
Rajamouli : మహేష్‌ఫ్యాన్స్ కి పండగే.. రాజమౌళి ఈసారి చాలా ఫాస్ట్..
ఆల్రెడీ వారణాసి సినిమా 2027లో ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. (Rajamouli)
© 2026 nimisham.in

ఆల్రెడీ వారణాసి సినిమా 2027లో ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. (Rajamouli)

రాజమౌళి (SS Rajamouli) మన దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్. ఆయన సినిమాల మార్కెట్ ఇండియా దాటి అనేక దేశాలకు పాకింది. ఆస్కార్ రేంజ్ కి వెళ్లారు. ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఆయన పారితోషికం ఉంటుంది కదా. ఐతే “వారణాసి” (Varanasi) సినిమాకి పారితోషికం బదులు ఓటిటి రైట్స్ తీసుకున్నారట. ఓటిటి రైట్స్ ఎంత వస్తే అంత ఆయన పారితోషికం అన్నమాట. అంటే నిర్మాత ఆయనకి ఇచ్చేది ఏమి లేదు. ఓటిటి కంపెనీలు సినిమాకి ఇచ్చే రైట్స్ మొత్తం తానే తీసుకొని నిర్మాత పెట్టుబడిని తగ్గిద్దామనుకున్నారు. తానూ భారీగా తన ఎకౌంట్ లో వేసుకుందామని భావించారు ఈ రైట్స్ తో. ఐతే పాపం, రాజమౌళి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు వేసుకున్న లెక్కలు వేరు, అప్పటి మార్కెట్ పరిస్థితులు వేరు. ‘వారణాసి’ సినిమా మొదలు కాకముందు, ఓటిటి కంపెనీలు భారీ పాన్ ఇండియా చిత్రాలను ఎగబడి వందల కోట్ల రూపాయలు చెల్లించి కొన్నాయి. ‘పుష్ప 2’ సినిమాని 270 కోట్లు పెట్టి కొనుక్కోంది Netflix సంస్థ. ‘పుష్ప 2’కే అంత వస్తే తన సినిమాకి ఈజీగా నాలుగు వందల కోట్లు వస్తాయని రాజమౌళి భావించారు. ఆ లెక్కలతోనే ఈ సినిమా ఓటిటి రైట్స్ (Varanasi OTT Rights) తనకి రాయించుకున్నారు. ఐతే ఈ రెండేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ఓటిటి సంస్థలు సినిమాలు కొనడం తగ్గించాయి. అలాగే ఇచ్చే రేట్స్ లో కూడా భారీగా కోత వేశాయి. ‘వారణాసి’ సినిమా ఒటిటి రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. అమెజాన్, జియో హాట్ స్టార్ రాజమౌళి అడుగుతున్నా రేట్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. జీ5 కూడా 175 కోట్లకుమించి ఇవ్వలేమని చెప్పిందట. మిగిలింది నెట్ ఫ్లిక్స్ మాత్రమే. ఈ సంస్థ 200 వద్ద బేరం ఆడుతోంది. ఫైనల్ గా 225 విత్ జీఎస్టీ వచ్చేలా ఉంది. అంటే మొత్తంగా 200 నుంచి 225 కోట్లు

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చల్లటి సమోసాల విషయంలో గత ఐదు నెలల క్రితం జరిగిన గొడపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టు చేరడంతో దుకాణదారుడితోపాటు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యాయవాది శివశంకర్ సింగ్ చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జల్హుపూర్ మార్కెట్లోని ఓ స్వీట్ దుకాణం వద్దకు వెళ్లాడు. తినేందుకు సమోసాలు ఇవ్వాలని కోరగా.. దుకాణదారుడు గుప్తేశ్వర్ సింగ్ చల్లటి సమోసాలు ఇచ్చాడు. దీంతో నాకు వేడి సమోసాలు కావాలని న్యాయవాది శివశంకర్ కోరగా.. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనపై శివశంకర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దుకాణం యాజమాని, అతని సిబ్బంది దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో శివశంకర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. శివశంకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన దుకాణదారుడు గుప్తేశ్వర్ సింగ్ తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేయాలని చౌబేపూర్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది శివశంకర్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన తాను చందౌలి నుంచి వారణాసికి ప్రయాణిస్తున్నాను. మార్గం మధ్యలో ఆకలి వేయడంతో జల్హుపూర్ మార్కెట్లోని ఒక స్వీట్ షాపులో రెండు సమోసాలు ఇవ్వాలని ఆర్డర్ చేశాను. వారు చల్లటి సమోసాలు ఇవ్వండంతో.. నేను వేడి సమోసాలు కావాలని కోరాను.. కానీ, దుకాణ యాజమాని ఆయన అనుచరులతో కలిసి నాపై దాడి చేశాడని శివశంకర్ సింగ్ ఆరోపించారు. నువ్వు ఏమైనా కలెక్టర్ వా.. వేడి వేడి సమోసాలు ఇచ్చేందుకు అంటూ తనపై వారు దుర్భాషలాడారని పేర్కొన్నాడు. అంతేకాదు.. వారు తన వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, నగదు లాక్కొన్నారని

Mahesh Babu’s Varanasi Music Album Update: ‘సూపర్‌స్టార్’ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వారణాసి సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా వారణాసి మ్యూజికల్ ఆల్బమ్ గురించి కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారణాసి ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని, సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఎంఎం కీరవాణి చెప్పిన ఆరు పాటల సంఖ్యపై ప్రస్తుతం అభిమానుల్లో ఓ సందేహం నెలకొంది. ఇప్పటికే విడుదలైన రణ కుంభ, సంచారి పాటలను కలుపుకుని మొత్తం ఆరు పాటలు ఉంటాయా?.. లేదా ఆ రెండు పాటలకు అదనంగా మరో ఆరు పాటలు ఉండనున్నాయా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజమౌళి సినిమాల్లో సంగీతానికి ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజన్‌కు కీరవాణి సంగీతం తోడైతే.. తెరపై ఎలాంటి అద్భుతం జరుగుతుందో అభిమానులు ఇప్పటికే చూశారు. ఇక వారణాసిలో ఆ అద్భుతం మరింత ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే వారణాసి మ్యూజిక్ ఆల్బమ్ కూడా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్లో రూపొందుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఐమ్యాక్స్ స్క్రీన్స్ దక్కే అవకాశం ఉంది. 'ట్రూ ఐమాక్స్ షూటింగ్' జరుపుకున్న తొలి ఇండియన్ మూవీగా రాజమౌళి 'వారణాసి' నిలచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అనేక ఐమ్యాక్స్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఐ మ్యాక్స్ ఫార్మాట్ తో 'వారణాసి' ఓ ఛాలెంజ్ ఎదుర్కొంటోంది. అదేంటో చూద్దాం? మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో డాక్టర్ కె.యల్.నారాయణ, కార్తికేయ నిర్మిస్తోన్న వారణాసి (Varanasi) ట్రూ ఐమ్యాక్స్ (True IMAX) షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీని దాదాపు 120 భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాను 'ట్రూ ఐ మ్యాక్స్ షూటింగ్ 'లో తెరకెక్కించారు. ఈ విధానంలో రూపొందిన తొలి భారతీయ చిత్రంగా 'వారణాసి' నిలచింది. అందువల్ల 'వారణాసి' సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచంలోని ప్రముఖభాషల్లో అందులోనూ ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్ లో రిలీజ్ చేయాలని భావించారు. 'ఆ సమయంలో ఏ లాంటి భారీ చిత్రాలు హాలీవుడ్ నుండి రావడం లేదని తెలుస్తోంది. అందువల్లే రాజమౌళి తన 'వారణాసి'కి కంఫోర్టబుల్ టైమ్ ను సెట్ చేసుకున్నారని సినీ పండిట్స్ భావిస్తున్నారు. గతంలోనూ 'ట్రిపుల్ ఆర్, జవాన్, కల్కి 2898 ఏడి" వంటి చిత్రాలు ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో ప్రదర్శితమయినాయి. వీటికంటే ముందు 'ఐ మ్యాక్స్ ఫార్మాట్'లో సందడి చేసిన తొలి భారతీయచిత్రంగా 'ధూమ్-3' నిలచింది. కానీ, ఇవన్నీ ఐమ్యాక్స్ థియేటర్స్ లో ప్రదర్శన కోసం డిజిటిల్ గా రీమాస్టరింగ్ చేసిన సినిమాలే కావడం గమనార్హం. అలా కాకుండా ఒరిజినల్ ఐమ్యాక్స్ కెమెరాతోనే షూటింగ్ జరుపుకొన్న ప్రప్రథమ భారతీయ చిత్రంగా 'వారణాసి' చరిత్ర సృష్టించింది. ఈ మూవీ ట్రూ 1.43 ఈజ్

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం ‘వారణాసి’ కూడా ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న ఈ తొలి సినిమా కోసం ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. కాన్సెప్ట్ గ్లింప్స్ కి ఇచ్చిన స్కోరే ఇప్పటికీ ఓ రేంజ్ లో హై ఇస్తూ వస్తుంది. ఇక మొత్తం సినిమాకి తన వర్క్ ఎలా ఉంటుందా అని అంతా మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారణాసి ఆల్బమ్ పై తాను బిగ్ క్లారిటీ అందించారు. ఇటీవల ఓ ఇంటరాక్షన్ లో కీరవాణి కామెంట్స్ వైరల్ గా మారాయి. వారణాసి ఆల్బమ్ ఎంతో గ్రాండియర్ గా ఉంటుంది అని ప్రామిస్ చేశారు. అంతే కాకుండా వారణాసి ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయని ఖరారు చేశారు. వారణాసి ఆల్బమ్ నుంచి ఆల్రెడీ రెండు పాటలు వచ్చేసిన సంగతి తెలిసిందే. రణ కుంభ అలాగే సంచారి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సో ఇంకా నాలుగు పాటలు మాత్రమే బాకీ ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయో చూడాలి మరి

మానస వారణాసి (Manasa Varanasi) ఇటీవల మంచి గుర్తింపు పొందింది. అచ్ఛ తెలుగు అమ్మాయి. ఈ ఏడాది విడుదలైన కఫుల్ ఫ్రెండ్లీ (Couple Friendly) ఆమెకి మొదటి హిట్. ఆమె నటనకి కూడా పేరు వచ్చింది. సంక్రాంతికి హిట్ కొట్టిన హీరో శర్వానంద్ (Sharwanand) తాజాగా ‘జార్జ్ క్రిష్’ (George Krish) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా మానస వారణాసి ని తీసుకున్నారు అని టాక్ నడుస్తోంది. కానీ ఆమె పేరు పరిశీలనకి వచ్చినప్పటికీ ఇంకా లాక్ చెయ్యలేదు. నిజానికి ఇందులో మొదట పూజా హెగ్దేను అనుకున్నారు. ఆ తర్వాత మమితా బైజు పేరు వినిపిచింది. కాయదు లోహర్, ప్రీతి ముకుందన్…ఇలా పలువురు భామలను సంప్రదించారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్ గా మానస వారణాసిని లాక్ చేసినట్టు టాక్ నడుస్తోంది. కానీ ఆమెని సైన్ చెయ్యలేదు అని ‘జార్జ్ క్రిష్’ పీఆర్ టీం తెలిపింది. మరి మానసకి నెక్స్ట్ పెద్ద ఆఫర్ ఏ హీరో సరసన వస్తుందో? ఎవరు ఒకే అంటారో?

భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు) అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు) ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు 100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు.. పెళ్లైన 7 రోజులకే.. నా భర్త అరాచకం అంతా ఇంతా కాదు సిగ్గుందా..! ఫస్ట్ మహిళలకు క్షమాపణ చెప్పు.. బాబు,లోకేష్ కు ఇచ్చిపడేసిన రోజా

ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి ఎయిర్ పోర్టులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు గన్ తీసుకెళ్తుండగా అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ గన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మహిళ, చిన్నారికి బుల్లెట్ గాయాలు తగిలాయి. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు జరిగింది.ఏం జరిగిందంటే..? అజాంగఢ్ కు చెందిన కమ్లీష్ రాయ్ అనే ప్రయాణికుడు తన సతీమణితో కలిసి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఐఎక్స్- 1810 అనే విమానంలో ముంబై వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో తన వద్ద ఒక గన్, మ్యాగజైన్ ఉన్నాయని అతను ఎయిర్ పోర్ట్ అధికారులకు వివరించాడు. అయితే గన్ ను పరిశీలిస్తుండగా ఆ గన్ బ్లాస్ట్ అయింది. దాంతో ఒక బుల్లెట్ బయటకు వచ్చింది. ఈ ఘటనలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న ఇద్దరు సిబ్బంది సైతం గాయపడ్డారు. దీనిపై భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.గాయపడిన ఆ ఇద్దరిని చికిత్స కోసం తరలించారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు అధికారులు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆయుధాన్ని తనిఖీ చేసే సమయంలో తూటా ఎలా పేలిందనే కోణంలో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. నిత్యం ఎయిర్ పోర్ట్ లో రద్దీ ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా ఈ షాకింగ్ ఘటన జరగడం అధికారుల్లో కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు

యూపీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఊహించని భద్రతా ప్రమాదం జరిగింది. విమానం ఎక్కేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి లైసెన్స్డ్ పిస్టల్ అనుకోకుండా పేలడంతో ఇద్దరు సెక్యూరిటీ స్క్రీనింగ్ సిబ్బంది గాయపడ్డారు. ఈ సంఘటనతో టెర్మినల్ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఉత్తర ప్రదేశ్‌లోని అజాంగఢ్ ప్రాంతానికి చెందిన కమలేష్ రాయ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ముంబై వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX-1810 విమానంలో ప్రయాణించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం, తన వద్ద లైసెన్స్ ఉన్న పిస్టల్ మరియు మ్యాగజైన్ ఉన్నాయని సదరు ప్రయాణికుడు విమానాశ్రయ కౌంటర్ వద్ద అధికారులకు వెల్లడించారు. ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఆయుధాలు, దానికి సంబంధించిన లైసెన్స్ పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలో అనుకోకుండా పిస్టల్ నుండి ఒక రౌండ్ ఫైర్ అయింది. తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ తొలుత నేలను తాకి, ఆ తర్వాత పక్కనే ఉన్న భద్రతా సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ అనూహ్య ఘటనలో AAICLAS సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్క్రీనర్లు గాయపడ్డారు. అందులో ఒక మహిళా సిబ్బంది తొడ భాగానికి గాయం కాగా, మరొక పురుష ఉద్యోగి చేతి బొటనవేలికి గాయమైంది. వెంటనే స్పందించిన విమానాశ్రయ వర్గాలు ప్రాథమిక చికిత్స అందించి, ఇద్దరినీ స్థానిక న్యూ లక్ష్మీ ట్రామా సెంటర్‌కు రవాణా చేశాయి. సమాచారం అందుకున్న వెంటనే వారణాసి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా మరియు గోమతి జోన్ డీసీపీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన ఇద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి వర్గాలు మరియు అధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా విమాన ప్రయాణాల్లో చెక్-ఇన్ లగేజీ ద్వారా చట్టబద్ధమైన ఆయుధాలను తీసుకెళ్లేందుకు కఠినమైన నియమావళి ఉంటుంది. ఆయుధాన్ని లోడ్ చేయకుండా విడదీసి, ప్రత్యేక

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Two employees injured gun fire incident in Varanasi airport: ఉత్తర ప్రదేశ్ లోని వారాణాసి ఎయిర్ పోర్టులో గన్ పేలిన ఘటన తీవ్ర దుమారంగా మారింది. వారాణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో సిబ్బంది ప్రయాణికుడి వస్తువుల్ని తనిఖీలు చేస్తుంగా ఒక్కసారిగా గన్ పేలింది. ఈ ఘటనతో ఇద్దరు భద్రత సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు అజంగఢ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తన భార్యతో కలిసి ముంబైకి వెళ్లేందుకు వారణాసి ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ఉదయం 09:30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం IX-1810 ఎక్కే ముందు తన వద్ద తుపాకీ, ఒక మ్యాగజైన్ ఉన్నాయని అధికారులకు చెప్పాడు . ఈ క్రమంలో గన్ పేలడంతో.. బుల్లెట్ మొదటగా నేలను తాకి, అనంతరం ఇద్దరు AAICLAS స్క్రీనర్లకు తగిలింది. ఈ బుల్లెట్ ఒక మహిళా సిబ్బంది తొడకు, మరో పురుషుడి చేతికి తగిలి తీవ్ర గాయమైనట్లు భద్రత సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనపై వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ క్లారిటీ ఇచ్చారు. Read more: రైల్వే స్టేషన్ నీళ్లు తాగుతున్నారా? కడుపునొప్పి, వాంతులు వచ్చే ప్రమాదకర బాక్టీరియా గుర్తింపు! హైదరాబాద్స్టేషన్లో కూడా!! గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం వారిని న్యూలక్ష్మి ట్రామా సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. దీనిపై ప్రస్తుతం

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఆర్కే రోజా తన సినీ ప్రస్థానం, టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆమెకు గల అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను చూస్తుంటే, పాత రోజుల్లో తనతో కలిసి నటించిన హీరోలు ఆశ్చర్యపోతారని తెలిపారు. వెంకటేశ్‌గారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు వంటి వారు ఎదురుపడినప్పుడు ఎలా ఉన్నావ్ రోజా.? అని ఆప్యాయంగా పలకరిస్తారని చెప్పారు. ఆమె బాలకృష్ణతో కలిసి నటించిన భైరవ ద్వీపం సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో క్వీన్ గెటప్‌లో ఆమె చాలా బాగుంటారని, తన అందానికి దేవుడు మంచి ఫీచర్స్ ఇచ్చారని బాలకృష్ణ ప్రశంసించేవారని తెలిపారు. భైరవ ద్వీపంలో తనకు స్క్రీన్ టెస్ట్ కూడా చేయలేదని పేర్కొన్నారు. అన్నమయ్య చిత్రంలో మోహన్‌బాబు పక్కన క్వీన్ క్యారెక్టర్‌కి కూడా తననే తీసుకున్నారని, ఎక్కడ క్వీన్ పాత్ర ఉన్నా తననే ఎంచుకునేవారని చెప్పారు. వెంకటేశ్‌గారి గురించి మాట్లాడుతూ.. ఆయన కొంచెం రిజర్వ్డ్గా ఉంటారని, అందరినీ పిలిచి మాట్లాడేంత జోవియల్‌గా ఉండరని తెలిపారు. బాలకృష్ణగారు మాత్రం సెట్లో అందరినీ కూర్చోబెట్టి కబుర్లు, పాటలు, పద్యాలు చెప్తూ సరదాగా గడిపేవారని పేర్కొన్నారు. నాగార్జునగారు చాలా కూల్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటారని, ఎవరినీ హర్ట్ చేయరని, హీరోయిన్లు ఆయనతో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారని ఆమె చెప్పారు. ప్రస్తుత తరం హీరోల గురించి మాట్లాడుతూ, మహేష్ బాబుకు తాను వీరాభిమానినని రోజా తెలిపారు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని, తన మేకప్ మేన్ పట్టాభి, మహేష్ బాబు హీరోగా చేసినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబుకు తల్లి పాత్ర కాకుండా వదిన లేదా అక్క పాత్ర చేయాలనుందని, ఒకవేళ తల్లి పాత్ర చేయాల్సి వచ్చినా పవర్ఫుల్ రోల్ అయితే చేస్తానని చెప్పారు. ప్రభాస్ వ్యక్తిత్వం తనకు బాగా ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ స్టైల్, అల్లు అర్జున్

విలక్షణ నటుడు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో విమర్శలు చేసే ప్రకాశ్ రాజ్, తన పేరును బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. "మిత్రులారా.. మీకో జోక్ చెప్పాలి. బెంగళూరు నియోజకవర్గంలో ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో నేను కూడా ఒకడిని. మంచి జోక్ కదా? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, నాటకరంగంలో రాణించాను. మీ అందరికీ తెలిసినట్లుగా, ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. "ఇది మంచి జోకే. ఆట మొదలైంది. నా ఓటర్ ఐడీని తిరిగి పొందడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరించాలో చూస్తాను. అయితే, మీకు ఓటు వేయని కొందరు పౌరుల ఓటు హక్కును మీ అధికారంతో మీరు అడ్డుకోవచ్చు. కానీ, మిమ్మల్ని అధికారం నుంచి దించే మా శక్తిని మీరు ఆపగలరా? జస్ట్ ఆస్కింగ్" అంటూ పాలకులకు సూటిగా సవాల్ విసిరారు.విద్యార్థులపై దాడిని ఖండించిన ప్రకాశ్ రాజ్ఇదే సమయంలో ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరసన తెలుపుతున్న జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌ను కూడా ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై

సూపర్‌స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 9న జనసేన పార్టీ అధికారిక ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ తన హృదయపూర్వక జన్మదిన సందేశాన్ని అందించారు. మహేష్ బాబు మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకులను మెప్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ అభినందనలకు మహేష్ బాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన పార్టీ పోస్టుకు మహేష్ బాబు ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. "మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు, మీకు ఎల్లప్పుడూ మోర్ పవర్ టు యు" అని మహేష్ బాబు రాసుకొచ్చారు. పవర్ స్టార్ అనే బిరుదు ఉన్న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. రెండు పెద్ద ఫ్యాన్ బేస్‌ల మధ్య ఈ పరిణామం ఎంతో పాజిటివ్ వాతావరణాన్ని పెంపొందించింది. టాలీవుడ్లో మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరూ అత్యున్నత స్థానాల్లో ఉన్న కథానాయకులుగా రాణిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇద్దరి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, వారిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా మంచి స్నేహం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా కోసం మహేష్ బాబు ఉచితంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీంతో పాటు 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించినప్పుడు కూడా మహేష్ బాబు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు 50వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సినీ, రాజకీయా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి వెంకటేశ్ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహేష్‌కు విషెస్ తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ సందేశానికి మహేష్ బాబు ఇచ్చిన స్పందన మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫలితంగా ఇరు కథానాయకుల అభిమానులు సోషల్ మీడియాలో ఈ

సూర్య ప్రకాష్ జోశ్యుల ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ సినిమాను గ్లోబల్ ప్రాజెక్టుగా దర్శకధీరుడు తీర్చిదిద్దుతున్నారు. ఈ భారీ అడ్వెంచర్ డ్రామాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా కథ ఏమై ఉండవచ్చు అనేది సినిమా అభిమానుల్లో డిస్కషన్ గా మారింది. తాజాగా, ఈ సినిమా కథ కు సంబంధించి ఒక కీలకమైన లీక్ బయిటకు వచ్చింది. అయితే ఈ కథ ఎవరో ఊరు పేరు లేని సైట్ లో ఉంటే పెద్ద విషయం కాదు,ఎవరూ పట్టించుకోపోదురు, కానీ ఈ సినిమా అఫీషియల్ బ్రాండ్ పార్టనర్ అయిన 'స్కైబ్లూ సినిమాటిక్స్' వారి వెబ్ సైట్ లో ఉండటంతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ మూవీకి ప్రపంచస్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు సినిమా ప్రమోషన్స్, బ్రాండ్ పార్టనర్షిప్స్ కోసం 'స్కైబ్లూ సినిమాటిక్స్' సంస్థతో 'వారణాసి' మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బ్రాండ్ ఇంటిగ్రేషన్ హక్కులను కూడా 'స్కైబ్లూ సినిమాటిక్స్' పొందింది. వైరల్ అవుతున్న కథేంటి? ఆ సైట్ లో ఉన్న సినాప్సిస్ ప్రకారం.. కథ 2027 కాలంలో సాగుతుంది. 'శాంభవి' అనే భారీ గ్రహశకలం (Asteroid) పుణ్యక్షేత్రమైన వారణాసి వైపు దూసుకొస్తూ భూమికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ విపత్తు నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు 'రుద్ర' అనే సాహసికుడైన పురాతత్వ శాస్త్రవేత్త (మహేష్ బాబు) సీన్ లోకి వస్తాడు. వారణాసి కి సంబంధించి గతంలో దాగి ఉన్న ఒక ప్రాచీన విశ్వ ఖగోళ పరికరాన్ని (Cosmic artefact) వెతికే గ్లోబల్ మిషన్‌ను ఆయన చేపడతారు. ఈ వేటలో రుద్రకు మందాకిని (ప్రియాంక చోప్రా) అనే చరిత్రకారిణి తోడుగా నిలుస్తుంది. ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ఖండాలు, యూరప్‌లలో సాగే ఈ అడ్వెంచర్‌లో, 'కుంభ' అనే విలన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వీరిద్దరినీ వెంటాడుతుంటాడు. ఇక్కడే

ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అయితే స్పిరిట్ షూటింగ్ కొనసాగుతున్న సమయంలోనే సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమా గురించి పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేయబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వంగా షేర్ చేసిన ఒక ఏఐ వీడియో ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. మహేష్ బాబుకు బర్త్ డే విషెష్ చెబుతూ సోషల్ మీడియాని తగలబెట్టినంత పని చేశారు. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సందీప్ రెడ్డి వంగా ఒక ఏఐ రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1983లో విడుదలైన సూపర్‌స్టార్ కృష్ణ నటించిన కిరాయి కోటిగాడు సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఈ వీడియో కోసం ఉపయోగించారు. అయితే అందులో కృష్ణ కనిపించాల్సిన స్థానంలో మహేష్ బాబు ముఖాన్ని ఏఐ సాంకేతికతతో ఉంచారు. సూపర్ స్టార్ కృష్ణ మాస్ గెటప్ లో పేరు కోటిగాడు అంటూ విలన్లకు తనని పరిచయం చేసుకుంటున్న డైలాగ్ ని మహేష్ బాబు చెబుతున్నట్లు ఏఐ ద్వారా రూపొందించారు. ఈ వీడియోపై మహేష్ బాబు కూడా స్పందించారు. సందీప్ రెడ్డి వంగా చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలకు ప్రేమతో పాటు నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. హహహా.. థ్యాంక్యూ సో మచ్ సందీప్. ఆల్ ద లవ్ టు యూ అంటూ మహేష్ బాబు స్పందించారు. దీనికి సందీప్ రెడ్డి వంగా కూడా స్పందిస్తూ ఐ లవ్ ద పోస్టర్ అండ్ డైలాగ్ అని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ సరదా సోషల్ మీడియా సంభాషణ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ బాబు ఇలాంటి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ రెట్రో స్టైల్ లుక్ తో

సినీ ప్రపంచంలో అందరిలా ఆలోచిస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా ఎందుకు అవుతాడు? అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాలోనూ, తన ప్రతి ఆలోచనలోనూ ఒక విలక్షణమైన ముద్ర వేసే ఈ ఫైర్‌బ్రాండ్ డైరెక్టర్, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది ఒక సంచలనమే అవుతుంది. సినీ ప్రపంచంలో అందరిలా ఆలోచిస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా ఎందుకు అవుతాడు? అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాలోనూ, తన ప్రతి ఆలోచనలోనూ ఒక విలక్షణమైన ముద్ర వేసే ఈ ఫైర్‌బ్రాండ్ డైరెక్టర్, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది ఒక సంచలనమే అవుతుంది. గతంలో చిరంజీవి ఆరాధన పోస్టర్‌తో మెగా ఫ్యాన్స్‌ని ఫిదా చేసిన సందీప్, ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చేసిన ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు టాలీవుడ్లో సరికొత్త చర్చకు తెరలేపింది. సాధారణంగా ఒక హీరో పుట్టినరోజు వస్తే డిజైనర్ పోస్టర్లతో శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. కానీ సందీప్ వంగా ఏఐ సాంకేతికతను వాడుకుని మహేష్ కి శుభాకాంక్షలు చెప్పి షాక్ ఇచ్చాడు. మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ ఐకానిక్ మూవీ కిరాయి కోటిగాడులోని మాస్ సీన్‌ను రీ-క్రియేట్ చేశాడు. 'పేరు కోటిగాడు.. ఊరు తెనాలి. ఉద్యోగం కిరాయి తీసుకొని కాళ్లూ చేతులు విరగ్గొట్టడం' అంటూ కృష్ణ చెప్పే ఆల్-టైమ్ మాస్ డైలాగ్‌ను మహేష్ బాబు గొంతుతో, ఆయన బీడీ వెలిగిస్తున్న ఆల్ఫా యాటిట్యూడ్ అవతార్‌లో ప్రెజెంట్ చేసి ఏకంగా నెట్టింటిని షేక్ చేశాడు. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ సందీప్ - మహేష్ కాంబో ఫిక్స్ అయిన్నట్లే అని చెప్పుకొస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్పెషల్ విష్ చూసిన తర్వాత ఘట్టమనేని అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వారణాసి తరువాత మహేష్ .. సందీప్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చాటి చెప్పనున్నారు రాజమౌళి. వారణాసి సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇప్పటికే మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మూడు నాలుగు గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. రాముడి మహేష్ కనిపించనున్నారని ఇప్పటికే రాజమౌళి చెప్పేశారు. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు లుక్స్ ను విడుదల చేశారు. యాక్షన్ అడ్వాంచర్ గా తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్రా అనే పాత్రలో కనిపించనున్నారు. అయితే వారణాసి సినిమాలో రామాయణానికి సంబందించిన సన్నివేశాలను చూపించనున్నారు. ఆ మధ్య విడుదల చేసిన టైటిల్ టీజర్ లోనూ రాముడు కుంభకర్ణుడిని వధించడం చూపించారు. అయితే రాముడు ఉన్నాడు కాబట్టి హనుమంతుడు కూడా ఉంటాడు. దాంతో వారణాసి సినిమాలో హనుమంతుడిగా నటించేది ఎవరు అనే ఆసక్తి మొదలైంది. అయితే గతంలో వారణాసి సినిమాలో హనుమంతుడిగా మాధవన్ నటిస్తున్నారని ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు మరో హీరో పెను బయటకు వచ్చింది. ఆయన ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ వారణాసి సినిమాలో హనుమంతుడిగా నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో ఓ యాక్షన్ సీన్ లో గద పట్టుకున్న చరణ్ అచ్చం హనుమంతుడిలా అనిపించాడు. అది నచ్చే ఇప్పుడు వారణాసి సినిమాలో చరణ్ ను హనుమంతుడిగా జక్కన్న చూపించనున్నారని సోషల్ మీడియాలో ఒకటే గుసగుస వినిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్

‘వారణాసి’ (Varanasi)కి సంబంధించి భారీగా ప్రచారం నడుస్తోంది. ఇప్పుడీ ప్రచారంలోకి మార్కెటింగ్ కూడా ఎంటరైంది. ‘వారణాసి’కి సంబంధించి అధికారిక ఉత్పత్తులు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే రుద్ర లాకెట్, టీ-షర్టులు, బోర్డు గేమ్స్ వంటి ఇతర ఉత్పత్తులతో కూడిన అధికారిక మర్చండైజ్ రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మేకర్స్ ‘వారణాసి’ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించడంతో పాటు, అభిమానుల కోసం బహుమతులు గెలుచుకునేలా ఒక గేమ్‌ను కూడా పరిచయం చేశారు. ఈ మర్చండైజ్ ప్రచారంలో మరో భాగం. మహేష్ (Mahesh Babu)మెడలో ఉన్న లాకెట్ లాంటిది పొందాలని ఇప్పటికే చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారణాసి చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నాడు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న కానుంది మేకర్స్ ‘వారణాసి’ చిత్రం
దర్శకు ధీరుడు రాజమౌళి , సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ అడ్వంచరస్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న ఈ ఇంటర్నేషన్ స్టాండర్డ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ వెర్సలైట్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కెరీర్లో 29వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఇండియన్ సినీ వర్గాలు ఊహించని ఒక పవర్ఫుల్ మల్టీస్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్‌డే పోస్టర్స్ఈ కథలోని త్రేతాయుగం నేపథ్య ఘట్టంలో మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా నెటిజన్లు రాముడిగా మహేశ్ ఎలా ఉంటాడో ఇమేజ్‌లు క్రియేట్ చేసి వైరల్ చేశారు. అయితే రాముడు ఉన్నాడంటే కచ్చితంగా హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేయనున్నారా? అని చాలాకాలంగా ఆసక్తి నెలకొనగా తాజాగా దీనిపై అదిరిపోయే న్యూస్ బయటికొచ్చింది. ఈ ఘట్టంలో అత్యంత కీలకమైన 'హనుమంతుడి'గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. మొదట ఈ రోల్ కోసం మాధవన్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, పాత్రలోని తీవ్రతకు చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సరైన ఎంపిక అని రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇటీవల ‘పెద్ది’తో తన కెరీర్లోనే సోలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కుస్తీ సన్నివేశాల్లో ఆయన చూపించిన రౌద్రం, బాడీ లాంగ్వేజ్, డివైన్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ ఇంటెన్స్ అప్పీరెన్స్ నచ్చే రాజమౌళి ఈ ప్రత్యేక పాత్ర కోసం చరణ్‌ను సంప్రదించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్త విజయం
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది నిజంగా కత్తి మీద సామే. సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా, ఫ్లాప్ పడినా సోషల్ మీడియాలో వచ్చే హేట్ రేట్, నెగెటివిటీని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది నిజంగా కత్తి మీద సామే. సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా, ఫ్లాప్ పడినా సోషల్ మీడియాలో వచ్చే హేట్ రేట్, నెగెటివిటీని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇక హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ కంటే ముందే దర్శకులు, నిర్మాతలు తీవ్రమైన టెన్షన్లో పడిపోతుంటారు. తమ అభిమాన హీరోను ఎలివేట్ చేసేలా ఒక టీజరో, గ్లింప్సో రిలీజ్ చేయాలి.. లేదంటే ఫ్యాన్స్ నుంచి వచ్చే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ ఊహించడం కూడా కష్టమే. కానీ.. వీటన్నింటినీ ఎంతో కూల్‌గా, తనదైన స్టైల్లో హ్యాండిల్ చేసే ఒక్కే ఒక్క దర్శకుడు ఎవరయ్యా అంటే జక్కన్న రాజమౌళినే అని చెప్పాలి. ఫ్యాన్స్ ఎంత ప్రెషర్ పెట్టినా, ఇండస్ట్రీ ఎంత ఆత్రుతగా ఎదురుచూసినా.. తన టైమ్ వచ్చే వరకు రాజమౌళి (SS Rajamouli) అస్సలు తగ్గడు. సాధారణంగా స్టార్ హీరోలను కష్టపెట్టడానికి వేరే దర్శకులు కాస్త జంకుతారేమో కానీ, జక్కన్న నిఘంటువులో మొహమాటం అనే మాటే ఉండదు. తనకు కావాల్సిన పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వచ్చేంత వరకు.. ఆ హీరోల రక్తం పిండేస్తుంటారు. ఇది వేరే ఎవరో చెప్పిన మాటలు కావు.. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలే స్వయంగా ఒప్పుకున్న సత్యం. అయితే, రాజమౌళి పెట్టిన కష్టానికి ప్రతిఫలంగా ఆ హీరోలకు వారి కెరీర్లోనే మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఇలా అందరూ జక్కన్న చెక్కిన శిల్పాలే, బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) చుట్టూ రోజూ ఏదో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. మహేష్ బాబు 29వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ భారీ అడ్వెంచరస్ డ్రామాకు సంబంధించి తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో ఒక మైండ్ బ్లాకింగ్ రూమర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఇండియన్ సినీ హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అనేలాంటి ఒక పవర్ఫుల్ మల్టీస్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో కథాంశం ప్రకారం ఉండే త్రేతాయుగం ఎపిసోడ్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించనున్నారనే టాక్ గతంలోనే వచ్చింది. దీనిపై దర్శకుడు రాజమౌళి కూడా స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఆ రాముడికి అత్యంత ప్రియమైన, దైవత్వంతో కూడిన పవర్ఫుల్ ‘హనుమంతుడి’ (Lord Hanuman) పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించబోతున్నారని ఫిలింనగర్ టాక్. మొదట ఈ విశిష్టమైన పాత్ర కోసం బహుభాషా నటుడు ఆర్. మాధవన్ పేరును పరిశీలించినప్పటికీ, రాజమౌళి తన విజన్‌కు అనుగుణంగా రామ్ చరణ్ ఐకానిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ డివైన్ లుక్ సరిగ్గా సెట్ అవుతాయని భావించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ క్లైమాక్స్ ఎపిసోడ్లో హనుమంతుడి ప్రతీకగా ప్రదర్శించిన రౌద్రం, రౌద్ర రసంతో కూడిన నటన ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో మైమరిపించింది. ఆ సినిమాలో చరణ్ చూపించిన డివైన్ అండ్ పవర్ఫుల్ అప్పీరెన్స్ రాజమౌళికి కూడా బాగా నచ్చిందని

సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. హీరో నటిస్తున్న తాజా చిత్రాల నుంచి టీజర్లు, గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు వస్తాయని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది. హీరో నటిస్తున్న తాజా చిత్రాల నుంచి టీజర్లు, గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు వస్తాయని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి (Varanasi) పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మహేష్ పుట్టినరోజున రాజమౌళి ఏదో ఒక సంచలన అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ గంపెడాశతో ఉన్నారు. కానీ, ఆ ఆశల మీద రాజమౌళి నీళ్ళు చల్లాడు. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి టీమ్ వారణాసి నుంచి ఎటువంటి టీజర్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయలేదు. కేవలం ఆఫ్రికా షెడ్యూల్లో చిత్రీకరించిన రెండు కొత్త స్టిల్స్‌ను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేసి రుద్ర పాత్రను పరిచయం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోల్లో మహేష్ బాబు రగ్గడ్ లుక్‌లో, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ పరిణామంపై అభిమానులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదో అద్భుతమైన టీజర్ వస్తుందని ఆశించాం, కానీ కేవలం సెట్ ఫొటోలతో సరిపెట్టారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజమౌళి మార్క్ అంటేనే గోప్యత, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా రావాలంటే ఇలాంటి జాగ్రత్తలు అవసరమే అని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం వారణాసి షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న

సోషల్ మీడియాలో ఇప్పటికే పండగ వాతావరణం మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. కానీ ఈసారి బర్త్ డే కి ఒక రేంజ్ క్రేజ్ రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న SSMB29! జైత్రయాత్రలా సాగుతున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్! గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న వారణాసి లీక్డ్ విజువల్స్ రచ్చ, రేపు రాబోతున్న అఫీషియల్ అప్డేట్ రూమర్స్.. ఇవన్నీ కలిపి ఫ్యాన్స్ కి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇవ్వాల్టి ఎక్స్ప్లేనర్ వీడియోలో మనం ఈ వారణాసి లీక్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది? రేపు బర్త్ డే రోజున రాజమౌళి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు? అనే విషయాలను గురించి మాట్లాడుకుందాం.. మొదటి నుంచి SSMB29 గురించిన ప్రతీ చిన్న విషయం ఒక హాట్ టాపిక్‌గానే మారుతోంది. విజయేంద్రప్రసాద్ అందించిన కథనం ప్రకారం ఇదొక గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్. 'ఇండియానా జోన్స్' తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. అయితే, ఈ కథకు మూలం భారతదేశంలోనే.. అందులోనూ అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నేపధ్యంలో ఉంటుందనే వార్తలు గత కొద్ది కాలంగా గట్టిగా వినిపిస్తున్నాయి. వారణాసి ఘాట్లు, గంగా హారతి బ్యాక్‌డ్రాప్, పురాతన ఆలయాల ప్రాంగణాలు.. వీటి మధ్య మహేష్ బాబు ఒక అడ్వెంచరర్ లుక్‌లో ఎలా ఉంటారనేది ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గోస్బంప్స్ వస్తున్నాయి. ఇండియన్ మైథాలజీ అండ్ ఆధ్యాత్మిక అంశాలను అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచర్‌కు అనుసంధానించడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. 'మగధీర', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాల్లో మనం ఇది చూశాం. ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి నేపథ్యాన్ని ఎంచుకోవడం వెనుక చాలా పెద్ద కథే ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఇక

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి రెండు ప్రత్యేక స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ స్టిల్స్‌తో రుద్ర తన నేచురల్ లుక్‌లో ప్రపంచానికి తొలిసారిగా కనిపించాడు. మొదటి స్టిల్‌లో దట్టమైన అడవి మధ్యలో ఒక వెదురు తెప్పపై విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా రుద్ర కనిపిస్తున్నాడు. ఇక ఆ స్టిల్‌ను చూస్తే పాలసంద్రంలో ఆదిశేషుపై సేదతీరే శ్రీ మహా విష్ణువులా కనిపిస్తున్నారు. ఇంకో స్టిల్‌లో కెన్యాలోని మసాయి మారా విశాలమైన మైదానాలకు చెందింది. అక్కడ రుద్ర జిరాఫీలు, వైల్డ్‌బీస్ట్‌ల మధ్య నిలబడి, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఈ రెండు స్టిల్స్‌ను గమనిస్తే ‘వారణాసి’ సినిమాలోని సోల్, రుద్ర పాత్ర తీరు గురించి అందరికీ అర్థమయ్యేలా ఉంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుండి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ మేరకు పోస్ట్ వేస్తూ.. ‘రుద్ర తనకంటే ఎంతో గొప్పదైన, పెద్దదైన ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి జన్మించాడు. అతను కోరుకోని విధిని మోస్తున్నాడు. అతను చమత్కారి, సున్నితమైనవాడు, ఉగ్రరూపం దాల్చగలడు. మహేష్ అతనికి తీసుకువచ్చింది అదే. ఉగ్రంగా కనిపించే పాత్రను ఎవరైనా పోషించగలరు. కానీ ఒకేసారి ఉగ్రంగా, సున్నితంగా నటించగలవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ఫ్రేమ్‌లు మా ఆఫ్రికా షెడ్యూల్ నుండి తీసుకోబడ్డాయి. ఏ సెట్ ఇవ్వలేని అనుభూతిని ఆ నేల మాకు ఇచ్చింది. కిలిమంజారో చుట్టూ మసాయి మారాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను నివ్వెరపోయాను. కొన్ని ఉదయాన్నే, మా కళ్ల ముందు ఉన్నదాన్ని 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్ కూడా ఇమడ్చలేదని నాకు అనిపించింది’ అని అన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, ఎం.ఎం. కీరవాణి సంగీతంతో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ఆయన చేపట్టే అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆయనకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.సీఎంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి కూడా మహేశ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేశ్ వంటి అగ్ర తారలు ఆయనకు విషెస్ తెలియజేశారు. భారతీయ సినిమాలో అత్యంత అభిమానం పొందిన నటులలో ఒకరిగా మహేశ్ ఎదగడం గర్వంగా ఉందని చిరంజీవి అన్నారు. మహేశ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా పిల్లలకు సహాయం చేయడం స్ఫూర్తిదాయకమని పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రశంసించింది.వెంకటేశ్ అయితే 'నా చిన్నోడు మహేశ్' అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ, రాబోయే 'వారణాసి' చిత్రంలోని రుద్ర లుక్‌లో మహేశ్ అదరగొడుతున్నాడని కితాబిచ్చారు. ఈ సినిమాతో మహేశ్ వచ్చే ఏడాది ప్రపంచాన్ని ఏలడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.ప్రస్తుతం మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మరోవైపు, అభిమానులు తమ హీరో పుట్టినరోజును పాత చిత్రాల రీ-రిలీజ్లు, ప్రత్యేక కార్యక్రమాలతో సోషల్ మీడియాలో ఘనంగా జరుపుకుంటున్నారు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి‘. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బజ్డేట్ పై తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్ చేసేస్తున్నాడు రాజమౌళి. కాగా నేడు సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమాలో మహేశ్ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేసారు రాజమౌళి. ఈ ఫోటోలు ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించినవి. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అనే క్యాప్షన్ తో ఎక్స్ లో పోస్ట్ చేసారు రాజమౌళి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ‘రుద్ర’గా రౌద్రం చూపించిన మహేశ్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో లాంగ్ హెయిర్, గడ్డం మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ లుక్ ఉబర్ కూల్ గా దర్శమిస్తున్నాడు సూపర్ స్టార్. అయితే మహేశ్ బాబు ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నేడు పుట్టిన రోజు సందర్భాంగా శ్రీరాముడు లుక్ చేస్తారని ఆశించారు ఫ్యాన్స్. కానీ అవేమి లేకుండా సింపుల్ పోస్టర్స్ తో సరిపెట్టేసాడు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు
సూపర్‌స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. బాక్సాఫీస్కా బాప్ అంటూ ఫ్యాన్స్‌తో ముద్దుగా పిలిపించుకునే మహేశ్నేడు పుట్టినరోజు(ఆగస్టు 9) జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా అభిమానులతో పాటు సెలబ్రెటీలు సైతం సోషల్‌మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.* వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్‌డే పోస్టర్స్మహేష్బాబు బర్త్‌డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌బాబును చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చానని, ఈ రోజు ఆయన భారతీయ చిత్రసీమలోనే అత్యంత ఆదరణ, ప్రజాదరణ పొందిన దిగ్గజ తారలలో ఒకరిగా ఎదిగిన తీరును తిలకించడం తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు మహేశ్‌కు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్మరోవైపు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా మహేశ్‌బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. మహేశ్‌బాబును ఒక హీరోగా అభిమానించడం గర్వకారణమని, ఒక గొప్ప వ్యక్తిగా ఆయనను గౌరవించడం తమకు దక్కిన అదృష్టమని కొనియాడారు. మహేష్‌లో ఉన్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంకితభావం మరియు వినయపూర్వక నడవడిక ఆయనను కేవలం సూపర్‌స్టార్‌గానే కాకుండా కోట్లమందికి స్ఫూర్తిగా నిలబెట్టాయని అన్నారు. అంతేకాకుండా, రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ‘వారణాసి’ చిత్రంపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాసి, దేశంలోనే నంబర్ వన్ చిత్రంగా నిలుస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ‘వారణాసి’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానన్నారు. బాక్సాఫీస్‌ను ఏలుతూ, చరిత్రను సృష్టిస్తూ ఇలాగే మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు.* ‘తప్పంతా నాదే, త్వరలోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తా’... అజయ్ భూపతి ఎమోషనల్ పోస్ట్సూపర్స్టార్ మహేష్ బాబుకి

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చాడు. ఆయన కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ చిత్రంలో మహేశ్ 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు.విడుదల చేసిన పోస్టర్లలో మహేశ్‌బాబు సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఒక పోస్టర్లో వెదురు తెప్పపై సేద తీరుతూ కనిపించగా, మరో పోస్టర్లో ఆఫ్రికా అడవుల్లోని ప్రకృతిని చూస్తూ నిలబడి ఉన్నాడు. "తీవ్రత మాత్రమే అతని నైజం కాదు... 'వారణాసి'లో రుద్ర" అంటూ మహేశ్‌బాబు ఈ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, మహేశ్ పాత్ర గురించి, నటన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. "రుద్ర ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పుట్టాడు. తను కోరుకోని విధిని మోస్తున్నాడు. అతడు చమత్కారి, సున్నితమైనవాడు, అదే సమయంలో తీవ్రమైన వాడు. మహేశ్ ఈ పాత్రకు ప్రాణం పోశాడు. తీవ్రత, సున్నితత్వం రెండింటినీ ఒకేసారి పండించగల నటులు చాలా తక్కువ మందే ఉంటారు" అని రాజమౌళి ప్రశంసించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో, మసాయ్ మారా ప్రాంతాల్లో షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, అక్కడి లొకేషన్లు సెట్స్‌లో సృష్టించలేని అనుభూతిని ఇచ్చాయని తెలిపాడు.ఈ చిత్రంలో మహేశ్‌తో పాటు నటిస్తున్న ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'వారణాసి' సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. ప్రధాన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయిందని, మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారని
ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత మెయింటేన్ చేసినా... ఏజ్ పెరుగుతున్నాకొద్ది ముసలితనం కామన్. దాచుకన్నా అది దాగదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో మాత్రం అద్భుతమే జరుగుతుంది. ఆయన వయసు పెరిగే కొద్ది గ్లామర్ రెట్టింపు అవుతోంది. 50 ఏళ్లు దాటినా సూపర్ స్టార్ ఇంకా కుర్ర హీరోలాగానే కనిపిస్తున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరున్న సూపర్ స్టార్.. ఇప్పటికీ అదే లుక్ ను మెయింటేన్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ లో అభిమానులను ఫిదా చేస్తున్నాడు. తాజాగా మరోసారి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు మహేష్. తాజాగా వారణాసి నుంచి మహేష్ బాబు న్యూ లుక్ ను రిలీజ్ చేశాడు రాజమౌళి. సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు మరింత యంగ్ గా, స్మార్ట్ గా కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 5 పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. మహేష్ బాబు ఇలా ఎలా మెయింటేన్ చేస్తున్నాడా అని అంతా షాక్ అవుతున్నారు. రాజమౌళి ఇలా ఫోటోస్ రిలీజ్ చేయగానే.. అలా వైరల్ చేసేస్తున్నారు అభిమానులు. సూపర్ స్టార్ మహేష్ బాబు 5 పదుల వయసులో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు, డైట్, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకపోవడం లాంటివి ముఖ్యమైనవి. మహేష్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నచ్చినవి తింటాడు కానీ.. మితంగా తీసుకుంటాడు. బాడీకి సరిపడా ప్రోటీన్, ఫైబర్ అందేలా బ్యాలెన్డ్ మీల్స్ ను మెయింటేన్ చేస్తుంటాడు. ఇక ఆయన లైఫ్ లో షుగర్ కానీ, డైరీ ప్రాడెక్ట్ అయిన పాలు, పెరుగు, వెన్న నెయ్యి లాంటివి అస్సలు ముట్టుకోడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పటి వరకూ టాలీవుడ్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Varanasi Story Line:ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా..వారణాసి సినిమా గురించి వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. 2027లో ప్రపంచం ఓ భారీ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ‘శాంభవి’ అనే భారీ ఉల్క భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పవిత్ర నగరం వారణాసికి ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ఆపడానికి హీరో రుద్ర రంగంలోకి దిగుతాడట. మహేశ్ బాబు ఈ సినిమాలో రుద్ర అనే పురావస్తు పరిశోధకుడు, సాహసికుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఓ పురాతన రహస్య వస్తువు కోసం అతడు అన్వేషణ చేస్తాడని చెబుతున్నారు. ఈ మిషన్‌లో అతనికి మందాకిని అనే చరిత్ర పరిశోధకురాలు సహాయం చేస్తుందట. ఈ పాత్రను ప్రియాంక చోప్రా జోనాస్ పోషిస్తున్నారు. ఆమె పాత్ర చాలా ధైర్యంగా, యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపించేలా ఉంటుందని సమాచారం. అదే సమయంలో రుద్ర, మందాకినిలను ఓ తెలివైన విలన్ వెంటాడుతుంటాడట. కుంభ అనే ఈ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. కథలో భాగంగా ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ప్రాంతాలు, యూరప్ వంటి అనేక ప్రదేశాలు కనిపిస్తాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ కథలో టైమ్ ట్రావెల్, పురాణాలు, ఆధునిక సైన్స్ వంటి అంశాలు కూడా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. గత కాలానికి, భవిష్యత్తుకు మధ్య జరిగే సంఘటనలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ నుంచి రుద్ర

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mahesh Babu Birthday Varanasi Special: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి'. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హీరో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'వారణాసి' సినిమా నుంచి సరికొత్త లుక్స్‌ను చిత్రబృందం షేర్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'వారణాసి' చిత్రబృందం విడుదల చేసిన లుక్స్ ప్రకారం.. ఆఫ్రికాలోని వైల్డ్లైఫ్లో షూటింగ్ చేస్తున్న క్రమంలో దాని తాలూకా లుక్స్‌ను విడుదల చేసినట్లు కనిపిస్తుంది. అందులో ఓ లుక్.. మహేష్ బాబు సైడ్ లుక్ ఉండగా, రెండోది ఆయన స్టైల్‌గా పడుకున్న లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడా పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్ఫుల్ విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజు మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. అసలు కథ ఏంటంటే..? ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ తో అల్లరించబోతున్నప్పటికీ.. ఈ స్టోరీ సోల్ మాత్రం పక్క ఇండియన్ ఎమోషన్

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన ఆయన అభిమానులకు భారీ సర్ ప్రైజ్ లభించింది. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' నుంచి మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే మాసీ మరియు అడ్వెంచరర్ పాత్రలో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఆయన 'రుద్ర' మరియు 'శ్రీరామ' అనే రెండు విభిన్న పాత్రలలో నటించనున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో మహేష్ బాబు ఒత్తైన జుట్టు, దట్టమైన గడ్డం మరియు మీసాలతో చాలా రగ్గడ్ అడ్వెంచరర్ అవతార్ లో దర్శనమిచ్చారు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇదిలా ఉండగా, ఈ పోస్టర్ షేర్ చేస్తూ రాజమౌళి పెట్టిన క్యాప్షన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఉగ్రరూపం మాత్రమే అతని ఏకైక కోణం కాదంటూ రుద్ర పాత్రలోని లోతైన కోణాలను రాజమౌళి తన సందేశం ద్వారా వెల్లడించారు. దర్శకుని ప్రకటనతో ఈ రుద్ర పాత్రలో కేవలం కోపం మాత్రమే కాకుండా, అనేక ఆసక్తికరమైన ప్రశాంతమైన షేడ్స్ కూడా ఉంటాయని స్పష్టమవుతోంది. ఫలితంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను మరియు మహేష్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి టేకింగ్ మరియు మహేష్ బాబు మాస్ మేకోవర్ కలగలిసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో రుద్రను పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అనే క్యాప్షన్ పెట్టారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ వారణాసి నుంచి మహేష్ బాబు కొత్త ఫోటోలను జక్కన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు.. అంతకు మించి కోణాలు ఉన్నాయి' ( Fierce isn’t his only shade… RUDHRA in Varanasi) అని అర్థం వచ్చేలా మహేష్ బాబును ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. దీనిని బట్టి రుద్ర పాత్రలో వీరత్వం ఒకటే కాదు అంతకు మించి ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటివరకు ‘వారణాసి’కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోల్లో మహేశ్‌బాబు లుక్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ షేడ్స్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. అయితే “Fierce isn’t his only shade” అంటూ రాజమౌళి చెప్పడంతో.. రుద్ర పాత్రలో యాక్షన్‌కు మించి మరో బలమైన భావోద్వేగ కోణం ఉండొచ్చనే చర్చ మొదలైంది. దీనితో ‘రుద్ర’ పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఇందులో మహేశ్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్‌ను పూర్తి చేసి, అనంతరం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మహేష్ కూడా వారణాసి గురించి పోస్ట్ చేశారు. 'రుద్ర ప్రపంచం నుంచి మరికొంత' (A little more of Rudhra’s world) అంటూ స్టైలిష్ ఫోటోలను షేర్ చేశారు. ఆయన పోస్ట్ ప్రేక్షకుల్లో

Varanasi : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నచిత్రం వారణాసి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయిక. కాగా.. నేడు మహేశ్‌బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి మహేశ్ బాబు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రుద్ర పాత్రని పరిచయం చేస్తూ రాజమౌళి పోస్ట్ పెట్టారు. రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు అనే క్యాప్షన్‌ను పెట్టారు. Anupama Parameswaran : అదిరిపోయిన అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు.. మీ దేశీ గర్ల్ అంటూ.. వాస్తవంగా రుద్ర అంటే తీవ్రమైన కోపం, భీకరమైన రూపం గుర్తుకు వస్తుంది. అయితే.. ఈ ఫోటోతో ఈ పాత్రలో కోపం కాకుండా ప్రశాంతత, లోతైన ఆలోచనలతో మరిన్ని భిన్నమైన షేడ్స్ కూడా ఉంటాయని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఒత్తైన జుట్టు, గడ్డం మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ అడ్వెంచరర్ లుక్‌లో మహేశ్ బాబు అదిరిపోయాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. Fierce isn’t his only shade… RUDHRA in #Varanasi. @urstrulyMahesh — rajamouli ss (@ssrajamouli) August 9, 2026
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న భారీ అడ్వెంచరస్ చిత్రం ‘ వారణాసి ’. అంతర్జాతీయ స్థాయిలో భారీ విజన్‌తో తెరకెక్కుతోన్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం భారతీయ చిత్రసీమలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.సోషల్ మీడియాను ఊపేస్తున్న 'రుద్ర' పోస్టర్లుమహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (ఆగస్టు 9) ఈ సినిమా నుంచి మేకర్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు. చిత్రంలో మహేశ్ పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు సంబంధించిన రెండు సరికొత్త పోస్టర్లను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పిక్‌లో పొడవాటి జుట్టు, గడ్డంతో రఫ్ అండ్ టఫ్ అవతార్‌లో కనిపించారు. ఒక పోస్టర్లో ప్రకృతికి దగ్గరగా అడవి నేపథ్యంలో సీరియస్ లుక్‌తో అలరించగా, మరొక పిక్‌లో వెదురు తెప్పపై పడుకుని శత్రువుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.రాజమౌళి ఈ పోస్టర్లను షేర్ చేస్తూ.. "‘‘వారణాసి’లో రుద్ర... ఉగ్ర రూపం ఒక్కటే ఆయన నైజం కాదు’ అని ఆసక్తికరంగా క్యాప్షన్ జత చేశారు. మహేశ్ బర్త్‌డే వేళ టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందని భావించిన అభిమానులకు, ఈ పిక్స్ మాత్రం నెవర్ బిఫోర్ స్టన్నింగ్ ఫీస్ట్‌లా మారాయి. పిక్స్ పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ట్రెండింగ్‌గా మారి నెట్టింట రికార్డు వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇండియన్ స్క్రీన్‌పై విజువల్ వండర్ఈ సినిమా కథాంశం వారణాసి నగరానికి దూసుకొచ్చే ‘శాంభవి’ అనే భారీ ఉల్క (asteroid) ప్రమాదం చుట్టూ తిరుగుతుందని సమాచారం. కాలాల సరిహద్దులను చెరిపేస్తూ త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, అలాగే ఆఫ్రికన్ అడవులు, అంటార్కిటికా మంచు ఖండాల నుంచి ప్రాచీన రోమ్ వరకు సాగే అడ్వెంచరస్ టైమ్ ట్రావెల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రాజమౌళి దిద్దుతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా జోనాస్ ‘మందాకిని’ అనే ఫైరిష్ క్యారెక్టర్లో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సాహసోపేత యాక్షన్ డ్రామా వారణాసి చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని, కేవలం కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని పరిశ్రమ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే రాజమౌళి తెరకెక్కించే సినిమాలు సాధారణంగా పూర్తి కావడానికి చాలా సమయం పడతాయి. ఈ క్రమంలోనే వారణాసి తర్వాత మహేష్ బాబు ఏ దర్శకుడితో తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారు అనే విషయంపై ఇప్పుడు సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. సాధారణంగా ఎస్.ఎస్. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడితో సినిమా పూర్తయిన తర్వాత ప్రతి కథానాయకుడు తమ తదుపరి చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటారు. మహేష్ బాబు కూడా అదే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లోని ఇద్దరు అత్యంత ప్రభావవంతమైన దర్శకుల పేర్లు మహేష్ బాబు తదుపరి చిత్రానికి బలంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా కాగా, మరొకరు ఉప్పెన, పెద్ది చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్న బుచ్చిబాబు సానా. ఈ ఇద్దరు దర్శకులు మహేష్ బాబు ఇమేజ్‌కు తగినట్లుగా కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరు దర్శకులలో మహేష్ బాబు ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఆయన తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. మహేష్ బాబు ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని