
ఇంటర్నెట్‌డెస్క్: టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ (Tata Motors Passenger Vehicles) సంస్థ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కార్లపై రూ.25,000 వరకు ధరలను పెంచనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో ఆ కంపెనీ పేర్కొంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి, ముడి పదార్థాల ధరల పెరుగుదల వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ పెంపు ఐసీఈ ఇంజిన్, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లోని కార్లకు వర్తిస్తుందని పేర్కొంది. కాకపోతే ఎంత పెంపు అనేది మోడల్‌ను బట్టి ఉంటుందని వెల్లడించింది. ముడిపదార్థాల ధరల పెరుగుదలను చాలా వరకు కంపెనీ తట్టుకుందని పేర్కొంది. కొద్ది భారాన్ని మాత్రమే వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





