
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా వల్లూరులో మెగా డీఎస్సీ అక్రమాలు బట్టబయలయ్యాయి. టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్ట్ ఇచ్చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. టెట్ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టు ఇచ్చినట్లు కర్నూలు విద్యాశాఖ అధికారులు నిర్థారించారు. స్పోర్ట్స్ కోటాలో టీచింగ్ పోస్టుకు టెట్ అర్హత తప్పనిసరి అనే నిబంధనలు ఉండగా.. అర్హత లేకుండానే ఓ అభ్యర్దిని ఎస్జీటీ పోస్టుకు శాప్ ఎంపిక చేసేసింది. కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో అర్హత లేని టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కర్నూలు డీఈవో ఆఫీస్‌లో టీచర్స్ కమిటి ఆధ్వర్యంలో ప్రభాకర్ గౌడ్ విద్యార్హతలపై విచారణ జరపగా.. విచారణ కమిటీకి అర్హత సర్టిఫికెట్లను ప్రభాకర్ గౌడ్ చూపలేకపోయారు. టీచర్ కమిటీ ముందు టెట్ అర్హత పొందలేదని ప్రభాకర్ అంగీకరించారు. స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ చేసిన టీచర్ పోస్టులలో అనర్హులకు చోటుపై వైఎస్సార్సీపీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో కేవలం ఒక జూడో క్రీడ ద్వారానే 21 మందికి టీచర్ పోస్టులు ఇచ్చేసింది. ఘటనపై పాఠశాల డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని కర్నూలు డీఈవో తెలిపారు. మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు) ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు) పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే snake plant ఈ మొక్కలని కిచెన్‌లో పెట్టుకుంటే.. మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు Konda Surekha: నాకంటే ముందు రేవెంత్

Pithapuram: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ అభయ బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు జనసైనికులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం నాయకులు, జనసైనికులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో, సేవా భావంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న తీరు తమకు స్ఫూర్తినిస్తోందని, ఆయన ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ ఆయన నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, కుమారపురం గ్రామ జనసైనికులు, గ్రామస్తులు, శ్రీ అభయ బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న వేళ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమాన హీరో జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలనే ఉత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుని, ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. అమలాపురంలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై.. రోళ్ల ప్రేమ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన పవన్ అభిమానులతో పాటు సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (Prem Kumar) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ప్రేమ్ కుమార్, తన అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి సొంత ఊర్లో ఘనంగా నిర్వహించాలని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అమలాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీ బ్యానర్‌ను ఏర్పాటు చేసేందుకు స్నేహితులతో కలిసి సిద్ధమయ్యాడు. బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పైనున్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగలడంతో ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అమలాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద వార్త తెలుసుకున్న

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి మెగా స్టార్ చిరంజీవికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం పవన్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించిన ట్వీట్ తో సోషల్ మీడియాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం టూ డే టాక్ అఫ్ ది డే. 'ఎక్స్' వేదికగా 'సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.కేవలం చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని గుణం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తత్వం పవన్ సొంతం. కళ్యాణ్ బాబు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానుల్లో మరింత జోష్ నింపేలా 'పంజా' మూవీ ఈ రోజు రీ రిలీజై థియేటర్స్ లో సందడి చేస్తుంది. అంతర్జాతీయ సినిమా వేదికగా జమ్మూకశ్మీర్.. రూ. 96 లక్షల ప్రైజ్ మనీతో వైభవంగా వేడుకలు.!

రైల్వే శాఖ కీలక అప్డేట్. హైదరాబాద్ వాసులకు రైల్వే తీపి కబురు అందిస్తోంది. హైదరాబాద్ పరిధిలో రైల్వే పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో కొత్తగా మూడు రైల్వే టెర్మినళ్ల ఏర్పాట కు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపింది. దీని పైన రైల్వే బోర్డు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మూడు టెర్మినళ్ల ఏర్పాటు ప్రాంతాలు.. భూ సమీకరణ.. నిధుల అంచనాల పైనా కసరత్తు పూర్తయింది. బెంగళూరు తరహాలో ఈ మూడు టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో, పూర్తిగా హైదరాబాద్ లో రైల్వే నిర్వహణ స్వరూపమే మారిపోనుంది.హైదరాబాద్ కు వచ్చే రైళ్ల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ పెరిగింది. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాక పోకలు సాగిస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి పైన ఒత్తిడి పెరుగుతోంది. చర్లపల్లి అందుబాటులోకి వచ్చిన తరువాత కొంత మేర ప్రయోజనం ఉన్నా.. ఇంకా టెర్మినల్స్ అవసరమని దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో మరో మూడు మెగా టెర్మినల్స్ కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ (ట్రిపులార్) మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్-ముంబయి మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్ కట్టాలనే డిమాండ్ పైన ఫోకస్ చేసింది. కేసీఆర్ రాజీనామా అస్త్రం..!? సంచలన వ్యూహం- టార్గెట్ రేవంత్..!!రైల్వే శాఖ నిర్ణయంతో... ప్రయాణీకుల కష్టాలకు చెక్దీంతోపాటు మహబూబ్‌నగర్-బెంగళూరు మార్గంలో జూకల్-శంషాబాద్, నిజామాబాద్-నాందేడ్ మార్గంలో డబిల్పుర్-మేడ్చల్ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఈ విస్తరణ కోసం 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర దిశల్లో ప్రతిపాదించిన మూడు మెగా టెర్మినళ్ల కోసం

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి జరిగిన టైమ్ కు పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడు. దాంతో పవన్ ను కూడా చిరంజీవితో కలిసి చెన్నైలోనే ఉండేవాడు. చిరంజీవి భార్య సురేఖ పవన్ కళ్యాణ్ ను కన్న కోడుకులా చూసుకుంది. పిల్లలు పుట్టిన తరువాత కూడా తన పిల్లలో సమానంగా పవర్ స్టార్ ను ఆమె ప్రేమించేది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా సురేఖను తల్లితో సమానంగా చూసుకుంటాడు. అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం కూడా సురేఖ తీసుకున్న నిర్ణయమే. ఆమే పవన్ కళ్యాణ్ ను హీరోను చేయాలని చిరంజీవితో చెప్పి పట్టుబట్టి ఒప్పించిందట. వదిన సురేఖ తనకు ద్రోహం చేసిందని పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీలో పవన్ కూడా నటించారు.ఈ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ ఈ కామెంట్స్ చేశారు. తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. అన్నయ చిరంజీవి మెగాస్టార్‌గా ఇమేజ్ పొంది పీక్‌లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అని అడినప్పుడు భయమేసింది. తాను చేయగలనా అనిపించింది. కానీ మనల్ని నమ్మేవ్యక్తులు ఇంపార్టెంట్. వదిన సురేఖ నన్ను నమ్మింది. ఆమె సినిమాలు చేయమని ప్రోత్సహించింది. ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్ ఎక్కి డాన్సు చేయమన్నారు. ఆ రోజు డాన్సు చేయడానికి నేను చచ్చిపోయాను. ఆ రోజు ఫోన్ చేసి మా వదినని అడిగాను. నన్ను ఎందుకు ఇలా చేశావని నిలదీశాను. ఆమె ఆ రోజు చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. దీనంతటికి కారణం వదిన చేసిన ద్రోహమే అని కామెంట్స్ చేశారు. తన ఎదుగుదలకు వదిన తీసుకున్న నిర్ణయమే కారణం అని పవన్ కళ్యాణ్ ఫన్నీ వేలో

