
Car Catches Fire | బెంజ్ సర్కిల్ఫ్లైవోవర్పై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు.. Video
Car Catches Fire | బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్‌పై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు.. Video

Car Catches Fire | బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్‌పై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు.. Video

Fire Accident | పెళ్లి పార్టీలో అగ్నిప్రమాదం.. 22 మంది దుర్మరణం

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు... ముంబై, సెప్టెంబరు 2: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని.. గత ఆరేళ్లుగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా ఎలా పరిగణిస్తారని పోలీసులను ప్రశ్నించింది. వారి దర్యాప్తు తీరు చూస్తుంటే సమాధానాల కన్నా ఎక్కువ సందేహాలే వ్యక్తమవుతున్నాయని ఆక్షేపించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరమని పేర్కొంటూ 44 పేజీల తీర్పును వెలువరించింది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్‌లో ఓ నివాస భవనం పైనుంచి పడి దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ తర్వాత వారం రోజులకే సుశాంత్‌సింగ్ తన ఇంట్లో మరణించడంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదో సంబంధం ఉందంటూ తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారంటూ కోర్టును ఆశ్రయించిన సతీశ్ సాలియాన్.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలోనే సతీశ్ సాలియాన్ వాంగూల్మాన్ని నమోదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ram Mandir CEO: అయోధ్య రామమందిర్ ట్రస్టు బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత వైమానిక దళంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పశ్చిమ వైమానిక కమాండ్‌కు నాయకత్వం వహించిన అధికారిగా ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. 1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలట్‌గా భారత వైమానిక దళంలో చేరిన జితేంద్ర మిశ్రా.. తన సుదీర్ఘ కెరీర్లో 3,000 గంటలకు పైగా విమానాలు నడిపారు. ఫైటర్ కంబాట్ లీడర్‌గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా సేవలందించారు. బెంగళూరులోని ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో చీఫ్ టెస్ట్ పైలట్‌గా పనిచేశారు. ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్‌గా, రెండు కీలక వైమానిక స్థావరాలకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌లోనూ కీలక పదవుల్లో పనిచేశారు. అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో ఉన్నత స్థాయి రక్షణ శిక్షణ పొందారు. 2025 జనవరి 1న వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌తో సరిహద్దు ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక వసతులపై దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. దాదాపు నాలుగు

అల్లరి నరేష్ కామెడీ సినిమాలకు కేరాఫ్. ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలు చేసి మెప్పించారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు సెలక్టీవ్‌గా వెళ్తున్నాడు. ఏడాదికి ఒక్క మూవీ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదే సమయంలో ఆయన యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్స్ ప్రారంభంలో విజయం సాధించాయి. కానీ ఆ తర్వాత అవి కూడా వర్కౌట్ కావడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జోనర్ మార్చాడు. మళ్లీ తన కామెడీ జోన్లోకి వచ్చాడు. అందులో భాగంగా `రంభ ఊర్వశి మేనక` చిత్రంలో నటించాడు. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, నరేష్ వీకే ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 4న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. కామెడీ ప్రధానంగా సాగాయి. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఇది సెన్సార్ పూర్తి చేసుకుంది. అలాగే ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ బయటకు వచ్చింది. దీని బట్టి చూస్తే మూవీ ఎలా ఉందంటే? సినిమా బేసిక్ లైన్ ఏంటనేది చూస్తే, వీకే నరేష్, అల్లరి నరేష్ తండ్రీకొడుకులు. వీరికి వంశ పారంపర్యంగా ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది. దానిపై సరైన విధంగా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి మేనకలు వస్తారు, కోరిన కోరికలు తీరుస్తారు అని నరేష్‌కి వీకే నరేష్ చెబుతారు. నరేష్‌కి హీరో కావాలనే కోరిక ఉంటుంది. అందుకోసం 25ఏళ్లుగా ముగ్గులు వేస్తూనే ఉంటాడు. కానీ రంభ(రాశి సింగ్), ఊర్వశి(విష్ణుప్రియ), మేనక(ప్రిషా సింగ్) రారు. ఎట్టకేలకు నరేష్ ప్రయత్నం ఫలిస్తుంది. ముగ్గురు దేవకన్యలు వస్తారు. మరి హీరో అవ్వాలనే

Sachin vs Virat: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వీరిద్దరి వన్డే కెరీర్ తొలి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకరు సెంచరీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తే, మరొకరు సెంచరీల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశారు. ఆశ్చర్యకరంగా తన మొదటి మ్యాచ్‌లో సచిన్ డకౌట్‌గా వెనుతిరిగారు. ఆ తర్వాత నుంచి ఏకంగా ఐదేళ్ల పాటు అంటే 1989, 1990, 1991, 1992, 1993 సంవత్సరాల్లో ఒక్క వన్డే సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. మూడంకెల స్కోరు సాధించడానికి సచిన్ చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. సచిన్ తన వన్డే కెరీర్‌లోని 76వ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ సాధించి సెంచరీల ఖాతాను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా సచిన్ రికార్డుల వేట మొదలుపెట్టారు. తన కెరీర్ పూర్తయ్యే సమయానికి వన్డేల్లో ఏకంగా 49 సెంచరీలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. సచిన్ వన్డే కెరీర్ తొలి ఐదేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోతే, విరాట్ కోహ్లీ మాత్రం అదే సమయంలో విధ్వంసం సృష్టించాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ తన తొలి ఐదేళ్లలోనే ఏకంగా 13 వన్డే సెంచరీలు బాదేశాడు. తొలి ఏడాది 2008లో సెంచరీ చేయకపోయినప్పటికీ 2009లో ఒకటి, 2010లో మూడు, 2011లో నాలుగు, 2012 నాటికి ఐదు సెంచరీలు సాధించి రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు. సచిన్ నెలకొల్పిన 49 వన్డే సెంచరీల రికార్డు సుమారు 11 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2023 నవంబర్‌లో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ సినిమాలో జంటగా నటించారు. రేపు(సెప్టెంబర్ 3) థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ, ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో, ఇక్కడి యాసతో సాగే ఒక ఫ్రెష్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. కథలో హీరో అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన ఫ్రెండ్స్‌తో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక డేటింగ్ యాప్ స్టార్టప్‌ను ప్రారంభిస్తాడు. అయితే ఈ డేటింగ్ యాప్ బిజినెస్ ద్వారా చెన్నైకి చెందిన అమ్మాయి (అనంతిక)తో అతను ఎలా కనెక్ట్ అయ్యాడు? ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ రొమాన్స్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తల్లిదండ్రులు మెచ్చేలా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి UA16+ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు.ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఎంతో గ్రిప్పింగ్‌గా 2 గంటల 22 నిమిషాలు (142 నిమిషాలు) రన్టైమ్తో ఫిక్స్ చేశారు. సుమంత్ ప్రభాస్ - అనంతిక మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ మ్యూజిక్, అద్భుతమైన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాబోతున్నాయి. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారట. జెన్-జీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా ఫ్యామిలీస్‌ను కూడా మెప్పించేలా ఉన్న ఈ 'రోమాంచకం' థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి. 'వండర్ వుమెన్' గాల్ గాడోట్ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి!

కన్నడ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక భారీ తీపి కబురు అందడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రత్యేకమైన వేడుకను పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్రం దేవరాయ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. చిత్రబృందం ఈ సర్ప్రైజ్ ప్రకటించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక దృశ్యమాధ్యమాల్లో ఈ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో కిచ్చా సుదీప్ కనిపించిన తీరు మరియు ఆయన గెటప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సుదీప్ తనదైన ముద్రతో దేవరాయ పాత్రలో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పోస్టర్లో చూపించిన ప్రతి అంశం కూడా కథలోని తీవ్రతను, సినిమాలో ఉండబోయే భారీ యాక్షన్ ఘట్టాలను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ విజువల్స్ సినీ విమర్శకులను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ విడుదలై క్షణాల్లోనే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సుదీప్‌కు సామాజిక వేదికల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితంగా దేవరాయ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాకు సంబంధించిన తదుపరి తాజా వివరాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముందుముందు ఈ చిత్రం నుంచి మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయని చిత్రబృందం సంకేతాలు ఇచ్చింది. దేవరాయ చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీప్ కెరీర్లోనే ఇది ఒక ప్రత్యేకమైన మరియు విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచిపోతుందని నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. కథనంలో ఉన్న కొత్తదనం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో దేవరాయ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు

Devaraaya: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవరాయ’ నుంచి కీలకమైన అప్డేట్ను విడుదల చేశారు. ఈ సినిమాలో సుదీప్ శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘చరిత్రను మార్చిన సామ్రాజ్యం.. ఒక శకాన్ని నిర్వచించిన మహారాజు.. కాలాన్ని దాటి నిలిచిపోయే ఓ దిగ్గజం’ అంటూ ‘దేవరాయ’ను మేకర్స్ పరిచయం చేశారు. అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌ను శ్రీకృష్ణదేవరాయల పాత్రలో చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు భారత చరిత్రలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి చారిత్రక పాత్రలో సుదీప్ కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. విడుదల చేసిన గ్లింప్స్‌లో సుదీప్ లుక్ రాజసం, గంభీరతతో ఆకట్టుకునేలా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సుప్రియాన్వి పిక్చర్ స్టూడియో బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్లో థియేటర్లలోకి రానుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు సుదీప్ మాస్, యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల వంటి చారిత్రక పాత్రలో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సుదీప్ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి పేర్కొన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి (Rana Daggubati) పేర్కొన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి సినిమాలు ఎంచుకునే ప్రేక్షకులు, ఇప్పుడు దర్శకుడి పేరు చూసి థియేటర్లకు వెళ్లే స్థాయికి చేరుకున్నారని అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రానా.. నేటి ప్రేక్షకులు కేవలం హీరోల అభిమానులుగా కాకుండా, మంచి కథలు చెప్పే దర్శకుల అభిమానులుగా మారుతున్నారని చెప్పారు. రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం సినిమా విజయంలో హీరోతో పాటు దర్శకుడి విజన్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని రానా అభిప్రాయపడ్డారు. ఒక దర్శకుడి గత చిత్రాల కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు కొత్త సినిమాలకు వెళ్లడం పెరిగిందన్నారు. అందుకే దర్శకుల పేర్లు ఇప్పుడు బ్రాండ్లుగా మారుతున్నాయని చెప్పారు. పాన్ ఇండియా సినిమాల విజయాలు కూడా ఈ మార్పుకు ప్రధాన కారణమని అన్నారు. భాషల సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త కథలు, ప్రత్యేకమైన మేకింగ్ అవసరమనే అవగాహన పెరిగిందని చెప్పారు
Ayodhya Ram Temple First CEO 2026 : దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయోధ్య రామాలయ పరిపాలన పరిధిలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోనుంది. ఆలయ నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే దిశగా రామాలయ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎవరనే విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం అధికారికంగా వెల్లడించనుంది. ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ నివాసంలో మధ్యాహ్నం నుంచి నిర్వహించే ముఖ్యమైన సమావేశంలో సీఈవో ఎంపిక కమిటీ తమ తుది నివేదికను సమర్పించనుంది.5,500కి పైగా దరఖాస్తులు.. ముగ్గురి పేర్లతో తుది జాబితా!ఆలయ తొలి సీఈవో స్థానం కోసం ఏకంగా 5,585 దరఖాస్తులు అందినట్లు నిపుణుల కమిటీ తెలిపింది. ఈ భారీ సంఖ్యలోని అభ్యర్థుల అర్హతలను నిశితంగా పరిశీలించిన ఎంపిక కమిటీ.. చివరి దశకు చేరుకున్న 16 మంది అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించింది. రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ, రిటైర్డ్ ఎల్జీ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణులైన సురేష్ హావ్డేలతో కూడిన ఈ ప్రత్యేక కమిటీ సభ్యులు ఇప్పటికే అయోధ్యకు చేరుకుని సమావేశానికి సిద్ధమయ్యారు. వీరు ప్రతిపాదించిన ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్‌లిస్ట్ నుంచి ఒకరి పేరును ట్రస్టు తుది నిర్ణయంగా ఖరారు చేయనుంది.రాజీనామాలు, ఖాళీల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ..!ఇటీవల కాలంలో అయోధ్య రామాలయంలో భక్తులు అందించే కానుకలు, విరాళాల చోరీకి సంబంధించి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. మరోవైపు ట్రస్టు సభ్యుడిగా సుదీర్ఘ సేవలు అందించిన విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర అకాల మరణం చెందారు. ఇలా ఒకేసారి ఏర్పడిన మూడు కీలక పదవుల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ట్రస్టు ప్రధాన కార్యదర్శి, ఇద్దరు నూతన సభ్యుల పేర్లను కూడా ఈ సమావేశంలో స్పష్టం చేయనున్నారు.ముందువరుసలో జగదీశ్ ఆఫ్లే పేరుట్రస్టు తొలి

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాట ‘సబ్కో’ నేడు విడుదలైంది. ఇప్పటికే సినిమాపై, ఆల్బమ్‌లోని పాటలపై మంచి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ పాట మరింత ఉత్సాహభరితమైన మ్యూజికల్ ఫ్లేవర్‌ను అందిస్తోంది. అత్యంత ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ‘సబ్కో’ పాటను సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ ఆలపించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఆకట్టుకునే స్వరకల్పన పాటకు ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వైబ్‌ను తీసుకొచ్చింది. ఈ పాటకు శ్రీ హర్ష ఇమాని సాహిత్యం అందించారు. గుంటూరులోని VVIT కాలేజీలో విద్యార్థుల ఉత్సాహభరిత సమక్షంలో ‘సబ్కో’ పాటను విడుదల చేశారు. విద్యార్థుల సందడి, ఉత్సాహంతో పాట లాంచ్ కార్యక్రమం ఎంతో జోష్‌గా, ప్రత్యేకంగా జరిగింది. ఇప్పటికే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తుండగా, తాజాగా విడుదలైన ‘సబ్కో’ పాట ఆ క్రేజ్‌ను మరింత పెంచుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కాలేజీలు, నగరాలను సందర్శిస్తూ విద్యార్థులతో ప్రత్యేకంగా మమేకమవుతున్నారు. మరోవైపు వరుసగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు. చిత్ర బృందం చేస్తున్న ఈ విస్తృత ప్రచారం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై మరింత ఆసక్తిని పెంచుతోంది. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది

భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఆమె ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. IAFలో చేరిక: జూన్ 18, 1994న భారత వైమానిక దళానికి చెందిన ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆమె అధికారిణిగా విధుల్లో చేరారు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె ట్రైనింగ్ సెంటర్లు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యా రంగానికి ప్రాధాన్యం: ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీలలో డిఫెన్స్ సహకారాన్ని పెంచేలా 'IAF చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడంలో శక్తి శర్మ ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాదు, సైనిక దళాల (Tri-services) చరిత్రలోనే ఒక సైనిక స్కూల్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా (కపూర్తలా సైనిక స్కూల్ ప్రిన్సిపాల్‌గా) వ్యవహరించిన తొలి మహిళా అధికారిణిగా కూడా ఆమె రికార్డు సాధించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంతో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సాధించిన ఈ ఘనత సాయుధ దళాల్లోని భావి మహిళా అధికారులకు స్ఫూర్తిదాయకం. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

Priya Adhikari : నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహించని విపత్తు కారణంగా మృతుల సంఖ్య వెయ్యికిపైగా చేరింది.. వేలాది మంది ఆచూకీ గల్లంతు కాగా.. ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో భాగంగా ఓ మహిళా పైలట్ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమెనే.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ప్రియా అధికారి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె నేతృత్వంలో ఆరు రోజుల్లోనే సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం విశేషం. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, మట్టికొండలు విరిగిపడటంతో నేపాల్‌లో అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రహదారులు, వంతెనలు ధ్వంసం కావడంతో కొన్ని ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవడం కష్టంగా మారింది. దీంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆమె సారథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లు చేస్తూ.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి సురక్షితంగా ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాక.. సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నవారికి అత్యవసర సహాయ సామగ్రిని చేరవేయడం వంటి కార్యకలాపాల్లో ఆమె ముందుండి పనిచేస్తున్నారు. నేపాల్‌లోని వరద ప్రభావిత రుసువా జిల్లాలోని తైమూర్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడి బాధితులను రక్షించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఆ ఆపరేషన్లలో ప్రియా అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సవాళ్ల నడుమ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ఒక్కోసారి ఐదారు హెలికాప్టర్లు ఒకేచోట దిగుతున్నాయి. బాధితులను తరలించడానికి రేడియో ద్వారా సమన్వయం చేసుకుంటున్నాం. భారీగా బురద ఉన్న ప్రాంతంలో చాపర్లు దిగడం కష్టంగా మారుతోంది. దీంతో బాధితులను ఎక్కించడం ప్రమాదంతో కూడుకున్న పని.. ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు పైలట్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్‌తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

Epic : శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎపిక్. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సబ్కో.. అంటూ సాగే లిరికల్ పాటను విడుదల చేసారు. ఈ పాటను హేశం అబ్దుల్ వహద్ సంగీత దర్శకత్వంలో శ్రీ హర్ష ఈమని రాయగా సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ పాడారు. ఈ సాంగ్ లండన్ కి వెళ్లి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మధ్య ఫ్రెండ్షిప్, ప్రేమ నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ ఎపిక్ సినిమా సాంగ్ వినేయండి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఆమె సరికొత్త అవతారంలో అలరించడానికి సిద్ధమయ్యారు. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మైసా విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు రష్మిక స్వయంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఫస్ట్ లుక్ పంచుకుంటూ మైసా పాత్రలోని తీవ్రతను, ఆక్రోశాన్ని అభిమానులతో పంచుకున్నారు. గోండు తెగల నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక తీవ్రమైన, రఫ్ అండ్ రా వారియర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆమె ఫేస్‌పై రక్తం, వైల్డ్ హెయిర్, చేతిలో ఈటె పట్టుకుని కనిపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో ఆమె పోషించిన గ్లామరస్ లేదా సాఫ్ట్ రోల్స్‌తో పోలిస్తే ఇది అత్యంత సాహసోపేతమైన పాత్ర అని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ గెటప్ కోసం ఆమె పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యారు. ఈ చిత్రంలో అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచేది నీటి అడుగున జరిగే పోరాట ఘట్టం. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఒక కథానాయిక ఆధ్వర్యంలో ఇటువంటి అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సాహసోపేతమైన యాక్షన్ సీన్ కోసం రష్మిక స్వయంగా దాదాపు 20 గంటల పాటు నీటి అడుగున శ్రమించారు. ఎలాంటి డూప్ లేకుండా ఆమె చేసిన ఈ విన్యాసాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేయడం ఖాయమని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. అన్ ఫార్ములా ఫిల్మ్స్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రానికి జేక్స్ బిజోయ్ అద్భుతమైన

నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన 116 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ రాష్ట్రాల్లో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆందోళనలు విరమిస్తే వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ఇచ్చిన హామీని ఆయా రాష్ట్రాలు తమ పిటిషన్లలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ నెల 5న ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు వేగంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fake Currency: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అన్న సామెత నిజం అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ సామెత నిజం అవుతోందా…? అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే యూపీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత కలిగిన కరెన్సీ వాల్ట్ నుంచి రూ. 7.4 కోట్ల విలువైన అసలైన కరెన్సీని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో ఈ భారీ అక్రమం చోటుచేసుకుంది. అత్యంత భద్రత కలిగిన వాల్ట్ నుంచి సుమారు రూ. 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుర్తించడంతో అసలు వివాదం మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రూ. 4.36 లక్షల వ్యత్యాసంతో బయటపడ్డ కుంభకోణం… పీఎన్బీ చీఫ్ డిప్యూటీ మేనేజర్ నిషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 10న బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిన నగదు రెమిటెన్స్‌లో రూ. 4.36 లక్షల కొరత కనిపించింది. ఈ తేడాపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించగా, కరెన్సీ వాల్ట్‌లో భారీ ఎత్తున నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై నిషా సింగ్ మాట్లాడుతూ, విచారణ వేగవంతం చేశాం. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం. నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. 'సిట్' ఏర్పాటు పీఎన్బీ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్‌లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వెంటనే రద్దు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్, కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం గళమెత్తుతున్న రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలను నిలదీసే ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, చట్టాలను దుర్వినియోగం చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వ వైఖరిని మార్చుకుని ఎఫ్ఐఆర్ను రద్దు చేయకపోతే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం టౌన్ అధ్యక్షుడు కిశోర్ నాయక్, మున్సిపాలిటీ చైర్పర్సన్ కోకపర్తి అనిత, వైస్ చైర్మన్ నవీన్, వివిధ విభాగాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు

కర్నూలు జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. కర్నూలు, సెప్టెంబర్ 1: జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని తెలిపారు. 67 ఏళ్ల అశోక్‌కు లివర్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, అలాగే 26 ఏళ్ల షేక్ జబీ ఉల్లాకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారని అన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య బృందం సమన్వయంతో శస్త్రచికిత్సలు పూర్తైనట్లు వెల్లడించారు. దాదాపు 20 గంటల పాటు శ్రమించి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారని మంత్రి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే జరిగే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు కర్నూలులో జరగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కర్నూలులో ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం వైద్య రంగంలో కీలక ముందడుగుగా అభివర్ణించారు. రాయలసీమలో ఇలాంటి అత్యాధునిక, క్లిష్టమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా ఉన్నారని... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని టీజీ భరత్ అన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, నిపుణులైన వైద్య బృందం కృషి అభినందనీయమన్నారు. గౌరిగోపాల్ హాస్పిటల్, టీఎక్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి అవయవాలు దానం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. అవయవ దానం ద్వారా మరికొందరికి కొత్త జీవితాన్ని అందించడం గొప్ప మానవతా సేవగా చెప్పుకొచ్చారు. కర్నూలులోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా మంత్రి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

Kankipadu: కంకిపాడులో పోలీసుల కాల్పుల కలకలం క్లూస్ టీమ్ విస్తృత తనిఖీలు ఈ వార్తకు సంబంధించిన

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‌పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్‌పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

Vaibhav Sooryavanshi Misses Youngest Century Record: భారత దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ తన ఆటతో ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దులీప్ ట్రోఫీ 2024లో చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి శతకం సాధించే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు మరోసారి త్రుటిలో చేజార్చుకున్నాడు. ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో, 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్ జోన్‌తో మొదలైన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ అదరిపోయే ఆరంభం ఇచ్చారు. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తూ, తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీకి చేరువయ్యాడు. అభిమానులందరూ అతడు శతకం పూర్తి చేయాలని ఆతృతగా ఎదురుచూస్తుండగా, 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్ష్ దుబే బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి గాల్లోకి లేవగా, డీప్ మిడ్ వికెట్ వద్ద

అందరూ ఫౌజీ, విశ్వంభర, టాక్సిక్ అంటూ బడా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే రెండు నెలల్లో చాలా క్యూట్ క్యూట్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాల్లో మిడ్ రేంజ్ హీరోలుంటే.. మరికొన్నింట్లో చిన్న హీరోలే ఉన్నారు. కానీ ఆ సినిమాలన్ని పెద్ద బ్యానర్స్ నుంచే రాబోతున్నాయి. మరి ఆ ప్రేమకథలపై ఓ లుక్కేద్దామా..? ఎపిక్: ది ఫస్ట్ సెమిస్టర్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోయే ఈ క్యూట్ లవ్ స్టోరీలో బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఎపిక్పై మంచి ఆసక్తే ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న రానుంది. అలాగే ఇదే బ్యానర్ నుంచి వస్తున్న మరో క్యూట్ ప్రేమకథ వీసా. గల్లా అశోక్, గౌరీ ప్రియా నటిస్తున్న ఈ సినిమాను ఉద్భవ్ తెరకెక్కిస్తున్నారు. వీసా అంటే వింటారా సరదాగా అని అర్థం.. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదల కానుంది వీసా. అలాగే ఇదే సీజన్లో రానున్న మరో క్యూట్ లవ్ స్టోరీ రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. కథ నచ్చి ఈ సినిమాను నిర్మిస్తున్నారు సందీప్ వంగా. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాదు.. అల్లరి నరేష్ కామెడీ ఎంటర్టైనర్ రంభ ఊర్వశి మేనక సెప్టెంబర్ 4న విడుదల కానుంది. దాంతో పాటే మహేంద్రగిరి వారాహి, సిగ్మా, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇదే సీజన్లో వస్తున్నాయి. పాన్,ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా? క్షణాల్లో రంగంలోకి సైబర్ నేరగాళ్లు.. రెప్పపాటులో బ్యాంకు ఖాతాలు గుల్ల బయటకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో రూపొందుతున్న సరికొత్త ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో రూపొందుతున్న సరికొత్త ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘ముగ్గురు కోతులు’ (Mugguru Kothulu). శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో నవ దర్శకుడు కార్తీక్ గరిమెల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ ఫస్ట్ లుక్ (First Look) పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో టైటిల్‌కు తగ్గట్టుగానే ముగ్గురు కుర్రాళ్లు రకరకాల ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ దర్శనమిచ్చారు. పోస్టర్ డిజైన్ చూస్తుంటేనే ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే హిలేరియస్ యూత్‌ఫుల్ కామెడీతో రాబోతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట మంచి బజ్‌ను క్రియేట్ చేయడంతో పాటు ప్రేక్షకుల్లో సినిమా కాన్సెప్ట్‌పై సరికొత్త క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎస్. సుహాస్ సంగీతం అందిస్తుండగా, రాజ్ నోముల సినిమాటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే కథ, కథనాలతో నేటి యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో టీజర్, పాటలతో పాటు మరిన్ని ఆసక్తికర ప్రమోషనల్ అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నామని ఈ

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తాయిమామన్ తంగ మోతిరం పథకం టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యువెలరీస్ ఎంపిక అయ్యాయి. 755 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్లు ఇవి. బంగారం ఉంగరాన్ని తయారు చేయడం, రవాణా, ఇతరత్రా ఖర్చులను ఆ సంస్థలే భరించాల్సి ఉంటుంది.ఈ పథకం కింద తమిళనాడులోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే సుమారు 4.42 లక్షల మంది నవజాతా శిశువులకు ఒక్కో గ్రాము చొప్పున బంగారు ఉంగరాలను బహూకరిస్తారు. ఈ పథకానికి సంబంధించిన బంగారపు వ్యయాన్ని మార్కెట్ ధరల ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచేందుకు విజయ్ ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోన్నారు.దీనికోసం తమిళనాడు మెడికల్ సర్వీసెస్ జూలై 14న దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. అధికారిక టెండర్ల పోర్టల్ ద్వారా జోయ్ ఆలుక్కాస్, కల్యాణ్ జ్యవెలరీస్, జీఆర్టీ జ్యువెలర్స్, ఉమ్మిడి జ్యువెలర్స్ వంటి మొత్తం 11 జ్యువెలరీ సంస్థలు ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. బిడ్డింగ్ దాఖలు చేశాయి. ఆయా సంస్థల్లో అన్నింటికంటే తక్కువ ధరను కోట్ చేశాయి.. జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్.ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎందీంతో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసింది. 70:30 నిష్పత్తిలో బంగారు ఉంగరాల తయారీ, సరఫరా బాధ్యతలను అప్పగిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జాయ్ ఆలుక్కాస్ అతి తక్కువ బిడ్డింగ్ నమోదు చేసింది. ఒకే ఒక్క పైసా సర్వీస్ ఛార్జీని మాత్రమే కోట్ చేస్తూ ఈ టెండర్‌ను దక్కించుకుంది. బంగారం ధర తప్ప.. ఉంగరం మేకింగ్ ఛార్జీలు, రవాణా, ఇన్సూరెన్స్, హాల్ మార్కింగ్, సర్వీస్ ఛార్జీలు.. అన్నింటికీ కలిపి ఒకే ఒక్క పైసా కోట్ చేసి టెండర్ దక్కించుకుంది జాయ్ అలుక్కాస్.సీఎం విజయ్ బిగ్

Jalaj Saxena Stats: దేశవాళీ క్రికెట్లో అసాధారణ రికార్డులు నెలకొల్పి, పరుగుల వరదతో పాటు వికెట్ల పంట పండించినా కొందరు ఆటగాళ్లకు జాతీయ జట్టు తలుపులు తెరుచుకోవు. రంజీ ట్రోఫీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఆల్‌రౌండ్ విన్యాసాలు ప్రదర్శించిన ఓ ప్లేయర్ భారత టెస్టు జట్టులో కనీసం ఒక్కసారైనా చోటు దక్కించుకోలేకపోవడం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భారత రెడ్ బాల్ క్రికెట్ సర్క్యూట్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన జలజ్ సక్సేనా, రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ సాధించని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్లో 6000 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 400 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఏకైక ఆటగాడిగా ఆయన ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. మైదానంలో నిలకడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేయడమే కాకుండా, తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విడదీస్తూ ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ఇలాంటి ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉన్న ఆటగాడు మరే ఇతర దేశంలో ఉన్నా సులువుగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేవాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మైలురాళ్లు.. 500 వికెట్లు, 14 సెంచరీలు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జలజ్ సక్సేనా నమోదు చేసిన గణాంకాలు ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. తన సుదీర్ఘ రెడ్ బాల్ కెరీర్లో మొత్తం 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 33.75 సగటుతో ఏకంగా 7224 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. బౌలింగ్ విభాగంలోనూ ఆయన అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 25.45 సగటుతో 512 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు చికిత్స కోసం బారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలింపు ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలింపు సగయింగ్ రీజియన్‌లోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైన్యం వైమానిక దాడి ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న 14 మంది మృతి, 20 మందికి గాయాలు

గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. పెల్లెట్‌గన్ దాడిలో గాయపడిన విద్యార్థికి అండగా ప్రతిపక్ష నేత నిరసన న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. సదరు ఘటన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాలని 19 ఏళ్ల వయసున్న విద్యార్థి సాహిల్ లోచబ్, అతని తల్లి ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పటికీ.. పోలీసులు నమోదు చేయకపోవటంతో ఆ విషయాన్ని వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారితో కలిసి రాహుల్ శుక్రవారం.. మందిర్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పెల్లెట్‌గన్ దాడిలో లోచబ్ కంటికి మూడు పెల్లెట్లు తగిలాయని, దాదాపు 200 పెల్లెట్లు అతడి శరీరంలోకి వెళ్లాయని, గుండెకు దగ్గరగా ఉన్న కొన్ని పెల్లెట్లను తీస్తే ప్రమాదం అని వైద్యులు వాటిని తీయలేదని, ప్రస్తుతం అతడు కంటి చూపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడని తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించటంతో రాహుల్ తదితరులు పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఢిల్లీ డీసీపీ సచిన్శర్మను కలిశారు. ఆయన కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించకపోవటంతో.. రాహుల్ పోలీసు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పైనుంచి ఆదేశాలు రావటం వల్లే, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని రాహుల్ విలేకరులకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకూ కదిలేది లేదని, అవసరమైతే ఆరు నెలలపాటైనా ధర్నాలోనే కూర్చుంటానని ప్రకటించారు. లోచబ్ కంట్లో మూడు పెల్లెట్లు పడ్డాయని ఆయనకు శస్త్రచికిత్స జరిపిన ఆస్పత్రి ఇచ్చిన నివేదికను ప్రదర్శించారు. లోచబ్ శరీరం నుంచి వైద్యులు తొలగించిన కొన్ని

గత నెల 20న ఢిల్లీలో నీట్ అక్రమాలపై విద్యార్ధులు నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు చేసిన పెల్లెట్ల ప్రయోగంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ ఏకంగా సాహిల్ అనే ఓ బాధితుడిని తీసుకుని పోలీసు స్టేషన్ కు వచ్చేశారు. ఉన్నట్లుండి ఇవాళ ఉదయం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు సాహిల్, అతని తల్లితో కలిసి వచ్చిన రాహుల్ గాంధీ.. పోలీసుల్ని బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కానీ పోలీసులు ఒప్పుకోలేదు.ఢిల్లీ నిరసనల బాధితుడితో నేరుగా స్టేషన్ కు రాహుల్..! షాకైన పోలీసులు..!దీంతో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని కూడా పిలిపించుకుని పోలీసు స్టేషన్ బయట బైఠాయించారు. దీంతో కేంద్రంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పని పరిస్ధితి ఎదురైంది. అయినా సాయంత్రం వరకూ దీనిపై స్పందించకుండా ఉన్నతాధికారుల్ని సంప్రదిస్తూనే ఉన్న పోలీసులు.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించారు. అనంతరం బాధితుడు సాహిల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, వెంటనే ఆ కాపీని రాహుల్ గాంధీ చేతికి అందించారు. పోలీసు స్టేషన్లో రాహుల్, ప్రియాంక మెరుపు ధర్నా- పెల్లెట్ల ప్రయోగంపై FIRకు పట్టు..!దీంతో రోజంతా పోలీసు స్టేషన్ లోనే ఈ ఎఫ్ఐఆర్ కోసం నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పెల్లెట్ల ప్రయోగమే చేయలేదని ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు.. ఇవాళ అందుకు కావాల్సిన ఆధారాలను, బాధితుడి మెడికల్ రిపోర్టులను, చివరికి పెల్లెట్లను కూడా పోలీసులకు అందజేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదు. దీంతో పెల్లెట్ల ప్రయోగంలో గాయాల పాలైన ఇతర విద్యార్ధులు కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ల నమోదు కోరబోతున్నారు. తనపై జరిగిన పెల్లెట్ల ప్రయోగం తర్వాత కంటి చూపు కోల్పోయిన సాహిల్.. తన ఆరోగ్యంపై ఆరా తీసేందుకు నిన్న ఫోన్
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'జైలర్ 2'. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వదల్లేదు. అప్పుడెప్పుడో వచ్చిన అనౌన్స్ మెంట్ టీజర్, ఇటీవల వచ్చిన రిలీజ్ డేట్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేయడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.'జైలర్ 2' నుంచి ''అలా బోలేలో'' అంటూ సాగే పాటను ఫస్ట్ సింగిల్ గా లాంచ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ ఈ డ్యాన్స్ నంబర్ కి ట్యూన్ చేయడమే కాదు, హుషారుగా ఆలపించారు. తెలుగు వెర్షన్ కి శ్రీనివాస మౌళి లిరిక్స్ రాశారు. ఈ పాట వినడానికి మలయాళం, తమిళం, తెలుగు మిక్స్ చేసినట్లుగా ఉంది. చూడ్డానికి కూడా బాగుంది. ఇందులో నటి పూర్ణ తన డ్యాన్సులతో సర్ప్రైజ్ చేశారు. మాస్, క్లాసికల్ మిక్స్ చేసి ఆమె వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.'గుంటూరు కారం' సినిమాలో పూర్ణ డ్యాన్స్ చేసిన 'కుర్చీ మడతపెట్టి' పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు 'అలా బోలేలో' సాంగ్ కూడా ఆమెకు అంతే పేరు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. లిరికల్ వీడియోలో రజనీకాంత్ డ్యాన్స్ చేసినట్టుగా చూపించలేదు. 'జైలర్'లో తమన్నా చేసిన 'కావాలయ్యా' పాట ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గ నిలిచిందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'జైలర్ 2'లో 'అలా బోలేలో' ఏ మేరకు వైరల్ అవుతుందో చూడాలి.'జైలర్ 2' చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయదశమి పండగ సందర్భంగా 2026 అక్టోబర్ 15న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు

భోగి సినిమా బృందం నటి డింపుల్ హయాతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ డింపుల్ హయాతి ఈ సినిమాలో ఒక కొత్త అవతార్‌లో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వెండితెరపై ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో డింపుల్ హయాతి మందారం అనే కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆమె ఫైరీ రెడ్ సారీ ధరించి చాలా బోల్డ్‌గా మరియు ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. ఆమె లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న భోగి సినిమాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా డింపుల్ హయాతి గ్లామరస్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. డింపుల్ హయాతి పుట్టినరోజును పురస్కరించుకుని స్కైసి మీడియా ప్రతినిధులు కూడా ఆమెకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితంగా ఆమె అభిమానులు మరియు నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విష్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భోగి చిత్రంలో ఆమె నటన మరియు లుక్ ఏ స్థాయిలో అలరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించింది. వచ్చే ఆగస్టు 28న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేలా దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భోగి సినిమాతో డింపుల్ హయాతి కెరీర్‌కు మంచి

సినిమా పేరు: ఇరుముడి -నటీనటులు:రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, శ్వాసిక విజయ్, అజయ్ ఘోష్ తదితరులు -సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ -ఎడిటింగ్: ప్రవీణ్ పూడి -మ్యూజిక్: జివి ప్రకాష్ కుమార్ -నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి -బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ -రచన,దర్శకత్వం: శివ నిర్వాణ -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026 మాస్ మహారాజా రవితేజ ఈ రోజు ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి 'ఇరుముడి' తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఇరుముడి ఎలా ఉందో చూద్దాం. త్రినాధ్( రవితేజ) ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఉండే పొల్లూరు అనే విలేజ్ కి చెందిన వ్యక్తి. ట్రాలీ ఆటోలో తన పొలంలోనే పండించిన అరటిగెలలని తన ఊరు పక్కన ఉండే టౌన్ లో అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నా మంచి వ్యక్తి. అయ్యప్పస్వామి దీక్ష తీసుకునే టైంలో మాత్రం ఆల్కహాల్ జోలికి వెళ్ళడు. ఆడవాళ్ళ అందర్నీ తన కూతురుగా భావించడంతో పాటు చెడుని అంతం చేయడం త్రినాధ్ నైజం. భార్య పేరు కావేరి. కూతురుపేరు మణికంఠ. తొమ్మిదేళ్ల వయసు ఉన్న మణికంఠ ఐదవ క్లాస్ చదువుతుంటుంది. ఏవైనా చెడు సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు చూసినా తండ్రికి చెప్పడం అలవాటు. ఆ విధంగా చెప్పడం చిన్నప్పట్నుంచి తండ్రి, కూతురు మధ్య ఉన్న ఒప్పందం కూడా. మరి ఆ ఒప్పందం తండ్రి కూతుళ్ళ జీవితంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? వస్తే ఆ మార్పులు ఏంటి? పరిచయమైన కొత్త క్యారెక్టర్స్ ఎవరు? సమాజానికి ఏమైనా మంచి జరిగిందా అనేదే ఇరుముడి సీలేరు లాంటి ఏరియాలో కంప్లీట్ లైవ్ లొకేషన్స్ లో ప్రశాంతమైన వాతావరణంలో మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు బోర్ కొట్టకుండా సాగింది

మార్గదర్శి ఫైనాన్షియర్ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది... హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్ ్సకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిపాజిట్ల వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మార్గదర్శిపై నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును 19 డిసెంబరు 2025న ఉండవల్లి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ గురువారం జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఉండవల్లి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మార్గదర్శి ఫైనాన్సియర్ ్స ఎలాంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి రూ.2,500 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిందని ప్రస్తావించారు. గతంలో హైకోర్టు ఆర్బీఐ వాదనలను విస్మరించిందని, కేవలం సాంకేతిక కారణాలను చూపుతూనే కేసును కొట్టివేసిందని తెలిపారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎ్‌ఫ అనేది ‘అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్’ కిందకు వస్తుందని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగిసిపోవని ఆర్బీఐ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా రూ.5.23 కోట్లకు పైగా చెల్లింపులు మిగిలి ఉన్నాయని, కొందరు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడం వల్లే ఇది పెండింగ్‌లో పడిందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర వాదనలు వినిపిస్తూ.. ఇప్పటి వరకు డిపాజిటర్లకు సంబంధించి రూ.2,500 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు వివరించారు. ఎవరూ క్లెయిమ్ చేయని మిగిలిన రూ.5.23 కోట్లను నిబంధనల ప్రకారం ఎస్ర్కో ఖాతాలో జమ చేశామనిచెప్పారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని, పబ్లిక్ నోటీసు జారీ చేసి, తదుపరి ప్రక్రియ అంతటినీ పారదర్శకంగా నిర్వహించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి

సినిమా పేరు: అమీర్ లోగ్ -నటీనటులు: వేద జలంధర్, హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట, రావణ్ నిట్టూరు, -విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ తదితరులు -సినిమాటోగ్రఫీ: సాలిగంటి విజయ్ కుమార్ -ఎడిటింగ్: రోహిత్ పెనుమత్స -మ్యూజిక్: స్మరన్ సాయి -నిర్మాత: మాధవి రెడ్డి సోమ -బ్యానర్ : అవాళ్ నెంబర్ ప్రొడక్షన్స్ -రచన,దర్శకత్వం: రమణా రెడ్డి సోమ -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026 హైదరాబాద్ పోరగాళ్ల కథ అంటు 'అమీర్ లోగ్' థియేటర్స్ లోకి వచ్చేసింది. రిలీజ్ డేట్ ఇరవై ఒకటి అయినా, ప్రమోషన్స్ తో వచ్చిన క్రేజ్ తో ప్రీమియర్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. శ్రీను( హరి మున్నంగి), రఫీక్(మనోజ్ ఆవుల), మల్లేష్( శశిధర్ కొచ్చర్ల కోట) చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక బస్తీ వాళ్ళ అడ్డా. ముగ్గురు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కావడంతో పాటు పని పాట లేకుండా తిరుగుతుంటారు. కానీ అమాయకత్వం, మంచితనం ఆ ముగ్గురి సొంతం. సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే గీత(వేద జలంధర్) ఆ ముగ్గురికి ఆత్మీయురాలు లాంటిది. తమ బస్తీలోనే ఉండే గీతని అక్క అని పిలుస్తుండటంతో పాటు తమ కష్ట సుఖాలని పంచుకుంటూ ఉంటారు. గీత తన ఆఫీస్ లోనే పని చేసే టీం లీడర్ రవి(రావణ్ నిట్టూరు) ని ప్రేమిస్తూ ఉంటుంది. రవి వల్ల శ్రీను, రఫీక్, మల్లేష్ కి అన్యాయం జరుగుతుంది. దీంతో రవికి గీత బ్రేక్ అప్ చెప్తుంది. జులాయిగా తిరిగే శ్రీను, రఫీక్, మల్లేష్ కి రవి అన్యాయం చేయడం ఏంటి? అసలు ఆ ముగ్గురి స్నేహితుల కథ మొత్తం ఏంటి? వాళ్ళ జీవితంలో ఎవరెవరు ఉన్నారన్నదే అమీర్ లోగ్. ఎనాలసిస్ కథలో గొప్పతనం లేకపోయినా ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా మంచి
హృదయాన్ని హత్తుకునే ‘మనసా వాచా’.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ సాంగ్ చూశారా! 'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.నాగవంశీ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ‘మనసా వాచా’ అనే పాట విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటను కె.ఎస్. చిత్ర, ఎస్.పి. చరణ్ కలిసి ఆలపించారు. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. ఈ పాటను మీరూ చూసేయండి. ఈ వార్తకు సంబంధించిన

ఇప్పటి వరకూ సెల్ ఫోన్లు పేలడం గురించే మనకు తెలుసు. అయితే.. సెల్ఫోన్లే కాదు.. మేమూ పేలతాం అంటున్నాయి ల్యాప్‌ట్యాప్‌లు. అవును.. హైదరాబాద్‌లో జరిగిన ఈ తాజా ఘటనే అందుకు నిదర్శనం. చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించినా, ఇది ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఉన్న నెస్ట్ హాస్టల్లో ఓ గదిలో తీవ్ర కలకలం రేగింది. ఓ విద్యార్థి తన ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ల్యాప్‌టాప్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో పాటు మంటలు చెలరేగాయి. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగానే మంటలు అంటుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గదిలో మంటలు చెలరేగడంతో అక్కడున్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్వల్ప అగ్నిప్రమాదంతో ముగిసినా, హాస్టల్ విద్యార్థులను మాత్రం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అసలు ల్యాప్‌టాప్‌లోనే సాంకేతిక లోపం ఉందా? లేక నాసిరకం ఛార్జర్ కారణంగా వేడెక్కిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచాలు, దుప్పట్లు లేదా దిండ్లపై ల్యాప్‌టాప్‌లను ఉంచి ఛార్జింగ్ పెట్టకూడదని, గాలి ప్రసరణ ఉండే గట్టి ప్రదేశాల్లో మాత్రమే ఛార్జ్ చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ నాణ్యమైన ఛార్జర్లను మాత్రమే వాడాలని, పర్యవేక్షణ లేకుండా ఎక్కువసేపు ఛార్జింగ్‌లో వదిలేయడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా? మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఎ1 నిందితురాలిగా బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో కస్టడీలో ఉన్న నటి పవిత్ర గౌడ జీవితంలో మరొక విషాదకర అధ్యాయం చోటుచేసుకుంది. ఆమె మొదటి భర్త సంజయ్ సింగ్ కన్నుమూసినట్లు సంచలన వార్త బయటకు వచ్చింది. అయితే, ఈ ఘోర విషాదం ఇటీవల జరిగింది కాదు. సుమారు 7 నుండి 8 నెలల క్రితమే రాజస్థాన్‌లో తుదిశ్వాస విడిచారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి పరిశ్రమ వర్గాలని, ప్రజలని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సంజయ్ సింగ్, పవిత్ర గౌడల బంధం వెనుక పెద్ద కథే ఉంది. వీరిద్దరి ప్రయాణం 2007-2008 కాలంలో ఒకరినొకరు ప్రేమించుకోవడంతో ప్రారంభమైంది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి పీటల దాకా వెళ్లి ఇద్దరూ దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఖుషీ గౌడ అనే కుమార్తె కూడా జన్మించింది. అయితే, మనస్పర్థలు మరియు వ్యక్తిగత విబేధాల కారణంగా వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో 2013లో వీరు అధికారికంగా విడాకులు తీసుకుని వేర్వేరు మార్గాల్లో పయనించడం ప్రారంభించారు. విడాకుల తర్వాత సంజయ్ సింగ్ తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారని సమాచారం. విడాకుల అనంతరం ఆయన మద్యపానానికి తీవ్రంగా బానిసయ్యారాని మీడియా వర్గాలు వెల్లడించాయి. విపరీతమైన ఆల్కహాల్ అలవాటు వల్ల ఆయన కాలేయ సంబంధిత వ్యాధులకు (లవర్ కాంప్లికేషన్స్) గురయ్యారు. బెంగళూరు వదిలి రాజస్థాన్‌కు వెళ్లిన ఆయన అక్కడ కొన్ని నెలల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. చికిత్స ఫలించక 7 నుంచి 8 నెలల కిందటే తన స్వస్థలంలో మరణించారు. రేణుకాస్వామి హత్య కేసు విచారణ సమయంలోనే సంజయ్ సింగ్ పేరు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో పవిత్రతో తన గతాన్ని, 2013 నాటి విడాకుల వివరాలను ఆయన బహిరంగంగానే పంచుకున్నారు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉండిపోయిన ఆయన మరణవార్త

ముంబైలో జరిగిన జెన్ జీ ఆందోళనల్లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన మోడల్ రియా అహిర్, ఇప్పుడు పోలీసులను ఒక విజ్ఞప్తి చేసి వార్తల్లో నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులు, నీచమైన కామెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముంబై పోలీసులను కోరింది. జూలై 22న దాదర్‌లోని శివాజీ పార్క్‌లో వర్షంలో జరిగిన నిరసన మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో అరెస్ట్ చేసిన నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ ముందుకు వచ్చి, గ్రే కలర్ హూడీతో గట్టిగా నిలబడిన రియా అహిర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె ఒక్కసారిగా ఈ జెన్ జీ ప్రొటెస్ట్‌కు ముఖచిత్రంగా మారింది. ఈ వివాదంపై ముంబై యూత్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మనోజ్ శర్మను కలిసి మాట్లాడింది. రియా అహిర్‌పై వేసిన ఎఫ్ఐఆర్, ఆమె ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతినిధి బృందంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హర్గున్ సింగ్, ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జీనత్ శబ్రీన్ ఉన్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారని, మరి ఈ ఎఫ్ఐఆర్ల ఉపసంహరణలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని హర్గున్ సింగ్ ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, రియాపై ఉన్న ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని జాయింట్ సీపీ మనోజ్ శర్మ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రియాకు సోషల్ మీడియా లో బెదిరింపు మెసేజ్‌లు పంపుతున్న అకౌంట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. జాయింట్ సీపీతో సమావేశం తర్వాత రియా అహిర్ మాట్లాడుతూ.. తన నిరసన వీడియో వైరల్ అయినప్పటి నుండి ఆన్లైన్ వేధింపులు

మాస్ మహారాజా రవితేజ రేపు ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచి ఇరుముడితో వరల్డ్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాడు. సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలు పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఇరుముడి వీక్షించడానికీ థియేటర్స్ దగ్గర బారులు తీరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A 16+ సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలు. సెన్సార్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ ప్రకారం, రవితేజ కెరీర్లోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ పవర్ ప్యాక్డ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతోంది. ఈ కథలో రవితేజ "త్రినాథ్" అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. మొదట్లో మద్యానికి విపరీతంగా బానిసైన నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ నటన మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. తన భార్య (ప్రియా భవానీ శంకర్), ముద్దుల కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర)లతో సాధారణ జీవితం గడుపుతున్న క్రమంలో, కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప మాల ధరిస్తారు. మద్యానికి బానిసైన ఒక తండ్రి అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి, నిష్టగా మాల ఎలా కొనసాగించాడు అనేది సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారనుంది. అంతేకాకుండా, ఊరిలో ఆడపిల్లలకు ముప్పు తలపెడుతున్న ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామాను దర్శకుడు శివ నిర్వాణ ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు అద్భుతంగా ముడిపెట్టారు. తన కూతురితో పాటు గ్రామంలోని మహిళల రక్షణ కోసం అయ్యప్ప దీక్షలో ఉన్న త్రినాథ్ ఏ విధంగా పోరాడాడు అనే అంశం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం. మాస్ యాక్షన్‌కి తోడుగా భక్తి రసం, తండ్రీ కూతుళ్ల మధ్యన సాగే ఎమోషనల్

రెండు వేర్వేరు రాష్ట్రాలు, రెండు వేర్వేరు ప్రభుత్వాలు.. కానీ రాజధాని మాత్రం ఒకటే. ఇది మరెక్కడో కాదు.. మన దేశంలోనే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రెండింటికీ ఏకైక రాజధానిగా ఉన్న నగరం చండీగఢ్.. అసలు.. రెండు రాష్ట్రాలకు ఒకే నగరం రాజధానిలా ఎలా మారింది..? భారతదేశంలోని మొదటి ప్లాన్డ్ సిటీగా పిలిచే చండీగఢ్ నగరం కథేంటి? ఈ నగరం ఎందుకు అంత స్పెషల్..? ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం... ఈ ప్రాంతంలో ప్రసిద్ధ చండీ మందిరం ( దుర్గా దేవి గుడి) ఉంది. అలాగే ఇక్కడ ఫేమస్ గఢ్( కోట) కూడా ఉంది. ఈ రెండు పదాలను కలిపి చండీగఢ్ అనే పేరు పెట్టారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు.. పంజాబ్ పాత రాజధాని ‘లాహోర్’ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయింది. దీంతో పంజాబ్ కోసం కొత్త రాజధాని నిర్మించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చండీగఢ్ ని రాజధానిగా నియమించారు. స్వతంత్ర భారత ప్రతిభను ప్రపంచానికి చూపించేలా ఒక ఆధునిక నగరాన్ని కట్టాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారు.ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుసియర్ ఈ నగరానికి ప్లాన్ వేశారు. విచిత్రమేంటంటే.. మనిషి శరీరం ఆధారంగా ఈ నగరాన్ని డిజైన్ చేశారు. క్యాపిటల్ కాంప్లెక్స్ తల భాగంలో, సిటీ సెంటర్ గుండె ఆకారంలో, పార్కులు, చెట్లు ఊపిరితిత్తులు గా విభజించారు. ఇక ఈ నగరాన్ని 'సెక్టర్లు'గా విభజించారు. ప్రతీ సెక్టార్లోనే బడులు, మార్కెట్లు, పార్కులు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే చండీగఢ్‌లో సెక్టర్ 13 ఉండదు. 1966లో పంజాబ్ నుండి 'హర్యానా' ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినట్లే పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే.. విభజన తర్వాత చండీగఢ్ మాదంటే మాదని ఇరు రాష్ట్రాలూ పట్టుబట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొంది. చండీగఢ్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా (UT) ప్రకటిస్తూ, రెండింటికీ ఉమ్మడి రాజధానిగా చేసింది

Singer Hemachandra: శ్రావణ భార్గవితో విడాకులపై తొలిసారి నోరు విప్పిన హేమచంద్ర! Sravana Bhargavi: ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయకుడు హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తమపై చెలరేగుతున్న ఊహాగానాలపై స్పందిస్తూ, మీడియాలో జరుగుతున్న చర్చల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు క్లిక్‌బైట్, సంచలనాల కోసం దారుణమైన థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తున్నాయని హేమచంద్ర మండిపడ్డారు.ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన: తన కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని వేడుకుంటున్నట్లు రూపొందించిన ఒక వీడియో థంబ్‌నైల్‌ను ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. మా ఇంట్లో ఎప్పుడూ జరగని విషయాన్ని మీరెలా చిత్రీకరిస్తారు? ఏం పిచ్చి దొబ్బిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి క్రియేటివిటీ చూపించడాన్ని పక్కన పెడితే, కుటుంబ సభ్యులతో పంచుకోలేని, సమాజంలో సిగ్గుపడే పనులను ఎవరూ చేయకూడదని హెచ్చరించారు. ఎవరైనా కుట్రపూరితంగా ప్రచారాలు చేసినప్పుడు వాటికి అనవసరంగా బహిరంగ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రొలాంగ్ చేయకుండా, కొంత సమయం తీసుకుని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలి.సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చేసే ఇటువంటి చర్చలు, పబ్లిక్ స్పేస్‌లో లేని వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఇంట్లోని పెద్దలు, పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన భావోద్వేగాలు, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి తన ‘ADHD’ ఆల్బమ్ వినాలని హేమచంద్ర సూచించారు.ఈ ఆల్బమ్‌లోని "యు ఆర్ మైన్" అనే పాట తన నిజమైన భావోద్వేగాల ప్రవాహమని చెప్పారు. కొంచెం తెలివైన వ్యక్తి అయితే ఆ ఆల్బమ్ వినగానే నా మనసులోని సమాధానం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తన భార్య శ్రావణ భార్గవి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక అద్భుతమైన

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో పట్టికలో భారత్ పరిస్థితి ఏమిటంటే... స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి రోజు ఆటలో 206 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/55తో చెలరేగిన సుతార్, మ్యాచ్ మొత్తంలో 10/131 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ భారీ విజయం సాధించినప్పటికీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకోలేకపోయింది. గత వారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో, వారు నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుత డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇంకా 8 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టుతో పాటు, నవంబర్‌లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, తదుపరి స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆడిన 10 టెస్టుల్లో నాలుగింటిలో ఓటమి చవిచూసిన టీమిండియాకు ఇకపై ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లేకుంటే, భారత్ తన మిగిలిన 8 టెస్టుల్లో 7 గెలిస్తే 68.52 శాతంతో (PCT) మెరుగవుతుంది. ఒకవేళ 6 విజయాలు, 2 ఓటములు నమోదైతే ఆ శాతం 62.96కి పడిపోతుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూకట్పల్లి రైతుబజార్లో నేటి ధరల వివరాలివే.. ఇరాన్‌కి సహాయం చేస్తే.. ఆర్థిక మూల్యం తప్పదు: ట్రంప్

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఓ భారతీయ విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. కేవలం ఐదు నిమిషాల పాటు వేడినీటి స్నానం చేసినందుకు 1,800 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 1.3 లక్షలు) జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ వింత అనుభవాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది.వమిక అనే భారతీయ యువతి సిడ్నీలో నివసిస్తోంది. ఇటీవల ఆమె తన అపార్ట్మెంట్లో వేడినీటితో స్నానం చేసింది. అయితే, చలిగా ఉంటుందన్న కారణంతో బాత్రూమ్లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్ చేయలేదు. దీంతో స్నానం తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చిన వేడినీటి ఆవిరి, సమీపంలో ఉన్న ఫైర్ అలారంకు తగిలింది. వెంటనే భవనంలో ఫైర్ అలారం పెద్ద శబ్దంతో మోగింది.అలారం మోగడంతో మొదట ఏదైనా డ్రిల్ అనుకున్నానని, కానీ కాసేపటికే బిల్డింగ్ మేనేజర్ తన అపార్ట్మెంట్లోకి వచ్చారని వమిక తన వీడియోలో చెప్పింది. ఫాల్స్ అలారం కారణంగా ఫైర్ సిబ్బంది రావడంతో, అధికారులు ఆమెకు పన్నులతో కలిపి సుమారు 1,900 డాలర్ల బిల్లు వేశారు. "వంట చేస్తుండగా ఇలా జరిగి ఉంటే ఇంత ఇబ్బందిగా ఉండేది కాదేమో" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. వాష్‌రూమ్‌కు ఇంత దగ్గరగా ఫైర్ అలారం ఎందుకు పెట్టారని ఆమె ప్రశ్నించింది.వమిక పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆస్ట్రేలియాలోని అనేక అపార్ట్మెంట్లలో, ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ లాంటి ప్రాంతాల్లో, ఆవిరి లేదా వంట పొగ వల్ల ఫాల్స్ అలారమ్స్ మోగితే ఫైర్ బ్రిగేడ్

హర్ష నర్రా, తన్మయి ఖుషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ విడుదలైంది. హర్ష నర్రా (Harsha Narra), తన్మయి ఖుషీ (Tanmayi Khushi), సిజు ఏఆర్, ప్రమోదిని ప్రధాన పాత్రధారులుగా సాయిబాబా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోడ్రన్ మిస్సమ్మ’ (Modern Missamma) చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్‌కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ పాటను విడుదల చేశారు. కిట్టూ విస్సా ప్రగడ సాహిత్యం అందించగా గోపీ సుందర్ సంగీతంలో సాహితీ చాగంటి, భవాని కాకేవ్ ఆలపించారు. పెళ్లి దాని నుంచి వచ్చే పర్యవసనాల గురించి కథానాయిక వర్ణిస్తూ ఈ పాట సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ ‘ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలున్న ఈ సినిమా కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’ అని తెలిపారు. హర్ష నర్రా మాట్లాడుతూ ‘ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు ఉన్న ఈ చిత్రంలోని కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని చెప్పారు. ‘ఇప్పటివరకూ వచ్చిన ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’, భూమిక ‘మిస్సమ్మ’ లాగే మా ‘మోడ్రన్ మిస్సమ్మ’ కూడా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని సాయిబాబా తెలిపారు

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో... కోల్‌కతా, ఆగస్టు 19: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సుమారు 80మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రతి అంతస్తులో నాలుగైదు హోటళ్లు నడుస్తున్నాయని.. గాలి, వెలుతురు లేని ఇరుకైన గదులే ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు
ఆమెకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు.. కొండా సుస్మితకు రేవూరి కౌంటర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఘాటుగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని, ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే సీఎం రేవంత్ తనను పరకాల అభ్యర్థిగా ప్రకటించారని రేవూరి తెలిపారు. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేని వ్యక్తి అని, సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని మండిపడ్డారు. దమ్ముంటే సీఎంపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ వార్తకు సంబంధించిన