
© 2026 nimisham.in

ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది
ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తెరకెక్కించబోతున్నారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ‘స్పిరిట్’ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్ పార్క్’ (Animal Park) సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రణయ్ వంగా తెలిపారు. దీంతో ‘స్పిరిట్’ తర్వాత వంగా ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సందీప్ రెడ్డి వంగా తర్వాతి సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందని, మరికొందరు మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆ ప్రాజెక్టుల కంటే ముందుగా ‘యానిమల్ పార్క్’నే ఆయన టేకప్ చేయనున్నారు.
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రణ్విజయ్ సింగ్ బల్బీర్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమా ముగింపులో ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన హింట్ ఇవ్వడంతో అప్పటి నుంచే సీక్వెల్‌పై భారీ ఆసక్తి ఏర్పడింది. ‘యానిమల్ పార్క్’లో రణ్‌బీర్ కపూర్ మరింత పవర్ఫుల్, డార్క్ అవతార్‌లో కనిపించనున్నాడనే అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం కంటే సీక్వెల్ మరింత వైలెంట్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’పై ఫోకస్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ సినిమా తర్వాత ‘యానిమల్ పార్క్’ను పట్టాలెక్కించనున్నట్లు వస్తున్న ఈ క్లారిటీతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’లో శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకవైపు శ్రీరాముడిగా ఎంతో సాత్వికమైన, గంభీరమైన పాత్రలో రణ్‌బీర్‌ను చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుండగా.. మరోవైపు ‘యానిమల్ పార్క్’లో పూర్తిగా భిన్నమైన డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన కనిపించనున్నారు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.






