
Prabhas | ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకుగ్లోబల్క్రేజ్ .. వైరల్‌గా చైనాడ్యాన్సర్ వీడియో!
Prabhas | ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్ .. వైరల్‌గా చైనా డ్యాన్సర్ వీడియో!
© 2026 nimisham.in

Prabhas | ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్ .. వైరల్‌గా చైనా డ్యాన్సర్ వీడియో!

‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. Romanchakam Movie Review 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ తమ భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై అన్నయ్య ప్రణవ్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'రోమాంచకం' (Romanchakam). ఈ మూవీతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'మేమ్ ఫేమస్'తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), '8 వసంతాలు' ఫేమ్ అనంతిక (Ananthika) ఇందులో జంటగా నటించారు. సినిమా ప్రకటన నుంచే మంచి హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆపై విడుదలైన పాటలతో యూత్‌కు కూడా చేరువయింది. అలాంటి ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ బుధవారం రాత్రి వేయగా గురువారం థియేటర్లకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా అన్నది రివ్యూలో చూద్దాం కథ విషయానికొస్తే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఇంజినీరింగ్ పూర్తి చేసి తన నలుగురి ఫ్రెండ్స్‌తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే ఎప్పటికైనా రోమాంచకం పేరుతో నేటి జెన్ జీ యూత్‌కు ఫ్లెక్సిబుల్‌గా ఉండే విధంగా డేటింగ్ యాప్ ని పెట్టాలని ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. అందు కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఓ డేటింగ్ యాప్‌లో చెన్నైకి చెందిన అమ్మాయి మైథిలి (అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఆపై క్లోజ్ అవుతాడు. మైథిలీ పుట్టినరోజున ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెన్నై వెళ్లిన అన్వేష్‌కు ఊహించని షాక్ తగులుతుంది. మైథిలి అతడిని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ ఫోన్ చేసి హైదరాబాద్ వస్తానని చెబుతుంది. హైదరాబాద్ వచ్చిన మైథిలీని అన్వేష్ తన ఫ్రెండ్ ఫ్లాట్ తనది అని చెప్పి అందులో ఉంచి ఫ్రెండ్‌ను కలవడానికి వెళతాడు. అయితే.. కాసేపటి తర్వాత అన్వేష్ తిరిగి వచ్చేటప్పటికీ

నటీనటులు : సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్, ఉపేంద్ర లిమాయే తదితరులు దర్శకత్వం : వేణుగోపాల్ రెడ్డి సమర్పణ : సందీప్ రెడ్డి వంగా సంగీతం : వాసుకి వైభవ్ ఛాయాగ్రహణం : పవన్ పప్పుల కూర్పు : వేణుగోపాల్ రెడ్డి ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఒక స్టార్టప్ నడుపుతుంటాడు. అతడు చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్)తో ప్రేమలో పడతాడు. అన్వేష్‌ను కలిసేందుకు మైథిలి హైదరాబాద్ వచ్చిన క్రమంలో అనూహ్య సమస్యలు మొదలవుతాయి. ఆమె రాకతో అన్వేష్, అతని స్నేహితుల బృందం ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అసలు మైథిలికి ఏమైంది? ఆ సమస్యల వలయం నుంచి అన్వేష్ అండ్ గ్యాంగ్ ఎలా బయటపడ్డారు? అన్నదే ఈ సినిమా కథ. ‘రోమాంచకం’ సినిమా పెద్దగా కథాబలంపై కాకుండా, సిట్యువేషనల్, సిల్లీ కామెడీపైనే ఎక్కువగా ఆధారపడి సాగుతుంది. చాలావరకు ‘జాతిరత్నాలు’ జోన్‌ను తలపించేలా సాగే ఈ చిత్రంలో వినోదానికి లోటు లేకుండా చూసుకున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫన్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ను బాగా నవ్విస్తాయి. క్లైమాక్స్ సీన్‌ను గందరగోళం (కన్ఫ్యూజన్) కామెడీతో డిజైన్ చేసిన విధానం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సుమంత్ ప్రభాస్ తన కేర్ఫ్రీ యువకుడి పాత్రలో ఎంతో ఈజ్‌తో నటించి మెప్పించాడు. ఫన్ సీన్లలో చలాకీగా కనిపిస్తూనే, హీరోయిన్ అనంతికతో మంచి కెమిస్ట్రీ పండించాడు. అనంతిక కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా కనిపించిన వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ పాత్రలు

Romanchakam Review : సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా తెరకెక్కిన సినిమా రోమాంచకం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. కథ విషయానికొస్తే.. అన్వేష్(సుమంత్ ప్రభాస్) రోమాంచకం అనే డేటింగ్ యాప్ స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఫ్రెండ్స్ తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. దాని కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఇంకో డేటింగ్ యాప్ లో చెన్నై అమ్మాయి మైథిలి(అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఇద్దరూ ఫోన్స్ లో మాట్లాడుకొని ఫ్రెండ్స్ అయి బాగా దగ్గరవుతారు. మైథిలి పుట్టిన రోజు నాడు మొదటిసారి కలవాలని సర్ప్రైజ్ అని చెప్పి చెన్నై వెళ్తాడు అన్వేష్. తను ఒక హోటల్ దగ్గర ఉన్నానని చెప్పి రమ్మంటాడు. కానీ మైథిలి బ్లాక్ చేస్తుంది. దాంతో మైథిలి జ్ఞాపకాలతో, ఫ్రెండ్స్ తో గొడవలతో బాధపడుతుంటే సడెన్ గా ఓ రోజు మైథిలి ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నాను నీతో ఓ రెండు రోజులు ఉంటాను అని చెప్తుంది. మైథిలిని అన్వేష్ తన ఫ్రెండ్ మామ ఫ్లాట్ కి తీసుకెళ్తాడు. కానీ అన్వేష్ బయటకు వెళ్లొచ్చేసరికి మైథిలి ఫ్లాట్ లో కనపడదు. దీంతో అన్వేష్ కంగారుపడతాడు. అసలు మైథిలి ఎందుకు హైదరాబాద్ వచ్చింది? మైథిలి ఏమైంది? మైథిలి కనపడకపోవడంతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు మైథిలి - అన్వేష్ ప్రేమించుకున్నారా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.. Also See : Sumanth Prabhas : ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్.. ఫొటోలు వైరల్.. సినిమా విశ్లేషణ.. సందీప్ రెడ్డి వంగ చిన్న సినిమా, అది కూడా లవ్ స్టోరీ నిర్మిస్తున్నాడు

'మేమ్ ఫేమస్' చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమంత్ ప్రభాస్, ఇప్పుడు 'రోమాంచకం' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రేపు (సెప్టెంబర్ 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.రోమాంచకం సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని సుమంత్ తెలిపాడు. తన పాత్ర కోసం దర్శకుడు వేణుగోపాల్ రెడ్డితో కలిసి దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేశానని వెల్లడించాడు. "ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే అమాయకమైన, క్యూట్ యువకుడి పాత్ర నాది. ఆ పాత్రలో సహజంగా కనిపించడానికి చాలా హోంవర్క్ చేశాం. కొన్ని సన్నివేశాల కోసం నెలల తరబడి ప్రాక్టీస్ చేశాక, నా నటనలో ఎంతో మెరుగుదల కనిపించింది" అని సుమంత్ వివరించాడు. ఓ అవార్డు ఫంక్షన్లో సందీప్ రెడ్డి వంగా తనను కలిసి ఓ 'క్యూట్ స్టోరీ' ఉందని చెప్పారని, ఆ తర్వాత దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రెండున్నర గంటల పాటు కథ వినిపించగా తాను ఎంతో ఆస్వాదించానని గుర్తుచేసుకున్నాడు. పైకి గంభీరంగా కనిపించినా సందీప్, ప్రణయ్ రెడ్డి చాలా మంచి వారని పేర్కొన్నాడు.ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల మద్దతు లభించడంపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు. పాన్

సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు గోపాల్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రేపు(సెప్టెంబర్ 3) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ ప్రభాస్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. → తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. → ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్తై కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. → రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న 'రోమాంచకం' చిత్రానికి ప్రీ రిలీజ్ దశలోనే అద్భుతమైన స్పందన లభిస్తోంది. నేటి నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, టికెట్ బుకింగ్స్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాకు విశేషమైన ఆదరణ కనిపిస్తోంది. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు.ప్రముఖ టికెటింగ్ పోర్టల్ బుక్‌మైషోలో 24 గంటల్లోనే 'రోమాంచకం' చిత్రానికి భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం విశేషం. ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉండటం, దీనిపై నెలకొన్న అంచనాలకు నిదర్శనంగా నిలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ తోడవ్వడంతో ఈ చిన్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది.వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. "ప్రేమ, హాస్యం, ఉత్కంఠ" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుండటంతో ఇది ఒక విభిన్నమైన ఎంటర్టైనర్గా ఉండబోతుందని తెలుస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రలు పోషించారు.సాధారణంగా పెద్ద సినిమాలకు కనిపించే బుకింగ్స్ ట్రెండ్, 'రోమాంచకం' చిత్రానికి కూడా కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సందీప్ వంగా సమర్పణ సినిమాకు అతిపెద్ద బలంగా మారిందని, ఈ పాజిటివ్ బజ్ ఓపెనింగ్స్‌కు ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి ప్రీమియర్లతో ఈ 'రోమాంచకం' ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి

ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఈ నెల 3న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. - మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. - తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. - ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది. - రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా ఈ నెల 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో సుమంత్ ప్రభాస్. – మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు. – తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది. – ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్ ఐ కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తూనే, చిన్న సినిమాలకు, యంగ్ టాలెంట్‌కు తనవంతు మద్దతు అందిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తూనే, చిన్న సినిమాలకు, యంగ్ టాలెంట్‌కు తనవంతు మద్దతు అందిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ మూవీ రోమాంచకం చిత్ర బృందానికి డార్లింగ్ ప్రభాస్ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా రోమాంచకం చిత్ర యూనిట్ ప్రభాస్‌ను ప్రత్యక్షంగా కలిసింది. ఈ సందర్భంగా మేకర్స్‌తో ఎంతో సరదాగా గడిపిన ప్రభాస్, సినిమా పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్‌ను చూసి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ స్పిరిట్ లో నటిస్తున్న ప్రభాస్, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. రోమాంచకం చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి, తమ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా కలెక్షన్లను కూడా దాటేయాలని ఆయన సరదాగా కామెంట్స్ చేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఊహించని రీతిలో వచ్చిన ఈ సపోర్ట్, బెస్ట్ విషెస్‌తో రోమాంచకం టీమ్ అమితానందం వ్యక్తం చేస్తోంది. యంగ్ క్రియేటర్లను ప్రోత్సహిస్తూ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను సమర్పిస్తుండటం, దానికి ప్రభాస్ ఆశీస్సులు కూడా తోడవ్వడంతో ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నిజంగా ఇలా ప్రభాస్ ని కలవడం ఫ్యాన్స్ గా తమకు రోమాంచకమే అని చిత్రబృందం చెప్పుకొస్తున్నారు. సెప్టెంబర్ 3 న ఈ సినిమా ప్రేక్షకుల

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ సినిమాలో జంటగా నటించారు. రేపు(సెప్టెంబర్ 3) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ, ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, ఇక్కడి యాసతో సాగే ఒక ఫ్రెష్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. కథలో హీరో అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన ఫ్రెండ్స్‌తో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక డేటింగ్ యాప్ స్టార్టప్‌ను ప్రారంభిస్తాడు. అయితే ఈ డేటింగ్ యాప్ బిజినెస్ ద్వారా చెన్నైకి చెందిన అమ్మాయి (అనంతిక)తో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ రొమాన్స్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తల్లిదండ్రులు మెచ్చేలా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు.ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో గ్రిప్పింగ్‌గా 2 గంటల 22 నిమిషాలు (142 నిమిషాలు) రన్టైమ్తో ఫిక్స్ చేశారు. సుమంత్ ప్రభాస్ - అనంతిక మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ మ్యూజిక్, అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాబోతున్నాయి. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారట. జెన్-జీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్‌ను కూడా మెప్పించేలా ఉన్న ఈ 'రోమాంచకం' థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి. 'వండర్ వుమెన్' గాల్ గాడోట్ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి!

కల్కి 2 (Kalki 2) సినిమా షూటింగ్ విషయంలో క్లారిటీ వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) స్వయంగా చెప్పాడు పది రోజులకు మించి ఇప్పటివరకు షూటింగ్ జరగలేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేను అన్నాడు. ఎందుకంటే ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తి చేసిన తర్వాత “కల్కి 2” షూటింగ్ మళ్ళీ మొదలు అవుతుంది ప్రభాస్ కి సంబంధించినంతవరకు. అంటే వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు ప్రభాస్. ఈ గ్యాప్ లో నాగ్ అశ్విన్ దీపిక పదుకోన్ స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకోవాలి. దీపిక మొదటి భాగంలో నటించింది. రెండో భాగంలో మాత్రం నటించడం లేదు. ఆమె అడిగిన అధిక పారితోషికం, డిమాండ్ల వల్ల ఆమెని కొనసాగించడం లేదు. రెండో భాగంలో దీపిక ఉండదు అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఆమె పోషించిన సుమతి పాత్రని సాయి పల్లవి (Sai Pallavi) పోషిస్తుంది అని అంటున్నారు. కానీ సాయి పల్లవి ఇంకా సైన్ చెయ్యలేదు. నిర్మాతలకు డేట్స్ విషయంలో క్లారిటీ రావడం లేదు. అందుకే ఆమెని ఇంకా అఫీషియల్ గా తీసుకోలేదు. ఫైనల్ గా దీపిక స్థానంలో సాయి పల్లవి ఉంటుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగుతుంది. ఈ గ్యాప్ లో ఆమె ధనుష్ హీరోగా రూపొందుతోన్న “ఓం” చిత్రం, రణబీర్ కపూర్ రాముడిగా, తాను సీతగా నటించిన ‘రామాయణం’ మొదటి భాగం చిత్రాన్ని విడుదల చేసుకొని వస్తుంది

రెబల్ స్టార్ ప్రభాస్‌ను రోమాంచకం సినిమా బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న సుమంత్ ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ప్రభాస్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా తన ఆశీర్వాదాలను అందించారు. యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ధరించిన షర్ట్‌పై ప్రభాస్ స్వయంగా తన చేతులతో ఒక సందేశాన్ని రాసి చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ప్రచారం వేగవంతం చేశారు. రొమాంటిక్, కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ సరసన అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రభాస్ తన షర్ట్‌పై "లైవ్ విత్ ప్రభాస్" అని రాయడంతో సుమంత్ ప్రభాస్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆల్ ది బెస్ట్, ఇరగదీసేయ్, ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావాలని ప్రభాస్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇదిలా ఉండగా, భవిష్యత్తులో రాబోయే స్పిరిట్ సినిమా రికార్డులను కూడా ఈ రోమాంచకం చిత్రం దాటేయాలంటూ ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానిస్తూ ఆశీర్వదించారు. ఈ ప్రత్యేక క్షణంలో ప్రభాస్ చూపించిన అభిమానానికి సుమంత్ ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫలితంగా ఈ కనువిందు చేసే సన్నివేశానికి సంబంధించిన వార్త ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ఇచ్చిన ప్రోత్సాహంతో చిత్ర యూనిట్ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇచ్చిన ఈ గ్రాండ్ సపోర్ట్ సినిమా ప్రచారానికి మరింత ప్లస్

హీరో సుమంత్ ప్రభాస్ చిన్నప్పట్నుంచి ప్రభాస్ ఫ్యాన్. తన పేరు వెనక కూడా ప్రభాస్ పెట్టుకున్నాడు. సుమంత్ ప్రభాస్ రోమాంచకం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫేవరేట్ హీరో ప్రభాస్ ని కలిసాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేవు. సందీప్ రెడ్డి వంగ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కడంతో సందీప్ సుమంత్ ని ప్రభాస్ దగ్గరకు తీసుకెళ్లాడు. ప్రభాస్ సుమంత్ ప్రభాస్ షర్ట్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ తన డై హార్డ్ ఫ్యాన్ సుమంత్ ప్రభాస్ ని కలిసిన ఫొటోలు వైరల్ గా మారాయి

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నుంచి వస్తున్న 'రోమాంచకం' విడుదలకి సర్వం సిద్ధమైంది. ‘మా నిర్మాణంలో వృథా ఖర్చులు ఉండవు. కథ ఏం డిమాండ్ చేస్తే అంత వరకే ఖర్చు పెడతాం. చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా మేం పాటిస్తున్న నియమం అదే’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) తెలిపారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించిన ‘రోమాంచకం’ (Romanchakam) ఈ గురువారం విడుదలకు సిద్దమైంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సమర్పకులు. సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanilkumar) జంటగా నటించారు. వేణుగోపాల్ రెడ్డి (T. Venugopal Reddy) దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి ప్రణయ్ మాట్లాడుతూ ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. తెలంగాణలో, చెన్నైలో 10 రోజులు చిత్రీకరించాం. సుమంత్ ప్రభాస్ క్యారక్టర్ నేపథ్యంగా కథ సాగుతుంది. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని లైఫ్‌లో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? ఫ్రెండ్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అనేవి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఎక్కడా బోర్ కొట్టదు. మా సంస్థ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లాగే ‘రోమాంచకం’ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే.. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కాస్త రాద్దాంతం జరిగినప్పటికీ తాజాగా.. సెన్సార్ యు/ఎ రాగా సినిమా నిడివిని 142 నిమిషాలు (2 గంటల 22 నిమిషాలు) గా లాక్ చేశారు. అమెరికాలో సెన్సార్ ఇండస్ట్రీ సారథ్యంలో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. సినిమా నిర్మించడానికి ముందే నిర్మాతలు సెన్సార్ రూల్స్ తెలుసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అర్థమైందని ప్రణవ్ తెలిపాడు. సందీప్ ఈ కథ విని ఓకే చేసిన తర్వాతే పట్టాలెక్కించాం. సందీప్ ‘స్పిరిట్’ పనులతో బిజీగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక చిన్న సినిమాకు తన మద్దతు తెలిపి ప్రమోషన్స్‌లో కొత్త జోష్ నింపారు. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న ‘రోమాంచకం’ చిత్ర బృందానికి ఆయన తన శుభాకాంక్షలు అందజేశారు. సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాలని, తన ‘స్పిరిట్’ చిత్రాన్ని కూడా దాటిపోవాలని సరదాగా వ్యాఖ్యానించారు.సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటిస్తున్న ‘రోమాంచకం’ సినిమా రేపు (సెప్టెంబర్ 3న) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హీరో సుమంత్ ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభాస్, సుమంత్ షర్ట్‌పై సంతకం చేసి.. "ఆల్ ది బెస్ట్.. ఇరగదీసేయ్. 'రోమాంచకం' బ్లాక్ బస్టర్ అయిపోవాలి. ‘స్పిరిట్’ని కూడా దాటెయ్యాలి" అంటూ చిత్ర బృందానికి విషెస్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది.ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్‌తో కలిసి సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా తన భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పుడు అదే బ్యానర్లో, సందీప్ వంగా సమర్పణలో ‘రోమాంచకం’ వస్తుండటంతో ప్రభాస్ తన వంతు సపోర్ట్ అందిస్తున్నారు. గతంలో ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రశంసించారు.వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ ‘రోమాంచకం’ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ వంటి స్టార్

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు సమర్పకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన సమర్పిస్తున్న తాజా చిత్రం 'రోమాంచకం'. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, సినిమా విడుదలకు ముందే హైదరాబాద్ సినీ ప్రియుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు.సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని పలు ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ఈ స్పెషల్ ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు. ఏఎంబీ సినిమాస్, ఏఏఏ సినిమాస్, ఆర్ట్ సినిమాస్, ప్రసాద్ మల్టీప్లెక్స్, పీవీఆర్ ఐనాక్స్ (ఫోరమ్, ఇనార్బిట్ మాల్స్), బ్రహ్మరాంబ, అల్లు సినిమాస్ వంటి థియేటర్లలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రలలో నటించారు. 'కమ్ ఇన్ యాజ్ ఏ గ్యాంగ్.. ఎగ్జిట్ విత్ ఏ బ్యాంగ్' అంటూ ప్రచార చిత్రాలలో ఇచ్చిన నినాదం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సందీప్ వంగా లాంటి స్టార్ డైరెక్టర్ ఒక చిత్రాన్ని సమర్పిస్తుండటంతో 'రోమాంచకం' కంటెంట్ ఎలా ఉండబోతోందనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన దృశ్య కావ్యం 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైథలాజికల్ సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు వేల కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కల్కి 2' రాబోతోంది. అయితే, ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ షూటింగ్ అప్డేట్పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు 'కల్కి 2' షూటింగ్ గురించి యాంకర్ సుమ నుండి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎంతో చమత్కారంగా, నిజాయితీగా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ తెలిపారు. మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతం తనకు కూడా ఒక 'బర్నింగ్ క్వశ్చన్' అని నవ్వుతూ చెప్పారు. "గ్రహాలన్నీ ఒక వరుసలోకి వచ్చి ఓ రౌండ్ కూడా తిరిగేశాయి.. మళ్లీ అవన్నీ సరైన స్థానానికి వచ్చినప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారని, ఆయన డేట్స్ ఖాళీ అయ్యి ఫ్రీ అయిన వెంటనే 'కల్కి 2' చిత్రీకరణను సుదీర్ఘమైన షెడ్యూల్‌తో లాంగ్ స్ట్రెచ్‌లో పూర్తి చేస్తామని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 3న విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని చిత్ర యూనిట్‌కు

'అర్జున్ రెడ్డి' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రోమాంచకం'. 'మేము ఫేమస్', 'గోదారి గట్టుపైన' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తుండగా, అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యువతను లక్ష్యంగా చేసుకున్న లవ్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.సెప్టెంబరు 3న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 'రౌడీ హీరో' విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో చిత్రంపై హైప్ భారీగా పెరిగింది. అంతేకాదు, చిత్రబృందం ప్రెస్ మీట్లు, కాలేజ్ ఫెస్ట్ లతో దూసుకెళుతోంది. విజయవాడలోనూ చిత్ర యూనిట్ సందడి చేసింది.ఇదిలా ఉండగా, 'రోమాంచకం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. చిత్ర నిడివిని 1 గంట 42 నిమిషాల 40 సెకన్లుగా ఖరారు చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే మహేష్ సినిమా సెట్లో ఎంత సరదాగా, జోవియల్‌గా ఉంటారో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. చాలా మంది సెలబ్రెటీలు ఆయన పనిచేసిన అనుభవాలను పలు సందర్భాల్లో పంచుకున్నారు. అలాగే గతంలో పోడ్కాస్ట్లో పాల్గొన్న ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను, మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని అరుదైన, ఆహ్లాదకరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆగడు చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ బాబు చేసిన అల్లరి, తమపై వేసిన జోకులు గురించి ఆయన మాట్లాడారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. ప్రభాస్ శ్రీను తన ఇంటర్వ్యూలో మహేష్ బాబును చూస్తే చాలా కామ్‌గా, కంపోజ్డ్గా ఉంటారని చాలా మంది అనుకుంటారని, కానీ మేకింగ్ వీడియోలలో మాత్రం ఆయన చుట్టూ ఉన్నవాళ్లందరూ పడి పడి నవ్వుకుంటారని తెలిపారు. "ఆయన చాలా జోవియల్‌గా ఉంటారు. బయటికి వచ్చినప్పుడు తక్కువ కనిపిస్తారు, కనిపించేదే తక్కువ, దాంట్లో కూడా చురకలు పడతా ఉంటాయి" అని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆగడు సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆయన వివరంగా వెల్లడించారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ బాంబేలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో షూటింగ్ జరుగుతోందని, ఆ వేడిమికి సెట్లో అందరూ అల్లాడిపోయారని శ్రీను పేర్కొన్నారు. బ్రహ్మానందం గారికి, ఇతర నటీనటులకు చెమటలు కారిపోయాయని, సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు సెట్లో దాదాపు 25-26 డినో లైట్లు పెట్టారని, ఆ వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా మారిందని వివరించారు. ప్యాకప్ ఎప్పుడు అవుతుందా అని ఆర్టిస్టులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, స్కూల్ సెలవులు ఇస్తే పిల్లలు ఎంత

యువ కథానాయకుడు సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటించిన రోమాంచకం చిత్రం హైదరాబాద్ స్పెషల్ ప్రీమియర్స్ సెప్టెంబర్ 2న ప్రదర్శితం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి ఒక్క రోజు ముందే ఈ ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ స్పెషల్ షోలకు సంబంధించి టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలయికతో వినోదాత్మకంగా ఉంటుంది. విదేశాల్లో యూఎస్, యూకేలలో కూడా సెప్టెంబర్ 2నే ప్రీమియర్ షోలు ప్రదర్శితం అవుతున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులు తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడాలని కోరారు. దీంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా థియేటర్ల దగ్గర ప్రీమియర్ షోలకు సంబంధించి బజ్ ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి వైవిధ్యమైన సంగీతాన్ని వాసుకి వైభవ్ సమకూర్చడం విశేషం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుండి యు సర్టిఫికేట్ పొందింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ కలిసి హాయిగా థియేటర్లలో చూడదగిన కుటుంబ వినోదాత్మక చిత్రంగా ఇది సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ చిత్రం పంపిణీ బాధ్యతలను తీసుకున్నారు. భారత్‌లో సాధారణ థియేట్రికల్ షోలు సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ యంగ్ టీమ్ ప్రయోగాన్ని ఆదరిస్తారని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. స్నేహితుల బృందంతో కలిసి థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడానికి రోమాంచకం సరైన చిత్రమని మేకర్స్ నొక్కి చెప్పారు. హైదరాబాద్ ప్రీమియర్స్ టికెట్ల విక్రయం వేగంగా సాగుతుండటంతో థియేటర్ల సంఖ్యను పెంచే దిశగా ఆలోచిస్తున్నారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని ఆయన తెలిపారు. ప్రభాస్ తన ఇతర సినిమా కమిట్మెంట్లు పూర్తి చేసుకుని ఫ్రీ అయిన వెంటనే తర్వాతి షెడ్యూల్స్‌ను వేగంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తతో కల్కి 2 సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రొడక్షన్ పురోగతిపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇంతకుముందు జూన్ నెలలో వచ్చిన నివేదికలతో పోలిస్తే ఈ ప్రకటన కొంత మార్పును సూచిస్తోంది. ఆ సమయంలో రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మొదలవుతుందని, రైటింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులు ఎక్కువగా పూర్తయ్యాయని నాగ్ అశ్విన్ వెల్లడించారు. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా సెప్టెంబర్ ప్లాన్ వాయిదా పడిందని ఆగస్టు నివేదికలు స్పష్టం చేశాయి. ఫౌజీ మరియు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ప్రభాస్‌ను బిజీగా ఉంచడంతో కల్కి 2 సెట్స్‌కు ఆయన రావడం ఆలస్యమైంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ భాగాలు ఇప్పటికే కొంతవరకు పూర్తయినట్లు సమాచారం అందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ భైరవ లేదా కర్ణ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. మరోవైపు సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొనే సెప్టెంబర్ 2025లో అధికారికంగా బయటకు రావడంతో ఆ ముఖ్యమైన పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ స్కేల్ చాలా పెద్దది కావడం వల్ల సినిమా నిర్మాణం మరింత సమయం తీసుకోనుంది. హెవీ VFX

'8 వసంతాలు' చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో నాకు లభించిన గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది మరియు నా మనస్సుకు బాగా దగ్గరైంది. ఆ సినిమా తర్వాత నా దగ్గరకు అనేక కథలు వచ్చినప్పటికీ, అవి నన్ను పూర్తి స్థాయిలో ఉత్సాహపరచలేకపోయాయి. అయితే 'రోమాంచకం' కథ విన్న వెంటనే నేను తీవ్రంగా ఎక్సైట్ అయ్యాను మరియు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని వెంటనే నిర్ణయించుకున్నాను. చాలా కాలంగా ఒక సరదా మరియు ఎనర్జిటిక్ బబ్లీ క్యారెక్టర్ చేయాలనేది నా కలగా ఉండేది, ఈ సినిమాతో ఆ నెరవేరుతోంది. నా సొంత స్వస్థలం కేరళలోని త్రిస్సూర్ కాగా, నా చిన్నతనం నుంచే భరతనాట్యం, మోహినియాట్టం, కూచిపూడి వంటి కళలతో పాటు కరాటేలో కూడా శిక్షణ తీసుకున్నాను. నా తల్లిదండ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, అప్పులు చేసి మరీ నా కళల శిక్షణకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. 2023లో ‘మ్యాడ్’, 2025లో ‘8 వసంతాలు’ సినిమాలతో తెలుగులో నాకు మంచి పేరు వచ్చింది. గతంలో నేను చేసిన ఇంటెన్స్ పాత్రలకు పూర్తి భిన్నంగా, ఈసారి 'రోమాంచకం'లో ఒక సరదా తమిళ అమ్మాయిగా ప్రేక్షకులను అలరించబోతున్నాను. ఈ సినిమాలో నా సహ నటుడు సుమంత్ ప్రభాస్ డేటింగ్ స్టార్టప్ నడుపుతున్న ఒక యువ ఎంట్రప్రెన్యూర్‌గా చాలా ఎనర్జిటిక్‌గా కనిపించనున్నారు. దీంతో ఆయన పాత్రకు పోటీగా ఉండేలా నా క్యారెక్టర్‌ను కూడా దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదిలా ఉండగా, షూటింగ్ సమయంలో సుమంత్ మరియు నా మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో నేచురల్‌గా, ఎలాంటి ల్యాగ్ లేకుండా రూపుదిద్దుకున్నాయి. కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడే నాకు కలిగిన ఆనందం ఖచ్చితంగా థియేటర్లలో ప్రేక్షకులకు కూడా అందుతుందని నమ్ముతున్నాను. మా సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'యూ' సర్టిఫికెట్ లభించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఫలితంగా, ఈ చిత్రాన్ని యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ పై దర్శకుడు కీలక అప్డేట్ ఇచ్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2’ (Kalki 2) ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై మొదటి భాగం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘కల్కి 2’కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందనే విషయం స్పష్టమైంది. ప్రభాస్ ప్రస్తుతం తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన తన మిగతా సినిమాల కమిట్మెంట్స్ను పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘కల్కి 2’ తదుపరి షెడ్యూళ్లను వేగంగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథ, పురాణ అంశాలు, అత్యున్నత స్థాయి విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు సంబంధించిన అంశాలను చూపించడంతో ‘కల్కి 2’పై ఆసక్తి మరింత పెరిగింది. మొదటి భాగంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా మెప్పించారు. కమల్ హాసన్ యాస్కిన్ పాత్రలో కనిపించి సినిమాకు మరింత బలాన్ని తీసుకొచ్చారు. ఈ ముగ్గురు నటులు సీక్వెల్లో కీలకంగా ఉండనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. శివన్నలో మరో యాంగిల్.. ఆసక్తికరంగా ‘కూర్మ అవతార్’ టీజర్

‘8 వసంతాలు’ తర్వాత తన దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వచ్చినప్పటికీ ఏవీ తనను ఎగ్జైట్ చేయలేదని, ‘రోమాంచకం’ (Romanchakam) కథ విన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందని హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ (Ananthika Sanilkumar) తెలిపారు. ఈ చిత్ర విశేషాలను ఇంటర్వ్యూలో తెలిపారు అనంతిక సనిల్ కుమార్. ‘8 వసంతాలు’ తర్వాత నా దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి. ఎన్నో కథలు విన్నాను. కానీ అవేవీ నన్ను ఎగ్జైట్ చేయలేదు. ఆ సమయంలో ‘రోమాంచకం’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. కథ విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి సినిమాలో కదా నటించాలని అనుకున్నాను అనే ఫీల్ కలిగింది. ఇందులో నేను బబ్లీగా, సరదాగా ఉండే అమ్మాయి పాత్రలో నటించాను. ఇలాంటి క్యారెక్టర్లో నటించాలనేది నా డ్రీమ్. యూత్ ఆడియెన్స్ బాగా రిలేట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమాలో నేను తమిళ అమ్మాయిగా కనిపిస్తాను. ఈ తరం యువత జీవితాల్లో జరిగే చాలా కాంటెంపరరీ అంశాలను సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ఇది ప్రేమకథే అయినప్పటికీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సుమంత్ ప్రభాస్ ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు వర్క్‌షాప్ చేశాడు. నేను మాత్రం ఆయనతో పోలిస్తే తక్కువ వర్క్‌షాప్స్ చేశాను. ఆయన పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌ను కూడా ఆయనతో పోటీ పడేలా డిజైన్ చేశారు. మా ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు చాలా లైవ్లీగా, నిజంగా ఒక జంట మధ్య జరుగుతున్నట్టుగా సహజంగా అనిపిస్తాయి. సీన్స్ ఎక్కడా ల్యాగ్ లేకుండా వేగంగా సాగుతూ ఎంటర్టైన్ చేస్తాయి. ‘8 వసంతాలు’తో పోలిస్తే ‘రోమాంచకం’ పూర్తిగా డిఫరెంట్ జానర్ మూవీ. ‘8 వసంతాలు’ లాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా చేయాలని అనుకున్నాను. అదే సమయంలో ప్రేమకథల్లో కూడా నటించాలని ఉండేది. ‘రోమాంచకం’ షూటింగ్ కూడా సినిమాలో ఉన్నంత సరదాగా జరిగింది

అందరూ ఫౌజీ, విశ్వంభర, టాక్సిక్ అంటూ బడా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే రెండు నెలల్లో చాలా క్యూట్ క్యూట్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాల్లో మిడ్ రేంజ్ హీరోలుంటే.. మరికొన్నింట్లో చిన్న హీరోలే ఉన్నారు. కానీ ఆ సినిమాలన్ని పెద్ద బ్యానర్స్ నుంచే రాబోతున్నాయి. మరి ఆ ప్రేమకథలపై ఓ లుక్కేద్దామా..? ఎపిక్: ది ఫస్ట్ సెమిస్టర్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే ఈ క్యూట్ లవ్ స్టోరీలో బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్పై మంచి ఆసక్తే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న రానుంది. అలాగే ఇదే బ్యానర్ నుంచి వస్తున్న మరో క్యూట్ ప్రేమకథ వీసా. గల్లా అశోక్, గౌరీ ప్రియా నటిస్తున్న ఈ సినిమాను ఉద్భవ్ తెరకెక్కిస్తున్నారు. వీసా అంటే వింటారా సరదాగా అని అర్థం.. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదల కానుంది వీసా. అలాగే ఇదే సీజన్లో రానున్న మరో క్యూట్ లవ్ స్టోరీ రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. కథ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నారు సందీప్ వంగా. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. అల్లరి నరేష్ కామెడీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4న విడుదల కానుంది. దాంతో పాటే మహేంద్రగిరి వారాహి, సిగ్మా, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇదే సీజన్లో వస్తున్నాయి. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా

సినిమా ఇండస్ట్రీలో రిస్క్‌తో కూడుకున్న స్టంట్ సీన్స్ లేదా భౌతికంగా కష్టమైన ఘట్టాల కోసం బాడీ డబుల్స్ (డూప్స్) వాడటం సాధారణమైన విషయమే. ఎక్కువగా బాడీ డబల్స్ ని బాలీవుడ్ లో వాడుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో రిస్క్‌తో కూడుకున్న స్టంట్ సీన్స్ లేదా భౌతికంగా కష్టమైన ఘట్టాల కోసం బాడీ డబుల్స్ (డూప్స్) వాడటం సాధారణమైన విషయమే. ఎక్కువగా బాడీ డబల్స్ ని బాలీవుడ్ లో వాడుతుంటారు. ఈమధ్యనే ఈ ట్రెండ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ప్రభాస్ (Prabhas) నటించిన కొన్ని సినిమాల్లో కూడా ఆయన బాడీ డబుల్స్‌పై ఎక్కువగా ఆధారపడ్డారంటూ పలు వార్తలు, రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ డూప్స్ కి పనిచెప్పలేదని సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ చిత్రంలో మాత్రం ప్రభాస్ ఎలాంటి డూప్‌ను వాడటం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కి బదులుగా ఒక్క షాట్లో కూడా బాడీ డబుల్ కనిపించరని ఆయన ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఒక ఇంటర్వ్యూలో ప్రణయ్ మాట్లాడుతూ.. సాధారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో బాడీ డబుల్స్‌ను ఉపయోగించరని, స్పిరిట్ లోని ప్రతి సన్నివేశాన్ని, రిస్కీ యాక్షన్ సీక్వెన్సులను ప్రభాస్ స్వయంగా చేస్తున్నట్లు ప్రణయ్ రెడ్డి తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రభాస్ చూపిస్తున్న అంకితభావాన్ని ఆయన కొనియాడడమే కాకుండా అవసరమైనప్పుడు ప్రభాస్ ఏకంగా రోజుకు 18 గంటల పాటు షూటింగ్లో పాల్గొంటూ కష్టపడుతున్నాడని వెల్లడించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయిందని, అనుకున్న ప్రణాళిక ప్రకారమే వచ్చే ఏడాది మార్చి 5 న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు

ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ వివాదం మరోసారి చర్చకు దారితీసింది. చిత్రం నుంచి తప్పుకున్న దీపికా పదుకొణెపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇటీవల పలు ఆరోపణలు చేశారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వని దీపికా, పాత్రికేయురాలు జాన్వి మంచందా పెట్టిన సామాజిక మాధ్యమ పోస్టును లైక్ చేశారు. మహిళా నటుల డిమాండ్లపై పరిశ్రమలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో దీపికా లైక్‌ను వంగా బ్రదర్స్ ఆరోపణలకు పరోక్ష కౌంటర్‌గా పలువురు భావిస్తున్నారు. అయితే దీనిని ఆమె అధికారిక స్పందనగా పరిగణించలేమన్న విషయం కూడా గమనించాలి. 2025లో దీపికా పదుకొణె స్పిరిట్ నుంచి తప్పుకోవడంతో పని గంటలు, పారితోషికంపై భిన్నమైన కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త తల్లిగా రోజుకు 8 గంటల పని షెడ్యూల్ కావాలని ఆమె కోరినట్లు అప్పట్లో నివేదికలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనంతరం పేరును ప్రస్తావించకుండా అసభ్య ప్రచార ఎత్తుగడలు, చెప్పని గోప్యతా ఒప్పందం అంటూ స్పందించారు. ఆ వ్యాఖ్యలు దీపికాను ఉద్దేశించినవేనని సినీ వర్గాల్లో విస్తృతంగా భావించారు. తరువాత ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఎంపిక చేయడంతో స్పిరిట్ వివాదం కొంతకాలం సద్దుమణిగింది. తాజాగా ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలతో పాత అంశాలు మరోసారి ముందుకొచ్చాయి. ప్రణయ్ రెడ్డి వంగా కథనం ప్రకారం పారితోషికం, చిత్రీకరణ సమయాలతోపాటు మరికొన్ని అంశాల్లో ఒప్పందం కుదరలేదు. ముఖ్యంగా సినిమా నికర లాభాల్లో దీపికా 10 శాతం వాటా కోరినట్లు ఆయన వెల్లడించారు. ఆమె ఏదైనా అడగవచ్చని, కానీ చిత్ర ఆర్థిక లెక్కలకు సరిపడితేనే ఇవ్వగలమని వివరించారు. దీంతో ఆ ప్రతిపాదన అనుకూలంగా లేదని భావించి ఇతర అవకాశాలను పరిశీలించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, సినిమా కథతోపాటు పాత్రకు సంబంధించిన అంతర్గత సమాచారం బయటకు వెళ్లిందని కూడా ఆరోపించారు. దీపికాతో ముందుకు వెళ్లకూడదనే నిర్ణయం దర్శకుడు సందీప్ రెడ్డి

ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ప్రభాస్ (Prabhas)పేరు.. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు గుర్తింపు పొందారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతో మరింత బలపడింది. దేశవ్యాప్తంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న ప్రభాస్‌కు ఇప్పుడు మరో కొత్త బిరుదు దక్కింది. అదే ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ (Indias Biggest superstar). సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ ప్రమోషనల్ కంటెంట్‌లో ఈ ట్యాగ్‌ను ఉపయోగించడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్లో ఈ బిరుదుపై చర్చ మొదలైంది. కొందరు అభిమానులు, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ ట్యాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డి వంగా, ‘స్పిరిట్’పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విమర్శలతో చిత్రబృందం వెనక్కి తగ్గలేదు. తదుపరి విడుదల చేసిన పోస్టర్లలోనూ ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ అనే ట్యాగ్‌ను కొనసాగించింది. దీంతో అసలు ఈ బిరుదును ప్రభాస్ ఎలా తీసుకున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయంపై ‘స్పిరిట్’ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడైన ప్రణయ్.. ‘రొమాంచకం’ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రభాస్ రియాక్షన్‌ను బయటపెట్టారు. “ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్” అనే ట్యాగ్ గురించి ప్రభాస్‌కు చెప్పినప్పుడు.. ‘మీ ఇష్టం డార్లింగ్’ అని ఆయన అన్నారు అని ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. ప్రభాస్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. తనకు ఇచ్చిన బిరుదుపై ప్రభాస్ ఎలాంటి హైప్ లేకుండా చాలా కూల్‌గా స్పందించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తనను తాను స్టార్‌గా చెప్పుకోవడం కంటే.. తన సినిమాలే తన స్థాయిని నిర్ణయిస్తాయన్నట్లుగా ప్రభాస్ రియాక్షన్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించి ఇండియా మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల జాబితాని విడుదల చేసింది. ఇందులో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ దుమ్ములేపారు. ఎన్టీఆర్ మళ్లీ లిస్ట్ లోకి రాగా, రామ్ చరణ్‌కి పెద్ద షాక్ ఇచ్చారు మహేష్ బాబు. అదే సమయంలో సూర్య తన సత్తాని చాటుకున్నారు. మరి ఇండియాలో టాప్ హీరో ఎవరనేది, టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారనేది చూస్తే. మొదటిస్థానం గురించి అందరు మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థానంలో ఒక్కరే ఉన్నారు. ఒక్కరే శాసిస్తున్నారు. ఆయనే ప్రభాస్. చాలా కాలంగా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1గా నిలిచారు. తనదైన ఇమేజ్, పాపులారిటీ, భారీ సినిమాలతో నిత్యం చర్చల్లో ఉంటారు ప్రభాస్. దీంతో నెంబర్ 1గా రాణిస్తున్నారు. మిగిలిన హీరోల స్థానాలు నిత్యం మారుతూనే ఉన్నాయి. కానీ తన స్థానంలో మార్పు లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రాల్లో నటిస్తున్నారు. రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం విజయ్ ఉన్నారు. ఆయన జూన్‌లో మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో స్థానంలోకి వచ్చారు. అదే సమయంలో నాల్గో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌కి పెద్ద షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు రెండు మూడు స్థానాల్లోకి రావడంతో షారూఖ్ నాల్గో స్థానంలోకి పడిపోయారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్నారు. ఐదో స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఆయన జూన్‌లో ఆరో స్థానంలో ఉన్నారు. కానీ జులైలో రామ్ చరణ్‌కి ఝలక్ ఇస్తూ 5వ స్థానంలోకి రావడం విశేషం. రామ్ చరణ్ గురించి గత నెలలో పెద్దికి సంబంధించిన చర్చ జరిగినా కూడా ఆయన పడిపోవడం గమనార్హం. అదే సమయంలో ఎలాంటి చర్చ లేకుండా మహేష్ బాబు ఒక్క స్థానం మెరుగుపడ్డారు. ఐదో

Fauji Movie Action Scenes Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. ఈ లీక్స్‌తో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఫౌజీలో ఉండబోయే రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫౌజీ సినిమాలో ఓ భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్‌ను దాదాపు 20 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుందని టాక్. సెట్‌కు సంబంధించిన విజువల్స్ కూడా లీక్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక రెండో యాక్షన్ బ్లాక్‌ను లార్డ్ నరసింహ స్వామి థీమ్ ఆధారంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండే ఈ డివోషనల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకోనున్నారని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ఫైట్‌లో ఏకంగా ముగ్గురు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కలిసి పనిచేసినట్లు టాక్. ఈ రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ఫౌజీ సినిమా సెకండ్ హాఫ్‌లో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. భారీ యాక్షన్, ఎమోషన్, విజువల్ ఎఫెక్ట్స్ కలయికలో ఈ సన్నివేశాలు అభిమానులకు థియేటర్లలో గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయని చిత్ర వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ప్రభాస్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో లీకై వైరల్‌గా మారింది. ఇందులో డార్లింగ్ రెడ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌తో ఫార్మల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘మిర్చి’ తర్వాత ప్రభాస్‌ను ఇలాంటి ఫార్మల్ లుక్‌లో చూడటం అరుదుగా ఉండటంతో.. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ‘ఫౌజీ’పై సోషల్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Prabhas Surgery News: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌కు సర్జరీ జరిగినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు ప్రధాన కారణంగా ప్రభాస్ ఓ వైద్యుడ్ని కలవడమే. హైదరాబాద్‌లోని ప్రముఖ అపోలో హాస్పిటల్స్‌లో మోకాలు, తుంటి, క్రీడా సంబంధిత గాయాల చికిత్సలో నిపుణులైన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.జె. రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు గ్లోబల్ స్టార్ ప్రభాస్ అభిమానులలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. డాక్టర్ రెడ్డి, నటుడు ప్రభాస్‌తో కలిసి దిగిన ఒక ఫోటోను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అయితే, ఆ ఫోటోతో పాటు ఆయన పెట్టిన సుదీర్ఘ సందేశంలో ప్రభాస్ ఆరోగ్య బాధ్యతను ప్రస్తావించడంతో పాటు ఆయన పడిన "వ్యక్తిగత త్యాగాల" గురించి రాయడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమైంది. డాక్టర్ రెడ్డి తన పోస్ట్‌లో ప్రభాస్ అద్భుతమైన నిరాడంబరత్వాన్ని కొనియాడారు. "ప్రభాస్ గురించి తెలుసుకోవడం, ఆయన ఆరోగ్య బాధ్యతను స్వీకరించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అపారమైన విజయం సాధించినప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా, ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా ఉంటారు. ఆయన సానుకూల దృక్పథం, అద్భుతమైన స్వభావం ఆయన్ని నిజంగా ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాయి" అని ప్రశంసించారు. దీనితో పాటు, ఒక విజయవంతమైన స్టార్ హీరో సాధించిన విజయాల వెనుక తరచుగా బయటి ప్రపంచానికి కనిపించని త్యాగాల గురించి కూడా డాక్టర్ ఒక సందేశాన్ని పంచుకున్నారు. "మీరు ఒక విజయవంతమైన వ్యక్తిని చూసినప్పుడు, కేవలం వారి బహిరంగ విజయాలను మాత్రమే
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రత్యేక పాత్రలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ఒక కీలక పాత్ర గురించి వస్తున్న వార్తలకు నిర్మాతల వైపు నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. గతంలో వచ్చిన టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ వినిపించడంతో, ఈ భారీ కాప్ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కథనంలో ఉన్న ఒక పవర్ ఫుల్ జైలర్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ను సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని ప్రణయ్ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా బలం చేకూరినట్లయింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో చేయనున్నారని సాగుతున్న ప్రచారానికి కూడా ప్రణయ్ ముగింపు పలికారు. 'స్పిరిట్' లో చిరంజీవి ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని తేల్చి చెప్పారు. కాస్టింగ్ పరంగా క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారిగా పూర్తిస్థాయి రోషకలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండడం మెగా మాస్ ఎలిమెంట్స్‌ని పెంచేస్తోంది. నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ ప్రతీ చిన్న వార్త నెట్టింట సంచలనమే సృష్టిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అసలు సందీప్, దీపికా మధ్య ఏం జరిగింది? ఆమెను ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సంచలన విషయాలు బయటపెట్టారు. 'స్పిరిట్' నుంచి దీపికా పదుకొనేను తీసేయడంపై ఇన్నాళ్లూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ, రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి షాకింగ్ నిజాలు వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ ఏదైనా ఒక సినిమా అనుకున్నారంటే.. పాత్రల విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్పిరిట్' కథ రాసుకుంటున్న సమయంలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆయన మొదట అనుకున్నది దీపికా పదుకొనేనే. సుమారు సంవత్సరంన్నర పాటు సందీప్, దీపికా ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్‌లో ట్రావెల్ చేశారు. ఆమె టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే అంత సమయం కేటాయించారు. అయితే, ఆ సమయానికి దీపికా నటించిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లుగా నిలిచాయి. దాంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ హిట్ల తర్వాత దీపికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. కేవలం భారీ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా.. సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం ప్రాఫిట్ షేర్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందట. దాంతో పాటు షూటింగ్ డేట్స్, రోజువారీ కాల్షీట్ టైమింగ్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానని కండీషన్స్ పెట్టింది. సరే, ఒక స్టార్ హీరోయిన్ అంత డిమాండ్ చేసినా బిజినెస్ పరంగా ఓకే అనుకోవచ్చు

ప్రభాస్ 'స్పిరిట్' మూవీ కాస్టింగ్‌పై బిగ్ అప్డేట్పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపుదిద్దుకుంటున్న స్పిరిట్ చిత్రంపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించి ఒక కీలకమైన ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. ఈ మూవీలో వర్సటైల్ నటుడు ప్రకాశ్ రాజ్ భాగం కావడం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. స్పిరిట్ టీజర్లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ వినిపించడంతో ఆయన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అందరూ భావించారు. జైలర్ పాత్ర కోసం ముందుగా ఆయన పేరునే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదని వార్తలు వచ్చాయి. నిర్మాత ప్రణయ్ వంగా అధికారిక క్లారిటీఈ వ్యవహారంపై స్పిరిట్ చిత్ర నిర్మాత ప్రణయ్ వంగా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్‌లో నటించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది. ఫలితంగా జైలర్ పాత్రలో వేరొక నటుడు కనిపించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. చిరంజీవి క్యామియో రోల్‌పై స్పష్టత ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలను కూడా నిర్మాత ప్రణయ్ వంగా ఖండించారు. ఈ నేపథ్యంలో సినిమాలో చిరంజీవి ఎలాంటి క్యామియో రోల్ చేయడం లేదని తేలిపోయింది. షూటింగ్ మరియు ఇతర నటీనటుల వివరాలు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల ఎంపికపై దృష్టి సారించింది. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీ నుంచి దీపికను తీసేయడానికి గల అసలు కారణం నిర్మాత రివీల్ చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందంటూ గతంలో ప్రచారం సాగడం, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణానికి ఈ రకమైన షరతులు సమంజసంగా అనిపించకపోవడంతోనే పరస్పర అంగీకారంతో ఆమె
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ తో కలిసి సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. ప్రభాస్ మూవీ నుంచి దీపిక తప్పుకుందనే వార్త జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పందించారు.‘స్పిరిట్’ నుంచి దీపిక పదుకునే తప్పుకుందా? తప్పించారా? అని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అదే సమయంలో ‘రోజుకు 8 పని గంటలు’ అంశం తెర మీదకు వచ్చింది. ఈ నియమ నిబంధనల కారణంగానే దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అందరూ అనుకున్నారు. అప్పుడే దీపికాను ఉద్దేశించి సందీప్ వంగా పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కేవలం పని గంటలు మాత్రమే కాదు, రెమ్యూనరేషన్ విషయంలోనూ దీపిక పెట్టిన కండిషన్ వల్లే ఆమెను తప్పించినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు.ప్రణయ్ వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకునే తప్పుకోవడం గురించి మాట్లాడారు. “వెబ్ సైట్లలో ఏమి రాశారో అదే రీజన్. ఒకటి రెమ్యునరేషన్, రెండు టైమింగ్. అవి కాకుండా వేరే రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆమెను తీసేయాలనేది సందీప్ తీసుకున్న నిర్ణయమే. ఆమెతో సందీప్ ఒక ఏడాదిన్నరపాటు టచ్ లో ఉన్నాడు. ఆమె పర్ఫార్మెన్స్ నచ్చి, సినిమాలో ఉంటే బెటర్ గా ఉంటుందని ఆలోచించాము. ప్రాజెక్టులోకి తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆ ఏడాదిన్నరలో చాలా మారాయి. ఆమెవి ఓ రెండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది”“నెట్ ఇన్ కమ్ నుంచి 10 శాతం కావాలని డిమాండ్ చేసింది. అంటే లాభాల్లో పది శాతం అడిగింది. అన్నీ హద్దులు దాటిపోయాయి

Spirit Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మేకర్స్ నుంచి కీలక స్పష్టత వచ్చింది. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మేకర్స్ ఖండించారు. ఈ సినిమా రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించిన ప్రకారమే 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు డార్లింగ్ తన కెరీర్లో చేయని విధంగా తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ఈ క్యారెక్టర్‌పై అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ప్రభాస్ లుక్, మేకోవర్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎమోషన్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో సినిమా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో భూషణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ డేట్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. 2027 మార్చి 5న ‘స్పిరిట్’ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి

ఇప్పుడు ఒక్క ఇండియన్ సినిమా మార్కెట్ లోనే కాకుండా ప్రపంచ సినిమా దగ్గరే భారతీయ సినిమాని సగర్వంగా ముందుకి తీసుకెళ్తున్న ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ ఇండస్ట్రీ వేసిన దారి లోనే అని చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్టార్ట్ చేసిన ట్రెండ్ తోనే ప్రపంచ వ్యాప్తంగా రీచ్ ని సొంతం చేసుకోవాలని అనేక సినిమాలు, మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ కొందరిలో టార్గెట్ అయ్యింది అనే మాట కూడా వాస్తవం. ముఖ్యంగా బాలీవుడ్ లో ఓ సెక్షన్ తెలుగు సినిమాలు, ఆడియెన్స్ మరియు దర్శకుల పట్ల సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ ఇంకొక సెక్షన్ మాత్రం తమ అక్కసు బయటపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆ లిస్ట్ లో ఇపుడు బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేరడం సోషల్ మీడియాలో టాలీవుడ్ యువత నడుమ చర్చగా మారింది. ఆ మధ్య అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ విషయంలో మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో ఎవరో నెటిజన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు అన్నీ ప్లాప్స్ అయ్యాయని ఓ లిస్ట్ పెడితే దానికి వ్యంగ్యంగా సపోర్ట్ చేస్తూ ‘ఊప్స్’ అంటూ సిద్ధార్థ్ ఆనంద్ రిప్లై ఇచ్చాడు. దీనితో ఇక మన తెలుగు యువత తగులుకున్నారు. వార్, పఠాన్ లాంటి సినిమాలు ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి హీరోతో కింగ్ సినిమా వంటివి చేస్తున్నప్పటికీ సిద్ధార్థ్ ఆనంద్ ఎందుకు ఇలాంటి ఆలోచనా ధోరణితో ఉండిపోయాడు అంటూ సోషల్ మీడియాలో తన రిప్లైకి మరింత పదునైన రిప్లైలు అందిస్తున్నారు. అయితే మన సినిమాలు ప్లాప్ అయ్యాయి అని చెప్పిన వ్యక్తి పోస్ట్ డిలీట్ చేసుకున్నాడు కానీ సిద్ధార్థ్ రిప్లై మాత్రం ఉండిపోయింది. అయితే ఇదేమి సిద్ధార్థ్ సైడ్ నుంచి ఇది మొదటిసారి కాదు. ఆ మధ్య ప్రభాస్ ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ స్పిరిట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఫౌజి, స్పిరిట్, కల్కి-2.. ఇలా ఆయన లైనప్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియాలో, అలాగే కొన్ని బాలీవుడ్ సైట్స్ లో ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అదేంటంటే.. 'ఆదిపురుష్' లాంటి డిజాస్టర్ తీసిన డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపధ్యంలో ఓం రౌత్ ఒక కథ చెప్పారని, ఆ లైన్ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరిగింది. నిజానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత ఓం రౌత్ ఏ రేంజ్లో ట్రోల్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ నుంచి నటీనటుల లుక్స్ వరకు ప్రతి విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి దర్శకుడికి ప్రభాస్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చే బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఓం రౌత్‌తో ప్రభాస్ కొత్త సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది. లెజండ్రీ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ రొమాంటిక్ మూవీ.. బాక్స్ బద్దలే

ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తెరకెక్కించబోతున్నారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చేసింది. ‘స్పిరిట్’ పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్ పార్క్’ (Animal Park) సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రణయ్ వంగా తెలిపారు. దీంతో ‘స్పిరిట్’ తర్వాత వంగా ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సందీప్ రెడ్డి వంగా తర్వాతి సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందని, మరికొందరు మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆ ప్రాజెక్టుల కంటే ముందుగా ‘యానిమల్ పార్క్’నే ఆయన టేకప్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా రణ్విజయ్ సింగ్ బల్బీర్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సినిమా ముగింపులో ‘యానిమల్ పార్క్’కు సంబంధించిన హింట్ ఇవ్వడంతో అప్పటి నుంచే సీక్వెల్‌పై భారీ ఆసక్తి ఏర్పడింది. ‘యానిమల్ పార్క్’లో రణ్‌బీర్ కపూర్ మరింత పవర్ఫుల్, డార్క్ అవతార్‌లో కనిపించనున్నాడనే అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం కంటే సీక్వెల్ మరింత వైలెంట్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’పై ఫోకస్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ సినిమా తర్వాత ‘యానిమల్ పార్క్’ను పట్టాలెక్కించనున్నట్లు వస్తున్న ఈ క్లారిటీతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం

పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో వరుస సినిమాలు చేస్తూ అత్యంత బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. పాన్-ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో వరుస సినిమాలు చేస్తూ అత్యంత బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో స్పిరిట్ (Spirit) ఒకటి. ఇండియన్ సినిమాలో తనదైన బోల్డ్ అండ్ రా మార్క్‌తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ కాంబినేషన్ పై టాలీవుడ్‌తో పాటు మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అద్భుతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను సందీప్ వంగా ఏ పవర్ఫుల్ పోలీస్ రోల్లో చూపించబోతున్నారా అని సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం విడుదలపై తాజాగా ఒక పుకారు వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం స్పిరిట్ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టాక్. ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన ఇతర చిత్రాల చిత్రీకరణల కారణంగా స్పిరిట్ ప్రధాన షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో స్పిరిట్ వర్క్ కొంత ఆలస్యమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి దాదాపు 60% షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇంకోపక్క అక్టోబర్ నెల నుంచి తదుపరి భారీ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సందీప్ రెడ్డి వంగా అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రసిద్ధ నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఒక కొత్త రిలీజ్ విండోను

ప్రభాస్ ‘ఫౌజీ’ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న వేళ తాజాగా అదిరిపోయే పోస్టర్ వచ్చింది.. కానీ ఎప్పట్లాగే ఈ పోస్టర్లోనూ హీరో మొహం దాచేసారు హను. కేవలం బాడీ లాంగ్వేజ్‌తో పోస్టర్ డిజైన్ చేసారు. అసలెందుకు హను ప్రతీసారి ప్రభాస్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు..? ఫేస్ దాచేసినా.. హింట్స్ మాత్రం చాలానే ఇచ్చారు హను.. మరి అవేంటో చూద్దామా..? ఫౌజీ పోస్టర్స్‌లో ఇప్పటి వరకు ప్రభాస్ మొహాన్ని క్లియర్‌గా చూపించలేదు హను రాఘవపూడి. ఈసారి కూడా మొహం దాచేసారు. మండుతున్న చార్మినార్ బ్యాక్ డ్రాప్లో, రక్తంతో తడిసిన బట్టలతో చేతిలో రెండు తుపాకులతో ప్రభాస్ నడిచొస్తున్న తీరు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. ఫేస్ కనిపించకపోయినా కేవలం ఆ ఆకారం చూస్తుంటేనే ప్రభాస్ ఎంత వైల్డ్‌గా కనిపించబోతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. కొత్త పోస్టర్లో చాలా హింట్సే ఇచ్చారు హను రాఘవపూడి. ఓవైపు గాంధీ అహింసా మార్గంలో వెళ్తుంటే.. దానికి వ్యతిరేక దిశలో హీరో ఆయుధాలు పట్టుకుని వెళ్లడం చూస్తుంటే స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ లాంటి పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. దానికి తోడు మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అనే ముద్ర కూడా ఉండటంతో ఈ కథ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే భారీ యాక్షన్ డ్రామా అని తేలిపోయింది. ఈ పోస్టర్ మీద ఏ బెటాలియన్ హూ ఫైట్స్ అలోన్ అని పెట్టిన క్యాప్షన్ చూస్తుంటే.. ఒంటరిగానే ఓ సైన్యంలా బ్రిటీష్ వాళ్ళను ఎదిరించే వీరుడి కథ అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న విడుదల కానుంది. ఇమాన్వి ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు.. మొత్తానికి ఈ సెటప్ అంతా చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయమని అర్థమైపోతుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ(Fauzi) సినిమాపై ఇప్పుడు షూటింగ్ వేగం పెరిగింది. పెండింగ్‌లో ఉన్న సీన్స్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్రబృందం రెస్ట్ లేకుండా పనిచేస్తోంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలకమైన షూటింగ్ జరుగుతుండగా, ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్‌కు భారీగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లోపే తనకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి తర్వాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంలో భాగంగా ఒకేసారి మూడు యూనిట్లు పనిచేస్తున్నాయి. ప్రభాస్‌కు సంబంధించిన ఎపిసోడ్స్‌ను హను రాఘవపూడి స్వయంగా తెరకెక్కిస్తుండగా, మిగిలిన భాగాలను ఇతర టీమ్స్‌కు విభజించి షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టైమ్ ను ఆదా చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా తగినంత టౌమ్ కేటాయించాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా సినిమాను రెడీ చేయడమే ప్రస్తుత మెయిన్ టార్గెట్ గా కనిపిస్తోంది. మరోవైపు ఫౌజీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడంతో షూటింగ్, రిలీజ్ విషయంలో డెడ్‌లైన్ మరింత కీలకంగా మారింది. డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ చేయడంతో పెండింగ్ షూట్‌ను వీలైనంత త్వరగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో హను రాఘవపూడి టీమ్‌పై ఇప్పుడు టైమ్ ప్రెజర్ పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి(Imanvi) హీరోయిన్గా నటిస్తున్నారు

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా ఆరంభం నుంచే ఆకాశాన్నంటే భారీ అంచనాలు ఉన్నాయి. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో ప్రభాస్‌ను సరికొత్తగా చూపించబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ లవర్స్ సైతం అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు అంచనాలను మరింతగా రెట్టింపు చేయగా జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి. ఇదిలాఉంటే.. ఇక ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరియన్ స్టార్ డాన్ లీ (Ma Dong-seok, Don Lee) పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు లేవని టాక్ వినిపిస్తోంది. అయితే.. ‘స్పిరిట్’ చిత్రంలో చిరంజీవి, కొరియన్ స్టార్ డాన్ లీ కీ రోల్స్ చేస్తున్నారని గతంలో అనేక వార్తలు ఫుంఖాను ఫుంఖాలుగా వచ్చిన విషయం అందరికీ విధితమే. అంతేగాక ఈ వార్తలను మేకర్స్ ఇప్పటి వరకు అటు దృవీకరించక పోగా ఇటు ఖండించనూ లేదు. దీంతో ఈ సినిమాపై హైప్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్లో వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించలేదని తెలుస్తోంది. దీంతో అసలు వీరిద్దరూ సినిమాలో ఉన్నారా? లేక తర్వాతి షెడ్యూల్లో అయిన వారి ఎంట్రీ ఉంటుందా? లేదా లేక ఇవన్నీ వ్యర్థ ప్రచారాలేనా అనే చర్చ

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడిగా ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం అశ్వత్థామ (Ashwatthama) ఆగిపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) కథానాయకుడిగా ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం అశ్వత్థామ (Ashwatthama) ఆగిపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఎంతో గ్రాండ్‌గా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశకు కూడా చేరుకోకుండానే రద్దవ్వడం షాహిద్ కపూర్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేయడానికి గల అసలు కారణాలను ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమాను పక్కన పెట్టడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ, అందులో ముఖ్యమైనది రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్ర ప్రభావమేనని ఆయన బహిరంగంగా అంగీకరించడం సంచలనంగా మారింది. నిర్మాత జాకీ భగ్నానీ మాట్లాడుతూ..' ప్రేక్షకులు ఒక సినిమాపై ఎంత డబ్బు ఖర్చు చేశారనే దాని ఆధారంగా విజయాన్ని నిర్ణయించరు. వారు ఎప్పుడూ కొత్తదనం, వినూత్నమైన కంటెంట్‌ను మాత్రమే కోరుకుంటారు. కల్కి 2898 AD చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ప్రేక్షకుల్లో అత్యంత తీవ్రమైన ముద్ర వేసింది. అటువంటి పాపులర్ రోల్‌ను మళ్లీ షాహిద్ కపూర్‌తో చూపించడం ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలమనే సందేహం కలిగింది. తొందరపడి సెట్స్ పైకి వెళ్లడం కంటే ప్రాజెక్ట్‌ను నిలిపివేయడమే శ్రేయస్కరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు' ఆయన తెలిపాడు. ఒకవైపు షాహిద్ కపూర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారగా, మరోవైపు ప్రభాస్ అభిమానులకు మాత్రం పండగ వాతావరణం నెలకొంది. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న కల్కి 2 చిత్రీకరణ ఇప్పటికే వేగంగా సాగుతోంది. త్వరలోనే ప్రభాస్ కూడా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్లో

ప్రభాస్–హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ వర్గాలు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రభాస్(Prabhas)–హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauzi) పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ వర్గాలు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై వస్తున్న వార్తలు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. 'ఫౌజీ’ సెట్స్‌లో ప్రభాస్, హను రాఘవపూడి మధ్య బాండింగ్ చాలా బలంగా మారిందని మేకర్స్ చెబుతున్నారు. హను చెప్పే సూచనలను ప్రభాస్ ఎంతో నమ్మకంతో ఫాలో అవుతున్నారని, స్టార్ హీరో అనే ఇమేజ్ను పక్కనపెట్టి.. దర్శకుడి విజన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారని ఇన్ సైడ్ టాక్. హను చెప్పిన విధంగా సన్నివేశాలను చేయడంతో పాటు, ఆయన తెరకెక్కిస్తున్న విధానాన్ని ప్రభాస్ ప్రత్యేకంగా అభినందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా హను తీస్తున్న కొన్ని సన్నివేశాలను చూసి ప్రభాస్ ఎంతో ఇంప్రెస్ అవుతున్నారట. తన చుట్టూ ఉన్నవారితో కూడా ‘‘హను ఈ సీన్‌ను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు’’ అంటూ సినిమా గురించి గర్వంగా చెబుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై ప్రభాస్‌కు ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయినప్పటికీ ఆయా సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది కూడా ‘ఫౌజీ’ గురించి ప్రస్తావిస్తూ ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఒక సినిమా సెట్స్‌పై హీరో ఇంతగా ఇన్వాల్వ్ అవ్వడం.. ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకానికి సంకేతంగా భావిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. ‘ఫౌజీ’ పూర్తయిన తర్వాత కూడా హను రాఘవపూడితో కలిసి మరో సినిమా చేయాలని ప్రభాస్ ఆసక్తిగా ఉన్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో ప్రభాస్–హను కాంబినేషన్లో మరో

టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ రూటే వేరు. టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో, బాక్సాఫీస్ లెక్కలు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేం. కానీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ సక్సెస్‌ను బ్యాలెన్స్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూటే వేరు. ‘శ్రీమంతుడు’తో జర్నీ స్టార్ట్ చేసిన ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్.. ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘ఉప్పెన’, పాన్ ఇండియా రేంజ్లో ‘పుష్ప’ ప్రాంచైజీలతో పాటు దాదాపు 25కు పైగా చిత్రాలతో ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సత్తా చాటుతున్న మైత్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఒక భారీ ప్లాన్‌తో సరికొత్త లైనప్‌ను సిద్ధం చేసింది. సాధారణంగా ఒకే సంస్థ ప్రెజెంట్ ట్రెండ్‌ను బేస్ చేసుకుని సినిమాలు ప్లాన్ చేయడం చూస్తుంటాం. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రాబోయే ప్రాజెక్టుల కోసం వేర్వేరు చారిత్రక కాలాలను ఎంచుకుంటోంది. కాలాన్ని రీక్రియేట్ చేస్తూ వెండితెరపై వింటేజ్ అనుభూతిని పంచే పీరియడ్ జోనర్పై పూర్తి దృష్టి పెట్టింది. ఒకే సమయంలో, వేర్వేరు టైమ్లైన్లలో నడిచే భారీ ప్రాజెక్టులను ఒకే బ్యానర్లో హ్యాండిల్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబోలో రానున్న ‘రణబాలి’ (Ranabaali). ఈ కథ 19వ శతాబ్దపు రాయలసీమ నేలల్లోకి తీసుకెళ్లనుంది. ఆ నాటి జీవన విధానం, స్థానిక పోరాటాలు, ఆచారాలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించేందుకు డైరెక్టర్ ఏకంగా రెండున్నరేళ్లు లోతైన పరిశోధన చేశారు. నాటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఒక పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఇక పాన్

ప్రభాస్ (Prabhas) ఎప్పుడూ మూడు సినిమాలు సెట్ పై ఉండేలా చూసుకుంటున్నాడా లేక అలా అనుకోకుండా జరుగుతున్నాయో తెలియడం లేదు. సాహో (Saaho)తర్వాత ప్రభాస్ అనేక సినిమాలు ఒప్పుకున్నాడు. కానీ అవన్నీ ఆలస్యం అయి… విడుదలకు చాలా టైం తీసుకున్నాయి. దాంతో ఎప్పుడూ మూడు సినిమాలు సెట్స్ పై ఉంటూ వస్తున్నాయి. సాహో విడుదల కాగానే ఆదిపురుష్, రాధే శ్యామ్, సలార్ మొదటి భాగం సెట్స్ పైకి వచ్చాయి. రాధే శ్యామ్ విడుదల అయిన తర్వాత ఆదిపురుష్, సలార్ సెట్స్ పై ఉంటూ కల్కి 2898 AD వచ్చి చేరింది. ఆదిపురుష్ విడుదల తర్వాత సలార్, కల్కి సెట్స్ పై ఉంటూ ది రాజాసాబ్ చేరింది. ఆ తర్వాత సలార్ విడుదలైంది, ఆపై కల్కి, ది రాజాసాబ్ విడుదల అయ్యాయి. ఇప్పుడు ‘ఫౌజీ’ విడుదలకు సిధ్దం అవుతోంది. ఈ డిసెంబర్ 3న రానుంది. “ఫౌజీ” సెట్స్ పై ఉండగానే ‘స్పిరిట్’ సినిమా జరుగుతోంది. త్వరలోనే ‘కల్కి 2’ సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటాడు. ఈ డిసెంబర్ లో ‘ఫౌజీ’ విడుదల తర్వాత అటు స్పిరిట్ షూటింగ్ కొనసాగుతుంది, అలాగే ‘కల్కి 2’ కూడా సెట్స్ పై ఉంటుంది. ఇక తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ సినిమాని వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్టార్ట్ చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే వచ్చే ఏడాది మళ్ళీ మూడు సినిమాలు సెట్స్ పై ఉంటాయి. ‘స్పిరిట్’ విడుదల తర్వాత మరోటి కూడా ఒప్పుకోవచ్చు

Prabhas Fauzi:ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాపై ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలు కూడా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు పాత్రల్లో ఎవరు నటించనున్నారనే విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫౌజీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఇద్దరు ప్రముఖ చారిత్రక వ్యక్తుల పాత్రలు కూడా కనిపించబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫౌజీలో మహాత్మా గాంధీ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రకు కథలో కీలకమైన ప్రాధాన్యత ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో పలు వైవిధ్యమైన, చారిత్రక పాత్రల్లో నటించిన అనుపమ్ ఖేర్ గాంధీజీగా కనిపిస్తే ఆ పాత్రపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు నటుడు అనిష్ యోహన్ కురువిల్లా రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గాంధీజీతో పాటు ఠాగూర్ పాత్రను కూడా కథలో భాగం చేస్తే ఫౌజీకి మరింత చారిత్రక నేపథ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పాత్రలను కథలో ఎలా ముడిపెట్టారనేది ఆసక్తికరంగా మారింది. అయితే అనిష్ యోహన్ కురువిల్లా ఠాగూర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తకు కూడా ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. ఇక ఫౌజీ కథ స్వాతంత్య్ర పోరాట కాలం నేపథ్యంలో సాగుతుందనే ప్రచారం ఇప్పటికే