
Mahabubabad Sp Dr Shabarish Hoists National Flag 173265
Mahabubabad: మహబూబాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్వాతంత్ర వేడుకలు! Mahabubabad: మహబూబాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా.
Mahabubabad: మహబూబాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్వాతంత్ర వేడుకలు!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని, వారి త్యాగాల స్ఫూర్తితో దేశ సేవకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
పోలీసు శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో మరింత సన్నిహితంగా ఉంటూ వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరంగా వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుత ప్రవర్తన పాటించాలని, ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు.
అనంతరం పోలీస్ అధికారులకు సేవా పతకాలు అందచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత, శాంతి, భద్రత కోసం తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎస్పీ ఆకాంక్షించారు.





