
మెగాస్టార్ చిరంజీవి ని మెగా ఫ్యాన్స్ అయితే అన్నయ్యా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇదే మాట ఇండస్ట్రీలో చాలామంది నోట నుంచి కూడా వినిపిస్తుంటుంది. అన్నయ్యా, బాస్, మెగాస్టార్ ఇలా చాలా పేర్లతోనే చిరంజీవిని కీర్తిస్తుంటారు. అయితే గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్‌ని హర్ట్ అయ్యేట్టు చేశాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్‌కి ఇండస్ట్రీ పాపులర్ యాక్టర్స్‌తో పాటు.. హైపర్ ఆది లాంటి కమెడియన్లను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఈ మెగా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలకి మైక్ ఇవ్వగా.. బిగ్ బాస్ విన్నర్ అంటూ అరుపులు అరిచారు. అయితే మనోడు రావడం రావడమే పంచ్ వేశాడు. ‘అవన్నీ అయిపోయాయి అన్నా.. ఇప్పుడు యాక్టర్’ అని అన్నాడు. ఇతనికి క్రేజ్ వచ్చిందీ.. నలుగురు గుర్తు పడుతున్నారంటే బిగ్ బాస్ వల్లే. కానీ అక్కడ మాత్రం బిగ్ బాస్ అనేసరికి.. అవన్నీ అయిపోయాయ్.. ఇప్పుడు యాక్టర్ అని అన్నాడు.లాస్ట్ ఇయర్ వరకూ నేను మీతో పాటు కూడా కూర్చోవడానికి అర్హతలేని వాడ్ని.. ఇప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నానంటే మీ దయవల్లే. నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవిగారు. ఇది బాస్ బర్త్ డే. ఆయన బర్త్ డే సెలబ్రేషన్ ఈవెంట్. చాలామందికి ఇన్స్పిరేషన్ అతను. అతని గురించి మాట్లాడుకుందాం అని అన్నాడు కళ్యాణ్ పడాల.అక్కడ మొదలైంది.. మనోడి స్పీచ్ ఎండ్ అయ్యేవరకూ మెగా ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. ఎందుకూ అంటే.. మెగాస్టార్ చిరంజీవిని పదే పదే.. అతను.. అతను అంటూ మాట్లాడటం. అక్కడికి పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఇండస్ట్రీ పెద్దలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా వచ్చారు. వాళ్లు చిరంజీవిని గారు.. అన్నయ్య అంటూ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంటే.. కళ్యాణ్ పడాల మాత్రం ‘అతను.. అతను’ అనే మాట్లాడటం మెగా ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు.పలు సందర్భాల్లో అతను కాదు.. ఆయన అనూ అంటూ అరిచి చెప్పినా కూడా.. మళ్లీ అతను అనే తన స్పీచ్‌ని కంటిన్యూ చేశాడు కళ్యాణ్ పడాల. మధ్యలో జై మెగాస్టార్.. జై మెగాస్టార్ అంటూ మెగా ఫ్యాన్స్ అడ్డుపడ్డారు. దాంతో కళ్యాణ్ పడాల.. జై మెగాస్టార్ అంటూనే.. రాత్రి మొత్తం జై కొడుతూనే ఉంటా.. మనం మన కంటే పెద్ద వాళ్లని సార్ అని మేడమ్ అని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం.. బట్ చాలా అరుదుగా కొంతమందికే కొన్ని బిరుదులు వస్తుంటాయి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ.. అలాంటి బిరుదులు రావు. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ బాస్ అని ఒకే ఒక్కర్ని పిలుస్తాం. ఆ బాస్ అనే పదం అందరికీ సూట్ కాదు. ఆ బాస్ అనే పదం తీసుకున్నారంటే అతనేదో పెద్దగానే చేశారు. అలాంటి అతనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి నా ఫస్ట్ హీరో అంటే మెగాస్టార్.8 ఏళ్ల వయసులో నేను స్టాలిన్ సినిమా చూశా.. నేను మా డాడీ తరువాత అంత అందంగా కనిపించిన వ్యక్తి ఆయనే. ఆ సినిమా చూసిన తరువాత అనుకున్నా.. ఇతనిలా ఏదోటి అవ్వాలి.. సాధించాలి అని. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే.. దానికి కారణం చిరంజీవి గారే. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే.. నేను ఈరోజు వరకూ నేను అతన్ని కలవాలని తపిస్తూనే ఉన్నా. కానీ అవకాశం నాకు రాలేదు. ఎట్ లీస్ట్.. బాస్ బర్త్ డేకి వచ్చి మీ అందరి ముందు అతనికి బర్త్ డే విషెష్ చెప్పే అవకాశం వచ్చింది.మీరు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారంటే.. ఆల్రెడీ అతను జెస్టిఫైడ్ పర్సన్. కానీ ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. మనందరి లైఫ్ ఎగ్జాంపుల్ అతను. ఈ ఏజ్‌లో కూడా అతను అంత కష్టపడుతున్నారంటే అంటూ తన స్పీచ్‌ని కంటిన్యూ చేయబోయాడు కళ్యాణ్ పడాల. అయితే చిరంజీవిని పదే పదే అతను అనడాన్ని తట్టుకోలేకపోయిన మెగా ఫ్యాన్స్.. కింద నుంచి ‘అతను కాదు.. ఆయన అనూ’ అంటూ గట్టిగా అరిచారు. పక్కనే ఉన్న యాంకర్ కూడా.. ‘ఆయన’ అని అనమంటున్నారు అంటూ గుర్తు చేసింది.హో ఆయనా? సరే.. ఆయన.. ఆయన.. సారీ బ్రో నాకు తెలియదు అని అన్నారు. సరే బాస్ అంత కష్టపడుతున్నారంటే అంటూ మళ్లీ స్పీచ్ స్టార్ట్ చేసిన కళ్యాణ్ పడాల.. ‘అతను మనకి ఇన్స్పిరేషన్.. అతన్ని చూస్తూ పెరిగాను.. అతని నుంచి వచ్చిన మొక్కే నేను’ అంటూ మళ్లీ అతను అతను అంటూ తన పంథాని మార్చుకోలేదు. దీంతో ఆగ్రహించిన మెగా ఫ్యాన్స్ కళ్యాణ్ పడాల స్పీచ్‌ని అడ్డుకున్నారు. ఇక యాంకర్ కల్పించుకుని.. ‘ప్రాంతాన్ని బట్టి అలా మాట్లాడాల్సి వస్తుంది.. అది ప్రేమతోనే అన్నాడు’ అని కవర్ చేసింది. అయితే ఒకసారి అన్నాడంటే తెలియక అనుకోవచ్చు.. రెండోసారి అన్నాడంటే పొరపాటు అనొచ్చు. అంత చెప్తున్నా కూడా పదే పదే చిరంజీవిని అతను అతను అన్నాడంటే ఏమనుకోలో మరి. ఏ అతను అంటే అదేమన్నా బూతా అని అనుకోవచ్చు కానీ.. మన గురించి ఎదుటి వ్యక్తి నచ్చని మాట మాట్లాడుతున్నాడంటే.. అది వాళ్లకి తప్పుగానే అనిపిస్తుంది. కాబట్టి సరిచేసుకుంటే పోయే.






