
జగిత్యాల: ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడే దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాలలోని ఇస్లాంపురాకు చెందిన మహ్మద్ జావీద్ (27) యూరప్‌లోని మాల్టాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఈ యువకుడు కారులో వెళ్తుండగా ట్రక్కు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితమే ఉద్యోగం కోసం యూరప్ వెళ్లిన జావీద్.. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకొని తిరిగి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివాహం జరిగిన మూడు నెలలకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.