
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఎ1 నిందితురాలిగా బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో కస్టడీలో ఉన్న నటి పవిత్ర గౌడ జీవితంలో మరొక విషాదకర అధ్యాయం చోటుచేసుకుంది. ఆమె మొదటి భర్త సంజయ్ సింగ్ కన్నుమూసినట్లు సంచలన వార్త బయటకు వచ్చింది. అయితే, ఈ ఘోర విషాదం ఇటీవల జరిగింది కాదు. సుమారు 7 నుండి 8 నెలల క్రితమే రాజస్థాన్‌లో తుదిశ్వాస విడిచారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి పరిశ్రమ వర్గాలని, ప్రజలని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
సంజయ్ సింగ్, పవిత్ర గౌడల బంధం వెనుక పెద్ద కథే ఉంది. వీరిద్దరి ప్రయాణం 2007-2008 కాలంలో ఒకరినొకరు ప్రేమించుకోవడంతో ప్రారంభమైంది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి పీటల దాకా వెళ్లి ఇద్దరూ దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఖుషీ గౌడ అనే కుమార్తె కూడా జన్మించింది. అయితే, మనస్పర్థలు మరియు వ్యక్తిగత విబేధాల కారణంగా వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో 2013లో వీరు అధికారికంగా విడాకులు తీసుకుని వేర్వేరు మార్గాల్లో పయనించడం ప్రారంభించారు. విడాకుల తర్వాత సంజయ్ సింగ్ తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారని సమాచారం. విడాకుల అనంతరం ఆయన మద్యపానానికి తీవ్రంగా బానిసయ్యారాని మీడియా వర్గాలు వెల్లడించాయి. విపరీతమైన ఆల్కహాల్ అలవాటు వల్ల ఆయన కాలేయ సంబంధిత వ్యాధులకు (లవర్ కాంప్లికేషన్స్) గురయ్యారు. బెంగళూరు వదిలి రాజస్థాన్‌కు వెళ్లిన ఆయన అక్కడ కొన్ని నెలల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. చికిత్స ఫలించక 7 నుంచి 8 నెలల కిందటే తన స్వస్థలంలో మరణించారు. రేణుకాస్వామి హత్య కేసు విచారణ సమయంలోనే సంజయ్ సింగ్ పేరు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో పవిత్రతో తన గతాన్ని, 2013 నాటి విడాకుల వివరాలను ఆయన బహిరంగంగానే పంచుకున్నారు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉండిపోయిన ఆయన మరణవార్త ఇప్పుడు కన్నడ నాట వైరల్‌గా మారింది.
మరొకవైపు పవిత్ర గౌడ ప్రస్తుతం జైలులోనే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. జైలులో తీవ్రమైన జ్వరం మరియు రక్తపోటు తగ్గిపోవడంతో (లో బిపి) ఆమెను జైలు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. న్యాయస్థానం విచారణకు కూడా ఆమె హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమె మొదటి భర్త మరణవార్త బయటకు రావడం ఈ కేసు తీవ్రతకు మరియు వారి వ్యక్తిగత జీవితాలలోని విషాదానికి అద్దం పడుతోంది.
ఓటీటీలో అరాచకం సృష్టిస్తున్న నిజమైన రొమాంటిక్ వెబ్ సిరీస్
మెగా ఫ్యాన్స్‌కి బిగ్ షాక్: చివరి నిమిషంలో చిరంజీవి సినిమా వాయిదా.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.





