
© 2026 nimisham.in

సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ చూసిన పలువురు హీరోలు మళ్ళీ పొంగల్ బరిపైనే గురి పెట్టారు.. వారిలో టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, యంగ్ హీరోస్ ఉన్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఆ ముచ్చటేంటో చూద్దాం.
టాలీవుడ్లో సంక్రాంతి (Pongal Movies) సీజన్‌కు ఉన్న క్రేజ్ మరో పండుగకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పొంగల్ తరువాత సమ్మర్, దసరా, క్రిస్మస్ సీజన్స్ కు సినిమాలు వచ్చి అలరించేవి. కానీ, ఇప్పుడు అనేకమంది తెలుగు స్టార్స్ సంక్రాంతి బరిపైనే గురి పెడుతున్నారు. అలా ఈ సారి పలువురు స్టార్స్ ముగ్గుల పండుగకు మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)- బాబీ కాంబోలో రెండో సినిమా ముందు నుంచీ పొంగల్ కే వస్తుందని వినిపిస్తోంది. ఈ మూవీకి 'కదిరి నరసింహుడు', 'కాకాజీ' అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి పలుమార్లు సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ సాధించారు. పాలిటిక్స్ వీడి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తరువాత చిరంజీవికి బంపర్ హిట్స్ చూపించిన "ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు" చిత్రాలు పొంగల్ కే ప్రేక్షకులను పలకరించడం గమనార్హం. అందువల్ల తన కొత్త సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే దిశగా చిరంజీవి అడుగులు వేస్తున్నారు.
మరో స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) కూడా పలుమార్లు సంక్రాంతి బరిలో గ్రాండ్ సక్సెస్ చూశారు. వెంకీ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' 2025 బ్లాక్ బస్టర్ గా నిలచింది... అలాగే ఆయన కేమియో రోల్ పోషించిన సమన శంకరవరప్రసాద్ గారు' కూడా బంపర్ హిట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న సినిమాను కూడా పొంగల్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మేకర్. ఈ చిత్రానికి 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బావా బామ్మర్ది సౌజన్యంతో (Bammardi Soujanyam Tho) అనేది దీని ట్యాగ్ లైన్. ఇలా టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను పేరులోని తేదీకే రిలీజ్ చేయబోవడం విశేషం.
రవితేజ సక్సెస్ రూటులో సాగుతున్న రోజుల్లో కొన్ని సంక్రాంతి హిట్స్ చూశారు. ఈ యేడాది రవితేజ (Ravi Teja) సంక్రాంతి సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంతగా అలరించలేదు. అయినా పొంగల్ బరిపైనే రవితేజ మనసు పారేసుకున్నారు. రవితేజ - శ్రీవిష్ణు కలసి నటిస్తోన్న సినిమాను సంక్రాంతి సంబరాల్లో దించే ప్రయత్నం సాగుతోంది. ఈ సినిమాకు "వీరాధివీరులంట", "మహిళామిత్ర మండలి తాలూకా" అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి. నాగార్జున నూరో సినిమా 'లాటరీ కింగ్', శర్వానంద్ 'జార్జ్ క్రిష్', సాయిదుర్గా తేజ్ 'సంబరాల ఏటిగట్టు' చిత్రాలు కూడా సంక్రాంతివైపే అడుగులు వేస్తున్నాయి. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న 'మహాకాళి' కూడా పొంగల్ కే రానుంది. సాయి దుర్గాతేజ్ తొలిసారి పొంగల్ బరిలో దూకుతున్నారు. మిగిలిన వారందరూ సంక్రాంతికి హిట్స్ చూసిన వారే. మరి ఈ సినిమాల్లో ఎన్ని సంక్రాంతి సంబరాల్లో సందడి చేస్తాయో చూడాలి.
Film Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








