
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Flag Hoisting | కోల్ సిటీ, ఆగస్టు 15: రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి స్వతంత్ర చౌక్‌లో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ జెండావిష్కరణ విషయంలో వివాదం తలెత్తింది. డివిజన్ ప్రధాన కేంద్రమైన స్వతంత్ర చౌక్‌లో ప్రతీ సంవత్సరం గెలిచిన కార్పొరేటర్ ప్రజల సమక్షంలో జెండావిష్కరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆకారపు రేఖ మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వతంత్ర చౌక్ లో ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ భర్త తిరుపతి తన అనుచరులతో వచ్చి ఇక్కడ తామే జెండా ఎగురవేయాలని వారించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణంకు దారి తీసింది. దీంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సముదాయించి ఎవరికి వారుగా వేడుకలు జరుపుకోవాలని సూచించి వెళ్లగొట్టారు. శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన పంద్రాగస్టు వేడుకలకు మరెక్కడా లేనివిధంగా 51వ డివిజన్లో మాత్రమే పోలీసులు బందోబస్తు కల్పించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు అయోమయానికి లోనయ్యారు. చివరకు ఒకే చోట ప్రక్కప్రక్కనే రెండు జాతీయ జెండాలు ఎగరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమైక్యతకు స్ఫూర్తిగా నిలవాల్సింది పోయి వేడుకల్లో ఆధిపత్యం ప్రదర్శించడం, ప్రజా తీర్పుతో గెలిచిన కార్పొరేటర్ ను అవమానించడం పట్ల స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ రేఖ మహేశ్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలను వేదికగా చేసుకొని మాజీ కార్పొరేటర్ రాజకీయం చేయడం, పైగా తన పట్ల దౌర్జన్యంకు దిగడం, కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్పొరేటర్‌గా ఇక్కడ జెండా ఎగురవేయడం అనేక

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ జాతీయ గేయం వందేమాతరం ఆలాపనను ఆపాల్సిందిగా అక్కడి సిబ్బందికి చేత్తో సంజ్ఞలు చేస్తోన్నట్లు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అదే విధమైన సైగలు చేయడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం ఖర్గే.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడుతుండగా సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.వందేమాతరం పూర్తి వెర్షన్ ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు అసహనానికి గురైనట్లు కనిపిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ విమర్శించారు. దేశ విభజనకు ముందు ఉన్న నాటి పాత మనస్తత్వమే కాంగ్రెస్ లో ఇప్పటికీ కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు దేశం పట్ల ఏ మాత్రం భక్తిభావం లేదని, విభజించి పాలించు దోరణిని కనపర్చుతోందని మండిపడ్డారు.ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించినది అసలు మన దేశ జాతీయ పతాకమే కాదు- ఆ దేశానిదిఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఖర్గే కోసం ఆమె ఓ కుర్చీని తీసుకుని రావాలంటూ ఆమె సిబ్బందిని కోరుతూ చేతిని ఊపారని వివరణ ఇచ్చింది. వృద్ధాప్యం కారణంగా ఖర్గే ఎక్కువ సేపు నిల్చోలేకపోయారని, ఇబ్బంది పడటాన్ని గమనించిన సోనియా గాంధీ ఆయన కూర్చోవడానికి కుర్చీని తీసుకుని రావాలంటూ అక్కడి సిబ్బందికి చేత్తో సైగలు చేశారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీన్ని కూడా

Nellore: నెల్లూరు జనసేన ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ! ఈ వార్తకు సంబంధించిన

Nirmal: మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ! ఈ వార్తకు సంబంధించిన

Mahabubabad: మహబూబాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్వాతంత్ర వేడుకలు! Mahabubabad: మహబూబాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని, వారి త్యాగాల స్ఫూర్తితో దేశ సేవకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు. పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మరింత సన్నిహితంగా ఉంటూ వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరంగా వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుత ప్రవర్తన పాటించాలని, ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. అనంతరం పోలీస్ అధికారులకు సేవా పతకాలు అందచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత, శాంతి, భద్రత కోసం తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎస్పీ ఆకాంక్షించారు

హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు. సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరావతి, ఆగస్టు 15: ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈఏడాది తొలిసారిగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జాతీయ జెండా వేడుకలను నిర్వహించారు. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. ఏపీ అసెంబ్లీలో 80వ స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయోద్యమ నాయకులు, రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులకు స్పీకర్ ఘన నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఏపీ శాసనసభ ఐదు కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు చిత్తూరు గురుజాల జగన్మోహన్, పూతలపట్టు మురళీమోహన్, చూడ చైర్మన్ కటారి హేమలత, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డుడి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పాల్గొన్నారు. కడప జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన స్వాతంత్ర్య

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Minister Anam Ramanarayana Reddy Ill Health: ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జరిగింది. జెండా ఆవిష్కరించిన తరువాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగిస్తుండగా స్టేజీ పైన ఒక్కసారి కుప్పకూలిపోయారు. దీంతో ఉలిక్కిపడ్డ ఆనం భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో పెద్ద గండం తప్పింది. దీంతో వారు అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ఆనంకు ప్రాథమిక చికిత్స అందించారు. ఇక మంత్రి ఆనంను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. గంటకు పైగా నిలబడి ప్రసంగించడంతో అస్వస్థత నెలకుందని చెప్పుకొచ్చారు. కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆనం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆ రోజు ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. డాక్టర్లు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఆనం పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దు చేస్తారా లేదా కొనసాగుతాయా అనేది చూడాలి మరి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. CM Revanth Independence Day 2026 Speech: జై తెలంగాణ' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ అహింసా మార్గం, జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య పోరాటాలను, మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశంలో జరిగిన హరిత, శ్వేత, నీలి విప్లవాల అభివృద్ధిని ప్రస్తావించారు. గత 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేస్తూ సంక్షేమ పథకాలను విస్తరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే 91 శాతం ఉందనే సానుకూల అంశాన్ని వెల్లడించారు. వ్యవసాయ రంగం.. రైతుల సంక్షేమం.. రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. యాసంగిలో 8,500 కొనుగోలు కేంద్రాల ద్వారా 81,12,000 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, వ్యవసాయంలో తెలంగాణ పంజాబ్‌ను మించిందని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత.. సంక్షేమ పథకాలు.. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతిరోజూ 34 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీ, శిల్పారామం వేదికలుగా కల్పిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డులు.. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి స్మార్ట్ కార్డుల

దేశం శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ వరుసగా 13వ సారి ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేయడం విశేషం. ఈ ఏడాది వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటలో జాతీయ గీతం ‘వందేమాతరం’ పాడారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ గీతానికి నివాళిగా ఈ చారిత్రక అడుగు వేశారు. ఎన్సిసి క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు కలిసి వందేమాతరం పాడగా, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన వినిపించింది. ప్రధాని మోదీ ముందుగా రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటకు చేరుకుని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అధికారుల స్వాగతం స్వీకరించారు. గౌరవవందనం తీసుకున్న తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వదేశీ 105 మి.మీ. ఫీల్డ్ గన్లతో 21 తుపాకుల గౌరవార్థన జరిగింది. వాయుసేన హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, అధికారికంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ సందర్భాన్ని చారిత్రకంగా అభివర్ణించారు. దీంతో దేశ ప్రజల్లో సరికొత్త ఉత్సాహం నిండింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ప్రతి హృదయంలో వందేమాతరం ధ్వనిస్తోందని చెప్పారు. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఎర్రకోట నుంచి వందేమాతరం మారుమ్రోగుతోందని పేర్కొన్నారు. 150 సంవత్సరాలు పూర్తయిన జాతీయ గీతానికి దీనికంటే అనుకూలమైన రోజు మరొకటి ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు, మహాత్మా గాంధీకి ఆయన నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా చిన్న కలలతో ఇకపై సరిపోదని, పెద్ద కలలు కనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఫలితంగా

1947 ఆగస్టు 15న భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న వేళ రాజధాని ఢిల్లీలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆ తొలి ఉదయం ఢిల్లీ వీధులు, మైదానాలు జనసంద్రంగా మారిన తీరును చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు 14 అర్ధరాత్రి న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంతో భారత్ స్వతంత్ర దేశంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. గడియారం 12 గంటలు కొట్టగానే అసెంబ్లీలో శంఖనాదం మోగగా, వెలుపల వేలాది మంది ప్రజలు జాతీయ నినాదాలతో హోరెత్తించారు. స్వాతంత్య్రం వచ్చిన ఆ రాత్రి నుంచే ఢిల్లీ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు అసెంబ్లీ భవనం వద్దకు వచ్చి చేరారు. సమకాలీన సైనిక రికార్డుల ప్రకారం అర్ధరాత్రి సమయంలోనే దాదాపు 3 లక్షల మంది పౌరులు రహదారులపై గుమిగూడి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయినా కూడా వేలాది మంది ప్రజలు రాత్రంతా ఫుట్‌పాత్‌లపైనే నిద్రించి చారిత్రక ఘట్టాల కోసం వేచి చూశారు. ఆగస్టు 15 ఉదయం రాష్ట్రపతి భవన్లో గవర్నర్ జనరల్ ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త మంత్రిమండలి ప్రమాణం చేయడంతో పాటు 31 తుపాకుల సెల్యూట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆ రోజు మధ్యాహ్నం ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ పార్క్‌లో భారీ ప్రజా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. కేవలం 30 వేల మంది వస్తారని అధికారులు అంచనా వేసినప్పటికీ అనూహ్యంగా 5 లక్షలకు పైగా ప్రజలు తరలిరావడంతో అక్కడ ప్లాన్ చేసిన పరేడ్ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో భారీ జనసముద్రం మధ్యలోనే నెహ్రూ మరియు లార్డ్ మౌంట్‌బాటన్ ఎంతో శ్రమించి వేదికపైకి చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జెండా ఎగురవేసే ఆ చారిత్రక సమయంలో ఆకాశంలో వర్షం కురిసి ఇంద్రధనుస్సు కనిపించడాన్ని ప్రజలంతా శుభసూచనగా భావించారు. ఫలితంగా దేశవ్యాప్తంగా స్వేచ్ఛా ఉత్సాహం వెల్లువెత్తినప్పటికీ, మరోవైపు దేశ విభజన వల్ల

గోల్కొండ కోటలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం భారత స్వాతంత్య్ర పోరాటమని అన్నారు. అహింసతోనూ విజయాన్ని సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించారని చెప్పారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.స్వాతంత్య్రం జీవనానికి ఆధారమని, దానికి వెల కట్టలేమని గాంధీజీ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం ద్వారా దేశంలోని వివిధ రంగాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు కృషి చేశాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను అందించడంతో పాటు విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా గాడిలో పెడుతున్నామని చెప్పారు. తమ సంక్షేమ పథకాలను కేవలం ఆర్థిక లెక్కలతో చూడటం లేదని స్పష్టం చేశారు. సంక్షేమంలో మానవీయత ఉందని, పేదల పట్ల బాధ్యత ఉందని అన్నారు. వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపనతో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల కోసం లేదా మొక్కుబడిగా సంక్షేమాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.32 నెలల్లో ప్రభుత్వం చేసిన కృషి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని ఆఫీసులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు 15: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని ఆఫీసులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు. నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్ గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు 15: గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందాన్ని సీఎం స్వీకరించారు. ఇక, గోల్కొండ కోటపై తొలిసారిగా ‘వందేమాతరం’ గీతాలాపన చేశారు. దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Independence Day 2026: వరుసగా 13 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర భద్రత బలగాలు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గేయం.. ఈ ఏడాది ఎర్రకోటలో జరగబోయే స్వాతంత్ర్య వేడుకల్లో రెండు ప్రత్యేక అంశాలు ఉన్నాయి. మొదటిది వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై తొలిసారిగా ఆ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. రెండవ ప్రధాన అంశం యువ శక్తి – వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో యువత ఆశలు, ఆకాంక్షలు, దేశ నిర్మాణంలో వారి పాత్రను హైలైట్ చేసే విధంగా వేడుకలను రూపొందించారు. జ్ఞాన్పథ్పై దాదాపు 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు వందే మాతరం ఆకారంలో నిలబడతారు. వీరిలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన బాలురు, బాలికలు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ మన జాతీయ గీతమైన జనగణమణను ఆలపిస్తుండగా.. దీని స్ధానంలో ఈసారి వందేమాతర గీతాన్ని ఆలపించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత శక్తి అందించే తోడ్పాటు ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తంగా ఉంటుందని కూడా కేంద్రం వెల్లడించింది. అయితే

ఎర్రకోట వద్ద పటిష్ఠ భధ్రత.. వందేమాతరం గీతాలాపన తర్వాత సభా ప్రాంగణంలో వాయు సేన విమానాలతో పూల వర్షం.. పంద్రాగస్టు వేడుకలు హాజరైన కేంద్ర మంత్రులు, విద్యార్ధులు, వివిధ రంగల ప్రముఖులు.. అలరిస్తున్న విద్యార్ధులు, సైనిక దళాల కవాతు.. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా వందనం ముందు వందేమాతరం గీతాలాపన..మరికాసేట్లో ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండాను ఎగరేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటకు వెళ్లేముందు రాజ్ ఘాట్‌ను సందర్శించిన ప్రధాని మోడీ.. కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Independence Day 2026 Live Updates: దేశ వ్యాప్తంగా ప్రజలు 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. 1947లో బ్రిటిష్ పాలనకు విముక్తిగా ప్రతి యేడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై మువ్వెన్నల జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఇక భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా 13వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ భారత ప్రధాని ఎర్రకోట నుంచి ఎలాంటి సందేశం ఇస్తారనేది దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి దేశ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Har Ghar Tiranga 2026: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. అందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ ప్రోగ్రాం పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లోని తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా' అభియాన్ ప్రోగ్రామ్‌లు నేటి నుంచి “హర్ ఘర్ తిరంగా అభియాన్”కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో 'తిరంగా యాత్ర'లను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ కోరారు. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వామ్యమై స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుగా, ఆగస్టు 12 నుంచి 14 వరకు మహాపురుషులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి, స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి కూడలిలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రతి పౌరుడిని మానసికంగా