
Business Ideas: ఇంట్లోనే బిజినెస్.. రూ.1,000 పెట్టుబడితో మొదలుపెట్టి లక్షల్లో సంపాదించే ఛాన్స్!
Business Ideas: ఇంట్లోనే బిజినెస్.. రూ.1,000 పెట్టుబడితో మొదలుపెట్టి లక్షల్లో సంపాదించే ఛాన్స్!
© 2026 nimisham.in

Business Ideas: ఇంట్లోనే బిజినెస్.. రూ.1,000 పెట్టుబడితో మొదలుపెట్టి లక్షల్లో సంపాదించే ఛాన్స్!

Apple| ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ (John Ternus)కు సంస్థ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. వార్షిక వేతనం, షేర్ల రూపంలో లభించే ప్రోత్సాహకాలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయన మొత్తం 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.551 కోట్లు) అందుకోనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న టిమ్ కుక్కు సుమారు 47 మిలియన్ డాలర్లు (సుమారు రూ.446 కోట్లు) అందనున్నాయి. ఈ వివరాలను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన నివేదికలో యాపిల్ వెల్లడించింది. టెర్నస్‌కు 3 మిలియన్ డాలర్లు వార్షిక మూల వేతనం కాగా.. మరో 55 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు అందనున్నాయి. ఆ స్టాక్‌లో 75 శాతం యాపిల్ షేరు పనితీరుతో ముడిపడి ఉంటుంది. మిగతా 25 శాతం కాలానుగుణంగా ఆయనకు దక్కుతుంది. మరోవైపు కుక్కు 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం.. 2027 ఆర్థిక సంవత్సరానికి 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు అందనున్నాయి. సెప్టెంబరు 1న జాన్ టెర్నస్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2001లో యాపిల్ సంస్థలో చేరిన టెర్నస్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల హార్డ్‌వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూస్తున్నాయి (Stock Market Today). మరోసారి పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం, చమురు ధరలు భగ్గుమనడంతో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి.. 76,262 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 232 పాయింట్లు కోల్పోయి.. 23,823 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా, సన్‌ఫార్మా, ఓఎన్జీసీ, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ , విప్రో, ఎంఅండ్ఎం స్టాక్స్ నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97గా ఉంది. నెలరోజుల గ్యాప్ తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. హర్మూజ్‌పై పట్టుకోసం ఇరాన్, అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి (Crude oil prices). బ్రెంట్ క్రూడ్ ప్యూచర్స్ ఒక బ్యారెల్‌కు 95.52 డాలర్లుగా ఉండగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Car Sales: భారతీయ కార్ల మార్కెట్లో ఆగస్టు 2026 నెల సరికొత్త చరిత్రను తిరగరాసింది. పండుగల సీజన్ కంటే ముందే కస్టమర్లు కార్లను విపరీతంగా కొనుగోలు చేయడంతో మారుతి సుజుకి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, మహీంద్రా, టాటా మోటార్స్ కంపెనీలు ఊహించని రీతిలో భారీ వృద్ధిని నమోదు చేసి సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. దేశీయంగా అత్యధిక కార్లు విక్రయించే దిగ్గజం మారుతి సుజుకి ఆగస్టు నెలలో 2,19,220 వాహనాలను అమ్మి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశీయ మార్కెట్లో 1,80,078 ప్యాసింజర్ వాహనాలను విక్రయించడమే కాకుండా, విదేశాలకు 33,844 యూనిట్లను ఎగుమతి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లోనే ఏకంగా 10 లక్షల వాహనాల మార్కును దాటేసి తన బలాన్ని నిరూపించుకుంది. గతేడాది ఆగస్టులో 1,31,278 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 1,76,971 కి చేరింది. మహీంద్రా ఎస్‌యూవీల దాటికి సరికొత్త రికార్డు మహీంద్రా కంపెనీ విక్రయాలు ఆగస్టు నెలలో ఏకంగా 42 శాతం వృద్ధి చెంది 1,07,648 వాహనాలకు చేరాయి. ఈ ఘనతలో కంపెనీ ఎస్‌యూవీల వాటా అత్యంత ముఖ్యం. గతేడాది ఆగస్టులో 39,399 ఎస్‌యూవీలు మాత్రమే అమ్ముడవగా, ఈసారి 50 శాతం వృద్ధితో 59,257 యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 61,167 యుటిలిటీ వాహనాలను అమ్మి మార్కెట్‌ను ఊపేసింది. టాటా మోటార్స్ ఆగస్టు నెలలో 67,753 ప్యాసింజర్ వాహనాలను అమ్మి గతేడాది కంటే 56 శాతం భారీ వృద్ధిని సొంతం చేసుకుంది. ఇందులోనూ ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు అగ్రభాగాన నిలిచాయి. కంపెనీ ఒకే నెలలో 16,549 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించి ఏకంగా 94 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా పెట్రోల్, డిజైన్ తో పాటు ఈవీల వైపు ప్రజలు చూపిస్తున్న ఆసక్తికి టాటా మోటార్స్ గణాంకాలే ప్రధాన ఉదాహరణ. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆగస్టు

రవితేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, సాయికుమార్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. `ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్లోనే కాదు వీక్ డేస్‌లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్‌గా రన్ కావడం మరో విశేషం. ఓ వైపు టాక్సిక్ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు. థియేట్రికల్‌గా అయిన బిజినెస్ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు

New LIC plans | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఎల్ఐసీ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీమా ప్లాటినమ్ (LIC Bima Platinum), జీవన్ రక్ష (LIC Jeevan Raksha) పేరిట రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి ఈ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ప్లాన్ల వివరాలు ఇవీ.. బీమా ప్లాటినమ్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ప్లాన్. ఇది పొదుపుతో పాటు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కూడా కల్పిస్తుంది. కచ్చితమైన ముందస్తు హామీతో కూడిన రాబడులు లభిస్తాయి. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ప్రతి వెయ్యి రూపాయలకు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 28 ఏళ్లు. గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా నిర్ణయించారు. 7, 10, 12, 15, 18 ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. 17, 20, 22, 25, 28 ఏళ్ల పాటు పాలసీ గడువు ఉంటుంది. కనీస బీమా హామీ మొత్తం రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. పాలసీ మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే బేసిక్ సమ్అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లు చెల్లిస్తారు. జరగరానిది ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. ఎల్ఐసీ పాలసీదారులకు రిబేటు లభిస్తుంది. రుణ సదుపాయం కూడా ఉంది. రైడర్లు జోడించుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం చొప్పున రెగ్యులర్ ఇన్కమ్ కింద ఏటా తీసుకునే వెసులుబాటూ ఉంది. ఎల్ఐసీ జీవన్ రక్ష నాన్-పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే అండగా నిలుస్తుంది. ఈ ప్లాస్ తీసుకోవడానికి కనీస వయసు

ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్‌లో (Apple) కీలక నాయకత్వ మార్పు జరిగింది. 15 ఏళ్లుగా సంస్థ సీఈవోగా కొనసాగిన టిమ్ కుక్ (Tim Cook) ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ (John Ternus) సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఆగస్టులో సీఈవో బాధ్యతలు స్వీకరించిన కుక్.. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ‘‘రేపటి నుంచి నా పదవి మారుతుంది, కానీ యాపిల్ సంస్థపై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నిరంతరం నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. తదుపరి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. సీఈవో పదవి నుంచి వైదొలిగినప్పటికీ.. కుక్ యాపిల్‌కు దూరం కావడం లేదు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. సంస్థకు సంబంధించిన కీలక అంశాల్లో సహకరించనున్నారు. 2011లో సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ కుక్ సారథ్యంలో ప్రస్తుతం 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జాన్ టెర్నస్ (John Ternus) 2001లో యాపిల్‌లో చేరారు. ఆయన ఇప్పటి వరకు హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబరు 9న జరగనున్న యాపిల్ కార్యక్రమంలో టెర్నస్ తొలిసారి సీఈవోగా వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Subash chandra | ఇంటర్నెట్‌డెస్క్: ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకులు సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియపై వివాదం కొనసాగుతోంది. రూ.22,006 కోట్ల క్లెయిమ్నకు గానూ రూ.6.25 కోట్లు మాత్రమే చెల్లించేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అనుమతించడంపై రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చెల్లింపు విషయంలో త్రిసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును ఎన్సీఎల్టీ నిలిపివేసింది. సుభాష్ చంద్రపై దాఖలైన వ్యక్తిగత దివాలా ప్రక్రియలో భాగంగా క్రెడిటర్లంతా కలిసి రూ.22,006.57 కోట్లు క్లెయిమ్ చేయగా.. కేవలం రూ.6.25 కోట్లు చెల్లించే పరిష్కార ప్రణాళికకు ఇటీవల ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. ఈ ప్రణాళికకు 80.81 శాతం క్రెడిటర్ల నుంచి ఆమోదం లభించడం గమనార్హం. అయితే, ఇందులో సుభాష్ చంద్ర కుటుంబంతో సంబంధం ఉన్న 5 సంస్థలు రుణదాతల కమిటీలో 61.78 శాతం ఓటింగ్ వాటాను కలిగి ఉన్నాయని, ఈ ప్రణాళిక ఆమోదించడంలో కీలక పాత్ర పోషించాయని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా రుణ చెల్లింపు ప్రణాళికపై నిర్ణయం తీసుకోవడానికి అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఎన్సీఎల్టీ ఏర్పాటు చేసింది. ఈ రోజు విచారణ జరిగింది. ఈ క్రమంలో త్రిసభ్య తీర్పును నిలిపివేయడంతో పాటు ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్న ఆస్తులను ఎవరికీ బదిలీ చేయకూడదని ఆదేశించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Fuel Prices Hike| ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయో తెలియని అనిశ్చితి నెలకొంది. దాంతో ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీఎన్జీ (CNG) ధరలు పెరిగాయి. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలో కూడా వరుసగా రెండోనెలలో పెంపు నమోదైంది. మంగళవారం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సీఎన్జీ ధరను కేజీకి రూ.2 చొప్పున పెంచింది. దీంతో ముంబయి, పరిసర ప్రాంతాల్లో కేజీ గ్యాస్ ధర రూ.88కి ఎగబాకింది. డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM)కు ఒక రూపాయి చొప్పున పెరిగింది. ఈ ధరలు నేటినుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో ధరలకు అనుగుణంగా ఈ ఇంధనాల రేట్లను సవరించినట్లు ఎంజీఎల్ వెల్లడించింది. రెండురోజుల క్రితం ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కూడా సీఎన్జీ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. దాంతో దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆ గ్యాస్ ధర రూ.83.09 నుంచి రూ.86.98కి చేరింది. సీఎన్జీ ధరలు పెరగడంతో ఆటో, ట్యాక్సీ సంఘాలు ప్రయాణ ఛార్జీల పెంపునకు డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ విమానాలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర లీటర్‌కు రూ.6.28 (5.46 శాతం) మేర పెరిగింది. దీంతో లీటర్ ధర రూ.115 నుంచి రూ.121.28కి పెరిగింది. ఈ మేరకు ఇండియన్ ఆయిలో కార్పొరేషన్ లిమిటెడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ పెంపు దేశీయ విమానయాన సంస్థలకు భారంగా మారనుంది. దాంతో ఆ ప్రభావం ప్రయాణికులపై పడనుంది. ఆగస్టు ఒకటిన ఏటీఎఫ్ లీటర్ ధర రూ.110 నుంచి 115కు పెరిగిన సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన పర్సనల్ ఇన్సాల్వెన్సీ కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఒక సంచలన రీపేమెంట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఆయనపై నమోదైన రూ. 22,006 కోట్ల అంగీకరించిన క్లెయిమ్‌లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించడం ద్వారా సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ తీర్పుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణదాతలైన బ్యాంకులు ఈ ప్రతిపాదనను అంగీకరించలేమని, ఇది ఎంతమాత్రం సరికాదని అంటున్నాయి. మరోవైపు, మీడియాలో ప్రచారమవుతున్న 99.97 శాతం రుణ మాఫీ వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు తనపై ఉన్న క్లెయిమ్ సైజ్ ఇంత పెద్దది కాదని సుభాష్ చంద్ర స్వయంగా వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ వివాదంపై ఢిల్లీలోని NCLT బెంచ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఇద్దరు సభ్యుల బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ఈ కేసును మూడో జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మకు బదిలీ చేశారు. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (IBC) సెక్షన్ 114 కింద ఈ ప్లాన్‌ను క్లియర్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం, సుభాష్ చంద్ర తన వ్యక్తిగత పూచీకత్తు హోదాలో రూ. 6.25 కోట్లు చెల్లిస్తారు. దీనితో పాటు, రుణం తీసుకున్న ప్రధాన సంస్థలు విడిగా సుమారు రూ. 1,494 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 80.8 శాతం ఓటింగ్ షేర్ ఉన్న రుణదాతలు ఈ ప్లాన్‌కు సపోర్టు ఇచ్చారు. అయితే LIC హౌసింగ్ ఫైనాన్స్ (LICHFL), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు మాత్రం ఈ రీపేమెంట్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేశాయి. రీజల్యూషన్ ప్రొఫెషనల్ అంచనా ప్రకారం.. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ ఈ రీపేమెంట్

