
West Bengal | విద్యార్థులకు మొబైల్ ఫోన్లు కొనేందుకు ఆర్థిక సాయం.. పథకాన్ని రద్దు చేయనున్న బెంగాల్
West Bengal | విద్యార్థులకు మొబైల్ ఫోన్లు కొనేందుకు ఆర్థిక సాయం.. పథకాన్ని రద్దు చేయనున్న బెంగాల్
© 2026 nimisham.in

West Bengal | విద్యార్థులకు మొబైల్ ఫోన్లు కొనేందుకు ఆర్థిక సాయం.. పథకాన్ని రద్దు చేయనున్న బెంగాల్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని నగరాల్లో పరిశుభ్రతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ జరిమానాల ఉద్దేశం ఆదాయం సమకూర్చుకోవడం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమేనని పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే రూ.100 జరిమానా విధిస్తారు. చెత్తను పడేయడం లేదా అపరిశుభ్రతకు కారణమయ్యేలా చేయడంపై రూ.200 జరిమానా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్ర విసర్జన చేసినా రూ.200 చెల్లించాలి. 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకానికీ ఇదే జరిమానా వర్తిస్తుంది. అయితే జరిమానాలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన పౌర మౌలిక వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వం తెలిపింది. “జరిమానాల ద్వారా డబ్బు వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం. జరిమానాలు విధించి ప్రజల నుంచి డబ్బు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని పాల్ చెప్పారు. కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు కూడా అందంగా మారాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్కటితో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో బాధ్యతాభావం రావాలని, “ఈ నగరం కూడా తమదే” అనే భావన పెరగాలని ఆమె అన్నారు. ఏడాదిలో కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు తమ నగరం, తమ రాష్ట్రాన్ని తామే అపరిశుభ్రం చేయకూడదనే భావనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మౌలిక వసతులపై దృష్టి ప్రజా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నారు

నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన 116 ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ రాష్ట్రాల్లో నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఆందోళనలు విరమిస్తే వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని జులై 25న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి ఇచ్చిన హామీని ఆయా రాష్ట్రాలు తమ పిటిషన్లలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ నెల 5న ఢిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు సీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు వేగంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన కేసుల ఉపసంహరణపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హెగ్సెత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 2028 రేసులో ఉన్నట్టా? విమాన ఇంధనానికి మళ్లీ మంట.. లీటరుకు రూ.6.28 పెరిగిన ఏటీఎఫ్ ధర

పశ్చిమ బెంగాల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్ రక్షణను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సిలిగురిలో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో సశస్త్ర సీమ బల్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయ పరిపాలనా భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. దేశ సరిహద్దులు బలోపేతం కానంత వరకూ భారత్ ఎంత మాత్రం సురక్షితంగా కాదని తేల్చి చెప్పారు. నలుమూలలా వ్యాపించి ఉన్న సరిహద్దులను మరింత పటిష్ట పర్చుకోవాల్సి ఉందని అన్నారు. సిలిగురి కారిడార్‌ను దేశంలో అత్యంత సున్నితమైన, భౌగోళిక వ్యూహాత్మక ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు దీనికి తగిన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు.దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఈ చికెన్స్ నెక్ ప్రాంత భద్రత దేశ సార్వభౌమాధికారానికి ఎంతో కీలకమని అమిత్ షా అన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించనున్న భారీ ఎస్ఎస్బీ పరిపాలనా భవనం సరిహద్దు రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షించడానికి, పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేయడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. జాతీయ భద్రత విషయంలో కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్దేశంలో శాంతిభద్రతలు వర్ధిల్లాలన్నా, పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశమంతటా సురక్షిత వాతావరణం నెలకొనాలన్నా సరిహద్దు వెంబడి శత్రువుల కదలికలను పూర్తిగా అరికట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా భద్రతా బలగాలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు కంచె వేయాలని కేంద్రం భావించినప్పటికీ.. దీనికి కావలసిన భూమిని కేటాయించడంలో గత మమత బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. సరిహద్దుల

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో... కోల్‌కతా, ఆగస్టు 19: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సుమారు 80మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రతి అంతస్తులో నాలుగైదు హోటళ్లు నడుస్తున్నాయని.. గాలి, వెలుతురు లేని ఇరుకైన గదులే ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు

మన దేశమంతా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటాము. కానీ పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆరోజు నిర్వహించుకోరు. వారికి ఆగస్టు 18న స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకుంటారు. అందుకే ఆ రోజే నిర్వహించుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాలు ఆగస్టు 18నే స్వాతంత్య్ర దినోత్సవం సెలెబ్రేట్ చేసుకుంటాయి. అలా ఎందుకు చేసుకుంటారో తెలుసుకోండి. 1947లో భారత విభజన సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం సరిహద్దుల విభజన బాధ్యతను లండన్‌కు చెందిన న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ కు అప్పగించింది. అంతకుముందు ఎన్నడూ భారతదేశానికి రాని రాడ్‌క్లిఫ్, సరిహద్దు కమిషన్లకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. వారు గీసిన ప్రాథమిక మ్యాప్ ప్రకారం పశ్చిమ బెంగాల్ లోని హిందూ జనాభా ఎక్కువగా ఉన్న నదియా, మాల్దా, ముర్షిదాబాద్, దినాజ్‌పూర్ వంటి ప్రాంతాలను పొరపాటున తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) భూభాగంలో చూపించారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే, ఈ ప్రాంతాల ప్రజలు తాము ఏ దేశంలో ఉన్నామో తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాత్కాలిక మ్యాప్ ఆధారంగా ఆగస్టు 14, 15 తేదీలలో నదియాలోని కృష్ణనగర్, మాల్దాలోని ఇంగ్లీష్ బజార్ వంటి ప్రభుత్వ భవనాలపై పాకిస్తాన్ జాతీయ జెండాలను కూడా ఎగురవేశారు. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, హిందూ మహాసభ నాయకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, నదియా రాజకుటుంబీకులు తీవ్ర నిరసనలు వ్యక్తంచేసి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మౌంట్‌బాటన్, రాడ్‌క్లిఫ్‌ను సరిహద్దులను సరిచేయాల్సిందిగా ఆదేశించారు. ఆగస్టు 17 రాత్రి ఆల్ ఇండియా రేడియో ద్వారా సవరించిన మ్యాప్ వివరాలను ప్రకటించారు. దీని ప్రకారం ఈ ముస్లిమేతర మెజారిటీ ప్రాంతాలు భారతదేశంలోనే ఉంటాయని స్పష్టమైంది. రేడియో ప్రకటన తర్వాత, 1947 ఆగస్టు 18 మధ్యాహ్నం ఆయా ప్రాంతాల్లోని పాకిస్తాన్ జెండాలను తొలగించి, మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఎగురవేశారు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విద్వేష ప్రసంగం కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు పశ్చిమ బెంగాల్‌లోని జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విద్వేష ప్రసంగం కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకుంది. ఆగస్టు 28న వారెంట్ అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కృష్ణానగర్ కోర్టులోని మూడో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఈ ఆదేశాలు జారీ చేశారు (Mahua Moitra Arrest Warrant). విద్వేష ప్రసంగం కేసులో కోర్టుకు హాజరు కావాల్సిందిగా గతంలో పలుమార్లు సమన్లు పంపినా మహువా మొయిత్రా హాజరు కాలేదని కోర్టు పేర్కొంది. దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేయడం తప్ప మరో మార్గం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. ఆగస్టు 12న కోర్టు ముందు మహువా మొయిత్రా హాజరు కావాల్సి ఉంది. ఆరోజున ఆమె కోర్టుకు రాలేదు. దీంతో ఆగస్టు 19న అయినా హాజరు కావాలని మరో అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె రాలేదు. దీంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది (TMC MP Hate Speech Case). మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా మహువా మొయిత్రా ప్రసంగించారనే ఆరోపణలతో కేసు నమోదైంది (West Bengal News). ఈ కేసులోనే ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసింది. మహువా తరఫు న్యాయవాది ఆమెను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుపరచడం నుంచి మినహాయించాలని కోరారు. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం.. పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్

ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. విద్వేష ప్రసంగం కేసులో సమన్లను ధిక్కరించినందుకుగానూ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ కోర్టు ఈమేరకు చర్యలు తీసుకుంది. ఈ అరెస్టు వారెంట్ అమలుకు సంబంధించిన నివేదికను ఆగస్టు 28న తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మహిళలను అవమానించారని, విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై మహువా మొయిత్రాపై గతంలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి కృష్ణానగర్ కోర్టు ఆమెకు పలుమార్లు సమన్లు జారీ చేసింది. బుధవారం కోర్టుకు హాజరు కావాలని ఇటీవల మరోసారి ఆదేశించింది. అయినప్పటికీ.. ఆమె హాజరు కాలేదు. పదేపదే సమన్లు జారీ చేసినప్పటికీ.. ఆమె గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. కుటుంబం గురించే ఎక్కువ చెప్పా కానీ..: సోనియా గాంధీ ‘‘కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరించడం.. ఆమె నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోంది. దీంతో అరెస్టు వారెంట్ జారీ చేయడం తప్ప కోర్టుకు వేరే మార్గం లేకపోయింది. మొయిత్రా కోర్టుకు హాజరవ్వరని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. దీనిని బట్టి ఆమెకు న్యాయస్థానంపై గౌరవం లేదని స్పష్టమవుతోంది’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చండీగఢ్‌లో వర్ష బీభత్సానికి నగరంలోని ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్ ధ్వంసమైంది. పంజాబ్‌లోని లూధియానాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మంచి నీటి పైప్‌లైన్

కోల్‌కతాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. ఆరుమందికి పైగా గాయపడ్డారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలకు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు.నగరంలోని ప్రీ స్కూల్ స్ట్రీట్‌లో ఉన్న హోటల్ ఇది. ఈ వేకువ జామున 1:45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత దట్టమైన పొగ అలముకుంది. ఈ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న వాళ్లు తేరుకుని బయటపడే లోపే అగ్నికీలలు హోటల్ మొత్తం వ్యాపించాయి. అక్కుడున్న ఫర్నిచర్, కర్టెన్లు, ఇతర వస్తువులు.. మంటలు త్వరగా వ్యాప్తిచెందడానికి కారణం అయ్యాయి.ఈ ఘటనలో ఊపిరాడక కొందరు, మంటల బారిన పడి మరికొందరు మరణించారు. మృతుల్లో ఒకరు బంగ్లాదేశీయుడు ఉన్నట్లు గుర్తించారు. అతను వైద్యం కోసం కోల్‌కతా వచ్చినట్లు తేలింది. సమాచారం అందిన వెంటనే అయిదు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. భవనం అంతా దట్టమైన పొగ అలుముకోవడంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి అత్యంత కష్టతరంగా మారింది.అమెరికా పౌరసత్వ రికార్డుల తనిఖీ మొదలెట్టినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటననిచ్చెనల సహాయంతో పై అంతస్తులకు చేరుకోవడానికి కూడా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్థానిక పోలీసులతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించాయి. ఈ మంటలు.. పక్కనే ఉన్న మరికొన్ని హోటళ్లు, వ్యాపార సముదాయాలకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుమందిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.మంటల బారిన పడ్డ హోటల్ కు పశ్చిమ బెంగాల్ ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం సమీపంలోనే ఉండటంతో రెస్క్యూ

