
Lalithaa Jewellery IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీ లలితా జువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకు తొలిరోజు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. బిడ్డింగ్ విండో తెరుచుకున్న తొలిరోజే 69 శాతం సబ్స్క్రిప్షన్ పూర్తి చేసింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. 6,27,61,403 షేర్లకు 4,35,37,826 బిడ్లు దాఖలయ్యాయి.
రిటెయిల్ ఇన్వెస్టర్లు కోటా 74 శాతం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కోటా 67 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 61 శాతం సబ్స్క్రిప్షన్ నమోదు చేశాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.508 కోట్ల నిధులను కంపెనీ సమీకరిచింది. రూ.1700 కోట్ల ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కోషేరు ధరల శ్రేణి రూ.190-201గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ప్రైస్ బ్రాండ్‌తో పోలిస్తే 15 శాతం అధికంగా గ్రే మార్కెట్ ప్రీమియం పలుకుతోంది. ఆగస్టు 24న మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉంది.
బ్లాక్‌స్టోన్ మద్దతు కలిగిన హోరైజన్ ఇండస్ట్రియల్ పార్క్ ఐపీఓ తొలిరోజు 14 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. 25,13,56,273 షేర్లకు గాను 3,52,85,000 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ ఇన్వెస్టర్ల కోటా 19 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కోటా కింద 3 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.1,167.8 కోట్ల నిధులను సమీకరించింది. రూ.2600 కోట్ల ఐపీఓ ఆగస్టు 19న ముగియనుంది. ఒక్కోషేరు ధరల శ్రేణి రూ.57- 60గా కంపెనీ నిర్ణయించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