LPG Price Hike: సెప్టెంబర్ నెల తొలిరోజే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం ఇల్లాళ్లకు ఊరటనిచ్చే విషయంగా మారింది. ఆగస్టు నెల ప్రారంభంలో కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించిన ఆయిల్ కంపెనీలు, సెప్టెంబర్ 1న మళ్లీ పెంచి షాకిచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ ప్రకటన ప్రకారం 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.9.50 వరకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో అయితే రూ.11 మేర భారం పెరిగింది. గతేడాది చివరిలో ధరలు తగ్గినప్పటికీ, మళ్లీ పెరగడం వల్ల హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, టీ కొట్ల నిర్వాహకులకు రోజువారీ నిర్వహణ వ్యయం పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరా వ్యయాలు, రూపాయి మారకం విలువల్లో వచ్చే మార్పుల వల్లే ఈ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెరిగినప్పటికీ 14.2 కేజీల సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను కంపెనీలు తాకలేదు. సాధారణ ఇళ్లలో వాడే గ్యాస్ రేట్లు మునుపటిలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి. 5 కేజీలు, 10 కేజీల చిన్న తరహా సిలిండర్ల ధరల్లోనూ ఎటువంటి మార్పూ చేయలేదు. ప్రస్తుతం 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్ రూ.349.50 వద్ద దొరుకుతుండగా, ఎక్స్‌ట్రాలైట్ సిలిండర్ ధర రూ.339 వద్దే ఉంది. కాకపోతే 5 కేజీల గృహేతర వాణిజ్య సిలిండర్ రేటు రూ.762 నుంచి రూ.764 కు పెరిగింది. తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో లేటెస్ట్ రేట్లు ధరల పెంపు తర్వాత నగరాల వారీగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. భాగ్యనగరం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.11 పెరిగి రూ.2,996 వద్దకు చేరి రూ.3,000 మార్కుకు అత్యంత చేరువైంది. దేశ

మనం చేసిన పని మరోసారి చేయాలంటే విసుక్కుంటాం. సణుక్కుంటాం.అవసరం అనుకుంటే తప్పదురా దేవుడా అని తలపట్టుకుని పూర్తి చేస్తాం. అలాంటిది ఓ దర్శకుడు ఒక సినిమాని ఇరవై ఏళ్ల పాటు నిరంతరం చెక్కుతూనే ఉంటారా? అదీ ఒక కొత్త సినిమా కాదు. అప్పటికే విడుదలైపోయి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, Hollywoodలో తన పేరును ఒక ప్రత్యేక స్థానంలో నిలిపిన సినిమా. అయినా దర్శకుడికి మాత్రం అది పూర్తయినట్టుగా అనిపించలేదు. అది కూడా ఏదో కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన దర్శకుడు కాదు. ఒక సినిమా తీసి వెంటనే గ్యాప్ లేకుండా ఇంకో సినిమాకు వెళ్ళిపోయే సాధారణ filmmaker అంతకన్నా కాదు. Alien, Gladiator, Black Hawk Down లాంటి చిత్రాలతో ప్రపంచ సినిమాపై తన ముద్ర వేసిన Ridley Scott. అలాంటి దర్శకుడు ఒకే సినిమాను పట్టుకుని దాదాపు పావు శతాబ్దం పాటు మళ్లీ మళ్లీ చెక్కాడు. అంటే బోర్ కొట్టలేదా? లేదు! అక్కడే ఈ కథలో అసలు ఇంట్రస్టింగ్ విషయం ఉంది. 1982లో విడుదలైన ఈ sci-fi masterpieceకు, Ridley Scott తనకు కావాల్సిన తుది రూపాన్ని ఇవ్వడానికి 2007 వరకు పట్టింది. ఆ రూపమే ‘Blade Runner: The Final Cut’. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే Final Cut అమెరికాలో YouTubeలో adsతో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కానీ YouTubeలో ఉచితంగా దొరకడం అనేది ప్రక్కన పెడితే ..ఒక దర్శకుడు తన సినిమా విడుదలైపోయిన 25 ఏళ్ల తర్వాత కూడా దాన్ని ఎందుకు వదల్లేదు? సినిమా పూర్తయింది.. కానీ దర్శకుడికి కాదు! Ridley Scott తెరకెక్కించిన Blade Runner ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు దాని కథ భవిష్యత్తులోని Los Angeles నేపథ్యంలో సాగుతుంది. మనుషుల్లా కనిపించే Replicants అనే artificial beingsను భారీ కార్పొరేట్ సంస్థలు తయారు చేసి, శ్రమ కోసం ఉపయోగిస్తాయి. వాటికి పరిమిత జీవితకాలాన్ని నిర్ణయిస్తాయి

ఇల్లు, ప్లాట్ లేదా వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం చాలా మందికి ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. సంవత్సరాల పొదుపు, బ్యాంకు రుణం లేదా కుటుంబ ఆస్తులను ఉపయోగించి స్థిరాస్తిలో పెట్టుబడి పెడతారు. అయితే, ఈ రంగంలో సరైన సమాచారం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాల నుంచి ఒకే ఆస్తిని పలువురికి అమ్మడం వరకు వివిధ రకాల మోసాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆస్తి కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించడం అత్యంత ముఖ్యం. కొన్ని రకాల మోసాలను ఇక్కడ చూద్దాం. ఇది స్థిరాస్తిలో సాధారణంగా కనిపించే మోసాల్లో ఒకటి. మోసగాళ్లు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌లు, గుర్తింపు పత్రాలు లేదా ఇతర భూ రికార్డులను సృష్టించి ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నించవచ్చు. కొన్నిసార్లు అసలు యజమాని సంతకాన్ని కూడా నకిలీ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలుదారులు పత్రాలపై మాత్రమే ఆధారపడకుండా, సంబంధిత ప్రభుత్వ రికార్డుల్లో యాజమాన్య వివరాలను స్వతంత్రంగా పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో ఒకే ప్లాట్ లేదా ఫ్లాట్‌ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొనుగోలుదారులకు విక్రయించే మోసాలు జరుగుతాయి. ముందస్తు బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లింపుల సమయంలో కొనుగోలుదారులు పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కొత్త లేఅవుట్లు లేదా అపార్ట్మెంట్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒప్పందం చేసుకునే ముందు ఆ ఆస్తిపై ఇప్పటికే ఇతర హక్కులు, ఒప్పందాలు లేదా రుణాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. చౌక ధరకు ప్లాట్లు అందిస్తున్నామని చెప్పి అనుమతి లేని లేఅవుట్లను విక్రయించే సంఘటనలు కూడా కనిపిస్తాయి. కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఇల్లు నిర్మించేందుకు అనుమతులు రాకపోవచ్చు లేదా అభివృద్ధి పనులు నిలిచిపోవచ్చు. రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలపై కూడా హామీలు మాత్రమే ఉండి, వాస్తవంగా అవి అందుబాటులో లేకపోవచ్చు

