
Harish Rao | భూముల చుట్టే రేవంత్ పరిభ్రమణం.. 22ఏ పేరిటప్రజల జీవితాలతో చెలగాటం
Harish Rao | భూముల చుట్టే రేవంత్ పరిభ్రమణం.. 22ఏ పేరిట ప్రజల జీవితాలతో చెలగాటం
© 2026 nimisham.in

Harish Rao | భూముల చుట్టే రేవంత్ పరిభ్రమణం.. 22ఏ పేరిట ప్రజల జీవితాలతో చెలగాటం

Harish Rao | 22A బిగ్ స్కామ్.. రేవంత్ A1.. పొంగులేటి ఏ2.. నిప్పులు చెరిగిన హరీశ్‌రావు

Harish Rao | భూ భారతి కాదు, భూ హారతి.. హరీశ్ రావు ఫైర్

Harish Rao | చీము, నెత్తురు ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి : హరీశ్ రావు

Harish Rao | నీళ్లు ఉండి మోటార్లు నడపడం చాతకాని ముఖ్యమంత్రిని నిన్నే చూస్తున్నా: హరీశ్ రావు

Harish Rao | మిగతా మూడు మోటార్లు ఎందుకు బంద్ పెట్టారు..?.. ఎల్లూరు పంప్‌హౌస్‌పై హరీశ్ రావు

Harish Rao | రేవంత్ రెడ్డికి సొంత ఊరి నుంచే కౌంట్‌డౌన్ మొదలైంది : హరీష్‌రావు

Harish Rao | ఇది కౌరవ సభ.. రేవంత్ రెడ్డి కలియుగ దుశ్వాసనుడు.. అసెంబ్లీ వేదికగా హరీశ్‌రావు ధ్వజం

Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..

Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం

Kavitha : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత..బీఆర్ఎస్కు దూరం అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన టార్గెట్‌ను మారుస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్లో తనకు అన్యాయం జరిగిందన్న మాటనే బలంగా వినిపిస్తున్న కవిత..పార్టీ తనను దూరం పెట్టడానికి..తన తండ్రి కేసీఆర్‌కు తనకు గ్యాప్ పెంచడానికి కారణం..వాళ్లే అంటూ పలువురు లీడర్లపై బాణాలు ఎక్కుపెడుతు వస్తున్నారు. మొన్నటి వరకు జోగినపల్లి సంతోష్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత గుంటనక్క అంటూ హరీశ్‌పై అటాక్ చేశారు. అటు కేటీఆర్‌ను అప్పుడప్పుగు గట్టిగానే విమర్శిస్తున్నారు. లేటెస్ట్గా ఇందూరు సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డే తన రాజకీయ ప్రత్యర్థి అన్నట్లుగా మాట్లాడుకొచ్చారు కవిత. దీంతో ఆమె టార్గెట్ మారినట్లే కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. కవిత ప్రశాంత్‌రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక ఆమె లక్ష్యమేంటన్న చర్చ మొదలైంది. కేసీఆర్‌తో తనకు దూరం పెరగడానికి ప్రశాంత్‌రెడ్డే కారణమన్నది కవిత ఆరోపణ. తండ్రీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని విమర్శిస్తూ..మహాభారతంలోని శకునితో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే..కవిత రాజకీయ కథనంలో ప్రశాంత్‌రెడ్డిని ఒక కీలక పాత్రగా చూపించే ప్రయత్నం జరుగుతోందా.? ఇంతకాలం హరీశ్‌రావు చుట్టూ తిరిగిన వివాదం..ప్రశాంత్‌రెడ్డి వైపు తిరగడానికి కారణమేంటన్నది డిస్కషన్‌కు దారితీస్తోంది. ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కవిత ఇందూరునే వేదికగా చేసుకున్నారు. అక్కడే సభలు పెడుతూ..రాజకీయ భవిష్యత్‌పై సంకేతాలు ఇస్తూ వస్తున్న కవిత.. అదే నిజామాబాద్ కేంద్రంగా ప్రశాంత్‌రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్లో అన్యాయం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కవిత కన్నీళ్లపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. ఇది ఆమె వ్యక్తిగత ఆవేదనా.? లేక ప్రజల్లో సానుభూతిని పెంచుకునే రాజకీయ వ్యూహమా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పాలిటిక్స్‌లో సెంటిమెంట్ కూడా ఒక బలమైన ఆయుధమే. ఒక నాయకుడికి అన్యాయం జరిగిందన్న భావనను ప్రజల్లో బలంగా నాటగలిగితే..అది రాజకీయంగా సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది. కవిత కూడా సానుభూతి కార్డుతోనే బీఆర్ఎస్ను బ్లేమ్ చేసే ప్లాన్‌లో ఉన్నారా

సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని.. అప్పుల భారం ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మేమే చెల్లిస్తున్నాం. సర్పంచ్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం. వెయ్యి రోజుల్లో రూ.1.76 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో చెప్పిన మాటను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. వరుస ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కాలేదు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ మేల్కొవడం లేదు. కేటీఆర్ మాటలన్నీ పచ్చి అబద్ధాలు.. అభూత కల్పనలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము. త్వరలో మూడు లక్షల పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. 2014-2018లో ఎన్నికల మ్యానిఫెస్టో లో పోడు భూముల సమస్య తీరుస్తామన్నారు.. తీర్చారా? బీఆర్ఎస్ పాలనలో ఆరాచకాలు మర్చిపోయి వంద రోజుల పాలన అంటూ విమర్శలు చేస్తారా?.’’ అంటూ పొంగులేటి మండిపడ్డారు. హరీష్‌రావుకు పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు. పొడుగు మనిషి 22ఏపై అసెంబ్లీలో ఇరగదీస్తా అంటుండు.. ఎం చేస్తాడో నేను చూస్తా. పక్కా పేపర్ ఆధారాలతో నేను అసెంబ్లీ లోనే సమాధానం చెప్తా.. 22ఏ అడ్డం పెట్టుకుని దందా చేస్తానంటే ఇక నడువదు. ధరణి పేరుతో పక్కరాష్ట్ర రాజులకు భూములను హరీష్ రావు కట్టబెట్టారు. కవిత ప్రశ్నలకు ముందు హరీష్ రావు సమాధానం చెప్పాలి’ అంటూ పొంగులేటి నిలదీశారు. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి కారణంగానే ఆ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆరోపించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ప్రసంగించారు.బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని కవిత విమర్శించారు. ఆ పార్టీ హయాంలో నాలుగు ఇళ్లు మాత్రమే బంగారమయ్యాయని ఎద్దేవా చేశారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్‌లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందించలేకపోయారని దుయ్యబట్టారు.ఈ సందర్భంగా వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్‌రెడ్డి తనను తండ్రి నుంచి దూరం చేశారని, ఆయనకు తన ఉసురు తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌రావును క్షమించినా ప్రశాంత్ రెడ్డిని మాత్రం జీవితంలో క్షమించనని స్పష్టం చేశారు. ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే పుట్టింటి వాళ్లే కుట్ర చేసి తరిమేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.తాను ఏ తప్పూ చేయకపోయినా నాలుగేళ్లుగా ఈడీ, సీబీఐలతో వేధించి తీహార్ జైలులో పెట్టారని కవిత అన్నారు. తాను నిర్దోషినని సుప్రీంకోర్టే చెప్పిందని, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక సీబీఐ అధికారిపైనే విచారణకు ఆదేశించిందని గుర్తుచేశారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే పంతం పట్టి పార్టీ పెట్టానని, పదవుల కోసం కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ప్రతిపక్షంగా

Harish Rao | పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలతో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాజ్ గోపాల్ పేట్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విద్యార్థులను చూసి ఆగి వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. నేను కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థినే. ఆ చదువుల ప్రాముఖ్యత, విద్యార్థుల కష్టాలు నాకు బాగా తెలుసు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు 7 దశాబ్దాల సుదీర్ఘమైన, ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో నిరుపేద విద్యార్థులు ఈ చదువుల ద్వారానే దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారన్నారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న వారిలో 95 శాతం మంది నిరుపేద విద్యార్థులేనని.. నామమాత్రపు ఫీజులు కట్టి, నాణ్యమైన ఇంజనీరింగ్ స్థాయి విద్యను డిప్లొమాలోనే వాళ్లు నేర్చుకుంటున్నారు. పాలిటెక్నిక్‌ను ఐటీఐలో కలపడం వల్ల అది తన స్టేటస్ కోల్పోతుందన్నారు హరీశ్ రావు. ఇప్పుడున్న విధానం ప్రకారం పాలిటెక్నిక్ పూర్తవగానే ఇంజనీరింగ్ సెకండియర్‌లో నేరుగా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. ఐటీఐలతో కలిపితే మళ్లీ ఇంటర్మీడియట్ చదివితే తప్ప ఇంజనీరింగ్ సీటు రాని దుస్థితి వస్తుందని విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంతటి పటిష్టమైన విద్యావ్యవస్థను తెలంగాణ విద్యాచట్టం పరిధి నుంచి తొలగించి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చడం దారుణం. దీనివల్ల నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ చదువులకు దూరమై, వ్యవస్థ పూర్తిగా పతనమవుతుందని తెలిపారు. భవిష్యత్తు గురించి అయోమయంలో విద్యార్థులు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లవుతున్నా నేటికి విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేడు. ఆ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా చూస్తున్నా.. విద్యార్థుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. విద్యార్థులు, మేధావులతో ఎలాంటి ముందస్తు అభిప్రాయ సేకరణ చేపట్టకుండా, కనీస విధివిధానాలు కూడా బహిర్గతం చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం

తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి రాసిన లేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి ఘాటుగా బదులిచ్చారు. హరీష్ రావు ని టార్గెట్ చేశారు.హరీష్ రావుకు పొంగులేటి ఘాటు కౌంటర్తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల వివాదం పైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు, రాహుల్ గాంధీకి రాసిన లేఖకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని మండిపడ్డారు.ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!అవినీతి, కమీషన్ల గురించి మీరే మాట్లాడాలిఅవినీతి, కమీషన్ల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. హరీష్ రావు చేసిన అవినీతి పైన కవితే స్వయంగా అనేక విషయాలు మాట్లాడారని గుర్తు చేశారు.కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు మీ దోపిడీ తెలియదాబీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు ఎలా సంపాదించారో, ఏం వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో బాగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న వారు ఇప్పుడు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం మరోసారి హీట్ పెంచింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.కమీషన్లు, అవినీతి గురించి హరీశ్ రావు మాట్లాడటం చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని హరీష్ రావు డిమాండ్‌చేసిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష హోదాలో ఉండి పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం తప్ప బీఆర్ఎస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు.కమీషన్లు, అవినీతి గురించి హరీశ్ రావు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ఆ పార్టీకి చెందిన నాయకులు, మరీ ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత గతంలో చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు మర్చిపోవద్దని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హరీశ్ రావు ఎలా సంపాదించారో, ఏ వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో భారీగా ఆర్థికంగా ఎదగడానికి కారణమేంటో ప్రజలకు వివరించాలని పొంగులేటి ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్, మెడికల్ కాలేజీల వరకు బీఆర్ఎస్ హయాంలో భారీ అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. తమ పాలనలో కమీషన్ల మీద పనులు జరిగాయని.. అదే విధానం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని బీఆర్ఎస్ భావించడం కేవలం భ్రమేనని అన్నారు. మీ భ్రమను ప్రజలపై రుద్దకండి అంటూ హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి హితవు పలికారు. గతంలో అధికారంలో ఉండి పరిపాలనలో విఫలమైన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నిర్మాణాత్మకంగా వ్యవహరించడం

తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని.. ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తోందని, నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ హరీశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలను 22A లో పెట్టారని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి.. రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. ఈ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)ను పోలీసులు హౌస్ అరెస్టు (house arrest) చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రి (TIMS Hospital) సందర్శనకు బయలుదేరిన హరీశ్‌రావును అనుమతి లేదంటూ కోకాపేటలో గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కోకాపేటలోని ఆయన ఇంటివద్దకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. సనత్‌నగర్ టిమ్స్ కూడా వెళ్లకుండా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)లను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిర్బంధాలు, హౌస్ అరెస్టులను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఆస్పత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish rao and talasani Srinivas yadav arrested: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. ఈ నేపథ్యంలో సనత్ నగర్ లో ఉన్న టిమ్స్ సదుపాయాల కల్పన విషయంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే.. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు, బీఆర్ఎస్ నేతలు సనత్ నగర్ టిమ్స్ ను సందర్శించడానికి బయలు దేరారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మాజీ మంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. హరీష్ రావును ఇంటి నుంచి బైటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కానీ హరీష్ రావు పోలీసులున్ని పక్కకు తోసి మరీ తన వాహంలో ఎక్కి కూర్చున్నారు. పోలీసులు హరీష్ వాహనాన్ని అడ్డగించారు. ఈ నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ గారు సహా మేమందరం టీమ్స్ సనత్ నగర్ వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. టీమ్స్ ఆసుపత్రులను కనీస మౌలిక వసతులు కూడా పూర్తిగా కల్పించకుండానే, అరకొర వసతులతో గుడ్డిగా ప్రారంభించారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసిందని, 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నాలుగు టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో 10 వేల పడకలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టీమ్స్ ఆసుపత్రులకు
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేటలో ఉద్రిక్తత సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అప్రకటిత ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ వార్తకు సంబంధించిన

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ఈ పర్యటన పిలుపు నేపథ్యంతో తెల్లవారుజాము నుంచే కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హరీశ్ రావు ఇల్లు విడిచి బయటకు రాకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో వాతావరణం వేడెక్కింది. ఈ ఆకస్మిక పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా... హరీశ్ రావు హౌస్ అరెస్ట్ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు (Harish Rao) సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు సంబంధించి హరీశ్‌రావు పిలుపునివ్వడంతో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్దకు పోలీసులు చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ వార్తతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్ కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

తమిళనాడు, కర్ణాటకలోని దేవాలయాలను సందర్శించిన తనపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, దేవుడి దర్శనానికి వెళ్లడం తప్పా అని రేవంత్‌ను సూటిగా ప్రశ్నించారు. ఈ ఆరోపణలు తన వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలో భాగమని హరీశ్ రావు ఆరోపించారు. ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలని, లేనిపక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన రేవంత్‌కు సవాల్ విసిరారు. గత ఆగస్టు 15 సమయంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలనుద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు పొరుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు వెళ్లి క్షుద్రపూజలు చేయిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ టెంపుల్ విజిట్స్ వివరాలు ఎందుకు దాచారని ప్రశ్నించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రేవంత్ తన పేరు చెప్పకుండా విమర్శలు చేస్తున్నారని, పేరు చెబితే లీగల్ నోటీసులు పంపుతానని హరీశ్ రావు హెచ్చరించారు. దీంతో దేవాలయాల పర్యటనపై హరీశ్ రావు పూర్తి స్పష్టత ఇచ్చారు. తాను కేవలం ఆధ్యాత్మిక చింతనతోనే తిరుచ్చి శ్రీ రంగనాథస్వామి, కొల్లూరు మూకాంబికా ఆలయాలను సందర్శించానని హరీశ్ రావు వివరించారు. దేవుడి పేరుతో రాజకీయం చేయడం రేవంత్‌కే చెల్లిందని, ఉద్యమ చరిత్ర లేని ఆయనకు తనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, తనను అగ్గిపెట్టెతో పోల్చిన రేవంత్ వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 22ఏ భూముల సెక్షన్ అంశాన్ని హరీశ్ రావు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. చివరికి సీఎం ఇల్లు, ఎయిర్పోర్ట్ భూములు కూడా ఆ జాబితాలో ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకోవడమే లక్ష్యంగా రిజిస్ట్రేషన్ల పేరుతో

ఆయనకు సెగ తగలగానే హడావుడి ముఖ్యమంత్రికి చురుకు తగిల్తేగానీ సామాన్యుల బాధలు పట్టవా? 22ఏను.. ప్రజల్ని దోచుకునే ఆయుధంగా మార్చుకున్నారు: హరీశ్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘భూములను అడ్డగోలుగా 22ఏ జాబితాలో వేయడం.. ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తామని డ్రామాలు ఆడడం ఎందుకు?’’ అని సర్కారుపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు ‘హంతకుడే సంతాపసభ పెట్టినట్టు’ ఉందని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన ఏకంగా ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చారని.. చివరకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఏ ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. సీఎం ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావుడి మొదలైందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్.. నీకు చురుకు తగిలితే కానీ సామాన్యుల బాధలు పట్టవా?’’ అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ల గోడు ఎవరు వినాలని నిలదీశారు. ఎవరి భూమి 22ఏలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు జరిగినపుడు తక్షణమే ఆ భూములను 22ఏ నుంచి తొలగించకుండా రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 22ఏ అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఒక ఆయుధంగా మారిందని.. రెవెన్యూశాఖలో ఏ పని కావాలన్నా, 22ఏ నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ

తెలంగాణలో 22A సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భూములను అడ్డగోలుగా నిషేధిత జాబితాలో చేరుస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆగస్టు 17న తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని లక్షలాది ఆస్తులను రాత్రికి రాత్రి ఈ జాబితాలోకి చేర్చడం దారుణమని విమర్శించారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న సామాన్యుల ఆస్తులను కూడా 22A పరిధిలోకి తెచ్చి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా 1999లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం రద్దయినప్పటికీ, తెలంగాణలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని పూర్తిగా ఎత్తివేశారు. అయితే, ఇప్పుడు పాత సీలింగ్ పరిధిలోని భూములను మళ్లీ 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఏకపక్షమని హరీశ్ రావు పేర్కొన్నారు. శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో 30 ఏళ్లుగా ఉన్న ఫ్లాట్లు, 20 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూడా ఈ జాబితాలో చేర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం చలాన్ డబ్బులు చెల్లించిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ అనుమతి (NOC) పొంది బ్యాంక్ రుణాలు తీసుకున్న ఆస్తులు కూడా ఇప్పుడు 22A జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా, బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీతో పాటు ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రభుత్వ భూములు కూడా ఈ జాబితాలో ఉండటం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. రెవెన్యూ శాఖలో ఏ పని జరగాలన్నా 30% కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కూడా ఇదే 22A జాబితాలో ఉందని, తనకు సెగ తగిలితేనే ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన విమర్శించారు. ఫలితంగా అవినీతి అక్రమార్కులకు ఈ సెక్షన్ ఒక ఆయుధంగా మారిందని, ప్రజల సొమ్మును ప్రభుత్వం నిలువునా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని, దానిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సోమవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి నివాసానికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్రజల గతి ఏమిటి?" అని ప్రశ్నించారు. అసలు ఏ ప్రాతిపదికన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారో విచారణ జరపాలని, ఆ జాబితాలో ఉన్న ఆస్తులు పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆయన విమర్శించారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. CM Revanth reddy visits medaram in mulugu: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుంది. నేతలు పరస్పరంపదునైన వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడకు వెళ్లిన, ఏ సభలో మాట్లాడిన బీఆర్ఎస్ పై విరుచుకు పడుతున్నారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం పర్యటించారు. సమ్మక్క సారాలమ్మను దర్శించుకున్నారు.ఆ తర్వాత మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి ఆప్యాయంగా రాఖీ కట్టి తన అభిమానంను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ములుగుజిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన నేతలకు తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా ఆరోపణలు చేశారు. రక్తం పంచుకుని పుట్టుకున్న మంత్రి సీతక్కను తోడబుట్టిన చెల్లెలిలా చూసుకుంటున్నామని అన్నారు. మరోపక్క.. సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు.. 2 కోట్ల మందికి ఆడబిడ్డలకు ఏం చేస్తాడని కవిత విషయంలో.. కేటీఆర్ ను సీఎం ఏకీపారేశారు. ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని మెడపట్టి బయటకు నెట్టేశారన్నారు. కొడుకు దుర్మార్గం చేస్తుంటే దౌడ మీద కొట్టాల్సిన తండ్రి ఫాంహౌజ్‌లో పడుకున్నాడని.. వీళ్లు తెలంగాణకు పట్టిన శనీశ్వరులంటూ విమర్శలు గుప్పించారు. Read more: Bandi Sanjay: కాంగ్రెస్ ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కొడుకు దుర్మార్గం చేస్తుంటే దౌడ మీద కొట్టాల్సిన తండ్రి ఫాంహౌజ్‌లో పడుకున్నాడని.. వీళ్లు తెలంగాణకు
శివమొగ్గలో అఘోర పూజలు, చేతబడులంటూ సీఎం వ్యాఖ్యలు... కోర్టుకు ఈడుస్తానన్న హరీశ్‌రావు సంగారెడ్డి ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, అల్లకల్లోలం సృష్టించడానికి కర్ణాటకలోని శివమొగ్గలో రహస్యంగా అఘోర పూజలు, చేతబడులు చేశారంటూ మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారని.. హరీశ్ రావు ప్రజలను రెచ్చగొట్టడంలో నంబర్ వన్ అని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కచ్చితంగా కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని తేల్చిచెప్పారు. ఈ వార్తకు సంబంధించిన

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish Rao vs Revanth Reddy: స్వాతంత్య్ర దినోత్సవం రోజు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి చిల్లర మాటలతో పచ్చి అబద్ధాలు ఆడడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రోత మాటలు మాట్లాడి ఉండరు. గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి మహనీయులను తలచుకోవాల్సిన రోజున రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తెరలేపాడు' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి కరెక్టుగా సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి పూర్తిగా 420 మాటలే మాట్లాడారు' అని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15వ తేదీ రోజున సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా మాట్లాడలేదు. సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మూలకు పడేసిందని ఆరోపించారు. వాటి గురించి కనీసం ఒక్క ముక్క కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. 'బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైన మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రోడ్లు తప్ప కాంగ్రెస్ వచ్చాక కొత్తగా ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా

సిద్ధిపేట: సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేది ప్రతీది అబద్దమేనని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఆయన అబద్ధాలే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పరని, ఆయనొక ఘరానా మోసగాడని ధ్వజమెత్తారు. రేవంత్‌కు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 15వ తేదీ) సిద్ధిపేట నుంచి మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్‌రావు.. రేవంత్‌పై ధ్వజమెత్తారు. ‘దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. అసెంబ్లీలో అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయి. రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు బిడ్డవైతే రుణమాఫీ చెయ్యాలి. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. రేవంత్‌రెడ్డి ఘరానా మోసగాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పాలి. ఆనాడు రూ. 1400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెడితే మేం కట్టాం. పిల్లలకు క్షమాపణలు చెబుతావా.. ముక్కు నేలకు రాస్తావా?, నిరుద్యోగుల గురించి రేవంత్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. గన్మెన్లు లేకుండా అశోక్‌నగర్‌కు రాగలవా? అని నిలదీశారు. ‘కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు కంటే రేవంత్ తక్కువ ఇచ్చారు. రూ. 15 వేల కోట్లు రైతు బంధు రేవంత్ ఎగ్గొట్టాడు. 2025-26లో మీరు ఇచ్చింది కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమే. ఇది తప్పు అయితే ముక్కు నేలకు రాస్తా. రేవంత్‌కు ఇదే నా సవాల్. అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. 2 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి యువతను మోసం చేశావు. మూడేళ్లలో 16వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ను కోర్టుకు ఈడుస్తా. నాపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలి. పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగుతా. రైతుబంధు, రుణమాఫీపై దమ్ముంటే అసెంబ్లీ చర్చింద్దాం. కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మీ

Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రసంగంలో 420 అబద్దాలు.. అన్నీ 420 మాటలేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో హరీశ్ రావు మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజు పోరాట యోధుల గురించి తలచుకుంటారు.. స్వాతంత్య్రోద్యమ ఫలితాల గురించి మాట్లాడుతారు.. ఏ ప్రధానమంత్రి , ముఖ్యమంత్రి అయినా కూడా దేశ అభివృద్ధి, దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతారు..కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా ఎవరూ ఉండరేమో అన్నారు. ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల తర్వాత కూడా గవే చిల్లర మాటలు.. గోబెల్స్ ప్రచారం.. ముఖ్యమంత్రి 4:20 నిమిషాలకు ఉపన్యాసం ప్రారంభించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు.. రేవంత్ రెడ్డి ప్రసంగంలో 420 అబద్దాలు.. అన్నీ 420 మాటలేనని మండిపడ్డారు. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి వచ్చినవ్.. ఒక్కమాట ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించో,, సంగారెడ్డి గురించో మాట్లాడినవా.. ? సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా..? నీ ప్రభుత్వం తప్పిదం, నీ చేతగాని తనం వల్ల సింగూరు ఖాళీ చేసినవ్. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఇవాళ మంచినీళ్లు లేవు. నారాయణ ఖేడ్‌లో రెండు రోజులకోసారి నల్లా వస్తుంది. కరువు కాలంలో కూడా ఎండాకాలంలో కేసీఆర్ తండాతండాకు రాష్ట్రం మొత్తం మంచినీళ్లు ఇస్తే.. నువ్వు సింగూరు రిపేర్ చేస్తా అని ఖాళీ చేసినవ్. పోని రిపేర్ అన్నా చేస్తవా అంటే అది కూడా చేయలేదన్నారు. నేడు సింగూరులో నీళ్లు లేక

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. ఈరోజు (శనివారం) సంగారెడ్డిలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజునా చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు ఉండరని విమర్శించారు. సిద్దిపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4:20 గంటలకు ప్రసంగం ప్రారంభించి 420 మాటలు మాట్లాడారని మండిపడ్డారు. ఆయన తన ప్రసంగంలో ఉమ్మడి మెదక్ జిల్లా గురించి ఒక్క మాటా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రేవంత్ చేతకానితనం వల్లే సింగూరు ఖాళీ అయిందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లాకు మంచినీళ్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి బాగుపడాలని గత ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మూలన పడేసిందని నిప్పులు చెరిగారు. జహీరాబాద్‌లో బసవేశ్వర విగ్రహం ప్రారంభించి ఏడాది అయిందని, ఆ రోజు ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలయ్యాయా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో ఈ మూడేళ్లలో ఒక్క రోడ్డు అయినా వేశారా? అని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చారని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, కానీ నేడు సంగారెడ్డిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెబుతున్నారని ఆగ్రహించారు. నిరుపేదలకు రేషన్

సిద్ధిపేట శ్రీరామకుంట వైకుంఠధామాన్ని సరికొత్త రీతిలో ఒక ఆహ్లాదకరమైన పార్కు తరహాలో తీర్చిదిద్దుతున్నామని మాజీ మంత్రి, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని శ్రీరామకుంట శ్మశానవాటికలో సాగుతున్న సుందరీకరణ పనులను ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన... మిగిలిన పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్మశానవాటిక ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా మరిన్ని మొక్కలు నాటాలని హరీశ్ సూచించారు. ప్రజల రాకపోకలకు వీలుగా సీసీ రోడ్లు, భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దహన సంస్కారాల కోసం వచ్చే ప్రజలు వెలుతురు లేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా... వెంటనే సరైన లైటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. వీటితో పాటు టాయిలెట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి శుభ్రత ఉండేలా చూడాలన్నారు. పర్యావరణహిత పద్ధతిలో బయోగ్యాస్ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించేలా చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని అత్యంత విలువైన రాయదుర్గంలో 10.63 ఎకరాల వారసత్వ భూమి వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేడు ఓ లేఖ రాశారు. ఆగస్టు 17, 21 తేదీల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించ తలపెట్టిన వేలాన్ని తీవ్రంగా ఖండించారు.గతంలో ప్రభుత్వ భూములను పూర్వీకులు అందించిన జాతీయ సంపదగా అభివర్ణిస్తూ ఉద్వేగభరిత ప్రసంగాలు చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అవే భూములను అమ్మకానికి పెట్టారంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ పరిసరాలు, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అమ్మేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ భూముల నుంచి రాయదుర్గంలోని వారసత్వ రాతి ప్రదేశాల వరకు తెలంగాణ విలువైన ప్రజా ఆస్తులకు ప్రమాదం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు."వేలం వేయాలని ప్రతిపాదించిన రాయదుర్గం పాన్‌మక్తా గ్రామంలోని సర్వే నంబర్ 83ని ఇప్పటికే హెరిటేజ్ సైట్‌గా ప్రకటించారు. దీని యాజమాన్య హక్కులపై ఎస్బీఐ, వక్ఫ్ బోర్డు మధ్య న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి కేసులు పరిష్కారం కానప్పుడు థర్డ్ పార్టీ ప్రయోజనాలు కల్పించవద్దని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది" అని హరీశ్ రావు తన లేఖలో గుర్తుచేశారు. ఇదే భూముల పరిరక్షణ కోసం 2020లో రేవంత్ రెడ్డి కోర్టులను ఆశ్రయించారని చెప్పారు. "అప్పుడు కోర్టుకెక్కిన మీరే, ఇప్పుడు సీఎం

తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూముల అమ్మకాలపై ప్రశ్నలు సంధిస్తూ సీఎంకు హరీశ్ లేఖ రాశారు. హైదరాబాద్, ఆగస్టు 13: రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూముల అమ్మకాలపై ప్రశ్నలు సంధిస్తూ సీఎంకు హరీశ్ లేఖ రాశారు. ‘ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా? నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన నువ్వు.. నేడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ, ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నావు’ అంటూ ఫైర్ అయ్యారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నేడు రాయదుర్గ్ ఇలా ఎక్కడిక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తుండటం సిగ్గుచేటని మాజీ మంత్రి మండిపడ్డారు. రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నం.83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో TGIIC వేలం వేయడానికి సిద్ధం కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ రేవంత్ కోర్టు మెట్లు ఎక్కారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటనా అని ప్రశ్నించారు. హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం.. వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోందని నిలదీశారు. ఇదే సర్వే నంబర్లో గతంలో 6.2 ఎకరాలు సుమారు ఎకరాకు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే, ఎస్బీఐ కోర్టుకు ఎక్కిందని... ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని వెల్లడించారు. అయినా, అదే సర్వే నంబర్లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటని.. న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా అని ఆగ్రహం వ్యక్తం

వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ అత్యంత భావోద్వేగ వాతావరణంలో జరిగింది. భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరియు హరీష్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట ప్రజల కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. సంతాప సభలో కేటీఆర్ మాట్లాడుతూ మనిషి ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, సమాజం కోసం ఎలా బతికామన్నదే అసలైన విషయమని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి యాత్రకు లక్ష మందికి పైగా ప్రజలు తరలిరావడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పారు. వర్షం పడుతున్నా సరే దాదాపు 12 గంటల పాటు జనం అక్కడే వేచి ఉండటం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందని తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రజల నుండి లభించిన ఆదరణ స్పష్టంగా కనిపిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పార్టీకి మరియు నియోజకవర్గానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని సభలో పలువురు వ్యాఖ్యానించారు. నర్సంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సుదర్శన్ రెడ్డి తన జీవితాన్ని అంకితం చేశారని నాయకులు వివరించారు. ఫలితంగా రాబోయే రెండు సంవత్సరాలలో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి కోరికను నెరవేర్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని సభముఖంగా స్పష్టం చేశారు

ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. వారి పట్ల అవమానకరంగామాట్లాడినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని శనివారం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు. ‘హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే.. దరఖాస్తు చేసుకోవడానికి వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి తరలి రావడం వారి తప్పా? లేక ఉద్యోగాల కల్పనలో విఫలమైన ప్రభుత్వం తప్పా? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తున్నట్టు?’ అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండులక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన సర్కారు 32నెలలు దాటినా అమలుకు నోచుకోలేదన్నారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేల మంది నిరుద్యోగులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా?2 లక్షల ఉద్యోగాల హామీ ఒక బోగస్’అని ఎద్దేవా చేశారు. పీజీలు చేసిన యువత కూడా చిన్న పోస్టుల కోసం పోటీ పడడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు