
© 2026 nimisham.in

ప్రభాస్–హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ వర్గాలు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ప్రభాస్(Prabhas)–హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauzi) పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ వర్గాలు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై వస్తున్న వార్తలు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. 'ఫౌజీ’ సెట్స్‌లో ప్రభాస్, హను రాఘవపూడి మధ్య బాండింగ్ చాలా బలంగా మారిందని మేకర్స్ చెబుతున్నారు. హను చెప్పే సూచనలను ప్రభాస్ ఎంతో నమ్మకంతో ఫాలో అవుతున్నారని, స్టార్ హీరో అనే ఇమేజ్ను పక్కనపెట్టి.. దర్శకుడి విజన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని ఇన్ సైడ్ టాక్. హను చెప్పిన విధంగా సన్నివేశాలను చేయడంతో పాటు, ఆయన తెరకెక్కిస్తున్న విధానాన్ని ప్రభాస్ ప్రత్యేకంగా అభినందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా హను తీస్తున్న కొన్ని సన్నివేశాలను చూసి ప్రభాస్ ఎంతో ఇంప్రెస్ అవుతున్నారట. తన చుట్టూ ఉన్నవారితో కూడా ‘‘హను ఈ సీన్‌ను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు’’ అంటూ సినిమా గురించి గర్వంగా చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో ‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై ప్రభాస్‌కు ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయినప్పటికీ ఆయా సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది కూడా ‘ఫౌజీ’ గురించి ప్రస్తావిస్తూ ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఒక సినిమా సెట్స్‌పై హీరో ఇంతగా ఇన్వాల్వ్ అవ్వడం.. ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకానికి సంకేతంగా భావిస్తున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే.. ‘ఫౌజీ’ పూర్తయిన తర్వాత కూడా హను రాఘవపూడితో కలిసి మరో సినిమా చేయాలని ప్రభాస్ ఆసక్తిగా ఉన్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో ప్రభాస్–హను కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అంతే కాదు ‘ఫౌజీ’ కథకు ప్రీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందనే టాక్ప్ర కూడా నడుస్తోంది. 'ఫౌజీ’పై ప్రభాస్ చూపిస్తున్న ఆసక్తి, హను రాఘవపూడిపై ఉంచుతున్న నమ్మకం చూస్తుంటే ఈ సినిమా ఆయన కెరీర్లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ కాంబినేషన్ నిజంగానే మరోసారి కలిస్తే.. అది టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్‌గా మారడం ఖాయమని ఫాన్స్ చెబుతున్నారు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.






