
Prakash Raj: యువత భయానికి.. మన మహాప్రభువు రీల్స్ చేసుకుంటున్నాడు
Prakash Raj: యువత భయానికి.. మన మహాప్రభువు రీల్స్ చేసుకుంటున్నాడు
© 2026 nimisham.in

Prakash Raj: యువత భయానికి.. మన మహాప్రభువు రీల్స్ చేసుకుంటున్నాడు

భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. భారతీయ సనాతన సంస్కృతిలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత అనన్యసామాన్యం. గతంలో ‘శంకరాభరణం’, ‘స్వరాభిషేకం’ వంటి క్లాసిక్స్ తెలుగు తెరపై సంగీత విప్లవాన్ని సృష్టించాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి అరుదైన కర్ణాటక శాస్త్రీయ సంగీత నేపథ్యంలో రూపొందిన సరికొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ (Jagamae Sangeetham). ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగా డాటర్ సుష్మిత కొణిదెల ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ‘18 పేజెస్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా.. ఈ చిత్ర బృందం NSR ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ప్రముఖ సిరీస్ 'బందిష్ బ్యాండిట్స్' చూసినప్పుడు చాలా నచ్చింది. దాన్ని కేవలం రీమేక్ చేయకుండా, మన కర్ణాటక సంగీతంలోని లోతైన కల్చర్‌తో, మన తెలుగు మూలాల నుంచి పుట్టిన కథగా తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని భావించాం. సంగీతంతో రొమాన్స్ చేయగల అనుభవం, మెచ్యూర్డ్ ఫిల్మ్ మేకింగ్ నైపుణ్యం ఉండటం వల్లే సూర్యప్రతాప్‌ను డైరెక్టర్‌గా ఎంచుకున్నాం. నా గత సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేర్’లో నటించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్‌లతో మళ్లీ పనిచేయడం కుటుంబంతో ఉన్నట్లే అనిపించింది. కథకు తగ్గ స్కోప్ ఉన్నందున ప్రైమ్ వీడియోతో చర్చించి భవిష్యత్తులో తప్పకుండా ‘సీజన్ 2’ కూడా తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నప్పుడు, డైరెక్టర్ ప్రతాప్ చెప్పే విధానం

సంగీత దర్శకుడిగా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం ఇమ్మోర్టల్. కయాడు లోహర్ కథానాయికగా నటించిన ఈ వ్యాంపైర్ ఫాంటసీ హారర్ రొమాన్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. పక్కింటి అమ్మాయితో సాధారణంగా మొదలైన ఒక ప్రేమకథ చివరకు ఎలా మారింది అనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రాత్రిపూట గది తాళం రంధ్రం నుంచి ఒక భయంకరమైన బ్యాట్ ముఖం ఉన్న జంతువు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ కథ ఒక తీవ్రమైన సర్వైవల్ నైట్‌మేర్‌గా మారుతుంది. ఈ సినిమాకు మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ప్రతిష్టాత్మకంగా సంగీతాన్ని అందించారు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అలాగే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డు నుంచి యూ సర్టిఫికేట్‌ను విజయవంతంగా పొందింది. ఈ హారర్ రొమాన్స్ డ్రామాను కేవలం ఒక్క భాషకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. ఫలితంగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. సినిమా థ్రిల్లింగ్ అంశాలతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. విభిన్నమైన వ్యాంపైర్ ఫాంటసీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాల్సి ఉంది. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు టికెట్లు అందుబాటులోకి వచ్చినందున బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులు ఈ విభిన్నమైన హారర్ థ్రిల్లర్

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

ఆగస్టు 26న నేపాల్‌లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి. అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్‌ను ఉంచారు. ఆ పైప్, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. "అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి" అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు

సాఫీగా సాగిపోతూ ముగింపుకు వచ్చింది అనుకున్న కార్తీక దీపం సీరియల్ లో ఇటీవలే మాలిని తన విలనిజం చూపించడం మొదలుపెట్టింది. మాలిని పాత్ర ఎంట్రీతో కార్తీక దీపం సీరియల్ అనేక మలుపులు తిరిగింది. దీంతో మాలిని పాత్ర చేసిన కన్నడ నటి తేజస్విని ప్రకాష్ ఫొటోలు వైరల్ గా మారాయి. అనేక కన్నడ సీరియల్స్ లో నటించిన తేజస్విని కన్నడ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. తెలుగులో లక్ష్మి రావే మా ఇంటికి సీరియల్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ తో ఒక్కసారిగా తన విలనిజం బయటపెట్టి వైరల్ అయింది

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు

నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ ఇంటి వీడియో ఇటీవల కాలంలో వైరల్‌గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటో తాజాగా ఇంటి ఓనర్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ భవనం తాలూకు వీడియో ఇటీవల నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో ఈ భవనం ఉంది. చుట్టూ ఇళ్లన్నీ జలసమాధి అవుతున్నా ఆ భవనం మాత్రం నిలబడ్డ తీరు జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. వరద సమయంలో భవనంలోనే ఉన్న ఆయన ఆ భయానక అనుభవం గురించి పలు విషయాలు చెప్పారు. ‘వరద చుట్టుముట్టే సమయంలో భవనంలో నాతో నా కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. మొదట నేను బయట ఒక షాపు వద్ద ఉండగా వరద అలర్ట్ అందింది. వెంటనే నేను ఇంటికి వెళ్లాను. అందరం బయటకు వెళదామనుకున్నాము. కానీ అప్పటికే బయట నీటి ఉధృతి పెరిగింది. దీంతో, మేము నాలుగో అంతస్తుకు వెళ్లాము. అక్కడికి కూడా నీరు వచ్చేయడంతో చివరకు భవనంపైకి వెళ్లాము. ఆ సమయంలో నా ఆలోచన అంతా కుటుంబంపైనే ఉంది’ ‘ఆ సమయంలో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు. మాకేమైనా అయితే వాడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెరిగిపోయింది. అదృష్టవశాత్తూ కొంత సేపటికి వరద ఉధృతి తగ్గింది. మాకు ప్రాణాపాయం తప్పింది’ అని ఆయన చెప్పారు. దాదాపు గంట పాటు ఆ కుటుంబం భవనంపైనే ఉండిపోయింది. ఆ తరువాత స్థానికులు కొందరు వచ్చి వారిని రక్షించారు. తమ ఇల్లు అంతటి వరద ఉధృతిని తట్టుకోవడానికి కారణం ఇంటి నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలే అని ఆయన చెప్పారు. ‘అది దాదాపు 40 ఏళ్ల నాటి భవనం. అప్పట్లో సిమెంట్, ఇతర సామగ్రి నాణ్యత ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. ఇంటి నిర్మాణం విషయంలో చాలా ఆలోచించి అనేక జాగ్రత్తలు

ఎమ్మెల్యే పుట్టాపై కిడ్నాప్ కేసు బెంగళూరు బీజేపీ నేత అపహరణ రాజరాజేశ్వరినగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది Putta Sudhakar Yadav: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌పై బెంగళూరులో సంచలన కేసు నమోదైంది. బెంగళూరుకు చెందిన భారతీయ జనతా పార్టీ నేత డాక్టర్ రవిప్రకాష్‌ను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. నాలుగు విభిన్న వాహనాల్లో వచ్చిన దుండగులు ఆయనను అపహరించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై బాధితుడు రవిప్రకాష్ భార్య సబీనా వెంటనే స్పందించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ హైడ్రామా వెలుగులోకి వచ్చింది. Narendra Modi: బంగారం కొనకండి.. విదేశీ ప్రయాణాలకు బ్రేక్ వేయండి.. ప్రధాని మోదీ సంచలన పిలుపు పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు: ఎమ్మెల్యేతో పాటు కుమారుడిపై కేసు నమోదు: ఈ కిడ్నాప్ వ్యవహారంపై డాక్టర్ రవిప్రకాష్ భార్య సబీనా బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన భర్త అపహరణ వెనుక మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్(Putta Sudhakar Yadav)తో పాటు ఆయన కుమారుడు పుట్టా రవికుమార్ ప్రమేయం ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాప్‌నకు గల ఆర్థిక లేదా రాజకీయ కోణాలపై పోలీసులు దృష్టి సారించి శోధిస్తున్నారు

Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్‌కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్‌పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్‌కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్‌కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్‌కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’

జీవీ ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. తాజాగా డిఎన్‌సి థియేటర్స్ సర్క్యూట్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక బుకింగ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూసిన సినీ ప్రియులు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో జీవీ ప్రకాష్, కయాదు లోహర్‌ల వర్షంలో సాగే రొమాంటిక్ దృశ్యాన్ని పోస్టర్ ద్వారా ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రకటించిన ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని ప్రముఖ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని థియేటర్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కథలో కథానాయకుడు తానుష్టపడిన యువతి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందో చూపిస్తారు. దీంతో సాధారణంగా ప్రారంభమయ్యే రొమాంటిక్ ప్రయాణం ఒక రాత్రిలోనే భయానక భ్రమగా మారుతుంది. ఇదిలా ఉండగా 4,000 సంవత్సరాల పూర్వంనాటి వింత కథతో పాటు గబ్బిలం రూపంలో ఉండే భయానక జీవి ఈ కథలో కీలకంగా మారనుంది. ఇటీవలే ధనుష్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫలితంగా సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాషలో విడుదలైన టీజర్ కూడా విశేషమైన స్పందనను దక్కించుకుంది. ఈ చిత్రానికి మరియప్పన్ చిన్న దర్శకత్వం వహించగా, సామ్ సిఎస్ సంగీతం అందించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషలలో కూడా ఒకేసారి విడుదల కానుంది. ప్రస్తుతం ప్రేక్షకులు సెప్టెంబర్ 4వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఏ విధమైన ఘనవిజయాన్ని సాధిస్తుందో

ఇటీవల ఇరుముడి, విశ్వనాధ్ అండ్ సన్స్ వంటి హిట్స్ లైంలైట్లో ఉన్నాడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar). ప్రస్తుతం తన కొత్త సినిమా ‘ఇమ్మోర్టల్’ (సెప్టెంబర్ 4 విడుదల) ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఓపెన్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన మాజీ భార్య సైంధవి (Saindhavi)తో ఉన్న రిలేషన్షిప్ గురించి ఆయన మాట్లాడిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భార్యాభర్తలుగా బంధం తెగిపోయినా తమ మధ్య స్నేహం మాత్రం అలాగే ఉందని జీవీ ప్రకాష్ స్పష్టం చేశారు. చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ కావడంతో ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ చెరిగిపోదని, విడాకులు తీసుకున్నంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. వివాహబంధం ముగిసినా ఒక మంచి రిలేషన్‌ను మెంటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటున్నామని తెలిపాడు జీవీ. కూతురు అన్వి పెంపకం విషయంలోనూ ఇద్దరం కలసి బాధ్యతలు షేర్ చేసుకుంటున్నట్టు వెల్లడించాడు. అన్వి తన ప్రాణమని, జీవితంలో సైంధవి, కూతురు ఇద్దరూ అత్యంత కీలకమైన వ్యక్తులేనని చెబుతున్నాడు. విడిపోయినప్పటికీ పాప భవిష్యత్తు కోసం బాధ్యతాయుతంగా కలసి ముందడుగు వేస్తున్న జీవీ ప్రకాష్ తీరును కొందరు నెటిజన్లు అభినందిస్తుంటే, మరికొందరు మాత్రం విడాకులు తీసుకోవడానికి అసలు కారణమేంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు

తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్న మండాడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ప్రమాదకర అనుభవాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమిళనాడు తీర ప్రాంతంలో జరిగే సాంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సముద్రంలోనే 45 రోజులపాటు క్లైమాక్స్ చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం సముద్రంలోకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్లమని, ఈ ప్రాజెక్ట్ కోసం తాను దాదాపు 100 రోజులు కేటాయించానని ఆయన చెప్పారు. సముద్రంలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో పడవలు తిరగబడటం వంటి ప్రమాదాలు పలుమార్లు జరిగాయని, నాలుగైదు సార్లు ఇక అయిపోయాం అనుకునే స్థాయికి వెళ్లామని సుహాస్ వివరించారు. తన కెరీర్లోనే ఇది అత్యంత ప్రమాదకరమైన అనుభవమని, ఇకపై ఇలాంటి లైఫ్ రిస్క్ ఉన్న సినిమాలు చేయనని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడు మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ సుమారు రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వెట్రిమారన్ వ్యవహరిస్తుండగా, సముద్రం పైన నైపుణ్యంతో నావికులను నడిపించే నాయకుడి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో హీరోగా సూరి ముత్తుకాళి పాత్రలో నటిస్తుండగా, సుహాస్ విలన్ షేడ్స్ ఉన్న సత్తపులి పాత్రలో నటిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్ జై శంకర్, బాల సరవణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. సముద్రంలో నిజమైన అలలు, గాలి దిశ ఆధారంగా పడవను నడపడం అత్యంత కష్టమైన ప్రక్రియ కావడం వల్ల చిత్రీకరణ సమయంలో యూనిట్‌కు తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 2025 అక్టోబర్ 3న రామనాథపురం జిల్లా తొండి తీరంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో సాంకేతిక సిబ్బంది ఉన్న పడవ బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగింది. ఇదిలా
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా, వైవిధ్యమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీవీ ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గాయని సైంధవితో పెళ్లి బంధం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జీవీ ప్రకాష్ తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య వైవాహిక జీవితం ముగిసినంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్కూల్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ తగ్గిపోదని తెలిపారు. అందుకే విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మంచి మిత్రులుగా రిలేషన్ మెంటైన్ చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు అన్వి బాధ్యతల గురించి కూడా జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కూతురు అన్వి తన ప్రాణమని, ఆమె భవిష్యత్తు కోసం ఇద్దరం బాధ్యతగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో సైంధవి, అన్వి ఇద్దరూ తనకు ఎంతో కీలకమైన వ్యక్తులని, ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటూ పాప పెంపకం విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదివరకు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శవంతమైన జంటగా పేరొందిన జీవీ ప్రకాష్, సైంధవిలు ఒకరినొకరు ప్రేమించుకుని 2013లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించారు. విడిపోయిన సమయంలో మీడియాలో రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ, వారు ఎంతో పరిణతితో వ్యవహరించారు. సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న జీవీ

హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మృతురాలు కమలమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహిళ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శ్రీకృష్ణ హాట్ చిప్స్ యజమాని ప్రకాష్.. నగదు, బంగారు కమ్మల కోసం కమలమ్మను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. కమలమ్మ జీతం తీసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రకాష్ ఆమెను తన షాపులోకి పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. కమలమ్మ షాపులోకి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే షాపులోకి వెళ్లిన అనంతరం ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కమలమ్మ వద్ద ఉన్న రూ.10 వేల నగదు, అర తులం బంగారు కమ్మల కోసమే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ వివాదంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. తన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆమె తేల్చిచెప్పారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్‌పై తనకు గౌరవం ఉందన్నారు. అయితే రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తన విమర్శలను సమర్థించుకున్నారు. ఆ ఆరోపణలు ఇప్పటివరకు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిత్వం చుట్టూ మొదలైన వివాదమే తాజా రాజకీయ ఉద్రిక్తతకు ప్రధాన కారణంగా మారింది. పరకాలకు వచ్చిన రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటాన్ని సుస్మిత ప్రశ్నించారు. ఆగస్టు 19న గీసుకొండలో కొండా సురేఖ పుట్టినరోజు కార్యక్రమంలోనే ఆమె బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పరకాల నుంచి తానే పోటీ చేస్తానని, టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమని ప్రకటించారు. అభ్యర్థిని ముందుగానే ప్రకటించే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని కూడా ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన ప్రాంతానికి వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి మద్దతు ప్రకటించడంపైనే ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సుస్మిత తెలిపారు. దీంతో తన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసినవి కావని, ముఖ్యమంత్రిని మాత్రమే ఉద్దేశించినవని వివరించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి మరో పార్టీ తరహాలో మార్చుతున్నారని కూడా ఆమె ఆరోపించారు. అసలు కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉందని, బీసీ నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం సోదరుడికి సంబంధించిన రూ.200 కోట్ల భూమి లావాదేవీపై కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు స్వతంత్ర నిర్ధారణ లేదనే విషయం కీలకం. సుస్మిత వ్యాఖ్యలు బయటకు రావడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ వేడి మరింత పెరిగింది. ఫలితంగా టీపీసీసీ
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్, ప్రత్యేక పాత్రలపై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ఒక కీలక పాత్ర గురించి వస్తున్న వార్తలకు నిర్మాతల వైపు నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది. చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. గతంలో వచ్చిన టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ వినిపించడంతో, ఈ భారీ కాప్ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కథనంలో ఉన్న ఒక పవర్ ఫుల్ జైలర్ పాత్ర కోసం ముందుగా ప్రకాష్ రాజ్‌ను సంప్రదించిన మాట వాస్తవమే అని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ కాలేదని ప్రణయ్ వెల్లడించారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా బలం చేకూరినట్లయింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యామియో చేయనున్నారని సాగుతున్న ప్రచారానికి కూడా ప్రణయ్ ముగింపు పలికారు. 'స్పిరిట్' లో చిరంజీవి ఎలాంటి అతిథి పాత్ర చేయడం లేదని తేల్చి చెప్పారు. కాస్టింగ్ పరంగా క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఈ వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ తొలిసారిగా పూర్తిస్థాయి రోషకలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండడం మెగా మాస్ ఎలిమెంట్స్‌ని పెంచేస్తోంది. నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు

రవితేజ 'ఇరుముడి' ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అమెరికా ప్రీమియర్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అత్యంత సానుకూల స్పందనను సొంతం చేసుకుంటోంది. భారీ అంచనాలు మరియు ముందస్తు బుకింగ్స్ఆధ్యాత్మిక అంశాలు మరియు ఫ్యామిలీ డ్రామా కలబోతగా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ మరియు ట్రైలర్లలో రవితేజ అయ్యప్ప స్వామి మాలలో కనిపించడంతో ప్రేక్షకుల్లో విశేష ఆసక్తి నెలకొంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. కథలోని లోతు మరియు పేరెంటింగ్ సందేశంకేవలం డివోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా కథలో మరింత లోతైన సామాజిక కోణాన్ని దర్శకుడు జోడించారు. ముఖ్యంగా ఆడపిల్లల పెంపకం మరియు పేరెంటింగ్ శైలిపై ప్రతి ఒక్కరినీ తీవ్రంగా ఆలోచింపజేసేలా సన్నివేశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తండ్రీ కూతుళ్ల అనుబంధంతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ సెంటిమెంట్ కూడా తొలి భాగంలో బాగా ఆకట్టుకుంటోంది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు మరియు సంగీతంప్రథమార్ధంలో ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ సన్నివేశాలను శివ నిర్వాణ సమర్థవంతంగా మేళవించారు. ఇంటర్వెల్ బ్లాక్ మరియు కథలోని కీలక మలుపు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారగా, 'మల్లెపూల పల్లకి' పాట వచ్చే సన్నివేశం థియేటర్లలో మంచి స్పందన పొందుతోంది. ఈ నేపథ్యంలో రొటీన్ కమర్షియల్ ముగింపు కాకుండా ఎమోషనల్ క్లైమాక్స్‌ను ఎంచుకోవడం సినిమా స్థాయిని పెంచింది. రవితేజ కెరీర్లో సరికొత్త మైలురాయిఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం రవితేజ తన రొటీన్ మాస్ శైలిని పక్కనపెట్టి ఇంటెన్స్ నటనను కనబరిచారు. దీంతో ఆయన నటనపై మరియు ఎంచుకున్న పాత్రపై సర్వత్రా ప్రశంసలు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ ప్రేక్షకులను ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచింది. దాంతో ఈసారి రెబల్ స్టార్ కు సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే వరుసగా సినిమాలను లైనప్ చేసిన ప్రభాస్ ఆయా షూటింగ్స్ లో యమా బిజీగా ఉన్నాడు. వాటిలో ముందుగా వచ్చేది మాత్రం స్పిరిట్ సినిమానే.. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆడియన్స్ లో ఆసక్తి రెట్టింపైంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను నెక్ట్స్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు స్పిరిట్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు ప్రభాస్ ను స్పిరిట్ లో ఎలా చూపించబోతున్నడో అంటూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఇప్పటికే హింట్ ఇచ్చాడు సందీప్.. స్పిరిట్ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్ ఇక ఈ మూవీలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమా నుంచి ఓ స్టార్ నటుడు తప్పుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది. ఆయన ఎవరో కాదు ప్రకాష్ రాజ్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రాజ్ కీలక పాత్రలో ఎంపిక చేశారట. అయితేఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఓ సీన్ విషయంలో ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడంతో ప్రకాష్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు

ప్రభాస్ 'స్పిరిట్' మూవీ కాస్టింగ్‌పై బిగ్ అప్డేట్పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో రూపుదిద్దుకుంటున్న స్పిరిట్ చిత్రంపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించి ఒక కీలకమైన ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. ఈ మూవీలో వర్సటైల్ నటుడు ప్రకాశ్ రాజ్ భాగం కావడం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. స్పిరిట్ టీజర్లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ వినిపించడంతో ఆయన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అందరూ భావించారు. జైలర్ పాత్ర కోసం ముందుగా ఆయన పేరునే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదని వార్తలు వచ్చాయి. నిర్మాత ప్రణయ్ వంగా అధికారిక క్లారిటీఈ వ్యవహారంపై స్పిరిట్ చిత్ర నిర్మాత ప్రణయ్ వంగా స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్‌లో నటించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది. ఫలితంగా జైలర్ పాత్రలో వేరొక నటుడు కనిపించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. చిరంజీవి క్యామియో రోల్‌పై స్పష్టత ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలను కూడా నిర్మాత ప్రణయ్ వంగా ఖండించారు. ఈ నేపథ్యంలో సినిమాలో చిరంజీవి ఎలాంటి క్యామియో రోల్ చేయడం లేదని తేలిపోయింది. షూటింగ్ మరియు ఇతర నటీనటుల వివరాలు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. చిత్ర బృందం ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల ఎంపికపై దృష్టి సారించింది. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'ఇరుముడి'. భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ అంశాల మేళవింపుతో వచ్చిన ఈ సినిమాపై తొలి నుంచే పరిశ్రమ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రవితేజను సరికొత్త ఆధ్యాత్మిక, కుటుంబ నేపథ్యంలో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే విదేశీ ప్రీమియర్లను పూర్తి చేసుకుని పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది.ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. మద్యం వ్యసనానికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకునే ఒక సాధారణ గ్రామీణ తండ్రి చుట్టూ తిరుగుతుంది. తన కన్నకూతురి ప్రేమ, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం అతడు పవిత్రమైన 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షను చేపడతాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి, అమాయకపు ఆడపిల్లలకు ఎదురయ్యే ఊహించని ప్రమాదం నుంచి దీక్షా నియమాలను పాటిస్తూనే అతడు తన కుటుంబాన్ని, ఊరిని ఎలా కాపాడాడనే అంశాన్ని దర్శకుడు క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఆకట్టుకునే తండ్రీ కూతుళ్ల బంధంయూఎస్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ స్పందనను పంచుకుంటున్నారు. ఫస్టాఫ్ ఎక్కడా హడావుడి లేకుండా ఎంతో నిజాయితీగా, మలయాళ చిత్రాల తరహా సహజత్వంతో సాగుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, పాఠశాల నేపథ్యంలో మొదలయ్యే సన్నివేశాలు, కథలోని అంతర్లీన ఉత్కంఠ ఫస్టాఫ్‌ను ఆసక్తికరంగా నడిపించాయి. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినప్పటికీ, ఇంటర్వెల్ సమయానికి వచ్చే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులుఇక సెకండాఫ్‌లో కథలోని ఎమోషన్స్ పీక్స్‌కి చేరుకుంటాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఊహించని ట్విస్టులు, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'మల్లెపూల పల్లకి' భక్తి గీతం నేపథ్యంలో వచ్చే మాస్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసిస్తున్నారు. ట్విస్ట్

Jagamae Sangeetham : చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు తీయగా తాజాగా మరో కొత్త సిరీస్ ని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మాణంలో మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన శబ్దంతో అందంగా మేళవించిన హృద్యమైన స్వరకల్పనల ద్వారా విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్‌కి ప్రాణం పోశారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి.. కీలక పాత్రల్ని పోషించారు. సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి నాకిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, కేస్కావ్ రెడ్డి, రూప లక్ష్మి.. పలువురు ఈ సిరీస్ లో నటించారు. Also See : Supritha : పెంపుడు కుక్క పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన సుప్రీత.. ఫొటోలు… ‘జగమే సంగీతం’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు నేడు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కర్ణాటక సంగీతం చుట్టూ తాత, మనవడి కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా, SVOD ఒరిజినల్స్ డైరెక్టర్, హెడ్ మాట్లాడుతూ.. కుటుంబం, వారసత్వం, ఆత్మశోధన వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తూనే, సంగీతంలోని భావోద్వేగ శక్తిని ఈ జగమే సంగీతం కథ చెప్తుంది. హత్తుకునే సంగీతం ఈ సిరీస్ లో ఉంది అని అన్నారు. నిర్మాత

ఈ యేడాది 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో నిర్మాతగా చక్కని విజయాన్ని అందుకున్న సుస్మిత కొణిదెల తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం 'జగమే సంగీతం' వెబ్ సీరిస్ నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా మరో వెబ్ సీరిస్ రాబోతోంది. గతంలో ఆమె 'షూట్ అవుట్ ఎట్ ఆలేర్' వెబ్ సీరిస్ తోనే నిర్మాతగా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత 'సేనాపతి' పేరుతో ఓ వెబ్ ఫిల్మ్ తీశారు. ఆపైన 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తన తండ్రి చిరంజీవి కథానాయకుడిగా ఈ యేడాది ఆమె నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'మన శంకర వర ప్రసాద్' అఖండ విజయాన్ని అందుకుంది. ఆ స్ఫూర్తితో ఇప్పుడు అమెజాన్ కోసం 'జగమే సంగీతం' వెబ్ సీరిస్ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించిన మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సీరిస్ 'బందిష్ బాండిట్స్' స్ఫూర్తితో తెలుగులో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో దీనిని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించారు. వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచించిన ఈ మ్యూజికల్ డ్రామాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఆయన సంగీతం ఈ సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సీరిస్ గురించి దర్శకుడు సూర్యప్రతాప్ చెబుతూ, 'కర్ణాటక సంగీతపు గొప్ప ప్రపంచ నేపథ్యంలో సాగే కథతో 'జగమే సంగీతం' రాబోతోంది. తన తాత శాస్త్రి గారి ప్రఖ్యాత సంగీత వారసత్వానికి వారసుడైన బాలు, సంప్రదాయ భారం, విచ్ఛిన్నమైన కుటుంబ బంధాలు, చిరకాలంగా దాచిపెట్టిన రహస్యాలతో సతమతమవడాన్ని చూపిస్తుంది. పాత వైరుధ్యాలు మళ్లీ తలెత్తి, తరతరాల వారసత్వాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, బాలు

మాస్ మహారాజా రవితేజ రేపు ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచి ఇరుముడితో వరల్డ్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాడు. సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలు పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఇరుముడి వీక్షించడానికీ థియేటర్స్ దగ్గర బారులు తీరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A 16+ సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలు. సెన్సార్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ ప్రకారం, రవితేజ కెరీర్లోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ పవర్ ప్యాక్డ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతోంది. ఈ కథలో రవితేజ "త్రినాథ్" అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. మొదట్లో మద్యానికి విపరీతంగా బానిసైన నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ నటన మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. తన భార్య (ప్రియా భవానీ శంకర్), ముద్దుల కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర)లతో సాధారణ జీవితం గడుపుతున్న క్రమంలో, కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప మాల ధరిస్తారు. మద్యానికి బానిసైన ఒక తండ్రి అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి, నిష్టగా మాల ఎలా కొనసాగించాడు అనేది సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారనుంది. అంతేకాకుండా, ఊరిలో ఆడపిల్లలకు ముప్పు తలపెడుతున్న ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామాను దర్శకుడు శివ నిర్వాణ ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు అద్భుతంగా ముడిపెట్టారు. తన కూతురితో పాటు గ్రామంలోని మహిళల రక్షణ కోసం అయ్యప్ప దీక్షలో ఉన్న త్రినాథ్ ఏ విధంగా పోరాడాడు అనే అంశం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం. మాస్ యాక్షన్‌కి తోడుగా భక్తి రసం, తండ్రీ కూతుళ్ల మధ్యన సాగే ఎమోషనల్
కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మకుటం' డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో తనదైన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు బుల్లితెర వీక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతోంది. మాస్, యాక్షన్ తో పాటు విపరీతమైన ఎమోషన్స్ నింపడంలో విశాల్ నైపుణ్యం ప్రత్యేకమైనది. తమిళంతో పాటు తెలుగునాట కూడా ఆయన సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే.. విశాల్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా, ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. కథానాయికలుగా అంజలి, దుషారా విజయన్ నటించగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కథ విషయానికి వస్తే.. కృపాకర్ అనే సాదాసీదా ఉద్యోగి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. సరదాగా విహారయాత్రకు వెళ్లిన సమయంలో అనుకోకుండా ఒక రౌడీ ముఠా అతని కారుపై దాడి చేస్తుంది. ఈ ప్రమాదంలో భార్యాపిల్లలను కోల్పోయిన కృపాకర్, ఆ దుండగులపై ఎలా పగ తీర్చుకున్నాడు? ఆ గ్యాంగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ రివెంజ్ డ్రామా తెరకెక్కింది. విశాల్ కి గతంలో 'పందెం కోడి', 'అభిమన్యుడు', 'మార్క్ ఆంటోని' వంటి విలక్షణమైన యాక్షన్ చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ లభించింది. అదే తరహాలో 'మకుటం'లో ఆయన చూపించిన వైవిధ్యమైన నటనకు, ముఖ్యంగా తండ్రీ కొడుకుల పాత్రల నడుమ ఉన్న వ్యత్యాసానికి ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా డిజిటల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో మాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ మిస్సయిన యాక్షన్ లవర్స్ ఈ సినిమా

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి రేపు అంటే ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గత చిత్రాలకు భిన్నంగా 'ఇరుముడి'గతంలో రవితేజ అంటేనే ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ సినిమాలను ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే, ఈసారి దర్శకుడు శివ నిర్వాణ ఆయనను పూర్తి భిన్నమైన, ఎమోషనల్ పాత్రలో చూపించబోతున్నారు. గతేడాది డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం, కేవలం 45 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయ్యప్ప దీక్షా నేపథ్యంలో భావోద్వేగ కథఈ చిత్రంలో రవితేజ ఆటో డ్రైవర్‌గా, తాగుడుకు బానిసైన తండ్రి పాత్రలో కనిపిస్తారు. తన కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప దీక్ష పూనడం, ఆ తర్వాత ఆయన జీవితంలో వచ్చే మార్పులే కథాంశం. దీంతో, ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపే ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందింది. చివరి 40 నిమిషాలు కీలకంసినిమాలోని చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని దర్శకుడు శివ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, రవితేజ నటనలో కొత్త కోణాన్ని చూస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ భావోద్వేగ సన్నివేశాలకు ప్రాణం పోసిందని సమాచారం. భారీగా బుకింగ్స్అల్లు సినిమాస్ ద్వారా బుక్ మై షోలో ఇప్పటికే టికెట్ల బుకింగ్స్ ఊపందుకున్నాయి. 'ది మాస్ ఈజ్ బ్యాక్' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించగా, సాయికుమార్ కీలక పాత్రలో మెరవనున్నారు. సినిమాపై అంచనాలుసాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగే ఈ సీరియస్ డ్రామా తెలుగు

తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ ఇప్పుడు కోలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తమిళ అరంగేట్ర చిత్రం మండాడి నుంచి చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో సుహాస్ ఎప్పుడూ లేని విధంగా పూర్తి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చేతికి ఉంగరం, గడియారంతో పాటు తీవ్రమైన హావభావాలు కలిగి ఉన్న ఆయన లుక్ యాక్షన్ సీక్వెన్స్‌కు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మండాడి చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెల్ఫీ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు మతిమారన్ పుగళేంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళ ప్రముఖ నటుడు సూరి ఇందులో కథానాయకుడిగా నటిస్తుండగా, సుహాస్ ప్రధాన ప్రతికథకుడిగా సాతపులి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తుండగా, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాలా శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళనాడు తీరప్రాంత మత్స్యకారుల యథార్థ జీవితాలు, సముద్రంలో జరిగే పడవ పందాల నేపథ్యంతో సాగుతుంది. ఇదిలా ఉండగా సముద్రంలో జరిగే పందాల విజువల్స్ జల్లికట్టు స్థాయిలో ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయని సమాచారం. దీంతో సూరి, సుహాస్ పాత్రల మధ్య ఘర్షణ అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఈ విలన్ పాత్ర యొక్క ప్రాధాన్యతను బట్టి సుహాస్ ఈ సినిమా కోసం 100 రోజులకు పైగా చిత్రీకరణలో పాల్గొన్నారు. చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఎస్ఆర్ కతీర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ పూర్తయి, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు

రవితేజ ‘ఇరుముడి’పై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇరుముడి’ (Irumudi) చిత్రానికి చాలా అవార్డులు వస్తాయని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ (GV Prakash Kumar) అన్నారు. ఎన్నో ప్రేమకథా చిత్రాలకు వినసొంపైన మెలోడీలు ఇచ్చి మ్యూజిక్ ప్రియులకు చేరువైన ఆయన, సంగీతం అందించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు జీవీ ప్రకాశ్‌కుమార్. ‘నేను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ‘ఇరుముడి’ చాలా ప్రత్యేకం. ఇదో ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథ చెప్పినప్పుడే ఇందులో పూర్తిగా లీనమైపోయాను. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనమిచ్చే చిత్రమిది. ప్రతీ క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇందులోని సంగీతానికి ఓ సైకలాజికల్ అప్రోచ్ ఉంటుంది. ‘మల్లెపూల పల్లకి’ పాటను రీక్రియేట్ చేసి అందరి అంచనాలను అందుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ నటించిన వాటిలో నా ఫేవరెట్ ‘ఇరుముడి’ చిత్రం. కచ్చితంగా ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది’ అని చెప్పారు

Singareni: దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి సింగరేణి: రాష్ట్ర దేశ ఇంధన భద్రతకు సింగరేణి సంస్థ తగినంత బొగ్గును అందించడంతో పాటు పునరుత్పాతక విద్యుత్తు రంగంలో కూడా తన వంతు కృషి చేస్తుందని సింగరేణి సంస్థ ఛైర్మన్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్ పో కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన భారత ఇంధన భద్రత విద్యుత్ ఉత్పత్తి అనే గోష్టిలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దశాబ్దాల కాలంగా దేశ ఇంధన అవసరాలకు తనవంతుగా బొగ్గు అందిస్తూ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి రాష్ట్ర జెన్ కో మరియు ట్రాన్స్ కో కలిసి సమష్టిగా కృషి చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ మరియు క్రిటికల్ మినరల్ రంగంలోకి కూడా ప్రవేశించిందని, అయినప్పటికీ దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి మరో నాలుగు దశాబ్దాల పాటు డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు. కనుక సింగరేణి సంస్థ రానున్న కాలంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కృషి చేస్తుందని అలాగే పునరుత్పాతక ఇంధన రంగంలో కూడా తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని తెలిపారు. ఈ చర్చ గోష్టికి ప్రొఫెసర్ పవన్ కుమార్ పరనంది సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ ఎనర్జీ సమ్మిట్ కు తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ హాజరుకాగా... ప్యానెల్ డిస్కషన్ లో సింగరేణి ఛైర్మన్ తో పాటు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ సీఎండీ శ్రీ దేవేంద్ర శృంగి, ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Mandaadi Movie: సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రం ‘మండాడి’. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘మండాడి’లో మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన సినిమా పోస్టర్లు, ఇతర ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో బోట్ సీక్వెన్స్‌లు చాలా ప్రత్యేకంగా ఉంటాయని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఆ సన్నివేశాలను రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా విడుదలైన పోస్టర్లో సుహాస్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్ ఈ పోస్టర్లో ప్రత్యేకంగా నిలిచింది. చేతికి ఉన్న ఉంగరం, వాచ్, గడ్డం, సీరియస్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పోస్టర్లో సుహాస్ కనిపిస్తున్న తీరు చూస్తే సినిమాలో ఆయన పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది. ఆయన చుట్టూ కనిపించే వస్తువులు కూడా సినిమాలోని కథ, పాత్ర గురించి ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సీఎం కోరడంపై మండిపడిన సుస్మిత, పరకాల బరిలో తాను కచ్చితంగా పోటీ చేస్తానని బహిరంగ సవాల్ విసిరారు
ఆమెకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు.. కొండా సుస్మితకు రేవూరి కౌంటర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఘాటుగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని, ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే సీఎం రేవంత్ తనను పరకాల అభ్యర్థిగా ప్రకటించారని రేవూరి తెలిపారు. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేని వ్యక్తి అని, సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని మండిపడ్డారు. దమ్ముంటే సీఎంపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ వార్తకు సంబంధించిన

అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు. టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్ వెనుక

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఘట్టమనేని జయకృష్ణ. దివంగత నటుడు రమేష్ బాబు తనయుడైన అతను 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూలై 30న థియేటర్లలోకి వచ్చిన ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. రోటీన్ స్టోరీ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అనుకున్న కలెక్షన్లు రావడం లేదు. అయితే మాస్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే థియేటర్లలో రిలీజైన 20 రోజులకే శ్రీనివాస మంగాపురం సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20 అంటే రేపటి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని నిర్మించగా, ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, అజయ్, శామ్, నరేష్, బ్రహ్మాజీ, మహేంద్రన్, వాసుకీ ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శ్రీనివాస మంగాపురం సినిమా కథ విషయానికి వస్తే.. తిరుపతి నేపథ్యంలో ప్రేమ, పగ, ప్రతీకారాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. థియేటర్లలో మిస్

పరకాలలో వచ్చే ఎన్నికలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని, మళ్లీ ఆయనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఇటీవల జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయన్న కొండా సుస్మితగత ఎన్నికలలో ఐదారు నియోజకవర్గాలలో విజయం సాధించడానికి తన తండ్రి కొండా మురళి ఎంతో కష్టపడ్డారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొండ మురళి రేవంత్ రెడ్డి కళ్ళకు కనిపించడం లేదని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని కొండా సుస్మిత అన్నారు. అంతేకాదు సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత హెచ్చరించారు.రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతా: కొండా సుస్మిత ఈరోజు కొండా సురేఖ జన్మదిన వేడుకలను పరకాలలో నిర్వహించగా ఆ కార్యక్రమంలో కొండ సుస్మిత పాల్గొన్నారు. భారీ కాన్వాయ్ తో బలప్రదర్శన చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. తను చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల స్కాములన్నీ బయటపెడతానని అన్నారు. తమ్ముడి రూ.200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే ఇప్పటివరకు మాట్లాడానని, కౌంటర్ ఇస్తే అన్నీ బయటపెడతానని హెచ్చరించారు.పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్న కొండా సుస్మితఅంతేకాదు పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదని, రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకు కూడా తెలియదని అన్నారు. గత ఎన్నికల సమయంలో కొండా మురళి రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం ప్రచారం చేస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచాడని వ్యాఖ్యలు చేశారు. పరకాల గడ్డ తమ అడ్డా అని పేర్కొన్న కొండా సుస్మిత, రేవూరి ప్రకాష్ రెడ్డిని రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు అభ్యర్థిగా ఇప్పుడే ప్రకటించడంపైన అసహనం వ్యక్తం చేశారు.రాజీనామా చేసి పోటీ

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందడమే కాకుండా, ఫిలిం వర్గాలు, సెన్సార్ టీమ్ నుంచి కూడా పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఊర మాస్ అభిమానులున్న రవితేజ.. భక్తి చిత్రంతో ఎలా మెప్పించగలడన్న డౌట్ చాలామందిలో ఉంది. కానీ ఈసినిమాతో ఆయన ఒక్కొక్కరికి పూనకాలు తెప్పించబోతునట్టు తెలుస్తోంది. పలు నివేదికల ఆధారంగా రూపొందించిన 'ఇరుముడి' ఫస్ట్ రివ్యూ / సెన్సార్ టాక్ వివరాలు చూస్తే. ఈ సినిమాలో రవితేజ ఒక సాధారణ గ్రామీణ ప్రాంతానికి చెందిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తారు. కథ బిగినింగ్ లో ఆయన పక్కా నెగెటీవ్ పాత్రలో కనిపిస్తారట. మందుకు బాగా అలవాటుపడిన పాత్రలో కనిపించే ఆయన, తన కూతురి కోరిక మేరకు అయ్యప్ప మాల ధరిస్తారు. మాల వేసుకున్న తర్వాత ఆయన జీవితంలో, ఆయన ప్రవర్తనలో వచ్చే మార్పుల ఏంటి? ఆ ఊరిలో మహిళల చుట్టూ అల్లుకున్న క్రైమ్ సస్పెన్స్ డ్రామా ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా రవితేజ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్న ఈసినిమాలో ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో అలరించినట్టు తెలుస్తోంది. స్వామి మాల ధరించిన తర్వాత ఆయన నటనలోని పరిణతి అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తండ్రి - కూతుళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం. రవితేజ , ఆయన కూతురిగా నటించిన చిన్నారి (బేబీ నక్షత్ర) మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో (Second Half) వచ్చే సెంటిమెంట్ సీన్లకు ఫిదా అవ్వాల్సిందే. అంతే కాదు ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 25 నిమిషాలు మాత్రమే ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవ్వబోతోంది. ఎక్కడా అనవసర సన్నివేశాలు లేకుండా స్క్రీన్ ప్లే స్పీడ్

మాస్ రాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమాతో రవితేజ ఇప్పటివరకు చూడని సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు దర్శకుడు శివ నిర్వాణ ప్రకటించారు. అయప్ప స్వామి భక్తి నేపథ్యంలో సాగే ఈ కథ, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ఆగస్టు 21న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. దర్శకుడు శివ నిర్వాణ 'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటిసారి రవితేజను డైరెక్ట్ చేస్తున్న ఆయన, ఈ కథపై ఎంతో ఆసక్తిని వ్యక్తం చేశారు. రవితేజలోని మాస్ ఇమేజ్ను ఏమాత్రం తగ్గకుండా, కొత్త కోణంలో చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో రవితేజ పాత్రలో ఎన్నో ఎమోషనల్ లేయర్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. తండ్రీకూతుళ్ల అనుబంధం మరియు వారి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రవితేజ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆధ్యాత్మికతకు మానవ సంబంధాలను జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేస్తుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సన్నివేశాలకు మరింత ప్రాణం పోస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా సాంకేతిక విలువలతో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాకు ప్లస్ కానుంది. ఈ నేపథ్యంలో రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కనిపించనుంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర వంటి నటులు

సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అంటూ సుస్మిత పోస్టు చేయడంతో.. పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. మరోవైపు.. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో, రాజకీయం మరో టర్న్ తీసుకుంది. కాగా, రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో.. సుస్మిత తాజా పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అధికార కాంగ్రెస్‌లోనే రేవూరి, కొండా కుటుంబం మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతోందన్న చర్చ మొదలైంది. పరకాలపై కొండా ఫ్యామిలీ కన్ను? కొండా కుటుంబానికి పరకాల నియోజకవర్గంతో రాజకీయంగా బలమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో సుస్మితను పరకాల నుంచి రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆ చర్చకు మరింత బలం చేకూర్చింది. అయితే, మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గ పరిధిలో భారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గీసుకొండ మండలంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సుస్మిత పటేల్ రాజకీయంగా కీలక ప్రకటన చేస్తారా? అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. ఒకవైపు రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు, మరోవైపు పరకాల నుంచి పోటీకి సుస్మిత పటేల్ ఆసక్తి.. ఈ రెండు పరిణామాలతో పరకాల కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరిగింది. ప్రస్తుతం ఇది పార్టీ అంతర్గత రాజకీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది

ఇరుముడి సినిమాలో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తలపై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. ‘ఇరుముడి’ (Irumudi) సినిమాలో రామ్‌చరణ్ (Ram Charan) కనిపిస్తారనే ప్రచారంలో నిజం లేదు. ఆయన అయ్యప్ప భక్తుడు (Ayyappa Swamy) కాబట్టి ఆ వైబ్ ఉంటుంది. అందుకే అభిమానులు ఆయన్ని చూడాలనుకున్నారేమో. మా చిత్రం చరణ్‌కి నచ్చాలని కోరుకుంటున్నాను’ అని ‘ఇరుముడి’ చిత్ర దర్శకుడు శివనిర్వాణ (Shiva Nirvana) తెలిపారు. రవితేజ (Ravi Teja), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివనిర్వాణ మాట్లాడుతూ ‘అయ్యప్ప స్వామి మాల, ఫ్యామిలీ, క్రైమ్ అంటూ మూడు లేయర్స్‌లో మా సినిమా కథ సాగుతుంది. ఇలాంటి సరికొత్త కథలో రవితేజలాంటి స్టార్హీరో చేసినప్పుడు ఆటోమేటిగ్గా జనాల్లో అటెన్షన్ వచ్చేస్తుంది. అంచనాలు పెరుగుతాయి. మా విషయంలోనూ అదే జరిగింది. తప్పకుండా అంచనాలు రీచ్ అవుతాం. ఈ చిత్రం కోసం నేను అయ్యప్ప మాల కూడా వేసుకున్నాను. చిత్రంలో అయ్యప్ప పూజకు సంబంధించి చూపించిన ప్రతి విషయం ప్రామాణికంగా ఉంటుంది. ఇటీవల విడుదలైన మల్లెపూల పల్లకి పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. సీలేరు ప్రాంతంలో అయ్యప్ప భక్తులు ఈ పాటను ఎక్కువగా పాడుకుంటారని తెలిసి ఆ పాటతో షూటింగ్ చేశాం. డప్పు శ్రీను గొంతులో ఈ పాట చిరస్థాయిగా ఉంటుంది’ అని అన్నారు

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. డివోషనల్ ఎలిమెంట్స్ తో సహా మంచి ఇంటెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ ని కూడా దర్శకుడు దట్టించి మంచి సినిమా అందిస్తున్నట్టు మేకర్స్ అంతా ధీమాగా ఉన్నారు. అయితే తమ సినిమాలపై సంగీత దర్శకులు ఇచ్చే రివ్యూస్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో మరింత కాన్ఫిడెన్స్ నింపుతాయి. ఈ ట్రెండ్ అనిరుద్ నుంచి బాగా వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇరుముడి సినిమాకి సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కూడా సింపుల్ రివ్యూ ఇచ్చేసాడు. ‘ఒక క్లాసిక్ రాబోతుంది’ అంటూ ఒక్క మాటలో సినిమా ఇరుముడి కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరింత కాన్ఫిడెన్స్ ని నింపేసాడు. అంతే కాకుండా సినిమా తాలూకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా పూర్తి చేసినట్టు సాలిడ్ అప్డేట్ ని తాను అందించాడు. సో మొత్తానికి ఒక క్లాసిక్ వర్క్ ఈ ఆగష్టు 21న రాబోతుంది అని చెప్పొచ్చు

మాస్ హీరో రవితేజ(Raviteja)ను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్న సినిమా ఇరుముడి(Irumudi). థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే మంచి ఆసక్తి పెరుగుతోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్(G.V Prakash) కుమార్ ఇచ్చిన హైప్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఇరుముడి క్లాసిక్‌గా నిలిచే అవకాశం ఉందంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తయిందని ఆయన వెల్లడించడం విశేషం. సాధారణంగా ఒక సినిమాకు మ్యూజిక్ డైరెక్టరే తొలి ఆడియన్ గా ఫైనల్ అవుట్‌పుట్‌ను పరిశీలిస్తారు. అందుకే జీ.వీ. ప్రకాష్ వంటి ఎక్స్పీరియెన్డ్స్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా గురించి ఇంత నమ్మకంగా మాట్లాడటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్స్ కూడా సానుకూలంగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో ఇరుముడిలో కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) తనదైన ఎమోషనల్ స్క్రీన్‌ప్లే తో ఈ థ్రిల్లర్‌ను రూపొందించినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాణ విలువలు సినిమాకు మరో బలంగా నిలవనున్నాయి. ఇక రవితేజ ఈ సినిమాలో ఇంతకుముందు కనిపించని షేడ్స్‌లో నటించడంతో పాటు, తన కెరీర్లో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ వరుసగా వస్తున్న పాజిటివ్ బజ్‌తో ఇరుముడిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది
మాస్ మహారాజా రవితేజ , శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ ఇరుముడి ’. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం రవితేజ్ కెరీర్లో ల్యాండ్ మార్క్ అవుతుందని చిత్ర యూనిట్‌తో పాటు ఆయన అభిమానులు సైతం ధీమాగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించి కొద్దిరోజులుగా ఓ ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలోని అయ్యప్ప పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్లో మెరవనున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వార్తలపై రామ్ చరణ్ టీమ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.* ‘ఫౌజీ’లో ప్రభాస్ రౌద్రరూపం… ఒళ్లంతా చందనంతో అప్పన్నని తలపించేలా భారీ యాక్షన్ ఫైట్అయ్యప్ప పాటతో ఊహాగానాలుప్రమోషన్స్లో భాగంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా ‘మల్లెపూల పల్లకి’ అనే అయ్యప్ప భక్తి గీతాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. థియేటర్లలో ఈ పాట వచ్చే సమయంలో ప్రేక్షకులకు వెండితెరపై ఒక ఊహించని సర్ప్రైజ్ ఉండబోతోందని వ్యాఖ్యానించారు. దీంతో సహజంగానే ఏటా అయ్యప్ప మాలధారణను నిష్టగా ఆచరించే రామ్ చరణ్, ఈ పాటలో అయ్యప్ప భక్తుడిగా ప్రత్యేక క్యామియో రోల్లో దర్శనమివ్వనున్నారనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రవితేజ, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఆయా హీరోల అభిమానులు భావించారు.రూమర్స్‌కి చరణ్ టీమ్ చెక్సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఊపందుకోవడంతో రామ్ చరణ్ పీఆర్ టీమ్ రంగంలోకి దిగింది. ‘ఇరుముడి’ చిత్రంలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ గానీ, స్పెషల్ అప్పియరెన్స్ గానీ చేయడం లేదని స్పష్టం చేసింది. ‘మల్లెపూల పల్లకి’ పాటలో చరణ్ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవి పూర్తిగా నిరాధారమైన ప్రచారం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘RaPo23’ కోసం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల పుదుచ్చేరి శివార్లలో రామ్ ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూట్ చేశారు. విశేషం ఏమిటంటే రామ్ కేవలం డైరెక్టర్‌గా కెమెరా వెనుక ఉండటమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నారు. పుదుచ్చేరిలో ఈ సినిమా కోసం భారీ సెటప్ వేశారు. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో రామ్ నటుడిగా తనపై ఉన్న బాధ్యతతో పాటు, దర్శకుడిగా సినిమా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘RaPo23’ ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా పుదుచ్చేరి షెడ్యూల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. మిగిలిన షూటింగ్‌ను అదే భారీ సెటప్‌లో పూర్తి చేసేందుకు త్వరలోనే టీమ్ మళ్లీ పుదుచ్చేరి వెళ్లనుంది. హీరోగా, దర్శకుడిగా ఒకేసారి రెండు బాధ్యతలు తీసుకున్న రామ్.. ఇంత కఠినమైన షూటింగ్ షెడ్యూల్స్‌లోనూ డెడికేషన్ తో పని చేస్తున్న తీరు ‘RaPo23’పై ఆసక్తిని మరింత పెంచుతోంది. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. డార్క్, ఇంట్రెస్టింగ్ నియో-నోయిర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిర్రు) కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ పార్ట్‌ను విక్రమ్ మోర్, పీటర్ హెయిన్ కలిసి హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ సినిమా కథకు, భారీ స్కేల్‌కు తగ్గట్టుగా ప్రత్యేకమైన సెట్స్‌ను రూపొందిస్తున్నారు. సినిమా కాస్ట్, క్యారెక్టర్స్, తదుపరి షెడ్యూల్స్కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ రాబోయే రోజుల్లో వెల్లడించనున్నారు

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న ఘనంగా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని రవితేజ ధీమా వ్యక్తం చేశారు. నేపథ్య సంగీతం లేకుండానే సినిమా చూశానని, ఇది ప్రేక్షకులకు గొప్ప ఎమోషనల్ అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని ఒక మధ్యతరగతి తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో అత్యంత సహజంగా తెరకెక్కించారు. కథకు బలం చేకూర్చేందుకు అయ్యప్ప భక్తి నేపథ్యాన్ని అద్భుతంగా జోడించినట్లు ఆయన వివరించారు. ఇది కేవలం సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, చివరలో ఇంటెన్స్ థ్రిల్లర్‌గా మారుతుందని వెల్లడించారు. సినిమాలోని చివరి 40 నిమిషాలు ప్రేక్షకులను సీట్లకే కట్టిపడేసేలా హ్యూమన్ డ్రామాను కలిగి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో ఒక తండ్రి కథ మాత్రమే కాకుండా, ఇద్దరు తండ్రుల మధ్య ఉన్న భావోద్వేగ ప్రయాణం ప్రధానంగా సాగుతుంది. మల్లెపూల పల్లకి అనే ప్రత్యేక గీతంలో 100 మంది స్వాములతో చిత్రీకరించిన సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇదిలా ఉండగా, రవితేజ కెరీర్లో అత్యంత సీరియస్ ఫ్యామిలీ డ్రామాగా ఇరుముడి నిలుస్తుందని శివ నిర్వాణ నమ్మకంగా ఉన్నారు. ఫలితంగా ఈ ప్రాజెక్టుపై రవితేజ పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్నారి నటి నక్షత్ర నటన ఈ చిత్రానికి ప్రాణం పోస్తుందని, వారిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయని ఆయన చెప్పారు. అలాగే కావేరి పాత్రలో ప్రియా భవానీ శంకర్ నటన పర్ఫెక్ట్గా సరిపోయిందని రవితేజ కొనియాడారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌తో మూడోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా వీరితో మరిన్ని సినిమాలు చేస్తానని ఆయన తెలిపారు. జీవీ

మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం నుండి ‘మల్లెపూల పల్లకి’ అనే భక్తి గీతం తాజాగా విడుదలైంది. ఆగస్టు 16 రాత్రి జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ ఈ లిరికల్ వీడియోను అధికారికంగా విడుదల చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అయ్యప్ప భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రవితేజతో పాటు ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా నటిస్తుండగా, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ పాట ఒరిజినల్ వెర్షన్‌కు పాడిన డప్పు శ్రీనునే దీనికి కూడా గాత్రం అందించడం విశేషం. సుంకర అంజనేయులు కంపోజ్ చేసిన అసలు బాణీకి జీవీ ప్రకాష్ కుమార్ తనదైన శైలిలో కొత్త మెరుగులు దిద్దారు. దీంతో పాత భక్తి స్పర్శను చెడగొట్టకుండానే, ఆధునిక థియేటర్ సౌండింగ్‌తో ఈ పాటను అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఇదిలా ఉండగా, శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రవితేజ తనదైన మాస్ ఎనర్జీని భక్తి గ్రేస్‌తో మిక్స్ చేసి వేసిన స్టెప్పులు అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. చౌడం శ్రీనివాసరావు అందించిన సాహిత్యం అయ్యప్ప భక్తుల మనసులను గెలుచుకోవడంతో, సాంగ్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఫలితంగా ‘ఇరుముడి’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్లో ఇదొక విభిన్నమైన ప్రయత్నంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భక్తిని, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ, శివ నిర్వాణ ఈ చిత్రాన్ని పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్లను వేగవంతం చేశారు

‘ఇరుముడి’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది. ప్రేక్షకులందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ‘ఇరుముడి’ (Irumudi) నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది. ప్రేక్షకులందరూ థియేటర్లలో ఒక మంచి సినిమాను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఇందులో మీరు ఇప్పటివరకు చూడని ఒక డిఫరెంట్ రవితేజను చూస్తారు. నా పాత్ర, కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కచ్చితంగా కనెక్ట్ చేస్తాయని నమ్ముతున్నాను' అని రవితేజ (Ravi Teja) అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో హుషారుగా సాగే ' మల్లెపూల పల్లకి' సాంగ్ ను విడుదల చేశారు. రవితేజ మాట్లాడుతూ 'ఈ సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్. నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. స్వాసిక నటన చూస్తే మీకు భయమేస్తుంది. అంత అద్భుతంగా చేసింది. కొన్ని క్యారెక్టర్స్ మీ మైండ్‌లో ఉండిపోతాయి. సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సాయికుమార్గాను కొత్తగా చూస్తారు. సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. జీవీ ప్రకాష్ బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. నక్షత్ర ఫ్యూచర్లో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ మిమ్మల్ని టచ్ చేస్తాయి. సినిమాలో మీకు ప్రియా భవానీ శంకర్ కనిపించదు.. కేవలం కావేరి పాత్ర మాత్రమే కనిపిస్తుంది

మాస్ మహారాజా రవితేజ తన తాజా చిత్రం 'ఇరుముడి' విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేశాడు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా, ఈ చిత్రంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర ప్రతిభను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించాడు."నక్షత్ర భవిష్యత్తులో కచ్చితంగా గొప్ప కథానాయిక అవుతుంది" అని రవితేజ జోస్యం చెప్పాడు. తమ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయని, అవి ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయని తెలిపాడు. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ అద్భుతమైన నటన కనబరిచిందని, మరో నటి శ్వాసిక తన నటనతో విస్మయానికి గురిచేసిందని కొనియాడాడు. అలాగే సాయి కుమార్, రమేశ్ ఇందిరల నటన కూడా తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నాడు.ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ అందించిన గీతాలు, నేపథ్య సంగీతం ప్రధాన బలమని రవితేజ స్పష్టం చేశాడు. రీ-రికార్డింగ్ ప్రేక్షకులను నేరుగా కథలోకి తీసుకెళ్లి, ఒక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణాన్ని అందిస్తుందని వివరించాడు. ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేశ్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ ఈ చిత్రాన్ని తమ సొంత ప్రాజెక్ట్‌లా భావించి ఎంతో నిబద్ధతతో పనిచేశారని వారిని అభినందించాడు.నిర్మాతలు నవీన్, రవితో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని రవితేజ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. దర్శకుడు శివ నిర్వాణ ప్రతిభ గురించి సినిమా ఘనవిజయం సాధించాక సక్సెస్ మీట్లో సవివరంగా మాట్లాడతానని చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది

వరంగల్ నేలకు ఒక గొప్ప చరిత్ర, పోరాట చైతన్యం ఉందని, పాలకుల అణచివేతకు గురైన ప్రతి సందర్భంలోనూ ఇక్కడి ప్రజలు తమ తిరుగుబాటును చాటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరకాలలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో తమ పార్టీ నాయకురాలు యశస్విని రాజకీయ కొండను బద్దలు కొట్టి విజయం సాధించారని గుర్తుచేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం కూలేశ్వరమైనా సరే.. ప్రాజెక్టులను నీటితో నింపి రైతులు అత్యధికంగా పంటలు పండించేలా చర్యలు తీసుకున్నామని సీఎం వివరించారు.రైతాంగం, మహిళల సంక్షేమానికి రూ. లక్ష కోట్ల ప్రాధాన్యం!తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గత 32 నెలల కాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఏకంగా రూ.90 వేల కోట్లు చెల్లించామని, రైతు భరోసా, రుణమాఫీ అమలు చేస్తూ రైతును రాజుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెండున్నరేళ్ల పాలనలో రైతుల శ్రేయస్సు కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని, సన్న ధాన్యానికి బోనస్ అందించిన ఘనత తమదేనన్నారు. ఇక మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ ఇద్దరు ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చామని తెరిపారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలకు గుండు సున్నా పెడితే, తమ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిందని, యూనిఫాం కుట్టే పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడంతో పాటు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణలో ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.కుటుంబ స్వార్థం కేసీఆర్‌ది.. ప్రజా సంక్షేమం మాది!కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టారని, కానీ ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు, పోరాట యోధులకు గుర్తింపు దక్కిందని సీఎం లెక్కలతో సహా వివరించారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడిని మంత్రులను చేస్తే, తాను సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌లను మంత్రులను చేశానని

Konda Surekha : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ పర్యటనలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కనిపించపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మూడు జిల్లాలను చుట్టేసిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా.. ఏ ఒక్క వేదికపై కూడా సురేఖ ఆసీనులు కాలేదు. అంతేకాదు దేవదాయ శాఖ మంత్రి అయిన ఆమె లేకుండానే మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించారు సీఎం. దాంతో, రాజకీయంగా అంతర్గత విభేదాల కారణంగానే మినిస్టర్ సురేఖ హాజరు కాలేదనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఇటీవల తరచూ బయటపడుతూనే ఉన్నాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య వర్గపోరు.. ఇక కాంగ్రెస్‌లో ఫిరాయింపులను, పాలన తీరును విమర్శించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నాయకురాలైన కొండా సురేఖ సైతం పార్టీపై కాసింత అసంతృప్తితోనే ఉన్నట్టు సమాచారం. Shock for Konda Surekha! During his Warangal tour, CM Revanth Reddy publicly backed sitting MLA Revuri Prakash Reddy for Parkal in the next elections — dashing Surekha's repeated push for daughter Sushmitha's candidacy. Konda couple's absence from the tour today adds to the buzz.… — Digital Prime News (@DigiPrimeNews) August 16, 2026 అందుకే కాబోలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలకు ఆమె దూరమయ్యారు. పరకాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ సురేఖ కనిపించలేదు. ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అయితే.. ఇదివరకే సురేఖ కుమార్తె సుస్మిత తాను పరకాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో.. తమ ప్రాంతంలోనే సీఎం పర్యటిస్తున్నా.. సురేఖ

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇరుముడి'. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట విడుదలైంది. 'మల్లెపూల పల్లకి' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. హైదరాబాదులో ఆదివారం ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ ను ఆవిష్కరించారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ 'మల్లెపూల పల్లకి' పాటకు చౌడం శ్రీనివాసరావు సాహిత్యం అందించారు. గాయకుడు డప్పు శ్రీను తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. రవితేజ ఎనర్జీకి తగినట్టుగా జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం, క్యాచీ ట్యూన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాట సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ప్రేమకథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ, మాస్ ఇమేజ్ ఉన్న రవితేజ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటించారు. బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్ ఫిల్మ్స్