
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Harish rao and talasani Srinivas yadav arrested: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. ఈ నేపథ్యంలో సనత్ నగర్ లో ఉన్న టిమ్స్ సదుపాయాల కల్పన విషయంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే.. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు, బీఆర్ఎస్ నేతలు సనత్ నగర్ టిమ్స్ ను సందర్శించడానికి బయలు దేరారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మాజీ మంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు.
హరీష్ రావును ఇంటి నుంచి బైటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కానీ హరీష్ రావు పోలీసులున్ని పక్కకు తోసి మరీ తన వాహంలో ఎక్కి కూర్చున్నారు. పోలీసులు హరీష్ వాహనాన్ని అడ్డగించారు. ఈ నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకొవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ గారు సహా మేమందరం టీమ్స్ సనత్ నగర్ వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. టీమ్స్ ఆసుపత్రులను కనీస మౌలిక వసతులు కూడా పూర్తిగా కల్పించకుండానే, అరకొర వసతులతో గుడ్డిగా ప్రారంభించారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసిందని, 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నాలుగు టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
రాబోయే రోజుల్లో 10 వేల పడకలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టీమ్స్ ఆసుపత్రులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. కానీ గత మూడేళ్లుగా టీమ్స్ ఆసుపత్రుల పనులను కావాలనే నత్తనడకన కొనసాగించారన్నారు.
కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఉద్దేశంతో రేవంత్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక టీమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెబుతూ, పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకుండా ప్రచారానికే పరిమితం చేస్తున్నారని కాంగ్రెస్ ను హరీష్ రావు ఏకీపారేశారు.
Read more: KBR పార్క్ చుట్టూ వన్-వే ఎఫెక్ట్.. 10H, 47L, 222A బస్సు రూట్లు మార్పు! ఏ మార్గంలో వెళ్తాయంటే?
టీమ్స్ ఆసుపత్రుల వద్దకు మేము వెళ్తే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందనే భయంతో అడ్డుకుంటున్నారన్నారు. టీమ్స్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించి, అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




