
NRI news | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అప్రజాస్వామికం..!
NRI news | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అప్రజాస్వామికం..!
© 2026 nimisham.in

NRI news | అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అప్రజాస్వామికం..!
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా అంతటా ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే సంకల్పంతో భాషా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకుడు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతులు, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను వెల్లడించారు. తెలుగు భాషను నేర్పడం, నేర్చుకోవడం ప్రతి తెలుగు కుటుంబ బాధ్యత అని గుర్తుచేశారు. మనబడి అధ్యక్షుడు కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదాన్ని గుర్తుచేస్తూ ఇప్పటివరకు లక్షా 10 వేల మందికి పైగా విద్యార్థులు మనబడి ద్వారా విద్యను పూర్తి చేసుకున్నారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో 10 దేశాల్లో దాదాపు 300 కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 12,500 మంది పిల్లలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర అమెరికాలో మనబడికి పాశ్చాత్య పాఠశాలలు, కళాశాలల సంఘం గుర్తింపుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ‘రన్ ఫర్ తెలుగు’ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి పతకాలతో సత్కరించారు. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేసి, ఆయా ప్రాంతాల్లో అల్పాహారం

వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. ఇంటర్నెట్ డెస్క్: వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. వీసా రెగ్యులరైజేషన్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్ జారీ, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్ ఐడీలు, ఉపాధి విషయాల్లో అవగాహనతో ఉండాలని సూచించింది. యూఏఈలో వెలుగు చూస్తున్న స్కామ్స్‌లో పలువురు బ్లూకాలర్ ఉద్యోగులు బాధితులుగా మారుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఎంబసీ వెల్లడించింది. మోసపూరితంగా బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్న నిందితులు వాటితో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పింది. బాధితులకు తెలియకుండానే వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం, లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకోవడం వంటివి చేస్తున్నారని చెప్పింది. ఈ స్కామ్ బారిన పడితే అప్పులు మిగిలడంతో పాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండేందుకు భారతీయులు తమ బయోమెట్రిక్, పాస్‌పోర్టు వివరాలను అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులతో పంచుకోవద్దని సూచించింది. యూఏఈ ప్రభుత్వ కేంద్రాలు, కౌంటర్లలోనే ఈ వివరాలను ఇవ్వాలని సూచించింది. భారతీయ పాస్‌పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ల జారీ కోసం భారతీయ కాన్సులేట్లు, లేదా ఎంబసీ బయోమెట్రిక్ వివరాలను కోరవని కూడా స్పష్టం చేసింది. బయోమెట్రిక్ వివరాలను ఎవరైనా అడిగితే వెంటనే ఎంబసీకి సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు చెప్పారు. రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మనీలా: తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం సభ్యులు బుధవారం ఫిలిప్పిన్స్ దేశ రాజధాని మనీలాలోని ఇండియన్ ఎంబసీని సందర్శించారు. ఆ తర్వాత మనీలాలోని కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ ఉన్నతాధికారులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ వలస విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫిలిప్పీన్స్ దేశ వలస విధానాన్ని ఆ దేశ ఉన్నత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వలస విధానాన్ని అమలు చేస్తున్న ఫిలిప్పీన్స్ దేశంలో అమలులో ఉన్న విధి విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇదే తరహా మెరుగైన వలస విధానాన్ని గల్ఫ్ కార్మికుల కోసం అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి వెల్లడించారు. ఫిలిప్పిన్స్ దేశ రాజధాని మనీలాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అంబసడర్ హర్ష కుమార్ జైన్, ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్ లతో వలస కార్మికుల విధానాల అంశాలపై కమిటీ సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. గల్ఫ్ కార్మికులను సంక్షేమం కోసం ఫిలిప్పీన్స్ తరహా విధానాలను అమలు చేస్తామన్నరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నారై అడ్వైజరి కమిటీ ఫిలిప్పీన్స్ దేశంలో పర్యటిస్తోంది. ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, ప్రొఫెసర్లు విజయ్ కొర్ర, శ్రీనివాస్ జునుగురు, లైజన్ ఆఫీసర్ ఆది కార్తీక్, తదితరులు ఈ బృందంలో ఉన్నారు. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. తాజా డ్రోన్ల దాడితో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం భీకరంగా మారింది. ఈ క్రమంలో.. క్రివీ రిహ్ స్టీల్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 14 మంది కార్మికులు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన కూడా. రష్యా క్షిపణి దాడి కారణంగా.. మిట్టల్ ప్లాంట్‌లోని కీలక ఉత్పత్తి విభాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలకు సంబంధించిన సదుపాయాలు ప్రభావితమయ్యాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియలను పాక్షికంగా నిలిపివేయాల్సి వచ్చింది. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు, నిపుణులు పరిశీలనలు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటు దాడి వల్ల జరిగిన ఆర్థిక నష్టంపై అధికారిక అంచనా ఇంకా వెలువడలేదు. అయితే భారీ పరిశ్రమ అయిన ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల మరమ్మతుల ఖర్చుతో పాటు ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. నష్టం స్థాయిని పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 90 ఏళ్ల చరిత్ర.. వెన్నెముక లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిహ్ స్టీల్ ప్లాంట్ సాధారణ పరిశ్రమ కాదు. దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం 1931లో అప్పటి సోవియట్ యూనియన్ హయాంలో ప్రారంభమైంది. 1934 ఆగస్టులో ఇక్కడ తొలి ఉక్కు ఉత్పత్తి జరిగింది. అప్పట్లో క్రివొరిజ్స్టల్ (Kryvorizhstal) పేరుతో కొనసాగిన ఈ ప్లాంట్.. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగంలో కీలకమైన సంస్థగా ఎదిగింది. 2005లో లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలోని మిట్టల్ స్టీల్ సంస్థ ప్రైవేటీకరణ వేలంలో ఈ ప్లాంట్‌ను సుమారు 4.8

సేవను జీవిత పరమార్థంగా, దాతృత్వాన్ని జీవన విధానంగా మలుచుకున్న శ్రీమతి శోభా రెడ్డి, శ్రీ ప్రసాద్ రెడ్డి దంపతులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ చిన్నారులు, పేద కుటుంబాలు, వెనుకబడిన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఆహార రవాణా వాహనాల కొనుగోలుకు 25 వేల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. రోజూ సుమారు 15 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న వంటశాలకు 2.5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వద్ద ఐదు ఎకరాల భూమి సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత పాదరక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రథమ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రారంభించారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పది కేంద్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆరోగ్య సేవల్లోనూ వారి సహకారం విశేషం. చెన్నైలోని శంకర నేత్రాలయ కోసం అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు 5.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. దీంతో ఈ యూనిట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్యం, శస్త్రచికిత్సలు అందించనున్నారు. ఇప్పటికే ఏపీలో ఎనిమిది నేత్ర శిబిరాలు నిర్వహించగా, తదుపరి శిబిరాన్ని తమిళనాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ ప్రసాద్ రెడ్డి గారు శంకర నేత్రాలయ యూఎస్ఏకు బోర్డు సలహాదారుగా, బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలందిస్తున్నారు. అలాగే, తన సంస్థ లాభాల్లో సుమారు 13 శాతాన్ని ప్రతి ఏడాది డల్లాస్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా న్యూజెర్సీ సెనెట్, అసెంబ్లీ ఆయనను సత్కరించాయి. శంకర నేత్రాలయం ప్రతిష్ఠాత్మక ‘శంకర రత్న’ పురస్కారంతోనూ ఆయనను గౌరవించనుంది. శ్రీ ప్రసాద్ రెడ్డి గారి సేవా ప్రస్థానంలో శ్రీమతి శోభా రెడ్డి గారి ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలుస్తున్నాయి. చిన్నారుల సంక్షేమం

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలో భారత సంతతి టీనేజర్‌పై హత్యాభియోగాలు నమోదయ్యాయి (Indian-Origin Teen). తల్లి, సోదరుడిని హత్య చేశాడన్న ఆరోపణలపై బుధవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని యాక్టన్‌లో ఈ హత్యలు జరిగాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తల్లి సుధా వెంకటేశన్ (45), సోదరుడు సిద్ధార్థ్ అరవింద్ (14)ను హత్య చేసిన ఆరోపణలపై అర్జున్ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సుదీర్ఘ గాలింపు జరిపిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం అర్జున్ ఇంటికి ట్యూటర్ రావడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి. సుధా వెంకటేశన్‌ను సంప్రదించేందుకు ట్యూటర్ ప్రయత్నించగా వీలుకాలేదు. తర్వాత సుధా భర్తకు సమాచారం ఇవ్వగా.. ఆయన ప్రయత్నించినా ఇంట్లో ఎవరూ స్పందించలేదు. దాంతో ఆయన వెంటనే పోలీసులకు ఫోన్‌చేశారు. వారు వచ్చిచూడగా.. సుధ, సిద్ధార్థ్ విగతజీవులై కనిపించారు. ఇద్దరి శరీరాలపై గాయాలు ఉన్నాయని, పరీక్షల అనంతరం మరణాలకు స్పష్టమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. పోలీసులు వచ్చినప్పుడు అర్జున్ ఇంట్లో లేడు. తల్లి కారులో బయటకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. అతడి కోసం రాత్రంతా గాలించి అరెస్టు చేశారు. అతడి ఆన్లైన్ యాక్టివిటీని ఆరాతీశారు. కుటుంబాన్ని చంపడం ఎలా అన్నదానిపై చాట్‌జీపీటీలో వెతికినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిపై హత్య అభియోగాలతో పాటు దాడి, కొట్టడం, వాహనాన్ని దొంగలించడం, అనుమతి లేకుండా వినియోగించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ప్రవాసాంధ్రుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నియామకం చేపట్టింది. శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాకు చెందిన ఎన్నారై దారపనేని ప్రసాద్‌ను యూఏఈలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) కంట్రీ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దుత్తలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ప్రసాద్, ఇకపై యూఏఈలోని ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం సేవలందించనున్నారు.ఈ నూతన బాధ్యతల్లో భాగంగా, యూఏఈలో నివసిస్తున్న తెలుగు వారి సంక్షేమ వ్యవహారాలను ప్రసాద్ పర్యవేక్షించనున్నారు. ప్రవాసాంధ్రుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంలో చొరవ చూపుతూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఏపీఎన్ఆర్టీఎస్, భారత రాయబార కార్యాలయం, యూఏఈలోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.ఈ నియామకం ద్వారా యూఏఈలోని ప్రవాసాంధ్రులకు ప్రభుత్వపరమైన సేవలు, సహాయం మరింత వేగంగా అందుతాయని అధికార యంత్రాంగం భావిస్తోంది

జగిత్యాల: ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడే దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాలలోని ఇస్లాంపురాకు చెందిన మహ్మద్ జావీద్ (27) యూరప్‌లోని మాల్టాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఈ యువకుడు కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితమే ఉద్యోగం కోసం యూరప్ వెళ్లిన జావీద్.. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకొని తిరిగి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివాహం జరిగిన మూడు నెలలకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌లో తెలుగు అందం మెరిసింది. డబ్లిన్‌లో జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ ఐర్లాండ్ 2026 (Miss India universe Ireland 2026) అందాల పోటీల్లో తెలుగు అమ్మాయిలు రాణించారు. ఈ నెల 8న నమ్ముడి ఐర్లాండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అక్కడ నివసిస్తున్న భారతీయ యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో మొదటి రన్నరప్‌గా ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఎంపిక కాగా.. రెండో రన్నరప్‌గా వరంగల్‌కు చెందిన రాజరాజేశ్వరి నిలిచారు. ఎమ్మెస్ పూర్తి చేసిన నిఖిత అక్కడే ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తల్లి సునీత వైరా పురపాలికలో కౌన్సిలర్‌గా ఉన్నారు. ఈ అందాల పోటీలు మూడు రౌండ్లలో జరిగాయని, అందం, ధైర్యం, వైఫల్యాలను అధిగమించి విజయం సాధించడం వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారని నిఖిత తెలిపారు. తుది పోటీలకు 18మంది ఎంపిక కాగా.. కేరళకు చెందిన అనుమోల్ విజేతగా నిలవగా.. తెలుగు యువతులు నిఖిత, రాజరాజేశ్వరి రన్నరప్‌లుగా సత్తా చాటారు. ఈ పోటీల్లో విజేతకు 1500 యూరోల ప్రైజ్ మనీ అందజేయగా.. మొదటి రన్నరప్‌కు 1000 యూరోలు, రెండో రన్నరప్‌కు 750 యూరోలు చొప్పున నిర్వాహకులు అందజేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌లో తెలుగు అందం మెరిసింది. నమ్ముడి ఐర్లాండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ 2026 (Miss India universe Ireland 2026) అందాల పోటీల్లో తెలుగు యువతులు రాణించారు. ఈ నెల 8న డబ్లిన్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో అక్కడ నివసిస్తున్న భారతీయ యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో మొదటి రన్నరప్‌గా ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మాదినేని నిఖిత ఎంపిక కాగా.. రెండో రన్నరప్‌గా వరంగల్‌కు చెందిన రాజరాజేశ్వరి నిలిచారు. ఎమ్మెస్ పూర్తి చేసిన నిఖిత అక్కడే ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తల్లి సునీత వైరా పురపాలికలో కౌన్సిలర్‌గా ఉన్నారు. తమ కుమార్తె అందాల పోటీల్లో భారతదేశం గర్వించేలా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వైరాలో నిఖిత కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఈ పోటీలు మూడు రౌండ్లలో జరిగాయని, అందం, ధైర్యం, వైఫల్యాలను అధిగమించి విజయం సాధించడం వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారని నిఖిత తెలిపారు. తుది పోటీలకు 18మంది ఎంపిక కాగా.. కేరళకు చెందిన అనుమోల్ విజేతగా నిలవగా.. తెలుగు యువతులు నిఖిత తొలి రన్నరప్‌గా, రాజరాజేశ్వరి రెండో రన్నరప్‌గా నిలవడం విశేషం. విజేతకు 1500 యూరోల ప్రైజ్ మనీ ఇవ్వగా.. మొదటి రన్నరప్‌కు 1000 యూరోలు, రెండో రన్నరప్‌కు 750 యూరోలు చొప్పున అందజేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. అమరావతి: గ్లోబల్ ఎన్ఆర్ఐ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. వివాహ వేడుకలో నూతన వధూవరులను నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. లోకేష్ దంపతులు తమ కుటుంబ వివాహ వేడుకకు హాజరు కావడంతో డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి, బిజీ షెడ్యూల్లోనూ ప్రత్యేకంగా సమయం కేటాయించి అమెరికా వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నందుకు నారా లోకేష్‌కు డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ దంపతుల రాకతో వివాహ వేడుక మరింత సందడిగా మారిందని, వారితో ఆత్మీయంగా గడిపిన క్షణాలు తమ కుటుంబానికి ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు మనోహర్‌రెడ్డికి ‘ఎన్ఆర్ఐ అచీవర్స్ అవార్డ్-2026’

సింగపూర్: ఏపీ ఎన్ఆర్టీ గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ వాసుదేవరావు ముక్కెర్లను సింగపూర్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. జూరాంగ్ రీజినల్ ఏరియాలోని బూన్లే పార్కులో శ్రీకాకుళం జిల్లా పాలవలస పీఎస్ఐ ట్రస్ట్ ప్రతినిధి బాబూరావు, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. వాసుదేవరావు గత 21 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు.. ముఖ్యంగా తెలుగు ప్రజలకు సేవలందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి గల్ఫ్‌లో రీజినల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టడం జిల్లా వాసులకు గర్వకారణమన్నారు. వాసుదేవరావు మాట్లాడుతూ.. బాబూరావు, ట్రస్ట్ సభ్యులు, కార్మిక సోదరులు తనకు ఆత్మీయ సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Trump H1B Visa Rules: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి బాధ్యతలు చేపట్టింది మొదలు వలస విధానాలపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో హెచ్ 1 బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ తీసుకువస్తున్న ఒక కొత్త ప్రతిపాదన అమెరికాలోని భారతీయ ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ లేదా ఇతర లీగల్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏదైనా కారణం చేత కంపెనీ నుంచి తొలగించినట్లయితే.. వారికి మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు 60 రోజుల సమయం గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఇది 2017లో అమల్లోకి వచ్చిన ఈ నిబంధన టెక్కీలకు ఒక పెద్ద ఊరటగా ఉంది. ఒకవేళ ఉద్యోగం పోతే, ఆ 2 నెలల వ్యవధిలో మరో కొత్త కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో హెచ్-1బీని బదిలీ చేసుకోవడం లేదా వేరే వీసా కేటగిరీకి మారడం లేదంటే స్వదేశానికి వెళ్లడానికి సన్నాహాలు చేసుకోవడానికి ఈ గడువు ఉపయోగపడేది అయితే తాజాగా ట్రంప్ యంత్రాంగం తెస్తున్న ప్రతిపాదన ప్రకారం.. హెచ్-1బీ అనేది కేవలం తాత్కాలిక ఉపాధి కార్యక్రమం మాత్రమేనని, ఉద్యోగం ఎప్పుడైతే కోల్పోతారో వెంటనే ఆ వ్యక్తి దేశం విడిచి వెళ్లాలని భావిస్తోంది. ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేయాలని వైట్‌హౌస్ పరిధిలోని ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ నిబంధన కనుక అమల్లోకి వస్తే.. ఉద్యోగం

గత 23 సంవత్సరాలుగా అమెరికాలోని తెలుగువారికి మీడియాపరంగా సేవలందిస్తున్న తెలుగు టైమ్స్ ఇప్పుడు బే ఏరియా వాసులకోసం మరో సబ్ పోర్టల్ ను ప్రారంభించింది. బే ఏరియా తెలుగు టైమ్స్ వెబ్ సైట్ ను కొత్తగా ప్రారంభించింది. శుక్రవారం, 7 ఆగస్టు 2026న కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫ్రీమాంట్ నగర మేయర్ శ్రీ రాజ్ సల్వాన్ మరియు మిల్పిటాస్ నగర మేయర్ శ్రీమతి కార్మెన్ మోంటానో కలిసి bayarea.telugutimes.net సబ్ పోర్టల్‌ను ఉమ్మడిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు టైమ్స్ ఎడిటర్ మరియు సీఈఓ శ్రీ వెంకట సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ, 2003లో బే ఏరియా గుండెకాయలాంటి శాన్ హోసేలో ప్రారంభమైన తెలుగు టైమ్స్, ఈ 23 ఏళ్లలో ఒక ప్రధాన మీడియా హౌస్‌గా రూపాంతరం చెందిందని తెలిపారు. అమెరికాలో, ముఖ్యంగా కాలిఫోర్నియా బే ఏరియాలో తెలుగు సమూహం ఎదగడాన్ని ఇది దగ్గర నుండి చూసిందని పేర్కొన్నారు. తెలుగు టైమ్స్ 10వ వార్షికోత్సవం (2013) సందర్భంగా ‘పాఠశాల’ అనే తెలుగు బోధనా సదుపాయాన్ని ప్రారంభించిందని, నేడు అది ఎంతో విజయవంతంగా నడుస్తోందని చెప్పారు. అలాగే ఇ-పేపర్, ఆన్లైన్ సేవలను ప్రారంభించి, అగ్రెస్సివ్ కంటెంట్ మరియు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రోజుకు లక్ష మంది వీక్షకులతో గొప్ప వృద్ధిని సాధించిందన్నారు. 2023లో 20వ వార్షికోత్సవం సందర్భంగా పెరుగుతున్న తెలుగు వ్యాపారవేత్తల కోసం బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రారంభించామని, అది కూడా మంచి విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇప్పుడు బే ఏరియాలోని ఫ్రీమాంట్, శాన్ హోసే, సన్నీవేల్, మిల్పిటాస్, డబ్లిన్, శాన్ రామోన్ వంటి 15 ప్రముఖ నగరాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సబ్ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు వివరించారు. ఫ్రీమాంట్ నగరపు మొదటి ఇండో-అమెరికన్ మేయర్ శ్రీ రాజ్ సల్వాన్ తెలుగు టైమ్స్‌కు అభినందనలు తెలిపారు. నేటి కాలంలో ప్రజలు స్థానిక వార్తలను ఎక్కువగా చదువుతున్నారని, 23 ఏళ్ల అనుభవం ఉన్న తెలుగు టైమ్స్ బే