
Real Estate | రియల్ ఎస్టేట్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. వెయ్యి రోజుల్లోనే అంతా తారుమారు!
Real Estate | రియల్ ఎస్టేట్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. వెయ్యి రోజుల్లోనే అంతా తారుమారు!
© 2026 nimisham.in

Real Estate | రియల్ ఎస్టేట్‌కు కాంగ్రెస్ బిగ్ షాక్.. వెయ్యి రోజుల్లోనే అంతా తారుమారు!

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది. ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు
గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కోకాపేట, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు భారీ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో నిర్వహించిన భూముల బహిరంగ వేలం కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలు పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు తెలంగాణ హౌసింగ్ బోర్డు తాజాగా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలానికి ముందుగా చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. అయితే ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు పోటీ పడటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వేలంలో ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్‌కు గజం రూ.2.36 లక్షల ధర పలికింది. మరో 2 ప్లాట్లు చదరపు గజం రూ.2.06 లక్షల చొప్పున విక్రయం అయ్యాయి. దీంతో కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది.ఈ బహిరంగ వేలంలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు వారు పోటీపడటంతో పలు ప్లాట్లు హౌసింగ్ బోర్డు నిర్ణయించిన కనీస ధర కంటే అధిక మొత్తానికి అమ్ముడయ్యాయి. వేలం పూర్తి అయ్యే సమయానికి 16 ప్లాట్లకు కలిపి చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ ప్రాంతానికి ఇప్పటికే ప్రత్యేకమైన రియల్ ఎస్టేట్ గుర్తింపు ఉంది. నగరంలోని ప్రధాన ఐటీ, వాణిజ్య ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, మెట్రో సహా రవాణా సదుపాయాలు, నివాస ప్రాంతంగా ఉన్న డిమాండ్ వంటి అంశాలు ఈ

Hyderabad Real Estate: హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరంలో భూముల ధరలు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు నగరానికి సమీపంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ ప్రాంతం కూడా రియల్ ఎస్టేట్‌లో ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్ చుట్టూ రోడ్లు, హైవేలు, రవాణా సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, కొత్త రహదారులు, మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులు నగర భవిష్యత్ అభివృద్ధిలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి క్రమంగా నగర శివారు ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు. ప్రధాన ప్రాజెక్టులకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొంతమంది పెట్టుబడిదారులు ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రోడ్డు సౌకర్యాలు, రవాణా, ఇతర మౌలిక వసతులు పెరిగితే భవిష్యత్తులో అక్కడ భూములకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వికారాబాద్ హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో పాటు ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అనంతగిరి కొండలు, పచ్చని ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు రహదారి కనెక్టివిటీ మరింత మెరుగైతే ప్రయాణం సులభమవుతుంది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడు నివాస ప్రాంతాలు, చిన్న వ్యాపారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా అభివృద్ధి చెందవచ్చు. హైదరాబాద్ ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే వికారాబాద్ పరిసరాల్లో కొన్ని చోట్ల భూములు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 120 గజాల ప్లాట్లు రూ.10 లక్షల లోపు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇది అన్ని ప్రాంతాలకు వర్తించదు. రోడ్డు పక్కన ఉన్న భూములు, పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు నగరానికి కొంత దూరంలో ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధిలో రీజినల్ రింగ్ రోడ్ (RRR), ఫ్యూచర్ సిటీ, కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, మెట్రో విస్తరణ, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పెద్ద ప్రాజెక్టు పక్కనే భూమి కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ప్రధాన రహదారులు లేదా అభివృద్ధి ప్రాజెక్టులకు ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ ధరలకు భూమి లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అభివృద్ధి విస్తరించినప్పుడు ఇలాంటి ప్రాంతాలకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వికారాబాద్ జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పాటు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. అనంతగిరి కొండలు, అడవులు, పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపడితే వికారాబాద్‌కు చేరుకోవడం సులభం కానుంది. ముఖ్యంగా బీజాపూర్ హైవే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటం ఈ ప్రాంత భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు ప్రయాణ సమయం తగ్గితే ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, పెట్టుబడిదారుల రాకపోకలు పెరగవచ్చు. ఒక ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడితే అక్కడ నివాస, వాణిజ్య అవసరాలు కూడా క్రమంగా పెరుగుతాయి. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే వికారాబాద్ పరిసరాల్లో భూమి ధరలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 120 గజాల ప్లాట్ ధర రూ. 10 లక్షలలోపే అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో భారీ తేడాలు ఉండవచ్చు. ప్రధాన రహదారికి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారీ బిల్డింగ్లు, పెద్ద రోడ్లు, వరల్డ్ క్లాస్ సిటీ ప్లాన్స్ మాత్రమే కాదు. భారతదేశ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రయాణం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఎంతో ప్రశాంతంగా ఉన్న కృష్ణా నదీ తీర ప్రాంతం, రాజధాని ప్రకటన రాగానే రాత్రికి రాత్రే కోట్ల రూపాయల బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. గత పదేళ్ల కాలంలో అమరావతి భూముల ధరలు చూసిన ఎత్తుపల్లాలు, పొలిటికల్ ట్విస్టులు, చివరకు ఇన్వెస్టర్లకు ఇచ్చిన లాభాలు రియల్ ఎస్టేట్ వరల్డ్‌లోనే ఒక కొత్త చరిత్ర సృష్టించాయి. 2014 సంవత్సరానికి ముందు తుళ్లూరు, నేలపాడు, మందడం, నవులూరు, రాయపూడి లాంటి గ్రామాల్లో భూముల వ్యాపారం ఎకరాల లెక్కన మాత్రమే జరిగేది. అప్పట్లో ఎకరం ధర రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండేది. అంటే గజం లెక్కన చూసుకుంటే కేవలం రూ.3,000 నుంచి రూ.6,000 మాత్రమే. కానీ 2014 చివరిలో ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ స్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రైతుల నుంచి ఏకంగా 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. 2016 నుంచి 2018 మధ్య వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ప్రారంభం కావడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకాయి. అయితే 2019లో ప్రభుత్వం మారడం, మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడంతో 2019-2023 మధ్య మార్కెట్ తీవ్రంగా పడిపోయింది. ఆ సమయంలో భూమి అమ్మకాలు తగ్గిపోయి గజం ధర రూ.12,000 వరకు పడిపోయింది. కానీ 2024లో మళ్లీ ప్రభుత్వం మారడం, వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు రావడంతో అమరావతిలో భూముల రేట్లు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. ఒక సాధారణ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అమరావతి

Visakhapatnam: విశాఖ ఉక్కు భూముల వేలం.. 19.29 ఎకరాల విక్రయానికి సిద్దం! ఈ వార్తకు సంబంధించిన

ఇల్లు, ప్లాట్ లేదా వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం చాలా మందికి ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. సంవత్సరాల పొదుపు, బ్యాంకు రుణం లేదా కుటుంబ ఆస్తులను ఉపయోగించి స్థిరాస్తిలో పెట్టుబడి పెడతారు. అయితే, ఈ రంగంలో సరైన సమాచారం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ పత్రాల నుంచి ఒకే ఆస్తిని పలువురికి అమ్మడం వరకు వివిధ రకాల మోసాలు జరుగుతుంటాయి. అందువల్ల ఆస్తి కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించడం అత్యంత ముఖ్యం. కొన్ని రకాల మోసాలను ఇక్కడ చూద్దాం. ఇది స్థిరాస్తిలో సాధారణంగా కనిపించే మోసాల్లో ఒకటి. మోసగాళ్లు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌లు, గుర్తింపు పత్రాలు లేదా ఇతర భూ రికార్డులను సృష్టించి ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నించవచ్చు. కొన్నిసార్లు అసలు యజమాని సంతకాన్ని కూడా నకిలీ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలుదారులు పత్రాలపై మాత్రమే ఆధారపడకుండా, సంబంధిత ప్రభుత్వ రికార్డుల్లో యాజమాన్య వివరాలను స్వతంత్రంగా పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో ఒకే ప్లాట్ లేదా ఫ్లాట్‌ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కొనుగోలుదారులకు విక్రయించే మోసాలు జరుగుతాయి. ముందస్తు బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లింపుల సమయంలో కొనుగోలుదారులు పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కొత్త లేఅవుట్లు లేదా అపార్ట్మెంట్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త అవసరం. ఒప్పందం చేసుకునే ముందు ఆ ఆస్తిపై ఇప్పటికే ఇతర హక్కులు, ఒప్పందాలు లేదా రుణాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. చౌక ధరకు ప్లాట్లు అందిస్తున్నామని చెప్పి అనుమతి లేని లేఅవుట్లను విక్రయించే సంఘటనలు కూడా కనిపిస్తాయి. కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఇల్లు నిర్మించేందుకు అనుమతులు రాకపోవచ్చు లేదా అభివృద్ధి పనులు నిలిచిపోవచ్చు. రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలపై కూడా హామీలు మాత్రమే ఉండి, వాస్తవంగా అవి అందుబాటులో లేకపోవచ్చు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Raidurg land auction: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త చరిత్రను తిరగరాసింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) తాజాగా నిర్వహించిన ఆన్లైన్ ఈ-వేలంలో రాయదుర్గం ఐటీ కారిడార్‌లోని స్థలాలు ఊహించని రీతిలో రికార్డు ధరలను పలికాయి. ఈ వేలంలో రాయదుర్గం పరిధిలోని P1 ప్లాట్ ఎకరం ఏకంగా రూ. 264 కోట్లకు అమ్ముడుపోయి, హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భూమిగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ చారిత్రాత్మక వేలంలో 'P1' ప్లాట్ మొత్తం విస్తీర్ణం 5.25 ఎకరాలు. ఎకరాకు రూ. 264 కోట్ల బిడ్ లెక్కన ఈ ఒక్క ప్లాట్ అమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాథమిక కనీస ధర కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజాల మధ్య సాగిన తీవ్ర పోటీని తట్టుకుని 'MSN రియాల్టీస్' సంస్థ ఈ ప్రైమ్ ప్లాట్‌ను దక్కించుకుంది. ఈ కొత్త బెంచ్‌మార్క్ ధరతో గతంలో నమోదైన రికార్డులన్నీ బద్దలయ్యాయి. 2022లో హెచ్ఎమ్డీఏ నిర్వహించిన వేలంలో ఎకరం రూ. 100 కోట్లు పలికి సంచలనం సృష్టించింది. 2025 అక్టోబర్ రాయదుర్గంలో ఎకరం రూ. 177 కోట్లుగా నమోదై అప్పటికి రికార్డుగా నిలిచింది.ప్రస్తుతం ఏకంగా రూ. 264 కోట్లకు చేరుకుని, కోకాపేటను అధిగమించి రాయదుర్గం నగరంలోనే నంబర్ 1 ఖరీదైన ప్రాంతంగా అవతరించింది. హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన 'నాలెడ్జ్ సిటీ' పరిధిలో ఈ ప్లాట్ ఉండటమే ఈ స్థాయి ధర రావడానికి ప్రధాన కారణం. టీ-హబ్, మై హోమ్ భూజా, ఐటీసీ

రేవంత్‌పై సుస్మిత సంచలన వ్యాఖ్యలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సై తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ కలకలం Hyderabad Real Estate: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం సృష్టిస్తున్న సంచలనాలు, భూముల ధరలకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు, మౌలిక వసతుల విస్తరణ, మెరుగైన పెట్టుబడి అవకాశాల కారణంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భూముల విలువ ఊహకందని స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో స్థలాల కొనుగోలుకు దిగ్గజ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు పోటీపడుతుండటంతో ప్రతి వేలంలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. Konda Susmita: నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. పరకాల స్థానాన్ని వదిలేది లేదు.. మరోసారి కొండా సుస్మితా సంచలన కామెంట్స్ రాయదుర్గం వేలంలో నింగినంటిన ధరలు: ఈ క్రమంలో రాయదుర్గం(Hyderabad Real Estate) పరిధిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) నిర్వహించిన భూముల బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. రాయదుర్గం పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 5.25 ఎకరాల స్థలానికి TGIIC వేలం నిర్వహించగా, ఎకరం ధర ఏకంగా రూ.264 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రాంతంలో వ్యాపార విస్తరణకు ఉన్న డిమాండ్ దృష్ట్యా పలు దిగ్గజ సంస్థలు వేలంలో తీవ్రంగా పోటీ పడటంతో ఈ స్థాయిలో ధర లభించినట్లు తెలుస్తోంది. పాత రికార్డులను తిరగరాసిన TGIIC వేలం: గతంలో ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి గరిష్టంగా రూ.237 కోట్లు పలికిన రికార్డు ఉండగా, తాజా వేలం ద్వారా ఆ రికార్డు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒకే చోట రూ.264 కోట్ల రికార్డు ధర లభించడం నగర చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది. ఐటీ కారిడార్‌లో ల్యాండ్ బ్యాంక్ పరిమితంగా ఉండటం, భవిష్యత్తులో వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఇక్కడ ఉన్న

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. కొత్త ఇల్లు లేదా ప్రాపర్టీ కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ వర్షాకాలం మీకు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. సాధారణ రోజుల్లో ఇల్లు చూడటానికి, వర్షాకాలంలో చూడటానికి చాలా తేడా ఉంటుంది. ఏడాది పొడవునా కనిపించని అనేక విషయాలు ఈ సీజన్లో బయటపడతాయి. ప్రాపర్టీ రియల్ క్వాలిటీ తెలుసుకోవడానికి వర్షం ఒక మంచి టెస్టింగ్ టైమ్. దీనికి తోడు ప్రస్తుతం బ్యాంకులు హోమ్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఇల్లు కొనడం ఎంతవరకు బెటర్ అనేది ఈ 4 పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. ఇంటి లుక్ ఎంత బాగున్నా, దానికి క్వాలిటీ చాలా ముఖ్యం. వర్షాకాలంలో మాత్రమే బిల్డింగ్ అసలు క్వాలిటీ ఏంటో క్లియర్‌గా తెలుస్తుంది. గోడలు, పై భాగం నుండి నీరు కారడం లేదా తేమ ఉందా అనేది ఈజీగా చెక్ చేయవచ్చు. విండోస్, డోర్స్, బాత్రూమ్లలో తేమ రావడం లాంటి సమస్యలు ఉంటే ఆ ప్రాపర్టీని తీసుకోకపోవడమే మంచిది. అలాగే వర్షం పడినప్పుడు అక్కడ నీరు నిలిచిపోకుండా ప్రాపర్ డ్రైనేజీ సిస్టమ్ ఉందో లేదో సరిచూసుకోవచ్చు. ఇల్లు కొనేటప్పుడు కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో చాలా చోట్ల రోడ్లపై నీరు చేరి, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. బిల్డర్లు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ ఉందంటూ ఎన్నో ప్రామిస్‌లు చేస్తారు. కానీ వర్షం పడితే కానీ ఆ రోడ్ల అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. రహదారులు గుంతలమయంగా ఉన్నాయా, లేదా రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్నాయా అనేది ఈ టైమ్‌లోనే సరిగ్గా అంచనా వేయవచ్చు. గతంలో ఆర్బీఐ (RBI) నాలుగు సార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత, చాలా బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. దీనివల్ల ఇల్లు కొనాలనుకునే వారికి ఆర్థికంగా

దేశంలోని ప్రధాన నగరాల్లో సొంత ఇల్లు కొనాలనుకునేవారికి ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 బెడ్రూమ్ (3BHK) అపార్ట్మెంట్ల ధరలను పరిశీలిస్తే, ముంబై అత్యంత ఖరీదైన నగరంగా అగ్రస్థానంలో నిలవగా, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాలు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 2026 నాటి ప్రాపర్టీ మార్కెట్ డేటా ఆధారంగా ఈ విశ్లేషణ వెలువడింది.ప్రముఖ ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్.కామ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికల ఆధారంగా దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 3BHK ఫ్లాట్ల ధరలను విశ్లేషించారు. ఈ నివేదిక ప్రకారం, ఆర్థిక రాజధాని ముంబైలో 3BHK అపార్ట్మెంట్ల సగటు ధర చదరపు అడుగుకు (sq ft) సుమారు రూ. 33,217గా ఉంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టులలో చదరపు అడుగు ధర రూ. 20,000 నుంచి ప్రారంభమై, ప్రీమియం ప్రాంతాల్లో రూ. 65,000 దాటుతోంది.ముంబై తర్వాత స్థానంలో న్యూఢిల్లీ నిలిచింది. ఇక్కడ చదరపు అడుగు సగటు ధర రూ. 15,329గా ఉండగా, గురుగ్రామ్‌లో ఇది రూ. 13,391గా ఉంది. ఇక దక్షిణాదిలో కీలకమైన ఐటీ హబ్ బెంగళూరులో 3BHK ఫ్లాట్ సగటు ధర చదరపు అడుగుకు రూ. 11,223గా నమోదైంది. పూణెలో రూ. 9,635, చెన్నైలో రూ. 9,007గా ఉంది.హైదరాబాద్‌లో అందుబాటు ధరలుఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 3BHK ఫ్లాట్ల ధరలు కొంత అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు సగటు ధర సుమారు రూ. 7,900గా రికార్డయింది. కొత్త ప్రాజెక్టులలో ఈ

Multi Crore Worth Homes of Indian Cricketers: భారత క్రికెట్ దిగ్గజాలు మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా బిలియనీర్ల తరహాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ దేశవ్యాప్తంగా నిర్మించుకున్న వందల కోట్ల విలువైన విలాసవంతమైన భవనాలు, వాటిలోని అద్భుతమైన సౌకర్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాంచిలో ధోనీ 7 ఎకరాల ఫామ్‌హౌస్.. సెహ్వాగ్ రూ.130 కోట్ల బంగ్లా! టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్‌లు, కార్లంటే ఎంతటి పిచ్చి ఉందో అందరికీ తెలిసిందే. రాంచిలోని తన సొంత ఊరిలో 7 ఎకరాల భారీ విస్తీర్ణంలో 'కైలాసపతి' పేరుతో రూ.100 కోట్లకు పైగా విలువైన ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. ఆధునిక డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ బంగ్లాలో అత్యాధునిక జిమ్, ఈత కొలను, ఇండోర్ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న పదుల సంఖ్యలోని సూపర్‌బైక్‌లు, లగ్జరీ కార్ల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద గ్యారేజ్‌ను ఏర్పాటు చేయడం ఈ భవనం ప్రత్యేకత. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? మరోవైపు డేంజరస్ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ నజఫ్‌గఢ్ వీధుల నుంచి హౌజ్ ఖాస్‌లోని రాజభవనం వరకు సాగించిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో సెహ్వాగ్‌కు ఉన్న 'కృష్ణ నివాస్' బంగ్లా విలువ సుమారు రూ.130 కోట్లుగా అంచనా. ఇందులో 12 విశాలమైన గదులు, ప్రాంగణంలో అందమైన కోవెల, పెంచుకునే కుక్కల కోసం ప్రత్యేకమైన లాన్ ఉన్నాయి. హర్యానా, నజఫ్‌గఢ్‌లలో కూడా ఆయనకు అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి. గురుగ్రామ్‌లో కోహ్లీ రాజభవనం.. ముంబైలో సచిన్ కలల సౌధం! భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ముంబై, లండన్, అలీబాగ్ ప్రాంతాలలో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అయితే అన్నింటికంటే

తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో వేలాది మంది ప్రైవేట్ ఆస్తుల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఇళ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు ఉన్నట్టుండి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేరడంతో అమ్మకాలు, తనఖాలు, బదిలీలు నిలిచిపోయాయి. రెవెన్యూ రికార్డుల నవీకరణలో జరిగిన పరిపాలనా లోపాలే ఈ సంక్షోభానికి కారణమని తేలడంతో ప్రభుత్వం క్షమాపణలు చెప్పి, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు, ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.అసలేంటి సెక్షన్ 22ఏ? పొరపాటు ఎలా జరిగింది?రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూదాన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను అక్రమ బదిలీల నుంచి కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే, ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' విధానంలోకి మారే క్రమంలో, 2026 ఏప్రిల్‌లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలతో పాటు, దశాబ్దాల

హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చెవెళ్ల కూడా ఒకటిగా మారుతోంది. మెరుగవుతున్న రహదారి సదుపాయాలు, కొత్త మౌలిక వసతుల ప్రాజెక్టులు, డేటా సెంటర్ అభివృద్ధి, హైదరాబాద్-బీజాపూర్ హైవే విస్తరణ వంటి అంశాలు ఈ ప్రాంతంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ (RRR) రాకతో చెవెళ్ల చుట్టుపక్కల భూముల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. చెవెళ్లలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రధాన కారణాల్లో రీజినల్ రింగ్ రోడ్ కీలకంగా మారనుంది. RRRకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే భూములపై కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతోంది. రింగ్ రోడ్ ఇంటర్‌చేంజ్‌లకు సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు భవిష్యత్తులో మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే RRR పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఏడాదికి సుమారు 20 శాతం నుంచి 42 శాతం వరకు పెరుగుతున్నట్లు మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. రహదారి నిర్మాణం, కొత్త కనెక్టివిటీ పూర్తయ్యే కొద్దీ ఈ ప్రాంతాల్లో నివాస ప్రాజెక్టులు, కమర్షియల్ అభివృద్ధి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. చెవెళ్లలో ప్రస్తుతం ప్లాట్లు రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు, భవిష్యత్తులో భూమి విలువ పెరగాలని ఆశించే పెట్టుబడిదారులు ప్లాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రెసిడెన్షియల్ లేఅవుట్లు, ఫార్మ్ ప్లాట్లు, వ్యవసాయ భూములు ఇలా వివిధ రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. చెవెళ్లలో రెసిడెన్షియల్ ప్లాట్ల సగటు ధర చదరపు అడుగుకు సుమారు రూ.2,847గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రీమియం ప్రాంతాల్లో రూ.14,049 వరకు ఉన్నాయి. RRRకు సుమారు 1.2 కిలోమీటర్ల దూరంలోని ప్రీమియం జోన్లో చదరపు గజం ధర దాదాపు రూ.7,800గా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తే కంద్వాడలో సగటు ధర చదరపు

కోకాపేట్ చరిత్రను అర్థం చేసుకోవాలంటే హైదరాబాద్ సంస్థాన కాలానికి వెళ్లాలి. నిజాం పాలనలో హైదరాబాద్ చుట్టుపక్కల విస్తారమైన భూములు వివిధ రకాల భూవ్యవస్థల కింద ఉండేవి. జాగీర్ వ్యవస్థలో భాగంగా కొన్ని భూభాగాలు ప్రభావవంతమైన కుటుంబాలు, అధికారులు, సంస్థానానికి అనుబంధ వర్గాల ఆధీనంలో ఉండేవి. ఆ సమయంలో కోకాపేట్ నేటి నగర రూపానికి పూర్తిగా భిన్నంగా ఉండేది. వ్యవసాయమే ప్రధాన కార్యకలాపంగా ఉండేది. జనసాంద్రత తక్కువగా ఉండటంతో గ్రామీణ వాతావరణం కనిపించేది. హైదరాబాద్ ప్రధాన నగర ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతం పెద్దగా పట్టణీకరణకు లోనుకాలేదు. కోకాపేట్ భూముల్లో కొంత భాగం అప్పటి ప్రభావవంతమైన భూస్వామ్య కుటుంబాల ఆధీనంలో ఉన్నట్లు చారిత్రక ప్రస్తావనల్లో కనిపిస్తాయి. భారత స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అనంతరం హైదరాబాద్ ప్రాంతంలోని పాత భూవ్యవస్థల్లో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. జాగీర్ వ్యవస్థ రద్దుతో అనేక భూముల పరిపాలన విధానం మారిపోయింది. ఆ దశలో కోకాపేట్‌కు మాత్రం వెంటనే పట్టణ ప్రాంత హోదా రాలేదు. హైదరాబాద్ నగరం అప్పటికి ప్రస్తుత స్థాయిలో పశ్చిమ దిశగా విస్తరించలేదు. దీంతో కోకాపేట్ చాలాకాలం వరకు నగరానికి బయట ఉన్న ప్రశాంతమైన ప్రాంతంగానే కొనసాగింది. కాలం గడిచే కొద్దీ హైదరాబాద్‌లో జనాభా పెరిగింది. కొత్త నివాస ప్రాంతాల అవసరం ఏర్పడింది. ప్రధాన నగర ప్రాంతాల్లో భూముల కొరత, ధరల పెరుగుదలతో అభివృద్ధి సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు నగర శివార్ల వైపు దృష్టి సారించాయి. ఈ పరిణామం కోకాపేట్ భవిష్యత్తును మార్చే కీలక దశగా మారింది. హైదరాబాద్ ఐటీ రంగంలో వేగంగా ఎదగడం కోకాపేట్ అభివృద్ధికి మరో పెద్ద కారణమైంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో కార్యాలయాలు, ఐటీ సంస్థలు పెరగడంతో వాటి చుట్టుపక్కల నివాసాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోకాపేట్ భౌగోళిక స్థానం కీలకంగా మారింది. నగరంలోని ప్రధాన ఐటీ, ఆర్థిక కేంద్రాలకు సమీపంగా ఉండటంతో

తెలుగు సినీ పరిశ్రమలో తమ కష్టార్జితాన్ని భూములు, స్థిరాస్తులలో పెట్టుబడిగా పెట్టడం పలువురు హీరోలకు అలవాటే. అలా దశాబ్దాల క్రితం తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ నేడు ఊహించని రీతిలో కోట్లకు చేరుకోవడం తరచూ చూస్తుంటాం. తాజాగా మాస్ మహారాజా రవితేజకు సంబంధించిన ఒక భారీ ఆస్తి గురించిన వివరాలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా చర్చనీయాంశమవుతున్నాయి. సినీ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల జరిగిన 'ఇరుముడి' చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో రవితేజ ఆస్తుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రవితేజ, అజయ్ ఘోష్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న 'మాస్ జాతర' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను ఆయన పంచుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని శంకర్ పల్లి దగ్గర రవితేజకు దాదాపు 26 ఎకరాల విశాలమైన ఫామ్‌హౌస్ (తోట) ఉందట. 'మాస్ జాతర' చిత్రానికి సంబంధించిన రైల్వే స్టేషన్ సెట్ తో పాటు ఇంటి సెట్లను ఈ తోటలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి షూటింగ్ నిర్వహించినట్లు అజయ్ ఘోష్ తెలిపారు. ఈ ఆస్తికి సంబంధించిన అసలు కథ ఏమిటంటే.. రవితేజ ఈ 26 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేశారట. కాలక్రమేణా హైదరాబాద్ నగరం విస్తరించడం, శంకర్ పల్లి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ వందల కోట్ల రూపాయలకు చేరుకుందని అజయ్ ఘోష్ అన్నారు. ఈ వ్యాఖ్యల అధికారిక మార్కెట్ వ్యాల్యూపై ధ్రువీకరణ లేనప్పటికీ, శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు ఎంత భారీగా పెరిగాయో ఈ విషయం స్పష్టం చేస్తోంది. అయితే, కోట్ల విలువైన ఆస్తి ఉన్నప్పటికీ రవితేజ వ్యక్తిత్వం ఎంత సాధారణంగా ఉంటుందో చెప్పడానికి అజయ్ ఘోష్ మరో సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి ఆ తోట విలువ గురించి

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటనలోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ముంబైలోని తన కమర్షియల్ ఆస్తుల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తాజాగా అంధేరి వెస్ట్‌లోని ఓ వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ఓ ప్రముఖ కంపెనీకి లీజుకు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఒప్పందం ద్వారా ఆయనకు నెలకు రూ. 33 లక్షల అద్దె రానుంది.ముంబై అంధేరిలోని ఓషివారా లింక్ రోడ్లో ఉన్న 'సిగ్నేచర్' భవనంలో అమితాబ్‌కు చెందిన ఆఫీస్ స్పేస్ ఉంది. దీనిలోని మూడు పై అంతస్తులను న్యూట్రిషన్ ఉత్పత్తుల సంస్థ 'ట్రూనేటివ్ ఎఫ్&బి ప్రైవేట్ లిమిటెడ్'కు లీజుకు ఇచ్చారు. ఈ ఒప్పందం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం 8,428 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ స్థలానికి ఐదేళ్ల పాటు లీజు కుదిరింది. ఈ ఐదేళ్ల కాలంలో అమితాబ్‌కు అద్దె రూపంలో మొత్తం రూ. 21.88 కోట్ల ఆదాయం లభించనుంది. ఒప్పందంలో భాగంగా ట్రూనేటివ్ సంస్థ రూ. 1.98 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. ఏటా అద్దెను 5 శాతం పెంచేలా నిబంధన చేర్చారు. దీంతో పాటు 9 కార్ల కోసం ప్రత్యేక పార్కింగ్ హక్కులను కూడా కల్పించారు.గతేడాది కూడా ఇదే 'సిగ్నేచర్' భవనంలోని నాలుగు ఆఫీస్ యూనిట్లను వార్నర్ మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమితాబ్ లీజుకు ఇచ్చారు. ఆ ఒప్పందం ద్వారా నెలకు రూ. 17.30 లక్షల అద్దె వస్తోంది.ముంబైలో అమితాబ్‌కు విలువైన ఆస్తులు అనేకం ఉన్నాయి. ఆయన కుటుంబంతో నివసించే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 22A Dispute : తెలుగు రాష్ట్రాల్లో 22 ఏ ( నిషేధిత భూముల జాబితా) వివాదం రచ్చలేపుతోంది. లక్షలాది మంది రైతులు, ఆస్తి యజమానుల పాలిట శాపంగా మారింది సెక్షన్ 22ఏ. తమ కష్టార్జితంతో కొనుగోలు చేసి.. పక్కగా సేల్ డీడ్ ద్వారా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రైవేట్ భూములు కూడా ఆకస్మాత్తుగా ఈ 22 ఏ జాబితాలో చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం ప్రభుత్వ రికార్డుల ప్రక్షాళన విధానంలోని లోపమే అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కేవలం బ్రిటిష్ కాలం పాత పత్రాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంది. ఆ తర్వాత దశాబ్దాల పాటు జరిగిన చట్టబద్ధమైన క్రయవిక్రయాలను, యాజమాన్య బదిలీలను పూర్తిగా విస్మరించింది. ఫలితంగా ఏళ్ల తరబడి రైతుల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల వ్యవసాయ పట్టాభూములు రికార్డుల్లో రాత్రికి రాత్రే ప్రభుత్వ ఖాతాల్లోకి చేరిపోయాయి. ప్రభుత్వ సాంకేతిక తప్పిదం వల్ల ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భూములపై క్రయవిక్రయాల హక్కులు కోల్పోయి యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై సెంటర్ ఫర్ లిబర్టీ అనలిస్ట్ నల్లమోతు చక్రవర్తి విశ్లేషించారు. రికార్డుల అప్ డేట్ లో భాగంగా జరిగిన ఈ చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రస్తుత గందరగోళానికి మూలకారణమని స్పష్టం చేశారు. కింది స్థాయిలోని లావాదేవీల చరిత్రను పరిగణలోనికి తీసుకోకుండా.. ఏకపక్షంగా సామాన్య భూములను 22ఏ జాబితాలో చేర్చడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని నల్లమోతుల వివరించారు. ఈ అన్యాయంపై ముఖ్యంగా ఏపీలో బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు

Hyderabad Real Estate : నిజాంల నగరం హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ సిటీగా మారిపోయింది. ఓవైపు ఓల్డ్ సిటీ నగర చారిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిస్తే మరోవైపు ఐటీ సిటీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇలా పాత కొత్తల కలయికతో హైదరాబాద్ నగరం ముందుకు సాగుతోంది... డెవలప్మెంట్ కు కొత్త అర్థం చెబుతోంది. హైదరాబాద్ అభివృద్ధి గురించి తెలియాలంటే ఇక్కడి రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు కొండలు, గుట్టలతో బీడుభూమిగా ఉన్నప్రాంతం ఐటీ విప్లవంతో కోట్లకు పడగలెత్తింది. ఒకప్పుడు హైదరాబాద్ లో రిచ్చెస్ట్ ఏరియా అంటే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్... కానీ ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, రాయదుర్గం వంటి ప్రాంతాలు వాటిని తలదన్నేలా మారాయి. ఇక్కడ భూముల ధరలు వందలు కోట్లు పలుకుతున్నాయి. గతంలో హైదరాబాద్ శివారు కోకాపేట నియోపోలిస్ లో ఎకరా భూమి రూ.100 కోట్లు పలికితేనే అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత రాయదుర్గం నాలెజ్డ్ సిటీలో టిజిఐఐసి నిర్వహించిన ఈ-వేలంలో రికార్డు స్థాయిలో రూ.237 కోట్లకు ఎకరం పలికింది. ఈ ధర రియల్ ఎస్టేట్ పండితులనే అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఆల్ టైమ్ రికార్డును బద్దలుగొట్టేందుకు రంగం సిద్దం అవుతోంది... అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంలో భూమిని అమ్మబోతోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం లోని ఐటిసి కోహినూర్ ఎదురుగా సర్వే నెంబర్ 83/1 లో గల 10.63 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఇటీవల మే నెలలో ఈ ప్రాంతంలోని భూమిని ఎకరం కనీస ధర రూ.139 కోట్లకు వేలం పెడితే ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. కాబట్టి ఈ నెలలో నిర్వహించే వేలంలో కనీస ధర రూ.175 కోట్లుగా నిర్ణయించింది టిజిఐఐసి. అయినా ఈ రాయదుర్గం భూమిని దక్కించుకునేందుకు పలు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి... దీంతో ఈసారి ఆల్ టైమ్ రికార్డు ధర నమోదయ్యే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణుల

క్రికెట్లో అద్భుతమైన ఆరంభం.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. కానీ రిటైర్మెంట్ తర్వాత మాత్రం ఉద్యోగం కోసం తలుపులు తట్టాల్సిన పరిస్థితి. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మాథ్యూ సింక్లెయిర్ జీవితం ఈ రెండు భిన్నమైన దశలకు నిదర్శనంగా నిలిచింది. టెస్టు అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేసిన ఈ బ్యాటర్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొద్దికాలానికే ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు. 1999లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన సింక్లెయిర్ 214 పరుగులతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై మరో టెస్టులో 204 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున 33 టెస్టులు, 54 వన్డేలు ఆడిన ఆయన.. దేశవాళీ క్రికెట్లోనూ అద్భుతమైన రికార్డు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 36 సెంచరీలు, 50కి పైగా బ్యాటింగ్ సగటు ఉన్నప్పటికీ.. రిటైర్మెంట్ తర్వాత ఆ అనుభవం ఉద్యోగ మార్కెట్లో పెద్దగా ఉపయోగపడలేదు. 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సింక్లెయిర్‌కు ఊహించని సమస్య ఎదురైంది. ఆయనకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేయకపోవడం, వ్యాపార రంగంలో అనుభవం లేకపోవడం ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న సమయంలో పెద్ద అడ్డంకిగా మారాయి. క్రికెట్లో 20 ఏళ్ల అనుభవం ఉన్నా.. కంపెనీలకు కావాల్సింది డిగ్రీ, వృత్తిపరమైన అనుభవం కావడంతో వరుసగా తిరస్కరణలు ఎదురయ్యాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. తన ఇద్దరు చిన్న పిల్లలను పోషించేందుకు సింక్లెయిర్ న్యూజిలాండ్ ప్రభుత్వ నిరుద్యోగ భృతి కోసం కూడా నమోదు చేసుకున్నారు. తాను అంతర్జాతీయ క్రికెటర్‌నని చెప్పుకుని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లడం తన జీవితంలో అత్యంత కష్టమైన అనుభవాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు వేలాది మంది అభిమానించిన క్రికెటర్.. కుటుంబాన్ని నడిపించేందుకు ఉద్యోగం కోసం వెతకాల్సి వచ్చింది. ఒక దశలో మాజీ న్యూజిలాండ్ ఓపెనర్ మార్క్ రిచర్డ్సన్ నిర్వహించిన రేడియో కార్యక్రమానికి ఫోన్ చేసిన సింక్లెయిర్.. “నా అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ చేశాను” అంటూ తనను పరిచయం చేసుకుని, ఏదైనా

రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లకు కూడా.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ అనుమతులకు 50శాతం టీడీఆర్ ఇచ్చినా చాలు.. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఊతమిచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ సిటీ: ట్రాన్స్ఫరబుల్ డెవల్‌పమెంట్ రైట్స్ (టీడీఆర్)పై చిక్కుముడులు వీడాయి. హెచ్ఎండీఏ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు టీడీఆర్ తీసుకోవడంపై భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులన్నింటికీ టీడీఆర్‌లను జారీ చేసే అధికారం ఆ సంస్థకే కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్‌లను ఎవరు జారీ చేయాలనే దానిపై ఇప్పటివరకు సందిగ్ధత నెలకొని ఉండేది. ఏ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ/ఎంఎంసీ)పరిధిలో భూ సేకరణ చేస్తే సంబంధిత కార్పొరేషనే ఇప్పటివరకు టీడీఆర్ జారీ చేసేది. అయితే, రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రతన్‌టాటా రేడియల్ రోడ్డుకు పరిహారంగా టీడీఆర్ కావాల్సినవారు ఎంఎంసీని సంప్రదించాలా? హెచ్ఎండీఏను సంప్రదించాలా? లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని సంప్రదించాలా అనే సందేహం ఉండేది. ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీనే (హెచ్ఎండీఏ) టీడీఆర్ జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ టీడీఆర్‌లను హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో హెచ్ఎండీఏ పరిధిలో భూసేకరణ, అభివృద్ధి పనులకు ఇక మరింత ఊతం లభించనుంది. బిల్డ్నౌలోనే సింగిల్ బ్యాంకు టీడీఆర్ పొందిన నిర్వాసితులు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు ప్రత్యేకంగా వెబ్సైట్లోనే టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేశాయి. అయితే, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఎంఎంసీ, సీఎంసీలు, పెరీ అర్బన్ రీజియన్ పరిధిలో ఎఫ్సీడీఏలు వచ్చాయి. దీంతో రాష్ట్రం మొత్తానికి ఒకే టీడీఆర్ బ్యాంకును బిల్డ్ నౌలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక టీడీఆర్‌ను పలు నిర్మాణ అనుమతులకు వినియోగిస్తూ తప్పదోవ
హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో స్థలాల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. 15వ ఫేజ్‌లో నిర్వహించిన ప్లాట్ల వేలంలో గజం గరిష్ఠంగా రూ.2.14 లక్షలు పలికింది. కీలక ప్రాంతంలో ఉన్న నివాస స్థలాలకు డిమాండ్ఉన్నప్పటికీ వేలంలో పాల్గొనేందుకు ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించకపోవడం గమనార్హం. మొత్తం 24 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. 12 స్థలాలకే పోటీదారులు ముందుకు వచ్చారు. హౌసింగ్ బోర్డు పశ్చిమ డివిజన్ పరిధిలోని 15వ ఫేజ్ ప్లాట్లకు శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ సామాజిక భవనంలో వేలం నిర్వహించారు. వేలంలో పలువురు బిడ్డర్లు పాల్గొని పలు స్థలాలకు పోటీ పడ్డారు. కొన్ని ప్లాట్లు గజం రూ.1.46 లక్షల చొప్పున కూడా ధర పలికాయి. అయితే మొత్తం ప్లాట్లతో పోలిస్తే పోటీ తక్కువగా ఉండటంతో వేలం ప్రక్రియ రెండు గంటల్లోపే ముగిసింది.అధికాదాయ వర్గాలకు కేటాయించిన నాలుగు ప్లాట్లలో రెండు స్థలాలు విక్రయమయ్యాయి. వాటిలో 266.66 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ నంబర్ 105కు అత్యధిక డిమాండ్ కనిపించింది. ఈ ప్లాట్‌కు గజం రూ.2.14 లక్షల ధర పలకడంతో హౌసింగ్ బోర్డు అధికారులు నిర్ణయించిన ధరలపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని ప్రముఖ నివాస ప్రాంతాల్లో స్థలాల కొరత, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాల నేపథ్యంలో కేపీహెచ్‌బీకి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉందని ఈ ధరలు సూచిస్తున్నాయి. వేలంలో మొత్తం 12 స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.39,30,04,251 ఆదాయం సమకూరింది. విక్రయమైన స్థలాల పరిమాణం, కేటగిరీ, బిడ్డింగ్‌లో నమోదైన ధరల ఆధారంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయం లభించింది. మరోవైపు మిగిలిన స్థలాలకు కూడా భవిష్యత్తులో నిర్వహించే వేలాల్లో మంచి ధర లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాలు, విద్యా సంస్థలు, మెట్రో, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలకు అనుసంధానం ఉండటంతో కేపీహెచ్బీలో స్థిరాస్తులకు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చే స్థలాల

ఒకప్పుడు బాలీవుడ్ అగ్ర కథానాయికగా రాణించిన ప్రీతి జింటా, సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయనున్నారు. ఆమిర్ ఖాన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న 'బట్వారా 1947' అనే చారిత్రక చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు. సన్నీ డియోల్, షబానా అజ్మీ, కరణ్ డియోల్, అలీ ఫజల్ వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ప్రీతి జింటాకు ఉన్న భారీ ఆస్తులు, ముఖ్యంగా ఆమె రియల్ ఎస్టేట్ పెట్టుబడుల వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ప్రస్తుతం ప్రీతి తన భర్త జీన్ గుడ్ఎనఫ్, పిల్లలు జై, జియాలతో కలిసి అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో నివసిస్తున్నారు. అక్కడ వారికి సుమారు రూ. 40 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన విల్లా ఉంది. విశాలమైన పెరడు, భారీ కిటికీలతో కూడిన ఈ నివాసానికి సంబంధించిన ఫోటోలను ఆమె అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఉంటారు.భారత్‌లో, ముఖ్యంగా ముంబైలోని అత్యంత ఖరీదైన పాలి హిల్ ప్రాంతంలో ప్రీతి జింటా భారీస్థాయిలో ఆస్తుల క్రయవిక్రయాలు జరిపారు. 2023 అక్టోబర్‌లో అక్కడ 1,474 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన ఆమె, ఆ తర్వాత 2025 నవంబర్‌లో దాదాపు అదే పరిమాణమున్న ఒక ఫ్లాట్‌ను రూ. 14 కోట్లకు పైగా ధరకు విక్రయించారు. అదేవిధంగా, ఈ ఏడాది మార్చి నెలలో అదే భవనంలోని 1,770 చదరపు అడుగుల మరో ఫ్లాట్‌ను రూ. 18.5 కోట్లకు విక్రయించడం గమనార్హం.ఇటీవల 2026 జూన్‌లో

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) తో పాటు ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో (ISRO) చంద్రుడిపై మానవ నివాసం సాధ్యమో, కాదో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు చేపట్టింది... చంద్రయాన్ 1,2,3 పూర్తవగా చంద్రయాన్ 4 కు సిద్దమయ్యింది. అమెరికా అయితే 50 ఏళ్ల కిందటే ఏకంగా మనుషులనే (వ్యోమగాములను) చంద్రుడిపైకి పంపింది. ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే చంద్రుడిపై మనిషి శాశ్వత నివాసం సాధ్యమో, కాదో ఇంకా తేలనేలేదు... అప్పుడే అక్కడ భూముల విక్రయాలు ప్రారంభించి రియల్ ఎస్టేట్ దందా ప్రారంభించాయి కొన్ని సంస్థలు. ఇలా లూనార్ ఎంబసీ, లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ వంటి సంస్థలు చంద్రుడిపై భూములను విక్రయిస్తున్నాయి. చాలామంది సెలబ్రిటీలే కాదు సామాన్యులు సైతం చంద్రుడిపై భూములు కొంటున్నారు. 1980లలో డెన్నిస్ హోప్ అనే వ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష చట్టంలోని ఓ లొసుగును వాడుకుని చంద్రుడిపై భూముల అమ్మకాన్ని ప్రారంభించాడు. దేశాలు చంద్రుడిని సొంతం చేసుకోలేవు కానీ, వ్యక్తులు కొనడాన్ని ఏ చట్టం ఆపలేదని అతను వాదిస్తున్నాడు. ఇలా చంద్రుడిపై భూములను అమ్మడానికే 'లూనార్ ఎంబసీ' అనే సంస్థను స్థాపించాడు… ఇప్పటివరకు చాలామందికే అమ్మాడు. ఇలా చంద్రుడిపై స్థలం కొన్నవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే చంద్రుడిపై భూమిని కొనుగోలుకు చట్టబద్దత లేదని తెలిసినా చాలామంది సరదాగా కొంటున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులకు గిప్టుగా ఇవ్వడానికి లేదంటే అంతరిక్ష అంశాలపై ఆసక్తితో చంద్రుడిపై భూమిని కొంటున్నారు. అందుకే నాామమాత్రపు ధరలకే చంద్రుడిపై భూమి లభిస్తోంది… ల్యాండ్ డీడ్, మ్యాప్, ఇతర పత్రాలు ఉన్నప్పటికీ చంద్రుడిపై ఎవరికీ, ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు. స్థలం ధర : చంద్రుడిపై ఎకరం భూమి కొనడానికి సగటున 20 నుంచి 40 డాలర్లు ఖర్చు అవుతుంది. మన కరెన్సీలో సుమారు రూ.1,700 నుంచి రూ.3,400

గురుగ్రామ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డీఎల్ఎఫ్ (DLF) సంస్థ మరోసారి రికార్డు స్థాయి ధరలతో వార్తల్లో నిలిచింది. డీఎల్ఎఫ్కు చెందిన ‘ది డాలియాస్’లో వ్యాపారవేత్త మానవ్ సర్దానా రూ.271 కోట్లకు పెంట్‌హౌస్ కొనుగోలు చేయడం దేశంలోనే అత్యంత ఖరీదైన సింగిల్-యూనిట్ రెసిడెన్షియల్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. 17,200 చదరపు అడుగుల సూపర్ ఏరియా, 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉన్న ఈ పెంట్‌హౌస్‌కు సూపర్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షలు, కార్పెట్ ఏరియా ప్రకారం దాదాపు రూ.2.6 లక్షలు ధర పలికింది. అయితే ఈ రూ.271 కోట్ల డీల్ డీఎల్ఎఫ్ గురుగ్రామ్ లగ్జరీ హౌసింగ్ ప్రయాణంలో ఒక్కసారిగా వచ్చిన మైలురాయి కాదు. ‘ది మాగ్నోలియాస్’ నుంచి ‘ది కామెలియాస్’, అక్కడి నుంచి ‘ది డాలియాస్’ వరకు సంస్థ క్రమంగా అత్యంత సంపన్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న ప్రత్యేకమైన రెసిడెన్షియల్ సెగ్మెంట్‌ను నిర్మించింది. డీఎల్ఎఫ్ స్వయంగా గురుగ్రామ్‌లోని ఈ ప్రాజెక్టులను తన ‘సూపర్ లగ్జరీ రెసిడెన్సెస్’ పోర్ట్‌ఫోలియోలో భాగంగా పేర్కొంటోంది. ఈ లగ్జరీ నిచ్చెనలోని పాత మెట్లలో ‘ది మాగ్నోలియాస్’ ఒకటి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ వివరాల ప్రకారం.. ఇక్కడ 4-BHK ఇళ్ల పరిమాణం సుమారు 6,350–6,400 చదరపు అడుగులు ఉండగా, ధరలు దాదాపు రూ.45 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. లాన్ టెర్రస్‌లు, క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, స్కేటింగ్ రింక్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. మాగ్నోలియాస్ తర్వాత డీఎల్ఎఫ్ మరింత ఎత్తైన సెగ్మెంట్‌ను ‘ది కామెలియాస్’తో నిర్మించింది. డీఎల్ఎఫ్ ప్రకారం.. ఇది గోల్ఫ్ లింక్స్‌లోని తన సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ కమ్యూనిటీల్లో అత్యంత విలాసవంతమైన ఆఫర్లలో ఒకటి. గోల్ఫ్ కోర్స్, ల్యాండ్‌స్కేపింగ్, ఆర్కిటెక్చర్, వెల్నెస్, క్లబ్‌హౌస్, వ్యక్తిగతీకరించిన సేవలను ఒకే నివాస అనుభవంలో కలపడం దీని ప్రధాన లక్ష్యం. కామెలియాస్‌లోని నివాసాల పరిమాణం సుమారు 7,350 చదరపు అడుగుల నుంచి 16,290

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ ప్రాపర్టీ వివాదంలో నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా దగ్గుబాటిలకు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని దగ్గుబాటి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్. తుకారాంజీ ఇటీవల తోసిపుచ్చారు. దీంతో నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ యథాతథంగా కొనసాగనుంది. ఈ వ్యవహారంలో నటులతో పాటు నిర్మాత డి. సురేష్ బాబు, డి. అభిరామ్, అకౌంటెంట్ గడ్డం విశ్వనాథం కూడా క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ వివాదం మూలాలు 2014 కాలం నాటి లీజు ఒప్పందంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో దగ్గుబాటి కుటుంబం తమ భూమిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇవ్వగా, వ్యాపారవేత్త కొరే నందు కుమార్ అక్కడ డెక్కన్ కిచెన్ రెస్టారెంట్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులు పెట్టారు. అయితే 2018 నుంచి ప్రాపర్టీ లీజు హక్కులు, స్థలం స్వాధీనం విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2022 నవంబర్‌లో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ 2024 జనవరిలో నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారని బాధితుడు నందు కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు అధికారుల సహకారంతో లీజు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హౌస్ ట్రెస్పాస్, దొంగతనం, క్రిమినల్ కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద నమోదు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ దగ్గుబాటి కుటుంబం 2024 లోనే హైకోర్టును ఆశ్రయించి తమ వాదనలను బలంగా వినిపించింది. ఇది కేవలం లీజు, ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన సివిల్ వివాదమని, కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ సరికాదని

ఒకప్పుడు బాలీవుడ్ ఆఫర్ల కోసమో లేదా సినిమాల ప్రమోషన్ల కోసమో దక్షిణాది నటీనటులు ముంబైకి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు దుమ్మురేపుతుండటంతో ముంబై మహానగరం కూడా దక్షిణాది తారలకు మరో సొంత ఇల్లుగా మారుతోంది. బాలీవుడ్ గుండెకాయ లాంటి బాంద్రా, జూహూ, లోఖండ్వాలా వంటి ప్రైమ్ లోకేషన్లలో సౌత్ స్టార్స్, దర్శకులు వందల కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తూ, భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముంబైలో సౌత్ స్టార్స్ లగ్జరీ ఇళ్లు – అంచనా ధర : పాన్-ఇండియా సినిమాల హవా నడుస్తుండటంతో వరుస షూటింగ్‌లు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, ముంబై ఆధారిత ప్రాజెక్ట్‌ల కోసం దక్షిణాది తారలు తరచూ ముంబైలోనే సమయాన్ని గడపాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే హోటళ్లలో ఉండటానికి బదులుగా తమదైన శైలిలో కోట్లాది రూపాయలతో లగ్జరీ పెంట్ హౌస్‌లు, డ్యూప్లెక్స్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూహూలో లగ్జరీ పెంట్ హౌస్ కోసం ప్రతినెల రూ. 16 లక్షల అద్దె చెల్లిస్తుండగా, ధనుష్ ఏకంగా రూ. 150 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసాడు. ఈ పరిణామం ఇండియన్ సినిమాలో సౌత్ స్టార్లకు పెరుగుతున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కోకాపేట నియోపొలిస్ భూముల వేలంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వేలంలో రికార్డు స్థాయిలో భారీ బిడ్ వేసి ప్లాట్‌ను దక్కించుకున్న వజ్రా కన్స్ట్రక్షన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ నిర్ణీత గడువులోగా నిధులు చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో వేలం నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ.. హెచ్ఎండీఏ సదరు నిర్మాణ సంస్థ భద్రతా డిపాజిట్‌గా చెల్లించిన రూ. 5 కోట్ల అర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD)ని జప్తు చేసింది.కోకాపేట ప్లాట్ నంబర్ 17లోని 4.59 ఎకరాల భూమికి వజ్రా కన్స్ట్రక్షన్స్ ఎకరాకు ఏకంగా రూ. 136.50 కోట్ల చొప్పున బిడ్ దాఖలు చేసి భూములు దక్కించుకుంది. ఈ లెక్కన ఆ భూమి మొత్తం విలువ రూ. 626 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, భూమి కొనుగోలుకు అవసరమైన పూర్తి ఆర్థిక ఇన్వెస్ట్మెంట్ సొంతంగా లేనప్పటికీ.. ప్రాజెక్టు ప్రకటించి ప్రీ-లాంచ్, ఓపెన్ టు పబ్లిక్ విక్రయాల ద్వారా కొనుగోలుదారుల నుంచి ముందస్తుగా నిధులు సమీకరించి ప్రభుత్వానికి చెల్లించవచ్చని ఆ సంస్థ భావించింది. అయితే మార్కెట్లో ఆశించిన స్థాయిలో ప్రీ-లాంచ్ విక్రయాలు జరగకపోవడంతో ఆ వ్యూహం ఫలించలేదు.నిర్ణీత గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవటంతో రూ. 5 కోట్ల డిపాజిట్‌ను హెచ్ఎండీఐ జప్తు చేసింది. ఫలితంగా వజ్రా కన్స్ట్రక్షన్స్ రూ. 600 కోట్లకు పైగా విలువైన కోకాపేట స్థలంతో పాటు రూ. 5 కోట్ల నగదును కోల్పోయి రెండు రకాలుగా నష్టాన్ని మూటగట్టుకుంది. భవిష్యత్ ప్రాజెక్టు విక్రయాలను నమ్ముకొని ఆర్థిక సామర్థ్యానికి మించి బిడ్లు వేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చెల్లింపులు జరగని నేపథ్యంలో ప్లాట్ నంబర్ 17 కింద ఉన్న 4.59 ఎకరాల స్థలానికి త్వరలోనే మళ్లీ పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. గత వేలంలో ఎకరాకు 136.50 కోట్ల కోట్లకు పైగా

Trump Towers Hyderabad : హైదరాబాద్ మహానగరంలో స్కైలైన్‌లో మరో అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. కోకాపేట్లో ట్రంప్ బ్రాండ్‌తో నిర్మించనున్న భారీ టవర్స్ ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారాయి. రెండు ఎత్తైన టవర్లను కలుపుతూ ప్రత్యేకమైన స్కై బ్రిడ్జ్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సుమారు 242 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న ఈ టవర్స్ హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్‌కు కొత్త రూపాన్ని తీసుకురానున్నాయి. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నగరంలోని ప్రీమియం హౌసింగ్ మార్కెట్లో సంచలనం సృష్టించేలా కనిపిస్తోంది. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో అడుగు పెట్టింది. భారతదేశంలో ట్రంప్ బ్రాండ్‌కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డైవలపర్స్ హైదరాబాద్‌కు చెందిన ఇరా రియల్టీతో కలిసి ఈ ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును నిర్మాణం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కోకాపేట్ గోల్డెన్‌మైల్ రోడ్డులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65 అంతస్తులతో మొత్తం రెండు టవర్లను అభివృద్ధి చేస్తున్నారు. 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం అవుతున్న ఈ టవర్స్‌లో మొత్తం 16 పెంట్హౌస్లతోపాటు 450 అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి ధరను మినహాయించి రూ.1,700 కోట్ల నుంచి రూ. 1,800 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రెబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి తెలిపారు. ఈ టవర్స్ భారతదేశంలో ఎనిమిదో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్టు. అయితే, దక్షిణ భారతదేశంలో మాత్రం ఇదే మొదటిది కావడం విశేషం. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 2031వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ట్రంప్ బ్రాండ్ భారత మార్కెట్లోకి 2014లో అడుగు పెట్టింది. ముంబై, పుణె, గురుగ్రామ్, నోయిడా, కోల్‌కతా వంటి నగరాల్లో ఇప్పటికే ఈ సంస్థ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్ ప్రాజెక్టు నిర్మాణ పనులు

హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఒక పెంట్‌హౌస్ ఏకంగా రూ.62 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'ట్రంప్ ఆర్గనైజేషన్' నిర్మిస్తోంది. 'ట్రంప్ టవర్స్' పేరుతో భాగ్యనగరంలోకి అడుగుపెడుతున్న ఈ ప్రాజెక్ట్‌తో దక్షిణ భారత మార్కెట్లోకి ఆ సంస్థ తొలిసారి ప్రవేశించింది.హైదరాబాద్‌కు చెందిన ఇరా రియల్టీ, ట్రంప్ బ్రాండ్‌కు భారత అధికారిక ప్రతినిధి అయిన ట్రెబెకా డెవలపర్స్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మంగళవారం ఈ ప్రాజెక్ట్ వివరాలను ట్రెబెకా వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి వెల్లడించారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్లో 4 ఎకరాల విస్తీర్ణంలో 65 అంతస్తులతో రెండు ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నట్లు వారు తెలిపారు. మొత్తం 22 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో 450 లగ్జరీ అపార్ట్మెంట్లు, 16 పెంట్‌హౌస్‌లు ఉంటాయి.ఈ ప్రాజెక్ట్ కోసం భూమి విలువ మినహా రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కల్పేష్ మెహతా వివరించారు. ఈ ఏడాది చివరికల్లా నిర్మాణ పనులు ప్రారంభించి, రాబోయే నాలుగేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫ్లాట్ల అమ్మకాల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.ట్రంప్ టవర్స్‌లో 3.5, 4 బీహెచ్‌కే ఫ్లాట్ల ధరలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉంటాయని మెహతా తెలిపారు. ఈ

Hyderabad: అత్యంత ఖరీదైన 450 ఫ్లాట్లు: రేరా అనుమతి పొందిన ట్రంప్ టవర్స్ హైదరాబాద్: నగరంలోని కోకాపేటలో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. 65 అంతస్తులతో రెండు టవర్ల నిర్మాణం జరగనుంది. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు సంయుక్తంగా వీటి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాయి. ఈ టవర్లలో అతి ఖరీదైన 450 ఫ్లాట్లు ఉండనున్నాయి. ట్రంప్ టవర్స్‌కు ఇప్పటికే రెరా అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్న ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు వెల్లడించాయి

భారతీయ రియల్ ఎస్టేట్ రంగ చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఉన్న డీఎల్ఎఫ్ లగ్జరీ ప్రాజెక్ట్ ‘ది దాలియాస్’లోని ఒక సూపర్ లగ్జరీ పెంట్‌హౌస్ ఏకంగా రూ.271 కోట్లకు అమ్ముడై దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ ‘ఇంపీరియల్ ఆటో’ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మానవ్ సర్దానా ఈ డీల్‌ను దక్కించుకున్నారు. ఈ ప్రాపర్టీ ధరల వివరాలు రియల్టీ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ పెంట్‌హౌస్ సూపర్ ఏరియా 17,200 చదరపు అడుగులు కాగా కార్పెట్ ఏరియా 10,500 చదరపు అడుగులు. సూపర్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు రూ.1.58 లక్షలు పడగా, కార్పెట్ ఏరియా లెక్కన చదరపు అడుగుకు ఏకంగా రూ.2.6 లక్షలు వ్యయమైంది. సాధారణంగా ముంబైలోని వర్లీ, మలబార్ హిల్స్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇటువంటి భారీ ధరలు కనిపిస్తాయి. అయితే గురుగ్రామ్‌లో ఒక్క సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ రూ.271 కోట్లకు అమ్ముడవడం భారతదేశపు అత్యంత ఖరీదైన హౌసింగ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. 1969లో ఫరీదాబాద్‌లో ఎస్.బి. సర్దానా, జగ్జీత్ సింగ్‌లు ప్రారంభించిన ఇంపీరియల్ ఆటో ఇండస్ట్రీస్ ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది. ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్స్ (పైప్లైన్లు, హోస్ అసెంబ్లీలు) తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థకు భారత్‌లో 20కి పైగా, విదేశాల్లో 3 ఉత్పాదన కేంద్రాలు ఉన్నాయి. గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం 'వార్బర్గ్ పింకస్' ఈ సంస్థను కొనుగోలు చేసుకున్నప్పటికీ సర్దానా కుటుంబం ఇంపీరియల్ ఆటో గ్రూప్‌లో క్రియాశీలకంగా కొనసాగుతోంది. ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు) ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు)
హైదరాబాద్ నగర పరిధిలో భూముల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమీకరించడమే ధ్యేయంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA)మరొక భారీ ఈ-వేలానికి శ్రీకారం చుట్టింది. అత్యంత ఖరీదైన కోకాపేట్‌లోని నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలో ఉన్న విలువైన భూములతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్లాట్లను విక్రయించడానికి అధికారులు నోటిఫికేషన్ సిద్ధం చేశారు. గతంలో డిసెంబర్ 2025లో నిర్వహించిన నియోపోలిస్ భూముల వేలంలో ఎకరానికి అత్యధికంగా రూ. 131 కోట్లు, రూ. 118 కోట్ల వరకు ధర పలికి హెచ్ఎండీఏకి సుమారు రూ. 1000 కోట్ల ఆదాయం సమకూరింది.అంతకుముందు వివిధ దశల్లో చేపట్టిన వేలం పాటల ద్వారా సుమారు రూ. 3,708 కోట్లు వచ్చాయి. గతంలో నమోదైన రికార్డు ధరలను ప్రాతిపదికగా తీసుకుంటూ.. ప్రస్తుతం నియోపోలిస్ లేఅవుట్లోని 4.59 ఎకరాల భూభాగానికి కనీస ధరగా ఎకరానికి రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. అలాగే గోల్డెన్ మైల్ లేఅవుట్లోని 0.70 ఎకరాల భూమికి ఎకరానికి రూ. 70 కోట్ల ప్రారంభ ధరను నిర్ణయించారు. ఈ ప్రధాన రెండు లేఅవుట్లకు సెప్టెంబర్ 9న ఈ-వేలం జరగనుంది.ఈ వేలం ప్రక్రియ మొత్తం ఆగస్టు 24న ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు కొనసాగనుంది. కోకాపేట్ మాత్రమే కాకుండా నగర శివారులలో ఉన్న పలు రెసిడెన్షియల్ లేఅవుట్లలో కూడా భూములను హెచ్ఎండీఏ అమ్మకానికి ఉంచింది. కూకట్పల్లి సమీపంలోని హైదరాబాద్ నగర్, మోకిలా, బాచుపల్లి, కొత్తూర్ సమీపంలోని ఇన్ముల్‌నర్వ లేఅవుట్లతో పాటు బైరాగిగూడ, చందానగర్, సూరారం, కాప్రా, కిష్టారెడ్డిపేట్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను వేలంలో విక్రయించనున్నారు.ఈ వేలంలో భాగంగా మోకిలా లేఅవుట్లోని 300 నుంచి 500 చదరపు గజాల ప్లాట్లకు చదరపు గజానికి కనీస ధర రూ. 55 వేలు, బాచుపల్లి లేఅవుట్లోని ప్లాట్లకు రూ. 45 వేలుగా నిర్ణయించారు. అలాగే సూరారంలో ఉన్న 2,420 చదరపు గజాల ల్యాండ్ పార్సెల్‌కు గజానికి రూ. 75