
Anil Ravipudi: సంక్రాంతి అంటే అనిల్ రావిపూడిదే.. ఈప్లానింగ్ చూసి నేర్చుకోవాల్సిందే!
Anil Ravipudi: సంక్రాంతి అంటే అనిల్ రావిపూడిదే.. ఈ ప్లానింగ్ చూసి నేర్చుకోవాల్సిందే!

Anil Ravipudi: సంక్రాంతి అంటే అనిల్ రావిపూడిదే.. ఈ ప్లానింగ్ చూసి నేర్చుకోవాల్సిందే!

సంక్రాంతికి వస్తున్నాం అని ఊరికే మాటలు చెప్పడం కాదు.. ఏకంగా 4 నెలల ముందే మేకర్స్ తమ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. చట్టం తన పని తను చేసుకుపోతున్నట్లు.. పండగ బరిలో ఉన్న హీరోలంతా పక్కా ప్లానింగ్‌తో అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు. ఎవరికి ఎవరూ తగ్గట్లేదు.. మీరొక అప్డేట్ ఇస్తే మేం రెండిస్తామంటున్నారు. మరి ఆ హంగామా మనం కూడా చూద్దామా..? పండగ సినిమాల ప్రమోషన్స్ అనగానే అనిల్ రావిపూడే గుర్తుకొస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో వస్తున్న సినిమాను జనవరి 12 విడుదల అనే టైటిల్ ప్రకటిస్తూనే ప్రమోషనల్ వీడియో విడుదల చేసారు అనిల్. ఇక శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో రాబోతున్న జార్జ్ క్రిష్ సినిమా ఓపెనింగ్ మొన్నే జరిగింది.. దీని షూట్ కూడా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరగబోతుంది. ఈ ప్రమోషనల్ హంగామాలో చిరు కూడా చేరిపోయారు. బాబీతో ఈయన చేస్తున్న మెగా 158 ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 22న టైటిల్ గ్లింప్స్ రానుంది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా అప్డేట్ మెగా అభిమానుల్లో పండగ ముందే వచ్చినంత జోష్ నింపుతోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. మెగా క్యాంపు నుంచే వస్తున్న సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మొన్నే జనవరి 12 అంటూ డేట్ ప్రకటించారు. ఒకేరోజు ఇటు వెంకటేష్, అటు సాయి ధరమ్ తేజ్ సినిమాలు బాక్సాఫీస్‌పై దండెత్తబోతున్నాయి. మొత్తానికి 4 నెలల ముందే మొదలైన ఈ ప్రమోషన్ల జాతర చూస్తుంటే.. ఈసారి సంక్రాంతి థియేటర్లలో మామూలు రచ్చ ఉండేలా లేదు. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. కొన్ని విటమిన్ లోపాలు ఉండొచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలి? వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్. ఈ ఫ్యామిలీ హ్యాండ్సమ్ హీరోకి మహిళా ప్రేక్షకుల నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. 2000ల ప్రారంభంలో శ్రీకాంత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. హీరోగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఆ తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్‌గా టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా దూసుకుపోతున్నాడు. ఈమధ్యకాలంలో సహాయ పాత్రలు, విలన్ రోల్స్ లో కూడా అలరించిన శ్రీకాంత్ తాజాగా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఈవెంట్స్ కు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. రీసెంట్ గా శ్రీకాంత్ జడ్జిగా ఉన్న షోలో సుడిగాలి సుధీర్ తో జరిగిన సంఘటన వైరల్ అవుతోంది. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మల్టీ టాలెంట్ స్టార్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). ప్రస్తుతం ఆయన జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో 'డ్రామా జూనియర్స్ సీజన్ 9'కి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో నటుడు హీరో శ్రీకాంత్, రోజా మరియు దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవల జీ తెలుగు విడుదల చేసిన ఒక వీడియో ప్రోమోలో శ్రీకాంత్ సుధీర్‌పై తీవ్రంగా విరుచుకుపడటం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో, శ్రీకాంత్ స్టేజీ పైకి రాగానే ఆయనను సుధీర్ ఆహ్వానిస్తూ.. "ఏంటన్నా అసలు.. మీరు ఎప్పుడూ చిన్న పిల్లల నవ్వుతో కనిపిస్తారు" అంటూ చనువుగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దాంతో ఒక్కసారిగా కోపానికి గురైన సీనియర్ నటుడు శ్రీకాంత్, సుధీర్ మాటలను అడ్డుకుంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "హేయ్ ఆపు! నీకు నేను హీరోలా కనిపించడం లేదా? తగ్గూ.. కొంచెం తగ్గూ.. అతి చేయకు. నీ పరిమితుల్లో (హద్దుల్లో) నువ్వు ఉండు" అంటూ హెచ్చరించారు. ఇన్నాళ్లూ మొహమాటంతో ఊరుకున్నానని, బయట తనకు ఉన్న గౌరవం తనకే ఉందని, ఇలాంటి ప్రవర్తన ఉంటే

సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెళ్లిపోయి కొత్తనీరు రావడం కామన్.. అచ్చం అలాగే సీనియర్ దర్శకుల ప్లేస్‌ను యంగ్ డైరెక్టర్లు భర్తీ చేస్తూ వాళ్ల మేకింగ్‌కు వారసులుగా మారుతున్నారు. సీనియర్లు మెల్లగా వేరే జోనర్స్‌కు షిఫ్ట్ అవుతుంటే.. ఆ గ్యాప్‌ను ఫిల్ చేస్తూ కుర్రాళ్లు తమదైన స్టైల్‌తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నారు. మరి టాలీవుడ్లో ఏ సీనియర్ డైరెక్టర్ ప్లేస్‌ను ఏ యంగ్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారో చూద్దామా..? ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్‌లు అనగానే త్రివిక్రమ్ గుర్తుకొస్తారు.. సింపుల్ కథలతో మ్యాజిక్ చేయాలంటే ఈయనే. ఈ ప్లేస్‌ను వెంకీ అట్లూరి భర్తీ చేస్తున్నారిప్పుడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్‌ని త్రివిక్రమ్ గానీ తీశారా అనేంతగా తీసారు వెంకీ. త్రివిక్రమ్ నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ప్యాన్ ఇండియాకు వెళ్తున్నారు.. దాంతో ఆ స్థానానికి సరైన వారసుడిగా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల కొంతకాలంగా ఫామ్‌లో లేరు. సరిగ్గా అదే టైమ్‌లో ఆ లోటు భర్తీ చేస్తూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ కామెడీ, యాక్షన్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో శ్రీను వైట్ల స్టైల్‌ను కంటిన్యూ చేస్తూ ఆయన సీటును అనిల్ పర్ఫెక్ట్గా సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు విలక్షణ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫాంటసీని జోడించారు నాగీ. తన అద్భుతమైన విజన్‌తో సరికొత్త సినిమాలు తీస్తూ సింగీతం గారికి వారసుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్! యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు! వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు

విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇంతవరకు #VenkyAnil5, #NKRAR2 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ‘అప్పుల అప్పారావు’లోని ఓ హాస్య సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోను మొదలుపెట్టారు. ఈవీవీ సత్యనారాయణ తనకు స్ఫూర్తి అని అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి కలిసి అనిల్ రావిపూడిని సినిమా టైటిల్ ఏంటని అడుగుతారు. అందుకు ఆయన ఎలాంటి తడబాటు లేకుండా ‘జనవరి 12 విడుదల’ అని చెబుతారు. దీంతో నటీనటులు కాసేపు అయోమయానికి గురవుతారు. తాము విడుదల తేదీ గురించి కాదు.. టైటిల్ గురించి అడిగామని చెబుతారు. చివరికి అదే సినిమా టైటిల్ అని అనిల్ వెల్లడించడంతో వీడియో ముగుస్తుంది.కొద్ది రోజుల క్రితం వెంకటేశ్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సినీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్‌ను తీసుకొచ్చారు. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్‌రెడ్డిగా వెంకటేశ్ కనిపించారు.భారత సైన్యంలో పనిచేసే ఈ అధికారి కౌంటర్ టెర్రరిజం, బందీలను రక్షించే కార్యకలాపాల్లో నిపుణుడిగా ఉంటారని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆర్మీ దుస్తుల్లో, సన్‌గ్లాసెస్‌తో, ఓ కారు

అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు. టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్ వెనుక

విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. "జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన శీర్షికను చిత్ర బృందం అధికారికంగా ఎంపిక చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ ద్వారానే ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ మరియు కామెడీ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు, ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తూ సందడి చేయనున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి చేసుకున్నట్లు సమాచారం అందింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫలితంగా, జనవరి 12న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద పోటీని ఇవ్వనుంది. వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలి. పండుగ రోజున కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి మరోసారి

సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ చూసిన పలువురు హీరోలు మళ్ళీ పొంగల్ బరిపైనే గురి పెట్టారు.. వారిలో టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, యంగ్ హీరోస్ ఉన్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఆ ముచ్చటేంటో చూద్దాం. టాలీవుడ్లో సంక్రాంతి (Pongal Movies) సీజన్‌కు ఉన్న క్రేజ్ మరో పండుగకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పొంగల్ తరువాత సమ్మర్, దసరా, క్రిస్మస్ సీజన్స్ కు సినిమాలు వచ్చి అలరించేవి. కానీ, ఇప్పుడు అనేకమంది తెలుగు స్టార్స్ సంక్రాంతి బరిపైనే గురి పెడుతున్నారు. అలా ఈ సారి పలువురు స్టార్స్ ముగ్గుల పండుగకు మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)- బాబీ కాంబోలో రెండో సినిమా ముందు నుంచీ పొంగల్ కే వస్తుందని వినిపిస్తోంది. ఈ మూవీకి 'కదిరి నరసింహుడు', 'కాకాజీ' అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి పలుమార్లు సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ సాధించారు. పాలిటిక్స్ వీడి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తరువాత చిరంజీవికి బంపర్ హిట్స్ చూపించిన "ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు" చిత్రాలు పొంగల్ కే ప్రేక్షకులను పలకరించడం గమనార్హం. అందువల్ల తన కొత్త సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే దిశగా చిరంజీవి అడుగులు వేస్తున్నారు. మరో స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) కూడా పలుమార్లు సంక్రాంతి బరిలో గ్రాండ్ సక్సెస్ చూశారు. వెంకీ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' 2025 బ్లాక్ బస్టర్ గా నిలచింది... అలాగే ఆయన కేమియో రోల్ పోషించిన సమన శంకరవరప్రసాద్ గారు' కూడా బంపర్ హిట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న సినిమాను కూడా పొంగల్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మేకర్. ఈ చిత్రానికి 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తూ వైరల్ అవుతోంది. దివంగత లెజెండరీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ వింటేజ్ కామెడీ స్పూర్తితో ఈ టైటిల్ గ్లింప్స్‌ను డిజైన్ చేశారు. హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సినిమా టైటిల్ ఏంటి?’ అని అడగ్గా, ఆయన ‘జనవరి 12 విడుదల’ అని పదే పదే బదులిస్తారు. రిలీజ్ డేట్ కాదు సినిమా టైటిల్ అడుగుతున్నాం కదా అని వెంకీ అడగగా, అసలు ఆ సినిమా పేరే ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అని రివీల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ‘బావ బావమర్ది సౌజన్యంతో’ అనే సరదా ట్యాగ్‌లైన్ కూడా జోడించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా పండగ వాతావరణంలో 12 జనవరి, 2027న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్, రిలీజ్ డేట్ రెండూ ఒకటే అయ్యేలా డిజైన్ చేసిన ఈ వినూత్న టైటిల్‌తో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ నిర్వహించే తీరు

