
రాష్ట్రంలో పెనమలూరుప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి
Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన
© 2026 nimisham.in

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

ఒకప్పుడు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకున్న న్యాయవాదులకు (Lawyers) ఇప్పుడు దాడులు స్వాగతం పలుకుతున్నాయి. వారు వాదిస్తున్న కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న వారు, విచారణలను తప్పుదోవ పట్టించేలా లాయర్లపై ఒత్తిళ్లు తీసుకోవడం, కుదరకపోతే దాడులకు దిగడం చూస్తూనే ఉన్నాం. వీటిని అరికట్టేందుకు కఠిన చట్టాల అవసరం ఉందని న్యాయస్థానాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాయర్లపై దాడులకు దిగితే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా గోవా ప్రభుత్వం అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టింది.ఏపీ మద్యం స్కాం- సిట్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం- రెండేళ్లయినా ఏమీ దొరకలేదు..!విధి నిర్వహణలో ఉన్న లాయర్లపై దాడి చేసిన వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానాతో సహా కఠినమైన శిక్షలను నిర్దేశించే బిల్లుకు ఇవాళ గోవా అసెంబ్లీ ఆమోదించింది. గోవా న్యాయవాదుల రక్షణ బిల్లు 2026పేరుతో తెచ్చిన ఈ బిల్లులో బెదిరింపులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు పోలీసు రక్షణ కల్పించడం, దుర్వినియోగానికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు కూడా ఉన్నాయి. లాయర్లపై తప్పుడు లేదా దురుద్దేశపూర్వక ఫిర్యాదులు చేసిన వారికి ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఈ బిల్లు చెబుతోంది. సుప్రీం సాక్షిగా కేంద్రంతో డీల్ ఓకే ..! కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..!న్యాయ, చట్ట, న్యాయవ్యవస్థ శాఖను కూడా నిర్వహిస్తున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఇది ఆమోదం పొందింది.లాయర్లు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు వారిపై హింస, బెదిరింపులు, వేధింపులు, తప్పుడు ఆరోపణలు, ఆస్తి నష్టం వంటి ఘటనలు పెరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు న్యాయవాద వృత్తి యొక్క స్వాతంత్రాన్ని, నిర్భయ పనితీరును ప్రభావితం చేస్తాయని, కక్షిదారుల న్యాయ ప్రాతినిధ్య హక్కును, న్యాయం పొందే అవకాశాన్ని దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు. ఈ చట్టం ప్రకారం న్యాయవాదిపై దాడి చేసినా లేదా నేరపూరిత బలప్రయోగం చేసినా రెండు సంవత్సరాల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాప్రభుత్వం పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రైతులు, మహిళలు, యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు చెప్పుకొచ్చింది. తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించామని స్పష్టం చేస్తోంది.దీనికి భిన్నంగా స్పందిస్తోంది.. బీజేపీ రాష్ట్రశాఖ. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన మొత్తం దోపిడీపూరకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తుతోంది. దీనిపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలకు తెర తీసింది.ఈ క్రమంలో.. నగరం అంతటా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన పోస్టర్లను అతికించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే దాదాపు 500కు పైగా ప్రాంతాలలో ఈ పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ భవన్ పరిసరాల్లో ఈ పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాప్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనేపలు ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, మెట్రో రైలు పిల్లర్ల వద్ద కూడా స్థానిక బీజేపీ శ్రేణులు ఈ నిరసన పోస్టర్లను ప్రదర్శించాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక గ్యారెంటీల అమలుపై నిరసన తెలపడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ

తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులను, వారి భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, విద్యార్థులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తలసానిని కలసి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరం కాకూడదనే సదుద్దేశంతో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారని... ఆ తర్వాత కేసీఆర్ హయాంలో కూడా సకాలంలో నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ. 11,000 కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కోర్సులు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ అండగా ఉంటుందని తలసాని హామీ ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై ‘జెన్ జీ’ యువత జరిపిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దిగొచ్చిందో, అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విద్యార్థులు గట్టి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం ఏ. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్-అంబర్‌పేట వంతెన ప్రారంభోత్సవ ప్రజా సమావేశంలో మాట్లాడిన ఆయన, అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించకుండా ఫార్మ్‌హౌస్‌కే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీ జీతం మరియు ఇతర భద్రతా సౌకర్యాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గత 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరుకావడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, కేవలం ఫార్మ్‌హౌస్‌కే పరిమితమై 1000 రోజులు గడిపేశారని ఆరోపించారు. దేశంలో ఏ ప్రతిపక్ష నేత కూడా ప్రజలకు దూరంగా ఇన్ని రోజులు ఉండలేదని, ప్రజాప్రతినిధిగా ఇది ఏమాత్రం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ 1000 రోజుల కాలంలో కేసీఆర్ జీతం రూపంలో రూ.1.24 కోట్లు తీసుకోగా, ఆయన భద్రత మరియు బుల్లెట్ ప్రూఫ్ ల కోసం ప్రభుత్వం మరో రూ.21 కోట్లు ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి లెక్కలు బయటపెట్టారు. దీంతో మొత్తం రూ.22.24 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉండగా సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే ఉద్యోగం ఊడుతుందని, మరి అసెంబ్లీకి రాని కేసీఆర్ విషయంలో ఏం చేయాలని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కేసీఆర్ వచ్చి 1000 రోజుల కాంగ్రెస్ పాలనతో పాటు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రత్యక్ష చర్చకు రావాలని సీఎం సవాలు విసిరారు. ఫలితంగా సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు, బైక్ ర్యాలీలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్‌లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి. నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం సాధారణమే. అయితే ప్రజా సమస్యలపై నిజంగా పోరాడాలంటే ఆ విమర్శలను సంబంధిత వేదికలపై కూడా వినిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విషయంలో ఇదే అంశం చర్చకు వస్తోంది. బయట ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆయన శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండటంపై అధికార కూటమి నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే ప్రక్రియ కొనసాగుతోందని చెబుతోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ స్వయంగా సభకు హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమ వాదనకు మరింత బలం వస్తుందని అధికార పక్షం అంటోంది. సభలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండటంతో పాటు, ప్రతిపక్షానికి కూడా ప్రజల తరఫున నిలదీసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ అంశంపై జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీకి రావడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికార పక్షాన్ని సభలోనే తీవ్రంగా ప్రశ్నించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం జగన్‌కు కూడా అదే అవకాశముందని, సభా వేదికను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా జగన్ సభకు వస్తే ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే మరోసారి ఉపాధ్యాయ నియామక ప్రకటన ద్వారా వేలాది ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం

తమిళనాడు రాజకీయాల్లో కొత్త రగడ మొదలైంది. అసెంబ్లీలోని 234 మంది ఎమ్మెల్యేలకు ఉచిత కార్లు ఇస్తామని టీవీకే ప్రభుత్వం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ప్రతి ఎమ్మెల్యేకు కారుతో పాటు డ్రైవర్, పెట్రోల్, వాహన నిర్వహణ కోసం నెలకు ₹75,000 భత్యం కూడా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ డీఎంకే పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఈ ఉచిత కార్లను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఉదయనిధి స్టాలిన్ సభలో వివరంగా వెల్లడించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రవాణా సౌకర్యాలు అవసరమని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి డిమాండ్ చేశారని ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ సదుపాయం తప్పనిసరి అని సర్కార్ సమర్థించుకుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతూ ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. దింతో రాష్ట్రం ఎదుర్కొంటున్న అప్పుల భారాన్ని తగ్గించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఉదయనిధి తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం, అప్పుల భారం గురించి మాట్లాడుతూ, మరోవైపు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం ద్వంద్వ విధానమని విమర్శించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేయకుండా, కార్లు లేని పేద ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫలితంగా ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్రమైన చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఆఫర్‌ను స్వాగతించగా, డీఎంకే మాత్రం తోసిపుచ్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత సదుపాయాలను నిరాకరించడం ద్వారా ప్రజల వైపు తాము నిలబడ్డామని డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రజాధనాన్ని పదుపుగా వాడాలని డీఎంకే పట్టుబడుతుండటంతో టీవీకే

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో అటు వైసీపీ సైతం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. సీట్ల సర్దుబాటు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ స్థానిక ఎన్నికల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.ఏపీలో ఇప్పుడు స్థానిక ఎన్నికల రాజకీయం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైన జనసేన నుంచి ఈ సారి వాయిస్ బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల ఫార్ములా ఇప్పుడు ఈ ఎన్నికలకు వర్తించదని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేసి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, కూటమి లోని మూడు పార్టీల అధినేత లు కలిసి కూర్చొని సీట్ల పంపకాల పైన మాట్లాడుకుందామని చంద్రబాబు సూచించారు. కాగా.. ఇక, ఇప్పుడు జనసేన నుంచి సీట్ల పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ అసెంబ్లీలోని జనసేన కార్యాలయ ప్రాగణంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల పైన చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!పవన్ సంకేతాల వెనుకసమావేశం తరువాత పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో..జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం.. అని పవన్ స్పష్టం చేసారు. ఇందులో ప్రత్యేకంగా జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా అని చెప్పటం ద్వారా సీట్ల

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకుని మంత్రి చర్చకు రావాలని ఏలేటి డిమాండ్ చేశారు. హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి శ్రీనివాస రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న (బుధవారం) సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. తన సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని మంత్రిని ఏలేటి మరోసారి డిమాండ్ చేశారు. తాను మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడే ఉంటానని, శ్రీనివాస రెడ్డి రావాలని డెడ్ లైన్ విధించారు. ఈ సందర్భంగా భూభారతి, 22ఏలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఫీనిక్స్, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థలకు భూ బదలాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను లాక్కున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు తాను కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇస్తారా? లేక పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఎవరొచ్చినా సరే తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్వర్క్ జాడలు క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి. అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి. ఉభయ సభల్లో జల కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం-2024ను ఆమోదించాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అలాగే, శాసనసభలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేయనుంది. ఈ మేరకు శాసనసభలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టనుండగా.. ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సవరణ బిల్లును సభ ముందుకు మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకురానున్నారు. అలాగే, ఉభయ సభల్లో వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ఎమ్మెల్యేలు గొండు శంకరరావు, వేగేశన నరేంద్రవర్మ రాజు ప్రవేశపెట్టనున్నారు. సూపర్ సిక్స్-ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు, ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు నేడు శాసనమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవల నిలుపుదల, గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం, నిరుద్యోగ భృతి, తిరుపతి గ్రామీణ మండలంలో గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ, భీమవరంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల కింద నిధుల మంజూరు, తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భవ్య పథకం కింద పారిశ్రామిక పార్కులు, ఎరువుల కోసం యాప్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంపైనా మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. శాసనమండలిలో పీఎం విద్యాలక్ష్మి పథకం, గోదావరి పుష్కరాలకు నిధులు, కాపు కార్పొరేషన్‌కు నిధులు, విద్యా హక్కు చట్టం, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల
MLA లవ్ ఫెయిల్ మాటలకి అవాక్కైన సీఎం విజయ్.. ఒక్కసారిగా..! తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో పెరియకుళం నియోజకవర్గ TVK ఎమ్మెల్యే శబరి అయ్యంగరన్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన, తన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాలేజీ రోజుల్లో ప్రేమలో విఫలమైన తనకు ఉద్యోగం, కారు లేవని.. కానీ సీఎం విజయ్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడంతో పాటు కారు కూడా కేటాయించారని సరదాగా వ్యాఖ్యానించారు. ట్రైన్లో వచ్చి, ఆటోలో అసెంబ్లీకి వస్తున్నప్పుడు పోలీసులు ఎమ్మెల్యే అంటే నమ్మలేదని, ఇప్పుడు ఈ రెండు నిర్ణయాలతో ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YS Jagan Padayatra: మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్ర జరిగిన తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే (వైఎస్సార్సీపీ) విజయం అని పూర్తి విశ్వాసం ప్రకటించారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. 'అన్నింట్లో చంద్రబాబు విఫలమవడంతో వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి వైఎస్సార్సీపీ పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. స్థానిక యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కండి. గెలుపే లక్ష్యంగా పని చేయాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదు' అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి' అని పార్టీ శ్రేణులకు సూచించారు. మనకు అత్యంత ప్రజాదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఇసుక

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సభకు దూరంగా ఉండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను చర్చించేందుకు శాసనసభే అత్యంత కీలకమైన వేదిక అని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఒక పార్టీ నిర్ణయించుకోవడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల మూడో రోజు సభకు వచ్చిన చంద్రబాబు, అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ వరుసగా సమావేశాలకు గైర్హాజరవుతున్న విషయంపై తొలిసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేల ద్వారా సభలో ప్రస్తావించాలని ఆశిస్తారని, అలాంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రతిపక్షం సభకు రాకపోవడం సరైన విధానం కాదని అన్నారు. ప్రతిపక్షానికి కొన్ని రాజకీయ అభ్యంతరాలు ఉన్నప్పటికీ వాటిని అసెంబ్లీ వేదికగానే ప్రస్తావించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. బయట సమావేశాలు నిర్వహించడం, మీడియా ముందు మాట్లాడటం ద్వారా సమస్యలు పూర్తిగా పరిష్కారం కావని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించేందుకు, ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేందుకు శాసనసభ సరైన వేదికగా ఆయన అభివర్ణించారు. ఎమ్మెల్యేలుగా ప్రజల నుంచి మద్దతు పొందిన నేతలు సభకు హాజరై తమ బాధ్యతను నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. తన రాజకీయ అనుభవాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు గతంలో ప్రతిపక్షాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అసెంబ్లీని పూర్తిగా బహిష్కరించిన పరిస్థితులు అరుదని చెప్పారు. 1978లో జైపాల్ రెడ్డి (Jaipal Reddy), వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) వంటి నేతలు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్న సమయంలోనూ శాసనసభలో చర్చల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే 1989-91 మధ్య ఎన్టీ రామారావు (N. T. Rama Rao) సభకు హాజరుకాని సందర్భాల్లో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజా

ఏపీలో కీలకమైన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్ పర్సన్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునేందుకు మార్గం సుగమం అయింది. గతంలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2005లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు నిన్న కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఇవాళ అసెంబ్లీలో (AP Assembly)ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో మున్సిపల్ చట్టంలో సవరణలు రానున్నాయి.మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని మంత్రి నారాయణ ఈ బిల్లుపై మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్ లేదా చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు. తొలి రోజే మండలి డిప్యూటీ ఛైర్మన్ కు కూటమి షాక్..! బొత్స ఫైర్..!ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది పనికొస్తుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్‌తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. చెన్నై, ఆగస్టు 19: ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. డీఎంకే నేతల అవినీతికి సంబంధించిన రెండు ఫైల్స్ తన టేబుల్‌పైనే ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు ఆ ఫైల్స్ తెరుస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి.. ఆ ఫైల్స్ ఇప్పుడే తెరిచేలా చేయొద్దని డీఎంకే నేతలకు వార్నింగ్ ఇచ్చారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణ పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై బుధవారం తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ డీఎంకే పార్టీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఎప్పుడు.. ఏం చెప్పాలో నాకు తెలుసు. అందుకే ప్రజలు మాపై నమ్మకంతో ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఉప ఎన్నికల సమయంలో నేను మాట్లాడతాను. ప్రజలకు కొంత మంచి జరగనివ్వండి’ అని అన్నారు. ‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన డయాబెటిస్ ఉన్నవారు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమా?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చే అధికారులను గ్రూప్-1 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారని, ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తారని చెప్పారు. అలాంటి పరీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజలు, ఉద్యోగార్థులు ఈ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ జవాబుదారీతనానికి వేదిక అని, ఇక్కడి నుంచే ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని తాను చాలాసార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం పోయేలా గత పాలకులు వ్యవహరించారని విమర్శించారు. 2018లో గ్రూప్-1 సర్వీసులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 1.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. వారిలో 325 మందిని షార్ట్‌లిస్ట్ చేశారని చెప్పారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్ట్‌తో తరలిస్తామని, అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారులను ఎంపిక చేసే పరీక్షల విషయంలో మరింత భద్రత ఉండాలని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో డిజిటల్ విధానాన్ని పక్కనపెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. అయినప్పటికీ కోర్టును తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు

విశాఖపట్నం డేటా సెంటర్లపై అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం డేటా సెంటర్లపై అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత డిజిటల్ ఎకానమీకి డేటా సెంటర్లు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. గూగుల్ పెట్టుబడితో విశాఖపై ఇతర ఐటీ కంపెనీలకు ఆసక్తి పెరిగిందని వ్యాఖ్యానించారు. డేటా సెంటర్ల ఎకోసిస్టమ్ 6.5 GWకు చేరితే ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమని వెల్లడించారు. కొత్త కూలింగ్ టెక్నాలజీలతో డేటా సెంటర్ల నీటి వినియోగం మరింత తగ్గుతుందని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు వస్తోందని వివరించారు. విశాఖ నగర ప్రజల నీటి అవసరాలకు కేటాయించిన నీటిని డేటా సెంటర్లకు మళ్లించమని స్పష్టం చేశారు. పోలవరం నుంచి విశాఖపట్నం నగరానికి గ్రావిటీ ద్వారా నీటి సరఫరాను 18 నెలల్లో అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. 1 GW థర్మల్ పవర్ ప్లాంట్‌తో పోలిస్తే డేటా సెంటర్‌కు దాదాపు పదో వంతు నీరే అవసరమని వెల్లడించారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నీటి వినియోగంపై కాకుండా డేటా సెంటర్లపైనే ఎందుకు నిరసనలు? చేస్తున్నారని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. డేటా సెంటర్ కేటాయింపులకు 6.5 GW పరిమితి విధించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. 6.5 GW డేటా సెంటర్ కేటాయింపుల లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలకే తమ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుందని స్పష్టం

అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి ఓ విలువ, గుర్తింపు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ చేశారు. బయట కూర్చుని వైసీపీ సభ్యులు ఎంత మాట్లాడినా విలువ ఉండదని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమని సీఎం ఉద్ఘాటించారు. అలాంటి వేదికను ఓ పార్టీ మొత్తం బహిష్కరించటం తన రాయజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదని తెలిపారు 1978లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డిలు ఇద్దరే అసెంబ్లీని అల్లాడించారని ప్రస్తావించారు.1989 నుంచి1994 సమయంలో ఎన్టీఆర్ మధ్యలో అసెంబ్లీకి రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున పోరాడామని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య తాను సవాల్ చేసి బయటకొచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకూ పోరాటం వదల్లేదని అన్నారు. గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా?.. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తమ వాళ్లు చేసిన పోరాటమే అందరినీ ఆలోచింప చేసిందని సీఎం చెప్పారు. ప్రజలు సభ్యులను ఎన్నుకునేది అసెంబ్లీలో వారి సమస్యలపై పోరాడతారనే నమ్మకంతోనే అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. గ్రూప్-1 అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా బయట కూర్చోని డీఎస్సీపై వైసీపీ సభ్యులు బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ కోతపెట్టిన బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్ధరించామని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 3వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల అక్రమాల అంశం సభను తీవ్రంగా వేడెక్కించింది. ఉదయం ప్రశ్నోత్తరాల సెషన్‌తో ప్రారంభమైన సభలో గత పాలనలోని అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమగ్రంగా విచారించేందుకు సిద్ధమైంది. సభలోని ముఖ్య అంశాల్లో ప్రధానంగా నిరుద్యోగ యువత ప్రయోజనాలు మరియు వ్యవస్థల ప్రక్షాళన లక్ష్యంగా ఈ గ్రూప్-1 విచారణ సాగనుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం ప్రకారం ఆగస్టు 17 నుంచి 20 వరకు మొత్తం 4 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం రోజున బిసి రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘ చర్చ పూర్తయిన తర్వాత బుధవారం నాటి సమావేశాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై సమయ పరిమితి లేకుండా చర్చించాలని బిఎసి నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన గ్రూప్-1 అంశంపై అన్ని కోణాల్లో నిలదీసేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం పాలనలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకనం మరియు ఎంపిక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని అధికార పక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సభలో బలంగా వినిపించింది. ఇదిలా ఉండగా తిరుపతి పరిధిలోని టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల నిలిపివేత అంశాలు కూడా సభను కుదిపేశాయి. శాసనసభలో మంత్రులు సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ గ్రూప్-1 వ్యవహారంలో చట్టపరమైన విచారణ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఫలితంగా బాధ్యులైన ఎంతటి వారైనా వదిలేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యా రంగానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల మరియు సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణపై కూడా మంత్రులు స్పష్టమైన ప్రకటనలు ఇచ్చారు. శాసనమండలిలో సైతం ఉదయం 10 గంటల నుంచి సంక్షేమ పథకాలు, నిరుద్యోగ

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ఏకపక్షంగా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. అటు వైసీసీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ ఏం చేయబోతుందనేది కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం అధికారికంగా ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయించింది. అర్బన్ - రూరల్ ప్రాంతాల్లో ఏ మేర అమలు చేయాలో డిసైడ్ అయింది. అదే విధంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను రాబట్టేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాలని తీర్మానించింది.చట్టంలోని నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు నిర్వహించేందుకు క్యాబినెట్ ఆమోదించింది. తిరుమల వేదికగా సాయిరెడ్డి కీలక ప్రకటన - టార్గెట్ ఫిక్స్..!!ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలుఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రస్తుతం వారి రిజర్వేషన్లు యథతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోంది. కాగా.. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా పెంచడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాల విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కానుంది. మూడు పార్టీలు స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాల పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, అటు వైసీపీ సైతం ఈ ఎన్నికల్లో గట్టి పోటీ

తమిళనాడులో విజయ్ దళపతి టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి కంచుకోటలను బద్దలు కొట్టి పార్టీ పెట్టిన తొలిసారే తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు విజయ్. తమిళనాట తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే తాజాగా తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఎంఆర్. పల్లవి తన పసిబిడ్డతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నెలల వయసున్న చంటిబిడ్డను మెయిన్ హాల్ లో అక్కడే ఉన్న అటెండెంట్ కు ఇచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అసెంబ్లీ హాల్ వద్ద రూమ్ లో కేర్ గివర్ వద్దే ఆ పసిబిడ్డ ఉండగా.. సమావేశాల అనంతరం ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి తన బిడ్డను తీసుకుని వెళ్లారు. అయితే ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆమెను విమర్శిస్తుండగా.. మరికొందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారంటూ పలువురు ఆమెకు మద్దతును ప్రకటిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎమ్మెల్యే తీరును విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు సహా అన్ని ప్రదేశాలకు ఆమె తన బిడ్డను తీసుకెళ్తూ హడావిడి సృష్టిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి తాజాగా స్పందించారు. పసిబిడ్డ కావడంతో తాను ఇంట్లో వదిలి రాలేకపోతున్నానని అన్నారు. ఒక తల్లిగా నా బాధ్యతలను, ఎమ్మెల్యేగా నా వృత్తి ధర్మాన్ని ఏకకాలంలో నిర్వర్తించడంలో ఎలాంటి తప్పు లేదు. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను తప్ప.. ఎవరికీ ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదు అని ఎమ్మెల్యే ఎం. ఆర్ పల్లవి స్పష్టం చేశారు. మరోవైపు తమిళనాడులో సీఎం విజయ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలోని స్దానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు (Chandrababu) స్వయంగా ప్రకటించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసమే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే 28 జిల్లాలకూ జెడ్పీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మేయర్, ఛైర్మన్లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.Amaravati: అమరావతి నాడు-నేడు..! అంబటి ఎమోషనల్ సాంగ్..! స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా రిజర్వేషన్లను వర్తింప చేస్తూ ఎన్టీఆర్ నాడు తీసుకున్న నిర్ణయం మొదలుకుని ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబు సభలో వివరించారు. ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేసిన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తున్నట్టు తెలిపారు. 1995, 2001, 2006, 2013 సంవత్సరాల్లో 34 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించినట్టు గుర్తు చేశారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి కుదించడం ద్వారా 16800 మంది స్థానిక బీసీ నేతలకు రాజకీయాల్లో అవకాశాలు దక్కలేదన్నారు. ఈ 34 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!సుస్థిరమైన పాలన అందించడం కోసమే పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపడతామని సీఎం వెల్లడించారు. ఈ మేరకు కెబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీంతో పాటు జిల్లాల విభజన జరిగినా ప్రస్తుతం 13 జిల్లా ప్రజా పరిషత్‌లే ఉండటంతో, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజా పరిషత్‌లను ఏర్పాటు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Revanth Reddy: 'రెండోసారి 117 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్‌ది కుటుంబ న్యాయం, నాది సామాజిక న్యాయం. కేసీఆర్‌ది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం. చెట్టుకు, పుట్టకు, రాయి, రప్పకు మొక్కుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని. వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు' అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తాము గ్రామగ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దిశ సరిగా లేకపోతే దశ సరిగా ఉండదని.. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం. మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 'అందెశ్రీ పాటకు విముక్తి కల్పించాం. గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపాం. బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 36 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. 95 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. 60 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాం' అని ముఖ్యమంత్రి వెల్లడించారు. 'యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలకు ఓ మహిళా ఎమ్మెల్యే తన పసిబిడ్డతో హాజరవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్. పల్లవి, కొన్ని నెలల వయసున్న తన బిడ్డను ఎత్తుకుని సభా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ ఉదంతంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పల్లవి తన బిడ్డను సహాయకురాలి పర్యవేక్షణలో ఉంచి, విరామ సమయాల్లో పసికందు బాగోగులు చూసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పసిబిడ్డను తీసుకువచ్చి అసౌకర్యం కలిగిస్తున్నారంటూ కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు, ఒక తల్లిగా పసిబిడ్డను సంరక్షించుకుంటూనే, ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారంటూ పలువురు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.ఈ విమర్శలపై ఎమ్మెల్యే పల్లవి స్పందించారు. "బిడ్డకు కొన్ని నెలలే వయసే కావడంతో ఇంట్లో వదిలి రావడం సాధ్యం కాదు. ఒక తల్లిగా నా బాధ్యతలను, ఎమ్మెల్యేగా నా విధులను ఏకకాలంలో నిర్వర్తించడంలో ఎలాంటి తప్పు లేదు. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను తప్ప, ఎవరికీ ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం సరికాదు" అని ఆమె స్పష్టం చేశారు

AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. చరిత్రలో మరిచిపోలేని రోజు! AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. ఈ నిర్ణయం బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుందని ఆమె పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. బీసీల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఆయన స్ఫూర్తితో సీఎం చంద్రబాబు బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. 1994లోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం పెరుగుతుందని అన్నారు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీ అని సవిత పేర్కొన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వంటి పలువురు బీసీ నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగారని తెలిపారు. బీసీలకు రాజకీయ గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పించడంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత విధించిందని మంత్రి సవిత ఆరోపించారు. 34 శాతం నుంచి 24 శాతానికి రిజర్వేషన్లు తగ్గించడం వల్ల 16,800కు పైగా పదవులకు బీసీలు దూరమయ్యారని విమర్శించారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని మంత్రి నారా లోకేశ్ తన పాదయాత్రలో గుర్తించి, అధికారంలోకి వస్తే 34

బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బలహీనవర్గాలను అసెంబ్లీకి పంపారని.. స్థానిక సంస్థలలో 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. అమరావతి, ఆగస్టు 18: బీసీలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు(మంగళవారం) ఏపీ అసెంబ్లీలో బీసీ సాధికారత రిజర్వేషన్లపై మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక బలహీనవర్గాలను అసెంబ్లీకి పంపారని.. స్థానిక సంస్థలలో 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 34 శాతం రిజర్వేషన్లను కల్పించారని గుర్తుచేశారు. గతంలో ఉన్న చట్టంలో మార్పు చేయాలంటే .. సవరణ చేయాలన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలపై దాడులు చేశారని, దమనకాండ చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీకి అండగా ఉన్న వర్గం బీసీలు అని అన్నారు. అందుకే బీసీలపై వైసీపీ కక్ష కట్టిందని విమర్శించారు. బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పి రిజర్వేషన్లను పెంచారని, అయితే చట్టాన్ని మార్పు చేయాల్సి ఉండగా అలా చేయకుండా కొత్త జీవో ఇచ్చారని గత ప్రభుత్వంపై మంత్రి మండిపడ్డారు. ఆ రిజర్వేషన్లు వద్దు అని చెప్పి వైసీపీ సానుభూతిపరుడితోనే కోర్టులో కేసులు పెట్టించారన్నారు. కోర్టులో ఎదురుదెబ్బ తగిలితే సుప్రీంకోర్టుకు వెళ్లలేదని... తద్వారా బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. నేడు కేబినెట్ సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: మంత్రి సవిత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఏపీ మంత్రివర్గ భేటీలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లు కు ఆమోదం తెలపనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్ల పైన కేబినెట్ భేటీ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా బీసీ రక్షణ చట్టం.. అమరావతిలో భూ సమీకరణ వంటి అంశాల పైన చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ పైనా నిర్ణయం తీసుకోనున్నారు.అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుకు సిద్దం అవుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంతులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ముందుకు వెళ్లే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. స్థానిక ఎన్నికలకు ఈవీఎంలా.. బ్యాలెట్ బాక్సులా- ప్రభుత్వం తాజా ఆదేశాలతో..!?దాదాపు 55కు పైగా అజెండా అంశాలతో మంత్రులు సమావేశం కానున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై క్యాబినెట్లో చర్చించనున్నారు. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.కాగా, తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఇంధన రంగంలో హైబ్రిడ్, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపైన చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రైల్వేలైన్ కోసం ల్యాండ్ పూలింగ్‌పై మత్రులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణ ప్రతిపాదనలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి- ఉత్తర్వులు జారీ..!!10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ విద్యార్థులకు IIT-JEE, NEET కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుపై క్యాబినెట్లో మాట్లాడనున్నారు

దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. అమరావతి, ఆగస్టు 18: దేశంలో కొబ్బరి అంటే గుర్తొచ్చే పేరు కోనసీమ అని.. ఆ జిల్లాకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. కొబ్బరి సాగులో 10వేల హెక్టార్లలోని కొబ్బరితోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనెక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు వెయ్యి సాయం చేసి కొత్తమొక్కలు పెట్టించాలని ప్రతిపాదన ఉందన్నారు. డ్రెయిన్లు శుభ్రం చేయకపోతే ఎంత పెట్టుబడి పెట్టినా, కొత్త మొక్కలు నాటినా ఫలితాలు ఉండవని మంత్రి తెలిపారు. అందుకే మొదటి దశలో శంఖరగుప్తం కాలువ పూడిక తీస్తే రెండు, మూడు నియోజకవర్గాల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. కొత్త ప్లాంటేషన్‌కు వీబీ రాంజీ పథకం కింద కేంద్రంలోని కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రకటించారు. మొత్తం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని కోనసీమలో కొత్తమొక్కలు పెట్టిస్తామమని చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పినట్లు అంతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. కొబ్బరితోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ మండలిలో పోడియం వద్ద బల్లలు చరుస్తూ వైసీపీ ఆందోళన.. సభ వాయిదా స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజున కీలక అంశంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 25 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏదీ లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జాతీయ జనాభా గణన (సెన్సస్) ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ విషయంలో ముందుకు వెళ్లలేమని ఆయన వెల్లడించారు.మంగళవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా గణన ప్రక్రియ కొనసాగుతోందని, 2027 మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు.జనగణన పూర్తయ్యే వరకు పరిపాలనా పరమైన సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మంత్రి సభకు వివరించారు. అందువల్ల, జనాభా గణన ప్రక్రియ ముగిసిన తర్వాతే అధిక జనాభా గల పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుపై మరికొంత కాలం వేచి చూడక తప్పదని స్పష్టమైంది

ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. అమరావతి, ఆగస్టు 18: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే డీఎస్సీపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి బల్లలు చరుస్తూ ఆందోళనకు దిగారు. నిరసనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. డీఎస్సీపై శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. DSCపై మండలిలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే నిర్ణయాన్ని ప్రజలు తమకు అప్పజెప్పారన్నారు. ‘మీరు కోరుకున్నట్టు ప్రభుత్వం నడవదు. నిన్న BAC లోనే మేము క్లియర్‌గా చెప్పాం. DSCపై చర్చకు సిద్ధమని నిన్న బీఏసీలోనే చెప్పాం. చైర్మన్ పోడియం ఎక్కడం మంచిది కాదు’ అని మంత్రి చెప్పారు. ప్రశ్నోత్తరాల అనంతరం బీఏసీకి పిలుస్తామని వైసీపీ సభ్యులతో చైర్మన్ అన్నారు. అయితే ఇప్పుడే డీఎస్సీకి పిలవాలని ప్రతిపక్ష నేత బొత్స పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత పిలుస్తానమని చైర్మన్ చెప్పినప్పటికీ.. వైసీపీ సభ్యుల నినాదాలు ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో సభను చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు. రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Assembly Session Today Agenda: ఆంధ్ర ప్రదేశ్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు 11 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ క్యాబినేట్ సమావేశం కానుంది. ఈ భేటిలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనుంది. అనంతరం వాటిని సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు శాసన సభ..ఉదయం 9 గంటలకు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కానుంది. వడ్డీ లేని రుణ పరిమితి పెంపుతో పాటు స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు.. కొబ్బరి తోటల పరిస్థితి.. ఉన్నతి పథకం .. కాఫీ రైతులకు పరిహారం.. రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు ... విశాఖలో వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు.. గ్రామ పంచాయతీల ఉన్నతీకరణపై సభ్యుల ప్రశ్నలుండన్నాయి. ఇక వెనకబడిన వర్గాలు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. అటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామిని కూడా క్యాబినేట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 24.15 శాతం రిజర్వేషన్స్ ఉన్నాయి. వాటిని మరో 9.75 శాతం పెంపు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మేయర్, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు.. అటు మున్సిపల్ కార్పోరేషన్లకు సంబంధించిన మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే బిల్లుకు క్యాబినేట్ ఆమోదం తెలిపి ఉభయ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు. అనంతరం విద్యుత్ శాఖకు సంబంధించిన జీవో ఆర్టీ నం.27ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-1971 ప్రకారం ఈ జీవోను సభ ముందు పెట్టనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ (అమెండ్మెంట్) బిల్లు-2026పై కీలక ప్రక్రియ జరగనుంది. సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరడంతోపాటు.. బిల్లును పరిశీలనకు తీసుకోవాలని, అనంతరం ఆమోదించాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించనున్నారు. అలాగే, ‘సూపర్ సిక్స్-ప్రజా సంక్షేమం’పై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సూపర్ సిక్స్ పథకాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంపై ఎమ్మెల్యే దాసరి సుధ ప్రశ్నించనున్నారు. గత రెండేళ్లలో స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసిన వడ్డీ లేని రుణాల వివరాలనూ ఆమె కోరనున్నారు. 25 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనపై ప్రశ్నలు రానున్నాయి. కోవూరు గ్రామ పంచాయతీని కూడా అప్‌గ్రేడ్ చేసే జాబితాలో చేర్చారా? అనే అంశంపై సభ్యులు ప్రశ్నించనున్నారు. కోనసీమలో వృద్ధాప్య దశకు చేరిన కొబ్బరి తోటల అంశం సభ ముందుకు రానుంది. కొబ్బరి తోటల పునరుజ్జీవనం, తిరిగి నాటే కార్యక్రమాలపై కొబ్బరి అభివృద్ధి బోర్డుతో కేంద్రం జరిపిన సంప్రదింపుల వివరాలను కోరనున్నారు. అర్హులైన కొబ్బరి రైతులకు కొత్త మొక్కలు
అసెంబ్లీ సాక్షిగా సీఎం క్షమాపణలు.. మాజీ సీఎం ప్రస్తావనతో..! తమిళనాడు శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. హెల్త్, రెవెన్యూ పద్దులపై చర్చ సందర్భంగా అటవీ శాఖ మంత్రి ఆర్వి రంజిత్ కుమార్ మాజీ సీఎం కరుణానిధి పేరును నేరుగా ప్రస్తావించడంపై డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం కూడా జోక్యం చేసుకుని సభ సాంప్రదాయాలను గుర్తుచేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం సి. జోసెఫ్ విజయ్ సభలోనే క్షమాపణలు తెలిపారు. అనంతరం రూల్ 110 కింద సీఎం సభలో ప్రకటన చేస్తూ.. రూ. 75 వేల వరకు ఉన్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తం రుణమాఫీ ప్యాకేజీ రూ. 6,220 కోట్లకు చేరగా, 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ వార్తకు సంబంధించిన

జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నా: జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 3వ తేదీన బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పీకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 1995 నుండి బీజేపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని దక్కించుకున్న పీకే.. బీజేపీకి గట్టి దెబ్బ కొట్టి చరిత్రాత్మక ఎన్నికల రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 64,151 ఓట్లు సాధించిన పీకే.. బీజేపీకి చెందిన నీరజ్ కుమార్‌ను 19,324 ఓట్ల తేడాతో ఓడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభకు వెళ్లడంతో.. బంకీపూర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో పోటీ చేసిన పీకే.. ఎవరూ ఊహించని రీతిలో విజయం ఢంకా మోగించి.. బిహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. చేపల వేటకు వెళ్లి తిరిగి రాని మత్స్యకారులు.. కోనసీమ జిల్లా యంత్రాంగం అలర్ట్ ఎన్టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

ఏపీ అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టారు. మెగా డిఎస్సీ నిర్వహణ, ఫలితాలపై వైసిపి చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన అసెంబ్లీలో, మండలిలో ఆధారాలతో సహా ఖండించారు. ప్రభుత్వం పారదర్శకంగా రికార్డు స్థాయిలో 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని విద్యాశాఖ మంత్రి విస్పంష్టంగా తేల్చి చెప్పారు. లోకేష్ సభ సాక్షిగా ఇచ్చిన వివరణతో వైసీపీకి బుల్లెట్ దిగిందా అన్నట్లుగా రిప్లై ఇచ్చారు. లోకేష్ వైసీపీకి ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అక్కడ, అలా ఇచ్చేశారని విశ్లేషించారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ అనలిస్టు డీవీ శ్రీనివాస్. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన డీవీ శ్రీనివాస్.. లోకేష్ సమావేశంతో జగన్ చెబుతున్నట్లు ప్రభుత్వం పారిపోలేదనీ జగనే పారిపోతున్నారని తేటతెల్లమైందని అన్నారు. సరిపోదా జగన్ సరిపోదా లోకేష్ రిప్లై అని ప్రశ్నించారు. లోకేష్ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారన్న ఆయన.. ఇప్పటికి మూడు సార్లు చర్చకు రావాలని చేసిన లోకేష్... ఇప్పుడు నాలుగో సారి సవాల్ చేశారన్న డీవీ శ్రీనివాస్.. సభకు రాకుండా వైసీపీ పారిపోయిందనడానికి ఆ పార్టీ సభ్యులు సభకు రాకపోవడమే నిదర్శనమన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు. డీవీ శ్రీనివాస్ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించండి. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి.!

మహారాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తెరదించారు. తమ పార్టీ ఎన్డీయేలో చేరబోదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలోనే కొనసాగుతామని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.వారాంతంలో జరిగిన రెండు రోజుల పార్టీ సమావేశంలో శరద్ పవార్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరతారన్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. మహారాష్ట్రతో పాటు జాతీయ స్థాయిలోనూ సమర్థమైన ప్రతిపక్షంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.అజిత్ పవార్ వర్గంతో మళ్లీ కలుస్తారన్న ప్రచారానికి కూడా తాజా నిర్ణయంతో తెరపడినట్లయింది. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమికి ఊరట లభించింది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్ష పోరాటాన్ని కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.ఇటీవల శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సుప్రియా సూలే, బజరంగ్ సోనావణే నేతృత్వంలో ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. శరద్ పవార్ కూడా ప్రభుత్వ పెద్దలను కలవడంతో పార్టీ ఎన్డీయే వైపు వెళుతుందన్న ప్రచారం ఊపందుకుంది.అయితే నియోజకవర్గాల అభివృద్ధి, రైతుల సమస్యలు, ప్రజా ప్రయోజనాల కోసమే ఇలాంటి భేటీలు జరుగుతున్నాయని ఎన్సీపీ (ఎస్పీ) స్పష్టం చేసింది. వీటికి పార్టీ రాజకీయ వైఖరితో సంబంధం లేదని తెలిపింది.పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు శశికాంత్ షిండే కూడా తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించనున్నట్లు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా, మంత్రుల మధ్య చోటుచేసుకున్న ఓ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన పార్టీ కండువా వేసుకుని శాసనసభలోకి రాగా, దానిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తనదైన శైలిలో చమత్కరించారు. "సత్యగారూ.. మీకెందుకండి ప్రత్యేకంగా పార్టీ కండువా? మీరు బీజేపీ అని లోకమంతా తెలుసు కదా" అని లోకేశ్ సరదాగా అనడంతో, సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా జతకలిశారు. "అవును సర్.. జాతీయ స్థాయిలో ప్రముఖ నేతల్లో సత్యగారు కూడా ఒకరు" అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడంతో అక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. ఆ తర్వాత లోకేశ్ మరో అడుగు ముందుకేసి.. "మా పార్టీ వారికి కూడా కొంచెం క్రమశిక్షణ గురించి నేర్పించండి" అని నవ్వుతూ సత్యకుమార్‌ను కోరారు. దీనిపై పక్కనే ఉన్న ఓ టీడీపీ ఎమ్మెల్యే "పార్టీ ఫస్ట్, సర్!" అని స్పందించగా.. వెంటనే సత్యకుమార్ యాదవ్ చిరునవ్వుతో "నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్!" అంటూ ఇచ్చిన రిప్లై మంత్రులు, ఎమ్మెల్యేలను ఎంతగానో ఆకట్టుకుంది. విధానపరమైన చర్చలతో సీరియస్‌గా సాగే అసెంబ్లీలో ఈ సరదా సంభాషణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

‘పాఠాలు చెప్తాం.. గుణపాఠాలు కూడా నేర్పుతాం’ అంటూ టీచర్లు చేస్తున్న ర్యాలీలను గొడ్డలి పార్టీ గుర్తు పెట్టుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజనులను గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అమరావతి, ఆగస్టు 17: ‘పాఠాలు చెప్తాం.. గుణపాఠాలు కూడా నేర్పుతాం’ అంటూ టీచర్లు చేస్తున్న ర్యాలీలను గొడ్డలి పార్టీ గుర్తు పెట్టుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు(సోమవారం) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గిరిజనులను గొడ్డలి పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇవ్వకపోతే మారాం చేస్తున్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని అనడం హాస్యాస్పదమన్నారు. 1/70 యాక్ట్.. అంటే గిరిజనుల భూ సంరక్షణ చట్టం రద్దు అవుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. గిరిజనుల భూములు, హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో గిరిజనులు ఏమాత్రం భయపడవద్దన్నారు. గిరిజనులను మభ్యపెట్టి, భయపెట్టి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఐటీడీఏ ఆపేసి, 18 పథకాలను నిలుపుదల చేశారని తెలిపారు. గురివిందకు తన తప్పు ఎరుగదు అన్నట్టు వైసీపీ నేతల తీరు ఉందని విమర్శించారు. జీవో నం 3 రద్దు చేస్తే అప్పుడు సీఎంగా జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. ఆయన తాడేపల్లిలో ఉంటాడో బెంగళూరులో ఉంటాడో ఎవరికీ తెలియదంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు శాశ్వత మైలురాయి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... డీఎస్సీ నిర్వహణ, విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలపై కీలక వివరాలు వెల్లడించారు. డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహించిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఏకంగా 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని సభకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని లోకేశ్ వివరించారు. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలను అత్యంత పారదర్శకంగా తెలిపారు. ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపిస్తుంటే, గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి కించపరిచిందని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వంలో వ్యవస్థను ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై న్యాయస్థానాల్లో 336 కేసులు దాఖలైన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తూ, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేశామని వెల్లడించారు. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కి సంబంధించి 3.68 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1.87 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారనే గణాంకాలను అసెంబ్లీ వేదికగా లోకేశ్ సమర్పించారు

సాక్షి, అమరావతి: ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు.. వాయిదాల పర్వంతో మొదలైంది. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరిట జరిగిన అక్రమాలపై శాసనమండలి దద్దరిల్లింది. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. చైర్మన్ తిరస్కారంతో చర్చకు పట్టుబట్టింది. ‘‘ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి. కానీ, మూడు లక్షల మందిని డీఎస్సీ రిక్రూట్మెంట్ పేరిట మోసం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. స్పోర్ట్స్ కోటా పేరుతో వాళ్లకు నచ్చినవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ అక్రమాలపై సభలో చర్చ జరగాల్సిందే. ఏపీపీఎస్సీపై కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. మంత్రుల అసహనం డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం వ్యక్తం చేశారు. విపక్ష నేతకు మైక్ ఎలా ఇస్తారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ప్రశ్నించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్నారు. బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడ : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి (ఫొటోలు) విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు) హైదరాబాద్ ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు) భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నువొక డమ్మీ హోమ్ మంత్రివి.. నీకు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని హితవు పలికారు.. సభలో ఎల్‌నినో అంశంపై చర్చించాలని సూచించారు. రఘువీరారెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని.. వారు సభకు దూరంగా ఉండటం సరికాదన్నారు.ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎష్ జగన్ అసెంబ్లీకి వెళ్లి ఎల్‌నినోపై సలహాలు ఇవ్వొచ్చన్నారు రఘువీరారెడ్డి. రాష్ట్రంలో రైతులు ఎల్‌నినో కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఎల్‌నినో, కరువు పరిస్థితులపై చర్చించి కేంద్రం సహకారంతో రైతుల్ని ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎల్‌నినో దెబ్బకు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని..వర్షాలు లేక రైతులు వేసిన పంటలు కనీసం మొలకెత్తలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్‌నినో గండం నుంచి రైతులను ఆదుకునేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు రఘువీరారెడ్డి.తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపేయాలని రఘువీరారెడ్డి కోరారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాల వినియోగంపై చర్చిస్తే జలవివాదాలకు అవకాశం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ తుంగభద్రలో నీటి వాటాను అడగకపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యా వ్యవస్థలో సమస్యలపై విద్యార్థి గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తు్న్నామని.. యువత భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీ మేధో నక్సల్స్ అన్న మాటను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు మాజీ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Andhra Pradesh Monsoon Assembly Session: ఆంధ్ర ప్రదేశ్ వర్షకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. గతంలో మాదిరే వైసీపీ అసెంబ్లీకి రాకూడదనే నిర్ణయం తీసుకుంది. శాసనసభలో తగినంత బలం లేనందున తమ వాదనలు వినిపించుకోరనే ఉద్దేశ్యంతో అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు ఏపీ శాసన మండలిలో తగిన బలం ఉన్నందున అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందకు వైసీపీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో జరిగిన మెగా DSC పరీక్షలో అక్రమాలు జరిగాయని YSPCP ఆరోపణ నేపథ్యంలో ఈ సారి సమావేశాలు హాట్ హాట్‌గా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ , శాసనమండలి సమావేశాలకు అన్ని రకాల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారులను దిశా నిర్ధేశం చేశారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో డిజిటల్ పాసులు.. కాగా ఈ సారి అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధులకు డిజిటల్ పాస్‌లు జారీ చేశారు. దీనిద్వారా గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో పాటు ప్రవేశం, నిష్క్రమణల వద్ద పాసుల స్కానింగ్ చేసిన తర్వాతే లోపలకి అనుమతిస్తారు. అంతేకాదు వెళ్లిటపుడు కూడా స్కానింగ్ చేయడం ద్వారా ఎవరు అసెంబ్లీ, మండలిలో ఎంత సేపు గడిపారనే విషయాన్ని నిర్ధారించుకోనున్నారు. ఎవరు వచ్చారు. ఎవరు వెళ్లారనే దానిపై క్లారిటీ కోసమే వీటిని జారీ చేయనున్నారు. అంతేకాదు మరోవైపు ఫేషియల్ రికగ్నైజేషన్ కూడా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే అవకాశం కనిపిస్తున్న ఈ సభా సమరంలో సర్కార్‌ను కార్నర్ చేసేందుకు ప్రతిపక్షం, వైసీపీ దాడిని తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహప్రతివ్యూహాలు సిద్ధమయ్యాయి. మొదటిరోజే సభలో అసలైన రాజకీయం నడవనుంది. నిరుద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న మెగా డీఎస్సీ-2025పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలిరోజే సభలో సంచలన ప్రకటన చేయనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు ఎల్-నినో ప్రభావంపై లఘు చర్చతో సభను మొదటిరోజే రసవత్తరంగా మార్చేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది.గైర్హాజరైతే జీతాలు కట్.. స్పీకర్ సంచలన అస్త్రం!సభకు రాకుండా జారుకునే ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఊహించని షాక్ ఇచ్చారు. ఇకపై సభలో దొంగ హాజరులకు ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో స్వయంగా కూర్చుంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ-కెమెరాలు ఆటోమేటిక్‌గా ఆన్ అయి హాజరును రికార్డు చేసేలా డిజిటల్ కెమెరా టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇంతటితో ఆగకుండా, ప్రజాధనాన్ని వృథా చేస్తూ సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్ పరిధిలోనే కఠిన చట్టం తేవాలని కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజలు గెలిపించింది సభలో కూర్చుని మాట్లాడటానికేనని, జగన్ బాధ్యతాయుతంగా అసెంబ్లీకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు.జగన్ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్! అసెంబ్లీకి రాకపోతే జీతం కట్గత అక్రమాలపై అటాక్.. నాలుగు రోజుల పొలిటికల్ డ్రామా!నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం పాత సర్కార్ పాపాలను ఎండగట్టేందుకు పక్కా అజెండాతో వస్తోంది. ఆగస్టు 18న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చ జరగనుండగా.. మూడో రోజు వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల స్కామ్‌ను బయటపెట్టేందుకు వ్యూహం రచించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, నాలుగో రోజు పెట్టుబడులతో పాటు సూపర్-6 హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించనుంది. మొత్తం 6 కీలక

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Assembly Session: సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని.. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తొలి సీఎం కె. చంద్రశేఖర్ రావు సభకు హాజరుకావాలని మరోసారి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి హాజరై అభివృద్ధి, సంక్షేమంపై చర్చించి.. తమకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 'రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటికి గెంటేసిన చరిత్ర కేటీఆర్‌ది. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కన్న తండ్రి కళ్లున్న ధృతరాష్ట్రుడిలా మారిపోయాడు' అని కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకున్నారని విమర్శించారు. ప్రజా పాలన- ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి దాదాపు రూ.424 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. విడతల వారీగా ప్రభుత్వంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువకుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. ప్రగతి నివేదన '32 నెలల్లో ధాన్యం కొనుగోలు చేసి 90 వేల కోట్లు రైతులకు చెల్లించాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసి రైతును రాజును చేయాలని ప్రయత్నిస్తున్నాం. రెండున్నరేళ్లలో రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ రుణాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా..? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ ఉదయం కాకినాడలో జరిగిన అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్‌ను పరీక్షించిన వైద్యులు ఆయనకు కనీసం రెండు వారాల పాటు ఎలాంటి శారీరక ఒత్తిడి లేకుండా పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. శస్త్రచికిత్స జరిగిన భుజంపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైద్యుల సలహా ప్రకారం ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజుకు ఆయన హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని జనసేన పార్టీ వర్గాల సమాచారం. జ్వరం తీవ్రత తగ్గిన తర్వాత, వైద్యుల అనుమతితోనే ఆయన విజయవాడకు తిరిగి వచ్చి సభకు హాజరవుతారని తెలుస్తోంది. అస్వస్థతతో బాధపడుతున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ తన అధికారిక విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు. త్వరలోనే మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖాపరమైన సమీక్షలు మరియు అసెంబ్లీ వ్యూహాలపై జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసైనికులు, కూటమి నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు

Parkal: నిరుద్యోగులను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం! ఈ వార్తకు సంబంధించిన

వరంగల్ నేలకు ఒక గొప్ప చరిత్ర, పోరాట చైతన్యం ఉందని, పాలకుల అణచివేతకు గురైన ప్రతి సందర్భంలోనూ ఇక్కడి ప్రజలు తమ తిరుగుబాటును చాటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరకాలలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో తమ పార్టీ నాయకురాలు యశస్విని రాజకీయ కొండను బద్దలు కొట్టి విజయం సాధించారని గుర్తుచేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం కూలేశ్వరమైనా సరే.. ప్రాజెక్టులను నీటితో నింపి రైతులు అత్యధికంగా పంటలు పండించేలా చర్యలు తీసుకున్నామని సీఎం వివరించారు.రైతాంగం, మహిళల సంక్షేమానికి రూ. లక్ష కోట్ల ప్రాధాన్యం!తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గత 32 నెలల కాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఏకంగా రూ.90 వేల కోట్లు చెల్లించామని, రైతు భరోసా, రుణమాఫీ అమలు చేస్తూ రైతును రాజుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెండున్నరేళ్ల పాలనలో రైతుల శ్రేయస్సు కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని, సన్న ధాన్యానికి బోనస్ అందించిన ఘనత తమదేనన్నారు. ఇక మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ ఇద్దరు ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చామని తెరిపారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలకు గుండు సున్నా పెడితే, తమ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిందని, యూనిఫాం కుట్టే పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడంతో పాటు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణలో ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.కుటుంబ స్వార్థం కేసీఆర్‌ది.. ప్రజా సంక్షేమం మాది!కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టారని, కానీ ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు, పోరాట యోధులకు గుర్తింపు దక్కిందని సీఎం లెక్కలతో సహా వివరించారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడిని మంత్రులను చేస్తే, తాను సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌లను మంత్రులను చేశానని

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను సమావేశపర్చనున్నారు. అయితే, వైసీపీ.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో ఈసారి కూడా సభ కూటమి సభ్యులతోనే జరగనుంది. ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) హోదా నిరాకరణకు నిరసనగా తమ బహిష్కరణ కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది.మరోవైపు, ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావం, రైతుల సమస్యలు, అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అధికారపక్షం తన వాదనను వినిపించనుంది.స్పీకర్ ఆహ్వానం.. వైసీపీ తిరస్కరణసమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే, సంబంధిత మంత్రుల నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడం, తమ నియోజకవర్గాల వాణిని వినిపించడం శాసనసభ్యుల బాధ్యత అని, జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో, అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు చెల్లించాలని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించి, తగిన చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించడం గమనార్హం.మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: జగన్అసెంబ్లీని బహిష్కరిస్తున్నప్పటికీ, శాసనమండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ శాసనసభ్యులతో ఇటీవల సమావేశమైన ఆ పార్టీ అధినేత