
© 2026 nimisham.in

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్ తర్వాత ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘NBK112’ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. అయితే, అనుకోకుండా ‘NBK111’ షూటింగ్ సమయంలో బాలయ్యకు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు.
సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరో లేదా అగ్ర దర్శకుడి షెడ్యూల్ మారితే, దాని ఎఫెక్ట్ వరుసగా మిగతా ప్రాజెక్టులపై పడుతుంది. ప్రస్తుతం బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, బాలయ్య గాయం వల్ల ఈ సినిమా షూటింగ్ వచ్చే సమ్మర్కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, బాలయ్య తర్వాత చేయాల్సిన మరికొన్ని సినిమాల షెడ్యూల్స్ కూడా రీ-షెడ్యూల్ కాక తప్పడం లేదట.
ఈ లైనప్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కొరటాల శివ సినిమా పూర్తయిన వెంటనే, బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉందట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలియంది కాదు. అయితే, బాలయ్య-కొరటాల సినిమా ఆలస్యం కానుండటంతో అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ ప్లానింగ్ను మార్చుకోవాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో మరో సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. వీరిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో చిరు - అనిల్ కాంబోపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్లతో ఓ మల్టీస్టారర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అది పూర్తికాగానే చిరంజీవితో సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు అనిల్ తదుపరి సినిమా కింగ్ నాగార్జున (King Nagarjuna)తో ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది. చిరు, నాగ్ ఇద్దరితో మల్టీస్టారర్ అనేలా కూడా టాక్ వినిపిస్తోంది. మరి ఏ విషయం అనిల్ రావిపూడి నుంచి ప్రకటన వస్తేగానీ, క్లారిటీ రాదు.
టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు వరుస కమిట్మెంట్స్తో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక్క ప్రాజెక్ట్ డేట్స్ మారినా, దాని వెనుక ఉన్న మొత్తం షెడ్యూల్ చైన్ మారిపోతోంది. ఒక హీరో గాయం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైతే, అది మరో హీరో, మరో దర్శకుడి కాంబినేషన్కు కొత్త మార్గం సుగమం చేస్తోంది. మరి బాలయ్య కోలుకుని సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్ల లెక్కలు ఎలా మారతాయో వేచి చూడాల్సిందే.
‘ది రెడ్ బ్యాగ్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే!
లక్ష మంది యువతులకు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అరుదైన ఘనత
‘అమీర్ లోగ్’.. భాష, యాసతో సంబంధం లేకుండా భావోద్వేగాలతోనే..
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








