
సింగపూర్: ఏపీ ఎన్ఆర్టీ గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ వాసుదేవరావు ముక్కెర్లను సింగపూర్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. జూరాంగ్ రీజినల్ ఏరియాలోని బూన్లే పార్కులో శ్రీకాకుళం జిల్లా పాలవలస పీఎస్ఐ ట్రస్ట్ ప్రతినిధి బాబూరావు, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. వాసుదేవరావు గత 21 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు.. ముఖ్యంగా తెలుగు ప్రజలకు సేవలందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి గల్ఫ్‌లో రీజినల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టడం జిల్లా వాసులకు గర్వకారణమన్నారు. వాసుదేవరావు మాట్లాడుతూ.. బాబూరావు, ట్రస్ట్ సభ్యులు, కార్మిక సోదరులు తనకు ఆత్మీయ సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





