
© 2026 nimisham.in

శ్రావణ మాసం మొత్తం కూడా విష్ణువు, వరలక్ష్మి, శివుడికి అంకితం చేయబడిన నెల. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం విష్ణువు, శివుడు, లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తుంటారు. ఇక ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అంతే కాకుండా పూజలు చేసి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని అంటారు పండితులు.
మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్లి, అభిషేకం చేసి, బిల్వదళాలతో స్వామి వారిని పూజించి, ఓం నమ:శివాయా అని 108 ససార్లు జపించడం వలన మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెబుతున్నారు పండితులు.
అంతే కాకుండా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో 16 రకాల పూజా ద్రవ్యాలతో పూజ చేయడం వలన ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవున్నారో వారు వాటి నుంచి త్వరగా బయపటడతారంట.
అంతే కాకుండా శ్రావణ మాసంలో అన్నదానం చేయడం వలన కూడా అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. ఈ మాసంలో ఎవరు అయితే అన్నదానం చేస్తారో వారికి ఉన్న పితృదోషాలు తొలిగిపోయి, కోరిన కోర్కెలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నెరవేరుతాయంట. అలా చేసినప్పుడే సరైన ఫలితం లభిస్తుందని చెబుతున్నారు పండితులు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.