2027 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల లెక్కలు అప్పుడే మొదలైపోయాయి.. 4 ముందే దర్శక నిర్మాతలు పండగ రేసులో కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. పాత సినిమాలకు తోడుగా కొత్త క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ ఫెస్టివల్ బరిలోనే దిగేందుకు ఆసక్తి చూపిస్తూ క్యూ కడుతున్నాయి. ఇంతకీ 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న ఆ భారీ సినిమాలేంటో చూద్దామా? చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న మెగా 158వ చిత్రం ఆన్ టైమ్‌లో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా.. దీని షూట్ కూడా వేగంగా జరుగుతుంది. పైగా చిరంజీవి రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు పండక్కే వచ్చి హిట్టవ్వడంతో.. ఆ సెంటిమెంట్‌ను గట్టిగా నమ్ముతున్నారు చిరు. అందుకే మెగా 158ను పండక్కే ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లో సంక్రాంతి అల్లుడు అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. తన సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో మల్టీస్టారర్‌ను సిద్ధం చేస్తున్నారు. పండక్కి మళ్లీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు.. ఇప్పటికే ఫస్టాఫ్ షూటింగ్ కూడా అయిపోయింది.. ఆన్ టైమ్ పండక్కి ల్యాండ్ కానున్నారు అనిల్. సంక్రాంతికి 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న శర్వానంద్.. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి జార్జ్ క్రిష్ అంటూ పండగ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకున్నారు. జనవరి 14న సినిమా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల.. 2010లో వచ్చిన నమో వెంకటేశ తర్వాత పండగ సీజన్లో రానున్నారు. ఇలా స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా.. ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి 'రామాయణం' యానిమేషన్ మూవీ చేయబోతున్నారు. రామాయణంలోని పాత్రలన్నింటి ఎమోషన్స్ ఆయనే పండించబోతున్నారట. భారతీయ పురాణాలలో గొప్పదైన రామాయణ కావ్యానికి ఉన్న ప్రత్యేక అంతా ఇంతా కాదు. వివిధ భాషల్లో లెక్క పెట్టలేనంత మంది వాల్మీకి రామాయణాన్ని తిరిగి స్పృశించారు. తమదైన భాష్యాన్ని తెలియచేస్తూ సమకాలీనులను ఆనంద పర్చారు. అలానే రామాయణ గాథను, అందులోని సన్నివేశాలను ఎంతోమంది రంగస్థలంపై ప్రదర్శించారు. ఇక ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది వందల చిత్రాలను రూపొందించారు. ఇప్పటికీ రామాయణం గాథ వెండితెరకెక్కుతూనే ఉంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం రామాయణాన్ని తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కృతం చేయాలని భావిస్తున్నారు. అయితే అది మామూలు సినిమా కాదు యానిమేషన్ మూవీ. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలన్నది ఆయన ప్లాన్. అయితే ఆ తర్వాత అనిల్ రావిపూడి ఈ రామాయణం గాథపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని తెలిసింది. ఇది మామూలు యానిమేషన్ మూవీ కాదని అనిల్ రావిపూడి సన్నిహితులు చెబుతున్నారు. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించేలా రామాయణ గాథను అనిల్ రావిపూడి తీర్చి దిద్దాలని అనుకుంటున్నారట. ప్రతీ సీన్ ను ఓపికగా డిజైన్ చేసుకోవడంతో పాటు ప్రతి పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ ను కాగితంపై రాసుకుని, వాటిని తానే అభినయించి, ఆ మూడ్‌ను యానిమేషన్ క్యారెక్టర్స్ కు అప్లయ్ చేయమని అనిల్ రావిపూడి చెప్పబోతున్నారట. రామాయణంలో ఒక్కో పాత్రదీ ఒక్కో శైలి, ఒక్కొక్కరిదీ ఒక్కో బాడీ లాంగ్వేజ్. అలానే ఒక్కొక్కరిదీ ఒక్కో లక్ష్యం. వీరందరికీ సంబంధించిన మూడ్స్ ను అనిల్ రావిపూడే పలికించబోతున్నారట. దానిని డిజిటలైజ్ చేసి

సూర్య ప్రకాష్ జోశ్యుల భోగి మంటలతో మొదలవుతుంది తెలుగు వారి సంక్రాంతి. చలికాలపు తెల్లవారుజామున ఇంటి ముందు మంటలు. ఆ తర్వాత పెద్ద పెద్ద ముగ్గులు. గొబ్బెమ్మలు. కొత్త బట్టలు. పిండివంటల వాసన. అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తలు, మామలు, బంధువులతో నిండిపోయే ఇళ్లు. పట్టణాల్లో ఉన్నవాళ్లు పల్లెలకు బయలుదేరుతారు. పల్లెల్లో ఉన్నవాళ్లు బంధువుల కోసం ఎదురుచూస్తారు.కోడి పందాలు.గుండాటలు. కొత్త అల్లుడు ఇంటికి రావడం నుంచి.. కనుమ రోజు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వరకు..పెద్ద ఉత్సవంలా సాగుతుంది. ఈ పండుగలో మరో పండుగ ఎప్పుడు చేరిందో మనకు తెలియకుండానే జరిగిపోయింది. అదే సినిమా పండగ. సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త సినిమా చూడాలి అన్న భావన తెలుగు కుటుంబ జీవనంలో దాదాపు ఒక భాగమైపోయింది. కాబట్టే సంక్రాంతి అంటే తెలుగు పరిశ్రమలో ఒక రిలీజ్ డేట్ గా చూడరు. అది ఒక బిజినెస్ మోడల్ గా గమనిస్తారు. సంవత్సరం ప్రారంభంలో వచ్చే ఆ కొన్ని రోజులు నిర్మాతలకు ఏడాది మొత్తం కలలో కనిపించే బాక్సాఫీస్ విండో. కుటుంబాలు కలిసి సినిమాలకు వెళ్లే సమయం. థియేటర్లకు అదనపు షోలు వేసే సమయం. స్టార్ హీరోలు తమ మార్కెట్‌ను పరీక్షించుకునే సమయం. చాలా కాలంగా సంక్రాంతి అంటే ఒకే రకమైన పోటీ కనిపించేది. కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు, ఆ తర్వాత కాలంలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ. వెంకటేష్ వర్సెస్ నాగార్జున. స్టార్ వర్సెస్ స్టార్.కానీ ఇప్పుడు ఆ పోటీ స్వభావమే మారుతున్నట్టుంది. 2025 నుంచి 2027 వరకు సంక్రాంతి సినిమాలను వరుసగా చూస్తే ఒక ఆసక్తికరమైన pattern కనిపిస్తుంది. సంక్రాంతి ఇక “ఎవరి స్టార్ పవర్ ఎక్కువ?” అన్నట్లు కాకుండా “ఎవరి సినిమా కుటుంబాన్ని థియేటర్‌కు తీసుకువచ్చి, అక్కడ రెండు మూడు గంటలు నవ్వించగలదు?” అనే ప్రశ్నగా మారింది. ఈ మార్పుకు ఒకే వ్యక్తిని కారణంగా చూపడం కొంచెం అతిశయోక్తి కావచ్చు. కానీ ఒక

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్ తర్వాత ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘NBK112’ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. అయితే, అనుకోకుండా ‘NBK111’ షూటింగ్ సమయంలో బాలయ్యకు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరో లేదా అగ్ర దర్శకుడి షెడ్యూల్ మారితే, దాని ఎఫెక్ట్ వరుసగా మిగతా ప్రాజెక్టులపై పడుతుంది. ప్రస్తుతం బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, బాలయ్య గాయం వల్ల ఈ సినిమా షూటింగ్ వచ్చే సమ్మర్‌కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, బాలయ్య తర్వాత చేయాల్సిన మరికొన్ని సినిమాల షెడ్యూల్స్ కూడా రీ-షెడ్యూల్ కాక తప్పడం లేదట. ఈ లైనప్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కొరటాల శివ సినిమా పూర్తయిన వెంటనే, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉందట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలియంది కాదు. అయితే, బాలయ్య-కొరటాల సినిమా ఆలస్యం కానుండటంతో అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ ప్లానింగ్‌ను మార్చుకోవాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2027 Pongal Race: 2027 సంక్రాంతికి లెక్కలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఆల్రెడీ ఆరు నెలలు ముందుగానే హీరోలు, దర్శక, నిర్మాతలు ఒకప్పడు బస్సుల్లో ఖర్చీఫ్‌లు వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్టు .. ఆయా హీరోలు దర్శక, నిర్మాతలు దస్తీలు వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు యాడ్ అవుతూనే ఉన్నాయి.. చిరంజీవి- బాబీ కలయికలో వస్తున్న చిత్రం మెగా 158 ఖచ్చితంగా ఆన్ టైమ్ సంక్రాంతికే రావడం పక్కా. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. పైగా చిరంజీవికి రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు పండక్కే వచ్చి హిట్ కొట్టాయి. దీంతో మరోసారి మెగాస్టార్ సంక్రాంతి సెంటిమెంట్‌నే నమ్ముకున్నాడు. ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ దాదాపు ఖరారు అయింది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల మూవీ.. అనిల్ రావిపూడికి సంక్రాంతి అల్లుడు అనే పేరు వచ్చేసింది. అది నిలబెట్టుకుంటూ 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్్ల మల్టీస్టారర్ సంక్రాంతికి రెడీ చేస్తున్నాడు. గత మూడు సంక్రాంతులకు వరుసగా తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇక సంక్రాంతి రేసులో మరో సినిమా శర్వానంద్, శ్రీను వైట్ల ‘జార్జ్ క్రిష్’ కూడా ఏడాది ముందే సంక్రాంతి బెర్త్ లాక్ చేసుకున్నారు. ఇక శర్వానంద్ కూడా ఈ యేడాది సంక్రాంతికి ‘నారీ నారీ

తెలుగు సినిమా పరిశ్రమకు సంక్రాంతి పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సినిమాల జాతర. 2027 సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఇప్పటికే పలు ఆసక్తికరమైన కాంబినేషన్లు, భారీ ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతుండటంతో అప్పుడే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి రేసులో అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన సినిమాలను ఓసారి చూస్తే.. వెంకటేష్ – కల్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి : సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలసి ఒక క్రేజీ మల్టీస్టారర్ గా కత్తిలాంటి ఐడియాతో వస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి నవ్వుల పంట పండించడం ఖాయంగా కనిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ : ‘హను-మాన్’ వంటి సంచలన విజయాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రవితేజ – శ్రీవిష్ణు – దిల్ రాజు : మాస్ మహారాజా రవితేజ కామెడీ అండ్ విలక్షణ నటనకు పేరుగాంచిన శ్రీవిష్ణు కాంబినేషన్లో ఒక హిలేరియస్ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్కు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్ – శ్రీను వైట్ల –జార్జ్ క్రిష్ :‘సంక్రాంతి హీరో’గా పేరున్న శర్వానంద్, ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ ‘జార్జ్ క్రిష్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14, 2027న విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కార్తి – కళ్యాణ్ శంకర్ –
విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోదానికి సరికొత్త హంగులు అద్ది, పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏమాత్రం విరామం లేకుండా నిరంతరాయంగా చిత్రీకరణ జరుపుతోంది.చిత్ర యూనిట్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారాలు, పండుగ సెలవులు అనే తేడా లేకుండా ఏకధాటిగా షూటింగ్ పనులను ముందుకు నడిపిస్తున్నారు. సంక్రాంతి నాటికి విడుదల చేయాలన్న పక్కా ప్రణాళికతో టీమ్ మొత్తం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వేగంతో పాటు అవుట్‌పుట్ విషయంలో కూడా రాజీపడకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు పూర్తి చేసుకున్న విజువల్స్ క్వాలిటీ అద్భుతంగా వచ్చిందని, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.* కావేరీ పాత్ర కోసం చాలా కష్టపడ్డా... ‘ఇరుముడి’లో సెంటిమెంట్‌తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది - ప్రియా భవానీకల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ఈ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్న పాత్ర కథకి ప్రధాన బలంగా నిలవనుంది. ఆర్మీలోని కౌంటర్-టెర్రరిజం, బందీల విముక్తి విభాగంలో పనిచేసే 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే మోస్ట్ పవర్ఫుల్ సైనిక అధికారి పాత్రలో ఆయన కనిపించనున్నారు. చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. మిలిటరీ గెటప్‌లో వెంకటేష్ చూపించిన గాంభీర్యం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్అనిల్ రావిపూడి అనగానే గుర్తొచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి ఈసారి భారీ యాక్షన్, ఆర్మీ నేపథ్యాన్ని జోడించి సినిమాను అత్యున్నత ప్రమాణాలతో మలుస్తున్నారు. ఇందులో వెంకటేష్‌కు

విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్‌ను ఎలాంటి బ్రేక్ లేకుండా శరవేగంగా పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ క్షణం తీరక లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఆదివారాలు, సెలవులు అనే తేడా లేకుండా టీమ్ షూటింగ్ చేస్తోందట. సంక్రాంతి విడుదలను టార్గెట్‌గా పెట్టుకుని వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తయిన సన్నివేశాల అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ప్రాజెక్ట్ విషయంలో నిర్మాణ సంస్థ, దర్శకుడు ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. భారీ స్కేల్‌తో పాటు అత్యున్నత నిర్మాణ విలువలను పాటిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. (VenkyANIL5 - #NKRAR2) అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్కు ఈసారి మరింత భారీ స్కేల్‌ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న ఆయన లుక్‌లో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఈ లుక్‌తో వెంకటేష్ ఓ రగ్గడ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది. పోస్టర్లో వెంకటేష్ పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడిగా కనిపించనున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ ఎంబ్లమ్ సినిమా మిలటరీ నేపథ్యాన్ని మరింత ఎఫెక్టివ్ గా వున్నాయి. మ్యూటెడ్ బ్లూ-గ్రీన్ స్కై, రాకీ టెర్రైన్, భారీ SUVతో పోస్టర్‌కు అడ్వెంచరస్, దేశభక్తి టచ్ వచ్చింది. ఎర్తీ క్యామోఫ్లేజ్ టోన్స్ కూడా ఈ రగ్గడ్ లుక్కు చక్కగా సరిపోయాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీ.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా

తెలుగు చిత్రసీమలో విక్టరీ వెంకటేష్ తన సినీ ప్రస్థానంలో 40 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 1986 ఆగస్టు 14న కలియుగ పాండవులు సినిమాతో కథానాయకుడిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన, సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత అదే తేదీన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆగస్టు 14న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపటి, సురేష్ ప్రొడక్షన్స్ బృందం సంయుక్తంగా ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించాయి. ఈ ప్రత్యేక సందర్భంగా వెంకటేష్‌ను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేస్తూ శక్తివంతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. వెంకటేష్ 1986లో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించి బ్రహ్మపుత్రుడు, స్వర్ణకమలం, ప్రేమ, బొబ్బిలి రాజా, చంటి, దృశ్యం, గురు, ఎఫ్2 వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలతో అలరించారు. కుటుంబ కథా చిత్రాల నుండి పవర్ ఫుల్ యాక్షన్ సినిమాల వరకు ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేసి విక్టరీ అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు అనేక నంది పురస్కారాలను అందుకొని నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన చిత్రం వెంకీఅనిల్5 మరియు ఎన్‌కేఆర్‌ఏఆర్2గా ప్రచారంలో ఉంది. విడుదల చేసిన పోస్టర్లో వెంకటేష్ కాంబాట్ కామోఫ్లాజ్ యూనిఫాం, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్‌తో చాలా కమాండింగ్‌గా కనిపించారు. కౌంటర్-టెర్రరిజం మరియు హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడైన ఆర్మీ అధికారిగా ఆయన పాత్ర ఉండబోతోందని చిత్ర బృందం స్పష్టం చేసింది. దీంతో ఈ ఆర్మీ ఆఫీసర్ అవతార్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా బ్యాక్‌డ్రాప్‌లో ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ సింబల్ మరియు లగ్జరీ కారు పక్కన ఆయన నిలబడి ఉన్న శైలి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తన ఎక్స్ ఖాతాలో వెంకటేష్‌తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా ఉందని రాసుకొచ్చారు

