
కమలాపురం: వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కడప- తాడిపత్రి జాతీయ రహదారిపై కమలాపురం సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద ఓ ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వాకిటి వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి షేక్‌ మహబూబ్‌ బాషా తీవ్రంగా గాయపడ్డారు. కొందరు పాత బట్టల వ్యాపారం చేసుకునేవారు కడప నుంచి ఎర్రగుంట్ల వైపునకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు కడప చిన్నచౌక్‌కు చెందిన మహిళగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