TikTok | ఇంటర్నెట్ డెస్క్: చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసును పరిష్కరించుకునేందుకు ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) అమెరికా ప్రభుత్వంతో రాజీకొచ్చింది. ఇందుకుగాను ఆ దేశ న్యాయ విభాగానికి (US Justice Department) 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,800 కోట్లు) చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తాన్ని రెండు దఫాలలో చెల్లించనున్నట్లు వెల్లడించింది. దీంతో 2024లో దాఖలైన ఈ వ్యాజ్యం ముగిసింది. టిక్‌టాక్ తమతో రాజీ చేసుకోవడం దేశంలోని పిల్లలు, తల్లిదండ్రులకు ఒక పెద్ద విజయమని అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్ స్టాన్లీ పేర్కొన్నారు. ఆన్లైన్లో పిల్లలకు రక్షణ కల్పించడం.. వారి వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా యాప్‌లు గోప్యంగా ఉంచేలా పర్యవేక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని (children's privacy) సేకరించే ముందు, పిల్లల కోసం ఉద్దేశించిన యాప్‌లు, వెబ్సైట్లు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని నిర్దేశించే ఫెడరల్ చట్టాన్ని టిక్‌టాక్, దాని చైనా ఆధారిత మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ.. 2024లో న్యాయ శాఖ వ్యాజ్యం దాఖలు చేసింది. నాటి నుంచి టిక్‌టాక్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ (ByteDance) సంస్థ తన వాటాలను తగ్గించుకుంది. దీంతో కొత్త టిక్‌టాక్ యూఎస్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయడానికి ఒరాకిల్ (Oracle), సిల్వర్ లేక్, ఎమిరేట్స్ పెట్టుబడి సంస్థ ఎంజీఎక్స్ వంటి ప్రధాన పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకుంది. పిల్లల భద్రత, గోప్యతపై సోషల్ మీడియా కంపెనీలు పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలను ఎదుర్కొంటున్న తరుణంలో టిక్‌టాక్ అమెరికా ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకోవడం గమనార్హం. మరోవైపు 1998 నాటి బాలల ఆన్లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం (COPPA)తో పాటు.. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలు రావడంతో ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా (Meta) సైతం కోర్టు విచారణలను ఎదుర్కొంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇటీవల చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం స్పందించింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే వీటి ధరలు పెరిగాయనడం సరికాదని పేర్కొంది. స్థానికంగా దిగుబడి తగ్గడం, పండగల వేళ డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణాలని స్పష్టం చేసింది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టామని.. నిల్వలపై పరిమితులు విధించడంతోపాటు దిగుమతులపైనా సుంకాలు తగ్గించామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్: ఎలాన్ మస్క్ దేశంలో జులై 20న కిలో చక్కెర ధర రూ.48.18గా ఉండగా.. ఆగస్టు 20నాటికి అది రూ.55.70కు పెరిగింది. దీంతో ఇథనాల్ తయారీకి కోసం చక్కెర మళ్లించడం వల్లే ఈ ధరలు పెరిగాయని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీ కోసం మళ్లించే చక్కెర వాటా 2022-23లో 12శాతం ఉండగా.. 2025-26లో 9శాతానికి తగ్గిందని కేంద్రం తెలిపింది. అంచనాల కంటే తక్కువ దిగుబడి రావడం, పండగల వేళ డిమాండ్, పంట నష్టం, అంతర్జాతీయ సరఫరాల్లో అంతరాయం, ఊహాగానాలతో కొంతమంది నిల్వలు పెంచడం, తదితర కారణాల వల్ల ధరలు పెరిగాయని స్పష్టం చేసింది. దేశంలో దాదాపు మూడోవంతు ఇథనాల్.. మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచే ఉత్పత్తి అవుతోందని తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో పెరుగుతోన్న చమురు ధరలు వంటి కారణాలతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో నేటి సెషన్లో రోజంతా ఒడుదొడుకులతో సాగిన సూచీలు (Stock Market).. చివరకు స్తబ్దుగా ముగిశాయి. ఈ ఉదయం 77,701 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex) కాసేపటికి 77,725 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. కానీ, ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. కీలక రంగాల్లో మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు లాభనష్టాల్లో ఊగిసలాడాయి. ఒక దశలో 77,445 కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు అత్యల్పంగా 3 పాయింట్ల లాభంతో 77,540 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (Nifty) 20 పాయింట్లు పెరిగి 24,252 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 3 పైసలు పెరిగి 95.71 వద్ద ముగిసింది. నిఫ్టీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. మారుతి సుజుకీ, ట్రెంట్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, సిప్లా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా.. లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఐటీ, ఆటో, మీడియా, ఫార్మా రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్‌డెస్క్: టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ (Tata Motors Passenger Vehicles) సంస్థ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కార్లపై రూ.25,000 వరకు ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో ఆ కంపెనీ పేర్కొంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ముడి పదార్థాల ధరల పెరుగుదల వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ పెంపు ఐసీఈ ఇంజిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లోని కార్లకు వర్తిస్తుందని పేర్కొంది. కాకపోతే ఎంత పెంపు అనేది మోడల్‌ను బట్టి ఉంటుందని వెల్లడించింది. ముడిపదార్థాల ధరల పెరుగుదలను చాలా వరకు కంపెనీ తట్టుకుందని పేర్కొంది. కొద్ది భారాన్ని మాత్రమే వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి ధర ఒకేరోజు దాదాపు రూ.4300 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయిలో పెరగడం మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. మార్కెట్లో నిన్న బంగారం ధర సుమారు రూ.1.58 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, వెండి సైతం కిలోకు రూ.10 వేలు పెరిగి రూ.2.45 లక్షలకు చేరింది. గత ఏడు వారాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. గోల్డ్ లోన్ రంగంలోకి ఆదిత్య బిర్లా కంపెనీ అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న వేళ అమెరికా డాలర్ విలువ పడిపోవడం.. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గుతుండడంతో మదుపరులు లోహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్‌రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి, బంగారం ధరలు పైపైకి పోతున్నట్లు చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇల్లు కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయి. రుణం తీసుకుంటే, అది దీర్ఘకాలిక బాధ్యతగా మారుతుంది. కాబట్టి, రుణగ్రహీతలు అటువంటి నిర్ణయం తీసుకునే ముందు పీఎఫ్‌పై రుణం తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ఇంటి లోన్/డౌన్ పేమెంట్ కోసం నిధులను సమకూర్చుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం 'ప్రావిడెంట్ ఫండ్' బ్యాలెన్స్‌ను ఉపయోగించడం. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి, లేదా ఇంటి డౌన్ పేమెంట్ కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి EPF ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉంది. అయితే, హౌసింగ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం PF నుంచి డబ్బు తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుందా, అవ్వదా అనే నిర్ణయాన్ని పీఎఫ్ ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీం, 1952(EPF పథకం)లోని సెక్షన్ 68B ప్రకారం, నిర్దిష్ట షరతులకు లోబడి, ఎవరైనా ఉద్యోగి ఇల్లు కొనడానికి లేదా స్థలంపై ఇల్లు నిర్మించడానికి తన EPF ఖాతాలోని బ్యాలెన్స్‌ను తీసుకోవచ్చు. ఇల్లు కొనడానికి ప్రావిడెంట్ ఫండ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ PF నిల్వలో 90 శాతాన్ని తీసుకోవచ్చు. ఇల్లు మీ పేరు మీద, మీ జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు గృహ రుణం కోసం PF డబ్బును ఉపయోగించవచ్చు. గృహ రుణం కోసం PF డబ్బును విడతల వారీగా తీసుకోవచ్చు. అయితే, ఇంటి నిర్మాణం ఆరు నెలల్లోపు పూర్తి కావాలి. గృహ నిర్మాణం కోసం పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవడంలో లాభ, నష్టాలు లేకపోలేదు. వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, మీ PF పొదుపును ఉపయోగించడం ద్వారా మీ రుణ మొత్తాన్ని లేదా నెలవారీ EMIలను తగ్గించుకోవడానికి నిధులు లభిస్తాయి. ఇది PF నుంచి డబ్బు తీసుకోవడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలలో ఒకటి. ఇది మీరు త్వరగా ఇల్లు కొనుగోలు చేయడానికి, మీ కుటుంబానికి దీర్ఘకాలిక

stock market| ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించాయి. దీంతో వరుసగా ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. గురువారం సెషన్లో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. విదేశీ మదుపర్ల పెట్టుబడులు కలిసొచ్చాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 77,468.45 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,909.68) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా సూచీ లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,611.11 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 628.04 పాయింట్ల లాభంతో 77,537.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 153.55 పాయింట్లు పెరిగి 24,231.85 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.71గా ఉంది. సెన్సెక్స్ 30లో టైటాన్, హెచ్‌సీఎల్, ఇండిగో, టాటా స్టీల్ కంపెనీ షేర్లు తప్ప మిగతా కంపెనీల షేర్లన్నీ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ ధర 93.94డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ ధర 4,490.60 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్ సూచీలు కూడా లాభాల్లోనే ట్రేడయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
Gold Loan Business : దిగ్గజ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ABCL) ఆగస్ట్ 20న కీలక ప్రకటన చేసింది. గోల్డ్ లోన్ బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమ సురక్షిత రుణాల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంలో భాగంగా గోల్డ్ లోన్ బిజినెస్‌ను వ్యూహాత్మక విస్తరణగా అభివర్ణించింది. దశల వారీగా పూర్తి స్థాయిలో గోల్డ్ లోన్ డెడికేటెడ్ బ్రాంచుల్ని తెరవనున్నట్లు స్పష్టం చేసింది. ముందుగా 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 200-300 వరకు బ్రాంచుల్ని ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఇక రాబోయే మూడేళ్లలో దీనిని 1000 బ్రాంచులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఈ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరాల్ని వెల్లడించింది.తమ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) విభాగంలో ప్రవేశపెడుతున్న ఈ గోల్డ్ లోన్ బిజినెస్, ఇప్పటికే ఉన్న రిటైల్, MSME రుణ వ్యాపారానికి అదనపు బలాన్ని చేకూరుస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ వ్యక్తిగత రుణాలు, చిన్న వ్యాపారాలకు రుణాలు, పెద్ద కార్పొరేట్ సంస్థలకు మార్ట్గేజ్ లోన్లు ఆఫర్ చేస్తోంది. మరోవైపు హోం లోన్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ సేవల్లోనూ ఉంది. ఈ అనుభవమే వినియోగదారులకు మరింత పారదర్శకమైన, సౌకర్యవంతమైన, తాకట్టుతో కూడిన లోన్లు అందించడంలో దోహదపడుతుందని చెబుతోంది. సాధారణంగానే బంగారం తాకట్టు పెట్టుకొని ఇచ్చే లోన్లు కంపెనీలకు సురక్షితమైనవి, రిస్క్ తక్కువగా ఉంటుందన్న భావన ఉంది.Read Also: KKR దూకుడు.. మొన్న మెడికవర్స్ హాస్పిటల్స్ కొనుగోలు.. ఇప్పుడు రిలయన్స్ మద్దతున్న బుక్‌మైషోలో పెట్టుబడి!పెరిగిన ABCL షేరు ధరకంపెనీ తాజా ప్రకటనతో స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్న ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ షేర్లు దూసుకెళ్లాయి. కిందటి సెషన్లో రూ. 396 వద్ద ముగియగా, గురువారం రోజు దాదాపు 1 శాతం లాభంతో రూ. 399.80 వద్ద

Irumudi : రవితేజ, ప్రియభవాని శంకర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో డివోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఇరుముడి సినిమా రేపే ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా మీద హైప్ భారీగానే ఉన్నా రవితేజ గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాకు థియేటరికల్ బిజినెస్ తక్కువగానే జరిగింది. ఇరుముడి సినిమా థియేటరికల్ బిజినెస్ డీటెయిల్స్.. నైజాం – 7 కోట్లు ఆంద్ర – 8 కోట్లు సీడెడ్ – 2.5 కోట్లు రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు ఓవర్సీస్ – 2 కోట్లకు అమ్ముడయినట్టు సమాచారం. ఇరుముడి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21.5 కోట్లకు థియేటరికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 45 కోట్లు గ్రాస్ వసూలు చేయాలి. 50 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అయినట్టే. ఈ సినిమాకు ఉన్న హైప్, ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం కలిసొచ్చి ఈజీగానే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. Also See : Irumudi Pre Release Event : రవితేజ ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు.. ఇక ఇరుముడి సినిమాకు ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలిపి దాదాపు 18 కోట్లకు అమ్ముడయినట్టు సమాచారం. గమనిక : ఈ సమాచారం అంతర్జాలం, పలు సోషల్ మీడియా అకౌంట్స్, పలు టాలీవుడ్ సంస్థల వ్యక్తుల నుంచి సేకరించరించినది. దీనిని 10 టీవీ ధృవీకరించట్లేదు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ మేరకు 'ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026'ను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. నిబంధనలను సరళతరం చేసి, ఉన్నత విద్యా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిగా తీసుకొచ్చిన 'జన్ విశ్వాస్' విధానంలో భాగంగానే ఈ సవరణలు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అన్ని రంగాలకు విస్తరింపజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఉన్నత విద్యా రంగంలో నియంత్రణలను సులభతరం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వర్సిటీల సంఖ్య తక్కువగా ఉందని, ఈ సవరణల ద్వారా కొత్త సంస్థలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.ఈ బిల్లులో పలు కీలక సవరణలు ప్రతిపాదించారు. ప్రధానంగా, ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని 50 ఎకరాల నుంచి సీఆర్డీఏ, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో 10 ఎకరాలకు, ఇతర ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించారు. కనీస పెట్టుబడి నిబంధనను పూర్తిగా తొలగించి, కేసును బట్టి నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకునేలా మార్పు చేశారు. ఎండోమెంట్ ఫీజును రూ.5 కోట్లకు పరిమితం చేశారు. బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీగా మారాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం కనీసం 3.01 సీజీపీఏ తప్పనిసరి చేశారు.ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో రెండో మహిళా విశ్వవిద్యాలయంగా 'విష్ణు మహిళా విశ్వవిద్యాలయం' ఏర్పాటుకు మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు

బిర్యానీకి లవర్స్ ఎక్కువ. ప్రతిరోజూ బిర్యానీ తినేవారు కూడా ఎక్కువే. అందుకే బిర్యానీ బిజినెస్ బాగా నడుస్తుంది. దీనికి పెట్టే పెట్టుబడి కూడా తక్కువే. అందుకే చిన్నగా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. రోడ్డు పక్కన చిన్న బండిపై కూడా బిర్యానీ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. ఒక ప్లేట్ బిర్యానీ రూ.90 ధర నిర్ణయించి.. రోజూ 50 ప్లేట్లు అమ్మితే నెలకు రూ.1.35 లక్షల ఆదాయం వస్తుంది. సరుకులు, అద్దె, సిబ్బంది జీతాలు, గ్యాస్, ఇతర ఖర్చులు తీసేస్తేనే అసలు లాభం తెలుస్తుంది. ఏ వ్యాపారంలోనైనా అమ్మకాలు మాత్రమే సరిపోవు. ఫుడ్ క్వాలిటీ, ధర, లొకేషన్, కస్టమర్లు, సరుకుల ఖర్చు, రోజువారీ నిర్వహణ వంటివి లాభాన్ని నిర్ణయించే కీలకమైన అంశాలు. ఉదాహరణకు, ఒక ప్లేట్ బిర్యానీని రూ.90కి అమ్ముతున్నారని అనుకుందాం. రోజూ 50 ప్లేట్లు అమ్మితే, ఒక రోజు మొత్తం అమ్మకం రూ.4,500 అవుతుంది. బిర్యానీ బిజినెస్ 30 రోజుల పాటూ అమ్మకాలు జరిగితే, నెల మొత్తం ఆదాయం రూ.1.35 లక్షలు అవుతుంది. కానీ ఈ రూ.1.35 లక్షలు మొత్తం లాభం అనుకుంటే పొరపాటే. అసలు లాభం తెలియాలంటే అన్ని ఖర్చులనూ తీసేయాలి. బిర్యానీ తయారీకి అవసరమైన బియ్యం, మాంసం, నూనె, మసాలాలు, కూరగాయల వంటి సరుకులకు నిరంతరం ఖర్చు అవుతుంది. వీటితో పాటు షాప్ లేదా కిచెన్ అద్దె, సిబ్బంది జీతాలు, కరెంట్, గ్యాస్, నీళ్లు, ప్యాకింగ్, రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. ఇలాంటి ఖర్చులన్నీ కలిపి నెలకు సుమారు రూ.80,000 వరకు కావచ్చని అంచనా. ఆ స్థాయిలో ఖర్చులు పోగా, రూ.1.35 లక్షల ఆదాయంలో సుమారు రూ.55,000 మిగలవచ్చు. అమ్మకాలు ఇంకా పెరిగితే లాభాలు భాగా కనిపిస్తాయి. దగ్గర్లోని ఆఫీసులు, కంపెనీలు, చిన్న చిన్న ఫంక్షన్లు, కుటుంబ వేడుకలకు బల్క్ ఆర్డర్లు తీసుకోవచ్చు. చివరగా, రోజుకు 50 ప్లేట్లు అమ్మడం అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అసలు

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, ఇతర మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు నష్టపోయాయి. దీంతో నిఫ్టీ వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 77,218.05 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,235.46) వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కొనసాగిన సూచీ.. ఓ దశలో 76,822.89 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 325.78 పాయింట్ల నష్టంతో 76,909.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76.60 పాయింట్ల నష్టంతో 24,078 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.75గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91 డాలర్ల స్థాయికి చేరగా.. బంగారం ఔన్సు ధర 4,368 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

దిల్లీ: ఆహార ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే లేబుళ్లు, నిబంధనలకు విరుద్ధమైన క్లెయిమ్‌లు, ప్రకటనలకు సంబంధించి ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేసిన నోటీసులపై డాబర్ ఇండియా, ఫెర్న్స్ ఎన్ పెటల్స్, మరో 4 నాలుగు సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. డాబర్ ఆయుర్వేద ఔషధ తైలాన్ని వంటనూనెగా విక్రయిస్తున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ‘ఆ ఉత్పత్తిని ఆయుర్వేద ఔషధ విభాగంలోకి మార్చమని ఇ-కామర్స్ సంస్థలను ఆదేశించామని, స్వంత వెబ్సైట్లోనూ విభాగాన్ని మారుస్తున్నట్లు’ డాబర్ తెలిపింది. రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ సహా అన్ని ఉత్పత్తుల లేబుళ్లను సరిదిద్దామని ఫెర్న్స్ ఎన్ పెటల్స్ పేర్కొంది. లొట్టే ఇండియా తమ ఉత్పత్తుల లేబుళ్లపై ఉన్న 100% క్లెయిమ్‌లను తొలగించింది. ఇతర ఉత్పత్తులతో పోల్చే ప్రకటనలు, వీగన్ క్లెయిమ్‌లను ఈట్ బెటర్ వెంచర్స్ తొలగించింది. మార్కెటింగ్ మెటీరియల్స్, వెబ్సైట్ కంటెంట్‌ను ఓం సాయి హెల్త్‌కేర్ మార్చింది. భవిష్యత్తులో ఇటువంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయబోమని హామీ ఇచ్చింది. నోటీసులు అందుకున్నాక, అవసరమైన మార్పులు చేపట్టిన జాబితాలో ఎస్ఎస్ ప్రోడక్ట్ ప్రాప్ కూడా ఉంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Gold Price Today: భారతీయ కుటుంబాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో పసిడి ధరలు పెరగడం సగటు కొనుగోలుదారులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. గత వారం రోజుల్లోనే తులం బంగారంపై రూ.3,500 కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. మంగళవారం ధర కాస్త పెరగ్గా, బుధవారం నాటికి కూడా అదే ధోరణి కొనసాగుతూ స్వల్పంగా రేట్లు పైకి కదిలాయి. ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల్లో ఈ ఊహించని మార్పులకు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలే ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉండటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ దేశాల మధ్య సైనిక, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న ప్రతిసారీ పసిడికి డిమాండ్ పెరిగి, మార్కెట్లో ధరలు ఉన్నపళంగా పైకి లేవడం సాధారణంగా మారిన పరిణామం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఒకే రీతిలో పయనిస్తున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల బిస్కట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.1,55,900 వద్ద విక్రయమవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910 వద్ద నిలిచింది. వెండి కూడా బంగారం తోటి పోటీపడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,54,900 మార్కును తాకింది. చెన్నైలో కూడా వెండి ఇదే స్థాయిలో ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రూ.2,49,900 వద్ద లభ్యమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో స్థానిక పన్నుల ప్రభావంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,050 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,060 గా ఉంది. ముంబై, బెంగళూరు నగరాల్లో

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగుల డేటా చోరీకి గురైనట్లు ఓ థ్రెట్ యాక్టర్ చేసిన ఆరోపణలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ‘హ్యాట్‌మాన్’ అనే సైబర్ నేరస్తుడు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగిస్తున్న పలు కంపెనీల వ్యవస్థల్లోకి చొరబడి సుమారు 36.4 లక్షల రికార్డులను దొంగిలించినట్లు ప్రకటించాడు. ఈ డేటాను ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు సైబర్ సెక్యూరిటీ నివేదికలు వెల్లడించాయి. అయితే, ఈ డేటా లీక్‌పై సంబంధిత సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా డేటా లీక్‌కు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వాటిలో మెక్‌డొనాల్డ్స్, గ్యాప్ ఇన్క్., వొడాఫోన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇంటర్కాంటినెంటల్ హోటల్స్ గ్రూప్, కైండ్రిల్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు చెందిన ఉద్యోగుల డేటా తన వద్ద ఉందని సైబర్ నేరస్తుడు పేర్కొన్నాడు. జూలై 31 నుంచి వరుసగా పలు డేటాబేస్లను విక్రయానికి ఉంచినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. మొత్తం తొమ్మిది లిస్టింగ్స్‌లో 36 లక్షలకు పైగా రికార్డులు ఉన్నాయని అతను పేర్కొన్నాడు. ఈ ఆరోపణల్లో అత్యంత పెద్ద డేటాబేస్ మెక్‌డొనాల్డ్స్‌కు సంబంధించినదిగా చెబుతున్నారు. సుమారు 17 లక్షలకు పైగా ఉద్యోగుల రికార్డులు తన వద్ద ఉన్నాయని హ్యాట్‌మాన్ పేర్కొన్నాడు. ఇందులో ఉద్యోగుల పేర్లు, ఎంప్లాయీ ఐడీలు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఉద్యోగ హోదాలు, ఫోన్ నంబర్లు, పోస్టల్ అడ్రస్‌లు, సర్వీస్ అకౌంట్లు, ఇతర అంతర్గత టెనెంట్ వివరాలు ఉన్నాయని అతను చెప్పినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ వార్తా సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్ నివేదించింది. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) క్రేజీ కాంబినేషన్ ఫిక్స్! విశ్వనాథ్ అండ్

