
జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల
జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల
© 2026 nimisham.in

జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల

Yellareddypeta: భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి - నగేష్ ఈ వార్తకు సంబంధించిన

ములకలపల్లి, సెప్టెంబర్ 02 : అత్యాచారానికి గురై హత్యకు గురైన శిరీషా కుటుంబాన్నిఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుధవారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెంకు చెందిన ఊకే శిరీషా హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తూ అత్యాచారానికి గురై హత్యకు గురైన విషయం తెలిసిందే. కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం చౌటిగూడెంలోని శిరీషా నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేటీఆర్ కు ఫోన్ చేసి శిరీషా తల్లి రామలక్ష్మీ, సోదరుడు శివరాంలతో మాట్లాడించారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని కేటీఆర్ ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన రాక్షసుడిని కఠినంగా శిక్షించడం ద్వారా తమకు న్యాయం చేయాల్సిందిగా శిరీషా వారు కోరగా కేటీఆర్ స్పందించి ఈ దారుణ ఘటన గురించి అసెంబ్లీలో లేవనెత్తి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అభయమిచ్చారు.ఆపదలో ఉన్న మిమ్మల్ని ఓదార్చి మనోధైర్యాన్ని ఇవ్వడానికే రవిచంద్ర, నాగేశ్వరరావులు వచ్చారని,న్యాయం జరిగే వరకు మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ వారికి చెప్పారు.శిరీషా తల్లి రామలక్ష్మీకి ఎంపీ రవిచంద్ర 50వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, కాపు సీతామహాలక్ష్మీ, సింధూ తపస్వి, ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు, మోరంపూడి అప్పారావు, పుష్పాల చందర్ రావు, మేకల వెంకటేశ్వర రావు, కొండవీటి రాజారావు, మేకల రాజేష్, గ్రామ సర్పంచ్ పద్మ పాల్గొన్నారు

Sircilla: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ మహేష్ గితే ఈ వార్తకు సంబంధించిన

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వీటిలో మరీ అంతగా అనే పాట ఒకటి. శ్రీరామచంద్ర ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ పాట కేవలం వినడానికి ఆహ్లాదంగా ఉండడమే కాకుండా. జీవితంపై మన ఆలోచనా విధానాన్ని మార్చేంత గొప్ప సందేశం ఇందులో ఉంది. కష్టం వచ్చిన ప్రతిసారీ కుంగిపోవడం కంటే దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని చెబుతుంది. అందుకే ఈ పాటను ఒక్కసారి శ్రద్ధగా వింటే చాలు.. మనసులోని భారాన్ని కొంతైనా దించుకున్న అనుభూతి కలుగుతుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మొదట మనసులో కలిగేది బాధ. ఆ బాధ క్రమంగా ఆందోళనగా మారుతుంది. ఆ తర్వాత అదే సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనల్ని మనమే మరింత బాధ పెట్టుకుంటాం. కానీ సమస్య గురించి ఆలోచిస్తూ ఏడవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. జరిగింది జరిగిపోయింది. దాన్ని మార్చలేం. అయితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇక ముందు అదే పరిస్థితి రాకుండా ఏం చేయాలి? అనే దానిపై దృష్టి పెట్టగలం. ఈ పాట మొదటి నుంచే ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది. బాధను అతిగా పెంచుకోవద్దని, మనసును అనవసరంగా కలవరపెట్టుకోవద్దని చెబుతుంది. కష్టం మన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. అదే మన జీవితమంతా కాదు. ఈ ఒక్క ఆలోచన మనలో బలాన్ని నింపుతుంది. మనకు ఎదురైన సమస్యను చూసి భయపడటం సహజం. కానీ ఆ భయంతోనే ఆగిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోయిందనుకోండి. మొదట బాధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. కానీ అదే విషయాన్ని రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటే కొత్త ఉద్యోగం రాదు. దాని బదులు కొత్త అవకాశాలను వెతకడం ప్రారంభిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. అలాగే

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana SIR: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు సాగిన సర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రకటన విడుదల చేసింది. సర్‌కు సంబంధించి ప్రత్యేక ప్రచారం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను 17.08.2026న ఆయా ఈఆర్ఓ కార్యాలయాల్లో ప్రచురించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాతో పాటు ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ( అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ముఖ్య వివరాలు, గడువులు క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు: ఆగస్టు 17 నుంచి ఈనెల 16వ తేదీ వరకు నోటీసుల జారీ, పరిష్కారం: 17.08.2026 నుండి 15.10.2026 వరకు ప్రత్యేక ప్రచార (స్పెషల్ క్యాంపెయిన్) తేదీలు - మొదటి విడత: ఈనెల 5 నుంచి 6వ తేదీ వరకు - రెండో విడత: ఈనెల 12వ తేదీ నుంచి 13 వరకు ప్రస్తుత పురోగతి మొత్తం 92,88,112 నోటీసులు రూపొందించగా 31,74,952 నోటీసులు అందాయి. 1,94,737 నోటీసులపై విచారణ పూర్తయింది. మిగిలిన నోటీసులను 119 మంది ఈఆర్ఓలు, 1,973 మంది ఏఈఆర్ఓల ద్వారా గడువులోగా విచారించనున్నారు. మొత్తం క్లెయిమ్‌లు, అభ్యంతరాలు: 9,07,292 - ఫారం-6 (కొత్త ఓటరు): 3,94,517 - ఫారం-6ఏ (ప్రవాస భారతీయులు): 6,346 - ఫారం-7 (పేర్ల తొలగింపు): 48,752

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువును రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెంచింది. ఈ నెల 10 వరకు సర్ గడువు ఉంటుందని తెలిపింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

Gurnoor Brar: టీమిండియాలో ఉద్భవిస్తున్న ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తన భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టం చేశారు. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి బౌలింగ్ చేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నానని, భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించడమే తన ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. గత మూడు నెలల కాలంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ వంటి దిగ్గజ పేసర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, వారితో ప్రాక్టీస్ చేయడం తన బౌలింగ్ రీతిని పూర్తిగా మార్చేసిందని 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్ తెలిపారు. బెంగళూరు వేదికగా విలేకరులతో మాట్లాడిన ఆయన, సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను సీనియర్ల నుంచి నేర్చుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఆరు వన్డేలు ఆడిన ఈ పంజాబ్ పేసర్, 11 వికెట్లు తీసి నిలకడైన ప్రదర్శన కనబరిచారు. అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లలో లభించిన అనుభవం తన బౌలింగ్ శైలిని మరింత మెరుగుపరిచిందని ఆయన వివరించారు. రంజీ ట్రోఫీ, ఇండియా-ఎ తరఫున కనబరిచిన అద్భుత ప్రదర్శనే తన్ను జాతీయ జట్టు తలుపు తట్టేలా చేసిందని గుర్నూర్ చెప్పారు. ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్కీ మోర్కెల్ మార్గదర్శకత్వంలో పని చేయడం తన బౌలింగ్ నైపుణ్యాన్ని విపరీతంగా పెంచిందని తెలిపారు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటర్లకు ఎలాంటి బంతులు వేయాలో, తన బౌలింగ్ కన్సిస్టెన్సీని ఎలా కాపాడుకోవాలో మోర్కెల్ సర్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మైదానంలో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తమను తాము ఎలా సిద్ధం చేసుకుంటారో చాలా దగ్గర నుంచి గమనించినట్లు గుర్నూర్ చెప్పారు. సహజసిద్ధమైన బౌలింగ్ శైలిని మార్చుకోవద్దని, కాకపోతే పరిస్థితులకు తగ్గట్లు వేగం, లెంగ్త్‌ను నిలకడగా కొనసాగించాలని సీనియర్లు தனకు సూచించినట్లు తెలిపారు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ అనుభవంతో ఆట

Sircilla: నాంపల్లి బీజేపీ ఆఫీసుపై దాడికి నిరసనగా సిరిసిల్లలో ఉద్రిక్తత! Sircilla: నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీజేపీ నాయకులు అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మీరే ఇలా దాడులకు పాల్పడితే.. 20 రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉన్న తాము దాడులకు పాల్పడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు

Sircilla: సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు బక్కి వెంకటయ్య! Sircilla: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భూ వివాదాలు, ఉద్యోగుల ప్రమోషన్లు, సివిల్ రైట్స్ డే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూ వివాదాల పరిష్కారంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు బాగుందని బక్కి వెంకటయ్య పోలీస్ శాఖను అభినందించారు. ఇక నేరెళ్ల బాధితులు ఇచ్చిన దరఖాస్తుపై స్పందించిన కమిషన్ చైర్మన్... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే రాష్ట్ర హైపర్ కమిటీ సమావేశంలో నేరెళ్ల బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బక్కి వెంకటయ్య వెల్లడించారు

Warangal: 22A భూములు అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సత్య శారద సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఆమెపై దాడి చేసి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ దాడిలో వృద్ధురాలి నోటికి తీవ్ర గాయాలై పళ్లు ఊడిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వేములవాడ అర్బన్ మండలం ఆర్ఆర్ చింతల్‌ఠాణా గ్రామానికి చెందిన మల్లవ్వ ఒంటరిగా జీవిస్తోంది. ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం రాత్రి పక్కింట్లోని బంధువుల ఇంట్లో నిద్రించింది. మంగళవారం ఉదయం తన ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లింది. మల్లవ్వ ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన దుండగుడు ఆమెను వెంబడించి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు తాళిబొట్టును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. దుండగుడి దాడిలో మల్లవ్వ నోటికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లోకి వచ్చిన సమయాన్ని దుండగుడు ముందుగానే గమనించాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది

Sircilla: కర్రీ అడిగేందుకు వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నంలోకి కర్రీ కోసం పక్కింటికి వెళ్లిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్‌కు చెందిన మోతె రాజు అన్నంలోకి కర్రీ కోసం పక్కింట్లోని మామిడాల రాజు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో పాత గొడవలను మనసులో పెట్టుకుని మామిడాల రాజు, అతని తల్లి అక్కవ్వ తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని మోతె రాజు తల్లి ఆరోపించారు. గొడ్డలితో దాడి చేయడంతో మోతె రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం

సినీ రంగంలో రాణించాలనుకునే వారికి గ్రామీణ నేపథ్యం అడ్డం కాదని నిరూపిస్తున్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామానికి చెందిన కసిరెడ్డి రాజ్‌కుమార్. సంగీత దర్శకుడిగా ఎదగాలనే ఆశయంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అనూహ్యంగా కమీడియన్‌గా, సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మండలంలోని ధర్మవరంలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న రాజ్‌కుమార్ ‘సాక్షి’ ముచ్చటించింది. సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? రాజ్‌కుమార్: మా తాతగారు యాళ్ల మాణిక్యం (తిక్కరాజు) హార్మోని ఆర్టిస్ట్. ఆయన స్ఫూర్తితో మ్యూజిక్ డైరెక్టర్ కావాలని సినీ రంగానికి వెళ్లాను. కానీ నటుడిగా అవకాశాలు రావడంతో ఆ దిశగా నా ప్రయాణం మళ్లింది. తొలి సినిమా? రాజ్‌కుమార్: 2017లో ‘రాజావారు రాణివారు’ ఆ తరువాత 15 చిత్రాల్లో నటించాను. గుర్తింపు తెచ్చిన సినిమాలు? రాజ్‌కుమార్: ‘లక్కీ భాస్కర్’, ‘ఆయ్’, ‘బెదురులంక’, ‘రంగా రంగా వైభవంగా’, ‘అర్జున ఫల్గుణ’. ఇరుముడిలో అనుభవం? రాజ్‌కుమార్: రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో భూషణం పాత్రలో చేశాను. ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించారా? రాజ్‌కుమార్: ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో పాటు దుల్కర్ సల్మాన్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు? రాజ్‌కుమార్: ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’, ‘డాన్ బాస్కో’ తదితర ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నాను. ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్ లక్ష్యాలు? రాజ్‌కుమార్: నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలి. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? ఇరుముడిలో మరో ఎడిట్.? జోరుగా టికెట్ బుకింగ్ బిడ్డ వ్యాఖ్యలపై కొండా మురళి రియాక్షన్..! విజయవాడ మెట్రోపై జస్ట్ ఆస్కింగ్ అంటూ కేశినేని నాని సంచలన

ఏపీలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)ఇవాళ పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. సర్‌లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్-మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్లకు సంబంధించిన సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలుకు నెలాఖరు వరకు మాత్రమే సమయం ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలని కోరారు.ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!అదే సమయంలో నాలుగైదు నెలలుగా బూత్ స్థాయిలో బీఎల్ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించినట్లు సజ్జల తెలిపారు. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపులకు సంబంధించిన వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమన్నారు. అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితిలో ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. Amaravati: చంద్రబాబు, నారాయణపై వైసీపీ కేసును తేల్చేసిన సుప్రీంకోర్టు..!డూప్లికేట్ లేదా బోగస్ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలని చెప్పారు. పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని సజ్జల సూచించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారన్నారు

హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లో 1,816 మంది అధికంగా మహిళలు హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. సుమారు నాలుగు లక్షలకు పై చిలుకు ఉన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. సుమారు 44.19 శాతం ఓట్లు జాబితా నుంచి కనుమరుగు కావడంతో వాటిలో కొన్ని ఓట్లైనా తిరిగి రాబట్టుకునేలా కార్యచరణ చేసుకునేందుకు రాజకీయ శిబిరాలు ప్రయత్నాలు ఆరంభించాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ జాబితాను ఇటీవల ప్రచురించింది. దీని ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.79 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. అత్యధిక ఓట్లు తొలగించబడిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ మూడోస్థానంలో నిలిచింది. పేరుకు జూబ్లీహిల్స్ అయినప్పటికీ నియోజకవర్గంలో బస్తీలు అత్యధికంగా ఉన్నాయి. మాస్ ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ప్రతీ యేట ఇక్కడ ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో సుమారు 79 వేల ఓటర్లు పెరిగారు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రకారం ఒకరికి ఒకే ఓటు అని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మెజారిటీ ఓటర్లు పుట్టిన ఊర్లో ఓటు ఉంచుకునేందుకు మొగ్గు చూపించారు. దీంతో ఓటు శాతం గణనీయంగా తగ్గింది. ఏకంగా 1.48 లక్షల మంది తమ ఓటును నియోజకవర్గం నుంచి వేరే చోటకు పెట్టుకున్నట్టు షిఫ్టింగ్ జాబితా ప్రకారం తెలుస్తోంది. అంతేగాకుండా ఇక్కడ హాస్టళ్లు కూడా ఎక్కువ ఉండడంతో చాలామంది స్థానిక చిరునామా కోసం ఓటరు కార్డులు చేయించుకున్నారు. ఇవి కూడా ఇప్పుడు తరలి పోయాయని లెక్కలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,219. ఇక్కడ పురుషుల కంటే మహిళలే 1,816 మంది ఎక్కువగా ఉన్నారు. పురుషులు 1,12,697 మంది ఉండగా, మహిళలు 1,14,513 మంది

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుపై తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞత చాటుకున్నారు. చంద్రబాబు, దామచర్ల చిత్రపటాలకు పాలాభిషేకం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలుపై తెలుగుదేశం శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, కృతజ్ఞత చాటుకున్నారు. గురువారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు, పార్టీ నాయకులు మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తూ, స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా థ్యాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు.. విన్నింగ్ టీమ్‌ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్‌గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

అల్లు అరవింద్ కి చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి అల్లు అరవింద్ నిర్మాత. ఆ తర్వాత వీరి కాంబోలో జానీ, జల్సా లాంటి చిత్రాలు వచ్చాయి. జల్సా మాత్రమే సూపర్ హిట్ అయింది. జల్సా మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. దీని గురించి ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు. నేను ఇండస్ట్రీకి వచ్చింది అల్లు శిరీష్ వల్లే. నేను సినిమాలకు సంబంధించి ఫ్యాన్ పేజీలు నడిపేవాడిని. నా ట్యాలెంట్ చూసి నువ్వు ఇండస్ట్రీకి వస్తే బావుంటుంది అని శిరీష్ ప్రోత్సహించారు. ఆ విధంగా ఇండస్ట్రీకి వచ్చాను. అల్లు శిరీష్ హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ లోనే నాకు పీఆర్వోగా అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి పీఆర్వోగా పని చేశాను. ఆ సినిమాకి నేను, శిరీష్ కలసి పబ్లిసిటీ కోసం వర్క్ చేశాం. ఆ మూవీలో పవన్ కళ్యాణ్ కాలు పైకి ఎత్తే పోస్టర్ ఉంటుంది. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. దానిని వైరల్ చేద్దాం అని అనుకున్నాం. కానీ అల్లు అరవింద్ గారికి ఆ పోస్టర్ అస్సలు నచ్చలేదు. అలా కాలు ఎత్తడం చూడడానికే ఇబ్బందిగా ఉంది. దానిని తలగించండి అని చెప్పారు. నేను కలగజేసుకుని.. లేదు సార్ ఇది బాగా వైరల్ అవుతుంది చూడండి అని చెప్పా. ఆ విధంగా అల్లు అరవింద్ గారిని ఒప్పించి ఆ పోస్టర్ ని పెట్టాను. ఆ పోస్టర్ ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఐకానిక్ స్టిల్స్ లో అది కూడా ఒకటి. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీనితో నాకు అల్లు అరవింద్ గారి దగ్గర, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ

ఎప్‌సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. హైదరాబాద్, సుల్తాన్పూర్, జగిత్యాల కాలేజీల్లో హాట్‌కేకుల్లా సీట్ల భర్తీ నేడు మంథని, సిరిసిల్ల, పాలేరు కాలేజీల్లో.. రేపు వనపర్తి, కోస్గి, మహబూబాద్ కాలేజీల్లో.. హైదరాబాద్ సిటీ: ఎప్‌సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. బుధవారం ఉదయం వర్సిటీ అడ్మిషన్ల విభాగంలో జరిగిన కౌన్సెలింగ్‌కు సుమారు 200మంది అభ్యర్థులతోపాటు, వారి తల్లిదండ్రులు తోడు రావ డంతో క్యాంపస్‌లో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీలోని వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో 26, సుల్తాన్‌పూర్‌లో 8, జగిత్యాలలో 2 సీట్లు ఖాళీగా ఉండగా జగిత్యాలలో ఒక సీటు మినహా మిగిలిన సీట్లన్నీ హాట్ కేకేల్లా భర్తీ అయ్యాయని అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. గురువారం మంథని, సిరిసిల్ల, పాలేరు కాలేజీల్లో, శుక్రవారం మహబూబాబాద్, వనపర్తి, కోస్గి జేఎన్టీయూ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్‌ను హైదరాబాద్ క్యాంపస్‌లోనే నిర్వహిస్తామని చెప్పారు. స్పాట్ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల ఎప్‌సెట్ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరి, ఇంటర్మీడియట్ మార్కుల్లో మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత మొదట వచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థులు అన్ని సర్టిఫిక్టెలతోపాటు ఫీజు డబ్బులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మద్యం రవాణా టెండర్లలో జరిగిన అవకతవకల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) చుక్కెదురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిలపై సిట్ అధికారులు దాఖలు చేసిన ప్రొడక్షన్ కమ్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.ఈ కేసులో కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, కారుమూరి సునీల్‌ను సిట్ నిందితులుగా చేర్చింది. అయితే, వీరిని అంతకుముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. గతంలో సిట్ అధికారులు వీరిని పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే, తమ రిమాండ్ చెల్లదంటూ రాజశేఖర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం సిట్ అధికారులు మళ్లీ కొత్తగా పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఏసీబీ కోర్టు, ఆ వారెంట్‌ను తిరస్కరిస్తూ వెనక్కి పంపింది.ఇదే కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులు కె. ధనుంజయ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. సమన్లు అందిన తర్వాతే విచారణకు హాజరు కావాలని జ్యుడీషియల్ అధికారి ఎల్. తేజోవతి వారికి సూచించారు

Kothagudem: కార్మికుల హక్కుల సాధనకు అన్ని సంఘాలతో కలిసి పోరాటం: ఏఐటీయూసీ! ఈ వార్తకు సంబంధించిన

Nirmal: ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: కలెక్టర్! నిర్మల్: నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్, మ్యాపింగ్ కాని ఓటర్ల గుర్తింపు, ఓటర్ల వివరాల్లోని వ్యత్యాసాలు, అనామలీస్ పరిశీలనను నిర్దేశిత నిబంధనల మేరకు పూర్తి చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లాల వారీగా ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ల వివరాల పరిశీలనలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల వివరాల్లో ఏవైనా వ్యత్యాసాలు, అనామలీస్ గుర్తించినట్లయితే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీ, సమయంలో హాజరై తమ పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించేలా వారికి అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా అందే దరఖాస్తులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, ఆగస్టు 19: అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓలు, ఈఆర్ఓలతో సీఈవో సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని వారిని ఆదేశించారు. అనామలీస్, నో- మ్యాపింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. క్లెయిమ్స్, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణలు చేపట్టాలని తెలిపారు. ASDD జాబితాలోని కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలని వారికి వివరించారు ఫారం 6, 6A, 7, 8పై క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం చేయ్యాలన్నారు. ఓటర్లకు నోటీసుల వివరాలు బీఎల్వోలు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నో- మ్యాపింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వారికి సీఈవో సుదర్శన్ రెడ్డి వివరించారు. కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్ తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

Mohammed Siraj Injury: బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో లంక పర్యటనలో పేస్ బాధ్యతలను సిరాజ్ తన భుజాలపై వేసుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గంభీర్ కేవలం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. అయితే మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ వేగం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐదో రోజు తొలి సెషన్లో అతను కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతని అత్యధిక వేగం 132.8 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ మొత్తం మీద సగటున 126 కిలోమీటర్ల వేగంతోనే బంతులు విసిరాడు. దీన్ని బట్టి అతను వంద శాతం ఫిట్‌గా లేడని, ఏదో నొప్పితో బాధపడుతున్నాడని దొడ్డ గణేశ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మామూలుగా అయితే సిరాజ్ ఇంత నెమ్మదిగా బౌలింగ్ చేయడని ఆయన గుర్తుచేశారు. సిరాజ్ ఫిట్‌నెస్‌పై వస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), బీసీసీఐ మెడికల్ టీమ్ పనితీరును బోనులో నిలబెడుతున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు సిరాజ్ చాలా రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే గడిపాడు. అప్పుడే అతని గాయం గురించి వైద్యులకు తెలియలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉంటున్న ఈ స్టార్ బౌలర్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసేలా మేనేజ్మెంట్ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? Is Siraj carrying a niggle? This isn’t the pace he usually bowls #SLvIND — Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 19, 2026 గాలే టెస్టులో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో

బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ప్రముఖ సీరియల్ నటి శిరీష రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక వార్త తీవ్రంగా ప్రచారం అవుతోంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన ప్రముఖ సీరియల్ నటి శిరీష రెండో పెళ్లికి సిద్ధమైనట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక వార్త తీవ్రంగా ప్రచారం అవుతోంది. ఐకానిక్ సీరియల్ మొగలి రేకులు తో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత రాములమ్మ, చెల్లెలి కాపురం, స్వాతి చినుకులు లాంటి పలు ప్రజాదరణ పొందిన ధారావాహికల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుకుంది. కెరీర్ అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట, కొన్నేళ్ల క్రితం మనస్పర్థలు, వ్యక్తిగత విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల తర్వాత తన కుమారుడితో కలిసి ఉంటున్న శిరీష, ప్రస్తుతం మళ్లీ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, ఆర్జే, యాంకర్ అయిన మహేంద్ర బొర్రాని ఆమె త్వరలోనే వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఒక ఈవెంట్లో వీరిద్దరి మధ్య మొదలైన పరిచయం, ఆ తర్వాత కాలంలో స్నేహంగా మారినట్లు తెలుస్తోంది. క్రమంగా వీరిద్దరి మధ్య అనుబంధం బలపడి ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు నిర్ణయించుకున్నారట. ఈ వేడుకను ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్‌గా నిర్వహించాలని ఈ జంట ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక వరుడిగా మారనున్న మహేంద్ర బొర్రా విషయానికి వస్తే, ఆయన బుల్లితెరపై యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. కేవలం యాంకరింగ్‌కే పరిమితం కాకుండా, నటుడిగా ఇంటింటి రామాయణం, మగువ ఓ మగువ వంటి సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి నటన పరంగా కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు. త్వరలోనే ఈ జంట తమ వివాహా విషయాన్ని అధికారికంగా

డేటా లేక్, స్మార్ట్ గవర్నెన్స్ పాఠాలు మాకు నేర్పండి అమరావతి నగరం ప్రపంచంలోనే అద్భుత నగరం అవుతుంది విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ శిర్సా అమరావతి రాజధాని నిర్మాణ తీరును చూశాం. నిజంగా ఇదొక అద్భుతం. ప్రపంచంలోనే ఇదొక గొప్ప నగరంగా మారుతుంది. నారా చంద్రబాబు నాయుడు విజనరీ ముఖ్యమంత్రి. అభివృద్ధికి, దార్శనికతకు ఆయనొక విశ్వవిద్యాలయం. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏపీ ప్రభుత్వం మార్గదర్శి. ఏపీని చూసి ఢిల్లీ ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పెట్టుబడుల ఆకర్షణ, స్మార్ట్ గవర్నెన్స్ తదితర అనేక రంగాల్లో మాకు మీ సహకారం కావాలి అని మంత్రులు లోకేష్, టీజీ భరత్‌లతో ఢిల్లీ పరిశ్రమలు, ఆహారం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా కోరారు. ఢిల్లీ ప్రభుత్వ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా నేతృత్వంలో ఆ ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక ప్రతినిధుల బృందం ఏపీలో పర్యటించి ఇక్కడి పారిశ్రామిక విధానాలు, పాలనా సంస్కరణలను అధ్యయనం చేస్తోంది. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీెఎస్)లో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో ఈ బృందం మంగళవారం సమావేశమైంది. ఈ బృందానికి రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌లు సాదర స్వాగతం పలికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివరించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని మంత్రి నారా లోకేష్ వివరించారు. 2026 ఆర్థిక సంవత్సంలో ఆంధ్రప్రదేశ్ 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించిందన్నారు. భాతరదేశం ఆకర్షిస్తున్నపెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా క్లస్టర్ ఆధారిత అభివృద్ధి దిశగా పారిశ్రామికాభివృద్ధి సాధిస్తున్నామన్నారు. తిరుపతి ప్రాంతంలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం

16 వేల టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేశారు టీచర్ రిక్రూట్మెంట్ అంటే ఢిల్లీలో కోర్టులు, కేసుల చిక్కులే ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణ అద్భుతం అంటూ విద్యా మంత్రి నారా లోకేష్‌ను ప్రశంసించిన ఢిల్లీ మంత్రి అమరావతి: ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 16వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టిన తీరుపై ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మన్జిందర్ సింగ్ శిర్సా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆయన ఆర్టీజీఎస్లో విద్యా, ఐటీ, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్సీ ద్వారా 16వేల మంది ఉపాధ్యాయులను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఎలా నియామకాలు చేపట్టగలిగారని ఆయన మంత్రి నారా లోకేష్‌ని ఆసక్తిగా అడిగారు. ఢిల్లీలో టీచర్ రిక్రూట్మెంట్ అంటేనే కోర్టులో కేసులు, ఫిర్యాదులు, గందరగోళాలు సృష్టించేసి దాని జోలికెళ్లాలంటే జడిపించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఎలాంటి వివాదాలు లేకుండా పారదర్శకంగా టీచర్ రిక్రూట్మెంట్ పూర్తి చేసిన లోకేష్‌కు అభినందనలు తెలిపారు. దీనికి మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తాము డీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి ఎక్కడా ఎలాంటి చిన్న పొరబాట్లకు తావు లేకుండా 16వేలమందికిపైగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామన్నారు. దీనిపైన కూడా ప్రతిపక్ష పార్టీ చాలా ఆరోపణలు చేసి విఫలమైందన్నారు. కోర్టుల్లో సైతం వారు ఎక్కడా చిన్న అక్రమం జరిగినట్లు ఆధారాలు చూపించలేకపోయారన్నారు. త్వరలో మరో 3వేల మందికిపైగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యాశాఖ తనకు ఎంతో ఇష్టమైన శాఖని, విద్యాశాఖలో వినూత్న విధానాలు అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు. మొట్టమొదటి సారి ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి ఇదో ఉదాహరణ అన్నారు
టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు ( Tollywood Celebrities ) హైదరాబాద్‌లోని తమ ఓటును వదులుకున్నారా? తమ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే తమ ఓటు హక్కును కొనసాగించడానికి మొగ్గు చూపారా? అంటే అవుననే అంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) ప్రక్రియలో తెలుగు చలనచిత్ర సీమకు చెందిన సెలబ్రిటీలు తమ ఓటును స్వంత రాష్ట్రానికి మార్చుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన టాలీవుడ్ ప్రముఖులు, ఇతర పరిశ్రమలకు చెందినవారు ఇక్కడి ఓటును వదులుకుని, తమ సొంత ఊర్లలోనే ఓటర్లుగా కొనసాగేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.ఏపీలోని స్వగ్రామాలకు సినీ ప్రముఖుల ఓట్లుఈ విషయమై తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) కార్యాలయ అధికారులు స్పందిస్తూ.. బడా సినీ కుటుంబాలతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వగ్రామాలకే ఓటు విషయంలో ప్రాధాన్యత ఇచ్చినట్టు ధ్రువీకరించారు. ‘‘మా అధికారులు, బూత్ స్థాయి అధికారులు (BLOలు) వారిని సంప్రదించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంత ఊర్లలోనే ఓటు హక్కును ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సినీ ప్రముఖులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎంతోకాలంగా నివసిస్తున్నప్పటికీ ఇక్కడి ఓటును తొలగించుకుని ఏపీలోనే తమ ఓటును ఉంచుకోవడానికే వారు సుముఖత వ్యక్తం చేశారు’’ అని అధికారులు పేర్కొన్నారు.నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన నివాస కేంద్రంగా ఉంది. వీరు దశాబ్దాలుగా ఇక్కడే నివాసముంటూ సొంత ఇళ్లను కూడా కలిగి ఉన్నారు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఎక్కువ భాగాన్ని ఇక్కడే గడుపుతున్నారు.అత్యధికంగా జూబ్లీహిల్స్లోనే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలిపోయిన హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్న జూబ్లీహిల్స్లోనే అత్యధికంగా ఉన్నారు. మొత్తం 1,48,859 మంది ఓటర్లు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తేలింది. అలాగే 8,232 మంది ఓటర్లు మరణించినట్లు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ డీసెంట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఎప్పటిలాగే సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక మమితా బైజు తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో సంజయ్ విశ్వనాథ్ కొడుకు అభయ్ ఒకటి. సినిమాలో ఈ పిల్లాడు తన క్యూట్ నెస్, న్యాచురల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అభయ్ అసలు పేరు చార్విక్. చాలా మంది ఈ అబ్బాయిని సెలబ్రిటీల పిల్లాడని అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ఈ బాబు కామన్ మ్యాన్ వాళ్ల అబ్బాయి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చార్విక్ ను తీసుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉందని వాళ్ల తల్లిదండ్రులు తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం 6 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీంతో చార్విక్ ను ఆడిషన్ కు తీసుకెళ్లాం. అక్కడ చాలా మంది పిల్లలు ఏడుస్తుండగా చార్విక్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. దీంతో అతని క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూసి మేకర్స్ వెంటనే సెలెక్ట్ చేశారు

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌పై భారత్ పూర్తి పట్టు సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి కష్టాల్లో పడింది. విజయానికి టీమిండియా కేవలం 6 వికెట్ల దూరంలో నిలవగా, లంక గెలవాలంటే చివరి రోజు ఇంకా 288 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో నాలుగో రోజు ఆటలో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలింగ్ ప్రారంభించిన భారత్‌కు పేసర్ మహమ్మద్ సిరాజ్, యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన శుభారంభం అందించారు. సిరాజ్ తన బౌన్సర్‌తో నిషాన్ మదుష్క (6)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించగా, ఆ తర్వాతి ఓవర్లోనే మానవ్ సుతార్.. దినేష్ చండీమాల్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన పసిందు సూరియబండార (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కొద్దిసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ.. కమిందు మెండిస్ (2)ను కీపర్ క్యాచ్‌గా ఔట్ చేయడంతో శ్రీలంక 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ దశలో లహిరు ఉడార (16), కెప్టెన్ ధనంజయ డిసిల్వా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే, మరోసారి బౌలింగ్‌కు వచ్చిన మానవ్ సుతార్ ఈ జోడీని విడదీసి తన రెండో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సోనాల్ దినుష (25 నాటౌట్)తో కలిసి ధనంజయ డిసిల్వా (31 నాటౌట్) పోరాడటంతో

హైదరాబాద్: తనపై ఆరోపణల కారణంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిపై టీపీసీసీ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కోరారు మేఘారెడ్డి. తాను టికెట్ అమ్ముకున్నానన్న వ్యాఖ్యలపై పీసీసీకి ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. దీనిపై మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారెడ్డి మాటల రికార్డింగ్స్ ఉన్నాయి. పార్టీ పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలిస్తోంది’ అని తెలిపారు. ఇక తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. ‘ మేము ప్రతి ఓటును కాపాడాలని చూస్తున్నాం. EC గైడ్ లైన్స్ తో చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయి. ASBD లపేరుతో 22% ఓట్లను తొలగించారు. ఓట్ తొలగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా బాద్యత వహించాలి. బీద ప్రజల ఓట్లు తొలగి పోతున్నాయి. కాంగ్రెస్ BLA లను 35వేలు మందిని ఇచ్చాం. కానీ EC 13వేల 100 మంది అని చూపిస్తున్నారు. 2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్ తో చాలా మంది ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేకపోయారు. ఎన్యుమరేషన్ పామ్ ఇవ్వలేదని డిలీట్ చేస్తున్నారు. అన్ మ్యాప్డ్ ఓట్లు 32 లక్షల 37వేలు. డౌట్ ఫుల్ గా ఉన్నాయి 60 లక్షల 50 వేలు ఓట్లు చూపిస్తున్నారు. 92లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయి. 1.60 కోట్ల ఓట్లకు ఎందుకు క్వచ్చన్ మార్క్ పెట్టారో చెప్పాలి. కాంగ్రెస్ ప్రతి పౌరుడి ఓటు కాపాడాలని ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఇంకా టైం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్

2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. హైదరాబాద్, ఆగస్టు18: 2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తాము ప్రతి ఓటు హక్కు కాపాడాలని చూస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌తో చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ఉదాసీనంగా చూడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఎఎస్బీడీల పేరుతో 22 శాతం ఓట్లు తొలగించారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని అన్నారు. పేద ప్రజల ఓట్లు తొలగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలను 35 వేల మందిని నియమించిందని తెలిపారు. కానీ ఈసీ మాత్రం13,100 మందిని ఇచ్చినట్లు చూపిస్తుందని చెప్పారు. సామాన్యుడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఈసీపై నిప్పులు చెరిగారు. 2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్‌తో చాలా మంది ఎనుమరేషన్ పామ్స్ ఇవ్వలేక పోయారని చెప్పుకొచ్చారు. దీంతో వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వివరించారు. అన్ మ్యాపుడ్ ఓట్లు 32,37000 ఉన్నాయని అన్నారు. అలాగే 60,50,000 ఓట్లు సందేహంగా ఉన్నాయని చూపిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో 92 లక్షల ఓట్లు ప్రశ్నార్ధకంగా మారాయని ఆవేదనతో అన్నారు. 1.60 కోట్ల ఓట్లు ఎందుకు క్వచ్చన్ మార్క్ పెట్టారో చెప్పాలంటూ ఈసీని తెలంగాణ పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. దేశంలో ఓటు హక్కును తొలగించే

వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయం మనిషి జాతకాన్ని మార్చేస్తుంది. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. విజయం మీ వైపు ఉంటే ఆటోమేటిక్‌గా డిమాండ్ మీ తలుపు తడుతుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయంలో నిజమవుతోంది.ధనుష్‌తో చేసిన 'సార్', దుల్కర్ సల్మాన్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' చిత్రాలతో వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన వెంకీ(Venky atluri), తాజాగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించారు. కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తోంది. వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే వెంకీ మాత్రం తన తరువాతి చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన అక్కినేని హీరోతో చేసే ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు... అక్కినేని నాగ చైతన్య. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నాగ చైతన్య కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ మైల్స్టోన్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నారట. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న వెంకీతో తన 25వ సినిమాను పట్టాలెక్కించేందుకు నాగ చైతన్య కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అసలు వీరిద్దరి కాంబినేషన్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నాగ చైతన్య, వెంకీ అట్లూరి మధ్య కేవలం ప్రొఫెషనల్ సంబంధమే కాకుండా మంచి స్నేహం, అనుబంధం ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకుడిగా మారినప్పటి నుంచి తాను

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం పెద్దూరులో మంగళవారం తెల్లవారుజామున మహాలక్ష్మి ఫర్నీచర్ తయారీ గోదాములో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నివాస గృహాలు దూరంగా ఉండటంతో చుట్టుపక్కలకు మంటలు వ్యాపించలేదు. ఆ సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోదాంలో సుమారు రూ.80 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో సమీపంలోని వారు పోలీసులకు, అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేందుకు గోదాం గోడలను యంత్రాలతో పగులగొట్టి మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, లంక బ్యాటర్లు డిక్వెల్లా, దినూషలు తమ జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్.. డిక్వెల్లాతో వాగ్వాదానికి దిగాడు. లంక ఇన్నింగ్స్ 54వ ఓవర్లో ఇది చోటచేసుకుంది. 54వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్ డిక్వెల్లా బ్యాట్‌ను టార్గెట్‌గా చేసుకొని అదే పనిగా బంతులను విసిరాడు. పదే పదే తనను రెచ్చగొట్టేలా బంతులు వేయడంతో సహనం కోల్పోయిన డిక్వెల్లా సిరాజ్‌తో మాటల యుద్ధానికి దిగాడు. 'బంతులను సరిగ్గా వెయ్యు' అని డిక్వెల్లా అనగా.. సిరాజ్ 'సరే ఈసారి ఇంకా ఇబ్బంది పెడుతానులే' అని ఘాటుగా ప్రతిస్పందించాడు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరిని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియాతో టెస్టు మ్యాచ్ ద్వారా మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నిరోషన్ డిక్వెల్లా మంచి ప్రదర్శనే చేశాడు. 115 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించిన అనంతరం ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. డిక్వెల్లా కెరీర్లో ఇది 23వ అర్ధశతకం. అయితే 55 టెస్టులాడినప్పటికీ డిక్వెల్లా ఖాతాలో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అతడి అత్యధిక టెస్టు స్కోరు 96గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం లభించింది. సోనాల్ దినూష (100) సెంచరీ చేయగా, డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా, జడేజా మూడు, కుల్దీప్, ప్రసిధ్, సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి

Indian Cricket: క్రికెట్ మ్యాచ్‌లో వికెట్ పడినప్పుడు ఆటగాళ్లు ప్రదర్శించే భావోద్వేగాలు కామనే. కొన్నిసార్లు ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్లు తీవ్ర వివాదాలకు దారితీస్తాయి. బ్యాటర్లను రెచ్చగొట్టేలా వేడుకలు చేసుకొని ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి, భారీ జరిమానాలు, మ్యాచ్ నిషేధాలు ఎదుర్కొన్న ఐదుగురు భారత క్రికెటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన అగ్రెసివ్ సెండ్‌ఆఫ్‌లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ తీసిన తర్వాత అతనికి ఇచ్చిన ఆగ్రహపూరిత సెండ్ఆఫ్ కారణంగా ఐసిసి ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. అంతకుముందు ఐపిఎల్‌లో మయాంక్ అగర్వాల్‌కు ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ ఇచ్చి ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ తన ప్రముఖ నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో తీవ్ర చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత ఈ రీతిలో ప్రవర్తించి 50 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోవడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే ఢిల్లీ ప్రిమియర్ లీగ్‌లో ప్రియాన్ష్ ఆర్యను అవుట్ చేసిన సమయంలో కూడా ఇదే సెలబ్రేషన్ పునరావృతం చేసి 30 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా చెల్లించాడు. జాతీయ జట్టు కీలక పేసర్ మహమ్మద్ సిరాజ్ మైదానంలో చూపించే తీవ్ర ఆవేశం వల్ల పలుమార్లు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను అవుట్ చేసిన అనంతరం అతని ముఖానికి అత్యంత సమీపంలోకి వెళ్లి ఆవేశంగా వేడుక చేసుకున్నందుకు గాను ఐసిసి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో సైతం ఒక డీమెరిట్ పాయింట్ పొందాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన కెరీర్లో వేడివేడి సెండ్ఆఫ్ల వల్ల పలుమార్లు ఐసిసి శిక్షలకు గురయ్యాడు. శ్రీలంక పర్యటనలో దినేష్ చండీమాల్, లాహిరు తిరిమాన్నేల

అనామలీస్ జాబితాలో 60.50 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో పూర్తి వివరాలివ్వనివారు 32.36 లక్షలు వీరంతా సరైన ఆధారాలు సమర్పించేందుకు సెప్టెంబరు 16 వరకు గడువు సర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం ఫారం సమర్పించని వారికి మరో అవకాశం అర్హులందరికీ ఓట్లు: సీఈవో సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో 92.86 లక్షల మంది ఓటర్ల వివరాలు సరిగా లేవని గుర్తించినట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. వారికి త్వరలో నోటీసులు జారీచేయనున్నటు చెప్పారు. సర్ ఓటరు ముసాయిదా జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ గత రికార్డులతో అనుసంధానం (మ్యాపింగ్) చేసే క్రమంలో ఓటరు పేరు, తల్లి, తండ్రి పేర్లలో తేడాలు, చిరునామా సరిగా లేకపోవడం వంటి కారణాలతో 60,50,918 మందిని అనామలీస్ క్యాటగిరీలో చేర్చారు. వీరితోపాటు ఎన్యూమరేషన్ ఫారాల్లో మూడు కాలమ్స్ నింపకపోవడం, సమగ్రంగా వివరాలు నమోదు చేయని 32,36,659 మందికి నోటీసులు జారీచేయనున్నారు. వీరు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో చేర్చుతారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. ఈ నెల పదోతేదీ వరకు పూర్తిచేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రకారం.. మొత్తం ఓటర్లలో ఫారాలు సమర్పించని 73.39 లక్షల మందిని ఏఎ్‌సడీడీ క్యాటగిరీలో చేర్చారు. వీరిలో శాశ్వతంగా చిరునామా మారినవారు 45,18,963 మంది, మరణించిన వారు 9,22,229 మంది, రెండుచోట్ల ఓటరుగా నమోదైనవారు 6,70,203 మంది ఉన్నారు. మిగిలిన 11,25,546 మంది నమోదిత చిరునామాలో లేకపోవడం, బీఎల్వోలు వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాలు పొందలేదు. వీరికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు సీఈవో తెలిపారు. వీరితోపాటు ఇతర క్యాటగిరీల్లోని 1,02,294 మందికి కూడా ఫారం 6ఏ ద్వారా

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana SIR Draft: తెలంగాణలో ఓట్ల సవరణ కార్యక్రమం (సర్) ముగిసింది. ఓటర్ల నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. ఎంత మంది తమ ఓటు హక్కును అప్డేట్ చేసుకున్నారనే అంశాలను ఎన్నికల సంఘం (ఈసీ) వివరించింది. సర్ ప్రక్రియలో కీలకమైన ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఈ ముసాయిదాలో ఎంత మంది ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు? ఎంత మంది ఓట్లు తొలగిపోతున్నాయనేది ఎన్నికల సంఘం సమగ్ర నివేదిక విడుదల చేసింది. 2,64,87,213 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించినట్లు ఈసీ ముసాయిదాలో తెలిపింది. అంటే 78.30 శాతం ఫారాలు సేకరణ జరిగింది. 9,22,229 మంది ఓటర్లు మృతిచెందిన వారిగా గుర్తించగా.. వారి ఓట్ల శాతం 2.73 గా ఉంది. 57,46,803 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, అందుబాటులో లేని లేదా ఇతర కేటగిరీల్లో ఉన్నట్లు గుర్తించగా వారి ఓట్ల శాతం 16.99 ఉంది. 6,70,203 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో నమోదైనట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. నిజమైన ఓటర్లు మళ్లీ ఓటర్ల జాబితాలో చేరేందుకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల ప్రక్రియలో ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం చేపట్టిన సర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్‌కు 25 జూన్ 2026 నుంచి 10 ఆగస్టు 2026 వరకు అవకాశం ఇచ్చారు. సర్ ఎన్యుమరేషన్ ఫలితాల్లో ఎలక్టర్ల నుంచి సేకరించిన ఫారాలు 2,64,87,213. అంటే 78.30 శాతం

శ్రావణ మాసం మొత్తం కూడా విష్ణువు, వరలక్ష్మి, శివుడికి అంకితం చేయబడిన నెల. అయితే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ నిత్యం విష్ణువు, శివుడు, లక్ష్మీదేవిని నియమ నిష్టలతో పూజిస్తుంటారు. ఇక ఈ మాసంలో ఏ చిన్న పూజ చేసినా అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అంతే కాకుండా పూజలు చేసి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని అంటారు పండితులు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే శ్రావణ సోమవారం శివాలయానికి వెళ్లి, అభిషేకం చేసి, బిల్వదళాలతో స్వామి వారిని పూజించి, ఓం నమ:శివాయా అని 108 ససార్లు జపించడం వలన మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో 16 రకాల పూజా ద్రవ్యాలతో పూజ చేయడం వలన ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవున్నారో వారు వాటి నుంచి త్వరగా బయపటడతారంట. అంతే కాకుండా శ్రావణ మాసంలో అన్నదానం చేయడం వలన కూడా అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. ఈ మాసంలో ఎవరు అయితే అన్నదానం చేస్తారో వారికి ఉన్న పితృదోషాలు తొలిగిపోయి, కోరిన కోర్కెలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నెరవేరుతాయంట. అలా చేసినప్పుడే సరైన ఫలితం లభిస్తుందని చెబుతున్నారు పండితులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితావిడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా స్పందించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో మీ పేరు వెతకడానికి ముందుగా మీ ప్రస్తుత పోలింగ్ బూత్, పార్ట్ నంబర్ తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో కొంతమంది ఓటర్ల పాత బూత్ నంబర్లు మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఎన్నికల సంఘం సెర్చ్ పోర్టల్‌లో ఎపిక్ నంబర్ లేదా అందుబాటులో ఉన్న వ్యక్తిగత వివరాలతో మీ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేరు ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ 1: ఎన్నికల సంఘం అధికారిక ఓటర్ పోర్టల్‌లోని ఎలక్టోరల్ రోల్ డౌన్లోడ్ విభాగాన్ని ఓపెన్ చేయాలి. స్టెప్ 2: అక్కడ 2026 సంవత్సరం ఎంచుకోవాలి. స్టెప్ 3: రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష వంటి వివరాలను ఎంపిక చేయాలి. స్టెప్ 4: కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. స్టెప్ 5: ఆ తర్వాత సంబంధిత పార్ట్ నంబర్, పార్ట్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 6: ‘Download Selected PDFs’పై క్లిక్ చేస్తే సంబంధిత ఓటర్ల జాబితా పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. స్టెప్ 7: PDFలో మీ పేరు, ఓటర్ వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి.ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేరు లేకపోతే ఏం చేయాలి?ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో అర్హత ఉన్నప్పటికీ మీ పేరు కనిపించకపోతే సంబంధిత బీఎల్ఓ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి కొత్త ఓటరు నమోదుకు

– సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు రుద్రంపూర్, ఆగస్టు 17 : దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్ ఐ ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) కార్యక్రమం డ్రాప్ పబ్లికేషన్ ప్రచురణ చూస్తే ఎలక్షన్ కమిషన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. నేడు ప్రకటించిన ఎస్ ఐ ఆర్ డ్రాప్ పబ్లికేషన్ చూస్తే అలాగే అనిపిస్తుందన్నారు. నెల రోజులు అధికారులు,బి ఎల్ ఓ, బిఎల్ఏలు ప్రతి ఇల్లు తిరిగి ఓటర్ వివరాలు, ఫోటోలు మార్చుకునే వారి ఫొటోలు సేకరించి, ఓటర్ లిస్ట్ లో ఉన్న తప్పులు, అడ్రస్ మార్పులు తదితర వివరాలు అప్లోడ్ చేసిన కూడా నేడు ప్రకటించిన లిస్టులో అవి లేకపోవడం ఆ వివరాలు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. యధాతధంగా కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగా షిఫ్టేడ్, డబుల్ ఓట్లు తొలగించి లిస్టును ప్రకటించారే తప్ప ఓటరు ఇచ్చిన వివరాలు, మార్పులు కానీ, కొత్త ఫొటో మార్పు కానీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన డ్రాప్లికేషన్లో అవి కనపడడం లేదన్నారు. మరలా ఫారం 8 తో ఓటర్ దరఖాస్తు చేసుకోవాలంటే కలర్ ఫొ టో దిగాలి, జిరాక్స్‌లు తీయాలి, ఇలా ఆర్థిక భారం, కాలయాపన జరుగుతుందని ఇది గమనించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఫైనల్ పబ్లికేషన్‌లో ఎస్ ఐ ఆర్ సర్వేలో ఓటర్ ఇచ్చిన సమాచారాన్ని వారు కొత్త ఫొటోలను అడ్రస్ మార్పు అప్లోడ్ చేసిన వివరాల ప్రకారం ఫైనల్ పబ్లికేషన్‌లో ప్రచురించాలని ఎలక్షన్ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు

తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం SIR ముసాయిదాను విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం SIR ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. SIR ప్రక్రియలో మొదటి భాగం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు తెలిపారు. 2.73 శాతం మంది చనిపోయినవారిగా గుర్తించినట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. మరోవైపు సుమారు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే 32 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించారు. ఈ నేపథ్యంలో సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత పత్రాలను సమర్పించి తమ వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. నోటీసులు అందుకున్న వారు వీలైనంత త్వరగా స్పందించాలని కోరారు. ఏ కారణంతో నోటీసు జారీ చేశామో స్పష్టంగా తెలియజేస్తామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నవారు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. సర్ జాబితా ముసాయిదా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు, సంబంధిత దరఖాస్తులను పరిశీలించనున్నట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. SIR ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా అధికారులు పాల్గొంటారని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంటర్నెట్ డెస్క్: గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా 3, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలొక వికెట్ పడగొట్టారు. శ్రీలంకపై భారత్ ఇంకా 178 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 460/9 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. నిషాన్ ఫెర్నాండో(0), లాహీరు ఉదారా(27), దినేశ్ చండిమాల్(4), కమిందు మెండిస్(14), ధనంజయ డిసెల్వా(21) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. పీకల్లోతు కష్టాల్లో పడిన లంకను సోనాల్ దినుశా, డిక్వెల్లా గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. ఆ తర్వాత కేశారా నువాంత(2), ప్రభాత్ జయసూర్య(10), లాహిరు కుమార(10) వరుసగా ఔటయ్యారు. గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే? శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?

Telangana Election Commission : తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 78.30 శాతం ఎన్యుమరేషన్ పత్రాలు అందించినట్లు తెలిపారు. 2.73శాతం మంది చనిపోయిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు సుమారు 60లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నారని.. అలాగే 32లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించండం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 92లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం నోటీసులు అందుకున్న వ్యక్తులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు గడువు ఉంటుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓట్లు అయినా లేకపోతే ఫారం -6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ముసాయిదా జాబితాకోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీలంక , భారత్ జట్ల మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంక, భారత్ (IND vs SL) జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌటైంది. చివరి వికెట్‌గా ప్రసిద్ధ్ కృష్ణ (2) పెవిలియన్‌కు చేరడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌కు ముగిసింది. టీమిండియా బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్(167) అద్భుత శతకంతో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్(82), ధ్రువ జురెల్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. రిషబ్ పంత్ 39, యశస్వి జైస్వాల్ 31 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో (0)ను సిరాజ్ ఔట్ చేశాడు. రెండో బంతికే స్లిప్‌లో ఉన్న పడిక్కల్‌కు నిషాన్ క్యాచ్ ఇచ్చాడు. అలానే 7.1 ఓవర్లో 27 పరుగుల వద్ద దినేష్ చండిమల్(4) ఔటయ్యాడు. మానవ సుతార్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత రెండు రోజులు వర్షం కారణంగా దాదాపు 60 ఓవర్ల వరకూ ఆట రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ ఓ పావుగంట ముందుగానే మ్యాచ్ మొదలైంది. తొలి ఓవర్లోనే వికెట్‌ను కోల్పోయిన శ్రీలంక ఆ షాక్ నుంచి కాస్త తేరుకుంది. బ్యాటర్లు ఉదారా (22*), మెండీస్ (11*) మరో వికెట్ పడనీయకుండా ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 47/2

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఎంతలా అంటే ఇప్పుడీ హీరోయిన్ సినిమా చేస్తే సూపర్ హిట్ అన్న విధంగా మారిపోయింది. ఆ హిట్ అవుతోన్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే ది మోస్ట్ లక్కీ ఛార్మ్ గా మారిపోయిందీ క్రేజీ హీరోయిన్. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన ఈ చిన్నది ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే డిగ్రీ పూర్తి చేయకుండానే హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టింది. 2017 నుంచే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల క్రితమే తెలుగుతెరకు పరిచయమైంది. కేవలం డబ్బింగ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోందీ అందాల తార. అలాగే తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడీ హీరోయిన్ పేరు మళ్లీ మార్మోగుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఆమె మరెవరో కాదు ప్రేమలు సినిమతో పలకరించి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన అల్లరితో ఆకట్టుకున్న మమితా బైజు. ప్రేమలు తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ తో రెబెల్ సినిమాలో చేసింది మమితా బైజు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా మమితా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్, ధనుష్ తో కలిసి కర అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలన్నీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా పైన క్లారిటీ ఇచ్చింది. 2025 నాటికి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాల ఆధారంగానే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితా కోసం ఎదురు చూడకుండానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.తాజా సర్ తుది జాబితాతో సంబంధం లేకుండా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇటీవల కేంద్రం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తుది ఓటర్ల జాబితాలు అక్టోబర్ 3వ తేదీన ప్రచురితమవుతాయి. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలు తయారు చేస్తే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.2025 నాటి జాబితాతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయంఈ క్రమంలోనే సమయం తక్కువగా ఉన్న కారణంగా 2025 నాటి జాబితాలతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అక్టోబర్‌లో ఎన్నికలను నిర్వహించాలని ఆలోచిస్తున్న క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా పురపాలక, నగర పంచాయతీలలో, నగరపాలక సంస్థ ఫోటో గుర్తింపు ఓటర్ల జాబితాలో ప్రచురణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి.రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ల పైన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు దగ్గర పడినట్లేనని అర్థం చేసుకోవచ్చు.జాబితాల ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇక స్థానిక సంస్థల ఎన్నికల కోసం మునిసిపాలిటీల్లో వచ్చే నెల 3వ తేదీలోగా, ఇప్పటివరకు

Sircilla: పోలీసులకు సేవా పతకాలు ప్రదానం – అభినందించిన విప్ సిరిసిల్ల: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో విశేష సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాలను అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ పతకాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో, కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బందికి వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. పోలీస్ శాఖలో విశేష సేవలు అందించి ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాలకు ఎంపికైన అధికారులను అభినందించారు. రాజేందర్, హెడ్ కానిస్టేబుల్, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఉత్తమ సేవా పతకం లభించింది. నాగేశ్వరరావు, కమ్యూనికేషన్ ఎస్ఐ, సేవా పతకానికి ఎంపికయ్యారు. భూక్య లత, హెడ్ కానిస్టేబుల్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్, సేవా పతకానికి ఎంపికయ్యారు. శ్రీనివాస్, బోయినపల్లి పోలీస్ స్టేషన్, సేవా పతకానికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి పతకాలు అందజేయడం ద్వారా వారి సేవలకు గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా పతకాలు అందుకున్న అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు
