
New Delhi | 26 ఏళ్ల యువకుడిలో గర్భసంచి.. ఇన్ఫెర్టిలిటీ పరీక్షలో బయటపడ్డ అరుదైన లక్షణం
New Delhi | 26 ఏళ్ల యువకుడిలో గర్భసంచి.. ఇన్ఫెర్టిలిటీ పరీక్షలో బయటపడ్డ అరుదైన లక్షణం
© 2026 nimisham.in

New Delhi | 26 ఏళ్ల యువకుడిలో గర్భసంచి.. ఇన్ఫెర్టిలిటీ పరీక్షలో బయటపడ్డ అరుదైన లక్షణం

Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్

New Delhi | ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ పేలుడు.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

Delhi University | ఏడు లక్షల మందికి 8 వేల గదులు.. గత్యంతరం లేకనే పీజీల్లో బస..!

New Delhi | పీజీ భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం..!

Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..

దిల్లీ: విశాఖ పాత విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసుల నిలిపివేతపై దాఖలైన పిల్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఏపీ హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. భోగాపురం ఎయిర్‌పోర్టుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. పాత విమానాశ్రయం నుంచీ విమాన సర్వీసులు నడపాలని విశాఖకు చెందిన కొసరాజు గోపాలకృష్ణ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం విచారణ చేపట్టింది. కొత్త ఎయిర్పోర్ట్ నగరానికి 60 కి.మీ దూరంలో ఉందని, కనెక్టివిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. 30 ఏళ్ల పాటు సేవలు అందించిన విశాఖ విమానాశ్రయంపై ఎయిర్పోర్ట్ అథారిటీ రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. భోగాపురం విమానాశ్రయం ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’తో నిర్మించడం ఆహ్వానించదగినదని.. అలా అని 30 ఏళ్ల పాటు సేవలు అందించిన ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు లేవని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు. 'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని

తనకు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ అగ్రనేతలకు ఇప్పటికే రాతపూర్వకంగా వివరించినట్లు కొండా సురేఖ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వ్యక్తిగతంగా కలిసి తాజా పరిణామాలపై మాట్లాడినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర ముఖ్య నేతలకు కూడా తన వాదనను లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో తనపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించానని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరానని తెలిపారు. పార్టీ నాయకత్వం తన వివరణ విన్న తర్వాత ఆలోచిస్తామని చెప్పిందని వెల్లడించారు. ప్రస్తుతం తనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై వేచి చూస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన రాజకీయ జీవితంతో ముడిపెట్టడం సరికాదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుమార్తెకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉందని, ఆమె తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు స్వయంగా తీసుకుంటుందని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఆమె మరో కుటుంబంలో భాగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండవచ్చని అన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను తాను ఖండించబోనని, అదే సమయంలో సమర్థించబోనని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది అనేక అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటారని, కేవలం తన కుమార్తె కావడం వల్ల ఆమె మాటలకు తనను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తాను, తన భర్త రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు వేరని, కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాలు వేరని పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలిపారు. తనపై మాత్రమే చర్యల విషయంలో చర్చ జరగడంపై కొండా సురేఖ ప్రశ్నలు సంధించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తన విషయంలో ఒక విధమైన ప్రమాణాలు, క్యాబినెట్‌లోని ఇతర సామాజిక వర్గాల నేతల విషయంలో మరో విధమైన ప్రమాణాలు అమలు చేస్తారా అని ప్రశ్నించారు. ఇతర మంత్రులపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై పార్టీ వైఖరి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha targets cm revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వివాదం అంశంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కొండా సురేఖ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. పదేండ్ల పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, తొలుత చర్యలు ఆయనపై తీసుకొవాలని ఏకీపారేశారు. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు. ఇక తాజాగా.. మరల మీడియా సమావేశంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతో మా మీద బలవంతంగా మాట్లాడించారన్నారు. ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడలేదు.. ఫోన్ చేసి పిలిస్తే బలవంతంగా వెళ్లామని వాళ్లే చెబుతున్నారన్నారు. వెనకనుండి మాట్లాడించిన వాళ్ల పేర్లు చెప్పదలుచుకోలేదన్నారు. కానీ ఎవరు చెప్పించారో మాకు తెలుసని కొండాసురేఖ పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడిందన్నారు. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టమన్నారు. నేను బీసీ మహిళా మంత్రిని.. నా భర్త మున్నూరు కాపు, నేను పద్మశాలి కులమని, మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయన్నారు. నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఒకపక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదని గొడవ నడుస్తుందన్నారు. అసలు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని మాట్లాడారు. నన్ను ఏమైనా చేయాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే, మరోవైపు.. కేంద్రమంత్రులతో సమావేశం అవుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న రక్షణ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు, అలాగే హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026, రక్షణ ఎక్స్పో-2026పై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో చర్చించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులతో పాటు ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, అత్యాధునిక భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రక్షణ ఎక్స్పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు కేంద్ర రక్షణశాఖ సహకారం అందించాలని కోరారు. ఎయిర్‌షోకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు సహకరించాలని.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్‌పోలో ప్రదర్శించాలని కోరారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్ఏఎల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha sensational comments on cm revanth reddy: మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పిలవలేదని కాసేటికి క్రితం చెప్పారు. అయితే.. తాజాగా.. మంత్రి కొండా సురేఖ చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఆయన .. పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారని అన్నారు. మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని ఢిల్లీ వేదికగా తిరుగుబావుట ఎగురవేశారు. తనను రాజీనామా చేయమని ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం చెప్పలేదన్నారు. అంతే కాకుండా వివాదాలల్లో.. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?.. అంటూ ఫైర్ అయ్యారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటికి ఏం సమాధానం చెబుతారు?.. ఏం చర్యలు తీసుకుంటారు?.. అంటూ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానంపై తన ధిక్కార స్వరం వినిపించారు. అంతే కాకుండా తన వివాదంకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కు అన్ని విషయాల్ని రాతపూర్వకంగా తెలియజేసినట్లు మంత్రి కొండాసురేఖ తెల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచేశాయి. ఇప్పటి వరకు తెలంగాణలో సీఎం రేవంత్ పై మండిపడిన మంత్రి కొండా

ఆంజనేయుడి కంటే ముందే రామాయణంలో సీతమ్మ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుడు జటాయువు. అదే పేరుతో ఢిల్లీ జూలో నివసిస్తున్న ఒక ఈజిప్షియన్ రాబందు జీవితం కూడా ఒక రకంగా విషాదకరమైన పోరాటమే! గత ఇరవై ఏళ్లుగా నాలుగు గోడల మధ్య, ఎవరూ లేని ఒంటరితనంతో.. నిశ్శబ్దంగా నరకం అనుభవించిన ఈ జటాయువు జీవితంలోకి ఎట్టకేలకు ఒక వెలుగురేఖ రాబోతోంది. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. అతనికి ఒక భాగస్వామిని తెచ్చేందుకు ఢిల్లీ జూ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్వేషణ మొదలుపెట్టారు.సుమారు ఇరవై ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తూ దారితప్పి, గాయపడి ఢిల్లీ తీరంలో వాలినప్పుడు అధికారులు ఈ రాబందును రక్షించారు. ఢిల్లీ జూకి తీసుకొచ్చి ప్రేమాభిమానాలతో జటాయువు అని పేరు పెట్టారు. అయితే కాలం గడిచేకొద్దీ వయోభారం, ఆరోగ్య సమస్యలతో జూలోని మిగతా రాబందులు ఒక్కటొక్కటిగా కన్నుమూశాయి. చివరికి జటాయువు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.సాధారణంగా ఈజిప్షియన్ రాబందులు 25 ఏళ్లకు పైగానే జీవిస్తాయి. 5 ఏళ్ల వయస్సు నుంచే జంటగా మారి ఒకే భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటాయి. కానీ మన జటాయువు మాత్రం తన జీవితంలోని బంగారంలాంటి సమయాన్నంతటినీ తోడు లేకుండానే గడిపేశాడు. ఇప్పుడు ఈ ఒంటరితనానికి ముగింపు పలికేందుకు అధికారులు నిబంధనల ప్రకారం జంతు మార్పిడి విధానంలో రెండు ప్రముఖ జూలతో చర్చలు జరుపుతున్నారు.జూలో ఒంటరి జీవితాలు.. మరో 16 జీవులకు తోడు కోసం వెతుకులాట!కేవలం జటాయువు మాత్రమే కాదు, ఢిల్లీ జూలో తోడు లేక రోదిస్తున్న జీవులు మరో 15 వరకు ఉన్నాయి. 2021లో తీసుకొచ్చిన రెండు మగ ఆస్ట్రిచ్లకు (ఉష్ట్రపక్షులు) ఆడ తోడు లేదు. అలాగే 2018 నుంచి ఒక రియా పక్షి, 2022 నుంచి ఒక మగ బార్న్ గుడ్లగూబ, గ్రే లాంగూర్, బ్లాక్ స్వాన్, చిన్న భారతీయ పునుగుపిల్లి వంటివి కూడా జంటలు లేక ఒంటరిగా
Delhi Bus Safety Guidelines 2026 : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు మంగళవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు, మహిళల రక్షణకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఢిల్లీలో నడిచే స్థానిక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని బస్సుల్లోనూ.. పానిక్ బటన్లు కచ్చితంగా పని చేయాల్సిందేనని, అలాగే కిటికీలకు పర్దాలు కూడా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దారుణ ఘటనతో కదిలిన యంత్రాంగం..!ఆగస్టు 4వ తేదీ రాత్రి గ్రేటర్ నోయిడాలో బస్సు ఎక్కిన మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి అనంతరం బాధితురాలిని దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన బస్సు కిటికీలకు లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు కిటికీల పర్దాలు కప్పి ఉంచడం, అలాగే నిబంధనల ప్రకారం పనిచేసే సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడం నేరస్థులకు కలసివచ్చింది. 2012 నాటి నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ఉదంతంతో.. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిబంధనలను కఠినతరం చేసింది.పర్దాలపై నిషేధం.. పానిక్ బటన్స్ తప్పనిసరినూతన నిబంధనల ప్రకారం.. బస్సు కిటికీలకు ఉండే పర్దాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే విండో ఫిల్మ్‌లను పూర్తిగా నిషేధించారు. విండ్‌షీల్డ్, వెనుక అద్దాలు, పక్క కిటికీల పారదర్శకత చట్టబద్ధంగా ఉండాల్సిందే. బస్సుల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లు, పానిక్ బటన్లు నిరంతరం పనిచేసే స్థితిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా పానిక్ బటన్లను అమర్చాలి. వీటితో పాటు పని చేసే అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సులో పానిక్ బటన్స్, వాహనం ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని బస్సు ఆపరేటర్లకు స్పష్టం చేసింది. ఇవి అన్ని వేళల పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్సు కిటికీ అద్దాలకు కర్టెన్స్ వేయవద్దని పేర్కొంది. అనధికారికంగా కిటికీ అద్దాలకు ఫిల్మ్ అతికించవద్దని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని బస్సు ఆపరేటర్లు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి చేరుకునే వాహనాలతోపాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. మహిళ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బస్సుల్లో డ్రైవర్, కండక్టర్ తదితర సిబ్బందిని నియమించే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆపరేటర్లకు సూచించింది. అలాగే బస్సుల్లో పానిక్ బటన్లు, వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ పరికరాలు కచ్చితంగా పని చేస్తూ ఉండాలంది. ఇవి అన్ని వేళలా పని చేస్తుండాలని తెలిపింది. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదే విధంగా ప్రతి బస్సులో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో వినియోగించే పరికరాలతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలంది. అదే విధంగా రాత్రి లేదా రద్దీ లేని సమయాల్లో బస్సులను సురక్షితమైన, తగినంత వెలుతురు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిలిపి ఉంచేలా చూడాలని ఆపరేటర్లకు స్పష్టం చేసింది. బస్సులో సిబ్బంది ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా సీపీఆర్‌లో ఫిర్యాదు చేయాలని మహిళా ప్రయాణికులను కోరింది. ఈ నిబంధనలు అమలు చేయకుంటే కఠిన చర్యలు తప్పవని బస్సు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని సంతరించుకుంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణతో పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆమోదం కోసం ఆయన వేణుగోపాల్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసులు, వారు సమర్పించిన వివరణలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. వీరిపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అధిష్ఠానం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది

ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న మరో నిర్భయ తరహా దారుణ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, బాధితురాలిపై దారుణం జరిగిన ప్రైవేట్ స్లీపర్ బస్సును ఎన్హెచ్ఆర్సీ సభ్యులు స్వయంగా పరిశీలించారు. ఈ ఘోరానికి సంబంధించి ఢిల్లీ పోలీస్ కమిషనర్, గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్, మైన్‌పురి ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. విచారణ పురోగతి, బాధితురాలికి అందించిన పరిహారం వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రెండు వారాల్లోపు సమర్పించాలని ఆదేశించింది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని (16) ఆగస్టు 4న తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడా సెక్టార్-63లోని బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పొరపాటున గ్రేటర్ నోయిడా పరిచౌక్ వద్ద బస్సు దిగింది. జోరు వానలో సెక్టార్-63 వైపు వెళ్లే వాహనం కోసం వేచి చూస్తుండగా, సుర్జాపూర్ నుంచి వస్తున్న 'విశ్వనాథ్' అనే ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)లు తాము సెక్టార్-63 వైపే వెళ్తున్నామని నమ్మబలికి ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారు. 47 కిలోమీటర్లు నరకం బాధితురాలు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన నిందితులు, బస్సు కర్టెన్లు మూసివేసి లైట్లు ఆర్పివేశారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి, కశ్మీరీ గేట్ వద్ద ఆమెను దింపివేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న బాధితురాలు ధైర్యం చేసి ఆటోలో సమీప పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బస్సులోని సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో, మార్గమధ్యలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ పోలీసులు పక్కా ఆధారాలతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్ట్

కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు పోస్టు ద్వారా బెదిరింపులేఖ వచ్చింది. 'కరుడుగట్టిన ఉగ్రవాదులు' త్వరలోనే హత్య చేస్తారని లేఖ పంపిన వ్యక్తి హెచ్చరించాడు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్‌కు ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. పోస్ట్ (తపాలా) ద్వారా వచ్చిన ఒక సంతకం లేని లేఖలో, 'కరుడుగట్టిన ఉగ్రవాదులు త్వరలోనే నిన్ను హత్య చేస్తారు' అని హెచ్చరించినట్లు ఆయన కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ లేఖలో రెండు మొబైల్ నంబర్లును కూడా పేర్కొన్నారు. హోం కార్యదర్శికి ఫిర్యాదు.. విచారణకు విజ్ఞప్తి తీవ్రమైన ఈ బెదిరింపు లేఖపై చిరాగ్ పాశ్వాన్ అదనపు ప్రైవేట్ కార్యదర్శి ఆలోక్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అత్యవసర లేఖ రాశారు. బెదిరింపు లేఖ మూలాలు, దాని ప్రామాణికతపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్‌కు కేంద్ర హోంశాఖ ద్వారా 'Z' కేటగిరీ భద్రత ఉంది. అయితే, ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించి, అవసరమైతే మరింత భద్రతను పెంచాలని హోం కార్యదర్శిని కోరారు. కేంద్రమంత్రి రాబోయే బహిరంగ కార్యక్రమాలు, పర్యటనలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది, లేఖ వెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది జులై నెలలో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని నడ్డా పేర్కొన్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు నడ్డా తెలిపారు. విద్యార్థులు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ యువత, విద్యార్థుల అభ్యున్నతి, వికాసమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నడ్డా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 5న నిర్వహించాల్సిన ర్యాలీని విరమించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించడాన్నీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వాగతించారు. కాగా, నీట్ పేపర్ లీక్‌తో దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కొన్ని వారాలపాటు ఆందోళనలు కొనసాగగా.. జులై 20 నుంచి 25 మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను సుప్రీంకోర్టు నేడు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీజేపీ నిరసనలకు సంబంధించిన కేసులను ఉపసంహరించుకుంటామని, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు కానున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన సీజేపీ నిరసనలపై దేశంలో ఎక్కడా ఎఫ్ఐఆర్లను నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2,873 నేరచరిత్ర కలిగిన వారి నేపథ్యంలో వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుపై పోలీసులకు సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం చెల్లింపులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. విధివిధానాలు రూపొందించిన మూడు నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలరని చెప్పింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలనే షరతుకి లోబడి ఆర్టికల్ 142 కింద ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నామని, ఈ విధానాన్ని రాష్ట్రాలు సైతం పాటించవచ్చని పేర్కొంది. ‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ రద్దు విద్యార్థులపై కేసుల ఉపసంహరణతో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. మరోవైపు, అంతకుముందు ఎఫ్ఐఆర్ల రద్దుకు సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు ఢిల్లీ , బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర పోలీసులు. రెండు పక్షాలు పరస్పర నమ్మకంతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సీజేఐ చెప్పారు. విద్యార్థులను ప్రత్యర్థులుగా భావించడం లేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్ కొబ్బరికాయ కొట్టేస్తా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School girl dies in delhi after teacher stand in sun punishment: సాధారణంగా సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంతో గౌరవంగా చూస్తారు. టీచర్లు తమ పిల్లలకు పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా చెబుతారని తల్లిదండ్రులు వారిపైన ఎంతో నమ్మకాలు పెట్టుకుంటారు. కానీ ఇటీవల కొంత మంది ఉపాధ్యాయుల ప్రవర్తన వారి పవిత్రమైన వృత్తికే మాయనిమచ్చగా మారుతుంది. కొంత మంది తప్పతాగి క్లాసులకు రావడం, తోటి మహిళ సిబ్బంది పట్ల నీచంగా ప్రవర్తించడం, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారి పనులు చేయించుకొవడం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం స్టూడెంట్స్ పట్ల పైశాచీకంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్‌లోని సర్వోదయ కన్యా విద్యాలయం ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల పదేళ్ల బాలిక స్కూల్ లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి పడిపోయినట్లు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. అయితే.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా గంటల వ్యవధిలోనే చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర దుమారం రాజుకుంది. దీనిపై అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పదేళ్ల విద్యార్థిని స్కూల్ కు పుస్తకం తెలేదని విషయంలో టీచర్ ఆమెను ఆగస్టు 27న రోజంతా ఎండలో నిలబెట్టింది. దీంతో బాలిక ఆరోగ్యం క్షీణించింది. తర్వాత పాఠశాల వారు బాలిక తల్లి అంజలికి ఫోన్ చేశారు. తమ కూతురు స్కూల్ కు వెళ్లే వరకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబ

కొండా సురేఖ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో సురేఖ పైన నిర్ణయం ఉంటుందని అందరూ భావించారు. పార్టీ నాయకత్వం క్రమిశిక్షణా సంఘం చేసిన సిఫారసు మీద నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. అయితే, అనూహ్యంగా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రేవంత్ కంటే ముందే పార్టీ హై కమాండ్ తో భేటీ కానున్నారు. దీంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది.కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారు. తాజా వివాదం వేళ పార్టీ క్రమశిక్షణా సంఘం కొండా పైన వేటు వేయాలని పార్టీ నాయకత్వానికి సిఫారసు చేసింది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనతో నిర్ణయం ఆలస్యం అయింది. ఆయన విదేశాల నుంచి రావటంతో కొండా సురేఖ నేరుగా ఆయన ఆప్పాయింట్ మెంట్ కోరారు. ఢిల్లీ రావాలని సూచించటంతో వెంటనే బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఇదే సమయంలో రేవంత్ సైతం ఢిల్లీకి బయల్దేరారు. సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి హస్తిన కు వెళ్లనున్నారు. రేవంత్ ఈ రోజు, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ వివాదంలో తొలి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు.. తన వివరణ లేఖ.. తాజా పరిస్థితుల పైన చర్చించే అవకాశం ఉందని సమాచారం. తిరుపతికి విమానాల రాకపోకల షెడ్యూల్ మార్పు, కొత్త టైమింగ్స్..!!హైకమాండ్ నిర్ణయం వేళకాగా, అటు రేవంత్ మద్దతుగా నిలుస్తున్న నేతలు మాత్రం సురేఖతో పాటుగా చిన్నారెడ్డి పైనా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు లేఖలు రాసారు. ఇక.. రేవంత్ సైతం తన వాదన పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసారు. చర్యలు తీసుకోకుంటే పార్టీలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని సూచిస్తున్నారు. ఇక.. సురేఖ పైన నేరుగా వేటు వేయకపోయినా.. మంత్రి వర్గ

కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఐదేళ్లు దాటుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణమే ముగింపు పలకాలంటూ పుతిన్ ముందే భారత్ తన శాంతి వైఖరిని అత్యంత స్పష్టంగా పునరుద్ఘాటించింది. అంతులేని యుద్ధం నుంచి యుద్ధం ముగింపు వైపు అడుగులు వేయడం మానవాళి శ్రేయస్సుకు అత్యవసరమని మోదీ తేల్చిచెప్పారు. గతంలో 2022 సమర్కాండ్ ఎస్సీఓ సదస్సులో ఇది యుద్ధాల యుగం కాదని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. 2025 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు తర్వాత 2026లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. గాంధీ, బుద్ధుడు నడయాడిన భారత భూమి నుంచి ఎల్లప్పుడూ శాంతి సందేశమే ప్రపంచానికి వెళ్తుందని రష్యా అధ్యక్షుడికి ప్రధాని నేరుగా వివరించారు. శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను నింపుతుందని మోదీ స్పష్టం చేశారు. దీంతో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలకు మరియు శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా మద్దతు ఇస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లోని సంఘర్షణల వల్ల అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం మరియు భారతీయ నావికుల భద్రత తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో మోదీ వ్యాఖ్యలపై స్పందించిన పుతిన్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనియాడారు. ఫలితంగా 2026 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగిందని రష్యా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రక్షణ, ఇంధనం, ఎరువులు, అంతరిక్షం మరియు వినూత్న రంగాలు సహా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై రెండు దేశాల అధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12–13

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సడన్‌గా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సాయంత్రం లేదా రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సమావేశం కానున్నారు. రాబోయే సెప్టెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి తీవ్ర రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గాంధీభవన్ వర్గాల్లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మరియు క్రమశిక్షణ నివేదిక అంశాలపైనే పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ మార్పులు మరియు చేర్పుల వ్యవహారం తీవ్రంగా వేడెక్కింది. దీనికితోడు మంత్రి కొండా సురేఖపై పీసీసీ డిసిప్లినరీ కమిటీ తయారు చేసిన నివేదిక ఇప్పటికే ఏఐసీసీకి చేరింది. సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మరియు దానిపై సురేఖ స్పందించిన తీరు పార్టీలో వివాదాస్పదమైంది. ఈ ఘటనల ఆధారంగా ఆమెను మంత్రివర్గం నుండి తొలగించడంతో పాటు పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని స్థానిక రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కీలక భేటీ కోసం సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటన ಮುగించుకుని తిరిగి రాగానే ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కూడా సమావేశమై మెట్రో రైల్, విమానాశ్రయం మరియు ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సు వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ మార్పులలో కొండా సురేఖ స్థానంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్పీకర్
Sukesh Chandrashekhar Sentenced 8 Years : సాధారణంగా బెయిల్ పొందడానికి ఏవేవో కారణాలు చెబుతుంటారు. ఎలాగోలా బయటకు వచ్చేందుకు సాధ్యమైనన్ని పనులు చేస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ వ్యక్తి మాత్రం బెయిల్ కోసం.. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవతారమెత్తాడు. అంతేనా ఓ ప్రత్యేక జడ్జీని బెదిరించి ఘోర మోసానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ తీవ్ర నేరానికి గాను అతనికి ఎనిమిది ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ హర్షితా మిశ్రా సంచలన తీర్పును ఇచ్చారు. నిందితుడు చేసిన తప్పు.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, విచారణ ప్రక్రియను దెబ్బతీసే కుట్రగా అభివర్ణించారు.పోలీస్ కస్టడీలోనే ప్లాన్.. కానిస్టేబుల్ ఫోన్‌తో డ్రామాఅవినీతి కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ 2017 ఏప్రిల్ 28వ తేదీన.. కానిస్టేబుల్ మంజీత్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను దక్కించుకున్నాడు. దాని ద్వారా అప్పట్లో అవినీతి నిరోధక చట్టం కేసులను విచారిస్తున్న స్పెషల్ జడ్జ్ పూనం చౌదరి ల్యాండ్‌లైన్, మొబైల్ నంబర్లకు ఫోన్ చేశాడు. మొదట సుప్రీంకోర్టు జడ్జి వద్ద పనిచేసే ప్రైవేట్ కార్యదర్శినని పరిచయం చేసుకుని, ఆ తర్వాత స్వయంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తినేనని బురిడీ కొట్టించాడు. తన కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, లేకపోతే ఉద్యోగ పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జడ్జీని బెదిరింపులకు గురిచేశాడు.ఇదీ చూడండి: జడ్జిపై తెలుగు లాయర్ అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన సీజేఐవిడివిడిగా శిక్షలు.. ఒకదాని తర్వాత ఒకటి అమలు!కానీ జడ్జీ మాత్రం ఈ పని చేసింది ఎవరో తెలుసుకున్నారు. ముఖ్యంగా అది కానిస్టేబుల్ నెంబర్ అని తెలుసుకుని.. నిందితుడిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. ఆపై విచారణ జరిపి.. సుకేష్ చంద్రశేఖరే నిందితుడిని గుర్తించారు. ముఖ్యంగా ఆగస్టు 20వ తేదీన సుకేష్‌ను ఐపీసీ సెక్షన్లు

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం మంత్రి పదవి ఊడే అవకాశం Cm Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం హస్తినకు చేరుకున్న సీఎం, మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అయితే ఈ పర్యటనలో ప్రధానంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల వ్యవహారంపై ఏఐసీసీ అధిష్ఠానంతో కీలక చర్చలు జరగనున్నాయి. పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. Telangana Rains: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక! అధిష్ఠానంతో సమావేశం - పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదికపై చర్చ: సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) బుధవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ కానున్నారు. కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి, ఆమెను మంత్రివర్గం నుండి తప్పించడమే లక్ష్యంగా అధిష్ఠానం వద్ద పట్టుబట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఇప్పటికే సీఎం ఈ విషయంపై వివరంగా చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గం నుంచి తప్పించే యోచన - పొంచి ఉన్న రాజకీయ మార్పులు: కొందరు కాంగ్రెస్ నాయకులు సురేఖకు మద్దతుగా ఇన్ఛార్జ్తో మాట్లాడినప్పటికీ, అధిష్ఠానం నుండి ఎలాంటి సానుకూల హామీ లభించలేదు. కొత్త మంత్రుల చేరిక లేదా మంత్రివర్గ విస్తరణకు మరికొంత సమయం పట్టినా, సురేఖను పదవి నుంచి తొలగించే విషయంలో సీఎం ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపిచడం లేదు. ఒకవేళ ఏఐసీసీ పెద్దలు సీఎంబో నివారించే ప్రయత్నం చేస్తే తప్ప, కొండా సురేఖ

కాక్రోచ్ జనతా పార్టీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు నిర్వహించనున్న మార్చ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి దేశ రాజధానిలో ఏదైనా అనర్థం జరుగుతుందని భావించేందుకు ఎలాంటి తగిన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధంగా అందరూ శాంతియుతంగా ప్రవర్తిస్తారని ఊహిస్తున్నామని వెల్లడించిన ఉన్నత న్యాయస్థానం, శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు పోలీసులదేనని తేల్చిచెప్పింది. ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ వివాదం వెనుక సుదీర్ఘమైన విద్యార్థి పోరాటం మరియు నెరవేరని హామీల నేపథ్యం దాగి ఉంది. మొదట సాటిరికల్ ఆన్లైన్ ప్లాట్‌ఫాంగా ప్రారంభమైన సిజెపి, నీట్ పేపర్ లీక్, రీ-టెస్ట్ వివాదాలు మరియు విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత తీవ్రమైన ఉద్యమ రూపం దాల్చింది. జంతర్ మంతర్‌లో సుదీర్ఘంగా 36 రోజుల పాటు నిరసనలు చేపట్టిన అనంతరం, జూలై 25న కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల ఫలితంగా ఉద్యమాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని, బాధిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చినట్లు సిజెపి ప్రతినిధులు వెల్లడించారు. దింతో ఒక నెల గడిచినా ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకుండా సాంకేతిక అంశాల వెనుక దాక్కుంటోందని సిజెపి ఆగస్టు 24న తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ అధికారి రాజేంద్ర సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ, లుటియన్స్ ఢిల్లీలోని ఇండియా గేట్, సెంట్రల్ విస్తా వంటి సున్నిత ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేని నిరసనలను నిషేధించాలని పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఊరేగింపులను వాయిదా వేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటివరకు సిజెపి నుంచి అనుమతి

కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న గొడవ.. భర్త ప్రాణాలను తీసింది. క్షణికావేశంలో ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. ఈ దాడిలో భర్త మృతి చెందగా.. భార్య జైలు ఊసలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో ఆ చిన్న పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.ఏం జరిగిందంటే..? దిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో వినయ్ గుప్తా, రేఖ దంపతులు కాపురం ఉంటున్నారు. మూడున్నరేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఈ జంటకు ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. వినయ్ అడోబ్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన వార్షిక ప్యాకేజీ రూ. 60 లక్షలుగా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వినయ్- రేఖల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో రేఖ తరఫు బంధువులు వినయ్ ను చంపేస్తామంటూ వార్నింగ్ లు ఇస్తూ వచ్చారు. ఇక తాజాగా మరోసారి వినయ్- రేఖల మధ్య గొడవ జరిగింది. తమ పిల్లలకు మెడిసిన్ ఇచ్చే విషయంలో వినయ్, రేఖా మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన భర్త వినయ్ గుప్తా.. భార్య రేఖపై గట్టిగా అరిచాడు.నా మీదే అరుస్తావా..? అంటూ భర్తపై కోపం పెంచుకున్న రేఖ అక్కడినుంచి వెళ్లిపోయింది. 10 నిమిషాల తర్వాత తన కుటుంబ సభ్యులను తీసుకొని అత్తారింటికి వచ్చింది. మా అక్కపై ఎలా అరుస్తావ్ అంటూ రేఖా సోదరులు (ఇద్దరు) వినయ్‌పై దాడి చేశారు. అనంతరం రేఖా తండ్రితో పాటు ఆమె మేనమామ సైతం వినయ్‌ని చుట్టుముట్టి ఎటాక్ చేశారు. వినయ్ కుటుంబ సభ్యులు అడ్డురాగా వారిని తోసేసి మరీ అతడ్ని దారుణంగా కొట్టి, గొంతు నులిమి.. గుండెపై తన్నారు.ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వినయ్ ను

కేంద్ర రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీలో (Delhi) చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, విస్తరణకు సంబంధించిన ఊహాగానాల మధ్య కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి సీనియర్ నాయకుడికి రాజ్యాంగ పదవి దక్కవచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఎన్డీఏ (NDA)లో టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పరిశీలనకు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రాలేదు. గవర్నర్ పదవి ఖరారైందన్న వార్తలు కూడా ప్రస్తుతం రాజకీయ చర్చల స్థాయిలోనే ఉన్నాయి. యనమల రామకృష్ణుడు టీడీపీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన ఆయన, ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా ఆర్థిక శాఖను నిర్వహించిన సమయంలో కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు. శాసనసభ వ్యవహారాలు, రాజ్యాంగపరమైన అంశాలపై ఆయనకు ఉన్న అవగాహనను పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల పదవీకాలం పూర్తవడం, మరికొన్ని చోట్ల రాజకీయంగా కీలకమైన పరిణామాలు చోటుచేసుకోవడం నేపథ్యంలో కేంద్రం కొత్త నియామకాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala), బీహార్ (Bihar) వంటి రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ల మార్పుపై చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యనమలకు ఏదైనా రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు అప్పగిస్తే ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లేదా బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలకు రాజ్యాంగ వ్యవహారాలపై అవగాహన ఉన్న వ్యక్తి అవసరమనే వాదన వినిపిస్తోంది

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ భారత పర్యటనపై అనిశ్చితి నెలకొంది. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసి, గంటల్లోనే దానిని ఉపసంహరించుకోవడంతో ఈ సందిగ్ధత మరింత బలపడింది. ఆగస్టు 23 నుంచి 25 మధ్య తారిఖ్ రెహమాన్ ఢిల్లీలో పర్యటించవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.అయితే, ఈ పర్యటనపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. భారత్‌లో ఉంటున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఇతర నిందితులను తమకు అప్పగించే విషయంపై భారత ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన కోసం బంగ్లాదేశ్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టత వస్తేనే పర్యటన ఖరారయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత్‌లో నివసిస్తున్న షేక్ హసీనా, తాను త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని ఇటీవల ప్రకటించారు. ఆమె మీడియా సమావేశాలు నిర్వహించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెను తమకు అప్పగించాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు తారిఖ్ రెహమాన్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పర్యటనపై నెలకొన్న సందిగ్ధత ఈ సదస్సుపై ప్రభావం చూపుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జంతర్ మంతర్ వద్ద మరోసారి హై టెన్షన్ నెలకొంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ఒకే వేదికపైకి వచ్చారు. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (UGC) ప్రవేశపెట్టిన నూతన ఈక్విటీ నిబంధనలను రద్దు చేయడంతో పాటు కుల ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పలు అగ్రవర్ణ సంఘాలు, ఓపెన్ కేటగిరీకి చెందిన ఉద్యోగ, ఉపాధి అభ్యర్థులు, ప్రతినిధులు సమిష్టిగా తరలివచ్చి తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించారు.ఆర్థిక ప్రాతిపదికనే కొలమానం కావాలి: తీవ్ర ఉత్కంఠ మధ్య ధర్నాగత నలభై ఐదు రోజులుగా వివిధ రకాల ఆందోళనలకు నిలయంగా మారిన జంతర్ మంతర్ వద్ద ఈ నిరసన ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం కుల పరిమితుల ఆధారంగా కాకుండా పేదరికం, ఆర్థిక అత్యవసర పరిస్థితులను బట్టే ప్రభుత్వ రంగాలు, ఉద్యోగాల్లో రాయితీలు కల్పించాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు. మెరిట్ ప్రాతిపదికన ప్రతిభను ప్రోత్సహించాలని, అర్హత కలిగిన నిజమైన పేద విద్యార్థులకు మాత్రమే ఉన్నత విద్యా సంస్థల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రిజర్వేషన్ సంస్కరణల ఆందోళన్: హనుమాన్ చాలీసా పారాయణాలతో హోరెత్తిన ప్రాంగణంనీట్ అభ్యర్థి హర్ష్ దూబే నేతృత్వంలో రిజర్వేషన్ సంస్కరణల ఆందోళన్ పేరిట ఈ నిరసన ర్యాలీ సాగింది. రాజస్థాన్ నుంచి వచ్చిన జనరల్ సేన, చాణక్య సేన, ప్రసిద్ధ కర్ణి సేనతో పాటు సామాజిక మాధ్యమాల ఇన్ఫ్లుయెన్సర్లు ఈ ప్రదర్శనకు పూర్తి మద్దతుగా నిలిచారు. నిరసన సందర్భంగా ఆందోళనకారులు సమిష్టిగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ భక్తిపూర్వక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ ప్రారంభమైంది.48 గంటల్లో మొదలుపెడతారా ? నన్ను రమ్మంటారా ?-అభిజీత్ బిగ్ వార్నింగ్..!అనుమతులపై

గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. పెల్లెట్‌గన్ దాడిలో గాయపడిన విద్యార్థికి అండగా ప్రతిపక్ష నేత నిరసన న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత నెల ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ‘చలో పార్లమెంటు’ ర్యాలీపై పోలీసులు ప్రయోగించిన పెల్లెట్‌గన్స్ కారణంగా గాయాల పాలైన ఓ విద్యార్థి కోసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధర్నాకు దిగారు. సదరు ఘటన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు జరపాలని 19 ఏళ్ల వయసున్న విద్యార్థి సాహిల్ లోచబ్, అతని తల్లి ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పటికీ.. పోలీసులు నమోదు చేయకపోవటంతో ఆ విషయాన్ని వారు రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారితో కలిసి రాహుల్ శుక్రవారం.. మందిర్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పెల్లెట్‌గన్ దాడిలో లోచబ్ కంటికి మూడు పెల్లెట్లు తగిలాయని, దాదాపు 200 పెల్లెట్లు అతడి శరీరంలోకి వెళ్లాయని, గుండెకు దగ్గరగా ఉన్న కొన్ని పెల్లెట్లను తీస్తే ప్రమాదం అని వైద్యులు వాటిని తీయలేదని, ప్రస్తుతం అతడు కంటి చూపును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడని తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. దానికి వారు నిరాకరించటంతో రాహుల్ తదితరులు పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఢిల్లీ డీసీపీ సచిన్శర్మను కలిశారు. ఆయన కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించకపోవటంతో.. రాహుల్ పోలీసు స్టేషన్ ఆవరణలోనే ధర్నాకు దిగారు. పైనుంచి ఆదేశాలు రావటం వల్లే, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారని రాహుల్ విలేకరులకు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకూ కదిలేది లేదని, అవసరమైతే ఆరు నెలలపాటైనా ధర్నాలోనే కూర్చుంటానని ప్రకటించారు. లోచబ్ కంట్లో మూడు పెల్లెట్లు పడ్డాయని ఆయనకు శస్త్రచికిత్స జరిపిన ఆస్పత్రి ఇచ్చిన నివేదికను ప్రదర్శించారు. లోచబ్ శరీరం నుంచి వైద్యులు తొలగించిన కొన్ని

గత నెల 20న ఢిల్లీలో నీట్ అక్రమాలపై విద్యార్ధులు నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు చేసిన పెల్లెట్ల ప్రయోగంపై నిరసనలు వ్యక్తం చేస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ ఏకంగా సాహిల్ అనే ఓ బాధితుడిని తీసుకుని పోలీసు స్టేషన్ కు వచ్చేశారు. ఉన్నట్లుండి ఇవాళ ఉదయం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కు సాహిల్, అతని తల్లితో కలిసి వచ్చిన రాహుల్ గాంధీ.. పోలీసుల్ని బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కానీ పోలీసులు ఒప్పుకోలేదు.ఢిల్లీ నిరసనల బాధితుడితో నేరుగా స్టేషన్ కు రాహుల్..! షాకైన పోలీసులు..!దీంతో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని కూడా పిలిపించుకుని పోలీసు స్టేషన్ బయట బైఠాయించారు. దీంతో కేంద్రంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పని పరిస్ధితి ఎదురైంది. అయినా సాయంత్రం వరకూ దీనిపై స్పందించకుండా ఉన్నతాధికారుల్ని సంప్రదిస్తూనే ఉన్న పోలీసులు.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదుకు అంగీకరించారు. అనంతరం బాధితుడు సాహిల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, వెంటనే ఆ కాపీని రాహుల్ గాంధీ చేతికి అందించారు. పోలీసు స్టేషన్లో రాహుల్, ప్రియాంక మెరుపు ధర్నా- పెల్లెట్ల ప్రయోగంపై FIRకు పట్టు..!దీంతో రోజంతా పోలీసు స్టేషన్ లోనే ఈ ఎఫ్ఐఆర్ కోసం నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పెల్లెట్ల ప్రయోగమే చేయలేదని ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు.. ఇవాళ అందుకు కావాల్సిన ఆధారాలను, బాధితుడి మెడికల్ రిపోర్టులను, చివరికి పెల్లెట్లను కూడా పోలీసులకు అందజేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదు. దీంతో పెల్లెట్ల ప్రయోగంలో గాయాల పాలైన ఇతర విద్యార్ధులు కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ల నమోదు కోరబోతున్నారు. తనపై జరిగిన పెల్లెట్ల ప్రయోగం తర్వాత కంటి చూపు కోల్పోయిన సాహిల్.. తన ఆరోగ్యంపై ఆరా తీసేందుకు నిన్న ఫోన్

భారత్, పాక్ దేశాల మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలను పాకిస్థాన్ అధికారులు అన్యాయంగా ధ్వంసం చేశారు. ఇలాంటి చర్యలు చేపట్టవద్దని భారత్ ముందుగానే విజ్ఞప్తి చేసినప్పటికీ.. పాక్ దానిని పట్టించుకోలేదు. దీనికి ప్రతీకారంగా ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ బయట వీధిలో నిర్మించిన కొన్ని తాత్కాలిక నిర్మాణాలను భారత అధికారులు తొలగించారు. ఈ చర్యపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. తాము సమానమైన రీతిలోనే సమాధానం ఇచ్చామని.. ఎంత మేర నష్టం జరిగిందో అంతకు తగ్గట్టే బదులిచ్చామని ఆయన స్పష్టం చేశారు.భారత్‌కు రానున్న బంగ్లా ప్రధాని?.. షేక్ హసీనా అంశంపై బిగ్ ట్విస్ట్!భారత్ కౌంటర్ పాకిస్థాన్ చర్యకు తగిన రీతిలోనే భారత్ జవాబుగా బదులిచ్చిందని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం బయట ఉన్న అక్రమ తాత్కాలిక నిర్మాణాలను తొలగించడం అత్యవసరమైన చర్య అంటూ ఆయన వివరించారు. ఇరు దేశాల దౌత్య కార్యాలయాల విషయంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తే అంతే తీవ్రంగా బదులిస్తామని భారత్ ఈ చర్య ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపింది.యెమెన్ తీరంలో నావికా సంక్షోభంయెమెన్ తీరంలో సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేసిన రెండు నౌకల ఉదంతంపై కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ రెండు నౌకల్లో మొత్తం 22 మంది భారతీయ నావికులు ఉన్నారని.. ఒక నౌకలో 16 మంది, మరో నౌకలో 6 మంది భారతీయులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ 22 మంది నావికులూ క్షేమంగానే ఉన్నారని రణధీర్ జైస్వాల్ తెలిపారు. నావికుల రక్షణ, సంక్షేమం కోసం సంబంధిత అంతర్జాతీయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.అప్పటిదాకా భారత్ ఎంత మాత్రమూ సురక్షితం కాదు: తేల్చి చెప్పిన అమిత్ షా నావికుల రక్షణకు ముమ్మర యత్నాలు యెమన్, సోమాలియా మధ్య ఉన్న

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన మెరుపు ధర్నాపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనల్లో పెల్లెట్ గన్ల దాడికి గురై తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్‌కు మద్దతుగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకస్మిక ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ధర్నాపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కేవలం తనకు అనుకూలమైన రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి వైఖరి తీసుకుంటున్నారని, అక్కడ ఉన్న ఆధారాలు ఆయన మాటలకు సరిపోలుతున్నాయా అని ప్రశ్నించారు. ఝార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసిన ఆమె.. వ్యవస్థను మెరుగుపరచడానికి ఎటువంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా కేవలం నాటకీయ నిరసనలు తెలపడం రాహుల్ కు పరిపాటిగా మారిందని ఆరోపించారు. అయితే, యువత ఆందోళనలను ప్రభుత్వం ఎల్లప్పుడూ నిశితంగా గమనిస్తూ పరిష్కరిస్తుందని ఆమె స్పష్టం చేశారు

నగరానికి 33% పీఎం 2.5 ధూళికణాలు పొరుగు దేశం నుంచే.. దిల్లీ: దేశ రాజధాని నగరమైన దిల్లీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుపోతుండటానికి పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. నగరవాసులను సతమతం చేసే పీఎం 2.5 ధూళికణాల్లో ఏటా దాదాపు 33% పొరుగు దేశం నుంచే ఇక్కడికి వస్తున్నాయి. పంజాబ్‌లో కాలుష్యానికీ అది ఓ గణనీయ కారణంగా నిలుస్తోంది. ‘బియాండ్ స్టేట్ బౌండరీస్: క్వాంటిఫైయింగ్ ఇంటర్‌స్టేట్ ఎయిర్ పొల్యూషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ సెక్టోరల్ సొల్యూషన్స్ ఇన్ ది ఇండో-గ్యాంగేటిక్ ప్లెయిన్’ పేరుతో ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్‌టీఈపీ)’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పలు ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. నివేదిక ప్రకారం- జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో పీఎం 2.5 ధూళికణాల వార్షిక గాఢత సగటు ఒక్కో క్యూబిక్ మీటరుకు 67.9 మైక్రోగ్రాములుగా ఉంది. ఇందులో స్థానిక వనరుల వల్ల వెలువడే ధూళికణాల వాటా కేవలం 28 శాతం. ప్రధానంగా ఇళ్లలో కార్యకలాపాలు, వ్యవసాయ పనులు, రవాణా, పారిశ్రామిక కార్యకలాపాల వల్ల ఈ ధూళికణాలు వెలువడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి 12 శాతం పీఎం 2.5 ధూళికణాలు ఎన్సీఆర్కు వీస్తున్నాయి. పాక్ నుంచి 33 శాతం వస్తున్నాయి. పంజాబ్‌లో పీఎం 2.5 ధూళికణాల వార్షిక గాఢత సగటు ఒక్కో క్యూబిక్ మీటరుకు 77.8 మైక్రోగ్రాములుగా ఉంది. ఈ కాలుష్య కణాల్లో దాదాపు 40 శాతం మేర రాష్ట్రానికి పాక్ నుంచి వస్తున్నాయి. ఇక స్థానిక కాలుష్యంలో 52 శాతానికి నివాస రంగ కార్యకలాపాలు కారణమవుతున్నాయి. తర్వాతి స్థానానంలో పారిశ్రామిక కార్యకలాపాలు (13.8 శాతం) ఉంటున్నాయి. వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత 7.9 శాతం మేర పీఎం 2.5 ధూళికణాల కాలుష్యానికి దారితీస్తోంది. రాజస్థాన్, ఎన్సీఆర్ల నుంచీ కాలుష్య కణాలు పంజాబ్‌కు వస్తున్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో గురువారం జరిగిన ఓ కార్యక్రమం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన కటౌట్ ముందు కొందరు వ్యక్తులు హారతి ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ‘ మోదీ చాలీసా ’ పఠించడంతో ఈ వ్యవహారం వైరల్‌గా మారింది. “జై జై మోదీ.. హర హర మోదీ” అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని మోదీ.. కిరీటం, ఆభరణాలు ధరించిన శ్రీరాముడి తరహా రూపంలో చూపించిన కటౌట్ వైరల్ అవుతోంది.ఆ మోదీ కటౌట్ చేతిలో విల్లు, బాణం ఉండగా.. చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు హారతి ఇస్తూ నినాదాలు చేశారు. ఆ వీడియోలో ఉన్న పోస్టర్‌పై “శ్రీ నరేంద్ర మోదీ చాలీసా” అని పేర్కొన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించలేదని స్పష్టం చేసింది. గురువారం ఉదయం తమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని పేర్కొంటూ పీసీఐ వివరణ ఇచ్చింది. ఓ సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు క్లబ్‌లోని హాల్‌ను అద్దెకు తీసుకుందని తెలిపింది. అయితే హాల్‌ను అద్దెకు తీసుకునే సమయంలో అంగీకరించిన నిబంధనలను సంబంధిత సంస్థ ఉల్లంఘించిందని పేర్కొంది. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే క్లబ్ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు వెల్లడించింది.‘మోదీ చాలీసా’ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తుండగా.. మరికొందరు మోదీ ఫ్యాన్స్ అభిమానాన్ని చూపించారని పేర్కొంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన ఎంతవరకు సమంజసం అనే అంశంపై కూడా నెటిజన్లు విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: శిర్డీ సాయిబాబాను (Shirdi Sai Baba) లక్ష్యంగా చేసుకొని, రూపొందించిన అభ్యంతరకర వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సంబంధిత వీడియోలను యూట్యూబ్ నుంచి తొలిగించాలని వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి సూచించింది. ఇదే అంశంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖతోపాటు గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ ఆత్మకథ.. రాహుల్ భావోద్వేగ పోస్ట్ శిర్డీ సాయిబాబాకు సంబంధించి అభ్యంతరకర వీడియోలు తొలగించే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ (జీఏసీ)కు దిల్లీ హైకోర్టు (Delhi High Court) గతంలోనే సూచించింది. ఈ క్రమంలో జీఏసీ ఇటీవల చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా కొన్ని వీడియోలు అలాగే ఉన్నాయని పేర్కొంటూ శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. వివాదాస్పదమైన కంటెంట్ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, వీటిని ఇలాగే కొనసాగిస్తే.. మత సామరస్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని వాదించింది. వాదనలు విన్న దిల్లీ న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. ఈలోగా ఇంకేమైనా కొత్త ఫిర్యాదులు దాఖలైతే సంబంధిత అధికారులు వాటిని పరిశీలిస్తారని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కర్ణాటకలో ఓ ప్రైవేటు బస్సు కండక్టర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులకు ఘోర ప్రమాదం తప్పింది

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) కన్నుమూశారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన అస్వస్థతకు గురికావడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరణానికి గల కచ్చితమైన కారణాలను ఆసుపత్రి వర్గాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య అనంతరం ఢిల్లీలో సిక్కులపై తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని పాలం కాలనీ ప్రాంతంలో నవంబర్ 1, 2 తేదీల్లో ఐదుగురు సిక్కుల మరణానికి కారణమైన కేసులో సజ్జన్ కుమార్ దోషిగా తేలారు. ఈ కేసులో 2018 డిసెంబరులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.ఔటర్ ఢిల్లీ నుంచి మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సజ్జన్ కుమార్, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండేవారు. అయితే, 2018లో కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. కాగా, ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారమే ఢిల్లీలో 3,000 మందికి పైగా సిక్కులు ప్రాణాలు కోల్పోయారు

దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల అధికారులు గురువారం కూల్చివేతలు చేపట్టారు. హైకమిషన్‌కు అనుమతించిన హద్దులు దాటి కొన్ని నిర్మాణాలు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ఉన్న రోడ్డుపై ఏర్పాటు చేసిన కొన్ని నిర్మాణాలను అధికారులు బుల్డోజర్తో తొలగించారు. హైకమిషన్ వీసా విభాగం వద్ద క్యూలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాలు కూడా ఇందులో ఉన్నాయి.కూల్చివేతల తర్వాత అక్కడ శిథిలాలు కనిపించాయి. విరిగిన ఇనుప కంచెలు, గేట్లు, రేకులు, ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు, ప్లాస్టర్ శిథిలాలు రోడ్డుపై పడ్డాయి. వీసా దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు మాత్రం కనిపించాయి. అక్కడ ‘విండో-1’, ‘పాకిస్థానీ పాస్‌పోర్ట్ ఓన్లీ’, ‘విండో-5 / కలెక్షన్ ఆఫ్ వీసా అప్లికేషన్స్’ అనే సూచికలు ఉన్నాయి.హైకమిషన్ ప్రధాన ప్రవేశ ద్వారం, దాని చుట్టూ ఉన్న గోడలు, గుమ్మట ఆకార నిర్మాణాలు, పాకిస్థాన్ చిహ్నంతో ఉన్న పెద్ద ఇనుప గేట్లు యథాతథంగా ఉన్నాయి. ప్రాంగణం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో ముళ్ల కంచె కూడా కనిపించింది.ఇస్లామాబాద్‌లోనూ ఇటీవల చర్యలుఢిల్లీలో ఈ చర్యలకు కొన్ని రోజుల ముందే ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ వెలుపల పాకిస్థాన్ అధికారులు భద్రతా బారికేడ్లు, పార్కింగ్ స్తంభాలను తొలగించారు. ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో చోటుచేసుకోవడంతో ఇరు దేశాల దౌత్య వర్గాల్లో చర్చకు దారితీశాయి.అయితే ఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల కూల్చివేతలకు, అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూకశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదని అధికార వర్గాలు

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం, త్వరలో ముఖ్యమైన పండుగలు వస్తున్న క్రమంలో ధరలు అమాంతం పెరగడం కొనుగోలు చేయాలనుకునేవారిని నిరాశపరుస్తోంది. ఆగస్ట్ 20న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,59,270కి చేరుకుంది. ఒక్కరోజే రూ.4300 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,46,000 పలుకుతుండగా.. ఇవాళ రూ.3950 హైక్ అయింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 వద్ద ట్రేడవుతుండగా.. గురువారం రూ.2180 పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000గా ఉండగా.. నేడు రూ.2 వేలు పెరిగి నిరాశకు గురి చేసింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,270 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,420గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,150 వద్ద కొనసాగుతున్నాయి. అటు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలు ప్రస్తుతం పలుకుతోంది. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పెరిగి షాకిచ్చింది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. గురువారం రోజే ఒకేసారి రూ.10 వేలు పెరిగింది. చెన్నైలో కిలో వెండి రూ.2.60 లక్షలు, బెంగళూరులో రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది

న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ సంచలనం ఆయుష్ శెట్టి ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, మేటి ఆటగాడు లక్ష్యసేన్ అనూహ్య ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరిచింది. కెనడాకు చెందిన వెన్ యు జాంగ్‌ను 21-16, 21-17 తేడాతో కేవలం 35 నిమిషాల్లోనే ఓడించి విజయం సాధించింది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు, రెండో గేమ్‌లో ఒక దశలో 9-12తో వెనుకబడినప్పటికీ.. వెంటనే పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.అయితే, పురుషుల సింగిల్స్‌లో భారత శిబిరానికి నిరాశ ఎదురైంది. అమెరికా ఆటగాడు గారెట్ టాన్తో జరిగిన హోరాహోరీ పోరులో లక్ష్యసేన్ 21-19, 19-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచినప్పటికీ, లక్ష్యసేన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు.మరోవైపు, యువ ఆటగాడు ఆయుష్ శెట్టి తన విజయయాత్రను కొనసాగిస్తున్నాడు. శ్రీలంక ఆటగాడు దుమిందు అబేవిక్రమను 21-8, 21-10 తేడాతో కేవలం 26 నిమిషాల్లోనే చిత్తుచేసి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి వాకోవర్ లభించగా, మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల జోడీ మూడో రౌండ్‌కు చేరుకుంది. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ సీఎన్జీ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ సీఎన్జీ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. సీఎన్జీతో నడిచే ఓ ట్రక్ బుధవారం సిలిండర్‌లో గ్యాస్ నింపించుకోవడానికి తిక్రి కలాన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న సీఎన్జీ పంప్ దగ్గరకు వచ్చింది. సిలిండర్‌లో గ్యాస్ నింపుతున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలటంతో సీఎన్జీ పంపులో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన ముగ్గురిని మహేష్, బ్రహ్మ్జీత్, సన్నీగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాబోయ్ పులి.. గుర్రాన్ని ఎలా ఈడ్చుకెళ్తోందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్.. ఏపీ ప్రయోజనాలపై కేంద్రంతో కీలక చర్చలు.. మహాబలిపురానికి సీఎం చంద్రబాబు

ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్‌తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ

భారత్‌లో అమెరికా రాయబారిగా వ్యవహరిస్తున్న సెర్గియో గోర్ శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ సమస్యల పరిష్కారం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుందని, వాషింగ్టన్ నుంచి కాదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను యూఎస్ రాయబారి ముందు ఉంచబోనని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. "మా సమస్యలకు పరిష్కారం వాషింగ్టన్ నుంచి రాదు. మా సమస్యలను మన కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలి" అని ఆయన తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో అమెరికా రాయబారి చెప్పే విషయాలను వినడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గతంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై వైట్ హౌస్ ముందు నిరసన తెలుపుతానంటూ ఒమర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో, ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా దౌత్యపరమైన స్పష్టత ఇచ్చారు. గత 15 ఏళ్లలో ఒక అమెరికా రాయబారి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఇది రెండోసారి మాత్రమే. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరణ జరిగిన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీనగర్ పర్యటన అనంతరం సెర్గియో గోర్ లడఖ్‌లో కూడా పర్యటించనున్నారు. 2020 గాల్వాన్ వ్యాలీ వివాదం తర్వాత అమెరికా రాయబారి లడఖ్ ప్రాంతాన్ని సందర్శించడం ఇదే తొలిసారి

దేశ రాజధాని దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దిల్లీ జల్ బోర్డు STP టెండర్ స్కామ్ లో ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. దిల్లీ జల్ బోర్డులో అవినీతికి సంబంధించి గతంలో నమోదైన కేసులో భాగంగా జైన్, బోర్డు మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాశ్ రాయ్ తో పాటు ఆరుగురు నిందితులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆప్ సర్కార్ సమయంలో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ల ఆధునికీకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 2024 లో ఎఫ్ఐఆర్ నమోదైంది.ఇక మురుగునీటి శుద్ధి ప్లాంట్స్ ఆధునీకరణ అలాగే సామర్థ్యం విస్తరణ కోసం జారీ చేసిన టెండర్లలో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. యూరో టెక్ ఎన్విరాన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు టెండర్ లో సాంకేతిక నిబంధనలు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రతిపాదిత పైలట్ పూర్తి స్టడీని నిర్వహించకుండానే ఇతర కంపెనీల నుంచి పోటీని తొలగిస్తూ పలు నిబంధనల్ని మార్చినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఏసీబీ తెలిపింది. మరోవైపు సత్యేందర్ జైన్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించింది. గతంలోనూ మనీలాండరింగ్ ఆరోపణలతో తప్పుడు కేసు పెట్టి సత్యేందర్ జైన్ ను అరెస్టు చేశారని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ అరెస్టు చేసి వేధిస్తున్నారని వివరించింది. ఇదే అంశంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నియంతృత్వ పాలన ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని ప్రశ్నించారు. జైలు పాలై, మానసిక వేదన అనుభవించిన వారికి పరిహారం ఎవరు చెల్లిస్తారని మండిపడ్డారు

ఇంటర్నెట్‌డెస్క్: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ మార్చ్ ఉద్రిక్తంగా మారడంతో భద్రతా బలగాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ ఆరోపణలపై విచారణ జరిపేందుకు హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఆ రోజు జరిగిన మార్చ్ ఫుటేజీని కమిటీ పరిశీలిస్తుందని చెప్పింది. ఆ నిరసనల్లో భాగంగా మహిళా ఆందోళనకారుల్ని లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. వాటిపైనా దర్యాప్తు జరుగుతుందని వెల్లడించింది. ఈ ప్యానెల్లో మాజీ న్యాయమూర్తులు, సీబీఐ మాజీ డైరెక్టర్, రాష్ట్ర మాజీ డీజీపీ సభ్యులుగా ఉంటారని చెప్పింది. నిరసనకారులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా విచారణలో ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, పోలీసు చర్య ఆరోపణలపై దిల్లీ, బిహార్ పోలీసులు అఫిడవిట్లు దాఖలు చేశారు. ‘‘ఆ రోజు 30 వేల మంది నిరసనకారులు మూడు కిలోమీటర్ల వరకు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసేలా 5 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆందోళనకారులు బారికేడ్లను దాటేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో 240 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 200 మంది ఆందోళనకారులు వైద్య చికిత్స చేయించుకున్నారు. వాస్తవానికి ఆ మార్చ్‌కు ఎలాంటి అధికారిక అనుమతి లేదు. అయినా సరే నిరసనకారులు పార్లమెంట్ వైపుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం చట్టవిరుద్ధం. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తులు ఆ గుంపులో కలిసిపోయారు’’ అని దిల్లీ పోలీసులు (Delhi Police) ఆరోపించారు. బిహార్‌లోని సివాన్‌లో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనల్లో ఓ కానిస్టేబుల్ ఏకే 47 తుపాకీని ఎక్కుపెట్టిన వీడియో బయటకు రావటం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే (cop fired AK-47). ఈక్రమంలో బిహార్ పోలీసులు సుప్రీంలో

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో లక్ష్య తరేజా అనే బ్యాటర్ పవర్ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి కాస్త మెయిన్ అంపైర్‌గా ధర్మేశ్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తాకింది. అంపైర్ అప్రమత్తమై కిందికి వంగినప్పటికీ బంతి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే అంపైర్‌ను పరీక్షించిన ఫిజియోలు మైదానం నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ అంపైర్‌కు మైదానంలో బంతి తాకడం ఇదే తొలిసారి కాదు. ఇదే సీజన్ ఆరంభంలో మరో బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ అతని భుజానికి బలంగా తాకింది. కానీ ఆ సమయంలో పెద్ద గాయం కాలేదు. అంపైర్‌ను గాయపర్చిన లక్ష్య తరేజా 25 బంతుల్లో ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'పాపం అంపైర్' అంటూ సానుభూతి చూపిస్తున్నారు. అంపైర్లు కూడా హెల్మెట్లు వాడాలని, టీ20 ఫార్మాట్లో తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. డీఆర్ఎస్తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్ చేసుకున్న రాహుల్! బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్

గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న అశోక్ గజపతి రాజు, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో భాగంగా ఆయన ప్రధానిని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని సందర్శించాలని ప్రత్యేకంగా కోరారు. ఆలయ ట్రస్ట్ బోర్డు తరఫున పంపిన ఆహ్వాన పత్రికను అందజేస్తూ, సింహాద్రి అప్పన్న ప్రత్యేక విగ్రహాన్ని ప్రధానికి బహుమతిగా సమర్పించారు. గత ఏడాది కాలంగా గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు విజయవంతంగా సేవలందిస్తున్నారు. తన పదవీకాలంలో సాధించిన పురోగతిని, బాధ్యతలను వివరిస్తూ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టు 17న జరిగిన ఈ సమావేశం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వీకరించి, సింహాచలం ఆలయాన్ని తప్పక సందర్శిస్తానని హామీ ఇచ్చారు. తన షెడ్యూల్‌ను బట్టి త్వరలోనే అప్పన్న స్వామిని దర్శించుకుంటానని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సింహాచలం క్షేత్రంలో ప్రధాని పర్యటనపై భక్తులలో, స్థానికులలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, ఆధ్యాత్మిక అంశాలతో పాటు గోవా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రధానితో ఆయన చర్చించారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం అందిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఫలితంగా గోవాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అందుతున్న నిధుల వినియోగంపై కూడా వారు సమీక్షించారు. గోవా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వస్తున్న సవాళ్లను గవర్నర్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం చూపిస్తున్న ప్రత్యేక చొరవపై అశోక్ గజపతి రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైతే, ఆయన పర్యటనలో సింహాచలం క్షేత్రం ప్రధాన ఆకర్షణగా మారనుంది. అప్పన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