FASTag local pass | ఇంటర్నెట్ డెస్క్: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) డిజిటల్ ఫాస్టాగ్ లోకల్ పాస్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అర్హత కల్గిన వాహనదారులు నెలవారీ లోకల్ పాస్‌లను రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్ యాప్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల టోల్‌ప్లాజాలకు వెళ్లాల్సిన ప్రయాస తప్పనుంది. టోల్ ప్లాజాలను ప్రత్యక్షంగా సందర్శించడం, అవసరమైన పత్రాలను మాన్యువల్‌గా సమర్పించాల్సిన అవసరం లేదన్నమాట. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నివాసితులు ఈ పాస్‌లు పొందేందుకు అర్హులు. మీ దగ్గర్లోని టోల్ ప్లాజా ఈ జాబితాలో ఉందో లేదో చెక్ చేయడానికి రాజ్‌మార్గ్‌యాత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 12, తెలంగాణలో 3 టోల్‌ప్లాజాలను ఎంపిక చేశారు. నిబంధనల మేరకు ఈ పాస్ వినియోగించి టోల్ ప్లాజాల మీదుగా అపరిమితమైన ప్రయాణాలు చేయొచ్చు. డిజిలాకర్, వాహన్ పోర్టళ్లతో అనుసంధానించి వాహనదారుడి స్థానిక వివరాలను వెరిఫై చేస్తారు. వాహనాదారుడి నివాసం టోల్ ప్లాజాకు 20 కి.మీ పరిధిలో ఉందో, లేదో తెలుసుకోవడానికి జీఐఎస్ లోకేషన్ ఆధారంగా వెరిఫై చేస్తారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Zee Media Q1 Results: ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక ఫలితాలు వచ్చేశాయి. క్వార్టర్ 1 ఫలితాల్లో జీ మీడియా అదరగొట్టింది. రూ.190.85 కోట్ల ఆదాయం పొందడం విశేషం. ఏఐ, డిజిటల్లో దూసుకెళ్తున్న భారత మీడియా దిగ్గజం జీ నెట్వర్క్ తదుపరి ప్రణాళికలు, లక్ష్యాలు ఏమిటో జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ తెలిపారు. క్యూ1 ఫలితాలపై అతడు స్పందిస్తూ జీ మీడియా నెట్‌వర్క్‌కు సంబంధించి ప్రణాళికలను వెల్లడించారు. సాంప్రదాయ ప్రకటనలపై మాత్రమే ఆధారపడే మీడియా సంస్థ స్థాయి నుంచి విభిన్న ఆదాయ మార్గాలు కలిగిన టెక్-మీడియా కంపెనీగా జీ మీడియా రూపాంతరం చెందుతోందని నెట్వర్క్ సీఈవో రక్తిమ్ దాస్ తెలిపారు. క్యూ1 ఆర్థిక ఫలితాల అనంతరం జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్‌రూమ్‌లు, రీజినల్ నెట్వర్క్ విస్తరణే తమ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (జెడ్ఎంసీఎల్) ఆర్థిక ఫలితాలు, సంస్థ డిజిటల్ వ్యూహం, భవిష్యత్ విస్తరణపై జీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్థిక పనితీరు – కీలక గణాంకాలు ఆదాయం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1) జీ మీడియా ఏకీకృత ఆదాయం రూ.190.85 ( రూ.1,908.5 మిలియన్లు) కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ ఖర్చులు: నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు రూ.174.59 కోట్లు (1,745.9 మిలియన్లు)గా ఉన్నాయి. వ్యూహాత్మక మైలురాయి: క్యూ1 పనితీరు సంస్థ తదుపరి వృద్ధి ప్రయాణానికి బలమైన పునాది వేసింది. సరికొత్త ఆదాయం వైపు మార్పు సాంప్రదాయ ప్రకటనలపై మాత్రమే ఆధారపడే న్యూస్

నూతన పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కేవలం 24 నెలల వ్యవధిలోనే రాష్ట్రం 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని ఆయన వెల్లడించారు. ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వం వల్లే సాధ్యమైందని లోకేశ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, పారదర్శక పాలన, వ్యాపార నిర్వహణలో వేగం (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి అంశాలే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి" అని వివరించారు. రాష్ట్రం వేగంగా పారిశ్రామిక శక్తిగా ఎదుగుతుండటం గర్వకారణమని అన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న సానుకూల వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను అందిస్తుండటంతో, ఇప్పుడు ప్రపంచం చూపు ఏపీ వైపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు
Inspirational story: జీవితంలో ఎదురయ్యే కష్టాలు, పేదరికం ఎవరి భవిష్యత్తునూ నిర్ణయించలేవు అనేందుకు ప్రముఖ రియల్టర్ విజయ్ వర్మ (Vijay Varma) ప్రయాణమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రాజస్థాన్‌లోని ఒక చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, రోజుకు కేవలం రూ.3 కూలీకి వంట పాత్రలు తోమడం, రూ.8లకు ఇసుక తీసుకెళ్లడం వంటి పనులు చేశారు. కానీ, ఆయనలోని పట్టుదల, కృషి ఆయనను నేడు రూ.160 కోట్ల విలువైన కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేతగా నిలబెట్టాయి. విజయ్ వర్మ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, వ్యాపారవేత్తగా ఆయన సాధించిన విజయం గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.రోజుకు రూ.3 కూలీ నుంచి మొదలురాజస్థాన్లోని ఝుంఝుంను జిల్లా బిసావు గ్రామంలో అక్టోబర్ నెల 1978లో విజయ్ వర్మ జన్మించారు. 10 ఏళ్ల వయసులోనే తన తాతమ్మలు చనిపోయారు. ఆ మరుసటి ఏడాదిలోనే తన తండ్రిని సైతం కోల్పోయారు. దీంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. కుటుంబ భారం మొత్తం విజయ్ వర్మ తల్లిపై పడింది. ఆమె అడవి నుంచి ఎండుటాకులు, కట్టెలు సేకరించి కేవలం కొన్ని కిలోల పిండి కోసం వాటిని ఇచ్చేవారు.Read Also: ఛాయ్ బంక్: రూ. 50 వేలతో స్టార్ట్ చేసి.. 120 ఫ్రాంచైజీల స్థాయికి.. ఇద్దరు మిత్రుల సక్సెస్ స్టోరీకుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి 6వ తరగతిలోనే చదువును ఆపేసిన విజయ్ వర్మ పని కోసం తన అన్నతో కలిసి ముంబై, పుణే వంటి నగరాలకు వెళ్లారు. పుణే రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక వడాపావ్ బండి వద్ద గిన్నెలు తోముతూ రోజుకు రూ.3 సంపాదించేవారు. ఆ తర్వాత ఒక నిర్మాణ సంస్థలో ఇసుక రవాణా పని చేస్తూ రోజుకు రూ.8 దినసరి కూలీగా మారారు. ఆ తర్వాత థియోటర్లు, భవనాల నిర్మాణ పనుల్లో టైల్స్ వేయడం, ప్లాస్టరింగ్, ఆర్సీసీ పనులన్నింటినీ స్వయంగా నేర్చుకుని భవన నిర్మాణ

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ కోల్గేట్-పామోలివ్ తన ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉంది. రానున్న త్రైమాసికాల్లో ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముడిసరుకుల వ్యయం పెరగడమే ఇందుకు కారణం. కంపెనీ లాభాల మార్జిన్లను కాపాడుకొనేందుకు ఈ ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ పేర్కొన్నట్లుగా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ‘‘గతేడాది జీఎస్టీ సవరణ వల్ల ఉత్పత్తుల బరువును పెంచాం. ప్రస్తుతం రూ.10, రూ.20 నుంచే కోల్గేట్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో ముడి సరుకుల సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇప్పుడు ధరలు పెంచకపోతే భవిష్యత్తులో ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని కంపెనీ సీఈవో అండ్ ఎండీ ప్రభా నరసింహన్ తెలిపారు. అలాగే, కంపెనీ టూత్ బ్రష్, టూత్ పేస్ట్ రెండింటిలోనూ ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, కోల్గేట్-పామోలివ్‌కు చెందిన పర్సనల్ కేర్ బ్రాండ్ పామోలివ్ మార్కెట్ పనితీరుపై ప్రభా నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు బాంబే షేవింగ్ కంపెనీతో జట్టు కట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ పతాంజలి, హేలియోన్ కంపెనీకి చెందిన సెన్సోడైన్, హిందూస్థాన్ యునిలీవర్‌కు చెందిన పెప్సోడెంట్ ఉత్పత్తులతో పోటీపడుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Jane Street | ఇంటర్నెట్ డెస్క్: ‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట’.. సరిగ్గా ఈ సామెత అమెరికాకు చెందిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ జేన్‌స్ట్రీట్‌కు సరిపోతుందేమో. భారత స్టాక్ మార్కెట్‌ను కొల్లగొట్టి దేశంలో నిషేధం ఎదుర్కొన్న ఈ సంస్థకు.. వాల్‌స్ట్రీట్‌లో తాజాగా గట్టి షాక్ తగిలింది. నేరుగా ఈ కంపెనీ నష్టపోనప్పటికీ.. నమ్మి పెట్టుబడి పెట్టిన ఓ హెడ్జ్‌ఫండ్ భారీగా నష్టపోవడంతో జేన్స్ట్రీట్కూ భారీగానే నష్టం వాటిల్లింది. వక్రమార్గంలో భారత స్టాక్ మార్కెట్‌ను మోసం చేసిన ఈ సంస్థకు.. ఏడాది తిరగకముందే అంతకు రెండు, మూడింతలు నష్టపోవడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడైన 24 ఏళ్ల లియోపోల్డ్ ఆస్చెన్బ్రెన్నర్ ఆస్చెన్బ్రెన్నర్ సిట్యువేషనల్ అవేర్నెస్ పేరిట హెడ్జ్ ఫండ్‌ను స్థాపించాడు. 19 ఏళ్లకే కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఈయన.. గతంలో ఎఫ్‌టీఎక్స్, ఓపెన్ఏఐలలో పనిచేశాడు. అయితే, సెమీకండక్టర్ షేర్లపై సిట్యువేషనల్ అవేర్నెస్ పెట్టిన పెట్టుబడులు బెడిసికొట్టడంతో ఈ సంస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. దీంతో ఈ హెడ్జ్ ఫండ్‌లో పెట్టుబడులు కలిగిన జేన్స్ట్రీట్కూ భారీగా నష్టం వాటిల్లింది. సిట్యువేషనల్ అవేర్నెస్ సంస్థ జూన్ నెలలో శాన్డిస్క్లో 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్లు చొప్పున పెట్టుబడులు పెట్టింది. జులైలో శాన్డిస్క్ షేర్లు 47 శాతం, మైక్రాన్ షేర్లు 29 శాతం మేర కుప్పకూలాయి. దీంతో కేవలం ఒక్క నెలలోనే పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు 67 శాతం ఆవిరైంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 10 శాతం వాటా కలిగిన బ్లూమ్ ఎనర్జీ షేర్లు కూడా అదే నెలలో 31 శాతం పడిపోయాయి. టీఎస్ఎంసీ, నెబియస్ షేర్లలో పెట్టిన పెట్టుబడులు కూడా నష్టాలను మిగిల్చాయి. ఫలితంగా 45 బిలియన్లుగా ఉన్న ఫండ్ విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ పతనం కారణంగా వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ దాదాపు 15 బిలియన్