ప్రముఖ బెంగాలీ జానపద గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పూర్ణ దాస్ బౌల్ (93) తన భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ అధికారులను ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో తన భూమిని బలవంతంగా ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఆయన తాజాగా జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళ్తే.. బీర్భూమ్ జిల్లాలోని ఇలాంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుమారు నాలుగు బీఘాల భూమిని గత 15 ఏళ్లుగా స్థానిక మాఫియా కబ్జా చేసిందని పూర్ణ దాస్ బౌల్, ఆయన కుమారుడు దిబ్యేందు దాస్ బౌల్ తెలిపారు. ఈ ఆక్రమణల వెనుక టీఎంసీ నేత అనుబ్రత మండల్, మాజీ మంత్రి చంద్రనాథ్ సిన్హా అండదండలు ఉన్నాయని వారు ఆరోపించారు.గతంలో ఈ వ్యవహారంపై భూమి పత్రాలు సహా బోల్పూర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, బీర్భూమ్ జిల్లా మేజిస్ట్రేట్, భూ సంస్కరణల శాఖకు (2023లో) ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ప్రయోజనం చేకూరలేదని పేర్కొన్నారు.తాజాగా, బీర్భూమ్ జిల్లా మేజిస్ట్రేట్ ధవళ్ జైన్‌ను కలిసి బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో తమకు న్యాయం జరుగుతుందని, కోల్పోయిన భూమి తిరిగి వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బౌల్ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన పూర్ణ దాస్ బౌల్‌ను 'బౌల్ సామ్రాట్' అని పిలుస్తారు. 2013లో

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ స్ట్రీట్ సమీపంలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మిర్జా గాలిబ్ స్ట్రీట్‌లోని ఓ హోటల్లో రాత్రి సుమారు 2 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు హోటల్లోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో హోటల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ పీల్చుకోవడంతో పలువురు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న సహాయక చర్యలు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పలువురు ఫైర్ టెండర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అదే సమయంలో హోటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చుట్టుపక్కల హోటళ్లకూ మంటలు.. మంటలు ఒక్క హోటల్‌కే పరిమితం కాకుండా సమీపంలోని మరికొన్ని హోటళ్లకు కూడా వ్యాపించినట్లు సమాచారం. దీంతో ఫ్రీ స్కూల్ స్ట్రీట్, మిర్జా గాలిబ్ స్ట్రీట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు మృతి ఈ ఘటనలో మృతుల్లో పలువురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు సమాచారం. వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చిన వారు హోటల్లో బస చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారి కూడా ఉండటంతో ఘటన మరింత విషాదకరంగా మారింది. ప్రమాదానికి కారణం? అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో

పశ్చిమ బెంగాల్‌ను వేధిస్తున్న అతిపెద్ద ప్రజారోగ్య సమస్య టీనేజ్ ప్రెగ్నెన్సీ (కౌమారదశలో గర్భం దాల్చడం) అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశంలోనే బెంగాల్ అగ్రస్థానంలో ఉందని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు."టీనేజ్ ప్రెగ్నెన్సీ మాకు అతిపెద్ద ఆందోళన కలిగిస్తోంది. దురదృష్టవశాత్తు, బెంగాల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీన్ని నివారించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం" అని మంత్రి తెలిపారు. ముర్షిదాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో, కొన్ని వర్గాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని, దీన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేమని ఆయన అన్నారు. ఈ సమస్యను సమూలంగా నిర్మూలించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరిస్తూ.. "ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక కమ్యూనిటీ డాక్టర్ల సహాయంతో ఇంటింటికీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాం. కుటుంబ సభ్యులతో మాట్లాడి అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలో అమలవుతున్న బాలల పరిరక్షణ విధానం కూడా నివారణ చర్యలకు దోహదపడుతుంది" అని ముఖర్జీ వివరించారు.టీనేజ్ గర్భాలను ఒక సామాజిక రుగ్మతగా అభివర్ణించిన మంత్రి, దీనిని తగ్గించడం తమ ప్రభుత్వానికి ఉన్న ప్రధాన సవాళ్లలో ఒకటని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, మాతృమరణాల రేటును తగ్గించడం వంటి ఇతర లక్ష్యాలతో పాటు దీనిపై కూడా దృష్టి

పశ్చిమ- మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరింత విస్తరిస్తోంది. దీని ప్రభావంతో అక్కడక్క నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని, తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.తాజా సమాచారం ప్రకారం.. ఈ వాయుగుండం ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌లోని బాంకురాకు 132, ఒడిశాలోని బాలేశ్వర్‌కు 1590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా భూభాగం వైపు ప్రయాణించే కొద్దీ ఆయా రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. దీని ప్రభావం ఉత్తరాంధ్ర సరిహద్దు జిల్లాలపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో వాతావరణం వేగంగా మారుతోంది.ఈ మార్పుల వల్ల రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సముద్రం అలజడికి గురయ్యే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండిశ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ ఓ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఆశ్రయం పొందవద్దని పేర్కొంది.తిరుమలలో శరవేగంగా.. : టీటీడీ తక్షణ ఆదేశాలు జారీ
టీఎంసీ సీనియర్ నాయకుడు, తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వేధింపులు, తీవ్రమైన మానసిక ఒత్తిడే ఆయన మరణానికి కారణమని ఆమె ఆరోపించారు. ‘‘క్రూరమైన రాజకీయ శత్రుత్వానికి బలయ్యే మనుషుల ప్రాణాల విలువేంటో మనందరినీ ఒక్కసారి ఆగి, ఆలోచించేలా ఈ ఘటన చేస్తోంది’’ అని దీదీ ఆవేదనకు గురయ్యారు. ఆశిష్ బెనర్జీని ‘‘పదే పదే అవమానించి, అబద్ధపు ఆరోపణలు మోపి, తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు’’ మమతా బెనర్జీ వాపోయారు. పార్టీ కార్యాలయంలో ఆశిష్ బెనర్జీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.‘‘తన చివరి రోజుల్లో ఆయన పడిన తీవ్ర మానసిక ఒత్తిడి ఈ విషాదాన్ని మరింత వేదనకు గురిచేస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ డిప్యూటీ స్పీకర్‌గా, చైర్మన్‌గా ఆశిష్ దా రాంపూర్ హట్ ప్రాంత అభివృద్ధికి తనను తాను అంకితం చేసుకుని, ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు.. ప్రజలకు ఆయన అంత సేవ చేసినప్పటికీ, ఆయనను పదే పదే అవమానించారు, నిందలు వేశారు, తట్టుకోలేని ఒత్తిడికి గురిచేశారు’’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మమతా బెనర్జీ రాసుకొచ్చారు.‘‘సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేసినప్పటికీ ఆయన ఎదుర్కొన్న వేధింపులు, మానసిక ఒత్తిడి.. కక్షపూరిత రాజకీయాల వల్ల ఎంతటి తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ ఘటన అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, పాత విద్యార్థులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన లేని లోటు ఎప్పటికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు.అటు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం ఆశిష్ బెనర్జీ మృతికి సంతాపం తెలిపారు. ఆయన విషాదకర మరణానికి దారితీసిన పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్‌లో నివాళులర్పించిన అభిషేక్.. ‘జీవితాంతం ఉపాధ్యాయుడిగా, ప్రజాసేవకుడిగా’ ఉంటూ బీర్భూమ్ ప్రజలకు గౌరవం, నిజాయితీతో

ఇంటర్నెట్ డెస్క్: బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నిహితుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ (Asish Banerjee) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లాలోని పార్టీ కార్యాలయం (Trinamool office)లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఇంటికి సమీపంలోనే పార్టీ కార్యాలయం ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తృణమూల్ నేత మృతి విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆశిష్ బెనర్జీ రాంపూర్హాట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001 నుంచి 2026 వరకు 25 ఏళ్లపాటు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. బెంగాల్ విద్యా, వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2021లో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేత ధ్రువ్ సాహా చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ కార్యాలయంలో పూర్తి వందేమాతరంపై వివాదం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Special Intensive Revision: ఒక పౌరుడికి ఒకే ఓటు విధానంతో అధికార యంత్రాంగం ఓటరు ముసాయిదా జాబితాను సిద్ధం చేసింది. ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండే విధంగా ఓటరు జాబితాను సమగ్రంగా సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. 3 కోట్ల 38 లక్షల 26వేల 448 మంది ఓటర్లున్న తెలంగాణలో 2 కోట్ల 64లక్షల 87వేల 214 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. 21.7 శాతం మంది ఓటరు జాబితానుంచి తొలగించారు. వీరిలో మృతిచెందిన ఓటర్లు, వలసవెళ్లినవారు, ఇచ్చిన అడ్రస్సుల్లో లేని వారు, ఒకటికంటే ఎక్కువచోట్ల నమోదైన ఓటర్లను జాబితా నుంచి తొలగించిన వారిలో ఉన్నారు. ఓటరు ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారంతా ఆగస్టు 30తేదీలోపు కొత్త ఓటరుగా నమోదయ్యేందుకు అవకాశం కల్పిస్తూ అధికారులు వెసులుబాటు కల్పించారు. పాత ఓటర్లు, కొత్తగా నమోదైన ఓటర్లతో అక్టోబరు 17 తేదీనాటికి సమగ్ర జాబితాను ప్రకటించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓటర్లకు నోటీసు జారీచేసి, విచారణ లేకుండా ఏ ఓటరు పేరూ తొలగించబోమని, అర్హులెవరూ ఓటు హక్కుకు దూరం కావొద్దన్నది ఎన్నికల సంఘం ప్రధాన ఉద్ధేశమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. సర్ సర్వే కంటే ముందు చేపట్టిన మ్యాపింగ్ సర్వేలో సుమారు 89 లక్షల ఓట్లలో తేడాలు గుర్తించారు. ఈ ఓటర్లకు ఎస్ఐఆర్ 2002తో మ్యాపింగ్ జరిగినప్పటికీ 11
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను అవమానించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్‌కు పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు గతంలో ఇచ్చిన ‘బంగ విభూషణ్’ అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. నాగేంద్ర రాయ్ అనంత్ మహరాజ్ పేరుతో పాపులర్ అయ్యారు. నేతాజీపై గత నెలలో అనంత్ మహరాజ్ చేసిన వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్ర, నేతాజీ నాయకత్వం, కూచ్ బెహార్ మహారాజు చారిత్రక ప్రాముఖ్యతకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ప్రతిపక్షాలతో పాటు బీజేపీలోని ఒక వర్గం కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్య సమరయోధుడు, బెంగాల్లో అత్యంత గౌరవనీయ నాయకుడైన నేతాజీపై సోషల్ మీడియాలో అభ్యంతరర వ్యాఖ్యలు చేసే వారిపై అరెస్టులతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి పోలీసులను ఆదేశించిన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ చట్టం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులకు సమానంగా వర్తిస్తుందని కూడా ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అజాద్ హింద్ ఫౌజ్ పాత్ర, బోస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ నేతాజీని ‘యుద్ధ నేరస్థుడు’ అని అనంత్ మహరాజ్ అభివర్ణించిన కొద్ది రోజులకే సీఎం సువేందు అధికారి పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేశారు.ఉత్తర బెంగాల్‌లోని రాజబన్షీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకులలో ఒకరైన అనంత మహారాజ్.. రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో ఈ బీజేపీ ఎంపీకి బంగా బిభూషణ్ పురస్కారం లభించింది. రాష్ట్రానికి, దాని ప్రజలకు చేసిన విశిష్టమైన, ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారని, దీనికి అత్యున్నత గౌరవం, ప్రతిష్ట ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.‘‘బంగ విభూషణ్ పురస్కారానికి నాగేంద్ర

పశ్చిమ బెంగాల్ లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి అధికారంలోకి వచ్చిన సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం.. నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే ఉంది. తద్వారా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం సువేందు అధికారి తన సొంత పార్టీ బీజేపీకి చెందిన ఓ ఎంపీకి గత ప్రభుత్వం ఇచ్చిన ఓ అవార్డును వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.డీలిమిటేషన్ బిల్లు వేళ కేంద్రానికి ఝలక్..! టీఎంసీ రెబెల్స్ యూటర్న్..!ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగాలీయులకు ఆరాధ్యుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను యుద్ద నేరస్తుడని అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ నాగేంద్ర రే (Nagendra ray) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనతో పాటు సువేందు ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎంపీ నాగేంద్ర రాయ్ కు ఆయన చేసిన సేవలకు గానూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇచ్చిన బంగ విభూషణ్ (Banga Bibhushan) అవార్డును వెనక్కి తీసుకోవాలని సువేందు ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు ముందు సోషల్ మీడియాలో నేతాజీపై అగౌరవకరమైన వ్యాఖ్యలు చేసేవారిపై అరెస్టులతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సువేందు అధికారి పోలీసుల్ని ఆదేశించారు. అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ, అయినా, ప్రభుత్వ అధికారి అయినా అంటూ తేల్చిచెప్పారు. చిమ్మ చీకట్లో బంగ్లాదేశ్..! షాపుల మూసివేత..! భారత్ వైపు చూపు..!సువేందు ఈ ట్వీట్ చేసిన 24 గంటల లోపే అనంత మహరాజ్ (Ananta Maharaj)గా కూడా పిలుచుకునే ఎంపీ నాగేంద్ర రేకు ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఎంపీ నాగేంద్ర రే .. నేతాజీని యుద్ధ నేరస్థుడుడిగా అభివర్ణించడం, భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన నాయకత్వం, ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రను ప్రశ్నించడం వంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వం అవార్డు వెనక్కి

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్ (అనంత మహారాజ్)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదానం చేసిన రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం 'బంగ విభూషణ్'ను ఉపసంహరించి, రద్దు చేసింది. ఈ నిర్ణయం గురువారం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది (Ananta Maharaj Banga Bibhushan). అనంత మహారాజ్ ఇటీవల నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను 'యుద్ధ నేరస్థుడు'గా అభివర్ణించి వివాదానికి తెర తీశారు. స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ నాయకత్వం, ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో పశ్చిమ బెంగాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అత్యంత గౌరవనీయ నాయకుడైన నేతాజీపై అవమానకర వ్యాఖ్యలను సహించబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు అనే తేడా ఉండదని కూడా ఆయన పేర్కొన్నారు (Netaji Controversy). కాగా, నాగేంద్ర రాయ్‌కు 2026 ఫిబ్రవరి 21న 'బంగ విభూషణ్' పురస్కారం లభించింది (Bengal Politics). అప్పట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రానికి, ప్రజలకు విశిష్టమైన సేవలు చేశారనే కారణంతో నాగేంద్రరాయ్కు మమత సర్కారు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనకు ఇచ్చిన పురస్కారాన్ని ఉపసంహరించుకుని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. నేతాజీ వారసత్వాన్ని అవమానించే వ్యాఖ్యలు పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించవచ్చని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు.. మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని మరోసారి రాజకీయ వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలైంది. ఆయన మునిమనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతను ప్రధాన బలంగా చేసుకుని.. నేతాజీ అనుసరించిన సమ్మిళిత, లౌకిక భావజాలంతో ముందుకు సాగుతామని చెప్పారు.ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్-జీ నిరసనలు తన నిర్ణయానికి ప్రధాన కారణమని చంద్రకుమార్ బోస్ తెలిపారు. నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వాలు, వ్యవస్థలపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.దేశవ్యాప్తంగా రాజకీయాలు, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు సహా పలు రంగాల్లో అవినీతి పెరిగిందని బోస్ ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విసిగిపోయిన యువతకు తమ హక్కుల కోసం పోరాడేందుకు ప్రత్యేక రాజకీయ వేదిక అవసరమని చెప్పారు. అందుకే నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో స్ఫూర్తి పొందిన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.చంద్రకుమార్ బోస్ 2016లో బీజేపీలో చేరారు. ఏడేళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. నేతాజీ సిద్ధాంతాల ప్రచారం కోసం ‘ఆజాద్ హింద్ మోర్చా’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదని ఆయన చెప్పారు. బీజేపీలో చేరడం తన తప్పిదమని గతంలో వ్యాఖ్యానించారు.2026 ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో చేరారు. నేతాజీ భావజాలంపై పనిచేసే అవకాశం ఉంటుందని భావించినట్లు తెలిపారు. అయితే నాలుగు నెలలకే ఆ పార్టీకి రాజీనామా చేశారు
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.గత వారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురవగా.. ప్రస్తుతం భానుడు భగ్గమంటున్నాడు. అయితే రాష్ట్రంలో వర్షాల విరామానికి బ్రేక్ పడిందని.. మళ్లీ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ చాలాప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగినప్పటికీ.. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్లీ జోరుగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ విశ్లేషణలు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ప్రాంతం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం వెల్లడించారు. దీని ప్రభావంతో రాత్రి వేళ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ వర్షాల తీవ్రత అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదని, ప్రాంతాల వారీగా వ్యత్యాసం ఉంటుందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, జనగామ, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విస్తృతంగా మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే వర్షాకాల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రి వేళ కురిసే వర్షాలు ఒక్కసారిగా తీవ్రత పెంచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, గ్రామీణ రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు.రాజధాని హైదరాబాద్‌లో పగటి పూట పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అక్కడక్కడా వర్షపు జల్లులు కురిసే అవకాశం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Abishek Porel Arrest: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనే ఆరోపణలపై ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అభిషేక్ పరేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఓ యువతి చేయగా.. అతడిపై పోలీసులకు ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా అభిషేక్‌ను అరెస్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో యువ క్రికెటర్ అభిషేక్ పరేల్‌ను అరెస్ట్ చేయడం క్రికెట్ రంగంలో కలకలం రేపుతోంది. ఏం జరిగింది..? అభిషేక్ పరేల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడని.. తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ మెడికల్ విద్యార్థిని డమ్ డమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్‌లో వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు అభిషేక్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఆ యువతి చేసింది. అభిషేక్‌తో తనకు మూడేళ్లు తాను సంబంధం కొనసాగిస్తున్నట్లు.. గతేడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆ యువతి ఆరోపణలు చేసింది. అనంతరం కేసులో పోరెల్‌ను అరెస్ట్ చేయాలని కోల్‌కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో ఎమామి సిటీలో పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ ప్రకటించారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి కేసు ఎదుర్కోవడంతో అభిషేక్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడింది. విచారణ అనంతరం శిక్ష పడితే మాత్రం అభిషేక్ భవిష్యత్ అంధకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ ఐపీఎల్ ప్రస్థానం పశ్చిమ బెంగాల్

మంట తట్టుకోలేక నీళ్లలోనే వారంలో ఐదు రోజులు..! శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఒక విచిత్రమైన, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పదహారేళ్ల బాలుడి ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒంటి నిండా అనియంత్రిత మంటలు రావడం వల్ల ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆ టీనేజర్ రోజంతా నీళ్లలోనే గడుపుతుండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగా ప్రాంతానికి చెందిన ఇక్బాల్ షేక్ అనే 16 ఏళ్ల కుర్రాడు ఈ వింత పరిస్థితితో నరకయాతన అనుభవిస్తున్నాడు. వారంలో దాదాపు నాలుగైదు రోజుల పాటు ఇతడు నీటిలోనే మునిగి తేలుతుంటాడు. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకుండా వరుసగా వారం రోజులు కూడా స్థానిక చెరువులోనే ఉండిపోతుండటం విశేషం. బాలుడి వింత ప్రవర్తన గురించి ఆరా తీయగా ఒక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. నీటి నుంచి బయటకు రాగానే తన శరీరం అంతా విపరీతమైన మంట పుడుతుందని, ఆ తాపాన్ని భరించలేకపోతున్నానని ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం చెరువు నీటిలో ఉన్నప్పుడు మాత్రమే తనకు ఆ మంట నుంచి శమనం లభిస్తుందని చెబుతున్నాడు. గత ఐదేళ్లుగా ఇక్బాల్ జీవితం ఇలాగే సాగుతోందని స్థానికులు తెలుపుతున్నారు. నిరంతరం నీటిలో ఉండటం వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. చర్మం దెబ్బతిని వివిధ రకాల చర్మ వ్యాధులు వ్యాపిస్తుండగా, ఎడతెరిపి లేని జలుబు, తీవ్రమైన దగ్గు అతడిని వేధిస్తున్నాయి. అతని ప్రాథమిక వైద్యం కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాధి మూలాలను గుర్తించి సరైన చికిత్స అందించడంలో అక్కడి వైద్యులు స్పష్టత ఇవ్వలేకపోయారు. మరొకవైపు, పేదరికంలో ఉన్న ఇక్బాల్ కుటుంబానికి కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్థాయి లేదు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 16 Years old boy Iqbal sheikh stays in pond mushirabad: సాధారణంగా చిన్న పిల్లలు ఎవరైన నీళ్లను చూస్తే భయంతో దూరంగా పోతారు. కేవలం స్విమ్మింగ్ వచ్చిన వారు మాత్రమే నీళ్లలొ దిగేందుకు సాహసంచేస్తారు. కొత్త ప్రదేశాల్లోని నీళ్లలో దిగేందుకు అస్సలు సాహసం చేయరు.ఈ నేపథ్యంలో ముర్షిదాబాద్ లో 16 ఏళ్ల బాలుడు గత ఐదేళ్లుగా ఎక్కువ కాలం నీళ్లలోనే ఉంటున్నాడు. ముర్షిదాబాద్‌లోని బెల్దంగాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత ఐదేళ్లుగా ఇక్బాల్ తన ఎక్కువ సమయాన్ని చెరువులోనే గడుపుతున్నడు. అతను నీళ్లలో నుంచి బైటకు రాగానే.. శరీరం అంత మంటలు వస్తున్నట్లు చెబుతున్నాడు. అంతే కాకుండా 11 ఏళ్ల వయసులో అతను ఇంట్లో నుంచి బైటకు వెళ్లిపోయాడు. అప్పుడు స్థానికంగా ఒక చెరువులో దిగినప్పుడు ఏదో ఆవహించిందని అక్కడి వారు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇక్బాల్ ను ఎక్కడకు తీసుకెళ్లిన నీళ్లలోనే ఉంటానని చెప్తున్నాడు. ఎక్కువగా చెరువులో ఉండటం వల్ల అతని చర్మం పూర్తిగా కమిలిపోయింది. అంతే కాకుండా పలు సమస్యలు వస్తున్నాయి. కొన్ని సార్లు రాత్రి పూట చెరువులో ఉంటున్నాడు. ఆ మార్గంలోని వారు బిస్కిట్స్, ఇతర తినుబండారాలు వేస్తే అవి తింటూ ఏం చక్కా చెరువులోనే ఉంటున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Read more: Jogulamba Gadwal: నువ్వు తోపు సామి.. వర్షాలు కురవాలని భారీ మొసలికి పూజలు.. వీడియో వైరల్... మరోవైపు.. ముర్షిదాబాద్‌లోని ప్రభుత్వం, సామాజిక సంస్థలు, ఈ

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురి జిల్లా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఒక బంగ్లాదేశీ చొరబాటుదారుడిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా... బంగ్లాదేశీయులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించి దీపాంకర్ గోప్ అనే భారతీయ తేయాకు రైతును అపహరించి బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లారు. తమ దేశానికి చెందిన వ్యక్తిని భారత్ విడుదల చేస్తేనే, రైతును తిరిగి పంపిస్తామని బంగ్లాదేశ్ సరిహద్దు బలగాలు (బీజీబీ), స్థానికులు దబాయిస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్‌గంజ్ బ్లాక్ పరిధిలోని సరిహద్దు కంచెకు సమీపంలో ఉన్న తన తేయాకు తోటలో పనిచేసుకుంటున్న దీపాంకర్‌పై దాదాపు 15 మందికి పైగా బంగ్లాదేశీయులు ఒక్కసారిగా దాడి చేసి, ఈడ్చుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్ఎఫ్ అధికారులు, బంగ్లాదేశ్ బీజీబీ అధికారులతో అత్యవసర ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి రైతును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గంలో రైతులకు భద్రత లేకపోవడంపై స్థానిక తేయాకు తోటల సంఘాలు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి. ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో (ఎన్సీపీఐ) అభిప్రాయభేదాలు వెలుగు చూశాయి. బీజేపీకి మద్దతుపలకడంపై ముగ్గురు ఎసీపీఐ ఎంపీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది ఎంపీలు ఇటీవల ఎసీపీఐలో చేరిన విషయం తెలిసిందే. ఎన్సీపీఐ బీజేపీకి మద్దతుగా ఉండటంపై ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో వారు పార్టీ సమావేశాలకు కూడా హాజరుకావట్లేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీజేపీకి దగ్గరైనట్టు కనిపిస్తే తమకు ఎంతో కాలంగా అండగా ఉంటున్న ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ విషయంలో అభిప్రాయాలు ఉన్నప్పటికీ ముగ్గురు ఎంపీలు ఇటీవల బిర్భూమ్ ఎంపీ శతాబ్దీ రాయ్‌తో కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. అంతేకాకుండా, ప్రధాని నివాసంలో అల్పాహార విందుకు కూడా హాజరయ్యారు. అయితే, బీజేపీ విధానాలతో తాము ఏకీభవించలేమని ముగ్గురు ఎంపీలు తెలిపారు. కానీ, వివిధ సంక్షేమ పథకాల ఫలాలు తమ నియోజకవర్గ ప్రజలకు చేరేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరిస్తామని అన్నారు. గత వారం ఎన్డీయే ఎంపీల మంగళ్ మిలన్ సమావేశంలో ఎన్సీపీఐ తరఫున 17 మంది ఎంపీలే హాజరయ్యారు. ఖాన్, రెహ్మాన్, పఠాన్ మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఇక శనివారం ఎంపీలు ఖాన్, రెహ్మాన్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిసి సర్‌తో ముర్షిదాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించారు. ‘ఎన్డీయేతో మేము కలిసేది లేదని ముందే చెప్పాము. కానీ ముస్లిం వర్గం, ముఖ్యంగా వెనకబడ్డ వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు సీఎం అంగీకరించారు’ అని

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. SIR Enumartion News: తెలంగాణ వ్యాప్తంగా SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కు నేడు ఆఖరు. ఇప్పటివరకు దాదాపు 78.14 శాతం ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చాలా తక్కువగా నమోదు అయినట్టు తెలుస్తుంది. వలన వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు తమ సొంత ఊరిలో ఓటు హక్కుకు సంబంధించిన ఫారమ్ అందజేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది సొంత ప్రాంతాల్లో ఓటు హక్కును ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీగా ఓటర్లు తగ్గే అవకాశాలున్నాయి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో 94 % తో యాదాద్రి టాప్, 58 % తో హైదరాబాద్ లీస్ట్ ... అయితే రాష్ట్ర వ్యాప్తంగా SIR ఎన్యుమరేషన్ ప్రక్రియ కాలేదు. దీంతో మళ్లీ గడువు పొడిగిస్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ముగింపునకు సంబంధించి ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్యుమరేషన్ గడువును భారత ఎన్నికల సంఘం రెండుసార్లు పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ వివరాల ప్రకారం నిన్నటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78.14 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్టు తెలిపింది. తెలంగాణలో భారీగా తగ్గనున్న ఓటర్లు.. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్ల ఉండగా, ఇప్పటివరకూ 2.64 కోట్ల ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్టు తెలిపారు. వీటిలో యాదాద్రి-భువనగిరి జిల్లా 94.30 శాతం డిజిటైజేషన్‌తో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కాగా హైదరాబాద్ జిల్లాలో డిజిటలైజేషన్ అత్యంత కనిష్ఠంగా 58.58 శాతంగా

పశ్చిమ బెంగాల్లో ‘లోక్తంత్ర సేనానీ’లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారికి నెల నెలా రూ.10,000 భత్యం, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సాయం అందిస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. ఆదివారం రాష్ట్ర సచివాలయం ‘నబన్న’లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.1975-77 మధ్య దేశంలో విధించిన అంతర్గత ఎమర్జెన్సీ సమయంలో ‘ఎంఐఎస్ఏ’, ‘డీఐఆర్’ వంటి చట్టాల కింద జైలుకు వెళ్లిన వారిని ‘లోక్తంత్ర సేనానీ’లుగా గుర్తిస్తున్నారు. ఈ సందర్భంగా 325 మంది సేనానీలను సీఎం సువేందు అధికారి ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్కరికి రాగి పతకాన్ని బహూకరించారు. ఒకవేళ సన్మానం అందుకున్న వ్యక్తి జీవించి లేకపోతే, వారి భర్త లేదా భార్య ఈ ప్రయోజనాలను పొందుతారని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం సువేందు అధికారి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ నాటి క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. "ఆ సమయంలో దేశవ్యాప్తంగా లక్ష మందిని జైళ్లలో పెట్టారు. వారిలో కనీసం 5,000 మంది బెంగాల్లోనే ఉన్నారు. అప్పుడు జైలు చీకటిలో జీవితాలు గడిపిన వారి త్యాగాల వల్లే ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, ఓటు హక్కు కాపాడబడ్డాయి" అని ఆయన అన్నారు.అలాగే, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సేవలను సీఎం స్మరించుకున్నారు. గతాన్ని ఉద్దేశిస్తూ, జాతీయవాదం, దేశభక్తి, సంప్రదాయ సంస్కృతిని చెరిపేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ముఖర్జీ సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆగస్టు 13న శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి
పశ్చిమ బెంగాల్లో మరోసారి తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలిశహర్‌లో నిరసనకారులు అడ్డుకున్నారు. పోలీసు కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె అక్కడికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసనకారులు మమతా బెనర్జీ వాహనాన్ని చుట్టుముట్టి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత వాహనంపై బురద, రాళ్లు, చెప్పులు వంటి వస్తువులు విసిరినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు.పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ ఘటనతో హలిశహర్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన వాహనంపై పెద్ద రాళ్లు విసిరారని మమతా బెనర్జీ ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తీవ్రంగా గాయపడే అవకాశం ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు.ఈ ఘటన వెనుక కుట్ర ఉందని దీదీ అనుమానం వ్యక్తం చేశారు. బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఇక.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ దాడిని హత్యాయత్నంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు.మాకేం సంబంధం లేదు.. ఖండించిన బీజేపీమమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిపై బీజేపీ స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ.. రాళ్లు, బురద, చెప్పులు విసరడాన్ని తమ పార్టీ సమర్థించదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బీజేపీ నేత, మంత్రి అగ్నిమిత్ర పాల్ కూడా ఈ దాడిని ఖండించారు. రాజకీయ