
మాస్ మహారాజా రవితేజ రేపు ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచి ఇరుముడితో వరల్డ్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాడు. సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలు పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఇరుముడి వీక్షించడానికీ థియేటర్స్ దగ్గర బారులు తీరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రం ఇప్పటికే తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A 16+ సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలు. సెన్సార్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ ప్రకారం, రవితేజ కెరీర్లోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ పవర్ ప్యాక్డ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతోంది. ఈ కథలో రవితేజ "త్రినాథ్" అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. మొదట్లో మద్యానికి విపరీతంగా బానిసైన నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ నటన మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. తన భార్య (ప్రియా భవానీ శంకర్), ముద్దుల కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర)లతో సాధారణ జీవితం గడుపుతున్న క్రమంలో, కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప మాల ధరిస్తారు. మద్యానికి బానిసైన ఒక తండ్రి అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి, నిష్టగా మాల ఎలా కొనసాగించాడు అనేది సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారనుంది. అంతేకాకుండా, ఊరిలో ఆడపిల్లలకు ముప్పు తలపెడుతున్న ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామాను దర్శకుడు శివ నిర్వాణ ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు అద్భుతంగా ముడిపెట్టారు. తన కూతురితో పాటు గ్రామంలోని మహిళల రక్షణ కోసం అయ్యప్ప దీక్షలో ఉన్న త్రినాథ్ ఏ విధంగా పోరాడాడు అనే అంశం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం.
మాస్ యాక్షన్‌కి తోడుగా భక్తి రసం, తండ్రీ కూతుళ్ల మధ్యన సాగే ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సాంకేతిక విభాగంలో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ముఖ్యంగా అయ్యప్ప స్వామి "ఇరుముడి కట్టు" పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలిచాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకి తోడు, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వసిక నటన సినిమాను తదుపరి స్థాయికి తీసుకెళ్లాయి. మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ మరియు 145 నిమిషాల క్రిస్పీ రన్టైమ్తో "ఇరుముడి" ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ అభిమానులకు పండగ వాతావరణం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు.
Irumudi, Raviteja, Shiva Nirvana, priya Bhavani Shankar
'ఆదిపురుష్' డైరెక్టర్‌తో ప్రభాస్ మరో మూవీ.?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.
Written by Skyc Media Editorial
checkFilm Critic & Entertainment Desk • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Share this story
Help others stay updated with verified breaking news and insights.