స్టూడెంట్ ట్రైబ్ ఈవెంట్లో UPEL.. యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు హైదరాబాద్: ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్ రంగంలో సేవలు అందిస్తున్న UPEL Private Limited యువతతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు స్టూడెంట్ ట్రైబ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన UPEL టీమ్.. యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి పరిశ్రమకు సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందించేందుకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం Electronics, Electrical, ECE, EEE, Mechatronics, Automation వంటి టెక్నికల్ విభాగాలతో పాటు Digital Marketing, Content Creation, Video Production, Social Media, Business Development, Sales వంటి విభాగాల్లో కూడా ఇంటర్న్‌షిప్ అవకాశాలను UPEL అందించనుంది. టెక్నికల్ విభాగాల్లో ఎంపికయ్యే విద్యార్థులకు VFDs, PLCs, HMIs, Servo Drives, CNC Systems, PCB Repair, Control Panels, Industrial Automation, Troubleshooting వంటి అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో క్రియేటివ్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సోషల్ మీడియా కంటెంట్, రీల్స్, వీడియో ప్రొడక్షన్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్ మరియు B2B కంటెంట్ వంటి విభాగాల్లో పనిచేసే అవకాశం కల్పించనున్నారు. ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన క్లిష్టమైన అంశాలను యువతకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తూ, రోజువారీ టెక్నికల్ కంటెంట్‌ను రూపొందించే కార్యక్రమాన్ని కూడా UPEL చేపట్టనుంది. ఇందులో భాగంగా టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలిగే యువ ప్రతిభకు ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు రియల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ వర్క్ కల్చర్, కెరీర్‌పై అవగాహన కల్పించడమే ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని UPEL Founder అజయ్ కుమార్ ఇనమడుగు మరియు CEO నరేష్ సిలివేరు తెలిపారు. స్టూడెంట్ ట్రైబ్ వంటి యువత వేదికలతో కలిసి పనిచేయడం ద్వారా విద్యార్థులు–పరిశ్రమల మధ్య వారధిగా
Babu Rao Success Story : జీవితంలో ఏమీ లేకుండా ఏదైనా సిటీకి రావడం, తినడానికి ఉండటానికి కూడా ఇబ్బందులు పడటం, తర్వాత ఏదైనా చిన్న పనితో ప్రారంభించి కోట్లకు కోట్లు సంపాదించడం ఇది సినిమాల్లో కనిపించే కథలా అనిపించినా హైదరాబాద్‌లో నిజంగానే జరిగిన ఒక వ్యక్తి ప్రయాణం. అవును హైదరాబాద్‌లో ప్రముఖ ఇరానీ చాయ్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కేఫ్ నిలోఫర్ వెనుక ఉన్న ఏ. బాబు రావు ప్రయాణం ఇలాంటిదే. 1975 సంవత్సరంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన చేతిలో పెద్దగా డబ్బు లేదు. ఉద్యోగం కోసం టికెట్ లేకుండానే రైలులో హైదరాబాద్ చేరుకున్న ఆయనకు మొదట టెక్స్టైల్ షాపులో సేల్స్‌మెన్‌గా ఒక పని దొరికింది. ఇక ఉద్యోగం వచ్చిన వెంటనే ఉండటానికి ఇల్లు దొరకలేదు. దాదాపు 15 రోజుల పాటు ఫుట్‌పాత్‌పైనే నిద్రించిన ఆయన స్నానం చేసేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌ను ఉపయోగించేవారని తెలిసింది. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రయాణం దాదాపు 5 దశాబ్దాల్లో కేఫ్ నిలోఫర్ అనే పెద్ద బ్రాండ్‌గా మారింది.టెక్స్టైల్ షాపు నుంచి రెస్టారెంట్ వరకుహైదరాబాద్ వచ్చిన తర్వాత బాబు రావు తొలుత టెక్స్టైల్స్ షాపులో సేల్స్‌మెన్‌గా చేరగా తర్వాత రెస్టారెంట్ ఉద్యోగంలో చేరారు. అక్కడే ఆయనకు సదరు వ్యాపారం ఎలా నడుస్తుంది. కస్టమర్లను ఎలా చూసుకోవాలి? రోజువారీగా నిర్వహణ ఎలా ఉంటుంది. ఇలా అన్ని విషయాలపై అవగాహన వచ్చింది. అదే సమయంలో ఒక కస్టమర్ ఆయన పనితీరును గమనించారు. కొత్తగా ప్రారంభమైన ఒక కేఫ్‌లో బాబు రావు బాగా పనిచేస్తారని భావించి అక్కడ ఉద్యోగం ఇప్పించారు. అదే కేఫ్ నిలోఫర్.ఇక బాబు రావు కేఫ్ నిలోఫర్‌లో తొలుత వెయిటర్‌గా చేరారు. అయితే ఆయన పని కేవలం కస్టమర్లకు చాయ్ ఇవ్వడంతోనే ముగియలేదు. అవసరమైనప్పుడు కేఫ్‌ను శుభ్రం చేయడం, పాత్రలు కడగటం వంటి పనులు కూడా చేసేవారు. పనేదైనా వెనుకాడకుండా చేయడం

Lalithaa Jewellery IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీ లలితా జువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకు తొలిరోజు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. బిడ్డింగ్ విండో తెరుచుకున్న తొలిరోజే 69 శాతం సబ్స్క్రిప్షన్ పూర్తి చేసింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. 6,27,61,403 షేర్లకు 4,35,37,826 బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ ఇన్వెస్టర్లు కోటా 74 శాతం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 67 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 61 శాతం సబ్స్క్రిప్షన్ నమోదు చేశాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.508 కోట్ల నిధులను కంపెనీ సమీకరిచింది. రూ.1700 కోట్ల ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కోషేరు ధరల శ్రేణి రూ.190-201గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ప్రైస్ బ్రాండ్‌తో పోలిస్తే 15 శాతం అధికంగా గ్రే మార్కెట్ ప్రీమియం పలుకుతోంది. ఆగస్టు 24న మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉంది. బ్లాక్‌స్టోన్ మద్దతు కలిగిన హోరైజన్ ఇండస్ట్రియల్ పార్క్ ఐపీఓ తొలిరోజు 14 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. 25,13,56,273 షేర్లకు గాను 3,52,85,000 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ ఇన్వెస్టర్ల కోటా 19 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కోటా కింద 3 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.1,167.8 కోట్ల నిధులను సమీకరించింది. రూ.2600 కోట్ల ఐపీఓ ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కోషేరు ధరల శ్రేణి రూ.57- 60గా కంపెనీ నిర్ణయించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్ చివరి దశకు చేరుకుందని స్పష్టం చేశాడు. ఇదే ఆఖరి సీజన్ కావచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఆశించిన మేర రాణించలేదు. ఈ మెగా టోర్నీలో పోర్చుగల్ నాకౌట్ స్టేజ్‌లోనే వెనుదిరిగింది. అప్పుడే తనకు చివరి వరల్డ్ కప్ అని రొనాల్డో ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రొనాల్డో తన కెరీర్ చివరి దశకు చేరుకుందంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఇదే ఆఖరి సీజన్ కావచ్చని తెలిపాడు. ‘నా ఫుట్‌బాల్ కెరీర్‌కు ఇదే(2026-27) చివరి సీజన్ కావచ్చు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఎలాంటి జీవితం గడపాలనే దానిపై నాకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలను ఎప్పుడో సిద్ధం చేసుకున్నా. నన్ను నేను బిజీగా ఉంచుకొనేందుకు చాలా విషయాలు ఉన్నాయి. మరోవైపు ఫుట్‌బాల్‌ను విడిచిపెట్టడం మాటల్లో చెప్పినంత తేలికేం కాదు. గత 25 ఏళ్లుగా ఫుట్‌బాల్‌తో అనుబంధం ఏర్పడింది. అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి’ అని రొనాల్డో వెల్లడించాడు. ‘రిటైర్మెంట్ తర్వాత కోచింగ్ కాకుండా.. వ్యాపారం వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్లబ్ ఓనర్ కావచ్చు. చాలాకాలం నుంచే నాకు ఆ ఆలోచన ఉంది. సొంతంగా ఫుట్‌బాల్ క్లబ్ ఉండాలనేది నా కోరిక. జాతీయ జట్టును వదిలి వెళ్లేటప్పుడు ముందుగా ఎవరికీ ఆ విషయం చెప్పను. నేను తీసుకొనే ఆకస్మిక నిర్ణయమే కానీ.. బాగా ఆలోచించే తీసుకున్నదే అవుతుంది’ అని రొనాల్డో వెల్లడించాడు. రొనాల్డో పోర్చుగల్ ఫుట్‌బాల్ తరఫున అత్యధిక 233 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ సాధించాడు. అలానే 2026 ప్రపంచ కప్ తో కలిపి అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ

Sachin Tendulkar: బెంగళూరులోని ఒక హోటల్ వేదికగా 1995లో జరిగిన ఒకే ఒక్క ఒప్పందం భారత క్రీడారంగ వాణిజ్య స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. 22 ఏళ్ల సచిన్ టెండూల్కర్ సంతకం చేసిన ఆ ఒక్క కాంట్రాక్ట్.. సాధారణ మ్యాచ్ ఫీజులపై ఆధారపడే భారత క్రికెటర్లను వందల కోట్ల బ్రాండ్లుగా మార్చే దిశగా తొలి అడుగు వేసింది. 1995 జులైలో రవిశాస్త్రి టీవీ వ్యాఖ్యాతగా పనుల్లో బిజీగా ఉన్న సమయంలో వర్డ్‌టెల్ అధినేత మార్క్ మస్కరెన్హాస్ను కలిశారు. సచిన్ టెండూల్కర్ కమర్షియల్ హక్కులను నిర్వహించేందుకు ఆసక్తి ఉందా అని రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు మార్క్ వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌లో బెంగళూరులోని తాజ్ రెసిడెన్సీ హోటల్లో సచిన్ సోదరుడు అజిత్ టెండూల్కర్‌తో మార్క్ సమావేశమయ్యారు. ఐదేళ్ల కాలానికి గానూ రూ.2.5 మిలియన్ డాలర్లు (అప్పట్లో మన కరెర్సీలో సుమారు రూ.7.5 కోట్లు) గ్యారెంటీ ఇస్తూ సచిన్ కమర్షియల్ రైట్స్ కోసం మార్క్ ఆఫర్ ఇచ్చారు. న్యాయవాదుల వివాదాలు, కమిటీల చర్చలు లేకుండా సచిన్ కుటుంబం ఒకే రోజులో ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో మారిన భారత క్రికెట్ వ్యాపార సూత్రాలు ఆ రోజుల్లో భారత ఆటగాళ్లకు యాన్యువల్ కాంట్రాక్టులు లేవు. క్రికెటర్లు కేవలం మ్యాచ్ ఫీజులు, చిన్నపాటి పత్రిక ప్రకటనలపైనే ఆధారపడేవారు. బీసీసీఐ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు దూర్దర్శన్కే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే 1995 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎయిర్‌వేవ్స్ ప్రభుత్వ ఆస్తి కాదు, ప్రజా ఆస్తి అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో ప్రసార హక్కుల వేలం తెరుచుకుంది. 1996 ప్రపంచకప్ ప్రసార హక్కులను వర్డ్‌టెల్ సంస్థ 10 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ప్రసార హక్కులతో పాటు భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సచిన్ బ్రాండ్ హక్కులను కూడా ఒకే సంస్థ చేజిక్కించుకోవడం క్రీడా రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. సచిన్ సోదరుడు అజిత్ పెట్టిన ఏకైక నిబంధన ఏంటంటే

వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడిని బుద్ధి, వాక్కు, వ్యాపారం, తర్కం వంటి వాటికి కారకుడిగా చెప్తారు. అటువంటి బుధుడు సెప్టెంబర్ 7న కన్యా రాశిలోకి ప్రవేశించానున్నాడు. ఈ ప్రవేశం భద్ర రాజయోగానికి కారణం అవుతుంది. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశులవారు సానుకూల ఫలితాలను చూస్తారు. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు కనిపించవచ్చు.బుధుడు స్వరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశులవారికి లబ్ది వ్యక్తిగత జాతకంలో బుధుని స్థానం, ఇతర గ్రహాల ప్రభావం, దశా-భుక్తులను పరిగణనలోకి తీసుకోవాలి. అయినప్పటికీ బుధుడు స్వరాశిలోకి ప్రవేశించడం చాలా మందికి బుద్ధి శక్తి, ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యం మరియు సానుకూల ఆలోచనలను పెంచుతుంది. ఈ కాలంలో కొత్త వ్యాపార వ్యూహాలు రూపొందించడం, ముఖ్యమైన చర్చల్లో పాల్గొనడం, వృత్తిపరమైన సామర్థ్యాన్ని చూపించడం, తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వంటి అవకాశాలు లభించవచ్చు.కుంభ రాశిఈ సమయం కుంభ రాశి జాతకులకు ఆర్థిక ప్రణాళికలు, భవిష్యత్తు ఆలోచనలకు అనుకూలం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కొత్త అవకాశాలు, ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారులు కొత్త వ్యూహాలు అమలు చేస్తే మంచి ఫలితాలు రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా, పెద్ద పెట్టుబడులు లేదా అధిక రిస్క్ నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా అలోచించి తీసుకోవాలి. .మకర రాశికన్యా రాశిలో బుధుని సంచారం మకర రాశి వారికి అదృష్టం ఇస్తుంది, ఉన్నత విద్య విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభించవచ్చు. వ్యాపారులకు దూర ప్రయాణాలు లేదా కొత్త వృత్తి సంబంధాల ద్వారా లాభాలు రావచ్చు. వృత్తిలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మిథున రాశిబుధుడు మిథున రాశికి అధిపతి కావడంతో కన్యా రాశిలో అతని సంచారం మీకు

తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'వెట్రి తమిళనాడు ఇన్వెస్ట్మెంట్'లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ వేదికపై ఆయన కీలక పాత్ర పోషించారు. కేవలం 100 రోజుల్లో 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం ఈ భారీ పెట్టుబడుల సదస్సును చేపట్టింది. విజన్, ఎంటర్ప్రైజ్, ట్రేడ్, ట్రాన్స్ఫార్మేషన్, రెసిలియెన్స్, ఇన్నోవేషన్ అనే ఆరు సూత్రాల ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. వేదికపై ఏర్పాటు చేసిన భారీ డిస్ప్లే బోర్డులో 100 రోజుల్లో 1 లక్ష కోట్ల పెట్టుబడులు సాధిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సదస్సులో విజయ్ వేదికపై ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది కేవలం ఫోటో షూట్ కోసమే నిర్వహించారా లేక వాస్తవమైన పెట్టుబడుల కోసమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, అధికారికంగా విజయ్ ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. సదస్సులో విజయ్ ప్రసంగంపై విపక్షాలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పెట్టుబడుల సేకరణ కంటే ఇది ప్రచార ఆర్భాటమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫలితంగా ఈ సదస్సు ఇప్పుడు తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన లక్ష్యం వైపు అడుగులు వేయడం సవాలుగా మారింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న 1 లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. పరిశ్రమల స్థాపన ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే పెట్టుబడుల ఒప్పందాలపై స్పష్టమైన నివేదిక వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర పురోగతి కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో కాలమే నిర్ణయించాలి. రాజకీయ

సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో దూసుకెళ్తోంది. ‘కరుప్పు’ విజయంతో సూర్య మార్కెట్ మరింత బలపడటంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ విలువ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అడ్వాన్స్ బుకింగ్స్‌పైనే పడింది. తమిళనాడులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో కాకపోయినా మోస్తరు స్థాయిలో కొనసాగుతున్నాయి. సాక్నిల్క్ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ చిత్రం తమిళనాడులో రూ.7.23 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌ను నమోదు చేసింది. ‘కరుప్పు’ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లు ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ మొత్తం సుమారు రూ.215 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు ఉన్నాయి. తమిళనాడు థియేట్రికల్ హక్కుల విలువ రూ.45 కోట్లు కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ.5 కోట్లు, ఓవర్సీస్లో రూ.15 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లకు చేరింది. ఓటీటీ, శాటిలైట్, సంగీత హక్కులతో కూడిన నాన్-థియేట్రికల్ బిజినెస్ విలువ రూ.125 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల పరంగా ఈ చిత్రం విజయవంతం కావాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.175 కోట్ల గ్రాస్‌ను సాధించాల్సి ఉంటుంది. ఆగస్టు 14న రాబోతోంది.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య, మమితా బైజు జంటగా నటించారు. రాధికతో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదం ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ

ITR Refund | ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో చాలా మంది రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. రిటర్నులు దాఖలు చేసిన కొన్ని గంటల్లోనే కొందరు రిఫండ్ అందుకోగా.. మరికొందరు మాత్రం వారాలు గడుస్తున్నా తమకు రిఫండ్ రాలేదని సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడతున్నారు. రిఫండ్ స్టేటస్ ఇంకా ‘అండర్ ప్రాసెస్’ అనే చూపిస్తోందంటూ కొందరు పేర్కొంటున్నారు. రిఫండ్ ఆలస్యానికి కారణమేంటి? ఇంతకీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంతో, ఆన్లైన్ లావాదేవీలు మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. ఆన్లైన్లో షాపింగ్ చేయడం, నిధులను బదిలీ చేయడం లేదా వ్యాపారం చేయడం వంటి ఏ విషయంలోనైనా, డిజిటల్ లావాదేవీల సౌలభ్యం మనం ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆన్లైన్ లావాదేవీలలో మోసాలను నివారించడానికి డిజిటల్ సంతకాలు ఒక శక్తివంతమైన సాధనంగా ఆవిర్భవించాయి. ఎలక్ట్రానిక్ పత్రాల ప్రామాణికతను ధ్రువీకరించడానికి, సంతకం చేసేవారి గుర్తింపును నిర్ధారించడానికి సురక్షితమైన, ట్యాంపర్-ప్రూఫ్ పద్ధతిని అందించడం ద్వారా, ఆన్లైన్ లావాదేవీల భద్రత, విశ్వసనీయతను పెంచడంలో డిజిటల్ సంతకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలను నివారించడానికి ఇవి ఎలా దోహదపడుతున్నాయో తెలుసుకుందాం. డిజిటల్ సంతకమనేది ఒక డిజిటల్ పత్రం లేదా సందేశానికి సంబంధించిన సమగ్రతను, ప్రామాణికతను ధ్రువీకరించడానికి ఉపయోగించే ఒక క్రిప్టోగ్రాఫిక్ పద్ధతి. ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును చేతితో రాసి తెలిపే సంప్రదాయ సంతకానికి భిన్నంగా, క్రిప్టోగ్రాఫిక్ కీలను ఉపయోగించి రూపొందించిన ఒక గణిత అల్గారిథమే డిజిటల్ సంతకం. సంతకం చేసే వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ కీతో పాటు, సంతకం చేస్తున్న పత్రం లేదా సందేశంలోని విషయానికి ఒక గణిత ఫంక్షన్‌ను వర్తింపజేయడం ద్వారా డిజిటల్ సంతకాలు సృష్టిస్తారు. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పణలు చేయడానికి లేదా ఇ-టెండర్లలో పాల్గొనడానికి, అద్దె ఒప్పందాలు, ఉద్యోగ ఒప్పందాలు వంటి వ్యక్తిగత చట్టపరమైన పత్రాల కోసం డిజిటల్ సంతకాలను ఉపయోగించవచ్చు. పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో రూపొందించి, ప్రాసెస్ చేసిన పత్రాలకు ఇ-సంతకాలు ఉత్తమంగా సరిపోతాయి. ఇవి వేగం, భద్రత, చట్టపరమైన చెల్లుబాటును నిర్ధారిస్తాయి. వీలునామాలు, రిజిస్ట్రేషన్, భౌతిక సంతకాలు అవసరమయ్యే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ వంటి కొన్ని ఆస్తి పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ, ట్రస్ట్ డీడ్లు లాంటి వాటిలో వీటిని అంగీకరించరు. ఇంకా, కోర్టులు కేవలం క్రిప్టోగ్రాఫిక్

టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల వృత్తి జీవితం గడిపి, తొమ్మిదేళ్ల పాటు టాటా సన్స్ ఛైర్మన్‌గా వ్యవహరించిన నటరాజన్ చంద్రశేఖరన్ (63) అతి త్వరలో గ్రూప్‌ను వీడనున్నారు. ఛైర్మన్‌గా మూడోవిడతలో ఐదేళ్లపాటు చంద్రశేఖరన్‌ను కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ ఏకగ్రీవంగా తీర్మానించినా.. టాటా సన్స్ బోర్డు ఇప్పటివరకు ఏమీ తేల్చలేదు. టాటా సన్స్‌లో ఈ ట్రస్టులకు 51.54% వాటా ఉంది. అయితే టాటా గ్రూప్‌నకు ఎంతో కీలకమైన టాటా సన్స్ ఛైర్మన్‌గా తనకు ఏకగ్రీవ మద్దతు లభించకపోవడం వల్లే వైదొలగనున్నట్లు చంద్రశేఖరన్ బుధవారం ప్రకటించారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా రెండో విడత పదవీ కాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్నందున, తన వారసుడి నియామకంపై బోర్డు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. చంద్రశేఖరన్, టాటా గ్రూప్ నుంచి వైదొలగనున్నారనే వార్తతో బుధవారం గ్రూప్ కంపెనీల షేర్లు 3.7% వరకు నష్టపోయాయి. వాటి మార్కెట్ విలువ రూ.45,000 కోట్లకు పైగా తగ్గింది. టాటా సన్స్ వాటాదార్ల సాధారణ సమావేశం ఈ నెల 18న జరగనుంది. అంతకుముందుగానే చంద్రశేఖరన్ తన నిర్ణయం ప్రకటించడం గమనార్హం. టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌కు తొమ్మిదేళ్లుగా (2017 నుంచి) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న నటరాజన్ చంద్రశేఖరన్ (63).. గ్రూప్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం సంచలనమే అయ్యింది. గతంలో రతన్‌టాటా నేతృత్వంలో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతల నుంచి సంస్థే తప్పించగా, ఇప్పుడు తనను ఛైర్మన్ పదవిలో కొనసాగించేందుకు బోర్డు ఏకగ్రీవ మద్దతు లభించలేదనే ఆవేదనతో చంద్రశేఖరన్ తప్పుకుంటున్నారు. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే.. టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో, గ్రూప్‌లోని దాతృత్వ సంస్థ (ట్రస్టు)లకు 66% వాటా ఉంది. గ్రూప్ పాలనపై ట్రస్టుల ప్రభావమే ఎక్కువ. బోర్డు సభ్యుల మధ్య సంఘర్షణ ఇక్కడే ప్రారంభమైంది. తన రాజీనామాపై చంద్రశేఖరన్ మాటల్లో చెప్పాలంటే.. ‘సర్ దొరాబ్జీ టాటా

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. How To Start Railway Station Business: సొంత బిజినెస్ ప్రారంభించాలని ఈ కాలంలో చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు జాబ్‌లు ఎప్పుడు ఉంటాయో? ఎప్పుడు ఊడతాయో కూడా తెలీదు. అయితే, మీరు కూడా బిజినెస్ రైల్వేస్టేషన్లో ప్రారంభించాలనుకుంటున్నారా? ప్రక్రియ ఏంటో తెలీదా? రైల్వే ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది తెలుసా? రైల్వేస్టేషన్లో వ్యాపారం ప్రారంభించడం.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై చిన్న షాపు సులభంగా ఓపెప్ చేయడం సులభమే. దీనికి టెండర్ ప్రక్రియ ఉంటుంది. ముందుగా రైల్వేస్టేషన్ అధికారుల పర్మిషన్ కూడా అవసరం. ఈ టెండర్ ప్రక్రియ అనేది ఐఆర్సీటీసీ ఆధారంగా జరుగుతుంది. విజయవంతంగా టెండర్ పూర్తి చేసిన వారికి లైసెన్స్ ఇస్తారు. రైల్వే రూల్స్ ప్రకారం వ్యాపారం ప్రారంభించవచ్చు. రైల్వేస్టేషన్ సంబంధిత అధికారులు టెండర్ విధానం ద్వారా ఈ దుకాణాలు ప్రారంభించవచ్చు. ఐఆర్సీటీసీ నిర్ణీత సమయాల్లో టెండర్లకు ఆహ్వానిస్తుంది. ఎప్పటికప్పుడు టెండర్స్ ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవాలి. ఆ స్టేషన్, మీకు ఆ టెండర్ సెట్ అవుతుందా? చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. టెండర్ లిస్ట్.. రైల్వే స్టేషన్లో షాప్ సరైన ప్రదేశంలో ఉందా? లేదా? లొకేషన్ చెక్ చేయండి. దీంతోపాటు దుకాణం సైజు, బిజినెస్ యాక్టివిటీకి పర్మిషన్, లైసెన్స్ గడువు, సెక్యూరిటీ డిపాజిట్, బిడ్డింగ్ డెడ్‌లైన్ కూడా చెక్ చేసుకోండి. మీ వద్ద ఈ టెండర్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉండాలి. సాధారణంగా రైల్వేకు సంబంధించిన టెండర్స్ ఇండియన్ రైల్వేస్ ఇప్రోక్యూర్మెంట్ సిస్టమ్ (IREPS) పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ప్రక్రియకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్

బంగారాన్నే ఇప్పుడు అత్యంత విలువైనదిగా చూస్తున్నాం. కానీ దీని కన్నా విలువైన మొక్క ఒకటుంది. ఆ మొక్క ఎక్కడో కాదు మనదేశంలోనే ఉంది. బంగారం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ విలువైన మొక్కగా దీన్ని పరిగణిస్తారు. ఈ మొక్క ఆకులనే వేల రూపాయలు పెట్టి కొంటారు. చైనా ఈ మొక్కల కోసం దొంగ దారులు వెతికి అక్రమంగా మొక్కలను దొంగిలించి అమ్ముకుంటోంది. ఇంత విలువైన ఆ మొక్క పేరు 'మిష్మి తీతా'. ఈ మొక్క కథేంటో పూర్తిగా తెలుసుకోండి. మిష్మి తీతా మొక్క అరుదైనది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువ. దీని శాస్త్రీయ నామం 'కాప్టిస్ తీతా'. ఇది మనకు హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. దీని వేర్లు చాలా చేదుగా ఉంటాయి. ఈశాన్య భారత భాషల్లో 'తీతా' అంటే చేదు అని అర్థం. అందుకే దీన్ని మిష్మి తీతా అని పిలుచుకుంటారు. సాంప్రదాయ ఆయుర్వేదం, చైనీస్ వైద్య విధానం, ఈశాన్య భారత గిరిజన వైద్యంలో ఈ మొక్కలోని భాగాలను అనేక రకాలుగా వాడతారు. ఈ మొక్క ఆకుల్లో 'బెర్బెరిన్' అనే ముఖ్యమైన రసాయనం ఉంటుంది. దీనివల్ల మలేరియా, కంటి సమస్యలు, కడుపునొప్పి, జ్వరం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మిష్మి తీతా మొక్కలు ఎక్కడ పడితే అక్కడ బతకలేవు. కొన్ని వాతావరణాల్లోనే జీవించడగలవు. ఈ మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణ కలిగిన అరుణాచల్ ప్రదేశ్‌లోని 'మిష్మి కొండల్లో' (Mishmi Hills) ఇది ఎక్కువగా పెరుగుతుంది. చైనాలోని టిబెట్ సరిహద్దు, మిజోరాం, నాగాలాండ్, మయన్మార్ సరిహద్దు అడవుల్లో కూడా ఈ మొక్కలు అరుదుగా దొరుకుతూ ఉంటాయి. సముద్ర మట్టానికి 2,000 నుంచి 3,000 మీటర్ల ఎత్తులో, తేమ, చల్లగా ఉండే సతత హరిత అడవుల్లో మాత్రమే ఈ మొక్కలు పెరగగలవు. అయితే ఈ మొక్కలను విపరీతంగా వాడేయడం… ఇతర దేశాలకు అక్రమ రవాణా చేయడం వల్ల ఇప్పుడు ఈ మొక్కలు అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి

ఇంటర్నెట్ డెస్క్: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు నటరాజన్ చంద్రశేఖరన్ ప్రకటనతో టాటా గ్రూప్ నాయకత్వంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు టాటా సన్స్ (Tata Sons) పగ్గాలను ఎవరు చేపడతారనేది కార్పొరేట్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. కాగా.. ఈ పదవి రేసు (Tata Succession)లో టీవీ నరేంద్రన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈయన ఎవరు..? ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడితే.. ఆయన ముందున్న సవాళ్లేంటీ? 61 ఏళ్ల టీవీ నరేంద్రన్ (TV Narendran) ప్రస్తుతం టాటా స్టీల్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తదుపరి ఛైర్మన్‌గా ఈయన పేరును టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. నరేంద్రన్కే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కార్పొరేట్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీవీ నరేంద్రన్ తిరుచిలోని ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత ఐఐఎం కలకత్తా నుంచి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన.. 1988లో టాటా గ్రూప్‌లో చేరారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇదే గ్రూప్‌లో పనిచేస్తున్నారు. తొలినాళ్లలో సేల్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి విభాగాల్లో పనిచేశారు. ఆగ్నేయ ఆసియాలో టాటా స్టీల్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. 2013లో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నరేంద్రన్.. ఆ తర్వాత సీఈఓగా పదోన్నతి పొందారు. కాగా.. తదుపరి ఛైర్మన్ రేసులో ఈయనతో పాటు నోయెల్ టాటా, సౌరభ్ అగర్వాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రశేఖరన్ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అప్పటిలోగా కొత్త ఛైర్మన్‌ను టాటా సన్స్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్‌కు మూడు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ విభాగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా నష్టాలు దాదాపు రెండు రెట్లు పెరిగి రూ.22,238 కోట్లకు చేరాయి. అహ్మదాబాద్
N Chandrashekaran: ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి టెక్నాలజీ మీద ఆసక్తితో కార్పొరేట్ రంగంలో ఒక ఇంటర్న్‌గా అడిగుపెట్టారు నటరాజన్ చంద్రశేఖరన్ (Natarajan Chandrasekaran). ఒక సాధారణ ఉద్యోగిగా తన కెరీర్ మొదలు పెట్టి టాటా గ్రూప్‌లో దిగ్గజ నాయకుడిగా తనదైన ముద్రవేశారు. ఇప్పుడు అనూహ్య పరిణామాల మధ్య తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి చంద్రశేఖరన్ వైదొలుగుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్‌లో ఆయన ప్రస్థానాన్ని ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.తమిళనాడులోని మోహనూర్ అనే ఓ కుగ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో ఎన్ చంద్రశేఖరన్ 1963లో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశి కోయంబత్తూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రోగ్రామింగ్, టెక్నాలజీపై ఇష్టంతో ఎంసీఏ పట్టా పొందారు. 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టారు. ఆ తర్వాత 40 ఏళ్ల పాటు ఒకే కంపెనీలో కొనసాగుతూ వచ్చారు.చిన్న వయసులోనే సీఈఓగాఅంచలంచెలుగా ఎదుగుతూ చిన్న వయసులోనే 2007లో టీసీఎస్ బోర్డు సభ్యుడిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకో 2009లో టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 46 ఏళ్లు. టాటా గ్రూప్ లో సీఈఓ బాధ్యతుల చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు టీసీఎస్ కష్టకాలంలో కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం దెబ్బతో కుదేలైన సంస్థను విపత్తు నుంచి బయటపడేశారు.2 సార్లు టాటా సన్స్ ఛైర్మన్గాసైరస్ మిస్త్రీ వివాదం తర్వాత టాటా గ్రూప్ పలు సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో టాటా సన్స్ ఛైర్మన్ పగ్గాలను ఎన్ చంద్రశేఖరన్ అందుకున్నారు. 2016 అక్టోబరులో టాటా సన్స్ బోర్డులో చేరారు. 2017లో ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. టాటా కుటుంబం నుంచి కాకుండా

N Chandrasekaran | ఇంటర్నెట్ డెస్క్: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ (N Chandrasekaran) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరితో తన పదవీకాలం ముగియనున్న వేళ.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పునర్నియామకం కోరకుండా గడువు వరకు ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇంతకీ టాటా సన్స్‌ను ఇన్నాళ్లు ముందుండి నడిపించిన చంద్రశేఖరన్‌కు వార్షిక వేతనం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.158.6 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఈ మొత్తం అందుకున్నారు. ఒక ఏడాదిలో ఆయన అందుకున్న అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు