
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
NBK - Koratala Siva Big update: బాలకృష్ణ, కొరటాల శివ సినిమా ఆగష్టు నెల మూడో వారం నుంచే సెట్స్ పైకి వెళ్లాలి. ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ బాలకృష్ణకు మోకాలి గాయం కావడంతో ఆ షెడ్యూల్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసారు. దీంతో షూటింగ్ ప్రారంభం మరికొంత ఆలస్యం కానుంది.
సెప్టెంబర్ రెండో వారం రెగ్యులర్ షూటింగ్.. అయితే సినిమా పనులకు మాత్రం అలాగే కొనసాగుతుంది. బాలయ్య లేని సీన్స్‌ను కొన్ని పిక్చరైజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ రెండో వారం నుంచి ఓ కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో బాలకృష్ణ లని సీన్స్ ఉండనున్నాయి. అంటే హీరో లేకుండా తెరకెక్కించాల్సిన సన్నివేశాలను ముందుగా పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 15 రోజులకు పైగా షూటింగ్ నిర్వహించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా కథ, కథనానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. బాలయ్యను ఇప్పటివరకు చూసిన మాస్ యాంగిల్‌కు భిన్నంగా.. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు కథలో కీలకంగా ఉండేలా దర్శకుడు కొరటాల శివ కథను సిద్ధం చేశారట.గతంలో బాలయ్య ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్‌లో మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు మరోసారి అదే చేయబోతున్నాడు.
కమర్షియల్ ఫార్మాట్లోనే కొత్త తరహా కథ.. అంతేకాదు.. సినిమా కథ కూడా సాధారణ కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా కొంత ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. కథలోని ఎమోషన్, పాత్రల మధ్య ఉండే బంధాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచేలా కొరటాల శివ స్క్రిప్ట్‌పై చాలా వర్క్ చేశారట.ఇప్పటికే ‘దేవర’ సినిమాతో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరటాల శివ.. ఆ తర్వాత చేయబోయే సినిమాగా బాలయ్య ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉండటంతో పాటు.. ఆయన నుంచి కొత్త తరహా నటనను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో కథను తీర్చిదిద్దుతున్నారనే ప్రచారం బలంగా జరుగుతోంది.
అయితే బాలకృష్ణ గాయం కారణంగా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్లో మార్పు రావడంతో.. ఆయన పాల్గొనే సన్నివేశాలను ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత రావాల్సి ఉంది. ముందుగా సెప్టెంబర్‌లో బాలయ్య లేని సన్నివేశాలను పూర్తి చేసి, ఆ తర్వాత ఆయన అందుబాటులోకి వచ్చిన వెంటనే మెయిన్ షూటింగ్‌ను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





