
Toxic Movie: టాక్సిక్ సినిమాపై ఆశలు.. భారీప్రాజెక్ట్ వదులుకున్న యశ్.. డైరెక్టర్ కామెంట్స్..
Toxic Movie: టాక్సిక్ సినిమాపై ఆశలు.. భారీ ప్రాజెక్ట్ వదులుకున్న యశ్.. డైరెక్టర్ కామెంట్స్..

Toxic Movie: టాక్సిక్ సినిమాపై ఆశలు.. భారీ ప్రాజెక్ట్ వదులుకున్న యశ్.. డైరెక్టర్ కామెంట్స్..

‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు అందించిన భారీ విజయాల తర్వాత, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యశ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘టాక్సిక్’. కన్నడ సినిమా పరిశ్రమను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) కెరీర్లో ఇప్పుడు ఒక కీలక మలుపు వచ్చింది. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు అందించిన భారీ విజయాల తర్వాత, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆయనను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘టాక్సిక్’ (Toxic). మొదట్లో ఈ సినిమాపై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాన్స్‌ల కారణంగా అంచనాలు తారాస్థాయికి చేరాయి. కో ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా కూడా యశ్ ఈ ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే, థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి, ఐదు వందల కోట్ల థియేట్రికల్ రైట్స్ వ్యాపారం జరిగింది. వరల్డ్ వైడ్‌గా మూడు వందల ఐదు కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, పెట్టిన పెట్టుబడి దృష్ట్యా ఈ చిత్రం సేఫ్ జోన్‌కి చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా సినిమాలో మోతాదు మించిన యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేశాయి. దీనివల్ల సోషల్ మీడియాలో ఈ చిత్రంపై కొంత ట్రోలింగ్ కూడా నడిచింది. రీసెంట్గా జీ5 సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకోగా, ఇప్పుడు అందరి దృష్టి యశ్ నటిస్తున్న నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana) వైపు మళ్ళింది. ప్రస్తుతం యశ్ కెరీర్‌ను పూర్తిగా మలచగల సత్తా ఉన్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్లో దాదాపు నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ పౌరాణిక చిత్రంపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో యశ్ అత్యంత శక్తివంతమైన పాత్ర అయిన రావణాసురుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో

Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యశ్‌కు బలమైన మార్కెట్ ఉన్న సొంత రాష్ట్రం కర్ణాటకలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సొంత రాష్ట్రంలో మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా.. హీరోకు ఉన్న క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా తొలి వారంలోనే భారీ వసూళ్లు నమోదవుతుంటాయి. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యశ్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలో ఈ సినిమా కనీసం రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా చేరుకోలేకపోయిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యశ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్క్‌ను ‘టాక్సిక్’ సులభంగా అందుకుంటుందని చాలామంది అంచనా వేశారు. కానీ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచే గణనీయమైన డ్రాప్‌ను చూసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడం సినిమా థియేట్రికల్ రన్‌పై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కర్ణాటకలో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌ను అందుకోవాలనే టార్గెట్‌ను ‘టాక్సిక్’ చేరుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి హిందీ మార్కెట్లో మాత్రం సినిమాకు కొంత ఊరట లభించినట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందీ బెల్ట్‌లో ‘టాక్సిక్’కు మెరుగైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అక్కడి నుంచి వస్తున్న వసూళ్లు సినిమాకు కొంత బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు. ఇక తెలుగులోనూ ‘టాక్సిక్’కు తొలి రోజు సాలిడ్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ.. రెండో రోజు నుంచి పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షోలు క్యాన్సిల్ అయ్యే

కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన సినిమా 'టాక్సిక్'. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్లు, బోల్డ్ సన్నివేశాలు తప్పితే ఆకట్టుకునే కంటెంట్ లేదని రివ్యూయర్లు తేల్చేశారు. దీంతో మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించిన టాక్సిక్ మూవీ రెండో రోజు నుంచి ఎదురీదడం ప్రారంభించింది. ఈ సంగతి పక్కన పెడితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని టాక్సిక్ సినిమాకు రేటింగ్ ఇచ్చాడన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లెటర్ బాక్స్ డీ అనే ఖాతాలో పలు సినిమాలకు రేటింగ్ ఇచ్చాడు గౌతమ్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషా సినిమాలకు కూడా గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. అందులో తన తండ్రి మహేష్ బాబు నటించిన సినిమాలు కూడా ఉండడం గమనార్హం. మహేష్ బాబు నటించిన 'పోకిరి', '1: నేనొక్కడినే' సినిమాలకు గౌతమ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో 'నిజం', 'వంశీ' చిత్రాలకు 2 స్టార్ రేటింగ్ ఇవ్వగా.. 'బ్రహ్మోత్సవం' చిత్రానికి కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాడు. అలాగే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ రవితేజ ఇరుముడి సినిమాకు 3 రేటింగ్ ఇచ్చాడీ స్టార్ కిడ్. ఇదే క్రమంలో యశ్ నటించిన టాక్సిక్ మూవీకి ఏకంగా 0.5 రేటింగ్ ఇచ్చాడు గౌతమ్. ఇప్పుడిదే విషయం టాలీవుడ్, శాండల్ వుడ్ లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ లెటర్ బాక్స్ డీ ప్రొఫైల్‌లో దాదాపు 400కు పైగా సినిమాలకు రేటింగ్స్ ఇచ్చాడు గౌతమ్. హాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్స్ 'ది ఒడిస్సీ', 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ చిత్రం 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రదర్శించబడుతోంది. అయితే, యశ్ నటనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నప్పటికీ... మేకింగ్, స్క్రీన్‌ప్లేపై మిశ్రమ స్పందన, విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీశ్ సోషల్ మీడియా వేదికగా యశ్‌కు మద్దతు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. "యశ్, నువ్వు ఏ విషయానికీ భయపడకుండా ధైర్యంగా నీ సొంత బాటలో ఇక్కడి దాకా వచ్చావు. ఈ సినిమాలో నీ నటన నిజంగా అద్భుతం. నీ కెరీర్లో ఇది ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. 'టాక్సిక్' బహుశా ఇప్పుడు రావాల్సిన చిత్రం కాదేమో, కాలంకంటే ముందే వచ్చిన సినిమా కావచ్చు. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు, లేదా ఈ చిత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారే నెగెటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. విజయం ఎప్పుడూ పక్కవారికి అసూయను కలిగిస్తుంది. ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోకు, భవిష్యత్తులో 'కేజీఎఫ్' కంటే పెద్ద హిట్ సాధించి మళ్లీ ఘనవిజయం సాధిస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని రాసుకొచ్చారు. మరోవైపు కాంతార ఫేమ్, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి కూడా యశ్‌కు అండగా నిలిచారు. 'టాక్సిక్' సినిమా ఒక సాహసోపేతమైన ప్రయోగమని... కన్నడ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలనే యశ్ తపనను తాము ఎంతగానో గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు యశ్ ప్రయత్నాన్ని సమర్థిస్తూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు
5/5సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ప్రముఖ గ్లోబల్ మూవీ రివ్యూయింగ్ ప్లాట్‌ఫామ్ 'లెటర్‌బాక్స్' (Letterboxd) ప్రొఫైల్ ద్వారా ఇచ్చే సినిమా రేటింగ్‌లు బయటకు రావడంతో ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కంటెంట్‌ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నిర్భయంగా ఇచ్చే ఈ రేటింగ్‌లు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా టాక్సిక్ పై ఇచ్చిన రేటింగ్ వైరల్ గా మారింది. టాక్సిక్ కి గౌతమ్ అర నక్షత్రం రేటింగ్ ఇచ్చాడు. ఇప్పటివరకు వివిధ భాషలు, వివిధ జోనర్లకి చెందిన 400లకి పైగా సినిమాలని గౌతమ్ వీక్షించినట్లు అతని ప్రొఫైల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ రివ్యూల సమాహారంలో అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే, గౌతమ్ తన తండ్రి మహేష్ బాబు నటించిన కల్ట్ క్లాసిక్ సినిమాలైన 'పోకిరి', '1: నేనొక్కడినే' చిత్రాలకు ఏకంగా పూర్తిస్థాయి 5/5 నక్షత్రాల రేటింగ్ ఇచ్చాడు. తన తండ్రి కెరీర్లోనే ఎంతో వైవిధ్యమైన, సాహసోపేతమైన ప్రయోగాత్మక పాత్రలను గౌతమ్ ఎంతగా అభినందిస్తాడో ఈ రేటింగ్స్ నిరూపిస్తున్నాయి. అయితే అదే సమయంలో, నెగెటివ్ టాక్ తెచ్చుకున్న మహేష్ బాబు సినిమా 'బ్రహ్మోత్సవం' చిత్రానికి గౌతమ్ కేవలం 1 స్టార్ మాత్రమే ఇచ్చి సరిపెట్టుకోవడం విశేషం. అంతేకాదు, మహేష్ బాబు నటించిన 'నిజం', 'వంశీ' చిత్రాలకు కూడా కేవలం 2 స్టార్ల చొప్పున మాత్రమే రేటింగ్ కేటాయించి తన స్వతంత్ర అభిప్రాయాన్ని ఏమాత్రం దాచుకోలేదు. టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల పాన్-ఇండియా, హాలీవుడ్ చిత్రాల విషయంలోనూ గౌతమ్ తన సమీక్షా ముద్రను స్పష్టంగా వేశాడు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం 'బాహుబలి 2' చిత్రానికి గౌతమ్ సంపూర్ణంగా 5 నక్షత్రాలు అందించగా, క్లాసిక్ లవ్ అండ్ యూత్ ఫుల్ డ్రామాలైన 'పెళ్లిచూపులు', 'సీతారామం' సినిమాలకు 4.5 రేటింగ్ ఇచ్చి తన సినిమా అభిరుచి ఎంత పరిణతి చెందిందో చాటిచెప్పాడు. ప్రతికూల వైపు చూస్తే, యశ్ నటించిన

ఒకప్పుడు ఒక్క చాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు... వెళ్లిన ప్రతి ఆడిషన్‌లోనూ ‘రిజెక్ట్’ అనే మాట విని విసిగిపోయిన క్షణాలు... కానీ ఇవాళ అదే నటి, ఒకే ఒక్క పాత్రతో సినిమా మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఆ నటి మరెవరో కాదు, కియారా అద్వానీ. 'టాక్సిక్' సినిమాలో ఆమె పోషించిన 'నాడియా' పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 'టాక్సిక్' సినిమాలో కియారా అద్వానీ చేసిన నాడియా పాత్ర మామూలు పాత్ర కాదు. సినిమా మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఒకరకమైన క్యూరియాసిటీని పెంచే ఈ క్యారెక్టర్, కథ ముందుకు సాగేకొద్దీ మరింత బలంగా మారుతుంది. నాడియా పాత్రకు కియారా ప్రాణం పోసిందని చెప్పొచ్చు. సర్కస్ ఆర్టిస్ట్‌గా, ప్రేయసిగా, స్నేహితురాలిగా, తల్లిగా... చివరికి ప్రేమలో విఫలమైన మహిళగా నాడియా ఎన్నో భావోద్వేగాలను పండిస్తుంది. ఈ షేడ్స్ అన్నింటినీ కియారా అద్వానీ చాలా సున్నితంగా, అద్భుతంగా పండించారు. కియారా నటనలో ఉన్న అసలు బలం డైలాగులు కాదు, ఆమె కళ్లే అని చెప్పొచ్చు. సంతోషం, బాధ, భయం, నిస్సహాయత, ప్రేమ... ఇలా ప్రతి ఎమోషన్‌ను కళ్ల ద్వారానే ప్రేక్షకులకు చేరవేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కొడుకు ముందు నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకునే సీన్ అయితే కియారా నటనకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆ ఒక్క సీన్లోనే నాడియా పాత్ర పడుతున్న బాధ, నిస్సహాయత, అంతర్మథనం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. 'టాక్సిక్'లో నాడియా పాత్ర స్క్రీన్ టైమ్ ఎంత ఉన్నా, ఆ క్యారెక్టర్ ప్రభావం మాత్రం సినిమా చివరి వరకు ఉండేలా కియారా చేసింది. కథలోంచి ఒక దశలో ఆ పాత్ర నిష్క్రమించినా, 'నాడియా' అనే పేరును ప్రేక్షకులు మర్చిపోకుండా చేయడంలో ఆమె నటన కీలక పాత్ర పోషించింది. రాయన్ లాంటి క్రూరమైన వ్యక్తితో ప్రేమలో పడటం, అతని బిడ్డకు తల్లి కావడం, చివరికి తను లేకపోయినా రాయన్ మనసులో ఒక భ్రమగా, జ్ఞాపకంగా మిగిలిపోవడం

ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఈక్వెషన్ యష్ విషయంలో శృతి తప్పింది. యష్ హోమ్ స్టేట్ కర్ణాటకలో టాక్సిక్ కి తగిలిన షాక్ ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. షాక్ కి గురి చేయడమే కాదు ఎందుకు ఇలా అనే విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. యష్ కి ఉన్న క్రేజ్, మాస్ ఇమేజ్‌ని బట్టి కర్ణాటకలో టాక్సిక్ చాలా తేలికగా 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరుతుందని అందరూ ఆశించారు. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా వచ్చిన . 140 కోట్ల గ్రాస్ లో కర్ణాటకలోనే దాదాపు 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డుల బోణీ కొట్టింది. కానీ, రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కర్ణాటకలో ఎలాంటి సినిమా లేకపోయినా కూడా ప్రేక్షకులు టాక్సిక్ థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కర్ణాటక థియేట్రికల్ రన్లో కనీసం 100 కోట్ల గ్రాస్ మార్జిన్ అందుకోలేక చేతులెత్తేసింది. అయితే ఉత్తరాది హిందీ బెల్ట్‌లో మాత్రం ‘టాక్సిక్’ అద్భుతమైన ప్రదర్శనతో ఊరటనిస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే బాలీవుడ్ మార్కెట్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కుతుండటం విశేషం. హిందీ బెల్ట్‌లో తొలి రోజే ఏకంగా 55 కోట్ల మేర సాలిడ్ కలెక్షన్లు సాధించి, సౌత్ ఇండియా సినిమాల్లోనే హిందీ వెర్షన్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమా కంటెంట్‌కి, యశ్ స్క్రీన్ ప్రజెన్స్‌కి బ్రహ్మరథం పడుతుండటంతో అక్కడ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ పరిస్థితిని పరిశీలిస్తే మరో రకమైన షాకింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. తెలుగులో మొదటి రోజు 20.1 కోట్ల గ్రాస్ సాధించి సాలిడ్ ఓపెనింగ్ తెచ్చుకున్నప్పటికీ, రెండో రోజు నుంచే థియేటర్లలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆడియన్స్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో పలు థియేటర్లలో షోలు రద్దయ్యే పరిస్థితులు కూడా చూసింది

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా, వర్సటైల్ నటి నయనతార , ప్రముఖ నటి కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించిన భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. థియేటర్లలో విడుదలై ఆరో రోజుకు చేరుకున్న నేపథ్యంలో, బాక్సాఫీస్ వసూళ్లలో గణనీయమైన మార్పులు నమోదు అయ్యాయి. ఆరో రోజు వసూళ్లలో మునుపటి రోజులతో పోలిస్తే 67.6 శాతం మేర తగ్గుదల (డ్రాప్) కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలిపి ఇప్పటివరకు రూ. 304.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోయింది. యాష్‌కు ఉన్న అంతర్జాతీయ మార్కెట్ క్రేజ్, అలాగే నయనతార, కియారా అద్వానీల సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. ఆరో రోజు సాధారణ పనిదినం (వర్కింగ్ డే) కావడంతో వసూళ్లలో 67.6 శాతం మేర తగ్గుదల నమోదైనట్లు బాక్సాఫీస్ విశ్లేషకులు వెల్లడించారు. అయినప్పటికీ, అంతర్జాతీయంగా, దేశీయంగా సాధించిన వసూళ్లతో కలిపి మొత్తం రూ. 304.05 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవడం టాక్సిక్ పవర్ ను చూపిస్తోంది. టాక్సిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ వసూళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా నెట్ కలెక్షన్లలో ఇప్పటికే రూ. 200 కోట్ల మార్కును దాటినప్పటికీ, మొదటి రోజు సాధించిన రికార్డు ఓపెనింగ్స్ తర్వాత ప్రతిరోజూ వసూళ్లు పడిపోతున్నాయి. ప్రముఖ ట్రేడ్ వెబ్సైట్ Sacnilk కథనం ప్రకారం, మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం రూ. 7.45 కోట్లు మాత్రమే రాబట్టింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇదే అత్యల్ప సింగిల్-డే కలెక్షన్ కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు భారత్‌లో సాధించిన మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 221.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో గ్రాస్ వసూళ్లు.. 264.80 కోట్లు కాగా.. ఒవర్ సిస్ లో

రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ టాలీవుడ్ పరిశ్రమ మొత్తానికి కొత్త ఊపిరి పోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనియాడారు. రాజ్‌తరుణ్, శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కూర్మావతార్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లకు జనం తండోపతండాలుగా తరలివస్తుంటేనే సినిమాలు తీసే నిర్మతలకు, నటీనటులకు కొండంత ధైర్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినిమాలో గురుస్వామి పాత్రలో జీవించిన సీనియర్ నటుడు సాయికుమార్ నటనపై ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు గుప్పించారు. ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఇరుముడి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ భక్తిరస డ్రామా ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల అనుబంధంతో పాటు అయ్యప్ప దీక్ష నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమా తెచ్చిపెట్టిన పాజిటివ్ వైబ్ కేవలం ఒక చిత్ర బృందానికే కాకుండా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో ప్లస్ అయిందని దిల్ రాజు విశ్లేషించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో ఇరుముడి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సినిమా భారతదేశంలో నెట్ వసూళ్ల రూపంలో ఏకంగా రూ. 129.55 కోట్లు సాధించింది. ఇదిలా ఉండగా ఇండియా గ్రాస్ పరంగా రూ. 150 కోట్ల మార్కును చాలా సులువుగా దాటేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. వరల్డ్‌వైడ్‌గా చూస్తే ఈ చిత్రం రూ. 170 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించి రవితేజ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ఒకవైపు జోరుగా కొనసాగుతుండగా మరోవైపు
‘ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌కు అలవాటు పడి థియేటర్లకు రావడం మానేశారు’.. ఇదీ కొంతకాలంగా సినీ వర్గాలు చెబుతున్నా మాట. దానికి తగినట్లే 2026లో సంక్రాంతి సీజన్ తర్వాత చాలాకాలం పాటు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే మంచి కంటెంట్ అందిస్తే థియేటర్లకు వచ్చేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇదే విషయాన్ని 2026 సెకండాఫ్ స్పష్టంగా చెబుతోంది. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు, ఓటీటీల వల్లే థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటోంది’ అన్న వాదనలకు టాలీవుడ్ బాక్సాఫీస్ గట్టి సమాధానం చెబుతోంది. కథలో బలం, చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే చాలు... ప్రేక్షకులు థియేటర్లను బ్రహ్మరథం పడతారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుస విజయాలతో సినిమా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.‘పెద్ది’తో మొదలై ‘ఇరుముడి’ వరకు ఈ బ్లాక్‌బస్టర్ వేవ్ ‘పెద్ది’ విజయంతో ఊపందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘మా ఇంటి బంగారం’, వైవిధ్యభరిత కథాంశంతో మెప్పించిన ‘లెనిన్’, సరికొత్త ప్రేమకథగా ఆకట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’, కడుపుబ్బా నవ్వించిన ‘కొరియన్ కనకరాజు’, ఎమోషన్స్ మేళవింపుగా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలు వరుసగా విజయబావుటా ఎగురవేశాయి. తాజాగా డివైన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఇరుముడి’ సైతం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలా వారానికి ఒక మంచి సినిమా రావడం, అది ప్రేక్షకులను విశేషంగా అలరించడం పరిశ్రమకు సరికొత్త ఊపునిచ్చింది.* డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టేసిన మెగాస్టార్.. సంక్రాంతికి ‘కాకా’ రచ్చకంటెంట్కు జైకొడుతున్న ప్రేక్షక దేవుళ్లుఈ విజయాల వెనుక ప్రధానమైన అంశం కంటెంట్ ప్రాధాన్యత. స్టార్ డమ్ కంటే కూడా కథను నమ్ముకుని తీసిన చిన్న, మధ్యతరహా చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. వీకెండ్ వస్తే చాలు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్స్ బుక్‌మైషో, డిస్ట్రిక్స్ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. స్టార్ ఇమేజ్‌తో పనిలేకుండా ఒక మంచి

'KGF 2' లాంటి భారీ విజయం సాధించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత, రాకింగ్ స్టార్ యశ్ తిరిగి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. అతను నటించిన 'టాక్సిక్' సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో యశ్ తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్ లో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా శుక్రవారం (ఆగస్టు 21) నుంచి ఇండియాలోనూ టాక్సిక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఎగబడుతున్నారు. ప్రస్తుతం, బుక్‌మైషో యాప్‌లో ప్రతి గంటకు 21.71 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఢిల్లీ, ముంబై వంటి నార్త్ సిటీల్లోనూ టాక్సిక్ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో యశ్ సినిమా టికెట్ల ధరలు ఎలా ఉన్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో సాధారణ టికెట్ ధర రూ. 400 నుంచి ప్రారంభమయ్యింది. అలాగే ఎగ్జిక్యూటివ్, ప్రీమియం టికెట్స్ ధర రూ.450లుగా ఉంది. ఇక ప్రీమియం టికెట్ ధరలు రూ.500 పలుకు తుండగా, కొన్ని నగరాల్లో రీక్లైనర్ సీట్స్ రేటు రూ. 1000కు పైగానే ఉంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. టాక్సిక్ టికెట్ ధరల పెంపుపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు
కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన రాకింగ్ స్టార్ యష్.. ఇప్పుడు తన తదుపరి పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. బిగ్ స్క్రీన్‌పై యష్‌ను సరికొత్త డార్క్ అవతార్‌లో చూడటానికి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్రంలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సీన్లు, డార్క్ థీమ్‌ను పరిగణనలోకి తీసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. విశేషమేమిటంటే, సినిమాలో ఎలాంటి ప్రధాన సన్నివేశాలపై కట్స్ విధించకుండా బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కేవలం ఒకటి రెండు సంభాషణల్లోని పదాలను మ్యూట్ చేయడం, చట్టబద్ధమైన హెచ్చరికలను స్పష్టంగా ప్రదర్శించడం వంటి చిన్నచిన్న మార్పులను మాత్రమే సూచించారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాలుగా లాక్ అయినట్లు అధికారిక సమాచారం. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, కథనంలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారీ హింసాత్మక సన్నివేశాలున్న చిత్రాలకు సెన్సార్ బోర్డ్ తీవ్రమైన కోతలు విధించిన సందర్భాలున్నాయి. అయితే 'టాక్సిక్' చిత్రంలో ఉన్న రా వయొలెన్స్‌కు ఒక్క కట్ కూడా పడకపోవడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో విపరీతంగా చర్చనీయాంశమైంది. స్వయంగా యష్ కూడా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కేవలం పెద్దల కోసమే రూపొందించబడిన కథ అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి ప్రసిద్ధ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాకు మరింత గ్లామర్, క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. పవర్ ఫుల్ కాస్టింగ్ తో

యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. అమెరికాలో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే సుమారు రూ.1.06కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటివరకు 204 ప్రాంతాల్లో 589 షోలకు కలిపి 5,500 టికెట్లు అమ్ముడయ్యాయట. విడుదలకు ముందు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. బుక్‌మైషోలోనూ మార్క్ ఇక బుక్‌మైషోలో ‘టాక్సిక్’కు ఇప్పటికే 10లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ నమోదయ్యాయి. ఈ ఘనత సాధించిన 13వ భారతీయ చిత్రంగా ‘టాక్సిక్’ నిలిచింది. యశ్ కెరీర్లో కేజీఎఫ్2 తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన రెండవ చిత్రమిది కావడం విశేషం. నేడు భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్? ఇప్పటివరకు అమెరికాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. భారత్‌లో బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యశ్ క్రేజ్ కారణంగా తొలి రోజు భారీ ఓపెనింగ్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఇదే జోరులో కొనసాగితే తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్ ధరలు భారీగా ఉండే ఛాన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు టికెట్ ధరలు రూ.500–600 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ షోల టికెట్ ధరలు కూడా సాధారణ ధరల కంటే రూ.50–100 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. ముంబై, ఢిల్లీలో కొన్ని ప్రీమియం షోలకు టికెట్ ధరలు ఏకంగా రూ.2,600 వరకు ఉండొచ్చని సమాచారం. ‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్లకు యశ్ మళ్లీ తెరపైకి వస్తుండటంతో ‘టాక్సిక్’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన కనిపిస్తోంది. ఆగస్టు 21న బుకింగ్స్ ప్రారంభం కాగా, బుక్ మై షోలో గంటకు 21.71 వేల టికెట్లు అమ్ముడుపోతున్నట్లు పలు వర్గాలు నివేదించాయి. ఆగస్టు 26న విడుదల కానున్న టాక్సిక్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఈ ప్రారంభ స్పందన సూచనగా నిలుస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామంతో యశ్ టాక్సిక్ ద్వారా తెరపైకి వస్తున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కీయారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. వెంకట కె. నారాయణతో కలిసి యశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతం పరిమిత మార్కెట్లలోనే అందుబాటులో ఉన్నప్పటికీ అమ్మకాలు వేగంగా సాగుతున్నట్లు సమాచారం. బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది ప్రాంతాల్లో ఇప్పటికే లక్షల్లో టికెట్లు అమ్ముడైనట్లు బాక్సాఫీస్ ట్రాకింగ్ ఖాతాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు ₹4.91 కోట్ల గ్రాస్ నమోదైనట్లు ఆయా వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా, బుక్ మై షోలో టాక్సిక్‌పై ఆసక్తి చూపిన వారి సంఖ్య 10 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బుకింగ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకముందే అమెరికాలో ప్రీమియర్ అమ్మకాలకు మంచి స్పందన కనిపించినట్లు సమాచారం. వెంకీ బాక్స్ ఆఫీస్ గణాంకాల ప్రకారం అక్కడ ముందస్తు అమ్మకాలు 1.2 లక్షల డాలర్లను దాటాయి. వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవగా, టెక్సాస్ వంటి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Toxic Movie Censor Review: 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్, గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యశ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరికొత్త చిత్రం 'టాక్సిక్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26వ తేదీన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఒకే రోజున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా అత్యంత వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక 'టాక్సిక్' చిత్రానికి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు. ఇక 'టాక్సిక్' మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో మొదట 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా మరింత గ్రిప్పింగ్ గా ఉంచేందుకు దానిని 2 గంటల

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యశ్. ఇప్పుడీ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామాయణం’లో రావణుడి పాత్రలో నటిస్తున్నాడు యశ్. ఈ రెండు సినిమాలతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ రాకింగ్ స్టార్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో యశ్ కు 14 మిలియన్లకు (1.4 కోట్ల) పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే యశ్ మాత్రం కేవలం ఒకే ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం టాక్సిక్ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నాడు యశ్. నేషనల్ మీడియా ఛానెల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి హీరో యశ్ ను ఒక ప్రశ్న అడిగింది. “మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు. ఎవరా వ్యక్తి, మీ జీవితంలో వారి విలువ ఏమిటి?' అని రాకింగ్ స్టార్ ను అడిగింది. దీనికి యశ్ నవ్వుతూ 'ఆమె నా భార్య”అని ఎంతో ప్రేమగా ఆన్సర్ ఇచ్చాడు. ఇది విన్న స్టూడియో మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. 'ఆమె నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఒకవేళ నేను తనని కూడా ఫాలో అవ్వకుండా జీరో పెడితే నాకు ఇబ్బందులు తప్పవు (నవ్వుతూ)

యష్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రధాన తారాగణం లుక్స్‌తో కూడిన పూర్తి పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా, ఈ సినిమాలో నటీనటులు పోషిస్తున్న పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రంలో యష్ ‘రాయా’ మరియు అతని కుమారుడు ‘రూమి అలియాస్ టికెట్’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ ‘నాడియా’ (రూమి తల్లి)గా, నయనతార రాయా సోదరి ‘గంగ’ పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో హుమా ఖురేషి ‘ఎలిజబెత్’గా, తారా సుతారియా ‘రెబెక్కా’గా, రుక్మిణి వసంత్ ‘మెలిస్సా’గా కనిపించనున్నారు. అలాగే అక్షయ్ ఒబెరాయ్ (టోనీ), డారెల్ డిసిల్వా (సాల్వడార్), సుదేవ్ నాయర్ (కర్మాడి), బాలాజీ మనోహర్ (భీర) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఇంగ్లీష్ ట్రైలర్‌ను ఈరోజు రాత్రి 8:30 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 26న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా లెవల్లో మళ్లీ సాలిడ్ సౌండ్ చేస్తున్న స్టార్ యశ్. ‘KGF 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు ‘టాక్సిక్’తో వస్తున్నాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 26న సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ప్రజెంట్ యశ్‌పై ఉన్నంత ఫోకస్ మిగతా కన్నడ స్టార్స్‌పై కనిపించడం లేదు. Siva Rajkumar : కన్నడలో సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ వయసు, ఆరోగ్య పరిస్థితుల సవాళ్లు ఉన్నా సినిమాల విషయంలో మాత్రం ఆయన స్పీడ్ తగ్గలేదు. ‘పెద్ది’లో కీలక పాత్రతో తెలుగులోనూ కనిపించాడు. తమిళంలోకి కూడా అడుగుపెడుతూ, కన్నడతో పాటు ఇతర భాషల్లో తన మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు. “666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్” ‘జైలర్ 2’, ‘బెయిల్’, ‘ఉత్తరకాండ’ లాంటి ప్రాజెక్టులతో కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. Darshan : కన్నడలో మాస్ ఫాలోయింగ్ విషయంలో దర్శన్‌ది సపరేట్ రేంజ్. కానీ ప్రస్తుతం దర్శన్ జైల్లో ఉన్నాడు. ఆయన చివరి చిత్రం ‘ది డెవిల్’ 2025 డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చింది. దర్శన్ ప్రాజెక్ట్స్ ‘రాజావీర మదకరి నాయక’, సింధూర లక్ష్మణ ఎప్పుడొస్తాయన్న క్లారిటీ లేదు. KICHAA : స్టార్ కిచ్చా సుదీప్ ‘మార్క్’ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్నా ఏకంగా నాలుగు స్క్రిప్ట్స్ లాక్ చేసినట్లు ప్రకటించాడు. అందులో కీలకమైనది అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బిల్లా రంగ బాషా – ది ఫస్ట్ బ్లడ్’. దాంతో పాటు దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఉన్నాడు. Upendra : ఇక తనదైన డిఫరెంట్ కథలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర కూడా సైలెంట్‌గా లేడు. రజనీకాంత్ ‘కూలీ’లో కలీషాగా కనిపించిన ఉపేంద్ర ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘45’తోనూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘భార్గవ’ షూటింగ్ ముగింపు

నటుడు యష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ‘టాక్సిక్’ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్ లాబీలతో పాటు పలు నగరాల్లోని మెట్రో రైళ్లపై సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నారు

రాక్ స్టార్ యష్.. టాక్సిక్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. `కేజీఎఫ్ 2` తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌తో థియేటర్లోకి వస్తున్నారు యష్. ఈ చిత్రం చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. మార్చిలోనే రిలీజ్ కావాల్సింది. యుద్ధ ప్రభావంతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ట్రైలర్ ప్రారంభంలో బోల్డ్ గా ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఇటీవల ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అది తలా తోక లేనట్టుగా ఉంది. కథ ఏంటో క్లారిటీ లేదు. యాక్షన్ పార్ట్ ని, రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు. అదే సమయంలో సినిమాలోని మెయిన్ ట్విస్ట్ ని రివీల్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు యష్. అందులో భాగంగా ఆయన రష్మిక మందన్నా కామెంట్లకి, అదే సమయంలో అల్లు అరవింద్ కామెంట్లకి స్పందించారు. గతంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇద్దరికి కలిపి ఇచ్చి పడేయడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఒకప్పుడు `కేజీఎఫ్`కి ముందు యష్ ఎవరికీ తెలియదన్నారు. ఈ సినిమా తర్వాతనే అందరికి తెలుసు అని మాట్లాడారు. దీనికి యష్ రియాక్ట్ అవుతూ, `కేజీఎఫ్` తన లైఫ్‌ని మార్చిందనేది నిజమే అని, సినిమా సక్సెస్ కేవలం నిర్మాతది మాత్రమే కాదని, దాని వెనుక సమష్టి కృషి ఉంటుందన్నారు. హీరో సరిగ్గా నటించకపోతే సినిమా హిట్ కాలేదని, ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో ఆడియెన్స్ కి తెలుసు అని అదిరిపోయే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగానే రష్మిక మందన్నా 2017లో

కన్నడ స్టార్ హీరో యశ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై స్పందించారు. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) రాజకీయాల్లోకి వస్తారనే చర్చ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని యశ్ స్పష్టం చేశారు. ఇప్పటికైతే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని చెప్పారు. భవిష్యత్తులో అవసరం ఉందని అనిపిస్తే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చని తన మనసులో మాట బయటపెట్టారు. రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన యశ్.. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడమే రాజకీయాల అసలు ఉద్దేశంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని యశ్ తెలిపారు. తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన ఈ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారొచ్చని.. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తే రాజకీయాల్లోకి రావచ్చేమోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యశ్.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం టాక్సిక్ ఈ నెలాకరున థియేటర్లలోకి రానుంది. సినీ కెరీర్లో దూసుకెళ్తున్న సమయంలో ఆయన రాజకీయాలపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యశ్ నిజంగానే భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనేది చూడాలి
పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న సౌత్ హీరోలలో యష్ ఒకరు. ‘KGF’ ఫ్రాంచైజీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ కన్నడ హీరో. తన క్రేజ్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడానికి ఆచితూచి అడుగులు వేస్తున్న యష్.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఆయన, తాజాగా ఓ హిందీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గతంలో తనను ఉద్దేశించి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌పై స్పందించారుKGF సినిమాకి ముందు యష్ ఎవరు? అని మూడేళ్ల క్రితం ఓ సినిమా ఈవెంట్లో అల్లు అరవింద్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో యష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు దీనిపై యష్ రియాక్ట్ అయ్యారు. కేజీఎఫ్ తన కెరీర్‌ను మార్చేసిందనేది కాదనలేని వాస్తవమని అన్నారు. అయితే ఒక సినిమా విజయం కేవలం నిర్మాతకు మాత్రమే సొంతం అనేది తాను నమ్మనని, దాని వెనుక ఎంతోమంది కష్టం ఉంటుందని పేర్కొన్నారు. ఆడియన్స్ ప్రతి ఒక్కరి శ్రమను గుర్తిస్తారని, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవరు దానికి అర్హులో వాళ్లకి బాగా తెలుసన్నారు.ఒక సినిమా వల్ల నిర్మాత కంటే హీరోకే ఎక్కువ పేరు వస్తుందనే అంశంపై యష్ మాట్లాడుతూ.. ''KGF వల్ల నాకు మంచి గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అయితే ఒక సినిమా సక్సెస్ కేవలం ప్రొడ్యూసర్ కి మాత్రమే సొంతం అని నేను నమ్మను. ఆ విజయం వెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నుంచి రైటర్ల వరకు అందరూ కష్టపడి పనిచేస్తేనే మంచి అవుట్‌పుట్ వస్తుంది. యాక్టర్స్ సరిగ్గా నటించకపోతే.. ఆ సినిమా కచ్చితంగా హిట్ అవ్వదు. ఆడియన్స్ నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. వారు ప్రతి

‘పాన్ ఇండియా స్టార్’ అనేది మనం చేసే పనిని బట్టి ప్రేక్షకులు ఇచ్చే ఒక గుర్తింపు మాత్రమేనని, సినీ పరిశ్రమలో ఏ స్టార్ ట్యాగ్ కూడా శాశ్వతంగా ఉండదని కన్నడ స్టార్ యశ్ అభిప్రాయపడ్డారు ‘పాన్ ఇండియా స్టార్’ అనేది మనం చేసే పనిని బట్టి ప్రేక్షకులు ఇచ్చే ఒక గుర్తింపు మాత్రమేనని, సినీ పరిశ్రమలో ఏ స్టార్ ట్యాగ్ కూడా శాశ్వతంగా ఉండదని కన్నడ స్టార్ యశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ‘టాక్సిక్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీగా అంచనాలున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా యశ్ ఓ హిందీ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో స్టార్ హీరోల ఇమేజ్, పాన్ ఇండియా స్టార్‌డమ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి. ఈ షోలో యశ్‌ను యాంకర్ ఓ ప్రశ్న అడిగారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్, మహేశ్ బాబు వంటి దక్షిణాది అగ్ర హీరోలు మీ మాదిరిగా తక్కువ సమయంలో పాన్ ఇండియా స్థాయిలో స్టార్లుగా ఎదగలేకపోయారు? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి యశ్ చాకచక్యంగా, వివాదాలకు తావు లేకుండా సమాధానమిచ్చారు. ‘ఎవరికీ స్టార్డమ్ శాశ్వతం కాదు. దక్షిణాది అగ్ర హీరోలంతా తమదైన శైలి చిత్రాలతో గొప్ప విజయాలు సాధిస్తూ రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు, తలరాత మారిపోవడానికి ఎవరికైనా ఒక్క శుక్రవారం చాలు. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఇచ్చే తీర్పే హీరో స్టార్‌డమ్‌ను నిర్ణయిస్తుంది. వరుస విజయాలతో ఇమేజ్ పెరగవచ్చు.. అలాగే ఒక్క పరాజయం ఆ ఇమేజ్ను డ్యామేజ్ చేయవచ్చు. అందుకే ‘పాన్ ఇండియా స్ట్టార్’ అనే ట్యాగ్ కంటే మంచి సినిమాలు చేయడంపైనే దృష్టి పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే యశ్ ఇచ్చిన సమాధానంతో అభిమానులు, నెటిజన్లు హర్షిస్తున్నారు. తోటి హీరోలను పోల్చకుండా, వారిని గౌరవిస్తూ యశ్ సమాధానం
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ సొంతం చేసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హిందీ టాక్ షో ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్.. హీరోల స్టార్డమ్, పాన్ ఇండియా ఇమేజ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.* రవితేజ రూ.12 లక్షలు పెట్టి కొన్న మామిడి తోట.. ఇప్పుడు రూ.వందల కోట్లు.. హిట్టు ఫ్లాప్ తీసి అవతల**టాక్ షోలో భాగంగా సదరు యాంకర్ యశ్‌ను ప్రశ్నిస్తూ.. "సౌత్ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్, దళపతి విజయ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలు మీలాగా త్వరితగతిన పూర్తిస్థాయి పాన్ ఇండియా సూపర్ స్టార్లుగా ఎందుకు ఎదగలేకపోయారు?" అని అడిగారు. దక్షిణాది స్టార్లను తక్కువ చేసి మాట్లాడినట్లున్న ఈ ప్రశ్నకు యశ్ ఏమాత్రం తడబడకుండా ఎంతో పరిణతితో, హుందాగా బదులిచ్చారు. స్టార్ ఇమేజ్ అనేది శాశ్వతం కాదని స్పష్టం చేస్తూ యశ్ తనదైన శైలిలో విశ్లేషించారు. సౌత్ స్టార్ హీరోలంతా సినీ పరిశ్రమలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని ప్రశంసించారు. 'పాన్ ఇండియా స్టార్' అనే పదం మనం చేసే పనిని బట్టి వచ్చే ఒక టెర్మినాలజీ మాత్రమేనని, చిత్ర పరిశ్రమలో ఏ ట్యాగ్ కూడా శాశ్వతంగా ఉండదని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క శుక్రవారం బాక్సాఫీస్ ఫలితం ఎవరి భవితవ్యాన్నైనా మార్చేయగలదని చెప్పారు. శుక్రవారం థియేటర్లలో వచ్చే తీర్పును బట్టి స్టార్లు, వారి పాన్ ఇండియా హోదాలు మారిపోతుంటాయని, కాలంతో పాటు విజయాలు రావడం, పోవడం సహజమని వివరించారు.* చివరి 40 నిమిషాలు సీట్లో కూర్చోలేరు.. ‘ఇరుముడి’పై అంచనాలు పెంచేసిన శివ నిర్వాణటాలీవుడ్ అభిమానుల అసంతృప్తియశ్ ఇచ్చిన సమాధానం చాలా హుందాగా, పరిణతితో కూడుకున్నదంటూ సినీ

రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. తర్వాత మాతృభాషలో కొన్ని మూవీస్ చేసింది. ఇదంతా 9-10 ఏళ్ల కిందటి ముచ్చట. అయితే ఈ టైంలో పలు వివాదాల్లోనూ ఈమె ఇరుక్కుంది. అందులో 'కేజీఎఫ్' హీరో యష్‌పై చేసిన 'షో ఆఫ్' కామెంట్ కూడా ఉంది. దీని కారణంగా యష్ అభిమానులు రష్మికని చాలా ట్రోల్ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి వ్యాఖ్యపై యష్ ఇన్నాళ్లకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో సదరు విషయమై క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి: డైరెక్టర్ వెంకీ అట్లూరి) 'ఆమె ఏ సందర్భంలో ఆ కామెంట్ చేసిందో నాకు తెలీదు. అప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కొందరు యాంకర్లు ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడుగుతూ, ఆప్షన్లు ఇచ్చి ఏదో చెప్పమంటారు. బహుశా రష్మిక కూడా ఆ ఆప్షన్ నాకు సరిపోతుందని భావించి అలా మాట్లాడిందేమో! రష్మిక వ్యాఖ్యల వల్ల చాలామంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. అయితే తోటి నటీనటులు ఎవరేమనుకున్నా నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయదు. ఎవరైనా తమకు నచ్చింది చెప్పొచ్చు. కానీ దాని వల్ల నేనేం మారిపోను' అని యష్ అన్నాడు. ఇక తన అభిమానులని ఉద్దేశిస్తూ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తోటి నటీనటులని గౌరవించలేని వాళ్లు తన అభిమానులే కాదని యష్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై అప్పట్లోన రష్మిక స్పందించింది. అలా అన్నందుకు క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఇన్నేళ్లకు సందర్భం రావడంతో యష్ కూడా స్పందించి ఎట్టకేలకు దీనికి ముగింపు పలికాడు. ఇకపోతే యష్ హీరోగా చేసిన 'టాక్సిక్'.. వచ్చే బుధవారం (ఆగస్టు 26) థియేటర్లలోకి రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్) భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని

పాన్ ఇండియా స్టార్ యశ్ (Yash) ప్రస్తుతం తన రాబోయే భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. పాన్ ఇండియా స్టార్ యశ్ (Yash) ప్రస్తుతం తన రాబోయే భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, రుక్మణి వసంత్, తార సుతరియా, కియారా అద్వానీ, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 26 న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన యష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తనపై చేసిన మిస్టర్ షో ఆఫ్ వ్యాఖ్యల గురించిన ప్రశ్న ఎదురైంది. రష్మిక వ్యాఖ్యలపై యశ్ ఎంతో హుందాగా, స్పష్టంగా స్పందించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గతంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో యశ్‌ను ఉద్దేశించి చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.2017లో ఇండస్ట్రీ ప్రారంభంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో రష్మిక.. యశ్‌ను ఉద్దేశించి మిస్టర్ షో ఆఫ్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యశ్ అభిమానులు రష్మికను తీవ్రంగా ట్రోల్ చేయడంతో ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. ఈ విషయంపై యశ్ మాట్లాడుతూ.. 'ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట అనిందో నాకు తెలియదు. అప్పట్లో తను ఇండస్ట్రీకి కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్లు ఆప్షన్లు ఇచ్చినప్పుడు అలా చెప్పి ఉండవచ్చు. దాన్ని నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఎవరి అభిప్రాయం వారిది, కానీ ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని మార్చలేదు' అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన అభిమానులకు యశ్ ఒక సందేశాన్ని ఇచ్చాడు. సహ నటీనటులను

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) చిత్ర ప్రమోషన్లు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈ ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ ఇంటర్వ్యూయర్ రజత్ శర్మతో జరిగిన ప్రత్యేక సంభాషణలో యశ్ పాల్గొన్న విషయం తెల్సిందే. రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) చిత్ర ప్రమోషన్లు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈ ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ ఇంటర్వ్యూయర్ రజత్ శర్మతో జరిగిన ప్రత్యేక సంభాషణలో యశ్ పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు ఇటీవల విడుదలైన తబాహీ పాటపై నెటిజన్లు, సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల కామెంట్లను ప్రస్తావిస్తూ ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇంటర్వ్యూ సందర్భంగా రజత్ .. 'తబాహీ పాట చూడటానికి ఒక కండోమ్ యాడ్ లా ఉందంటూ కొందరు విమర్శిస్తున్నారు, దీనిపై మీరేమంటారు?' అని యశ్‌ను ప్రశ్నించాడు. ఈ ఊహించని ప్రశ్నకు యశ్ ఎంతో సమయస్ఫూర్తితో, తనదైన శైలిలో నవ్వుతూ బదులిచ్చాడు. 'నేను ఉచితంగా అయితే కండోమ్ యాడ్‌లో నటించను కదా సార్' అంటూ సరదాగా పంచ్ విసిరాడు. యశ్ ఇచ్చిన ఈ చమత్కారమైన సమాధానంతో ఇంటర్వ్యూలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అంతేకాకుండా ఈ సినిమాలో వల్గారీటి ఉంది అన్నవారికి కూడా యశ్ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు. ఇందులో ఎలాంటి వల్గారీటి లేదని, సినిమా మొత్తంలో ఏ అమ్మాయిని కూడా తాను కిస్ చేయలేదని తెలిపాడు. సినిమాలోని పాటలు లేదా సన్నివేశాలను కేవలం వినోదం కోసమే చూడాలని, ప్రతిదానికీ తప్పుడు అర్ధాలు వెతకాల్సిన అవసరం లేదని యశ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ టాక్సిక్ సినిమా విజువల్స్, కంటెంట్ పరంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని యశ్ ధీమా వ్యక్తం చేశాడు. యశ్ చెప్పిన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 26 న ఈ

Rashmika Mandanna vs Yash: కన్నడ స్టార్ హీరో యష్, హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన పాత కామెంట్‌పై తాజాగా స్పందించారు. రష్మిక కెరీర్ ప్రారంభంలో చేసిన ఈ వ్యాఖ్య అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయంపై యష్ మాట్లాడటంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. రష్మిక 2017లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కన్నడ ఇండస్ట్రీలో ‘మిస్టర్ షోఆఫ్’ ఎవరు అని అడిగినప్పుడు యష్ పేరు చెప్పింది. ఆ సమయంలో ఆమె ఇండస్ట్రీలో కొత్తగా ఎదుగుతున్న హీరోయిన్. రష్మిక చేసిన ఈ వ్యాఖ్య యష్ అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.ఇటీవల యష్, ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన పాత కామెంట్ గురించి యష్‌ను ప్రశ్నించారు. దీనికి యష్ చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. రష్మిక ఆ మాట ఏ ఉద్దేశంతో చెప్పిందో తనకు తెలియదని యష్ అన్నారు. ఆమె అప్పటికి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిందని గుర్తు చేశారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లో యాంకర్లు ఒక ప్రశ్నకు మూడు లేదా నాలుగు ఆప్షన్లు ఇస్తారని, అందులో ఒకదాన్ని ఎంచుకునే సమయంలో అలా జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎవరో ఒకరు తన గురించి ఏదైనా అభిప్రాయం చెప్పినంత మాత్రాన అది తన వ్యక్తిత్వాన్ని నిర్ణయించదని యష్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందని అన్నారు. తాను ఎవరో ఇతరుల అభిప్రాయాల వల్ల మారిపోనని తెలిపారు. అంతేకాదు, యష్ తన అభిమానులకు కూడా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. ఇతర నటీనటులను అభిమానులు గౌరవించాలని చెప్పారు. మరో నటుడిని గౌరవించని వ్యక్తిని తాను తన అభిమానిగా భావించనని యష్ స్పష్టంగా చెప్పారు. అప్పట్లో వచ్చిన విమర్శల తర్వాత రష్మిక కూడా తన వ్యాఖ్యలపై

పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ ఎవరి సొంతం కాదని, అది శాశ్వతం కూడా కాదని కన్నడ హీరో యష్ స్పష్టం చేశారు. ఇటీవల బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినిమా రంగానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు, ఇది 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా స్టార్ డమ్ అనేది భారతీయ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. రామ్ చరణ్, విజయ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఎందుకు ఇంకా ఆ స్థాయిని అందుకోలేదనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, యష్ మాత్రం ఈ విషయాన్ని చాలా పరిణతితో విశ్లేషించారు. ప్రతి నటుడికి, ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరూ తమ తమ పరిధిలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారని యష్ గుర్తు చేశారు. దీంతో సినిమా రంగంలో విజయాలు, స్థానాలు అనేవి సమయాన్ని బట్టి నిరంతరం మారుతూ ఉంటాయని ఆయన వివరించారు. ఏ నటుడైనా సరే, ఆ సమయంలో తాను చేస్తున్న ప్రాజెక్టుల విజయంపైనే వారి గుర్తింపు ఆధారపడి ఉంటుందని యష్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్టార్ డమ్ అనేది ఎవరికీ శాశ్వతం కాదని, అది ఒక నిరంతర ప్రక్రియ అని యష్ తెలిపారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫలితంగా ఆయన వ్యక్తం చేసిన ఈ పరిణతి గల అభిప్రాయాలకు నెటిజన్లు, సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. వివాదాలకు తావు లేకుండా అందరినీ గౌరవిస్తూ యష్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంపై భారీ అంచనాలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ ఈసినిమా మరో పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు యష్. అందులో భాగంగా బాలీవుడ్ లో చేసిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో విలేకరి ప్రశ్నిస్తూ.. “రామ్ చరణ్, విజయ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి దక్షణాది నటులు మీలాగా పాన్ ఇండియా సూపర్‌స్టార్స్‌గా ఎందుకు ఎదగలేకపోయారు? దానికి గల కారణాలు ఏంటి?” అని అడగగా యశ్ దానికి కాస్త హుందాగా సమాధానమిచ్చారు. యశ్ స్పందిస్తూ.. “వారందరూ తమ పరిధిలో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతీ నటుడికి, ప్రతీ సినిమాకి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది. పైగా ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ ఎవరికీ శాశ్వతం కాదు. అది ఏ ఒక్కరి సొత్తు కాదు, చిత్రపరిశ్రమలో విజయాలు, హోదాలు సమయాన్ని బట్టి మారుతుంటాయని, కేవలం ప్రాజెక్ట్ సాధించే విజయాన్ని బట్టే ఆ సమయానికి గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.స్టార్డమ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అని అందరూ కలసి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు’ అని అన్నారు. తోటి కథానాయకుల శ్రమను, వారికున్న ప్రజాదరణను గౌరవిస్తూ యశ్ ఇచ్చిన ఈ సమాధానంపై నెటిజన్లు మరియు సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రాబోతున్న టాక్సిక్ తో యశ్ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి

‘కేజీఎఫ్’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్, తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’పై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ఈ సినిమా అశ్లీలతను, పురుషాధిక్యతను ప్రోత్సహించేలా ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. "సినిమాల్లో అశ్లీలతను నేను ఎన్నడూ ప్రోత్సహించను. అది ముమ్మాటికీ తప్పే. సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణకు కూడా ఒక హద్దు ఉంటుందని, వాటిని కళాత్మకంగా తెరకెక్కించాలని నేను నమ్ముతాను" అని స్పష్టం చేశాడు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కలిగే అనుభూతే అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డాడు.‘టాక్సిక్’ కథాంశం గురించి వివరిస్తూ.. "ఈ చిత్రం ప్రధానంగా నేటి తరం యువత (జెన్-జీ) ఎదుర్కొంటున్న సమస్యలు, పాతతరం ఆలోచనలతో వారికి ఎదురయ్యే సంఘర్షణల చుట్టూ తిరుగుతుంది. ఇందులో భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఇది యువత కోసమే తీసిన చిత్రమని అందరికీ అర్థమవుతుంది" అని యశ్ ధీమా వ్యక్తం చేశాడు.‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ, నయనతార, హ్యూమా ఖురేషీ వంటి ప్రముఖ తారలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది

యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో యశ్ స్పందించారు. టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన యశ్.. బోల్డ్ కంటెంట్ విమర్శలపై మాట్లాడారు. అసభ్యత తప్పేనని.. కానీ నేను ఇందులో కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టలేదని అన్నారు. దానికి కూడా ఒక హద్దు ఉంటుందని.. అది మాకు తెలుసని స్పష్టం చేశారు. ఇక్కడ సినిమా అంటే దృశ్యపరంగా ఆకట్టుకునేలా కనిపించాలని.. అదే ఒక క్రియేటర్ గొప్పతనం అని అన్నారు. ప్రస్తుతం మీ సినిమాలపై జెన్ జీ ఎందుకు విమర్శలు చేస్తున్నారని యశ్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ప్రతి పాత తరం వారు యువతరం తప్పు చేస్తోందని భావిస్తుంటారని తెలిపారు. తన చిత్రంలోని బోల్డ్ సీన్స్‌పై వస్తున్న విమర్శలకు యశ్ సమాధానమిచ్చారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ప్రోటోకాల్ ఉల్లంఘించిన బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు చంపినవారిని కాపాడుతున్నారు? ప్రియాంక ఆత్మకు శాంతి చేకూర్చాలంటే... జాతీయ జెండాకు అవమానం.. జెండాను తిరగేసి కట్టిన టీడీపీ నేతలు

యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాటలు, ట్రైలర్లు ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆగస్టు 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది సినిమా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విదేశాల్లో 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. యశ్ గత చిత్రాల విజయం తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో యశ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రలో తమ హీరోను చూసి మురిసిపోతున్నారు అభిమానులు. 'టాక్సిక్' సినిమా ముహూర్తం రోజు యశ్ ఓ స్పెషల్ కారులోనే వచ్చారు. గతేడాది జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చక్కర్లు కొడుతున్నాయి. యశ్ వాడేది బ్లాక్ రేంజ్ రోవర్. దీని నంబర్ KA 01 NA 8055. బెంగళూరు సెంట్రల్ ఆర్టీఓలో రిజిస్టర్ అయింది. 8055 అంకెలు 'BOSS' లా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. 2023 జనవరిలో కొన్న ఈ కారు ధర సుమారు 5 కోట్లు అని సమాచారం. యశ్‌కు ఎన్ని కార్లున్నా, RX 100 బైక్ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ చదువుపై శ్రద్ధ తగ్గుతోందని ఆ బైక్‌ను వాళ్ల నాన్న అమ్మేశారట. యశ్ కొన్న మొదటి కారు మహీంద్రా స్కార్పియో. దాని ధర అప్పట్లో 9 నుంచి 16 లక్షల మధ్య ఉండేది. నార్త్ అమెరికాలో 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 38 వేల డాలర్లు దాటాయి. అక్కడ ఆగస్టు 25నే ప్రీమియర్ షోలు పడనున్నాయి. అంటే, ఇండియా కంటే ముందే విదేశీ అభిమానులు సినిమా చూడబోతున్నారన్నమాట

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'టాక్సిక్ .. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. మలయాళం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కంటెంట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఇటీవల రిలీజైన టాక్సిక్ ట్రైలర్ కు యూట్యూబ్ లో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ టాక్సిక్ మూవీ కంటెంట్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యశ్ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉందని ప్రశంసలు వస్తున్నప్పటికీ ఈ మూవీలో బోల్డ్ సీన్స్, హింస మోతాదుకు మించి ఉన్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి. అంతకు ముందు కియారా బోల్డ్ సాంగ్ పై కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకే చెందిన ప్రముఖ నటి రిషికా సింగ్ టాక్సిక్ సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ మూవీ ట్రైలర్ లో చూపించిన బోల్డ్ సీన్స్ పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. 'యశ్ టాక్సిక్ ట్రైలర్లో చూపించిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ నన్ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. యశ్ కూడా ఓ భర్తగా, తండ్రిగా మహిళల పట్ల గౌరవం చూపాలని ఆశిస్తున్నాను. మహిళలను గౌరవించకపోతే ఆయనను కర్ణాటక నుంచి ఖాళీ చేయిస్తాం' అంటూ హెచ్చరించింది రిషికా సింగ్. చివరగా 'నేను కూడా టాక్సిక్' అంటూ కామెంట్స్ చేసింది. దీంతో రిషికా కామెంట్లపై యశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె విమర్శలను తిప్పికొడుతున్నారు. అదే సమయంలో రిషికా గతంలో నటించిన సినిమాలు, ఫొటోషూట్స్ లోని బోల్డ్ క్లిప్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. [caption id="attachment_1887266" align="alignnone" width="1280"] Toxic Movie, Rishika Singh[/caption] ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమా కేవలం పెద్దల

కన్నడ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన నటి రుక్మిణి వసంత్, ఇప్పుడు వరుస సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో సందడి చేస్తున్నారు. విభిన్నమైన పాత్రలు, సహజ నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. సప్త సాగరములు దాటి మూవీతో పాపులర్ అయిన ఈ అమ్మడు `కాంతార 2`తో పాన్ ఇండియా క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇండియా వైడ్‌గా హాట్ కేక్‌గా మారిపోయారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార: చాప్టర్ 1'లో కూడా రుక్మిణి వసంత్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఆమె పాపులారిటీ మరింతగా పెరిగింది. ఇదే సమయంలో, నిఖిల్ సిద్ధార్థ్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. రుక్మిణి వసంత్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' కూడా ఒకటి. భారీ అంచనాలున్న ఈ సినిమాలో రుక్మిణి కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ఆమె పాత్రకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ సినిమా ఈ నెలలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రుక్మిణి వసంత్ సినీ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'డ్రాగన్' సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఒకవైపు యశ్‌తో 'టాక్సిక్', మరోవైపు జూ.ఎన్టీఆర్‌తో 'డ్రాగన్'... ఇలా వరుసగా పెద్ద సినిమాలు రుక్మిణి చేతికి వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయట. బాలీవుడ్ నుంచి ఆమెకి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం

వరుస హిట్ లతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు... కేజీఎఫ్ ఫేమ్, రాకింగ్ స్టార్ యశ్. ఇప్పుడు భార్య కోరికలు తీరుస్తూ మంచి భర్త అనిపించుకుంటున్నారు. అందుకు రాధిక పండిత్ ఇచ్చిన ఇంటర్వ్యూనే సాక్ష్యం. ఇంతకీ ఈ కోరికేంటో తెలుసా? యశ్, రాధికా పండిత్ కన్నడ ఇండస్ట్రీలో అందమైన జంట. ఈ మధ్య సోషల్ మీడియాలో రాధికా పండిత్ పాత ఇంటర్వ్యూ ఒకటి తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె చెప్పిన కోరికలను యశ్ ఇప్పుడు నిజం చేస్తుండటమే దీనికి కారణం. యశ్, రాధికల పెళ్లి సమయంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో, "యశ్‌ను ఎలాంటి పాత్రల్లో మీరు చూడాలనుకుంటున్నారు? అని రాధికను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగారు. దానికి ఆమె ఏం చెప్పారో తెలుసా? యశ్‌కు చారిత్రక (Historic) పాత్రలు చేసే సత్తా ఉంది. అలాంటి పెద్ద పాత్రల్లో, అలాగే డ్యూయెల్ రోల్ ఉన్న సినిమాల్లో ఆయన్ను చూడాలని కోరికగా ఉందన్నారు..రాధికా. రాధిక అప్పుడు అన్న మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయి. యశ్ తన తర్వాతి సినిమా 'రామాయణ'లో 'రావణుడు' పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే 'టాక్సిక్' సినిమాలో యశ్ ద్విపాత్రాభినయం (Dual Role) చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా భార్య రెండు పెద్ద కోరికలను యశ్ ఒకే ఏడాదిలో తీరుస్తుండటంతో…..ఎంత మంచి భర్త అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు రాధికా పండిత్‌ను యశ్ పాలిట 'లక్కీ చార్మ్' అని పిలుస్తున్నారు. "భర్త, కుటుంబం కోసం రాధిక తన కెరీర్‌ను త్యాగం చేసింది. ఆమెకు మనం థ్యాంక్స్ చెప్పాలి", "భార్య మాట వినే మగాడు జీవితంలో ఎప్పుడూ పైకి వస్తాడు", "ఒకే ఏడాదిలో రాధిక రెండు కలలు నిజమవుతున్నాయి. యశ్ నిజంగా రాకింగ్ స్టార్!" అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు

కేజీఎఫ్ 2 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఏకంగా ఐదు గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ యశ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు యశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే టాక్సిక్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. టాక్సిక్ సినిమా కథని మొదట ఒక స్టార్ హీరోకి వినిపించారట దర్శక నిర్మాతలు. కానీ ఆయన ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదట. దీంతో ఫైనల్ గా యశ్ ను తీసుకున్నారట. టాక్సిక్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ సూర్య అని తెలుస్తోంది. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు మోతాదుకు మించి ఉండడం, అలాగే యాక్షన్ సీక్వెన్సులు కూడా భారీగా ఉండడంతో సూర్య ఈ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది. టాక్సిక్ సినిమా విషయానికి వస్తే.. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్స్టర్ మైండ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ద్వారా సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్..ఈ సినిమా విషయంలో ప్రేక్షకులలో ఏదోక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయెలెంట్ గా ఉంది. ఇందులో యశ్, నయనతార, కియారా అద్వానీ పాత్రలు మరింత హైలెట్ కానున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ ద్వారానే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. ఇందులో యశ్ తోపాటు కియారా అద్వాని, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్.. అలాగే ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయం నెట్టింట చర్చకు దారితీసింది. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్లతో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో నటీనటుల కోసమే దాదాపు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందట చిత్రయూనిట్. ఈ సినిమా కోసం యశ్ దాదాపు రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. అలాగే హీరోయిన్ కియారా అద్వానికి రూ.15 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్లు టాక్. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార రూ.12

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా, జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం టాక్సిక్(Toxic). రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా, జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం టాక్సిక్(Toxic). కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హుమా ఖురేషీ, తారా సుతారియా వంటి తారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా రిలీజ్ కు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించింది. ఇక తాజాగా ఈ సినిమా పారితోషికాల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీగానే బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. హీరో యష్ ఈ సినిమా కోసం నేరుగా రూ. 50 కోట్ల పారితోషికం తీసుకోవడమే కాకుండా ఈ చిత్రానికి సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటంతో లాభాల్లో వాటాతో కలిపి యష్ మొత్తం పారితోషికం రూ. 100 కోట్ల మార్క్‌ను దాటనుంది. ఇక ఈ సినిమాలో కథానాయిక కాకపోయినప్పటికీ, అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్న నయనతార ఏకంగా రూ.18 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. మరోవైపు సినిమాలో నదియా పాత్రలో ప్రధాన కథానాయికగా నటిస్తున్న కియారా అద్వానీకి దాదాపు రూ.15 కోట్లు లభించినట్లు తెలుస్తోంది. ఇక వీరితో పాటు సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణీ వసంత్ రూ. 3 కోట్లు అందుకోగా, ఎలిజిబెత్ పాత్రలో నటిస్తున్న హుమా ఖురేషీకి, రెబెకా పాత్ర పోషిస్తున్న తారా సుతారియాకు చెరో రూ. 2 కోట్ల వరకు అందించినట్లు తెలుస్తోంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు

ఈ రోజు 'రాకింగ్ స్టార్' యశ్ అంటే దేశవ్యాప్తంగా తెలుసు. కానీ ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు. నటుడు కావాలనే కలతో 16 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశాడు. అప్పుడు ఆయన దగ్గర కేవలం ₹300 మాత్రమే ఉన్నాయని సమాచారం. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూ, ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు కూడా చేశాడు. రోజుకు సుమారు ₹50 సంపాదిస్తూ, నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2004లో 'ఉత్తరాయణ' అనే కన్నడ టీవీ సీరియల్‌తో ఆయన నటన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత నాటకాల్లోనూ నటించాడు. 2007లో 'జంబద హుడుగి' సినిమాలో యశ్ సహాయ నటుడిగా పరిచయమయ్యాడు. ఆ మరుసటి ఏడాదే 'రాకీ' సినిమాతో హీరోగా మారాడు. 'మొగ్గిన మనసు', 'గూగ్లీ' వంటి చిత్రాలు ఆయనకు మంచి అభిమానులను ఏర్పర్చాయి. అయితే 2018లో వచ్చిన 'KGF: చాప్టర్ 1' ఆయన కెరీర్లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. 'రాకీ భాయ్' పాత్ర ఆయన్ను కన్నడ ప్రేక్షకులను దాటి పాన్-ఇండియా స్టార్‌ను చేసింది. 2022లో వచ్చిన 'KGF: చాప్టర్ 2' విజయంతో ఆయన మార్కెట్ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లు దాటిన తొలి కన్నడ చిత్రంగా 'KGF: చాప్టర్ 1' రికార్డు సృష్టించింది. కేజీఎఫ్ 2 సుమారు రూ.1200కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. యశ్, ఆయన భార్య రాధికా పండిట్ కలిసి 'యశోమార్గ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, ఈ ఫౌండేషన్ చెరువుల పూడికతీత పనులు చేపట్టిందని సమాచారం. 2020లో కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన 3,000 మంది కార్మికులకు తలా ₹5,000 చొప్పున సహాయం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకే యశ్ కథ కేవలం '₹300 నుంచి ₹53 కోట్లు' సంపాదించడం మాత్రమే కాదు, సినిమా

Kiara Advani:యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలోని రొమాంటిక్ సీన్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కియారా భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమన్నారు? పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి. కియారా అద్వానీ నటించిన టాక్సిక్ సినిమాలోని ఇంటిమేట్ సీన్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా యశ్‌తో ఆమె చేసిన సన్నివేశాలపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కియారాకు భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండగా నిలిచారు. ఆమె నటనను, సినిమా కోసం చేసిన కష్టాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాక్సిక్ ట్రైలర్‌పై స్పందించిన సిద్ధార్థ్ మల్హోత్రా.. ఈ సినిమా కోసం కియారా పడిన శ్రమ, పట్టుదల, అభిరుచి తెరపై స్పష్టంగా కనిపించబోతున్నాయని ప్రశంసించారు. టాక్సిక్ ఆమె కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, యశ్‌తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. టాక్సిక్లోని తబాహి పాట విడుదలైన తర్వాత కియారా, యశ్ మధ్య ఉన్న సన్నిహిత సన్నివేశాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కొందరు నెటిజన్లు విమర్శలు చేయగా, మరికొందరు మాత్రం సినిమాలోని పాత్రకు అనుగుణంగానే కియారా నటించారని సమర్థిస్తున్నారు. బెంగళూరులో జరిగిన టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యశ్ కూడా కియారాకు మద్దతుగా నిలిచారు. ఒక నటిగా ఎదురయ్యే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తాను నమ్మిన పాత్రను నిజాయితీగా చేయాలని ఆమెకు సూచించారు. కియారా తన పాత్ర పట్ల ఎంతో అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. యశ్, కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం టాక్సిక్ అధికారిక తెలుగు ట్రైలర్ కేవిఎన్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల కావడం జరిగింది. ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక డార్క్ స్టైలైజ్డ్ క్రైమ్ వరల్డ్ లో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. సుమారు 4 నిమిషాల 39 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో అత్యంత ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు మరియు లోతైన పాత్రల భావోద్వేగాలను చూపించారు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఉన్న ఉత్సుకత రెట్టింపైంది. ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్ రయా మరియు టికెట్ అలియాస్ రుమి అనే తండ్రీకొడుకుల ద్విపాత్రాభినయంలో కనిపిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి రాజీవ్ రవి ఛాయాగ్రహణం అందించగా, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. దీనికి అదనంగా విశాల్ మిశ్రా మరియు తనిష్క్ బాగ్చీ కూడా స్వరాలు అందించారు. ఫలితంగా ట్రైలర్ లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ చాలా పవర్ఫుల్ గా వచ్చాయి. ఈ నేపథ్యంలో నేర ప్రపంచంలో సాగే పవర్ స్ట్రగుల్స్, ద్రోహం మరియు తండ్రీకొడుకుల మధ్య ఉండే విభిన్నమైన సంబంధాలను గీతు మోహన్‌దాస్ చాలా ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఈ కథను గీతు మోహన్‌దాస్ తో కలిసి యశ్ స్వయంగా సహ రచయితగా అందించడం చిత్ర ప్రత్యేకతను మరింత పెంచింది. పెద్దల కోసం రూపొందించిన ఫెయిరీ టేల్ అనే సబ్‌టైటిల్ కి తగ్గట్టుగానే ట్రైలర్ లోని ప్రతి దృశ్యం అత్యంత విభిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త

‘టాక్సిక్’ సినిమా ప్రారంభించినప్పుడు చాలా మంది ‘నీ వల్ల కాదు’ అన్నారు. అలాంటివాళ్లకు సినిమా పూర్తి చేసి నా సత్తా చూపించాను' అని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అన్నారు. ‘టాక్సిక్’ సినిమా ప్రారంభించినప్పుడు చాలా మంది ‘నీ వల్ల కాదు’ అన్నారు. అలాంటివాళ్లకు సినిమా పూర్తి చేసి నా సత్తా చూపించాను' అని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అన్నారు. ఆమె దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం బెంగళూరులో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వేదికపై దర్శకురాలు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా ప్రారంభించినపుడు చాలా మంది ఎన్నో మాటలు అన్నారు. తనపై నమ్మకం ఉంచి.. ఈ సినిమాను అంగీకరించినందుకు యశ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నిర్మాత కేవీఎన్ నాపై పెట్టిన నమ్మకం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. మా కోసం ఎక్కడా రాజీ పడకుండా అన్ని సమకూర్చారు. ఈ జర్నీని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను' అన్నారు

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన కొత్త సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' ట్రైలర్ లాంచ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆగస్టు 8, 9 తేదీలలో నిర్వహించిన ఈ వేడుకలో ఆయన చిత్రంలో నటించిన నటీనటులందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ చిత్రంలో నటి కియారా అద్వాణీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్‌లతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ వేడుకలో మాట్లాడిన యశ్, ఈ సినిమా కోసం నటీనటులను తీవ్రంగా శ్రమపెట్టినందుకు తానంతట తాను క్షమాపణ కోరుకుంటున్నట్లు వేదికపై నుంచి ప్రకటించారు. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు యశ్ కథా రచయితగా, సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు ఆంగ్ల భాషల్లో కూడా ఏకకాలంలో రూపొందిస్తున్నారు. చిత్రం కోసం నటీనటులందరూ ఎంతో అంకితభావంతో పనిచేశారని యశ్ ఈ వేదికపై కొనియాడారు. ముఖ్యంగా 'తబాహి' పాట విషయంలో నటి కియారా అద్వాణీ ప్రదర్శనపై వచ్చిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రతి నటుడు కూడా సినిమా కోసం తమవంతు ఉత్తమ ప్రతిభను కనబరిచారని చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటులందరినీ చాలా కష్టపెట్టామని యశ్ ఆవేదన వ్యక్తం చేశారు. "టాక్సిక్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడికి నేను ఒక మాట ఇస్తున్నాను. ఈ సినిమా విడుదలైన తర్వాత మీ అందరినీ ప్రేక్షకులు సరికొత్త కోణంలో చూస్తారు. మిమ్మల్ని షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పెట్టినందుకు నిజంగా క్షమించండి" అని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ఇంతమంది ప్రముఖ నటీనటులతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత అహంకారాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చారని యశ్ ప్రశంసించారు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Nayanthara:యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆసక్తి కనిపిస్తోంది. తాను సాధారణంగా సినిమా ప్రమోషన్స్‌కు ఎందుకు హాజరుకానో నయనతార ఈ కార్యక్రమంలో వివరించారు. ప్రమోషన్స్ అంటే తనకు ఇష్టం లేదని కాదు.. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు అంత సౌకర్యంగా అనిపించదని చెప్పారు. అందుకే ఎక్కువగా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం యష్ కారణంగా తాను ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చానని నయనతార చెప్పారు. యష్ తనకు ఫోన్ చేసి అడిగిన తర్వాత ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. యష్‌ను మొదటిసారి కలిసిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. తాను ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని చెప్పిన నయనతార.. యష్‌ను కలిసినప్పుడు మాత్రం అతని వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా అనిపించిందన్నారు. అతని లార్జర్-దెన్-లైఫ్ ఇమేజ్ చూసి, తాను ‘రాకీ భాయ్ రాజ్యంలోకి వెళ్తున్నానా?’ అని అనుకున్నానని సరదాగా చెప్పారు. అంతేకాదు, యష్ కష్టపడి పనిచేసే విధానాన్ని నయనతార ప్రశంసించారు. తాను ఇప్పటివరకు ఇంతగా శ్రమించే నటుడిని చూడలేదని అన్నారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు యష్ తన సమయం, శక్తిని ‘టాక్సిక్’ సినిమాకు కేటాయించారని చెప్పారు. చివర్లో తన మనసులోని మాటలన్నీ చెప్పేశానని గుర్తించిన

యశ్ హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ కేవలం పెద్దల కోసం మాత్రమేనని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో వయొలెన్స్, గన్స్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయి అయితే తాజాగా టాక్సిక్ మూవీలో కియారా రోల్‌పై మొదటి నుంచి విమర్శలొస్తున్నాయి. ఆమె తల్లి అయిన కొద్ది నెలల్లోనే ఇలాంటి బోల్డ్ రోల్ చేయడంపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. టాక్సిక్ బోల్డ్ సాంగ్ రిలీజ్ తర్వాత ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ కూడా లేడీ కావడంతో టాక్సిక్‌పై మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనూ వయొలెన్స్, బోల్డ్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో యశ్.. హీరోయిన్ కియారాపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక ప్రళయం అంటూ కొనియాడారు. ముఖ్యంగా ట్రోలింగ్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు యశ్. నువ్వు ఈ సినిమాలో చాలా గొప్ప పాత్ర పోషించావని కొనియాడారు. నయనతార సైతం కియారాపై ప్రశంసలు కురిపించింది. అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం వయొలెన్స్, బోల్డ్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి సినిమాలతో సమాజానికి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా మూవీ తీస్తే కథలో కొంతైనా

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Toxic trailer review: పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్ సినిమాల తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ ప్రారంభం నుంచే టాక్సిక్ ప్రపంచం ఎంత డార్క్‌గా ఉండబోతుందో చూపించారు. దిస్ వాస్ సపోజ్డ్ టు బి మై ఫెయిరీ టేల్ అనే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. యశ్ స్టైలిష్ లుక్, మాస్ యాక్షన్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్లో భారీ గన్ ఫైట్స్, అగ్నిప్రమాదాలు, ఛేజింగ్ సన్నివేశాలు, సర్కస్ బ్యాక్‌డ్రాప్, మంచుతో నిండిన లొకేషన్స్ వంటి విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లను దర్శకురాలు గీతు మోహన్‌దాస్ చాలా డార్క్ టోన్‌లో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎలిమెంట్స్ కలిసి సినిమాకు ఒక ప్రత్యేకమైన టోన్‌ను తీసుకొచ్చాయి. ఇక కియారా అద్వానీ కూడా ట్రైలర్లో తన గ్లామరస్ లుక్‌తో పాటు కీలకమైన పాత్రలో కనిపించారు. యశ్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా పెరిగింది. మరోవైపు నయనతార పాత్ర సినిమాకు మరో కీలక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ఆమెను పవర్ఫుల్ డాన్ పాత్రలో

Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్‌కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 7:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో యశ్ ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా సందడి నెలకొంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా యశ్‌ను సరికొత్త లుక్, పాత్రలో చూడబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘టాక్సిక్’ ట్రైలర్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ట్రైలర్లో యశ్ పాత్ర ఎలా ఉండబోతుంది? కథ ఏ నేపథ్యంలో సాగుతుంది? నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అనే విషయాలపై ఇప్పుడు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘టాక్సిక్’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని వెంకట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె నారాయణతో కలిసి హీరో యష్‌కు చెందిన మన్స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదలకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో సోషల్ మీడియాలో #ToxicTrailer ట్రెండ్ అవుతోంది. సాయంత్రం 7:01 గంటలకు ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి

ఎప్పుడెప్పుడా అంటూ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న టాక్సిక్ ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమవుతోంది. కేజీఎఫ్ తరువాత రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ చిత్రం టాక్సిక్ (Toxic). ఎప్పుడెప్పుడా అంటూ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న టాక్సిక్ ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమవుతోంది. కేజీఎఫ్ తరువాత రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ చిత్రం టాక్సిక్ (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 26 న ప్రేక్షకుల ముందకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా టాక్సిక్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించడం సెన్సేషన్ గా మారింది. మొదటి నుంచి నయన్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటూ వస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కూడా ప్రమోషన్స్ కి రాను అని ముఖం మీదనే చెప్పేస్తుంది అంట. కానీ, ఈ భామ.. టాక్సిక్ ఈవెంట్ కి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ లో తానెందుకు సినిమాల ప్రమోషన్లకు, ఈవెంట్లకు దూరంగా ఉంటుందో ఆ సీక్రెట్ ని బయటపెట్టింది. "నేను ఈవెంట్లకు దూరంగా ఉండటానికి కారణం మాట్లాడటం సరిగ్గా రాకపోవడమే, కానీ టాక్సిక్ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ ఈవెంట్ కి రావడానికి కారణం.. యష్. ఆయన కేవలం ఒకే ఒక్క కాల్ చేసి ఆహ్వానించారు. ఆయన మాట కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అలాగే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన గీతూ మోహన్‌దాస్ మేకింగ్, కథ చెప్పిన తీరు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. సెట్స్‌లో నటీనటులను ఆమె చూసుకున్న విధానం అద్భుతం' అని చెప్పుకొచ్చింది. తోటి నటీమణులు కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియాల నటనను కూడా ఆమె ప్రత్యేకంగా అభినందించింది. ముఖ్యంగా హీరో యష్ గురించి