
© 2026 nimisham.in

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏడుకొండల వెంకన్న సాక్షిగా నిజాలే మాట్లాడతానంటూ మొదలుపెట్టిన బండ్ల గణేశ్... మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వాన్ని, ఆయన సాధించిన ఉన్నత స్థానాన్ని ఎంతో భావోద్వేగంగా వర్ణించారు.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా చెన్నైలో అడుగుపెట్టిన చిరంజీవి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ 'మెగాస్టార్' అంటే ఏంటో నిరూపించారని బండ్ల గణేశ్ కొనియాడారు. తనకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను, అలాగే తెలుగు పరిశ్రమను చేత్తో పట్టుకొచ్చింది చిరంజీవినేనని ఆయన గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా, భారతదేశంలో ఏ నటుడికీ దక్కని అద్భుతమైన అదృష్టం రామ్ చరణ్ రూపంలో చిరంజీవికి దక్కిందని... ఒక మెగాస్టార్‌కు మెగా పవర్ స్టార్‌ను కొడుకుగా ఇచ్చిన ఘనత ఆయన మంచి వ్యక్తిత్వానిదేనని వ్యాఖ్యానించారు.
చిరంజీవి మంచితనాన్ని వివరిస్తూ... 85 ఏళ్ల వయసున్న తల్లిని ఇప్పటికీ కంటికి రెప్పలా చూసుకునే గొప్ప కొడుకని చెప్పారు. గతంలో తాను ఇల్లు కట్టుకున్న సమయంలో తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతూ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ షూటింగ్ సమయంలో 50 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి తనను ఆశీర్వదించిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. చిరంజీవి ఇతరులను తొక్కుతారనే విమర్శలకు గట్టిగా సమాధానమిస్తూ... ఆయన ఎవరినీ తొక్కడని, పైకి ఎక్కిస్తాడని, ప్రోత్సహించి ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడని స్పష్టం చేశారు. కష్టపడే ప్రతి ఒక్కరూ పరిశ్రమలో పైకి రాగలరనే భరోసా ఇచ్చింది చిరంజీవినేనని, ఆయన జీవిత చరిత్రను రాబోయే తరాలకు పాఠ్యపుస్తకాలుగా పెట్టాలని పేర్కొంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








