సంఖ్య కంటే మనస్సులోని నిశ్చలమైన భక్తి, శుద్ధత మాత్రమే అత్యంత ముఖ్యం. దేవుడి అనుగ్రహం పొందడానికి ఎక్కువ సంఖ్యలో అగరబత్తులు లేదా బాహ్య ఆడంబరాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఎక్కువ వెలిగిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా? ఎక్కువ సంఖ్యలో అగరబత్తులు వెలిగిస్తేనే ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఎక్కడా పేర్కొనలేదు. మోతాదుకు మించి వెలిగించడం వల్ల అధిక పొగ , ఇంటి వాతావరణం మసకబారడమే కాకుండా శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఏదైనా మితంగా ఉపయోగించడమే శ్రేయస్కరం. ఆధ్యాత్మికంగా, అగరబత్తి సువాసన మనస్సును ఏకాగ్రత వైపు మళ్లించి, ధ్యానం లేదా జపంలో నిమగ్నమవ్వడానికి సహాయపడుతుంది. అలాగే పరిసరాల్లోని ప్రతికూల (నెగెటివ్) శక్తులను తొలగించి, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అగరబత్తులను నేలపై కాకుండా ఎల్లప్పుడూ సురక్షితమైన, స్థిరమైన స్టాండ్‌లోనే అమర్చి వెలిగించాలి. అగరబత్తి వెలిగించిన తర్వాత దాని మంటను ఆర్పేసి, కేవలం పొగ (ధూపం) మాత్రమే వచ్చేలా చూడాలి. వెలిగించిన అగరబత్తులను ఎప్పుడూ అజాగ్రత్తగా వదిలేయకూడదు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఘాటైన రసాయనాలు (కెమికల్స్), అధిక పొగను వెలువరించే అగరబత్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. సహజసిద్ధమైన మూలికలతో తయారైన వాటిని ఎంచుకోవడం మంచిది. పూజలో దీపారాధనతో పాటు అగరబత్తి వాడటం శుభప్రదమే అయినప్పటికీ, అగరబత్తి వెలిగించడం తప్పనిసరి నియమమేమీ కాదు. ఒకవేళ అది

Spirit Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మేకర్స్ నుంచి కీలక స్పష్టత వచ్చింది. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మేకర్స్ ఖండించారు. ఈ సినిమా రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించిన ప్రకారమే 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు డార్లింగ్ తన కెరీర్లో చేయని విధంగా తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ఈ క్యారెక్టర్‌పై అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ప్రభాస్ లుక్, మేకోవర్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎమోషన్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో సినిమా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో భూషణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ డేట్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. 2027 మార్చి 5న ‘స్పిరిట్’ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి

ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తెరకెక్కించబోతున్నారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ‘స్పిరిట్’ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్ పార్క్’ (Animal Park) సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రణయ్ వంగా తెలిపారు. దీంతో ‘స్పిరిట్’ తర్వాత వంగా ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సందీప్ రెడ్డి వంగా తర్వాతి సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందని, మరికొందరు మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆ ప్రాజెక్టుల కంటే ముందుగా ‘యానిమల్ పార్క్’నే ఆయన టేకప్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రణ్విజయ్ సింగ్ బల్బీర్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమా ముగింపులో ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన హింట్ ఇవ్వడంతో అప్పటి నుంచే సీక్వెల్‌పై భారీ ఆసక్తి ఏర్పడింది. ‘యానిమల్ పార్క్’లో రణ్‌బీర్ కపూర్ మరింత పవర్ఫుల్, డార్క్ అవతార్‌లో కనిపించనున్నాడనే అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం కంటే సీక్వెల్ మరింత వైలెంట్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’పై ఫోకస్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ సినిమా తర్వాత ‘యానిమల్ పార్క్’ను పట్టాలెక్కించనున్నట్లు వస్తున్న ఈ క్లారిటీతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం

దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. అది కూడా వారంతా పట్టుకుని ఉతికారు. ఇంటర్నెట్ డెస్క్: దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. అది కూడా వారంతా పట్టుకుని ఉతికారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన రాష్ట్రం మణిపూర్. ఇక్కడి ప్రజలు బెయివోలి పండగను నెల రోజుల పాటు జరుపుకున్నారు. ఈ పండగ వేడుకలు ఇటీవల ముగిశాయి. దీంతో లియై గ్రామానికి చెందిన పలువురు యువకులు మురికి నీటితో ఉన్న చిన్న మడుగులోకి దిగారు. చొక్కాలు లేకుండా ఉన్న వారంతా తివాచీని ఆ నీటిలో ముంచి పైకి తీస్తూ పలుమార్లు ఉతికారు. అంతా ఒకే సారి వంగి పైకి లేస్తున్నారు. చుట్టూ కొండులను పచ్చదనం పరిచి ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియోను ట్విట్టర్లో నేహా గురుంగ్ పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియోలోని దృశ్యాలు ఆ ప్రాంతానికి సంబంధించిన సామూహిక స్ఫూర్తికి, కఠోర శ్రమకు ప్రతిబింబమని వారు అభివర్ణించారు. మరొకరు అయితే ఆ ప్రాంత సంస్కృతి, కష్టపడి పని చేయడంతోపాటు నిజమైన ఐక్యతకు ప్రతిబంబమని తెలిపారు. సామూహికంగా కలిసి పని చేస్తే.. సామాజిక స్ఫూర్తిని నింపవచ్చని అభిప్రాయపడ్డారు. ఇంకొకరు అయితే ఈశాన్య భారతదేశ సంస్కృతి ప్రత్యేకంగా ప్రశంసనీయమైనదని గుర్తు చేశారు. ఈ వీడియో లియైలోని సామూహిక జీవన విధానాన్ని కూడా చూపించిందని చెప్పారు. నెల రోజుల పాటు సాగిన ఉత్సవాల తర్వాత.. తివాచీలు శుభ్రపరిచే పని సామూహిక బాధ్యతగా ఆ ప్రాంతంలో మారిందని నెటిజన్లు పేర్కొన్నారు

పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో వరుస సినిమాలు చేస్తూ అత్యంత బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో వరుస సినిమాలు చేస్తూ అత్యంత బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. ఇండియన్ సినిమాలో తనదైన బోల్డ్ అండ్ రా మార్క్‌తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ కాంబినేషన్ పై టాలీవుడ్‌తో పాటు మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అద్భుతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను సందీప్ వంగా ఏ పవర్ఫుల్ పోలీస్ రోల్లో చూపించబోతున్నారా అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం విడుదలపై తాజాగా ఒక పుకారు వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టాక్. ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన ఇతర చిత్రాల చిత్రీకరణల కారణంగా స్పిరిట్ ప్రధాన షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో స్పిరిట్ వర్క్ కొంత ఆలస్యమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి దాదాపు 60% షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇంకోపక్క అక్టోబర్ నెల నుంచి తదుపరి భారీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సందీప్ రెడ్డి వంగా అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రసిద్ధ నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఒక కొత్త రిలీజ్ విండోను

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ మండిపడ్డారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. విశాఖపట్నం, ఆగస్టు18: కార్యకర్త నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పోరాటాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉందని అన్నారు. దేశాన్ని మరింత శక్తిమంతంగా చేయడానికి సంకల్పం తీసుకోవాలని ప్రతి కార్యకర్తకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో మంచి పాలన అందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమికి మంచి విజయాన్ని అందించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి కూటమి ఏర్పాటైందని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. అంధ్రప్రదేశ్పై ప్రధాన మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు. తమ కలలను సాకారం చేసే పార్టీని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. అనేక ప్రాజెక్టులు ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి డబల్ ఇంజిన్ సర్కార్ పని చేస్తుందని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. విపక్షం కాంగ్రెస్ పార్టీ అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. దీనిని తిప్పి కొట్టాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహిత్యంగా ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. వాటిని ఖండించాలని పార్టీ శ్రేణులకు నేషనల్ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో నిరాశ కనపడుతోందని

Arunachalam Girivalam: అరుణాచలంలో మోక్షమార్గం రహస్యం... గిరి ప్రదక్షిణలో ఈ గుహలోనుంచి ఎందుకు వెళతారో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా ఆరంభం నుంచే ఆకాశాన్నంటే భారీ అంచనాలు ఉన్నాయి. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో ప్రభాస్‌ను సరికొత్తగా చూపించబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ లవర్స్ సైతం అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు అంచనాలను మరింతగా రెట్టింపు చేయగా జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి. ఇదిలాఉంటే.. ఇక ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరియన్ స్టార్ డాన్ లీ (Ma Dong-seok, Don Lee) పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు లేవని టాక్ వినిపిస్తోంది. అయితే.. ‘స్పిరిట్’ చిత్రంలో చిరంజీవి, కొరియన్ స్టార్ డాన్ లీ కీ రోల్స్ చేస్తున్నారని గతంలో అనేక వార్తలు ఫుంఖాను ఫుంఖాలుగా వచ్చిన విషయం అందరికీ విధితమే. అంతేగాక ఈ వార్తలను మేకర్స్ ఇప్పటి వరకు అటు దృవీకరించక పోగా ఇటు ఖండించనూ లేదు. దీంతో ఈ సినిమాపై హైప్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్లో వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించలేదని తెలుస్తోంది. దీంతో అసలు వీరిద్దరూ సినిమాలో ఉన్నారా? లేక తర్వాతి షెడ్యూల్లో అయిన వారి ఎంట్రీ ఉంటుందా? లేదా లేక ఇవన్నీ వ్యర్థ ప్రచారాలేనా అనే చర్చ

నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా?నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా? Samatha 17 August 2026 Gen Z వారు ఎక్కువగా తమ పుస్తకంలో నెమలి ఈకలను పెట్టుకునేవారు. చాలా వరకు ప్రతి పిల్లల పుస్తకంలో ఈ నెమలి ఈకలు అనేవి ఉండేవి. అయితే చాలా మంది పుస్తకంలో నెమలి ఈకలు పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మార్కులు ఎక్కువ వస్తాయి అనేవారు. మరి నిజంగానే పుస్తకంలో నెమలి ఈక పెడితే మార్కులు ఎక్కువ వస్తాయా? దీని గురించి పండుతులు ఏం చెబుతున్నారు అనేది ఇ ప్పుడు చూద్దాం. పుస్తకంలో నెమలి ఈక పెట్టడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు. దీని వలన పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందంట. నెమలి ఈకలు కృష్ణుడికి, సరస్వతీ మాతకు చాలా ప్రీతికరం అంటారు. అందువలన ఈకలను పుస్తకంలో పెట్టడం చాలా మంచిదంట. దీని వలన జీవితంలోని అడ్డంకులు తొలిగిపోయి, చదువులో వెనకబడిన వారు కూడా మళ్లీ చదువులో రాణించే అవకాశం ఉన్నదం ట. పుస్తకంలో నెమలి ఈకను ఉంచడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగడంవలన అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు పండ ితులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమన ించాలి. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

శ్రావణ మాసం మొత్తం కూడా విష్ణువు, వరలక్ష్మి, శివుడికి అంకితం చేయబడిన నెల. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం విష్ణువు, శివుడు, లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తుంటారు. ఇక ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అంతే కాకుండా పూజలు చేసి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని అంటారు పండితులు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్లి, అభిషేకం చేసి, బిల్వదళాలతో స్వామి వారిని పూజించి, ఓం నమ:శివాయా అని 108 ససార్లు జపించడం వలన మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో 16 రకాల పూజా ద్రవ్యాలతో పూజ చేయడం వలన ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవున్నారో వారు వాటి నుంచి త్వరగా బయపటడతారంట. అంతే కాకుండా శ్రావణ మాసంలో అన్నదానం చేయడం వలన కూడా అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. ఈ మాసంలో ఎవరు అయితే అన్నదానం చేస్తారో వారికి ఉన్న పితృదోషాలు తొలిగిపోయి, కోరిన కోర్కెలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నెరవేరుతాయంట. అలా చేసినప్పుడే సరైన ఫలితం లభిస్తుందని చెబుతున్నారు పండితులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Ramana Reddy Soma)దర్శకత్వం వహించిన ఈ సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని తెలుగులో ఆగస్టు 21న గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఈ సందర్భంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో మాట్లాడి ‘అమీర్ లోగ్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లోనే ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కి వచ్చాను. జేఎన్టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. ఆ టైంలోనే ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడ్ని. 2007లోనే ఆఫీస్ స్టార్ట్ చేశాను. అర్కిటెక్చర్ ఇండస్ట్రీలో నాకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. కరోనా టైంలో సొంత ఊరికి వెళ్లాను. అప్పుడు ఖాళీగా ఉండటంతో ఓటీటీలో మరిన్ని సినిమాలు చూశాను. సినిమాలు తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? కథలు రాయడం, చదవడం నాకు చాలా ఇష్టం. ఆరేడేళ్ల నుంచి కథల నుంచి రాయడం ప్రారంభించాను. నా సొంత అనుభవాలు, చూసిన వాటి నుంచి ఎన్నో రాసేవాడ్ని. తర్వాత సినిమాకి కథలు ఎలా రాయాలని నా స్నేహితుడి ద్వారా నేర్చుకున్నాను. యూట్యూబ్ ద్వారా కొంత నేర్చుకున్నాను. ఆ తర్వాత కొంత మంది ఫ్రెండ్స్ సాయంతో షూటింగ్ సెట్‌కి వెళ్లాను. అలా మెల్లిగా సినిమాలతో నా జర్నీ ప్రారంభమైంది. మొదటి సినీ ప్రయత్నం గురించి చెప్పండి? మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. రాత్రి రాశా.. ఉదయం పూట షూటింగ్ చేసేశాం. ఊర్లో, సిటీలో

మనం రోజూవారి సంభాషణల్లో 'చిదంబర రహస్యం' అనే మాటను వింటుంటాం. ఏదైనా అంతుచిక్కని విషయం ఉన్నా, లేదా బాగా దాచిపెట్టిన గుట్టు ఉన్నా దానిని చిదంబర రహస్యంతో పోలుస్తాం. కాలక్రమంలో ఇది ఒక ప్రసిద్ధ సామెతగా మారిపోయింది. కానీ, ఈ పదబంధం వెనుక అత్యంత లోతైన ఆధ్యాత్మిక భావన, ఒక గొప్ప పురాణ నేపథ్యం దాగి ఉన్నాయి. తమిళనాడులోని ప్రసిద్ధ చిదంబరం నటరాజ స్వామి ఆలయం నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది. అసలు ఈ రహస్యం ఏంటి? గర్భగుడిలోని తెర వెనుక ఏముంది? శివుడు అక్కడ ఎందుకు నృత్యం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ తత్వశాస్త్రంలో పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం చాలా ముఖ్యమైనవి. తమిళనాడులోని చిదంబరం ఆలయం పంచభూత క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మిగిలిన నాలుగు క్షేత్రాలలో స్వామివారు పృథ్వి, ఆపస్, తేజస్సు, వాయు రూపాల్లో అంటే మన కంటికి కనిపించే లింగ రూపాల్లో దర్శనమిస్తారు. కానీ చిదంబరంలో మాత్రం శివుడు అరూప రూపంలో అంటే ఆకాశం లేదా శూన్య రూపంలో కొలువై ఉంటారు. ఈ ఆలయంలో శివుడు ప్రధానంగా ఆనంద తాండవం చేస్తున్న నటరాజ స్వామి రూపంలో కనిపిస్తారు. అయితే గర్భగుడిలో నటరాజ స్వామికి కుడి వైపున ఒక పరదా ఉంటుంది. పూజారి ఆ తెరను తొలగించి దీపారాధన చేసినప్పుడు అక్కడ భౌతికంగా ఎలాంటి విగ్రహం లేదా శివలింగం కనిపించవు. కేవలం బంగారంతో చేసిన మారేడు ఆకుల మాల వేలాడుతూ కనిపిస్తుంది. కంటికి ఏమీ కనిపించకపోవడమే ఇక్కడి అసలైన రహస్యం. కంటికి ఏమీ కనిపించని ఆ శూన్య స్థలమే 'చిదంబర రహస్యం'. దీని అర్థం భగవంతుడు కేవలం ఒక నిర్దిష్ట రూపానికే పరిమితం కాలేదని, ఆయన నిరాకారుడు, సర్వవ్యాపి, ఆకాశంలా అనంతమైనవాడని చెప్పడమే. "చిత్" అంటే చైతన్యం లేదా జ్ఞానం అని, "అంబరం" అంటే ఆకాశం అని అర్థం. అంటే జ్ఞానమే ఆకాశ రూపంలో ఉందనే

ప్రభాస్–హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ వర్గాలు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రభాస్(Prabhas)–హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauzi) పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ వర్గాలు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై వస్తున్న వార్తలు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. 'ఫౌజీ’ సెట్స్‌లో ప్రభాస్, హను రాఘవపూడి మధ్య బాండింగ్ చాలా బలంగా మారిందని మేకర్స్ చెబుతున్నారు. హను చెప్పే సూచనలను ప్రభాస్ ఎంతో నమ్మకంతో ఫాలో అవుతున్నారని, స్టార్ హీరో అనే ఇమేజ్ను పక్కనపెట్టి.. దర్శకుడి విజన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని ఇన్ సైడ్ టాక్. హను చెప్పిన విధంగా సన్నివేశాలను చేయడంతో పాటు, ఆయన తెరకెక్కిస్తున్న విధానాన్ని ప్రభాస్ ప్రత్యేకంగా అభినందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా హను తీస్తున్న కొన్ని సన్నివేశాలను చూసి ప్రభాస్ ఎంతో ఇంప్రెస్ అవుతున్నారట. తన చుట్టూ ఉన్నవారితో కూడా ‘‘హను ఈ సీన్‌ను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు’’ అంటూ సినిమా గురించి గర్వంగా చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై ప్రభాస్‌కు ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయినప్పటికీ ఆయా సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది కూడా ‘ఫౌజీ’ గురించి ప్రస్తావిస్తూ ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఒక సినిమా సెట్స్‌పై హీరో ఇంతగా ఇన్వాల్వ్ అవ్వడం.. ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకానికి సంకేతంగా భావిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. ‘ఫౌజీ’ పూర్తయిన తర్వాత కూడా హను రాఘవపూడితో కలిసి మరో సినిమా చేయాలని ప్రభాస్ ఆసక్తిగా ఉన్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో ప్రభాస్–హను కాంబినేషన్లో మరో

ఘనంగా గంగాజల్ కావడి యాత్ర కాషాయ వస్త్రాల్లో శివభక్తుల కోలాహలం చార్మినార్ నుండి సరూర్‌నగర్ వరకు Gangajal Kawad Yatra: భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లింది. పవిత్రమైన శ్రావణమాసపు వేళ శివనామ స్మరణతో నగర వీధులు ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయాయి. భాగ్యనగర్ కావడి సేవా సంఘం అత్యంత శ్రద్ధా సక్తులతో నిర్వహించిన ఈ మహా యాత్ర, నగరవాసులకు ఒక దివ్యానుభూతిని అందించింది. సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు భక్తిమార్గాన్ని అందించే లక్ష్యంతో ఈ మహత్కార్యాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. Monsoon Alert: దేశంలో జోరందుకున్న రుతుపవనాలు.. ఎల్ని నో ప్రభావానికి చెక్.. 15 రోజులు భారీ వర్షాలు చార్మినార్ సమీపంలోని చారిత్రాత్మక మహాదేవ మందిరం వద్ద పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ కావడి యాత్ర(Gangajal Kawad Yatra) సరూర్‌నగర్‌లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం వరకు కోలాహలంగా సాగింది. కాషాయ వస్త్రాలు ధరించిన 1250 మంది శివభక్తులు కావడులతో భజనలు, హరహర మహాదేవ నినాదాల మధ్య నడుస్తూ స్వామివారికి పవిత్ర గంగాజలాన్ని సమర్పించారు. భక్తిప్రపత్తులతో సాగిన ఈ శోభాయాత్ర నగరంలో శివతత్వాన్ని ప్రసరింపజేసింది

ప్రభాస్ (Prabhas) ఎప్పుడూ మూడు సినిమాలు సెట్ పై ఉండేలా చూసుకుంటున్నాడా లేక అలా అనుకోకుండా జరుగుతున్నాయో తెలియడం లేదు. సాహో (Saaho)తర్వాత ప్రభాస్ అనేక సినిమాలు ఒప్పుకున్నాడు. కానీ అవన్నీ ఆలస్యం అయి… విడుదలకు చాలా టైం తీసుకున్నాయి. దాంతో ఎప్పుడూ మూడు సినిమాలు సెట్స్ పై ఉంటూ వస్తున్నాయి. సాహో విడుదల కాగానే ఆదిపురుష్, రాధే శ్యామ్, సలార్ మొదటి భాగం సెట్స్ పైకి వచ్చాయి. రాధే శ్యామ్ విడుదల అయిన తర్వాత ఆదిపురుష్, సలార్ సెట్స్ పై ఉంటూ కల్కి 2898 AD వచ్చి చేరింది. ఆదిపురుష్ విడుదల తర్వాత సలార్, కల్కి సెట్స్ పై ఉంటూ ది రాజాసాబ్ చేరింది. ఆ తర్వాత సలార్ విడుదలైంది, ఆపై కల్కి, ది రాజాసాబ్ విడుదల అయ్యాయి. ఇప్పుడు ‘ఫౌజీ’ విడుదలకు సిధ్దం అవుతోంది. ఈ డిసెంబర్ 3న రానుంది. “ఫౌజీ” సెట్స్ పై ఉండగానే ‘స్పిరిట్’ సినిమా జరుగుతోంది. త్వరలోనే ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటాడు. ఈ డిసెంబర్ లో ‘ఫౌజీ’ విడుదల తర్వాత అటు స్పిరిట్ షూటింగ్ కొనసాగుతుంది, అలాగే ‘కల్కి 2’ కూడా సెట్స్ పై ఉంటుంది. ఇక తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్టార్ట్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే వచ్చే ఏడాది మళ్ళీ మూడు సినిమాలు సెట్స్ పై ఉంటాయి. ‘స్పిరిట్’ విడుదల తర్వాత మరోటి కూడా ఒప్పుకోవచ్చు

దక్షిణ భారతదేశం అద్భుతమైన దేవాలయ నిర్మాణ శైలికి, ఆధ్యాత్మిక వైభవానికి, సుదీర్ఘ సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇక్కడ ఉన్న ప్రాచీన ఆలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కావు. ఇవి మన పురాతన సంస్కృతికి, విశిష్ట కళలకు, సమాజ పురోగతికి ప్రాథమిక మూలస్తంభాలుగా నిలిచాయి. చరిత్ర, భక్తి, అద్భుత శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా దక్షిణ భారతదేశంలో వెలసిన, ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన టాప్ 5 దివ్య క్షేత్రాల వివరాలు ఇక్కడ చూద్దాం. తమిళనాడులోని పవిత్ర రామేశ్వరం ద్వీపంలో నెలకొని ఉన్న రామనాథస్వామి ఆలయం పరమశివుడు కోలువైన దేవాలయం.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అఖిల భారత చార్ ధామ్ యాత్రలో ఒక అత్యంత ముఖ్యమైన భాగంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణ పురాణాల ప్రకారం, శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి లంకకు వెళ్లడానికి ముందు పరమశివుడిని పూజించడం కోసం స్వయంగా ఈ ఆలయ నిర్మాణాన్ని సూచించాడని, ఇక్కడి ప్రధాన లింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తులు బలంగా నమ్ముతారు. తరువాతి కాలంలో పాండ్య రాజులు, జాఫ్నా రాజవంశ పాలకులు ఈ ఆలయాన్ని భారీ గోపురాలు, విశాలమైన ప్రాకారాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొడవైన వరండాలతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. మధురై నగరంలోని వైగై నది ఒడ్డున వెలసిన శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయం దక్షిణ భారత దేవాలయ శిల్పకళా నైపుణ్యానికి ఒక నిలువుటద్దం లాంటిది. పార్వతీదేవి అవతారమైన మీనాక్షి అమ్మవారికి, శివుని రూపమైన సుందరేశ్వరునికి ఈ ప్రాచీన ఆలయం ఇది. క్రీస్తు శకం 6వ నుండి 9వ శతాబ్దాల మధ్య కాలం నాటి తమిళ సంగం సాహిత్యంలో కూడా ఈ దివ్య ఆలయ ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఏకంగా 33,000 కంటే ఎక్కువ రంగురంగుల శిల్పాలు, అద్భుతమైన ఆకృతులు ఉన్నాయి. భక్తులను

మన సమాజంలో ఎవరైనా చనిపోయినప్పుడు వారి భౌతిక కాయాన్ని సూచించడానికి వివిధ పదాలు ఉపయోగిస్తుంటారు. సాధారణ సంభాషణల్లో 'శవం' లేదా 'మృతదేహం' అనే పదాలు వింటుంటాం. కానీ ప్రముఖులు, మహనీయులు చనిపోయినప్పుడు మాత్రం వార్తల్లో, అంతిమ యాత్రల సమయంలో 'పార్థివ దేహం' అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు 'మృతదేహం' అనడానికి, 'పార్థివ దేహం' అనడానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? 'పార్థివ' అనే పదం వెనుక ఉన్న భారతీయ సంస్కృతి, తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మిక అంతరార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. 'పార్థివ' అనే పదం 'పృథివి' (భూమి) అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. అంటే పృథివికి సంబంధించినది, లేదా భూమి నుండి ఉత్పత్తయి అంతిమంగా మళ్లీ ఆ భూమిలోనే లీనమయ్యేది అనడానికి పార్థివ పదం ఉపయోగిస్తారు. ఇక దేహం అంటే ఆత్మ నివసించే భౌతిక శరీరం. కాబట్టి 'పార్థివ దేహం' అంటే "భూసంబంధమైన శరీరం" లేదా "తిరిగి మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న భౌతిక కాయం" అని అర్థం. సనాతన ధర్మం ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం ఏదో ఒక మూలకం నుండి తయారైంది. అలాగే మన శరీరం కూడా ఈ భూమి తత్వంతో ఏర్పడినదే. ప్రాణం ఉన్నంత కాలం ఇది 'జీవ దేహం', ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయిన తర్వాత ఇది పృథివికి చెందే 'పార్థివ దేహం'. భారతీయ తత్త్వశాస్త్రం ప్రకారం మానవ శరీరం పంచభూతాలు (ఐదు మహా భూతాలు)తో నిర్మితమైంది. అవి… పృథివి (భూమి) : మన శరీరంలోని మాంసం, ఎముకలు, చర్మం వంటి ఘన పదార్థాలు. ఆపస్సు (నీరు) : రక్తము, లాలాజలము వంటి ఇతర ద్రవ పదార్థాలు. తేజస్సు (అగ్ని) : శరీరంలో ఉండే వేడి, జీర్ణశక్తి. వాయువు (గాలి) : మనం పీల్చే శ్వాస (ప్రాణవాయువు). ఆకాశం (శూన్యం) : శరీరంలోని ఖాళీ ప్రదేశాలు (అవయవాల మధ్య ఉండే స్థలం). మనుషులు జీవించి

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ (Sai Marthand) మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ సాంగ్స్ బాగున్నాయి. టీజర్, ట్రైలర్ నాకు నచ్చాయి. సాయి స్మరణ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. హరి నాకు మంచి మిత్రుడు. రమణా రెడ్డి పెద్ద ఆర్కిటెక్ట్. ఆయన ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు. ఇది చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపించింది. ‘ఫలక్ నుమా దాస్’ రేంజ్లో ఈ సినిమా విజయం సాధిస్తుందనిపిస్తోంది. ఆగస్ట్ 21న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరారు. ‘లిటిల్ హార్ట్స్’ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ఆర్టిస్టులందరూ సహజంగా అనిపిస్తున్నారు. నా మెంటర్ సాయి స్మరణ్. అతని మ్యూజిక్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్. హరి మంచి ఆర్టిస్ట్, సింగర్. ట్రైలర్ చాలా బాగుంది. మంచి బిర్యానీ వాసన వస్తోంది. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంకరేజ్ చేయండని అన్నారు. దర్శకుడు రమణా

దక్షిణ భారతదేశ దేవాలయాలలో లభించే పులిహోర కేవలం రుచికరమైన ప్రసాదం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. పులిహోర తయారీలో ఉపయోగించే చింతపండు, పసుపు, ఇంగువ, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వంటి సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఇది త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ పులిహోర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం.. అసలు పులిహోర ఎలా పుట్టింది అనే విషయానికి వస్తే.. దక్షిణ భారతీయ భాషల నుంచి వచ్చింది పులిహోర. ఇందులో పులి అంటే చింతపండు రుచి, హోర అంటే అన్నం లేదా వండిన బియ్యానికి సంబంధించిన పదం. ఈ పులిహోరను తమిళంలో పులియోదరై, కన్నడంలో పులియోగరే అని పిలుస్తారు. అందువల్ల పులిహోర అంటే పులుపు అన్నం అని అర్థం. ఇది కేవలం వంటకం కాదు. భాష, సంస్కృతి, ఆధ్యాత్మికత కలసిన జీవన చిహ్నం. ఆలయాలలో పూజలు ముగిసిన తర్వాత భగవంతునికి నివేదించే నైవేద్యంలో పులిహోరకు అగ్రతాంబూలం ఉంటుంది. ఆయుర్వేద, వైష్ణవ సంప్రదాయాల ప్రకారం, చింతపండుతో తయారుచేసే ఈ అమ్ల ఆహారం సాత్విక గుణాలను పెంపొందిస్తుంది. మంత్రోచ్ఛారణల మధ్య, పవిత్రమైన వాతావరణంలో తయారుచేసి స్వామివారికి అర్పించడం వల్ల ఈ ప్రసాదంలో సానుకూల శక్తి నిండి ఉండి, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇకపోతే, పులిహోర తయారీలో వాడే ప్రతి పదార్థమూ ఒక ఔషధ గని అని చెప్పవచ్చు. ఇకపోతే, పులిహోర తయారీలో వాడే ప్రతి పదార్థమూ ఒక ఔషధ గని అని చెప్పవచ్చు. చింతపండు : ఇందులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు: ఇది సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇంగువ, ఆవాలు: కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నివారించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా

మానవ అంతరాత్మలో స్వేచ్ఛ ఎంతటి సహజసిద్ధమైన కాంక్షో, తాను జన్మించిన నేల పట్ల అనురాగం కూడా అంతే సహజమైన ప్రకృతి ధర్మం. మాతృభూమిని ప్రేమించడం విశ్వాసంలో ఒక అంతర్భాగం. సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ, ప్రతి ప్రాపంచిక దాస్యం నుండి విముక్తి పొందిన ఆత్మ మాత్రమే తన జన్మభూమి పవిత్రతను, స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించగలదు. ఈ ఆత్మస్వేచ్ఛే మాతృభూమితో ఒక విడదీయరాని ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తుంది. మక్కాను వీడుతూ ప్రవక్త పలికిన అమృత వాక్కులు దైవప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నగరాన్ని వీడి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్తున్న ఆ భావోద్వేగ ఘట్టం మాతృభూమి పట్ల ఉండే ఆ΄్యాయతకు సజీవ సాక్ష్యం. స్వదేశాన్ని వదిలి వెళ్తున్న వేళ, మక్కా సరిహద్దుల్లో ఆగి, ఆ నేలవైపు ప్రేమోద్వేగంతో చూస్తూ ప్రవక్త పలికిన మాటలు విశ్వచరిత్రలోనే అత్యంత ఆర్ద్రమైనవి: ‘ఓ మక్కా! అల్లాహ్ సాక్షిగా... ఈ భూ మండలంపై ఉన్న సమస్త ప్రదేశాల కంటే నీవే నాకు అత్యంత ప్రియమైనదానివి. అల్లాహ్‌కు కూడా నీవే అత్యంత ఇష్టమైన నిలయానివి. నీ ఒడిలో పెరిగిన నా ప్రజలే నన్ను ఇక్కడి నుండి వెళ్లగొట్టి ఉండకపోతే, నేను నిన్ను వదిలి వేరే ఏ చోటుకూ వెళ్లేవాడిని కాను.’ ప్రవక్త (స) తన జన్మభూమి పట్ల వ్యక్తపరిచిన ఈ అపరిమితమైన ప్రేమ, మాతృభూమి పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన అనురాగానికి శాశ్వతమైన మార్గదర్శిగా నిలిచింది. సజ్దా – పుట్టిన నేలతో ఆత్మిక విలీనం ప్రవక్త చూపిన ఈ స్వేచ్ఛా స్ఫూర్తి, మాతృభూమి ప్రేమ ముస్లింల రోజువారీ ఆరాధనలో జీవకళగా నిలుస్తాయి. ఇస్లామ్‌లో రోజుకు ఐదు పూటలా చేసే ప్రార్థనలో అత్యంత పవిత్రమైన ఘట్టం ‘సజ్దా’ (సాష్టాంగ ప్రణామం). మనిషి తన అహంకారాన్ని, సమస్త లౌకిక బంధనాలను త్యజించి, తన శరీరంలోనే అత్యంత గౌరవప్రదమైన శిరస్సును భూమికి ఆనించి దైవానికి ప్రణమిల్లే క్షణమది. ఈ సజ్దా కేవలం ఒక ఆరాధనా ప్రక్రియ మాత్రమే కాదు