
బెంగళూరు (చిత్రదుర్గం): ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీనడంతో వినోద్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చిత్రదుర్గం జిల్లా దండిన కురుబరహట్టి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్‌ అనే వ్యక్తి చెల్లకెరలో కర్ణాటక కట్ పీస్ సెంటర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చిత్రదుర్గం బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్రదుర్గం రూరల్ పోలీసులు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