టాలీవుడ్లో సంక్రాంతి సీజన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించే పండగ కావడంతో పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను సంక్రాంతికే తీసుకురావాలని తహతహలాడుతుంటారు. అయితే ఈసారి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని సినిమాలు సైతం ముందే సంక్రాంతి స్లాట్‌పై కర్చీఫ్ వేసేస్తున్నాయి. ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి జార్జ్ క్రిష్ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించారు. సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. మరోవైపు రవితేజ – శ్రీవిష్ణు కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించనున్న ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనప్పటికీ సంక్రాంతి రేసులోనే నిలపాలని దిల్ రాజు పట్టుదలతో ఉన్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోలు కూడా పండగ బరిలో గట్టిగానే పోటీపడుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతోంది. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ కూడా ఇదే బరిలో ఉంది. దీనికి తోడు కోలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ పోటీని మరింత హీటెక్కిస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాతో పాటు, ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న కొత్త సినిమా కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. మొత్తానికి సినిమా షూటింగ్‌లు పూర్తి కాకుండానే విడుదల తేదీల ప్రకటనలతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పోరు అప్పుడే వేడెక్కింది
టాలీవుడ్ లో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో ‘హిట్ మెషీన్’ అనే పేరు తెచ్చుకున్నారు. ఒక్క సినిమా తీయడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకుంటున్న ఈరోజుల్లో.. అనిల్ ఏడాదికో సినిమా చేస్తున్నారు. ఎంత పెద్ద హీరో అయినా సరే, తక్కువ డేట్స్ లో సినిమాని కంప్లీట్ చేయడం ఆయన స్పెషాలిటీ. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే రావిపూడి.. ఒక్కసారి సినిమా పట్టాలెక్కిన తర్వాత షూటింగ్ పరుగులు పెట్టిస్తారు. ఇప్పుడు VenkyAnil5 చిత్రాన్ని కూడా అదే స్పీడుతో పూర్తి చేస్తున్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి #VenkyAnil5, #NKRAR2 వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్నారు. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే అప్పుడే సినిమా మొదటి భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయిందట. ఇప్పటికే ఫస్టాఫ్ ఎలా వచ్చిందో చూసుకున్నారట. ఇది సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట కాదు. సినిమాకి పాటలు రాస్తున్న లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ స్వయంగా చెప్పిన విషయం.అనంత శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘VenkyAnil5’ మూవీ విశేషాలను పంచుకున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గోదావరి జిల్లాల్లోని కుటుంబ నేపథ్యంలో వస్తే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సిటీలోని ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చింది. ‘వెంకీ - కళ్యాణ్ రామ్’ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది” అని అనంత శ్రీరామ్ చెప్పారు. 2027 సంక్రాంతికి బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నామని తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే ఫస్టాఫ్ చూసుకున్నామని వెల్లడించారు.‘Venky Anil5’ బావాబామదర్దుల కథ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వెంకటేష్

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ యోధుడిగా కనిపించనున్నారు. 2027 మార్చి తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తో్న్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ నెల 20 నుంచి ‘గుంటూరు కారం’ సెట్లో ఓ మాస్ పాట చిత్రీకరించనున్నారు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొననున్నారు. నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన కథ నచ్చడంతో భాగ్యశ్రీ ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ ఫెయిల్యూర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి స్వీకరించారు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని చెబుతూ త్వరలోనే అందరికీ నచ్చే మంచి చిత్రంతో తిరిగొస్తానని చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని.. ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందన్నారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూడండి. అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి ‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో అత్యంత అరుదైన మరియు భారీ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించి వేడి వేడి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున కలయికలో ఒక ప్రతిష్టాత్మక చిత్రం రూపొందనుందనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వ్యాపారాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారని సమాచారం. గత కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి మరియు నాగార్జున మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతున్నప్పటికీ పూర్తిస్థాయి మల్టీస్టారర్ చిత్రంలో వీరు కలిసి నటించలేదు. అనిల్ రావిపూడి ఇప్పటికే సీనియర్ హీరోలతో వరుస విజయవంతమైన చిత్రాలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు దిగ్గజ హీరోలను ఒకే తెరపై చూపించేందుకు ఆయన ఒక బలమైన కథను సిద్ధం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథకు ప్రాథమికంగా ఆమోదం లభించిందని ప్రస్తుతం స్క్రీన్ ప్లే పనులు శరవేగంగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో చిత్ర పరిశ్రమలోని ప్రధాన వర్గాలలో మరియు అభిమానులలో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సరిపోయే మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ మరియు నాగార్జున శైలికి తగిన క్లాస్ అంశాలను సమతుల్యంగా మేళవించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్ తెరపైకి వస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమని సినీ వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి రెండు వర్గాల అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి మార్క్ పూర్తిస్థాయి కామెడీ మరియు కుటుంబ భావోద్వేగాలతో కూడిన మాస్ ఎలివేషన్ సీన్లు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం చిరంజీవి మరియు నాగార్జున ఇద్దరూ తమ తమ ముందస్తు ప్రాజెక్ట్‌ల చిత్రీకరణలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తమ