
© 2026 nimisham.in

చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు తన్మయత్వంతో చిందులేసిన కుర్రాడు.. కళ్లుచెదిరే ఫైట్లు, కళ్లప్పగించి చూసే డ్యాన్సులతో వెండితెరకు వాయువేగాన్ని పరిచయం చేసిన అంజనీపుత్రుడు.. కమర్షియల్ సినిమాను కొత్త పుంతలు తొక్కించి బాక్సులు బద్దలుకొట్టిన స్టారాధిస్టారుడు.. నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగానికి ఎనలేని సేవలందించిన పద్మవిభూషణుడు.. ఏడు పదుల వయసులోనూ అభిమానుల హృదయాలను ఏలుతున్న చిరంజీవుడు.. మెగాస్టార్ చిరంజీవి! నేడు ఆయన 71వ జన్మదినోత్సవం. అభిమానులకు పట్టలేని సంబరం. ఈ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం(Megastar Chiranjeevi 71st Birth day).
చిరంజీవి అనగానే గుర్తొచ్చేది.. ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది ఒకటుంది. అదేంటో అందరికీ తెలుసు. అవును..! అది తనకు మాత్రమే సాధ్యమనిపించే డ్యాన్స్. చిరు డ్యాన్స్‌లో ఓ ఊపు ఉంటుందబ్బా అంటారు 90's కిడ్స్ (90's kids). ఇక జెన్‌జీ(Gen-Z) కుర్రాళ్లేమో బాస్ స్టెప్పేస్తే ఆ గ్రేసే వేరు బ్రో అంటారు. అందువల్లేనేమో తరాలకు అతీతంగా అందరూ చిరు డ్యాన్సులకు కనెక్టవుతుంటారు. చిరంజీవి పాట ఎక్కడ వినిపించినా, అందులోని లిరిక్సే కాదు, ఆయన వేసిన స్టెప్పులు కూడా ఇట్టే గుర్తొస్తాయి.
90's కిడ్స్‌కు పాటలు వినాలంటే ఒకప్పుడు రేడియో, ఆ తరువాత టేప్ రికార్డర్, వాక్‌మ్యాన్, సీడీ ప్లేయర్, యూట్యూబ్, స్పాటిఫై.. ఇలా ఎన్నో మారాయి. కానీ, వాటిలో చిరంజీవి పాటలను వింటూ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. అందుకే చిరంజీవి పాటలంటే వారికి ఓ అందమైన జ్ఞాపకం.
ఎక్కడైనా 90's కిడ్స్ రీయూనియన్ పార్టీ జరుగుతోందనుకోండి. అందులోకి వెళ్లి చూస్తే చిరంజీవి పాటలతో టాప్ లేచిపోతుంటుంది. ‘జీ.. ఏ.. ఎన్.. జీ.. గ్యాంగ్ గ్యాంగ్.. బజావో బ్యాంగ్ బ్యాంగ్.. గ్యాంగ్ లీడర్’(Gang Leader) అని ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం గట్టిగా అరిచేస్తుంటారు. ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో యబ్బ..’ (Jagadekaveerudu Atilokasundari) అని తమ ఊహల్లోని అతిలోక సుందరిని ఊహించుకుంటూ లయబద్ధంగా స్టెప్పులేస్తుంటారు. ‘బంగారు కోడిపెట్ట వచ్చెనండి.. హే పాపా.. హే పాపా.. హే పాపా..’(Gharana mogudu) అని ఫుల్‌జోష్‌లో మెగాస్టార్‌లా ఫీలవుతూ డ్యాన్స్ ఇరగదీస్తుంటారు. అంతేనా.. ‘హోయిరబ్బా.. హోయిరబ్బా... హోయిరబ్బా.. హోయ్.. ఈ పేటకు నేనే మేస్త్రీ..’(Mutha mestri) అని చేతి కింద షర్టు మడిచి పెట్టుకొని స్టెప్పు వేయడానికి ట్రై చేస్తుంటారు. ఇలా ఎంతసేపైనా అలుపూసొలుపూ రాదు. ప్లే లిస్ట్ ముగిసిపోదు. ఒకదాని వెంట ఒకటి చిరంజీవి పాటలు వస్తూనే ఉంటాయి. ‘నడక కలిసిన నవరాత్రి.. సిగ్గుపడితే శివరాత్రి.. ’(Hitler) అని రెండు మోకాళ్లపై చేతులు పెట్టుకొని కింది నుంచి పైకి లేస్తూ వేసే స్టెప్పును వేయకుండా ఉంటారా? అది అయిపోగానే ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సరా.. ముస్తాబదిరింది.. ’(Bavagaru bagunnara), ఆ వెంటనే ‘రామ్మా చిలకమ్మా.. ప్రేమ మొలకమ్మా.. ’(Chudalani undi), ఆ తరువాత ‘దాయిదాయి దామ్మా.. కులుకే కుందనాల బొమ్మా..’(Indra) పాటకు వీణ స్టెప్పు వేసి తీరతారు. అదే జోష్‌తో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్.. హు.. హ.. హు.. హ..’(Shankar dada mbbs) అని కోరస్ పాడేస్తారు. ఇలా ఒకటా రెండా.. 90's కిడ్స్‌కు హార్ట్‌బీట్‌గా మారిన చిరు పాటలు, స్టెప్పులు ఎన్నో ఉన్నాయి.
జెన్‌జీ తరాన్ని కూడా తన గ్రేస్‌తో ఫ్యాన్స్‌గా మార్చుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే రీల్స్, షార్ట్స్‌లో చిరు స్టెప్పులు, కవర్ సాంగ్స్ వైరల్ అవుతుంటాయి. కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ అయినా, ఫేర్వెల్ పార్టీ అయినా చిరు సాంగ్స్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తుంటారు. ‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు..’(khaidi number 150) అని బాసు పాటకు డ్యాన్స్ కుమ్మి పడేస్తుంటారు. ‘పూనకాలు లోడింగ్.. ’(Waltair Veerayya) పాట వింటే వారికి పూనకాలు వచ్చేస్తాయి. ‘మీసాల పిల్లా..’(Mana Shankara Vara Prasad Garu) పాటకు కర్చీఫ్‌ను స్టైల్‌గా ఎగరేసి పట్టుకొనే స్టెప్పు వారికి మహా ఇష్టం. జెన్‌జీకి చిరంజీవితో వైబ్ మ్యాచ్ అయింది. అందుకే ఎంత మంది యువ హీరోలొచ్చినా, జెన్‌జీ కుర్రాళ్లు చిరును మర్చిపోలేదు. ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వారిని ఆనందపరచడానికి చిరంజీవి కూడా మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తూ, డ్యాన్సులతో అలరిస్తూ ముందకు సాగుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
చిరంజీవి అంటే తనకు ప్రాణమని నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు.
జెన్ జీ కూడా జై చిరంజీవి అంటారని అది మెగాస్టార్ స్థాయి అని నటుడు హైపర్ ఆది అన్నారు.
ట్రోల్స్ వారికి ఎవరికీ అందనంత ఎత్తులో చిరంజీవి ఉన్నారని రచయిత బీవీఎస్ రవి అన్నారు.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








