S
SkycMediaSkyc Media · Professional Movie Reviews & Breaking News
Home
India
World
Science
Health
Movies
Technology
Publishers
Crawl Hub
Follow Us

© 2026 news.skycmedia.com

S
SkycMedia
PublisherAdmin
Home
⭐ ReviewsOTT
SkyC AnalysisPoliticsSportsBusinessBox OfficeGold RatesPublishersCrawl Hub
HomeSkyC AnalysisMoviesReviewsOTTBox OfficeBigg Boss 10PollsPoliticsSportsBusinessGold RatesTechnology
HomeMoviesReviewsOTTNews

Koratala Siva News

8 కథనాలు

Latest Stories

8 కథనాలు
కొరటాల సినిమాలో తమిళస్టార్ హీరో
•Movies•31 ఆగ

కొరటాల సినిమాలో తమిళస్టార్ హీరో

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్‌లో గాయపడిన బాలయ్య, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే ఇప్పటివరకు పూర్తయిన సీన్లకు డబ్బింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన ప్రత్యేక పాత్ర కోసం తమిళ హీరో ఆర్యను ఎంపిక చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆర్య ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ఫిలిం నగర్ టాక్. కొరటాల శివ బాలయ్యను పూర్తి స్థాయి మాస్ అవతారంలో చూపిస్తూనే, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా పెద్దపీట వేసేలా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది చివర్లో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, SLV సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు

బాలయ్యతో ఇరుముడి’ దర్శకుడు నిజమేనా
•Movies•31 ఆగ

బాలయ్యతో ఇరుముడి’ దర్శకుడు నిజమేనా

‘ఇరుముడి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ చేసే సినిమాకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరనే విషయం పై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుస ప్లాప్‌లతో కాస్త వీక్‌గా ఉన్న రవితేజకు ఈ సినిమా ఊపిరి పోయడమే కాదు, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసింది. ఇక ఓవర్సీస్, ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న హోల్డ్ చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో ఈజీగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ హిట్ పడటంతో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు చిత్రసీమలో ఒక డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో గ్రాండ్ హిట్ కొడితే చాలు.. నిర్మాతలు, హీరోల మేనేజర్లు వారి చుట్టూ తిరగడం సహజమే. ఇప్పుడు శివ నిర్వాణ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పలువురు ప్రముఖ నిర్మాతలు ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు కాకపోయినా పర్లేదు.. భవిష్యత్తులో మీతో సినిమా చేస్తాం, అడ్వాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారనే పుకార్లు

పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య
•Movies•18 ఆగ

పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ NBK112. ఇప్పటికే పూజ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాల వల్ల నిలిచిపోయిందంటూ ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న రూమర్లపై చిత్ర యూనిట్ “Team NBKKoratalaSiva” పేరుతో క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించిన ప్రచారాలను, అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుంది, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘NBK111’ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే ఈ కొరటాల శివ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రాంభం అవుతుందని’స్పష్టం చేసారు. బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో గాయపడడంతో మొకాలుకి సర్జరీ చేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యాక ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు కొరటాల

బాలయ్య-కొరటాల శివ సినిమా ఆగిపోయినట్లేనా? నెట్టింట తెగ వైరల్
•Movies•17 ఆగ

బాలయ్య-కొరటాల శివ సినిమా ఆగిపోయినట్లేనా? నెట్టింట తెగ వైరల్

Tollywood: బాలయ్య-కొరటాల శివ సినిమా ఆగిపోయినట్లేనా? నెట్టింట తెగ వైరల్.! Tollywood: కొరటాల శివ-బాలయ్య మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాను అధికారికంగా ప్రకటించి, గ్రాండ్‌గా లాంచ్ చేసినప్పటికీ స్క్రిప్ట్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కాల్సిన నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో రకరకాల వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా ముందుకు వెళ్లకుండా పూర్తిగా ఆగిపోయినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కలయికపై అభిమానులలో మొదట్నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ఈ వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ గతంలో అధికారికంగా ప్రకటించడంతో పాటు అత్యంత వైభవంగా గ్రాండ్‌గా లాంచ్ కూడా చేశారు. ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగినప్పటికీ, ఆ తర్వాత కథ, స్క్రిప్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా సరైన ఏకాభిప్రాయం కుదరలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దర్శకుడు సిద్ధం చేసిన కథపై హీరో సంతృప్తి చెందారా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో వస్తున్న ఈ రకమైన విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావచ్చని లేదా పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు మూవీ టీమ్ లేదా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. చిత్ర యూనిట్ స్పందిస్తేనే ఈ వార్తలపై పూర్తి నిజానిజాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. కాగా, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'దేవర' సినిమా తర్వాత దాదాపు రెండేళ్లకు కొరటాల శివ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా చుట్టూ జరుగుతున్న అనూహ్య పరిణామాలు ప్రస్తుతం నందమూరి

బాలయ్య - కొరటాల సినిమాపై వదంతులు.. ఫుల్క్లారిటీ ఇచ్చిన టీమ్
•Movies•17 ఆగ

బాలయ్య - కొరటాల సినిమాపై వదంతులు.. ఫుల్క్లారిటీ ఇచ్చిన టీమ్

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో పట్టాలెక్కనున్న భారీ యాక్షన్ చిత్రం (NBK 112) నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించింది. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అవన్నీ కేవలం నిరాధారమైన వదంతులేనని స్పష్టం చేసింది. అభిమానులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరింది.ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘NBK 111’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తన భాగాన్ని పూర్తి చేసిన వెంటనే, కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ఆగిపోలేదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది.ఈ చిత్రాన్ని జూన్ 25న అమరావతిలో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న ఊహాగానాలకు తాజా వివరణతో తెరపడింది

ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
•Movies•17 ఆగ

ఆగిపోయిందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై వస్తోన్న రూమర్స్‌కు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ (NBK112) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే, గత రెండు రోజులుగా బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటూ సోషల్ మీడియా, వెబ్ మీడియా సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు నందమూరి అభిమానుల్లో (Nandamuri Fans) తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న రూమర్లపై చిత్ర యూనిట్ స్పందిస్తూ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ‘‘నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఎలాంటి రూమర్స్‌ను నమ్మవద్దు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న NBK111 పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది’’ అంటూ టీమ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న నిరాధారమైన రూమర్లకు పూర్తిగా తెరపడినట్లైంది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న బాలయ్య, కొరటాల శివ వంటి కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ డైరెక్టర్‌తో జతకట్టనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర బృందం ఇచ్చిన స్పష్టతతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమాపై వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాలయ్యని ఇప్పటి వరకు చూపించని ఓ వైవిధ్యమైన పాత్రలో కొరటాల చూపిస్తారని ఆశపడుతున్నారు. అలాంటి ఆశలతో ఉన్న వారంతా.. సడెన్‌గా ఈ సినిమా

మరింత ఆలస్యం.. చిరంజీవికిప్లస్ అవుతుందా
•Movies•16 ఆగ

మరింత ఆలస్యం.. చిరంజీవికిప్లస్ అవుతుందా

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్ తర్వాత ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NBK112’ ప్రాజెక్ట్ లైన్‌లో ఉంది. అయితే, అనుకోకుండా ‘NBK111’ షూటింగ్ సమయంలో బాలయ్యకు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరో లేదా అగ్ర దర్శకుడి షెడ్యూల్ మారితే, దాని ఎఫెక్ట్ వరుసగా మిగతా ప్రాజెక్టులపై పడుతుంది. ప్రస్తుతం బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, బాలయ్య గాయం వల్ల ఈ సినిమా షూటింగ్ వచ్చే సమ్మర్‌కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, బాలయ్య తర్వాత చేయాల్సిన మరికొన్ని సినిమాల షెడ్యూల్స్ కూడా రీ-షెడ్యూల్ కాక తప్పడం లేదట. ఈ లైనప్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కొరటాల శివ సినిమా పూర్తయిన వెంటనే, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉందట. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలియంది కాదు. అయితే, బాలయ్య-కొరటాల సినిమా ఆలస్యం కానుండటంతో అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ ప్లానింగ్‌ను మార్చుకోవాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్

బాలయ్య, కొరటాల మూవీపై బిగ్ట్విస్ట్ ఇదే
•Movies•10 ఆగ

బాలయ్య, కొరటాల మూవీపై బిగ్ట్విస్ట్ ఇదే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. NBK - Koratala Siva Big update: బాలకృష్ణ, కొరటాల శివ సినిమా ఆగష్టు నెల మూడో వారం నుంచే సెట్స్ పైకి వెళ్లాలి. ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. కానీ బాలకృష్ణకు మోకాలి గాయం కావడంతో ఆ షెడ్యూల్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసారు. దీంతో షూటింగ్‌ ప్రారంభం మరికొంత ఆలస్యం కానుంది. సెప్టెంబర్ రెండో వారం రెగ్యులర్ షూటింగ్.. అయితే సినిమా పనులకు మాత్రం అలాగే కొనసాగుతుంది. బాలయ్య లేని సీన్స్‌ను కొన్ని పిక్చరైజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ రెండో వారం నుంచి ఓ కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ లని సీన్స్ ఉండనున్నాయి. అంటే హీరో లేకుండా తెరకెక్కించాల్సిన సన్నివేశాలను ముందుగా పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 15 రోజులకు పైగా షూటింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కథ, కథనానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. బాలయ్యను ఇప్పటివరకు చూసిన మాస్ యాంగిల్‌కు భిన్నంగా.. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు కథలో కీలకంగా ఉండేలా దర్శకుడు కొరటాల శివ కథను సిద్ధం చేశారట.గతంలో బాలయ్య ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్‌లో మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు

సంబంధిత విభాగాలు (Related)

Categories

Movies

Topics

MoviesAndhra PradeshNationalTelanganaPoliticsSports

Keywords

Nbk112BalakrishnaKoratala SivaActor AryaNbk 112 CastBalakrishna Koratala Siva MovieTamil Hero Arya Cop RoleTollywood Movie UpdatesTelugu NewsIndia News
SkycMedia

Skyc Media · Professional Movie Reviews & Breaking News

తెTeluguEnEnglishहिHindiಕKannada

News

  • India News
  • World Affairs
  • Politics & Elections
  • Sports & Cricket
  • Science & Space
  • Health & Wellness
  • Business & Economy
  • Technology & AI

Cinema

  • Movie Reviews
  • OTT Updates
  • Box Office
  • Movies Directory
  • Cinema News
  • Gold Rates
  • Bigg Boss

Explore

  • Celebrity Profiles
  • Publishers Hub
  • Polls
  • Crawl Hub
  • Sitemap
  • Robots

Company

  • About Us
  • Contact Us
  • Publisher Login
  • Privacy Policy
  • Terms & Conditions
Follow SkycMedia:
InstagramX (Twitter)YouTubeLinkedInFacebook
Contact & Advertising Inquiries: contact@skycmedia.com
Advertise on SkycMedia

© 2026 SkycMedia · All Rights Reserved · Fast & Unbiased Digital Media.