
Jntu Spot Admissions 2026 Engineering Seats Fill Fast Spot Counselling Schedule For Remaining Colleges 1551233
ఎప్‌సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు.
ఎప్‌సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు.
హైదరాబాద్, సుల్తాన్పూర్, జగిత్యాల కాలేజీల్లో హాట్‌కేకుల్లా సీట్ల భర్తీ
నేడు మంథని, సిరిసిల్ల, పాలేరు కాలేజీల్లో..
రేపు వనపర్తి, కోస్గి, మహబూబాద్ కాలేజీల్లో..
హైదరాబాద్ సిటీ: ఎప్‌సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. బుధవారం ఉదయం వర్సిటీ అడ్మిషన్ల విభాగంలో జరిగిన కౌన్సెలింగ్‌కు సుమారు 200మంది అభ్యర్థులతోపాటు, వారి తల్లిదండ్రులు తోడు రావ డంతో క్యాంపస్‌లో సందడి వాతావరణం నెలకొంది.
హైదరాబాద్ జేఎన్టీయూ కాలేజీలోని వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో 26, సుల్తాన్‌పూర్‌లో 8, జగిత్యాలలో 2 సీట్లు ఖాళీగా ఉండగా జగిత్యాలలో ఒక సీటు మినహా మిగిలిన సీట్లన్నీ హాట్ కేకేల్లా భర్తీ అయ్యాయని అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. గురువారం మంథని, సిరిసిల్ల, పాలేరు కాలేజీల్లో, శుక్రవారం మహబూబాబాద్, వనపర్తి, కోస్గి జేఎన్టీయూ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్‌ను హైదరాబాద్ క్యాంపస్‌లోనే నిర్వహిస్తామని చెప్పారు.
స్పాట్ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల ఎప్‌సెట్ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరి, ఇంటర్మీడియట్ మార్కుల్లో మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత మొదట వచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అభ్యర్థులు అన్ని సర్టిఫిక్టెలతోపాటు ఫీజు డబ్బులు వెంట తెచ్చుకోవాలని సూచించారు.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News





