
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఈ ఏడాది సెప్టెంబరు 14 సోమవారం వినాయకచవితి వచ్చిన సంగతి తెలిసిందే. మరి విఘ్నేశ్వరుడి పూజ ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో చేయాలి?

కొత్తగా ఏ పని మొదలు పెట్టినా, శుభకార్యం చేసినా తొలుత పూజించేది విఘ్నేశ్వరుడినే.

పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం పన్నూరులోని రామగిరి ఖిల్లా ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వినూత్నమైన పద్ధతిలో మట్టి వినాయకుడిని తయారు చేశా

Bandla Ganesh | చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల వద్ద బండ్ల గణేష్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం (AP Deputy CM)కు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ బర్త్‌డే అంటే అందరి కళ్లూ ఎదురుచూసేది ఒక్కరి ట్వీట్ కోసమే.. ఆయనే ప్రముఖ నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ (Bandla Ganesh)! గతంలో పవన్ కళ్యాణ్ మూవీ ఆడియో ఫంక్షన్లలో బండ్లన్న ఇచ్చిన స్పీచ్‌లు, డైలాగులు ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ పెట్టిన సుదీర్ఘమైన, ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన మార్క్ భక్తిని చాటుకుంటూ బండ్లన్న చేసిన పోస్ట్ చూసి ‘బండ్లన్న మళ్లీ పూనకాలతో పూనకేశ్వరుడిగా మారాడు’ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికెత్తుతూ బండ్ల గణేష్ రాసిన పదాలు అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. మీ పేరు వింటే పూనకం… మీ పేరు వింటే పులకం… మీ రూపం చూస్తే పులకింత… మీ మాట వింటే ధైర్యం… మీ అడుగు పడితే సంచలనం! మీరు కేవలం ఒక హీరో మాత్రమే కాదు… కోట్లాది మందికి ఒక బలమైన భావోద్వేగం. మీరు ఒక స్టార్ కాదు… నడిచే ఒక అద్భుత శక్తి. మీరు ఒక సాధారణ పేరు కాదు… కోట్లాది హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర. మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా పూర్వజన్మ సుకృతం

విశాఖపట్నం: విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి, మద్యం మత్తులో యువకులు అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. పుట్టినరోజు పేరిట పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం(ఎస్ఆర్ పురం)లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఓ పార్టీలో 15 మంది యువతీ యువకులు గంజాయి, మద్యం సేవించారు. ఈ క్రమంలో జరిగిన గొడవను ప్రశ్నించిన రిసార్ట్ వాచ్‌మన్‌ను బీరు, మద్యం బాటిళ్లతో విచక్షరహితంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దాడిలో గాయపడిన వాచ్‌మన్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. నగరంలోని కొబ్బరితోట ప్రాంతానికి చెందిన రోషిణి అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్ కనకల గణేష్(24) పుట్టినరోజు కోసం ఎస్ఆర్ పురంలోని లక్కీ రిసార్ట్‌ను బుక్ చేసింది. వారిద్దరితో సహా మొత్తం 15 మంది(11 మంది యువకులు, నలుగురు యువతులు) సోమవారం రాత్రి రిసార్ట్‌కు చేరుకున్నారు. మంగళవారం వేకువజాము వరకు గంజాయి, మద్యం పూటుగా సేవించారు. ఆ తర్వాత అదుపుతప్పి రిసార్ట్‌లోని సామగ్రిని బద్దలు కొట్టడం మొదలు పెట్టారు. అదే సమయంలో వారితో వచ్చిన యువతులపై కూడా యువకులు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రిసార్ట్ వాచ్‌మన్‌గా ఉన్న బమ్మిడి పైడయ్య(70) మద్యం మత్తులో ఉన్న వారందరినీ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తి మత్తులో ఉన్న 15 మందీ మూకుమ్మడిగా పైడయ్యపై బీరు, మద్యం బాటిళ్లతో దాడి చేశారు. దీంతో పైడయ్య కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులోనే 5 గంటలు.. పైడయ్యపై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులు ఒక్కొక్కరిగా రిసార్ట్ నుంచి జారుకున్నారు. పుట్టినరోజు చేసుకున్న గణేష్ మాత్రం మత్తులో రూమ్‌లోనే ఉన్నాడు. ఉదయం 10 గంటలకు రిసార్ట్‌లో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది వచ్చి చూడగా పైడయ్య రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న పైడయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రూమ్‌లో మత్తులో పడి ఉన్న నిందితుడు గణేష్ ను
సినీ పరిశ్రమలో అభిమానం అనేది సహజమే... కానీ ఆ అభిమానాన్ని ఆరాధనగా, భక్తిగా మార్చుకున్న అతి కొద్దిమందిలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకు కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. సాక్షాత్తూ ప్రత్యక్ష దైవం. మైక్ దొరికితే చాలు పవన్‌ను ఆకాశానికెత్తేస్తూ బండ్ల గణేష్ ఇచ్చే ఎనర్జిటిక్ స్పీచ్‌లు టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. పవన్‌పై ఆయన చూపించే ఈ నిస్వార్థ ప్రేమని సినీ జనాలు వీరభక్తి అని పిలుస్తుంటారు. తాజాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక ప్రత్యేక పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.* అల్లు అర్జున్‌ని పక్కనపెట్టి యష్‌తో లోకేష్ కనకరాజ్ సినిమానా?... అల్లు, యష్ ఫ్యాన్ వార్ వేళ మరో బాంబ్హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అగ్ర నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఎదుగుదలలో పవన్ కల్యాణ్ పాత్ర ఎంతో కీలకం. పవన్‌తో ఆయన నిర్మించిన ‘గబ్బర్ సింగ్’ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి వారి అనుబంధాన్ని మరింత దృఢం చేసింది. ఆడియో వేడుకల్లో, ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో బండ్ల గణేష్ వేదికపైకి వచ్చారంటే అభిమానుల్లో పూనకాలు రావడం ఖాయం. 'వకీల్ సాబ్' ఈవెంట్లో పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ... ‘ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా’ ఆయన ఇచ్చిన స్పీచ్ తెలుగు సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆపదలో ఉన్న అభిమానులకు, పేదలకు ఎన్నో సందర్భాల్లో ఆయన ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.మరోసారి 'పవనేశ్వర' జపంబుధవారం (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని బండ్ల గణేష్ తన ఆరాధ్య దైవానికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 'వకీల్ సాబ్' వేదికపై గర్జించిన డైలాగును గుర్తుచేస్తూ ఆయన రాసిన

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల నేపథ్యంలో కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న నిర్మాత అశోక్‌కుమార్‌కు కోర్టులో ఊరట లభించింది. తెలుగు నిర్మాతలమండలికి (Telugu Film Producers Council) రెండేళ్లకు ఓ సారి జరిగే ఎన్నికలు ఈ ఏడాది ఈ నెల 6న జరుగనున్నాయి. ఇందులో అధ్యక్ష పదవి కోసం సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ (C Kalyan), మరో నిర్మాత బండ్ల గణేశ్ మొదట పోటీ పడ్డారు. చివరి క్షణంలో బండ్ల గణేశ్ (Bandla Ganesh) పోటీ నుంచి తప్పుకోవడంతో సి.కల్యాణ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక కార్యదర్శి పదవికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పోటీ పడుతున్న అశోక్‌కుమార్ (Ashok Kumar) నామినేషన్‌ను తిరస్కరించడంతో ఆయన న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న తర్వాత ఆయన నామినేషన్‌ను స్వీకరించి, ఎన్నికల ప్రక్రియలో కొనసాగేలా చూడమని ఎన్నికల అధికారికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అశోక్‌కుమార్ వెల్లడిస్తూ ‘ఇది నా వ్యక్తిగత విజయం కాదు.. నిజాయితీ, పారదర్శకత, నమ్మకం, ప్రతి సభ్యుడి ఎన్నికల హక్కుకు సంబంధించిన విషయం’ అని చెప్పారు

హైదరాబాద్: ఈసారి భాగ్య నగర పరిధిలో లక్షా నలభై వేల గణేష్ మండపాల సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాటి నిమజ్జనాలకు అవసరమయ్యే ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపింది. బడ్జెట్ కేటాయిపులో ప్రభుత్వం స్పీడ్ పెంచాలని మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని, ఎప్పటిలాగే అన్నీ చెరువులు, వినాయక సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుందని బాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావి నూతుల శశిధర్ సాక్షి టీవీకి తెలిపారు. ‘అధికారుల తప్పుడు నివేదిక కారణంగా హైకోర్టు వినాయక సాగర్‌పై స్టే ఇచ్చింది. ఎక్కడ వినాయక నిమజ్జనం వల్ల పొల్యూషన్ జరిగినట్లు సరైన ఆధారాలు లేవు. కావాలనే కొందరు అధికారులు హిందూ పండుగలను ఆంక్షలు పెట్టాలని చూస్తున్నారు. కాప్రా చెరువుతో పాటు హైడ్రా డెవలప్ చేసిన అన్నీ చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. అడ్డుకోవడానికి హైడ్రాకు ఎలాంటి అధికారం లేదు. చెరువులకు ఓనర్లు ప్రజలు.. అధికారులు, నాయకులు కాదు. చెరువుల్లో నిమజ్జనం చేయడం మా సంప్రదాయం. అందుకే అన్నీ చెరువుల్లో నిమజ్జనం కొనసాగిస్తాం. అడ్డుకోవాలని చూస్తే.. పరిణామాలు మరోలా ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారీ పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ

కుంభ రాశి : కుంభ రాశి వారికి వినాయక చవితి తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ రాశుల వారు ఎక్కవ మొత్తంలో డబ్బు పొదుపు చేసుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి : మకర రాశి వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎవరు అయితే ఎదురు చూస్తు్న్నారో వారికి ఇది చాలా శుభప్రదమైన సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అంతే కాకుండా, ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది మీన రాశి : మీన రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వారికి ఉన్నతాధికారుల నుంచి మనన్నలు అందుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది ఈ రాశి వారికి చాలా వరకు మేలు చేస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

Osmania University: దళిత బంధు పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఓయూలో నిరసన! Osmania University: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న దళిత బంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డా. బుషిపాక గణేశ్ ఆధ్వర్యంలో మోత్కూర్, అడ్డగూడూరు మండలాలకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బుషిపాక గణేశ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రెండో విడతలో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.3 లక్షలు జమ చేసిన అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కలెక్టర్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని తెలిపారు. రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా దళిత బంధు నిధుల సమస్య పరిష్కారం కాలేదని, దీంతో లబ్ధిదారుల కుటుంబాలు అనేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బ్యాంకు ఖాతాలపై ఉన్న ఫ్రీజింగ్‌ను ఎత్తివేసి, గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసి ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో మిగిలిన రూ.10 లక్షల దళిత బంధు నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ తో పాటు దళిత బంధు లబ్ధిదారులు జిల్లా శివాజీ, జక్కుల గిరిబాబు, ఇటీకాల అంజన్న, చేడే సైదులు, బాలెంల నరేందర్, శ్రీరామ్‌ల ప్రదీప్, బుషిపాక సంజీవ, బట్ట చిన్న వెంకన్న, మంద విష్ణు తదితరులు పాల్గొన్నారు

గణపతి విగ్రహాల ధరలు పెంపు ముడిసరుకులు, రవాణా భారం అధికం ఈసారి ఇరవైశాతం రేట్లు పెరుగుదల Ganesh Idol Prices Hike: వినాయక చవితి పండగ సమీపిస్తుండటంతో భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల సందడి అప్పుడే మొదలైంది. హైదరాబాద్ నగరంలతో పాటు శివారు ప్రాంతాల్లో విగ్రహాల తయారీ పనులు తుదిమెరుగులకు చేరుకున్నాయి. అయితే ఈ ఏడాది గణనాథుని విగ్రహాల ధరలు భారీగా పెరగనుండటంతో భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ధరల భారం తప్పేలా లేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి విగ్రహాల రేట్లు దాదాపు 25 శాతం వరకు పెరిగినట్లు తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. PMAY-U: ఏపీ పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. సొంతింటి కోసం రూ.2.89 లక్షల సాయం.. డైరెక్ట్ అకౌంట్ లోకే ముడిసరుకులు, రవాణా భారం - పెరిగిన విగ్రహాల రేట్లు: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), కొబ్బరిపీచు, రంగులు, అలంకరణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడమే కాకుండా రవాణా ఛార్జీలు కూడా భారంగా మారాయని తయారీదారులు వెల్లడించారు. గతేడాది 20 అడుగుల విగ్రహం ధర(Ganesh Idol Prices Hike) రూ.85 వేలు ఉండగా, ఈసారి అది రూ.లక్ష దాటింది. అలాగే సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే 12 నుండి 16 అడుగుల విగ్రహాల ధరలు గతంలో రూ.50-60 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.70 నుండి 80 వేల వరకు పలుకుతున్నాయి. ఎవర్ గ్రీన్ ధూల్‌పేట్ - శివార్లకు విస్తరించిన వ్యాపారం: నగరంలో వినాయక విగ్రహాల తయారీ అనగానే మొదట గుర్తుకొచ్చే ధూల్‌పేట్‌తో పాటు నాగోలు, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ధూల్‌పేట్ విగ్రహాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా విశేషమైన డిమాండ్ ఉంది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలను దిగుమతి చేసుకుని విక్రయిస్తుండటంతో మార్కెట్లో పోటీ బాగా పెరిగింది. Telangana

తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వేడెక్కబోతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ఈసారి అధ్యక్షుడిగా బండ్ల గణేశ్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు నిర్మాతల మండలిలో ఎన్నికల శంఖారావం మ్రోగింది. గత కొంతకాలంగా ఈ అసోసియేషన్ ఎన్నికలు జరపాలని పలువురు నిర్మాతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరబోతోంది. సెప్టెంబర్ 6న ఎన్నికలను నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజేతలను ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఆగస్ట్ 17 నుంచి నిర్మాతల మండలి ఎన్నికలకు నామినేషన్స్ ను స్వీకరిస్తున్నారు. ఇది 24వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజులు విత్ డ్రాస్ కోసం గడువు ఇచ్చి, 28న తుది జాబితాను ప్రకటిస్తారు. వీరందరికీ సెప్టెంబర్ 6న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగుతాయి. ఇదే రోజు సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తారు. తెలుగు నిర్మాతల మండలికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు చిన్న నిర్మాతలకు మధ్య హోరాహోరీ పోరు సాగుతూ ఉంటుంది. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి ఈసారి అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ పదవికి సి. కళ్యాణ్ పోటీ పడుతున్నారు. సి. కళ్యాణ్ ప్యానల్ నుంచి కార్యదర్శులుగా తుమ్మలపల్లి ప్రసన్న కుమార్, వైవియస్ చౌదరి పోటీ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీస్ గా అమ్మిరాజు, రామసత్యనారాయణ బరిలో నిలుస్తున్నారు. ట్రెజరర్‌గా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు పోటీ చేస్తున్నారు. కాగా... యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు చెందిన బండ్ల గణేశ్ ప్యానల్ నుంచి ఏ పదవికి ఎవరెవరు పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా కలసి బండ్ల గణేశ్‌ను ఈసారి అధ్యక్ష పదవికి బరిలో దించడం

బండ్ల గణేష్ (Bandla Ganesh) పక్కా తెలుగుదేశం పార్టీ అభిమాని. చంద్రబాబు కోసం శ్రమించే వ్యక్తి. నేను తెలంగాణ వాడిని, నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం తిరుమల కాలినడకన వెళ్లిన వింతైన వ్యక్తి. అంతే కాదు, ఎన్డీయేకి చెందిన చంద్రబాబుని ఇష్టపడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జనసేన అధినేతని దేవుడిగా కొలిచే విచిత్రమైన వ్యక్తి. ఇక తాజాగా చిరంజీవి బర్త్ డే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూ మరింతగా రెచ్చిపోయారు. పొగడంలో బండ్లకి పోటీ రారు ఎవరూ అని మరి నిరూపించుకున్నారు. “మెగాస్టార్ క్యారెక్టర్ భావితరాలకు ఒక రామాయణం, భవిష్యత్ తరాలకు ఒక భగవద్గీత,” అని చిరంజీవి వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తారు. బండ్ల గణేష్ నిర్మాతగా కొత్త సినిమా అనౌన్స్ చేస్తాను అని ఇటీవల ప్రకటించారు. అలాగే ఒక కొత్త ప్రొడక్షన్ బ్యానర్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆ బ్యానర్ పై సినిమాలు ఇంకా స్టార్ట్ చెయ్యలేదు
చిరంజీవి క్యారెక్టర్, క్యాలిబర్ మీకేం తెలుసు.. బండ్ల గణేష్ మాస్ స్పీచ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో నిర్మాత బండ్ల గణేష్ పాల్గొని ప్రసంగించారు. చిరంజీవి అంటే తనకు ప్రాణమని, ఆయన వల్లే తనలాంటి సామాన్యులు సినీ పరిశ్రమలోకి వచ్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే చిరంజీవి స్పూర్తిదాయక జీవితాన్ని రాబోయే తరాల కోసం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఆయన కోరారు. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వార్తకు సంబంధించిన

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏడుకొండల వెంకన్న సాక్షిగా నిజాలే మాట్లాడతానంటూ మొదలుపెట్టిన బండ్ల గణేశ్... మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వాన్ని, ఆయన సాధించిన ఉన్నత స్థానాన్ని ఎంతో భావోద్వేగంగా వర్ణించారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా చెన్నైలో అడుగుపెట్టిన చిరంజీవి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ 'మెగాస్టార్' అంటే ఏంటో నిరూపించారని బండ్ల గణేశ్ కొనియాడారు. తనకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను, అలాగే తెలుగు పరిశ్రమను చేత్తో పట్టుకొచ్చింది చిరంజీవినేనని ఆయన గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా, భారతదేశంలో ఏ నటుడికీ దక్కని అద్భుతమైన అదృష్టం రామ్ చరణ్ రూపంలో చిరంజీవికి దక్కిందని... ఒక మెగాస్టార్‌కు మెగా పవర్ స్టార్‌ను కొడుకుగా ఇచ్చిన ఘనత ఆయన మంచి వ్యక్తిత్వానిదేనని వ్యాఖ్యానించారు. చిరంజీవి మంచితనాన్ని వివరిస్తూ... 85 ఏళ్ల వయసున్న తల్లిని ఇప్పటికీ కంటికి రెప్పలా చూసుకునే గొప్ప కొడుకని చెప్పారు. గతంలో తాను ఇల్లు కట్టుకున్న సమయంలో తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతూ కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ షూటింగ్ సమయంలో 50 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి తనను ఆశీర్వదించిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. చిరంజీవి ఇతరులను తొక్కుతారనే విమర్శలకు గట్టిగా సమాధానమిస్తూ... ఆయన ఎవరినీ తొక్కడని, పైకి ఎక్కిస్తాడని, ప్రోత్సహించి ఉన్నత స్థానంలో కూర్చోబెడతాడని స్పష్టం చేశారు. కష్టపడే ప్రతి ఒక్కరూ పరిశ్రమలో పైకి రాగలరనే భరోసా ఇచ్చింది చిరంజీవినేనని, ఆయన జీవిత చరిత్రను రాబోయే తరాలకు పాఠ్యపుస్తకాలుగా పెట్టాలని పేర్కొంటూ తన ప్రసంగాన్ని ముగించారు

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం విచ్చేశారు. ఇటీవల బండ్ల గణేష్ కుమార్తె జనని, అల్లుడు సూర్య తేజల వివాహం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) నివాసానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) శుక్రవారం విచ్చేశారు. ఇటీవల బండ్ల గణేష్ కుమార్తె జనని, అల్లుడు సూర్య తేజల వివాహం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ విచ్చేశారు. ఇక ఈ వివాహానికి పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ హాజరైనప్పటికీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల వల్ల ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరుకా లేకపోయారు. ఈ క్రమంలో ఫిల్మ్ నగర్‌లోని బండ్ల గణేష్ నివాసానికి స్వయంగా వెళ్లిన సునీతకు, గణేష్ దంపతులు సాదరంగా ఘన స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత నూతన వధూవరులకు ధర్మవరం పట్టు వస్త్రాలు బహుకరించి, వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనంతరం బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కాసేపు సరదాగా, ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా దివంగత నేత పరిటాల రవితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నాడు. ఐకానిక్ సినిమా శ్రీరాములయ్య చిత్రంలో నటించే సమయం నుంచే పరిటాల కుటుంబంతో తనకు ఎంతో గాఢమైన బంధం ఏర్పడిందని, పరిటాల రవితో గడిపిన రోజులు ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరువలేనిదని గణేష్ భావోద్వేగంగా వెల్లడించాడు. దశాబ్దాలు గడుస్తున్నా తమ కుటుంబాల మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఇలాగే కొనసాగడం పట్ల ఇరు వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా బండ్ల తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'మా ఆత్మీయురాలు, మా వదిన పరిటాల సునీతగారు ఈరోజు ప్రత్యేకంగా మా

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యిపోయాయి. ఎప్పటిలానే.. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆగస్టు 20 రాత్రి మెగా మహోత్సవం ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 71వ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యిపోయాయి. ఎప్పటిలానే.. మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆగస్టు 20 రాత్రి మెగా మహోత్సవం ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రముఖ నటుడు, కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi) చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. వేదికపై ఉన్న దర్శకుడు బాబీ, జానీ మాస్టర్, నాగేంద్ర, ఆటా సందీప్, రమేష్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆది, 90స్ జనరేషన్ ప్రేక్షకులందరినీ ఉద్దేశించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడాడు. తమ జనరేషన్ చందమామని చూస్తూ తిందని, చిరంజీవిని చూస్తూ పెరిగిందని, పవన్ కళ్యాణ్ ని చూస్తూ అరిచిందని, రామ్ చరణ్ ని చూస్తూ గర్వపడుతోందని తెలిపాడు. చిన్నతనంలో టీవీ లేక పక్కింటికి వెళ్లి వేరే సినిమాలైతే మధ్యలోనే వచ్చేసేవాళ్లమని, కానీ చిరంజీవి సినిమా అయితే చివరిదాకా చూసేవాళ్లమని గుర్తుచేశాడు. గ్రీటింగ్ కార్డ్స్ నుంచి హాస్టల్ రూముల్లో పోస్టర్ల వరకు మెగాస్టార్‌తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, ఈ జనరేషన్‌కి చిరంజీవి ఒక హీరో కావచ్చు కానీ తమకు మాత్రం వన్ అండ్ ఓన్లీ హీరో అని స్పష్టం చేశాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా హీరోలందరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, వాళ్లందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదేనని గుర్తుచేశాడు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డులను వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోనీలు దాటేసినట్లే, సినిమాల్లో కూడా రికార్డులు మారుతుంటాయి గానీ.. చిరంజీవి డాన్స్, నటన, ఫ్యాన్ బేస్, సహాయ గుణం లాంటి రికార్డులను మాత్రం ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారని, కేవలం అనుసరించారంతేనని అన్నాడు. 'స్వయంకృషి', 'విజేత', 'ఆపద్బాంధవుడు', 'మగమహారాజు' అనేవి కేవలం

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మెగా కుటుంబానికి ఏ రేంజ్ భక్తుడో కూడా వివరించాల్సిన అవసరం లేదు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మెగా కుటుంబానికి ఏ రేంజ్ భక్తుడో కూడా వివరించాల్సిన అవసరం లేదు. బండ్లన్న స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చాలాకాలం తరువాత ఒక మెగా భక్తుడుగా బండ్ల స్పీచ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచ్ తో అదరగొట్టేశాడు. ఏడుకొండల వెంకన్న సాక్షిగా నిజాలే మాట్లాడతా..అంటూ మొదలుపెట్టి చిరంజీవి వ్యక్తిత్వం, మంచి మనసు అన్నింటినీ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. 'ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు, అంజనమ్మల కడుపున చిరంజీవి జన్మించారో కానీ, గత 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలుగుతూ, అభిమానులను రక్షిస్తూ, ఎందరికో జీవనాధారాన్ని కల్పిస్తూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ఈరోజు ఏడుకొండల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాద్రి అప్పన్న, యాదగిరిగుట్ట నరసింహస్వామి మరియు నేను కొలిచే అయ్యప్ప స్వామి సాక్షిగా మెగాస్టార్ క్యారెక్టర్, కెపాసిటీ, క్యాలిబర్, వ్యక్తిత్వం గురించి నిజాలు మాట్లాడడానికే వచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకునే కుర్రాడిలా చెన్నై నగరంలో అడుగుపెట్టి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో చూపించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. నాకు ఆయనంటే ప్రాణం. ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను, తెలుగు ఇండస్ట్రీని చేత్తో పట్టుకొచ్చింది ఆయనే. భారతదేశంలో ఏ నటుడికి దక్కని అద్భుతమైన అదృష్టం రామ్ చరణ్ రూపంలో తన లెగసీని కంటిన్యూ చేయడానికి దక్కింది. ఎంతో మంది స్టార్లు ఉన్నారు కానీ, ఒక మెగాస్టార్‌కు మెగా పవర్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత .. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి వెళ్లారు. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం గత ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సునీత తనయులు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే కొన్ని కారణాల వలన పరిటాల సునీత బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు.. ఫిల్మ్ నగర్‌లోని బండ్ల గణేష్ నివాసానికి పరిటాల సునీత వెళ్లారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కుటుంబం.. పరిటాల సునీతకు సాదర స్వాగతం పలికింది. అనంతరం బండ్ల గణేష్ కుమార్తె, అల్లుడికి పరిటాల సునీత.. ధర్మవరం పట్టువస్త్రాలు అందించి ఆశీర్వదించారు. బండ్ల గణేష్ కుటుంబసభ్యులతో కాసేపు ఆత్మీయంగా గడిపారు. శ్రీరాములయ్య సినిమా అప్పటి నుంచి పరిటాల కుటుంబంతో బండ్లగణేష్‌కు అనుబంధం ఉంది.పరిటాల సునీత తమ ఇంటికి వచ్చిన విషయాన్ని బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఫోటోలను పంచుకున్నారు. "మా ఆత్మీయురాలు, మా వదిన పరిటాల సునీత ఈరోజు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి, నా కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించి వెళ్లడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు చల్లగా, చక్కగా, ఆనందంగా ప్రజా సేవ చేస్తూ, పరిటాల రవన్న పేరును ఇంకా చిరస్థాయిగా నిలిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. వదినమ్మ అని పిలవడంతోనే పరిటాల కుటుంబానికి, బండ్ల గణేష్‌కు ఉన్న అనుబంధం తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆగస్ట్ 16వ తేదీ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 11 గంటల 58 నిమిషాలకు వరుడు సూర్యతేజ.. జననిమూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్‌ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే వీటిని సెప్టెంబర్ 11, 13, 14 తేదీలకు మార్చాలని ఏసీబీ నుంచి బీసీసీఐకి ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి రోజున ఓ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పండగ రోజున మ్యాచ్.. వ్యూయర్షిప్పై కన్ను గణేశ్ చతుర్థి సందర్భంగా మ్యాచ్ నిర్వహిస్తే టీవీ వ్యూయర్షిప్తో పాటు స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే షెడ్యూల్‌ను ముందుకు జరపాలని కోరినట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అఫ్గానిస్థాన్ తొలిసారి భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. అయితే మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. భారత్‌కు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆగస్టు 27న ముగియనుంది. సెప్టెంబర్ 24న ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యలో భారత జట్టుకు ఖాళీ సమయం ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ కూడా జరిగే అవకాశం లేనందున.. అఫ్గానిస్థాన్ సిరీస్‌ను ముందుకు జరపడం సాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షెడ్యూల్ మార్పుపై బీసీసీఐ, ఏసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కుల్దీప్ యాదవ్‌పై వారికి

హైదరాబాద్‌లోని మల్లిఖార్జున నగర్ యూత్ అసోసియేషన్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడు వికసిత భారత్ 2047 థీమ్‌లో భాగంగా రోబో ఆకారంలో గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మల్లిఖార్జున నగర్ యూత్ అసోసియేషన్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడు వికసిత భారత్ 2047 థీమ్‌లో భాగంగా రోబో ఆకారంలో గణపతిని ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గురువారం లలితబాగ్ విగ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, పర్యావరణ సుస్థిరతపై ప్రధాని మోదీ విజన్‌ను భక్తులకు తెలియజేయడానికి రోబో గణేష్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అయోధ్య, చంద్రయాన్, ఆపరేషన్ సిందూర్ థీమ్‌లలో గణపతి ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ సుశీల్ కుమార్, కోశాధికారి గుండు శ్రీకాంత్, అధ్యక్షుడు వెంకటేష్, ప్రతినిధులు దయానంద్, సాయి చరణ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Alwal: అల్వాల్‌లో వినూత్న చోరీ చందా కోసం వెళ్లి నగదు దోచుకున్న మైనర్లు ఈ వార్తకు సంబంధించిన

Mohammed Siraj Injury: బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో లంక పర్యటనలో పేస్ బాధ్యతలను సిరాజ్ తన భుజాలపై వేసుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గంభీర్ కేవలం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. అయితే మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ వేగం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఐదో రోజు తొలి సెషన్లో అతను కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో అతని అత్యధిక వేగం 132.8 కిలోమీటర్లు మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ మొత్తం మీద సగటున 126 కిలోమీటర్ల వేగంతోనే బంతులు విసిరాడు. దీన్ని బట్టి అతను వంద శాతం ఫిట్‌గా లేడని, ఏదో నొప్పితో బాధపడుతున్నాడని దొడ్డ గణేశ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మామూలుగా అయితే సిరాజ్ ఇంత నెమ్మదిగా బౌలింగ్ చేయడని ఆయన గుర్తుచేశారు. సిరాజ్ ఫిట్‌నెస్‌పై వస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), బీసీసీఐ మెడికల్ టీమ్ పనితీరును బోనులో నిలబెడుతున్నాయి. శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు సిరాజ్ చాలా రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే గడిపాడు. అప్పుడే అతని గాయం గురించి వైద్యులకు తెలియలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉంటున్న ఈ స్టార్ బౌలర్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసేలా మేనేజ్మెంట్ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? Is Siraj carrying a niggle? This isn’t the pace he usually bowls #SLvIND — Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 19, 2026 గాలే టెస్టులో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో

Amalapuram: అమలాపురంలో కలకలం బట్టల అలమరలోకి దూరిన గోధుమ తాచుపాము! అమలాపురం: అమలాపురం పట్టణంలోని గొల్లగూడెం, కృష్ణుడి గుడి పక్కన ఉన్న రోడ్డులో ఓ ఇంట్లోకి పాము ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మందపాటి మూర్తి నివాసంలో అద్దెకు ఉంటున్న కుటుంబ సభ్యులు బట్టలు సర్దుకునేందుకు ఆలమర తెరవగా అందులో గోధుమ తాచుపాము కనిపించింది. ఒక్కసారిగా పాము కనిపించడంతో వారు భయంతో బయటకు పరుగులు తీశారు.వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న గణేష్ వర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని,జాగ్రత్తగా పామును పట్టుకున్నారు.అనంతరం పామును సురక్షితంగా డబ్బాలో బంధించారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో ప్రస్తుతం పాముల సంచారం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు.ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,బట్టలు,సామగ్రి కదిలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లలోకి పాములు ప్రవేశించినప్పుడు ప్రజలు భయపడి వాటిని చంపే ప్రయత్నం చేయకుండా,వెంటనే స్నేక్ క్యాచర్లకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అక్కడ ఉన్న ప్రజలకు గణేష్ వర్మ కోరారు

Bandla Ganesh : నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని బండ్ల వివాహం ఇటీవల ఆగస్టు 16న ఏపీకి చెందిన వ్యాపారవేత్త సూర్యతేజతో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ సెలబ్రిటీలు, రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్, రిసెప్షన్, నిశ్చితార్థం, హల్దీ.. ఇలా పెళ్లివేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకల్లో బండ్ల గణేష్ అల్లుడు సూర్య తేజ అదిరిపోయే డ్యాన్స్ వేసాడు. కూతురు జనని కూడా సూర్యతేజతో కలిసి డ్యాన్స్ వేసింది. సూర్య తేజ డ్యాన్స్ కి అందరూ షాక్ అయ్యారు. బండ్లన్న అల్లుడు వేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే అల్లుడి డ్యాన్స్ చూసి బండ్ల్ గణేష్ కూడా షాక్ అయ్యాడు. Also See : Bandla Ganesh : బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. పెళ్లి మండపం చూశారా..? బాహుబలి రేంజ్ లో సెట్స్ వేసి.. దీంతో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో స్టేజిపై బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సూర్య నీ డాన్స్, నీ ఎనర్జీ చూస్తుంటే నాకు గుండెల్లో దడ పుడుతుంది. నీకు దండం పెడతాను. నువ్వు బిజినెస్ లోనే ఉండు, పొరపాటున కూడా సినిమాల్లోకి వస్తానని అనకు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఆ రిసెప్షన్ కి వచ్చిన దర్శకులను ఉద్దేశించి.. ఇక్కడ ఉన్న దర్శకులందరూ మా అల్లుడి డాన్స్ మర్చిపోండి. తనని హీరోగా పెట్టి సినిమాలు చేద్దామని అనుకోకండి అని సరదాగా వార్నింగ్ ఇచ్చాడు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ కామెంట్స్ కి అల్లుడు సూర్యతేజ వెంటనే సమాధానమిస్తూ.. మామయ్య నాకు అసలు సినిమాల్లోకి రావాలని లేదు. ఇప్పుడు వేసిన డాన్స్ అంతా కేవలం మీ కూతురిపై ఉన్న ప్రేమతో మాత్రమే అని అన్నారు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Bandla Ganesh: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు పెళ్లి ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లికి ముందు జరిగిన సంగీత్ కార్యక్రమంలో కూడా సందడి వాతావరణం కనిపించింది. ముఖ్యంగా బండ్ల గణేష్ అల్లుడు సూర్య చేసిన డ్యాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీత్ వేడుకలో సూర్య ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఆయన డ్యాన్స్ చూసిన అభిమానులు, కుటుంబ సభ్యులు గట్టిగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. సూర్య అంత ఎనర్జీతో డ్యాన్స్ చేయడం చూసి బండ్ల గణేష్ కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయన మైక్ తీసుకుని తన అల్లుడిపై సరదాగా కామెంట్స్ చేశారు. “నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు గుండెల్లో దడ మొదలైంది” అంటూ బండ్ల గణేష్ సరదాగా అన్నారు. తన అల్లుడు ఇంత బాగా, ఇంత ఎనర్జీతో డ్యాన్స్ చేస్తాడని తాను అసలు ఊహించలేదని చెప్పారు. ఆయన మాటలు అక్కడ ఉన్న వారందరినీ నవ్వించాయి. అంతేకాదు.. సూర్యకు హీరో అవ్వాలనే ఆలోచన రావద్దని కూడా బండ్ల గణేష్ సరదాగా సూచించారు. అక్కడ ఉన్న దర్శకులందరినీ ఉద్దేశిస్తూ.. తన అల్లుడు చేసిన డ్యాన్స్‌ను మర్చిపోవాలని అన్నారు. సూర్య మంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎదగాలని, సినిమాల్లో హీరోగా చేయాలని మాత్రం అనుకోవద్దని చమత్కరించారు. దీనికి సూర్య కూడా సరదాగా సమాధానం ఇచ్చారు. తన భార్యపై ఉన్న ప్రేమతోనే తాను ఆ డ్యాన్స్ చేశానని చెప్పారు

Arunachalam Girivalam: అరుణాచలంలో మోక్షమార్గం రహస్యం... గిరి ప్రదక్షిణలో ఈ గుహలోనుంచి ఎందుకు వెళతారో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం, సినిమాలు రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సినిమా గా పవన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వచ్చింది. నెక్స్ట్ పవన్ ఓజీ2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని చెప్పడం కరెక్ట్. వీరిద్దరి మధ్య అంత అద్భుతంగా బాడింగ్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులకు కొదవ లేదు. సెలెబ్రిటీలే పవన్ అని అమితంగా అభిమానిస్తుంటారు. వారిలో బండ్ల గణేష్ ఒకరు. బండ్ల గణేష్ స్టేజీ ఎక్కితే చాలు.. పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుతూ వీరావేశంతో ఊగిపోతారు. అనేక సందర్భాల్లో తాను పవన్ కళ్యాణ్ కి భక్తుడు అని బండ్ల గణేష్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టిన ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఆడియో క్లిప్స్ మాత్రమే కాదు.. త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా బండ్ల గణేష్ అప్పట్లో ట్వీట్స్ కూడా చేశారు. ఆవేశాలు చల్లారాక త్రివిక్రమ్ తో బండ్ల గణేష్ రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. ఒకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయి. అది సహజం. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతాం కదా అని ఆ మధ్యన బండ్ల గణేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇటీవల బండ్ల గణేష్ తన కుమార్తె వివాహానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇన్వైట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో త్రివిక్రమ్ పెళ్ళికి హాజరవుతారా కారా అనే సందేహం ఉండేది. ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్ బండ్ల గణేష్ కుమార్తె పెళ్ళికి

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుమార్తె జనని (Janani) వివాహాన్ని ఆగస్ట్ 16, ఆదివారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. ఈ వివాహం అనంతరం బండ్ల గణేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) తన కుమార్తె జనని (Janani) వివాహాన్ని ఆగస్ట్ 16, ఆదివారం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. సూర్యతేజ (Surya Teja)తో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు, స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు తరలివచ్చి నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పెద్దల సమక్షంలో, బంధుమిత్రుల కోలాహలం నడుమ ఈ వేడుక కన్నులపండువగా ముగిసింది. ఈ సందర్భంగా తన కూతురి పెళ్లికి వచ్చి, ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తన సందేశంలో.. ‘‘నిన్న నా కుమార్తె జనని వివాహ వేడుకకు విచ్చేసి, నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కుటుంబంతో ఉన్న గాఢమైన అనుబంధంతో, ఆప్యాయతతో తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ శుభకార్యానికి తరలివచ్చిన పెద్దలు, నా ప్రాణసమానులైన ఆత్మీయులు, సినీ మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి రాకతో మా ఇంట్లో జరిగిన ఈ పండుగ వేడుక మరింత ప్రత్యేకంగా, ఎంతో ఆనందంగా మారింది. మీరు అందించిన ప్రేమ, ఆశీర్వాదాలు మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి’’ అని బండ్ల తన సంతోషాన్ని తెలియజేశారు. అంతేకాకుండా, ఇంతటి భారీ వేడుకలో ఏవైనా లోటుపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ‘‘మా ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసిన అతిథులకు, పెద్దలకు ఎలాంటి అసౌకర్యం లేదా ఇబ్బంది

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ దంపతుల విషయంలో పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. సాధారణంగా సెలబ్రిటీ దంపతుల విషయంలో పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. చైతూ-శోభిత జంట విషయంలోనూ గత కొంతకాలంగా శోభిత గర్భవతి అంటూ రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సమంత ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారీ, శోభిత తన భర్త చైతన్యకు వంట చేసి పెట్టిన ఫొటో షేర్ చేసినా లేక ఏ చిన్న పోస్ట్ పెట్టినా నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది. అయితే తాజాగా ఈ రూమర్లన్నింటికీ గట్టి చెక్ పడింది. ఇటీవల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహ వేడుకకు నాగచైతన్య, శోభిత జంటగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో శోభిత ఎరుపు రంగు పట్టు చీర కట్టుకుని ఎంతో సంప్రదాయబద్ధంగా, అందంగా మెరిసిపోయింది. అనంతరం ఈ పెళ్లికి ఆమె ధరించిన చీరతో కొన్ని ఫోటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుకుంది. ఆ ఫోటోలలో శోభిత తన నడుము స్పష్టంగా కనిపించేలా ఫోజులిచ్చింది. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్‌గా ఉంటే కొంచెమైనా బేబీ బంప్ కనిపించాలి కదా, కానీ అలాంటిదేమీ లేకపోవడంతో ఆమె గర్భవతి కాదని స్పష్టమైంది. గత కొంతకాలంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ పుకార్లకు చెక్ పెట్టడానికే శోభిత ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్.. అక్కినేని కోడలు ప్రెగ్నెంట్ అన్నారు కదరా.. అలా కనిపించడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి

Trivikram – Bandla Ganesh : ఒకరు పవన్ కళ్యాణ్ కి భక్తుడు. ఇంకొకరు పవన్ కళ్యాణ్ కి ఆప్త మిత్రుడు. పవన్ ఫ్యాన్స్ కి ఈ ఇద్దరూ కావాల్సినవాళ్ళే. కానీ కొన్నాళ్ల క్రితం ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ ఓ వివాదం అయితే నెలకొంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మరొకరు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ఎంత క్లోజ్ అనేది అందరికి తెలిసిందే. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ స్పీచ్ లతో, ఆయన నా దేవుడు అంటూ వైరల్ అయ్యారు. కొన్నాళ్ల క్రితం ఓ పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కు బండ్ల గణేష్ ని ఆహ్వానించకపోవడంతో ఫ్యాన్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ.. త్రివిక్రమ్ వల్లే అంటూ తిట్టారు. త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టిన ఆడియో క్లిప్ అప్పట్లో తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో కూడా బండ్ల గణేష్ త్రివిక్రమ్ కి కౌంటర్ గా గతంలో కొన్ని ట్వీట్స్ వేశారు. దాంతో బండ్లన్న – త్రివిక్రమ్ మధ్య గ్యాప్ ఏర్పడింది. Also See : Bellamkonda Sreenivas : భార్య బర్త్ డే.. పార్టీ నుంచి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ ఈ వివాదంపై స్పందిస్తూ.. ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం, కోపతాపాలు ఉండవా. ఒక మాట అనుకుంటాం. మళ్లీ కలిసిపోతాం అని అన్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా కలిసిపోయారు అని తెలుస్తుంది. బండ్ల గణేష్ కూతురు జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. త్రివిక్రమ్ పెద్ద పుష్పగుచ్చం తీసుకొని జనని పెళ్లి కి

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ తారలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బండ్ల గణేశ్ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు) విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు) విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు) హైదరాబాద్ ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు) చేతకాని వాడి చేతిలో విద్యాశాఖ పెడితే ఇలానే ఉంటుంది నువొక డమ్మీ హోమ్ మంత్రివి.. నీకు చంద్రబాబు పదవి ఇచ్చింది..! తిరుమల అలిపిరి మెట్లపై సిగరెట్ తాగుతూ వ్యక్తి హల్చల్

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నాగచైతన్య దంపతులు, గోపీచంద్, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీకాంత్, నటి జయప్రద, దర్శకులు కె రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు అల్లు అరవింద్, నాగవంశీ, అనిల్ సుంకర, శిరీష్, సాహు గారపాటి తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూతురు జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఆలయం నమూనాలో భారీ పెళ్లి మండపం సెట్స్ వేశారు. మెయిన్ పెళ్లి మండపం పక్కనే అతిధులు కూర్చోడానికి మరికొన్ని మండపం సెట్స్ వేశారు. భారీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలను, అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసారు. మండపం మొత్తం పూలతో అలంకరించారు. మొత్తానికి కూతురి పెళ్ళికి బండ్ల గణేష్ బాహుబలి రేంజ్ లో సెట్స్ వేసాడని అంటున్నారు

‘హుషార్ పిట్టలు’ టీంని చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదలైంది. గత నాలుగైదు రోజులుగా వేస్తున్న ప్రీమియర్లకు ఆల్రెడీ అద్భతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, బెక్కం వేణుగోపాల్ గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాని ఇప్పటి వరకు లక్ష మంది చూశారు. దాదాపు కోటి ముప్పై లక్షల గ్రాస్ వచ్చింది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సినిమాని చూస్తారు. ప్రీమియర్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ ఏర్పడింది. సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లకి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్‌కి బ్రేక్ వచ్చింది. ఇంకా పది, ఇరవై లక్షల మంది సినిమాని చూస్తే టీంకు లాభాలు వస్తాయి. కంటిన్యూగా పబ్లిసిటీ చేయండి. కోరుకున్న విజయం దక్కుతుంది. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘ఎన్నో చిన్న చిత్రాలు తీసి సక్సెస్‌ను చూశాను. మళ్లీ ఈ ‘హుషార్ పిట్టలు’ మూవీని అందరితో కలిసి థియేటర్లో చూసి, ఆ సక్సెస్‌ను చూడటం ఆనందంగా అనిపించింది. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే కచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్స్ లేకపోయినా.. స్టార్ హీరో

Secunderabad: బాలంరాయి దండు మారెమ్మ ఫలహారం బండి ఊరేగింపు సికింద్రాబాద్: బాలంరాయి దండు మారెమ్మ దేవాలయం ఫలహారం బండి వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలాదారుడు హనుమంతరావు, బాలీవుడ్ నటులు చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రమోద్ ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫలహారం బండి విద్యుత్ దీపాల మధ్య వివిధ వేషాధారణలు పోతరాజుల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకునే విధంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఈ పలహారం బండి ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సలహాదారుడు విహెచ్ హనుమంతరావు బాలీవుడ్ నటులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ నాయకులు ఇతరులు ఫలహారం బండి ఊరేగింపులో భారీ ఎత్తున ప్రజలు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు

నటుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆగస్టు16 న హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. నటుడు, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) కుమార్తె జనని వివాహం ఆగస్టు16 న హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అసలు బండ్ల తన కూతురు పెళ్లి ఈ రేంజ్ లో చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ పెళ్లి కోసం కదిలింది. ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ సెలబ్రిటీలతో జనని పెళ్లి వేడుక కళకళలాడిపోయింది. అయితే ఈ పెళ్లి వేడుకలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, ఆయన సతీమణి, నటి శోభిత ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహ వేదికపైకి జంటగా విచ్చేసిన నాగచైతన్య, శోభితలను బండ్ల గణేష్ ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సంప్రదాయబద్ధమైన ఎరుపు రంగు పట్టు చీర ధరించి, రాయల్ లుక్‌లో ఎంతో అందంగా మెరిసిపోయింది. ముఖ్యంగా ఆమె నుదిటి మీద కుంకుమతో మరింత అందంగా కనిపించింది. ఇక నాగచైతన్య కూడా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి, వేదికపై నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. వీరిద్దరి కెమిస్ట్రీ, క్యూట్ ప్రెజెన్స్ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది. వేదికపై బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించిన చై-శోభిత జంట, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల గణేష్.. నాగ చైతన్యను నాతో ఒక సినిమా చేయమని చెప్పమ్మా అంటూ శోభితతో మాట్లాడడం ఆకట్టుకుంది. అక్కినేని కొత్త జంట ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఈ విజువల్స్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శోభిత ట్రెడిషనల్ లుక్కు అభిమానులు, నెటిజన్లు
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. బండ్ల గణేష్ కుమార్తె జనని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటుగా.. మాజీ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సినీ నటులు చిరంజీవి, నాగార్జున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరోవైపు బండ్ల గణేష్‌కు, చంద్రబాబు కుటుంబానికి మధ్య మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వరుడు సూర్యతేజ చంద్రబాబు దంపతుల చేతుల మీదుగా తాళి అందుకుని మాంగళ్యధారణ చేయడం విశేషం. ఇక తన కుమార్తె పెళ్లికి చంద్రబాబు సతీసమేతంగా రావడంతో బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న నటుడు బ్రహ్మాజీ ఆయనను ఊరడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ సినీ, రాజకీయాలకు చెందిన వ్యక్తి కావటంతో ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.చంద్రబాబుపై అభిమానంతో బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికలోనూ ఆయన పేరు వేయించిన సంగతి తెలిసిందే. ఆహ్వాన పత్రిక పైభాగంలో శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదాలతో అని రాయించడం అప్పట్లో వైరల్ అయ్యింది. అంతేకాదు.. 2023లో చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో, ఆయన జైలు నుంచి విడుదల కావాలని, మళ్లీ సీఎం కావాలని బండ్ల గణేష్

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ హాల్లో ఆగస్టు 16న అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి సూర్యతేజతో హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ హాల్లో ఆగస్టు 16న అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ అగ్రనేతలు, టాలీవుడ్ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేకంగా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులందించారు. అలాగే తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల, అక్కినేని నాగార్జున, వెంకటేష్, చిరంజీవి దంపతులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో తన ముద్దుల కుమార్తెను సాగనంపే సమయంలో బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబు, భువనేశ్వరి వారి చేతుల మీదుగా మంగళసూత్రం వరుడుకు అందించారు. కూతురు మెడలో తాళి పడగానే.. బండ్ల ఎమోషనల్ అయ్యాడు. కూతురి పెళ్లిలో బండ్ల గణేష్ కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, ఒక తండ్రికి కూతురిని సాగనంపే క్షణం కంటే మించిన భావోద్వేగం మరొకటి ఉండదని కామెంట్లు పెడుతున్నారు. నవదంపతులకు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

సినీ నటుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఇంట్లో కళ్యాణ శోభ సంతరించుకుంది. ఆయన కుమార్తె జనని వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా, వైభవంగా నిర్వహించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన సూర్య తేజతో జనని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు నగరంలోని ముఖ్యులు, కుటుంబ సభ్యులు ఆత్మీయులు విచ్చేసి సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ వర్గాల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ శుభకార్యానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు, నటులు, నిర్మాతలు సాంకేతిక నిపుణులు విచ్చేసి బండ్ల గణేశ్ కుటుంబానికి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. హాజరైన ప్రముఖులకు, శ్రేయోభిలాషులకు బండ్ల గణేశ్ స్వయంగా ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు. వేడుకకు సంబంధించిన విశేషాలు మరియు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేశ్, రాజకీయాల్లోనూ తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు. కూతురి వివాహం అత్యంత కోలాహలంగా సాగడంతో ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన దంపతులు సూర్య తేజ - జనని దంపతులకు పలువురు నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్పోర్ట్ బంద్.. రేపటి నుంచి భోగాపురం

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె జనని వివాహం ఆదివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆమె ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన అగ్ర ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులు జనని, సూర్య తేజ వద్దకు వెళ్లి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ, బండ్ల గణేశ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తన కుమార్తె పెళ్లి వేడుకకు చంద్రబాబు సతీసమేతంగా రావడం పట్ల బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో ఏడ్చేశారు. దాంతో పక్కనే ఉన్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఆయనను ఊరడించారు. కాగా, వరుడు సూర్యతేజ సీఎం చంద్రబాబు-నారా భువనేశ్వరిల చేతులమీదుగా తాళి అందుకుని వధువు మెడలో మంగళసూత్రధారణ చేయడం విశేషం. బండ్ల గణేశ్ కు సినీ, రాజకీయ రంగాల్లో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో, ఈ వివాహ వేడుకకు ఇరు రంగాలకు చెందిన నాయకులు, నటీనటులు, నిర్మాతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారి రాకతో వివాహ ప్రాంగణం సందడిగా మారింది. అతిథులను బండ్ల గణేశ్ దంపతులు సాదరంగా ఆహ్వానించి, వారి బాగోగులు చూసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు

ఇంటర్నెట్ డెస్క్: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత వైభవంగా జరుగుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ప్రముఖుల సందడితో వివాహ ప్రాంగణం అంతా తారాతోరణాన్ని తలపిస్తూ పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అతిథులందరినీ బండ్ల గణేష్ స్వయంగా దగ్గరుండి సాదరంగా ఆహ్వానిస్తూ సత్కరించారు. సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకలో సినీ తారల రాకతో ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. నూతన దంపతులు జనని, సూర్యతేజ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న శుభవేళ వేదమంత్రోచ్ఛారణల మధ్య వివాహ క్రతువు ఘనంగా సాగుతోంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన విశేషాలు, ప్రముఖుల సందడిని వీక్షించేందుకు కింది లైవ్ వీడియో చూడండి. ఇండియాలో ఇద్దరు హీరోల వయసే వెనక్కి వెళుతోంది: త్రివిక్రమ్ పవన్, చరణ్.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. ‘ది ఇండియన్ బార్డర్’ నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ సాంగ్ విడుదల

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Puri Jagannath Temple Theme: వినాయక చవితి ఉత్సవాల్లో విశిష్ట ప్రాధాన్యం ఉన్న బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈసారి కొత్త థీమ్‌తో బాలాపూర్ గణేశ్ రూపుదిద్దుకుంటోంది. అశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండడంతో వారికి మరపురాని అనుభూతి కల్పించేందుకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ నిర్వాహకులు ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి యేడాది మాదిరి ఈ ఏడాది మరో కొత్త థీమ్‌తో వస్తున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ్ స్వామి ఆలయ రూపంలో మండపాన్ని రూపుదిద్దుతున్నారు. ప్రతి సంవత్సరం భక్తులకు వైభవంగా దర్శనమిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న బాలాపూర్ గణేష్ 2026 సంవత్సరానికి సంబంధించి కొత్తగా కనిపించనున్నారు. ఈ ఏడాది మరో అద్భుతమైన రూపంలో భక్తులను కనువిందు చేయబోతున్నారు. గతంలో అరుణాచలేశ్వర ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదాద్రి స్వర్ణగిరి ఆలయం, అయోధ్య శ్రీరామ మందిరం వంటి పుణ్యక్షేత్రాల థీమ్‌లలో మండపాన్ని రూపొందించి బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనమిచ్చింది. కొత్త కొత్త థీమ్‌లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడంతో ఈ ఏడాది కూడా మరో పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు. ఈసారి పూరీ ఆలయం రూపంలో మండపాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రతి సంవత్సరం సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ ఈ ఆలయ నమూనాలు వేస్తుండగా... ప్రతి రూపం భక్తుల్లో ఆధ్యాత్మిక భావన, భక్తి శ్రద్ధలను మరింత పెంచుతున్నాయి. ఈ ఏడాది ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్‌లో బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. జగన్నాథ స్వామి ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా బాలాపూర్ గణేశ్ మండపం రూపొందించనున్నారు. ఈ ఆలయంతో బాలాపూర్ గణేశ్ సరికొత్తగా కనిపిస్తాడని.. భక్తుల కళ్లకు పండుగలా

నటీనటులు : వాసవి గణేశన్, అన్ష్, గోవర్ధన్ రెడ్డి, రమేష్ నకిరేకంటి, అంజి తదితరులు దర్శకత్వం : భిక్షు సంగీతం : చరణ్ అర్జున్ నిర్మాత : వెంకట్ యాదవ్ సినిమాటోగ్రఫీ : రుద్ర సాయి ఎడిటింగ్ : మార్తాండ్ కే వెంకటేష్ ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన తాజా చిత్రాల్లో బోల్డ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “హుషార్ పిట్టలు” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఓ చిన్నపాటి గ్రామానికి చెందిన టీనేజర్స్ రవి (అన్ష్), చిట్టి (వాసవి గణేశన్) లలో రవి అప్పుడే పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ కి వస్తాడు. చిట్టి స్కూల్ స్టేజి లోనే ఉంటుంది కానీ ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై హద్దులు దాటి ప్రవర్తించడం మొదలు పెడతారు. కానీ వీరిపైనే పంచ ప్రాణాలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలు బాగుపడతారు. పెద్ద స్థాయికి వెళతారు అని భావిస్తారు. ఈ క్రమంలో రవి, చిట్టిలు ఏం చేశారు? తమ తల్లిదండ్రుల మాట విని మారారా లేదా? ఈ ప్రాసెస్ లో వారు తెలుసుకున్నది ఏంటి? ఈ చిత్రం ద్వారా దర్శకుడు ఇచ్చిన సందేశం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో మొదటిగా మాట్లాడుకోవాలింది మాత్రం దర్శకుడు తీసుకున్న బోల్డ్ అటెంప్ట్ కోసమే అని చెప్పాలి. తాను ఇచ్చిన సందేశం ఇందులో చాలా బాగుంది. ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎలా పాడైపోతున్నారు అనే అంశాన్ని నిక్కచ్చిగా కళ్ళకి కట్టినట్టు చూపించేసారు. పైగా దీనికి సాలిడ్ కామెడీ ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేయడం సినిమాలో బాగుంది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కొన్ని కామెడీ సీన్స్ తో పాటుగా అక్కడక్కడా ఆలోచింపజేసే సన్నివేశాలు ఇందులో యాడ్ చేయడం

అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. సినిమా రివ్యూ: హుషారు పిట్టలు (Husharu Pittalu Review) అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం ‘హుషారు పిట్టలు’. అన్ష్, వాసవి గణేషన్ జంటగా బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో విపరీతంగా బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యువతను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. మాసినపల్లి రవి (అన్ష్) చదువులో ఫస్ట్. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అదే ఊళ్లో ఉండే చిట్టి (వాసవి గణేషన్) రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, ఎట్రాక్షన్ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే! అతని చుట్టూ ఉండే బ్యాచ్‌లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పుదారిలోకి తీసుకెళ్లాడు. అతని మాటలకు, చేష్టలకు ఎట్రాక్ట్ అయిన రవి చిట్టితల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమీ ఇద్దరిని దారి తప్పి, హద్దులు దాటే దాకా తీసుకెళ్తుంది. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు (ప్రణీ రెడ్డి)కి హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో ఇరు కుటుంబాలు ఎలా స్పందించాయి. చిన్న వయసులో తెలిసీతెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి? అన్నది కథ. స్కూలింగ్ పూర్తయిన ఓ యువకుడు

Hushar Pittalu Review: అన్ష్, వాసవి గణేషన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్ పై వెంకట్ యాదవ్ నిర్మాణంలో బిక్షు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ సినిమాని ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నా మూడు రోజుల ముందు నుంచే పలు నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. రవి(అన్ష్) అప్పుడే టెన్త్ క్లాస్ అయిపోతుంది. స్కూల్ ఫస్ట్ వస్తాడు. అదే ఊళ్ళో ఉండే చిట్టి(వాసవి గణేశన్) అప్పుడే పెద్దమనిషి అవుతుంది. చిట్టి రవిని చూసి ఇష్టపడుతుంది. చక్కగా చదువుకునే రవిని బాలన్న, ఇంకొంతమంది కలిసి అడల్ట్ వీడియోలు చూపించి, అమ్మాయిలను ప్రేమించాలి అని చెప్పి చెడగొడతారు. దాంతో రవి కూడా చిట్టికి కనెక్ట్ అవుతాడు. వీళ్ళిద్దరూ తెలిసి తెలియని వయసులో హద్దులు దాటి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఏకంగా శృంగారం చేసుకునే దాకా వెళ్తారు. ఇది చిట్టి అక్క శైలు(ప్రణీ రెడ్డి)కి తెలిసి హెచ్చరించినా వినకుండా కుదిరినప్పుడల్లా అదే ప్రేమ అనుకోని శృంగారం చేసుకుంటారు. చిట్టిని ఎంతో ప్రేమగా చూసుకునే ఆమె తండ్రి(గోవర్ధన్)కి ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడు? రవి తండ్రికి ఈ విషయం తెలిసి ఏం చేస్తాడు? తెలిసి తెలియని వయసులో చేసిన శృంగారంతో వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వీళ్ళ ప్రేమ ఫలిస్తుందా లేదా? ఈ సంఘటనలతో వీళ్ళ జీవితం ఎలా మారుతుంది.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే. హుషార్ పిట్టలు అనే టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఉన్న అడల్ట్ కంటెంట్ కి టీజర్ ఒక్కసారిగా వైరల్ అయి సినిమాపై అంచనాలు పెంచడమే కాక ఇలాంటి సినిమాలు తీస్తున్నారేంటి అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ట్రైలర్ తర్వాత ఇది ఎలాంటి సినిమానో కాస్త క్లారిటీ వచ్చింది. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ కూడా బాగుండటం, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా రిలీజ్

అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘హుషార్ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెక్కెం వేణుగోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. *నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ అందరికీ నచ్చింది. ఆల్రెడీ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ టైంలో నాకు సురేష్ బాబు గారు, శిరీష్ గారు, బెక్కెం వేణు గోపాల్ గారు సహాయం చేస్తున్నారు. మేమంతా కష్టపడి సినిమాని తీశాం. మేం ఒంటరిగా పోరాడుతున్నాం. మా ఈ పోరాటంలో మీడియా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు వాళ్లందరం కలిసి చేసిన సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చెప్పిన కథను భిక్షు తెరపైకి అద్భుతంగా తీసుకు వచ్చారు. రుద్ర సాయి గారి విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. చరణ్ అర్జున్ గారు ఈ సినిమాకి ఓ పిల్లర్. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ఫైనాన్షియర్ శివకు థాంక్స్. సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. *అన్ష్ మాట్లాడుతూ* .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాతో హిట్టు కొట్టబోతోన్నా అని తొడ గొట్టి చెబుతున్నా. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు వేస్తుండేవాడిని. కృష్ణా నగర్లో జరిగిన ఓ ఆడిషన్‌కి వెళ్తే.. అక్కడ కాఫీ కప్పులు తీయించారు. కానీ నా అభిమాన హీరో చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని ముందుకు కదిలాను. కళామతల్లికి కిరీటంలా కాకపోయినా పాదాల వద్ద పుష్పాన్ని అయితే చాలని అనుకుంటున్నాను. సురేష్ బాబు గారు మాకు