
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Toxic Movie Censor Review: 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్, గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యశ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరికొత్త చిత్రం 'టాక్సిక్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26వ తేదీన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఒకే రోజున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా అత్యంత వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక 'టాక్సిక్' చిత్రానికి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు.
ఇక 'టాక్సిక్' మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో మొదట 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా మరింత గ్రిప్పింగ్ గా ఉంచేందుకు దానిని 2 గంటల 54 నిమిషాలకు (సుమారుగా 174 నిమిషాలు) కుదించారు. ఈ భారీ రన్ టైమ్ టాక్సిక్ సినిమాకు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ వెర్షన్ మూవీని కూడా రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
'ఏ' (A) సర్టిఫికెట్ జారీ.. సెన్సార్ రిపోర్టు ప్రకారం.. టాక్సిక్ సినిమా థియేటర్లలో వేరే లెవెల్ లో ఉండబోతోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో హీరో యశ్ ద్విపాత్రాభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాజిటివ్, నెగెటివ్ రెండు క్యారెక్టర్లలో కూడా ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించారని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి మేజర్ హైలైట్ గా నిలవబోతున్నాయని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే యశ్ కెరీర్ లోనే కాకుండా, మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలోనే టాక్సిక్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఒక మహిళా దర్శకురాలు ఇంతటి భారీ యాక్షన్, 'ఏ' సర్టిఫికెట్ ఉన్న సినిమా తీసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం సామాన్యమైన విషయం కాదని నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు 1 మిలియన్ వరకు ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి స్థాయి రివ్యూ మరియు టాక్ తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఆగస్టు 26 వరకు ఆగాల్సిందే. అంతకంటే ముందుగానే ఆగస్టు 22న హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