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. కానీ ఓ కమెడియన్ మాత్రం మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేశారట. గతంలో రాజకీయాలతో సుమారు 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీనంబర్ 150. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవితో పాటు అలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ నటించారు. ముఖ్యంగా చిరంజీవి- అలీ కాంబినేషన్స్ లో వచ్చిన సీన్లన్నీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే అలీ కంటే ముందు ఈ పాత్ర కోసం ఒక స్టార్ కమెడియన్ ను అడిగారట. కానీ ఆయన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా.? గతంలో ఠాగూర్, స్టాలిన్, ఇంద్ర లాంటి సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించిన సునీల్. ఇదే క్రమంలో చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ 150 కోసం కూడా సునీల్ ను ముందుగా సంప్రదించారట మేకర్స్. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ మూవీ #Mega158 / #ChiruBobby2, వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, రా మాస్ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది. కె. సత్యం, సూపర్వైజర్గా చిరంజీవి ఆక్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌కు ఫోన్ చేసి లోడ్ సమయానికి వస్తుందని చెబుతూ అందరినీ పలకరిస్తారు. సునీల్ లీవ్ అడగగా, తమ టార్గెట్ ఫెస్టివల్ అని చెప్పి లీవ్‌ను తిరస్కరిస్తారు. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ గురించి చెప్పగా సత్యం వాటిని విసరమని చెబుతారు. ఆ కీస్ అనుకోకుండా నీటిలో పడిపోతాయి. అయితే ఓ కుక్క ఒక రిమోట్ తీసుకొస్తుంది. దానితో మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీస్తారు. ఆసక్తికరంగా.. కీస్‌తో పాటు గన్స్ కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత కళ్లద్దాలు పెట్టుకున్న చిరంజీవిని చూపిస్తూ ‘కాకా’ టైటిల్‌ను రివీల్ చేయడం ఆదరిపోయింది. ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్, స్టైలిష్ చిరంజీవి గన్ ఫైరింగ్ సీక్వెన్స్‌తో కనిపించడం గ్లింప్స్‌కు మాస్ టచ్ ఇచ్చింది. ‘కాకా’ టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ గ్లింప్స్ కూడా స్ట్రైకింగ్ విజువల్స్, డిఫరెంట్ సెటప్‌తో వెంటనే ఆకట్టుకుంటుంది. చిరంజీవిని అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు బలంగా కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయడంలో బాబీ కొల్లి మరోసారి తన మార్క్ చూపించారు. రెండు విభిన్నమైన లుక్స్‌ను చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ గ్లింప్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి. చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేశారు. బాబీ మెగాస్టార్‌ను రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రజెంట్ చేశారు. మిడిల్ క్లాస్ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్ తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. గన్ ఫైరింగ్ సీక్వెన్స్‌లో ఆయన బాడీ
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో గతంలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చుట్టూ గత కొద్దిరోజులుగా రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కథ విషయంలో వ్యత్యాసాల వల్ల లేదా శ్రీకాంత్ ఓదెల వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లన్నింటికీ స్వయంగా దర్శకుడే చెక్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా "మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో మరచిపోలేని జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను బాస్" అని పోస్ట్ చేశారు. దీంతో ఈ కాంబో ప్రాజెక్ట్ రద్దయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. డైరెక్టర్‌గా తొలి చిత్రం 'దసరా'తో బాక్సాఫీస్ వద్ద రికార్డు సంచలనం సృష్టించిన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో 'ది ప్యారడైజ్' అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో కొంత ఆలస్యం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌ను నాచురల్ స్టార్ నాని స్వయంగా సమర్పిస్తున్నారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ మాస్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. గతంలో విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో రక్తంతో తడిసిన చేతులు కనిపించడంతో, ఇది మెగాస్టార్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉండగా, అది పూర్తయిన వెంటనే మెగాస్టార్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ప్రకటించిన భారీ సినిమా ఆగలేదని తాజాగా స్పష్టత వచ్చింది. చిరంజీవి 71వ జన్మదినం సందర్భంగా శ్రీకాంత్ ఓదెల చేసిన పోస్ట్ ఈ ప్రాజెక్ట్‌పై నెలకొన్న అనుమానాలకు సమాధానమిచ్చింది. చిరంజీవితో సినిమా చిత్రీకరణ ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో చిరు-ఓదెల సినిమా రద్దయిందంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ప్రచారానికి దర్శకుడి నుంచే స్పష్టత వచ్చినట్లయింది. చిరంజీవిని ‘టి-రెక్స్ మెగాస్టార్’గా సంబోధిస్తూ శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితో కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు సృష్టించేందుకు సినిమా చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా చిరు-ఓదెల సినిమా భవిష్యత్తుపై వివిధ రకాల ప్రచారం సాగింది. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ పనుల్లో బిజీగా ఉండటమే ఈ అనుమానాలకు ప్రధాన కారణంగా మారింది. ‘ది ప్యారడైజ్’ పనుల కారణంగా చిరు-ఓదెల సినిమా ఆలస్యమవుతోందనే ప్రచారం మొదట వినిపించింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, చివరకు పూర్తిగా రద్దయిందనే వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, ఈ కథను రామ్ చరణ్‌తో రూపొందించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది. దీంతో మెగా అభిమానుల్లో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందేహాలు పెరిగాయి. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల స్వయంగా చిరంజీవితో చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పడంతో ఆ ప్రచారానికి బలమైన సమాధానం లభించింది. చిరు-ఓదెల సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, న్యాచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 1970ల కాలం నేపథ్యంలో ఈ కథ ఉంటుందని అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 1974-75 తర్వాత జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ యాక్షన్ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా శ్రీకాంత్ ఓదెల తన రా, రస్టిక్ కథనశైలిలో చిరంజీవిని ఎలా చూపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. గతంలో విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో చిరంజీవి చేతులకు రక్తం

నేడు.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన జన్మదిన వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు అభిమానులు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ కాకా టైటిల్ పోస్టర్ కూడా విడుదల కావడం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. 2027 జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. బాబీ కొల్లి దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ కింద వెంకట్ కే నారాయణ దీన్ని నిర్మిస్తోన్నారు. పాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. మెగాస్టార్‌కు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. టాలీవుడ్ కు చిరంజీవి ఓ దిక్సూచి లాంటివారని కొనియాడారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తన ప్రతిభ, అంకితభావం, అకుంఠిత దీక్షతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారని ప్రశంసించారు. తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న ఎంతో మంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చిరంజీవిని చూసి స్ఫూర్తి పొందారని, ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. మెగాస్టార్ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయమని కొడాలి నాని వ్యాఖ్యానించారు.పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లుసినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరానికి చిరంజీవి సినీ ప్రయాణం ఓ పాఠ్యపుస్తకం లాంటిదని కొడాలి నాని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేయడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యమని, వెండితెరపైనే కాకుండా, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంక్ వంటి సామాజిక సేవా

Chirala: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు చీరాల: జనసేన పార్టీ మరియు రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు చీరాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రాధా రంగా మిత్రమండలి ఆఫీసు నందు మెగాస్టార్ చిరంజీవి గారి 71 వ పుట్టినరోజు వేడుకలు రాధా రంగా మిత్రమండలి మరియు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగారని ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారని ప్రజాసేవలో బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ద్వారా ఎన్నో వేల మందికి రక్తదానం నేత్రదానం చేశారని అలాంటి స్వార్థం లేని వ్యక్తులు సమాజంలో ఉండాలని పలువురు పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, రాధా రంగా మిత్రమండలి బాపట్ల జిల్లా అధ్యక్షులు గోకుల్ కిరణ్ బాబు, చుండూరు వాసు, హనుమకొండ కిషోర్, పాలవలస శ్రీనివాస్, పాపిశెట్టి అంజిబాబు, చుండూరు రామకృష్ణ, రావూరు బాలాజీ, సురేషు, నాగరాజు, తిరుమల శెట్టి హనుమయ్య, మరియు రాధా రంగా మిత్రమండలి సభ్యులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు

రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విజయనగరం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3వేల పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ప్రకటించారు. విద్యామంత్రిగా తాను బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 10వేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులు భర్తీచేశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు ఇందుకోసం ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు (శనివారం) విజయనగరం దాసన్నపేట జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలి.. విద్యావ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు పూర్తి అయ్యాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇక పూర్తిగా అభ్యసనా ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టిసారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్‌లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు. సంస్కరణల కారణంగా గత ఏడాది అద్భుతమైన ఫలితాలు వచ్చాయని వివరించారు. ఇది తొలిమెట్టు మాత్రమేనని అన్నారు. నూరుశాతం ఫలితాల సాధనపై దృష్టిసారించాలని ఆదేశించారు. ఇన్నోవేటివ్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా మెళకువలు నేర్పాలని దిశానిర్దేశం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ సంస్కరణల ఆలోచన.. యువగళం పాదయాత్ర సమయంలో కర్నూలు జిల్లాలో తాను పర్యటిస్తున్న సమయంలో ఉపాధి కోసం పిల్లాపాపలతో వలస వెళ్లే కుటుంబాలను చూశానని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను గమనించాను. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఆనాడే నిర్ణయించుకున్నా. అత్యంత సవాళ్లతో కూడిన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Pawan Kalyan Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్న హృదయపూర్వక భావాలు పంచుకున్నారు. ఈ క్రమంలో పాత జ్ఞాపకాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా రంగంలో అడుగుపెట్టి హీరో కాకముందు నుంచే అన్నయ్యే తన జీవితానికి ఏకైక హీరో అని పవన్ కల్యాణ్ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ తన స్కూలు రోజుల్లో అన్నయ్య పక్కన నడవడం కూడా ఎంతో గర్వకారణంగా భావించేవారని, అప్పట్లో ఆయన ఇంకా కాలేజీ విద్యార్థి అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తితో నడుస్తున్నట్లు అనుభూతి చెందేవారని పేర్కొన్నారు. చిన్నతనంలో చిరంజీవి కాలేజీ చదువు కోసం నర్సాపూర్ వెళ్లేవారని, వేసవి సెలవులకు ఆయన ఇంటికి రావడం ఒక పెద్ద పండుగలా ఉండేదని గుర్తుచేసుకున్నారు. కానీ, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉండేదని, ఆయన తిరిగి వచ్చేంతవరకు ఇల్లంతా కళావిహీనంగా మారిపోయేదని పేర్కొన్నారు. చిరంజీవి తన పొడవైన ఉంగరాల జుట్టుతో, దృఢమైన ఎన్సీసీ క్యాడెట్ శరీరాకృతితో, నాన్నగారి బుల్లెట్ బైక్ నడుపుతుంటే ఒక అభిమానిగా చూస్తూ ఆరాధించిన క్షణాలను పవన్ గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో మొదటిసారి సింగపూర్ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పుడు పెద్ద నీలం రంగు బ్యాగులో లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్ పుస్తకాలు, మ్యూజిక్ టేపులు, టేప్ రికార్డర్, సువాసనల యార్డ్లీ పౌడర్లు తేవడం ద్వారా చిన్న ఇల్లాంటి తమ నివాసంలో సంతోషాన్ని, చిరునవ్వులను

బండ్ల గణేష్ (Bandla Ganesh) పక్కా తెలుగుదేశం పార్టీ అభిమాని. చంద్రబాబు కోసం శ్రమించే వ్యక్తి. నేను తెలంగాణ వాడిని, నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం తిరుమల కాలినడకన వెళ్లిన వింతైన వ్యక్తి. అంతే కాదు, ఎన్డీయేకి చెందిన చంద్రబాబుని ఇష్టపడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జనసేన అధినేతని దేవుడిగా కొలిచే విచిత్రమైన వ్యక్తి. ఇక తాజాగా చిరంజీవి బర్త్ డే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూ మరింతగా రెచ్చిపోయారు. పొగడంలో బండ్లకి పోటీ రారు ఎవరూ అని మరి నిరూపించుకున్నారు. “మెగాస్టార్ క్యారెక్టర్ భావితరాలకు ఒక రామాయణం, భవిష్యత్ తరాలకు ఒక భగవద్గీత,” అని చిరంజీవి వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తారు. బండ్ల గణేష్ నిర్మాతగా కొత్త సినిమా అనౌన్స్ చేస్తాను అని ఇటీవల ప్రకటించారు. అలాగే ఒక కొత్త ప్రొడక్షన్ బ్యానర్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆ బ్యానర్ పై సినిమాలు ఇంకా స్టార్ట్ చెయ్యలేదు

కొన్నాళ్ల క్రితం చిరంజీవి కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి దూరం పెరిగింది. అటు ఇటు రాకపోకలు తగ్గిపోయాయి. అల్లు అర్జున్ వెళ్లి వైకాపా అభ్యర్థికి ప్రచారం చెయ్యడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఐతే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలోకి రావడం, ఇక్కడ పుష్ప 2 సినిమా థియేటర్ తొక్కిసలాట కేసులో ఒకరోజు అల్లు అర్జున్ జైలులో ఉండి రావడంతో మళ్ళీ ఇరు కుటుంబాల మధ్య రిలేషన్స్ మెరుగు అయ్యాయి. ఐతే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. “మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మాకు ఎప్పుడూ గొప్ప అండగా నిలిచారు. మనలో ప్రతి ఒక్కరినీ ఆయన స్ఫూర్తిగా నిలిపి, ఎదిగేలా ప్రోత్సహించారు. #KKAVCF (Iykyk)” అంటూ బన్నీ మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. అయితే ఈ ట్వీట్లో బన్నీ ఉపయోగించిన #KKAVCF హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌కు అసలు అర్థం ఏమిటో అల్లు అర్జున్ వివరించలేదు. అయితే అల్లు అర్జున్ గతంలో చేసిన ఓ వ్యాఖ్యను బట్టి ఆ భావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ సందర్భంలో బన్నీ మాట్లాడుతూ “కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్” అని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఇప్పుడు అదే మాటను గుర్తు చేసేలా #KKAVCF అనే హ్యాష్‌ట్యాగ్‌ను అల్లు అర్జున్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌కు పూర్తి అర్థాన్ని బన్నీ స్వయంగా వెల్లడించలేదు

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా ఆయన జన్మించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి స్వయంకృషితో తెలుగు సినిమా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో చిరంజీవి సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత విభిన్న పాత్రలు, డ్యాన్స్, మాస్ హీరోయిజంతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలతో మెగాస్టార్‌గా ఎదిగారు. తెలుగు సినిమాలో హీరోయిజం, డ్యాన్స్‌కు తనదైన శైలిని తీసుకొచ్చిన నటుడిగా చిరంజీవి నిలిచారు. చిరంజీవి పుట్టినరోజును అభిమానులు సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం, కంటి దానం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆయన పుట్టినరోజు వేడుకల్లో అభిమానుల సేవా కార్యక్రమాలు కూడా ప్రధాన భాగంగా మారాయి. ఈ ఏడాది కూడా వివిధ ప్రాంతాల్లో అభిమానులు ముందస్తు వేడుకలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్రపురి కాలనీలో నిర్వహించిన పుట్టినరోజు కార్యక్రమాలకు సుష్మిత కొణిదెల, నిహారిక కొణిదెల హాజరయ్యారు. రక్తదానం చేసిన వారికి వారు సర్టిఫికెట్లు అందజేశారు. ఫలితంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు వినోదంతో మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలతోనూ కొనసాగాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి భావోద్వేగంతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్ననాటి జ్ఞాపకాలు, చిరంజీవి ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబంపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు. “నా అన్నయ్య నాకు హీరో అయ్యే ముందే హీరో” అంటూ తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా చిరంజీవికి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినిమా రంగంలో చిరంజీవి
చిరంజీవి క్యారెక్టర్, క్యాలిబర్ మీకేం తెలుసు.. బండ్ల గణేష్ మాస్ స్పీచ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో నిర్మాత బండ్ల గణేష్ పాల్గొని ప్రసంగించారు. చిరంజీవి అంటే తనకు ప్రాణమని, ఆయన వల్లే తనలాంటి సామాన్యులు సినీ పరిశ్రమలోకి వచ్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే చిరంజీవి స్పూర్తిదాయక జీవితాన్ని రాబోయే తరాల కోసం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఆయన కోరారు. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వార్తకు సంబంధించిన
మెగాస్టార్ చిరంజీవి ని మెగా ఫ్యాన్స్ అయితే అన్నయ్యా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇదే మాట ఇండస్ట్రీలో చాలామంది నోట నుంచి కూడా వినిపిస్తుంటుంది. అన్నయ్యా, బాస్, మెగాస్టార్ ఇలా చాలా పేర్లతోనే చిరంజీవిని కీర్తిస్తుంటారు. అయితే గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్‌ని హర్ట్ అయ్యేట్టు చేశాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్‌కి ఇండస్ట్రీ పాపులర్ యాక్టర్స్‌తో పాటు.. హైపర్ ఆది లాంటి కమెడియన్లను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఈ మెగా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలకి మైక్ ఇవ్వగా.. బిగ్ బాస్ విన్నర్ అంటూ అరుపులు అరిచారు. అయితే మనోడు రావడం రావడమే పంచ్ వేశాడు. ‘అవన్నీ అయిపోయాయి అన్నా.. ఇప్పుడు యాక్టర్’ అని అన్నాడు. ఇతనికి క్రేజ్ వచ్చిందీ.. నలుగురు గుర్తు పడుతున్నారంటే బిగ్ బాస్ వల్లే. కానీ అక్కడ మాత్రం బిగ్ బాస్ అనేసరికి.. అవన్నీ అయిపోయాయ్.. ఇప్పుడు యాక్టర్ అని అన్నాడు.లాస్ట్ ఇయర్ వరకూ నేను మీతో పాటు కూడా కూర్చోవడానికి అర్హతలేని వాడ్ని.. ఇప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నానంటే మీ దయవల్లే. నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవిగారు. ఇది బాస్ బర్త్ డే. ఆయన బర్త్ డే సెలబ్రేషన్ ఈవెంట్. చాలామందికి ఇన్స్పిరేషన్ అతను. అతని గురించి మాట్లాడుకుందాం అని అన్నాడు కళ్యాణ్ పడాల.అక్కడ మొదలైంది.. మనోడి స్పీచ్ ఎండ్ అయ్యేవరకూ మెగా ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. ఎందుకూ అంటే.. మెగాస్టార్ చిరంజీవిని పదే పదే.. అతను.. అతను అంటూ మాట్లాడటం. అక్కడికి పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఇండస్ట్రీ పెద్దలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా వచ్చారు. వాళ్లు చిరంజీవిని గారు.. అన్నయ్య అంటూ ఆయనకి ఇవ్వాల్సిన

ఎలాంటి సినీ వారసత్వం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన అద్భుత నటనా కౌశలం, డాన్సులతో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఆర్థిక ప్రస్థానం అత్యంత స్పూర్తిదాయకం. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో కేవలం బాక్సాఫీస్ రికార్డులే కాకుండా, ఒక బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్న వేళ.. సీని, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వివిధ నివేదికలు, జాతీయ మీడియా అంచనాల ప్రకారం, చిరంజీవి నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు రూ. 1,650 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 1978లో సాధారణ నటుడిగా ప్రారంభమై, భారత్‌లోనే అత్యధిక పారితోషికం పొందే స్థాయికి చేరుకున్నారు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వాణిజ్య ప్రకటనలు, వివిధ వ్యాపార భాగస్వామ్యాలు ఆయన సంపదను నిలకడగా పెంచాయి. మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్!అత్యాధునిక నివాసాలు - రియల్ ఎస్టేట్ఆయన ఆస్తులలో ప్రధాన భాగం రియల్ ఎస్టేట్ రంగానికి చెందింది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. గత నివేదికల ప్రకారం ఈ భవనం విలువ దాదాపు రూ. 28 కోట్ల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు బెంగళూరు సహా పలు నగరాలలో ఉన్న విలువైన స్థిరాస్తులు ఆయన ఇన్వెస్ట్మెంట్ వ్యూహానికి నిదర్శనం.మెగాస్టార్ సినిమాలకు స్టార్లు కట్టిన ఏపీ మంత్రి.. రాత్రంతా థియేటర్ దగ్గరే ఉండిరాయల్ గ్యారేజ్ - లైఫ్స్టైల్ఆయన లగ్జరీ కార్ల సేకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌తో పాటు రేంజ్ రోవర్, టయోటా ల్యాండ్ క్రూజర్, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లు ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రైవేట్ జెట్ విమానం ఉందనే ప్రచారం

‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Mega158 (#ChiruBobby2) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్ ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లింప్స్ ఎలా ఉందంటే? తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. ఆక్వా రంగంలో ‘కె. సత్యం’ అనే సూపర్ వైజర్‌గా చిరంజీవి ఎంట్రీ ఇచ్చే సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది. చెన్నై టీమ్‌తో ఫోన్ మాట్లాడుతూ లోడ్ సకాలంలో చేరుతుందని భరోసా ఇవ్వడం, పండుగ టార్గెట్ పేరుతో సునీల్ అడిగిన లీవ్ తిరస్కరించడం లాంటి సహజమైన సన్నివేశాలతో కథనం మొదలవుతుంది. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ విసిరే క్రమంలో అవి అనుకోకుండా నీటిలో పడిపోగా, ఓ కుక్క రిమోట్‌ను తీసుకురావడం.. ఆ రిమోట్ మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీసే క్రమంలో తుపాకులు బయటకు రావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అద్దాలు ధరించిన మధ్యవయస్కుడైన ‘కె. సత్యం’ రూపంలో మెగాస్టార్ హుందాగా కనిపిస్తూనే, ఆ వెంటనే ‘కాకా’ టైటిల్ రివీల్ కావడం గూస్బంప్స్ తెప్పిస్తుంది. అనంతరం వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజ్ మెగా ఫ్యాన్స్‌కు వింటేజ్ వైబ్స్‌ను గుర్తుచేస్తోంది. బాబీ మరోసారి చిరంజీవిలోని మాస్ అండ్ క్లాస్ వేరియేషన్లను పర్ఫెక్ట్గా ఒడిసిపట్టారు. విజయ్ కార్తీక్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫీ ఆద్యంతం రిచ్‌గా ఉంది. ముఖ్యంగా ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అందులో ‘గ్యాంగ్ లీడర్’ నాటి ఐకానిక్ “గ్యాంగ్ గ్యాంగ్” రీమిక్స్ బీట్ జోడించడం గ్లింప్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది lఈ చిత్రంలో అనస్వర రాజన్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆయన చేయడమే కాకుండా, అభిమానులకు, ప్రజలకు కూడా ఆయన ఈ పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ మెగాబ్రదర్ ఏం చేశారో తెలుసా.. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ (కదంబవాసిని) మొక్కలను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గమని తెలిపారు. అంతేకాదు, ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుందని తెలుపుతూ.. ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలని కోరుతూ.. సోదరుడు

మెగాస్టార్ చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో అగ్ర స్థానానికి చేరుకున్నారు. ఎదిగిన తర్వాత తన కష్టాన్ని, మూలాలను మరచిపోలేదు. అందుకే కష్టంలో ఎవరున్నా ఆదుకునేందుకు చిరంజీవి ముందుకొస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ లాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. లెక్కకు మించి ఆర్థిక సహాయాలు చేశారు. గుప్తదానాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేడు ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి సంబంధించిన అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. సినీ కళాకారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి వస్తే చిరు వెంటనే స్పందిస్తారు. నటుడు శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటనని గుర్తు చేసుకున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఎవ్వరికీ తెలియని, మాకు మాత్రమే తెలిసిన గుప్తదానాలు, సహాయాలు ఎన్నో చేశారు. చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు. అన్ని విషయాలు ఆయన దృష్టివరకు వెళ్లడం కష్టం. అన్నింటినీ ఆయన పట్టించుకోలేరు. కానీ ఆయన దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టారు. పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు లాంటి నటులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని చిరంజీవి మాచేత డబ్బులు ఇచ్చి పంపారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నట్లు చిరంజీవి గారికి సురేఖ గారి ద్వారా తెలిసింది. పొట్టి వీరయ్య, గుండు హనుమంత రావు కష్టాల్లో ఉన్నట్లు సురేఖ గారు టీవీలో చూసి చిరంజీవికి చెప్పారు. చిరంజీవి గారు నన్ను వెంటనే ఇంటికి పిలిచి.. శివాజీ రాజా ఇదిగో ఈ 2 లక్షలు పొట్టి వీరయ్యకి ఇవ్వు.. ఈ 2 లక్షలు గుండు హనుమంతరావుకు ఇవ్వు అని నాకు డబ్బులు ఇచ్చి వాళ్లకు అందేలా చేశారు. ఒక వేళ దృష్టికి వచ్చినా సైలెంట్ గా ఉండిపోవచ్చు. కానీ చిరంజీకి గారు అలా చేయరు. 24 క్రాఫ్ట్స్ లో ఎవరు కష్టాల్లో ఉన్నా గమనిస్తూనే ఉంటారు. సాయం చేస్తూనే ఉంటారు అని శివాజీ రాజా తెలిపారు

చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు తన్మయత్వంతో చిందులేసిన కుర్రాడు.. కళ్లుచెదిరే ఫైట్లు, కళ్లప్పగించి చూసే డ్యాన్సులతో వెండితెరకు వాయువేగాన్ని పరిచయం చేసిన అంజనీపుత్రుడు.. కమర్షియల్ సినిమాను కొత్త పుంతలు తొక్కించి బాక్సులు బద్దలుకొట్టిన స్టారాధిస్టారుడు.. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి ఎనలేని సేవలందించిన పద్మవిభూషణుడు.. ఏడు పదుల వయసులోనూ అభిమానుల హృదయాలను ఏలుతున్న చిరంజీవుడు.. మెగాస్టార్ చిరంజీవి! నేడు ఆయన 71వ జన్మదినోత్సవం. అభిమానులకు పట్టలేని సంబరం. ఈ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం(Megastar Chiranjeevi 71st Birth day). చిరంజీవి అనగానే గుర్తొచ్చేది.. ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది ఒకటుంది. అదేంటో అందరికీ తెలుసు. అవును..! అది తనకు మాత్రమే సాధ్యమనిపించే డ్యాన్స్. చిరు డ్యాన్స్‌లో ఓ ఊపు ఉంటుందబ్బా అంటారు 90's కిడ్స్ (90's kids). ఇక జెన్‌జీ(Gen-Z) కుర్రాళ్లేమో బాస్ స్టెప్పేస్తే ఆ గ్రేసే వేరు బ్రో అంటారు. అందువల్లేనేమో తరాలకు అతీతంగా అందరూ చిరు డ్యాన్సులకు కనెక్టవుతుంటారు. చిరంజీవి పాట ఎక్కడ వినిపించినా, అందులోని లిరిక్సే కాదు, ఆయన వేసిన స్టెప్పులు కూడా ఇట్టే గుర్తొస్తాయి. 90's కిడ్స్‌కు పాటలు వినాలంటే ఒకప్పుడు రేడియో, ఆ తరువాత టేప్ రికార్డర్, వాక్‌మ్యాన్, సీడీ ప్లేయర్, యూట్యూబ్, స్పాటిఫై.. ఇలా ఎన్నో మారాయి. కానీ, వాటిలో చిరంజీవి పాటలను వింటూ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. అందుకే చిరంజీవి పాటలంటే వారికి ఓ అందమైన జ్ఞాపకం. ఎక్కడైనా 90's కిడ్స్ రీయూనియన్ పార్టీ జరుగుతోందనుకోండి. అందులోకి వెళ్లి చూస్తే చిరంజీవి పాటలతో టాప్ లేచిపోతుంటుంది. ‘జీ.. ఏ.. ఎన్.. జీ.. గ్యాంగ్ గ్యాంగ్.. బజావో బ్యాంగ్ బ్యాంగ్.. గ్యాంగ్ లీడర్’(Gang Leader) అని ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం గట్టిగా అరిచేస్తుంటారు. ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో యబ్బ..’ (Jagadekaveerudu Atilokasundari) అని తమ ఊహల్లోని అతిలోక సుందరిని ఊహించుకుంటూ లయబద్ధంగా స్టెప్పులేస్తుంటారు. ‘బంగారు కోడిపెట్ట వచ్చెనండి

Pawan Kalyan : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ అన్నదమ్ముల మధ్య ఎంత అనుబంధం ఉందొ అందరికి తెలిసిందే. పవన్ గతంలో అనేకమార్లు అన్నయ్య చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, ఆయన దగ్గర పెరిగినప్పటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. నేడు చిరంజీవి పుట్టిన రోజు కావడంతో పవన్ కళ్యాణ్.. చిరంజీవి కష్టాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు మోడీ, చిరంజీవిలతో వైరల్ అయిన వీడియోని షేర్ చేస్తూ అనేక మాటలు రాశారు. పవన్ ఆలయం తన ట్వీట్ లో.. ఆయన ఎప్పుడూ ఆనందానికి మూలం. ఈ ప్రత్యేకమైన రోజున నేను జ్ఞాపకాల దారిలో నడుస్తుండగా, నాకు తారసపడిన కొన్ని జ్ఞాపకాలు ఇవి. మా చిన్నతనంలో ఆయన నర్సాపూర్‌లో కళాశాల విద్యను అభ్యసించడానికి ఇంటి నుండి దూరంగా వెళ్లారు. వేసవి సెలవుల్లో ఆయన ఇంటికి తిరిగి రావడం ఒక పండుగలా ఉండేది. ఆయన కళాశాల చదువుల కోసం తిరిగి వెళ్ళినప్పుడు, ఒక పెద్ద బాధ, నిరాశ మమ్మల్ని వెంటాడేవి. మేమందరం ఆయన లేని లోటును తలుచుకుని ఆ శూన్యాన్ని అనుభవించేవాళ్ళం. ఆయన తిరిగి వచ్చేవరకు మా ఇల్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది కాదు. నా పాఠశాల రోజుల్లో ఆయన పక్కన నడవడమే ఒక గర్వించదగిన క్షణం. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తితో నడుస్తున్నట్లు నాకు అనిపించేది. అప్పటికి ఆయన ఇంకా కళాశాలలోనే ఉన్నారు. ఆయన తన ఉంగరాల పొడవాటి జుట్టుతో, బెల్ బాటమ్ ప్యాంటు, కళ్ళద్దాలతో, దృఢమైన ఎన్సిసి క్యాడెట్ శరీరంతో మా నాన్నగారి బైక్ (బుల్లెట్ – 350 సిసి) నడుపుతున్నప్పుడు.. ఓహ్! అది ఒక వీరాభిమానిని ఆరాధించే క్షణం. నా అన్నయ్య హీరో కాకముందే నాకు ఎప్పుడూ హీరోనే. ఆయన సినీ జీవితం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చేస్తోన్న చిత్రం ‘మెగా158’. మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి కలిసి చేస్తోన్న చిత్రం ‘మెగా158’. ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, మేకర్స్ అందరికీ షాకిస్తూ.. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ స్పెషల్ గ్లింప్స్ వదిలారు. ఈ స్పెషల్ గ్లింప్స్ ఎలా ఉందో చూసేయండిక. ‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!

టాలీవుడ్లో సరికొత్త టైటిల్స్ ఎప్పుడూ సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా మెగా కాంపౌండ్‌లో ఒక ఆసక్తికరమైన ‘రైమింగ్, సెంటిమెంట్’ హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్లో సరికొత్త టైటిల్స్ ఎప్పుడూ సినీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా మెగా కాంపౌండ్‌లో ఒక ఆసక్తికరమైన ‘రైమింగ్, సెంటిమెంట్’ హాట్ టాపిక్‌గా మారింది. అదే మెగా, అల్లు హీరోల ‘కా’ అక్షర ప్రాస సెంటిమెంట్. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇద్దరూ తమ రాబోయే భారీ చిత్రాలకు సరిగ్గా రెండు అక్షరాల పవర్ఫుల్ టైటిల్స్‌ను ఎంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. మామ ‘కాకా’గా, అల్లుడు ‘రాకా’గా బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతుండటంతో నెట్టింట తెగ సందడి నెలకొంది. ముందుగా అల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు ‘రాకా’ (Raaka) అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బన్నీలోని పూర్తిస్థాయి మాస్, యాక్షన్ అంశాలను ఎలివేట్ చేసేలా ఈ టైటిల్ ఉండటంతో.. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. ఇక మామ.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న Mega158 చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను నేడు (ఆగస్ట్ 22) గ్రాండ్‌గా విడుదల చేశారు. అందరూ ఊహించినట్లు కాకుండా ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే అదిరిపోయే మాస్ టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో సోషల్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏడుకొండల వెంకన్న సాక్షిగా నిజాలే మాట్లాడతానంటూ మొదలుపెట్టిన బండ్ల గణేశ్... మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వాన్ని, ఆయన సాధించిన ఉన్నత స్థానాన్ని ఎంతో భావోద్వేగంగా వర్ణించారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా చెన్నైలో అడుగుపెట్టిన చిరంజీవి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ 'మెగాస్టార్' అంటే ఏంటో నిరూపించారని బండ్ల గణేశ్ కొనియాడారు. తనకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను, అలాగే తెలుగు పరిశ్రమను చేత్తో పట్టుకొచ్చింది చిరంజీవినేనని ఆయన గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా, భారతదేశంలో ఏ నటుడికీ దక్కని అద్భుతమైన అదృష్టం రామ్ చరణ్ రూపంలో చిరంజీవికి దక్కిందని... ఒక మెగాస్టార్‌కు మెగా పవర్ స్టార్‌ను కొడుకుగా ఇచ్చిన ఘనత ఆయన మంచి వ్యక్తిత్వానిదేనని వ్యాఖ్యానించారు. చిరంజీవి మంచితనాన్ని వివరిస్తూ... 85 ఏళ్ల వయసున్న తల్లిని ఇప్పటికీ కంటికి రెప్పలా చూసుకునే గొప్ప కొడుకని చెప్పారు. గతంలో తాను ఇల్లు కట్టుకున్న సమయంలో తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతూ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ షూటింగ్ సమయంలో 50 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి తనను ఆశీర్వదించిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. చిరంజీవి ఇతరులను తొక్కుతారనే విమర్శలకు గట్టిగా సమాధానమిస్తూ... ఆయన ఎవరినీ తొక్కడని, పైకి ఎక్కిస్తాడని, ప్రోత్సహించి ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడని స్పష్టం చేశారు. కష్టపడే ప్రతి ఒక్కరూ పరిశ్రమలో పైకి రాగలరనే భరోసా ఇచ్చింది చిరంజీవినేనని, ఆయన జీవిత చరిత్రను రాబోయే తరాలకు పాఠ్యపుస్తకాలుగా పెట్టాలని పేర్కొంటూ తన ప్రసంగాన్ని ముగించారు

ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేశారు. చిరంజీవి సినీ రంగంలో సాధించిన విజయాలను, ఆయన సామాజిక సేవను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు."ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్‌గా నిలిచారు" అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అంతేకాకుండా, చిరంజీవి సామాజిక స్పృహను కూడా చంద్రబాబు ప్రశంసించారు. "రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరంజీవికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. దాదాపు మూడు దశాబ్దాలు తెలుగు సినీ పరిశ్రమని ఏకచత్రాధిపత్యంగా ఏలిన హీరో. మధ్యలో పొలిటికల్ బ్రేక్ తీసుకున్నా ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా కష్టపడుతూ సినిమాలు చేస్తున్నారు అభిమానుల కోసం. ఆయన సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకోవడం, సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి అండగా నిలవడం చేసారు. ఇన్ని దశాబ్దాల కెరీర్ లో ఆర్థికంగా కూడా తన ఆస్తుల విలువను పెంచుకున్నారు చిరంజీవి. Also See : Vangalapudi Anitha : కూతురితో కలిసి వరలక్ష్మి వ్రతంలో.. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఫొటోలు.. ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, GQ మరియు పలు నివేదికల ప్రకారం కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరికే దాదాపు 1650 కోట్ల విలువ చేసే స్థిర, చర ఆస్తులు ఉన్నట్టు సమాచారం. వాటిలో ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో చిరంజీవికి 25,000 చదరపు అడుగుల సొంత ఇల్లు ఉంది. ఆ ఇంటి విలువ దాదాపు 30 కోట్లు అని సమాచారం. వీటితో పాటు చెన్నైలో ఓ బిల్డింగ్, బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంది. కోకాపేటలో వందల కోట్ల విలువ చేసే కొన్ని ఎకరాల భూమి ఉంది. దాంట్లో ప్రస్తుతం ఆచార్య సినిమాకు వేసిన సెట్స్ ఉంచి సినిమా షూటింగ్స్ కి అద్దెకు ఇస్తున్నారు. దాని నుంచి కూడా సంపాదన వస్తుంది. ఇక చిరంజీవి దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. అయన వద్ద ఉన్న కార్లలో 4 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్, 2 కోట్ల విలువ చేసే టయోటా ల్యాండ్ క్రూయిజర్, 10 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్, 3 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కార్లు ముఖ్యమైనవి. ఇవే కాకుండా మరికొన్ని కార్లు

ఇంటర్నెట్‌డెస్క్: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రధానపాత్రలో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీమ్ అప్డేట్ ఇచ్చింది. సినిమా (Mega 158 Update) టైటిల్‌ను ‘కాకా’గా ఖరారు చేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో (Kaaka) చిరంజీవి మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తున్నారు. అక్వా సంస్థలో ఉద్యోగిగా చిరంజీవి సత్యం అనే పాత్రలో నటిస్తున్నారు. ‘ఇది సత్య మాట.. ఇంకా డౌటా’ అనే డైలాగు ఆయన పాత్ర స్వభావాన్ని తెలుపుతోంది. ఇందులో కనిపించిన ‘ఐ లవ్ డాడీ’ అనే కీ చైన్‌కు.. ప్లాష్ బ్యాక్‌లో ఆయనకు తండ్రితో అనుబంధం ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రివీల్ అనంతరం యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజు.. మెగా ఫ్యాన్స్‌కు వింటేజ్ చిరును గుర్తుచేస్తోంది. ఇక ‘కాకా’ సినిమా సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది (kaaka Movie Release Date). ‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత చిరు - బాబీ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే ఈసారి ఓ చక్కటి భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ కాంబోలో మరోసారి రాబోతోన్న మెగా158 చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కలయికలో కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా158’. మెగాస్టార్ పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగగా, అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘కాకా’ (Kaaka) అనే ఊరమాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో చిరు స్వాగ్, బాబీ టేకింగ్ చూసి మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. విడుదలైన టైటిల్ గ్లింప్స్ విషయానికొస్తే.. ఆక్వా ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌లో సూపర్వైజర్ ‘కె. సత్యం’గా చిరంజీవి కనిపించారు. ‘ఏంట్రా తంబీ.. ఇది సత్యం మాట, ఇంకా డౌటా?’ అంటూ చిరు చెప్పిన డైలాగ్, ఆయన వేసుకున్న ‘ఐ లవ్ డాడ్’ కీచైన్‌తో కూడిన తాళంచెవిని రొటేట్ చేసే స్టైల్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. దీనికి తోడు ఎస్. థమన్ అందించిన ‘పాప రీపాప.. ఆడితే ఆట.. ఇస్తా తోట.. కాకా!’ అంటూ ‘గ్యాంగ్‌లీడర్’ వైబ్‌తో సాగే మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఫ్యాక్టరీలో పనిచేసే సాధారణ వ్యక్తిలా కనిపిస్తూనే, లోపల ఉన్న విధ్వంసకర మాస్ కోణాన్ని చిరంజీవి ఆవిష్కరించిన తీరు గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆంటోనీ

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చిరంజీవి సినిమాలే కనిపిస్తుంటాయి. మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ముందు వరుసలో ఉంటుంది. ఈసినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు పూర్తి అయ్యింది. 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్.. మెగాస్టార్ చిరంజీవిని తిరుగులేని "నంబర్ వన్" సింహాసనంపై కూర్చోబెట్టింది. దర్శకుడు విజయ బాపినీడు సృజనాత్మకత, పరుచూరి సోదరుల మాస్ డైలాగ్స్, బప్పీలహరి సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టాయి. చిరంజీవి, విజయశాంతి, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, శరత్ కుమార్, మురళీ మోహన్, నిర్మలమ్మ లాంటి స్టార్ తారాగణం నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడానికి గల కారణాలేంటో చూద్దాం. రఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) ముగ్గురు అన్నదమ్ములు. రఘుపతి బాధ్యతాయుతమైన అన్నగా కుటుంబాన్ని పోషిస్తుంటే, రాఘవ ఐఏఎస్ (IAS) కు సిద్ధమవుతుంటాడు. రాజారామ్ బాధ్యతారాహిత్యంగా నలుగురు స్నేహితుల గ్యాంగ్‌తో జాలీగా తిరుగుతుంటాడు. తమ్ముడి ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం డబ్బు కావాల్సి వస్తే, రాజారామ్ జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడడు. అయితే, నగరంలో అరాచకాలు సాగించే ఏకాంబరం (రావు గోపాల్ రావు), కనకాంబరం (ఆనందరాజ్) చేతిలో రఘుపతి దారుణంగా హత్యకు గురవుతాడు. ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న అన్న మరణం వెనుక ఉన్న కుట్రను రాజారామ్ ఎలా బయటపెట్టాడు? తన కుటుంబానికి దూరమైన పరిస్థితి నుండి, తన గ్యాంగ్, ప్రియురాలు కన్యాకుమారి (విజయశాంతి) సహాయంతో విలన్ల అంతం ఎలా చూశాడు? తమతోనే ఎంతో సరదాగా ఉంటూ.. హీరోకి లైన్ వేసే కన్యాకుమారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న విషాదం ఏంటి? అది ఎప్పుడు రివీల్ అవుతుంది? అనేదే మిగతా కథ. రాజారామ్ పాత్రలో చిరంజీవి నటన, ఆటిట్యూడ్, డ్యాన్సులు, ఫైట్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా

మెగాస్టార్ చిరంజీవి నేడు ఆగష్టు 22న తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు అంటే ఆయన కోట్లాదిమంది అభిమానులకు పండగే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవిదేశాల్లో ఉన్న చిరు అభిమానులంతా పుట్టినరోజు సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ బర్త్ డే ని మరింత స్పెషల్ గా మార్చేలా గిఫ్ట్ వచ్చేసింది. చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వ్ వాల్తేరు వీరయ్య తర్వాత వీరిద్దరి కాంబోలో ఇది రెండో చిత్రం. తాజాగా ఈ చిత్ర టైటిల్ రివీల్ చేస్తూ, సినిమా థీమ్ ని తెలియజేసేలా డీటెయిల్స్ ఇస్తూ గ్లింప్స్ వదిలారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న కాకా అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ అయింది. టైటిల్ చాలా కూల్ గా ఉంది. గ్లింప్స్ లో కంటెంట్ కూడా కూల్ గా చూపించారు కానీ.. సినిమా చాలా వయలెంట్ గా ఉండబోతున్నట్లు హింట్స్ ఉన్నాయి. గ్లింప్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళదాం. అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీ కంపెనీలో కె. సత్యం అనే పేరుతో చిరంజీవి సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. చిరంజీవి లుక్ చాలా సింపుల్ గా ఉంది. కానీ ఆ కంపెనీలో అన్నీ మిస్టీరియస్ గా అనిపిస్తున్నాయి. పెద్ద స్థాయిలో డీలింగ్స్ జరుగుతున్నాయి. సినిమా థీమ్ ని తెలియజేయాలి అంటే ఇందులో ఒక్క డైలాగ్ ఉంది. వణక్కం సత్యన్న చెప్పిన టైంకి చెన్నై పోర్ట్ కి సరుకు వచ్చి పూడుస్తది కదా అని తమిళ వ్యక్తి ఫోన్ లో అడుగుతారు. దీనికి చిరంజీవి బదులిస్తూ.. ఎన్నాడా తంబీ.. ఇది సత్యం మాట.. ఇంకా డౌటా అంటూ తన స్టైల్ లో మెగాస్టార్ డైలాగ్ చెప్పారు. అంటే సత్యం మాట ఇస్తే అది జరిగి తీరాల్సిందే. ఆ ఆక్వా కంపెనీలో అంతా సత్యంకి రెస్పెక్ట్ ఇచ్చేలానే ఉంటారు. సత్యం అసలు కాకాగా ఎలా

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. కృష్ణా జిల్లా, ఆగస్టు 22: మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. గుడివాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని.. దీంతో నిజం తేలిపోయిందని చెప్పారు. ‘ఓపెన్ డిబేట్‌కు రా.. లేదా అసెంబ్లీకి రా.. నీ అనుమానాలు క్లియర్ చేస్తా అని లోకేశ్ సవాల్ విసిరినా జగన్ నుంచి సమాధానం లేదు’ అంటూ విమర్శించారు. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులు మీడియా ముందు స్పష్టంగా చెబుతున్నా.. అధికారుల దగ్గరకు వెళ్లి ఇది తప్పు అని చెప్పలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బిజీ అయితే తమ ప్రతినిధులను పంపి అనుమానాలు తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వాళ్ల పని అంటూ మండిపడ్డారు. సమాధానం చెప్పకుండా తాడు బొంగరం లేని బందర్ పిచ్చోడిని పంపిస్తున్నారని.. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారుణ్య నియామకంలా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని.. నేరస్థులంటే ఆయనకు చాలా ఇష్టమని, పలకరించడానికి అత్యుత్సాహం చూపుతున్నారని రామయ్య విమర్శించారు. కౌరవుల మాదిరి జగన్ ఎప్పుడూ నేరస్థులు, దొంగలు, విధ్వంసకారుల పక్షమే అని.. అందుకే తల్లి, చెల్లి కూడా తోడు లేరన్నారు. జెన్-జీ అంటూ జగన్ పెట్టే మీటింగ్‌లో గంజాయి బ్యాచ్ ఉంటుంటే... రాష్ట్రంలో నిజమైన జెన్-జీలు లోకేశ్‌కు మద్దతు

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ(ఆగస్టు 22) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ క్రీడా ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగాభిమానులు హంగామా చేస్తున్నారు. మెగాస్టార్ కు సంబంధించిన పాత సినిమాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి… — N Chandrababu Naidu (@ncbn) August 22, 2026 చిరంజీవి పుట్టిన రోజు.. ఆహా స్పెషల్ వీడియో
తెలుగు సినిమా చరిత్రను "చిరంజీవికి ముందు... చిరంజీవి తర్వాత" అని విభజించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. థియేటర్లలో ఈలల వర్షం కురిసినా, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలన్నా గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు మెగాస్టార్ చిరంజీవి . సామాన్య కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి మద్రాసు వీధుల్లో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చిరంజీవి ఆనాడు పరిశ్రమలో దిగ్గజ హీరోల హవా నడుస్తున్న సమయంలో కేవలం తన అద్వితీయమైన నటన, అద్భుతమైన డ్యాన్స్ శైలి, ఫైట్లలో సరికొత్త వేగంతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ‘పునాదిరాళ్లు’తో తన కెరీర్‌కి పునాది వేసుకున్న చిరంజీవి సుప్రీం హీరోగా కోట్లాది మంది ప్రేక్షకుల మన్ననలు పొంది మెగాస్టార్‌గా రూపాంతరం చెంది ఇప్పుడు ఒక్క కంటిసైగతో యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీనే శాసించే స్థాయికి చేరుకున్నారు. నేడు (ఆగస్టు 22) చిరంజీవి తన 71వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మెగాస్టార్ పుట్టినరోజంటే కోట్లాది మంది అభిమానులకు ఒక పండుగ రోజు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన చిరంజీవికి చిన్న వయసు నుంచే నటనపై ఆసక్తి ఉండేది. దీంతో యుక్త వయసు రాగానే మద్రాస్ చేరుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి 1978లో "పునాదిరాళ్ళు", "ప్రాణం ఖరీదు" చిత్రాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలన్‌గా, సహాయ నటుడిగా, యాంటీ హీరోగా వైవిధ్యభరిత పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన "మనవూరి పాండవులు", కె. విశ్వనాథ్ గారి "శుభలేఖ" లాంటి చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి.ఖైదీతో సంచలనం1983లో విడుదలైన "ఖైదీ" చిత్రం తెలుగు చిత్రసీమ గమనాన్ని మార్చేసింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా, చిరంజీవిని మాస్ హీరోగా తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. చిరంజీవి రాకతో తెలుగు సినిమాల్లో యాక్షన్ శైలి మారింది

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఆయన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ ఫెస్టివల్. ఆగస్ట్ 22వ తేదీ వస్తోందంటే చాలు చిరంజీవి అభిమానుల ఆనందం అంబరమంటుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) బర్త్‌డే (HBD Chiranjeevi) ఆయన ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్ ఫెస్టివల్. ఆగస్ట్ 22వ తేదీ వస్తోందంటే చాలు చిరంజీవి అభిమానుల ఆనందం అంబరమంటుతూ ఉంటుంది. పైగా సక్సెస్ రూటులో సాగుతోన్న మెగాస్టార్.. ఫ్యాన్స్‌కు మరింత ఆనందం పంచుతున్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తను మెగాస్టారే అనేలా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు సైతం షాకిస్తున్నారు. ఏడు పదులు దాటిన తర్వాత హీరోలకు స్టార్ డమ్ తగ్గుతుందంటారు. డెబ్బై ఏళ్ళ వయసులోనూ స్టార్‌గా సక్సెస్ చూసిన వారు అరుదుగానే ఉన్నారు... అలాంటి జాబితాలో చిరంజీవి సైతం చేరారు. ఈ యేడాది సంక్రాంతి సంబరాల్లో టాప్ హిట్‌గా నిలచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సక్సెస్‌తో ఆ ఫీట్ సాధించారు చిరంజీవి. ఇప్పటి వరకు 70 ఏళ్ళవయసులోనూ టైటిల్ రోల్స్‌తో బంపర్ హిట్స్ చూసిన వారిలో యన్టీఆర్, రజనీకాంత్ ఉన్నారు.. ఇప్పుడు చిరంజీవి కూడా వారి సరసన చేరారు. అదే ఫ్యాన్స్‌కు అమితానందం పంచుతోంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో చిరంజీవి మరో విశేషాన్నీ సొంతం చేసుకున్నారు. ఆయన రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో సినిమాలకు అంకితమైన తర్వాత మూడు బంపర్ హిట్స్ చూశారు. ఆ మూడు చిత్రాలు సంక్రాంతి సంబరాల్లోనే పాలుపంచుకోవడం విశేషం. 2017లో ‘ఖైదీ నంబర్ 150’, 2023లో ‘వాల్తేరు వీరయ్య’, ఈ యేడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇలా సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్రాలతో చిరు బంపర్ హిట్స్ అందుకున్నారు. ఒకప్పుడు మెగాస్టార్‌గా ఆయన రాజ్యమేలుతున్న సమయంలోనూ వరుసగా సంక్రాంతి సక్సెస్ తో ‘హ్యాట్రిక్’ సాధించారు. ఇప్పుడు అలా వరుస సంవత్సరాల్లో కాకపోయినా, వరుసగా పొంగల్‌కు రిలీజ్ చేసిన సినిమాలతో గ్రాండ్ సక్సెస్ చూశారు చిరంజీవి. అది కూడా విశేషంగా మారింది.. అందుకే

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఈ పేరుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వయంకృషితో సక్సెస్ అయిన హీరోల్లో మెగాస్టార్ ముందుంటారు. విలన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత హీరోగానూ విజయం సాధించారు. ఇప్పటివరకు సుమారు 157కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు మెగాస్టార్. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ఇక చిరంజీవి అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని కోట్ల మంది అభిమానులు మెగాస్టార్ ను ఆరాధిస్తారు. ఈ అభిమానినికి కారణం చిరంజీవి సినిమాలు ఒక్కటే కారణం కాదు ఆయన చేస్తోన్న సేవా కార్యక్రమాలు. బ్లండ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అంటూ ఇప్పటికే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు చిరంజీవి. అలాగే కరోనా టైమ్ లో ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. అలాగే కష్టాల్లో ఉన్న ఎంతో మంది నటీనటులకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు చిరంజీవి. ఇక మనకు తెలియకుండా చిరంజీవి చేసిన గుప్తదానాలు ఎన్నో. ఇదిలా ఉంటే చిరంజీవి గొప్పతనం, ఆయన ఉదారత గురించి ఇటీవల ఒక టాలీవుడ్ యాక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ స్టార్టింగ్ లో రూమ్ రెంట్ కట్టేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే అప్పట్లోనే చిరంజీవి రూ.10000 సాయం చేశారని గుర్తు చేసుకున్నాడు. ఆ పదివేలతో తాను దాదాపు ఆరు నెలల పాటు హాయిగా బతికానని సదరు నటుడు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరనుకుంటున్నారా? ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ గా, సహాయక నటుడిగా మెరుస్తోన్న శివాజీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసి మాస్టర్ సినిమా లో శివాజీ కీలకపాత్రలో నటించాడు. అయితే అప్పటికీ శివాజీ కెరీర్ లో పెద్దగా స్థిరపడలేదు. సినిమా

ఇవాళ (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి. దీంతో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న సినిమాల నుంచి కూడా వరుసగా అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ వేదికగా ఒకరోజు మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన చిరంజీవి బర్త్ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులతో పాటు భారీగా అభిమానులు తరలివచ్చారు. డైరెక్టర్ బీవీఎస్ రవి, నిర్మాత బండ్ల గణేష్, హైపర్ ఆది, బిగ్ బాస్ విజేత పవన్ కల్యాణ్ పడాల, డైరెక్టర్లు వశిష్ట, బాబీ, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారీ సీని ప్రముఖులు. కాగా ఇదే కార్యక్రమానికి విశ్వంభర సినిమా డైరెక్టర్ వశిష్ట కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగాస్టార్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. 'ఇక్కడకు వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. బాస్ బర్త్ డే అంటేనే మాకు పెద్ద పండగ. ఈ సెలబ్రేషన్స్ లో నేను కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలి' అని చిరంజీవికి విషెస్ చెప్పారు వశిష్ఠ ఈ క్రమంలోనే అభిమానులు 'విశ్వంభర' సినిమా టాపిక్ ను తీసుకురాగావశిష్ఠ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విశ్వంభర.. ఇక్కడున్న చాలా మంది నాపై కోపంగా ఉన్నారు. చాలా మంది తిడుతున్నారు. ఇంకొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. 'రాసిపెట్టుకోండి బల్లగుద్ది చెబుతున్నాను. 'విశ్వంభర' లేటుగా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది' అని చెప్పుకొచ్చారు వశిష్ఠ. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా సుమారు మూడేళ్ల క్రితం అంటే 2023 ఆగస్టు 22న 'మెగా 156' పేరుతో 'విశ్వంభర' సినిమా ప్రారంభమైంది. ఆ

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యిపోయాయి. ఎప్పటిలానే.. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆగస్టు 20 రాత్రి మెగా మహోత్సవం ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 71వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యిపోయాయి. ఎప్పటిలానే.. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆగస్టు 20 రాత్రి మెగా మహోత్సవం ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. వేదికపై ఉన్న దర్శకుడు బాబీ, జానీ మాస్టర్, నాగేంద్ర, ఆటా సందీప్, రమేష్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆది, 90స్ జనరేషన్ ప్రేక్షకులందరినీ ఉద్దేశించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడాడు. తమ జనరేషన్ చందమామని చూస్తూ తిందని, చిరంజీవిని చూస్తూ పెరిగిందని, పవన్ కళ్యాణ్ ని చూస్తూ అరిచిందని, రామ్ చరణ్ ని చూస్తూ గర్వపడుతోందని తెలిపాడు. చిన్నతనంలో టీవీ లేక పక్కింటికి వెళ్లి వేరే సినిమాలైతే మధ్యలోనే వచ్చేసేవాళ్లమని, కానీ చిరంజీవి సినిమా అయితే చివరిదాకా చూసేవాళ్లమని గుర్తుచేశాడు. గ్రీటింగ్ కార్డ్స్ నుంచి హాస్టల్ రూముల్లో పోస్టర్ల వరకు మెగాస్టార్‌తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, ఈ జనరేషన్‌కి చిరంజీవి ఒక హీరో కావచ్చు కానీ తమకు మాత్రం వన్ అండ్ ఓన్లీ హీరో అని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా హీరోలందరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, వాళ్లందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదేనని గుర్తుచేశాడు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డులను వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీలు దాటేసినట్లే, సినిమాల్లో కూడా రికార్డులు మారుతుంటాయి గానీ.. చిరంజీవి డాన్స్, నటన, ఫ్యాన్ బేస్, సహాయ గుణం లాంటి రికార్డులను మాత్రం ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారని, కేవలం అనుసరించారంతేనని అన్నాడు. 'స్వయంకృషి', 'విజేత', 'ఆపద్బాంధవుడు', 'మగమహారాజు' అనేవి కేవలం

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మెగా కుటుంబానికి ఏ రేంజ్ భక్తుడో కూడా వివరించాల్సిన అవసరం లేదు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మెగా కుటుంబానికి ఏ రేంజ్ భక్తుడో కూడా వివరించాల్సిన అవసరం లేదు. బండ్లన్న స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చాలాకాలం తరువాత ఒక మెగా భక్తుడుగా బండ్ల స్పీచ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ తో అదరగొట్టేశాడు. ఏడుకొండల వెంకన్న సాక్షిగా నిజాలే మాట్లాడతా..అంటూ మొదలుపెట్టి చిరంజీవి వ్యక్తిత్వం, మంచి మనసు అన్నింటినీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. 'ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు, అంజనమ్మల కడుపున చిరంజీవి జన్మించారో కానీ, గత 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలుగుతూ, అభిమానులను రక్షిస్తూ, ఎందరికో జీవనాధారాన్ని కల్పిస్తూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ఈరోజు ఏడుకొండల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాద్రి అప్పన్న, యాదగిరిగుట్ట నరసింహస్వామి మరియు నేను కొలిచే అయ్యప్ప స్వామి సాక్షిగా మెగాస్టార్ క్యారెక్టర్, కెపాసిటీ, క్యాలిబర్, వ్యక్తిత్వం గురించి నిజాలు మాట్లాడడానికే వచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకునే కుర్రాడిలా చెన్నై నగరంలో అడుగుపెట్టి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో చూపించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. నాకు ఆయనంటే ప్రాణం. ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను, తెలుగు ఇండస్ట్రీని చేత్తో పట్టుకొచ్చింది ఆయనే. భారతదేశంలో ఏ నటుడికి దక్కని అద్భుతమైన అదృష్టం రామ్ చరణ్ రూపంలో తన లెగసీని కంటిన్యూ చేయడానికి దక్కింది. ఎంతో మంది స్టార్లు ఉన్నారు కానీ, ఒక మెగాస్టార్‌కు మెగా పవర్

‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏

చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండిలా..చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండిలా.. August 21 Jyothi Gadda సరైన నిద్ర అవసరం: ప్రతిరోజూ క్రమం తప్పకుండా 8 నుంచి 9 గంటల పాటు ప్రశాంతమైన నిద్రపోవడం వల్ల చర్మ కణాలు పునరుజ్జీవనం పొంది ముఖం యవ్వనంగా, ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం: రోజువారీగా తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఇది చర్మాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడి, ఎల్లప్పుడూ తేమగా, సాఫ్ట్‌గా ఉంచుతుంది. సన్‌స్క్రీన్ లోషన్ వాడకం: ఎండలో బయటకు వెళ్లే సమయంలో కంపల్సరీగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ఇది సూర్యుడి హానికరమైన యూవీ (UV) కిరణాల వల్ల చర్మం నల్లబడకుండా, మచ్చలు పడకుండా కాపాడుతుంది. రోజూ వ్యాయామం చేయడం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఇది చర్మానికి తగినంత ఆక్సిజన్, పోషకాలను అందించి సహజమైన మెరుపును తీసుకొస్తుంది. పోషకాహారం తీసుకోవడం: విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, పచ్చని కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం అంతర్గతంగా మెరుగుపడుతుంది. విటమిన్ సీ, ఒమేగా-3: విటమిన్ సీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు చర్మాన్ని మృదువుగా మార్చి, ముడతలు పడకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవడం: తీవ్రమైన ఒత్తిడి చర్మంపై ముడతలు, పింపుల్స్ తెస్తుంది. ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండి, చర్మ సౌందర్యం ద్విగుణీకృతమవుతుంది. సహజసిద్ధమైన ప్యాక్‌లు: వంటింట్లో లభించే పసుపు, ఉసిరి, తేనె, కలబంద వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను వాడటం వల్ల ఎలాంటి కెమికల్స్ దుష్ప్రభావాలు లేకుండా ముఖం తాజాగా మారుతుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచడం: రోజుకు రెండుసార్లు మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది దుమ్ము, ధూళి, జిడ్డును తొలగించి చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా శ్వాస పీల్చుకోవడానికి సహాయపడుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్

భారతీయ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఏడు దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి కన్నుమూశారు. ఆమె మరణవార్త పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది" అంటూ ఆమె ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. "వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అంటూ చిరంజీవి నివాళులర్పించారు. యష్ ‘టాక్సిక్’ మూవీకి షాక్ ఇచ్చిన సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే? నయనతార మూవీకి రికార్డు డీల్.. రూ.100 కోట్ల ప్రాజెక్ట్‌కి మైండ్ బ్లాకింగ్ ఓటీటీ రేట్!

దక్షిణాది చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సీనియర్ దిగ్గజ నటి షావుకారు జానకి (Sankaramanchi Janaki) (94) ఇకలేరు. దక్షిణాది చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన సీనియర్ దిగ్గజ నటి షావుకారు జానకి (Sankaramanchi Janaki) (94) ఇకలేరు. గత కొద్ది రోజులుగా వయోభారంతో పాటు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మృతితో తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన జానకి, విజయా వారి ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రం షావుకారు (1950) ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ మొదటి సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారి షావుకారు జానకిగా చిత్రసీమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు ఏడు పదుల సుదీర్ఘ నటప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేసన్లతో కథానాయికగా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించిన ఆమె, తర్వాతి కాలంలో సహాయ, అత్త, అమ్మమ్మ పాత్రల్లోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. చివరగా ఆమె అన్నీ మంచి శకునములే అనే సినిమాలో కనిపించారు. ఆమె పార్థివదేహాన్ని అభిమానులు, ప్రముఖుల నివాళుల కోసం చెన్నైలోని తేనాంపేట్ నివాసంలో ఉంచారు. ఇక జానకి మరణవార్త తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, రాధిక శరత్ కుమార్ సహా టాలీవుడ్, కోలీవుడ్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, నడిగర్ సంఘం ప్రతినిధులు జానకి మృతికి సంతాపం తెలుపుతూ ఆమె కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని వ్యక్తపరిచారు. ఆమె అందించిన సేవలు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి