
© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
2027 Pongal Race: 2027 సంక్రాంతికి లెక్కలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఆల్రెడీ ఆరు నెలలు ముందుగానే హీరోలు, దర్శక, నిర్మాతలు ఒకప్పడు బస్సుల్లో ఖర్చీఫ్‌లు వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్టు .. ఆయా హీరోలు దర్శక, నిర్మాతలు దస్తీలు వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు యాడ్ అవుతూనే ఉన్నాయి..
చిరంజీవి- బాబీ కలయికలో వస్తున్న చిత్రం మెగా 158 ఖచ్చితంగా ఆన్ టైమ్ సంక్రాంతికే రావడం పక్కా. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. పైగా చిరంజీవికి రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు పండక్కే వచ్చి హిట్ కొట్టాయి. దీంతో మరోసారి మెగాస్టార్ సంక్రాంతి సెంటిమెంట్‌నే నమ్ముకున్నాడు. ఈ సినిమాకు ‘కదిరి నరసింహుడు’ అనే టైటిల్ దాదాపు ఖరారు అయింది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.
అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల మూవీ.. అనిల్ రావిపూడికి సంక్రాంతి అల్లుడు అనే పేరు వచ్చేసింది. అది నిలబెట్టుకుంటూ 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్్ల మల్టీస్టారర్ సంక్రాంతికి రెడీ చేస్తున్నాడు. గత మూడు సంక్రాంతులకు వరుసగా తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇక సంక్రాంతి రేసులో మరో సినిమా శర్వానంద్, శ్రీను వైట్ల ‘జార్జ్ క్రిష్’ కూడా ఏడాది ముందే సంక్రాంతి బెర్త్ లాక్ చేసుకున్నారు. ఇక శర్వానంద్ కూడా ఈ యేడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ టెంపోను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో మళ్లీ సంక్రాంతిని నమ్ముకున్నాడు.
ఇప్పుడు కొత్తగా మరికొన్ని సినిమాలు కూడా యాడ్ అవుతున్నాయి.. ఆల్రెడీ పెద్ద హీరోలు, సినిమాలు ఉండగానే మరికొన్ని సందట్లో సడేమియాలాగా ఎవరైనా పక్కకు తప్పుకుంటే వద్దానమనే ప్లాన్‌లో ఉన్నారు.
ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’.. సంబరాల ఏటిగట్టు.. ప్రశాంత్ వర్మ హనుమాన్ 2024 సంక్రాంతికే వచ్చి సంచలనం రేపింది.. ఇప్పుడు 2027 సంక్రాంతికి PVCUలో భాగంగా ఉన్న మహాకాళి సినిమాను జనవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాను 2027, జనవరి 12న ప్లాన్ చేస్తున్నారు.
హసిత్ గోలీ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించబోయే రవితేజ, శ్రీ విష్ణు మల్టీస్టారర్ కూడా సంక్రాంతికే రానుంది. కార్తి, కళ్యాణ్ శంకర్ కాంబోలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా పొంగల్ 2027 బరిలోనే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. వీటికి తోడు డబ్బింగ్ సినిమాల్లో రజినీకాంత్ ‘ధర్మన్’ ఈ పోటీలో నిలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








