
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్‌పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్‌పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్‌పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్‌పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్‌తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు

దేశంలో వాతావరణం రూటు మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెల ఉడుకెత్తిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం 1901 నుంచి చూస్తే, అంటే గత 125 ఏళ్ల హిస్టరీలోనే ఈసారి ఆగస్టు అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు దంచి కొట్టాలి. కానీ ఈసారి వానలు తగ్గుముఖం పట్టి ఎండలు మండిపోయాయి. సెప్టెంబరు నెలలో కూడా పెద్దగా వర్షాలు పడేలా కనిపించడం లేదు. ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. రాత్రి వేళల్లో ఉండే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలకు చేరుకుని 125 ఏళ్ల రికార్డును తిరగరాసింది. వర్షాల విషయానికి వస్తే దేశంలో ఆగస్టులో కేవలం 213.3 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. 2001 సంవత్సరం తర్వాత చూస్తే ఇదే 7వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం వర్షపాతం లోటు 14 శాతంగా ఉంది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మధ్యస్థ నుంచి తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితులే ఈ తీవ్రమైన మార్పులకు కారణమని చెప్పారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మాన్సూన్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఆగస్టు నెలలో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజుల పాటు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన దేశమంతా వర్షాలు లేక ఎండలు, తీవ్రమైన

కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Thalliki Vandanam 2026 Status: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల, ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థుల కుటుంబాలకు విద్యా పరంగా ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత పొందిన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోకి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా జమ చేయనున్నారు. అర్హులు, లబ్ధిదారులు.. ఈ విద్యాసంవత్సరం నూతనంగా పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరిన చిన్నారులతో పాటు, జూనియర్ కళాశాలల్లో చేరిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు. గత నెలలో లబ్ధి పొందలేకపోయిన అర్హులకు కూడా ఈ విడతలో నగదు జమ కానుంది. దాదాపు 2.78 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నట్లు సమాచారం. విడుదల తేదీ, చివరి గడువు.. తాజా అధికారిక నివేదికల ప్రకారం.. ప్రభుత్వం ఈ పథకం కింద నిధులను ఆగస్టు 30వ తేదీన విడుదల చేయనుంది. అయితే, విభిన్న సాంకేతిక కారణాల వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి, అలాగే ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్ ఉన్నవారికి ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. కొత్త దరఖాస్తుల సమర్పణకు, వివరాల సవరణకు ఆగస్టు 25వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది. తల్లిదండ్రులు చేయాల్సిన పనులు అర్హత ఉండి ఇంకా లబ్ధి పొందని విద్యార్థుల తల్లులు వెంటనే తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయడంతో

శ్రావణ మాసంలో ఆగస్టు 28 పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సారి చంద్ర గ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆగస్టు 28 రోజు ఉదయం 8.04 గంటలకు ప్రారంభమై 9:44 గంటలకు పూర్తి అవుతుంది. అయితే మన భారత దేశంలో కనిపించదు, అందువలన సూతక కాలం నియమాలు వర్తించవు. కానీ ఇది రాశులపై మాత్రం ప్రభావం చూపుతుందంట. కాగా, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో చూసేద్దాం. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశిలో ఇది ఏర్పడటం వలన వీరు అనే ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరు ఆర్థికంగా కూడా చాలా నష్టపోతారు. అందువలన వీరు గ్రహణం పూర్తి అయ్యే మరసటి రోజు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలంట. కన్య రాశి : కన్యారాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అందువలన వీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రహణానికి ముందు ఖర్చులు అధికం అవ్వడం మానసిక ప్రశాంతత లోపించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. సింహ రాశి : సింహ రాశి వారికి అపనిందలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు ప్రతి పనిలో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

కన్య రాశి : కన్యా రాశి వారికి ఆగస్టు చివరి వారం చాలా అద్భుతంగా గడుస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం లభిస్తుంది. తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఊహించని విధంగా మంచి జాబ్ దొరుకుతుంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి : మకర రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. డబ్బులు చేతికి అందుతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ రాశుల వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పాలి. అంతే కాకుండా చాలా ఆనందకర వాతావరణం నెలకుంటుంది. మీన రాశి : మీన రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో నెగ్గుక వస్తారు. ఈ నెల చివరి వారం మొంత్తం ఆనందాలతో చాలా బాగా గడిచి పోతుంది

School Holidays : ఇప్పటికే ఆగస్ట్ లో వరుస సెలవులు వచ్చాయి... ఇకపై కూడా ఈ హాలిడేస్ కొనసాగనున్నాయి. బోనాలు, స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం వంటి పర్వదినాలు ఆదివారంతో కలిసివచ్చాయి... దీంతో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ప్రతి వారం ఓ లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇక ఈ నెలలో (ఆగస్ట్) కేవలం వారంరోజులే మిగిలివున్నాయి... ఇందులోనూ నాల్రోజుల సెలవులున్నాయి. కేవలం స్కూళ్లు, కాలేజీలకే కాదు ఆఫీసులకు కూడా సెలవులు రాబోతున్నాయి.. అంటే ఉద్యోగులకు కూడా పండగే అన్నమాట. మరి వచ్చేవారం ఏరోజు, ఎందుకు సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా రేపు (ఆగస్ట్ 23) ఆదివారమే కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఐటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజులు సెలవులుంటాయి... అంటే వారికి ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) కూడా సెలవే అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో చాలా విద్యాసంస్థలకు నేడు ప్రత్యేక సెలవు ఉంది. ఇలా విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా రెండ్రోజుల (ఆగస్ట్ 22, 23) సెలవులు వచ్చాయి. వచ్చేవారం మధ్యలో మరో సెలవు వస్తోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మిలాద్-ఉన్-నబి ఆగస్ట్ 26న అంటే బుధవారం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది... అంటే మధ్యలో కేవలం సోమ, మంగళవారం (ఆగస్ట్ 24,25) మాత్రమే వర్సింగ్ డేస్… తర్వాత మళ్ళీ హాలిడే. మిలాద్-ఉన్-నబి పండక్కి తెలంగాణలోని విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు హాలిడేనే. సోదర సోదరీమణుల ప్రేమానురాగాల పండగ రాఖీ. అన్నాచెల్లి, అక్కాతమ్ముడు... ఇలా తోబుట్టువులు ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఈ పండగ ఉంటుంది... ఈసారి ఆగస్ట్ 28 (గురువారం) రాఖీ పౌర్ణమి వస్తోంది. ఈ పండక్కి విద్యాసంస్థలకు అధికారిక సెలవు ఉంటుంది. అయితే ఉద్యోగులకు మాత్రం

క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. హైదరాబాద్ సిటీ: క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా ఆగస్టు 25న ప్రకటించనున్నారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్లకోసం హౌసింగ్ బోర్డుకు 60,720 దరఖాస్తులందాయి. వాటిలో సుమారు 40వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. అర్హుల జాబితా వెబ్సైట్ క్యూర్ స్టేట్సలో అప్లికేషన్ /ఫోన్ నంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అభ్యంతరాలుంటే ఆగస్టు 23 ఆదివారం సాయంత్రం లోగా వెబ్సైట్లో రిపోర్డు చేయవచ్చన్నారు. లాటరీకి అర్హత సాధించిన వారి తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించి, ఆగస్టు 27 నుంచి 30 వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ తీసి ఇళ్లు కేటాయించనున్నారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే
ఫర్నీచర్ షాప్‌కి వెళ్లొచ్చు అని ప్రభావతి చెబుతుంది. దీంతో రోహిణిని తీసుకుని వమనోజ్ వెళ్తాడు. నా శపథం నెరవేర్చుకున్నా.. అత్తయ్య నోటితోనే వెళ్లమనేలా చేశా అని రోహిణి అనుకుంటుంది. నాకు ఎక్కడో తేడా కొడుతోంది మీనా అని బాలు అంటాడు. మీకు అన్నీ అనుమానాలే అని మీనా కొట్టి పారేస్తుంది. సరే గానీ నా ఫ్రాడ్ ఫ్రెండ్‌కి కలుద్దాం పదా అని బాలు అంటాడు. నేను రాను అని మీనా అంటే.. నాకు ఇంత అందమైన భార్య ఉందని తెలియాలి కదా అని బాలు అంటాడు. ఆటోకి డబ్బుల్లేక నడుచుకుంటూ వస్తాడేమో అని బాలు అనుకుంటే.. రిచ్ గా కారులోంచి దిగుతాడు ఫ్రాడ్ ఫ్రెండ్. అది చూసి బాలు షాక్ అవుతాడు. ఇదేంట్రా ఇలా దిగావ్.. అని బాలు అడిగితే.. కూటి కోసం కోటి విద్యలు కదరా అని ఫ్రాడ్ ఫ్రెండ్ అంటాడు. మొన్నే పెద్ద జైలు నుంచి రిలీజ్ అయ్యారా అని అంటాడు ఫ్రాడ్ ఫ్రెండ్ రాజు. ఎందుకు రా.. దొంగతనాలు సరిగ్గా చేయడం లేదా? ఇంకా దొరికిపోతున్నావా? అని ఇద్దరూ దొంగల కష్టాలు, బాధల్ని మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే గజ దొంగలు చాలా ఏళ్ల తర్వాత కలుసుకుని మాట్లాడినట్టు ఉందని తిడుతుంది మీనా.ఫర్నీచర్ షాప్‌కి రిచ్ మెన్లా.. అసలు ఏ పని మీద వెళ్తున్నావ్ రా అని బాలు అడుగతాడు. ఓ లేడి కిలాడి ఉందిరా.. ప్రభావతి అనే ఫర్నిచర్ షాప్‌కి వెళ్లి రిచ్ మ్యాన్‌లా నటించాలి.. అందుకు ఆ షాప్ ఓనర్ రోహిణి నాకు ఐదు వేలు ఇస్తుంది.. అసలే సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్‌తో సినిమాకి వెళ్లాలి.. ఆ డబ్బులు కూడా కావాలి.. కదా.. అందుకే నటించేందుకు వెళ్తున్నా అని అంటాడు. సర వెళ్లు.. నీ వల్ల మా నోటికి, మా ఇంట్లో వాళ్ల చేతికి కూడా పని దొరికింది అని బాలు అంటాడు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.అటు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 నియోజకవర్గాలకే పరిమితమైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 శాతం ఓటు బ్యాంకును నిలుపుకోవడం, అదే స్థాయిలో స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఇదివరకు నిర్వహించిన ఎన్నికల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అదే స్థాయిలో పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.ఇందులో భాగంగా.. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన ఓ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు హాజరుకానున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.చిక్కుల్లో పడ్డ నెతన్యాహు: రెడ్ నోటీస్స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ శ్రేణులను కిందిస్థాయి నుంచి సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ ఇన్ఛార్జ్లకు స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ధీటుగా స్థానిక సంస్థలను గెలుచుకోవడంపై దిశానిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ లో జగన్ కు గ్రాండ్ వెల్కమ్: అదే హైలైట్ఈ కీలక భేటీలో నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా పనిచేసేలా క్యాడర్లో భరోసా నింపనున్నారు. అధికార కూటమి ప్రజావ్యతిరేక విధానాలపై

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపర బావ నామ సంవత్సరం, శ్రావణమాసం, వర్షఋతువు, దక్షిణాయనం, 2026 ఆగస్టు 22 శనివారం. పండితుల ప్రకారం ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏవి? ఏ రాశులు కొత్త పనులు ప్రారంభించకూడదు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవాలి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున కోపాన్ని తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కీలకమైన పనులను ప్రారంభిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసివచ్చే రోజు కావడంతో ప్రాంతీయ ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరం. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సానుకూలంగా సాగుతాయి. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది.. ఇతరులతో అనవసరపు గొడవలకు దిగకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. కుంభ రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కార్యాలయంలో మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు బాగుంటుంది. మీన రాశి వారు ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.. దీనివల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
మీ అక్క బతికి ఉన్నన్నిరోజులు నన్ను బాగా చూసుకుంది.. అయినా మీ అక్కని చంపినందుకు ఈ నారాయణ జైలు శిక్ష అనుభవించి వచ్చాడు కదా.. అయినా నీకు మీ అక్క పిల్లలు అంటే ప్రేమ లేదా? అని తాయారు అంటుంది. ఇప్పుడు ఈ చంపుకోవడం లాంటివి వద్దు అని అంటుంది. మామయ్య.. మేం చిన్నప్పటి నుంచి ఏ దిక్కు లేకుండా బతికాం. మా అందరినీ చూసి పై నుంచి అమ్మ ఆత్మ ఎంత బాధ పడి ఉంటుందో అని పెద్ది అంటాడు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ కూడా లేదు.. ఇప్పుడు నాన్నకి దూరం చేస్తారా? అని మహా అడుగుతుంది. వీడు నాకు ప్రాణ భిక్ష పెట్టడం ఏంటి.. అని నారాయణ పైపైకి వెళ్తుంటాడు. మా అక్క చూసి మిమ్మల్ని.. మీ మొహం చూసి ఈ నారాయణను ఇప్పుడు వదిలేస్తున్నా.. ఈ పగ మాత్రం చల్లారలేదు.. నీ చావంటూ ఉంటే.. అది నా చేతుల్లోనే అని దుర్గ ప్రసాద్ అంటాడు. దీంతో నారాయణ గొడవకు వెళ్తుంటాడు. అందరూ కలిసి నారాయణను బయటకు తీసుకు వస్తారు. కారులో అందరూ హైదరాబాద్‌కు రిటర్న్ అవుతారు.కేరింగ్‌గా చూసుకున్న మహా.. కారులో కూర్చున్న నారాయణని కన్నా టచ్ చేస్తాడు. అబ్బ.. దెబ్బలు బాగా తగిలాయ్ రా అని అంటాడు. నీకు ఎలా ఉంది రా అన్ని కేశవ అడిగితే.. ఇవన్నీ నాకు అలవాటు అయ్యాయ్ కదరా అని చక్రి అంటాడు. ఇక దారిలో మెడికల్ షాప్ చూసి కారు ఆపండి అని మహా అంటుంది. చక్రి చేతిని పట్టుకుని ఆయింట్ మెంట్ రాస్తుంది. అమ్మ అని చక్రి అరుస్తుంటే.. మీరేమైనా చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా? అని మహా అంటుంది. షర్ట్ బటన్స్ విప్పండి.. బ్యాక్ సైడ్, షోల్డర్ మీద రాస్తాను అని మహా అంటుంది. నాకు సిగ్గు అండి అంటూ మెలికలు తిరుగుతుంటాడు చక్రి.మళ్లీ వద్దాం.. వాళ్లని తిడదాం, కొడదాం

22 ఆగస్టు 2026న చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ ఉన్న గురు గ్రహంతో సంయోగం చెంది గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ గోచారం కారణంగా అన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మార్పులు కనిపిస్తాయి. ఈ రోజు కెరీర్, ఫైనాన్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. మేషం: మేషరాశి వారికి పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. పెద్ద ఖర్చులు నివారిస్తే మంచిది. వృషభం: వృషభ రాశి వారికి పని ఒత్తిడి పెరగవచ్చు. ఓపికతో పని చేస్తే ఫలితాలు ఉంటాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. మిథునం: కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మిథున రాశి జాతకులకు అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావచ్చు. ఆర్థికంగా మంచి రోజు. చిన్న లాభాలు కనిపిస్తాయి. కర్కాటకం: కర్కాటక రాశి జాతకులకు పనిలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. సీనియర్ల మద్దతు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. సింహం: సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించే రోజు. ప్రమోషన్ లేదా పారితోషికం రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించండి. కన్య: కన్యా రాశి జాతకులు ముఖ్యమైన పనులపై దృష్టి పెడితే విజయం సాధిస్తారు. పని పూర్తి చేయడంలో ఆలస్యం ఉండవచ్చు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. తుల: తులారాశి జాతకులకు సహకారం, భాగస్వామ్యాల వల్ల లాభం వస్తుంది. కొత్త కాంట్రాక్టులు రావచ్చు. ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులు నియంత్రించండి. వృశ్చికం: వృశ్చిక రాశి జాతకులకు రహస్య ప్రాజెక్టులు లేదా పరిశోధన పనుల్లో విజయం ఉంటుంది. ఆర్థికంగా అనుకూలం. అనుకోని ఆదాయం రావచ్చు. పెద్ద నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ధనుస్సు: చంద్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో అవకాశాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభదాయకం. మకరం: మకర
ITR 3, 4 Deadline: అసెస్మెంట్ ఇయర్ 2026-27కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో 6.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు నమోదైనట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. నాన్ ఆడిట్ కేటగిరీ కింద ఐటీఆర్ 3, 4, 5,7 దాఖలు చేసేందుకు ఆగస్టు 31, 2026 ఆఖరి తేదీ అని తెలిపింది. ఆఖరి క్షణంలో రద్దీ వల్ల వచ్చే టెక్నికల్ సమస్యలని నివారించేందుకు పన్ను చెల్లింపుదారులు వెంటనే తమ రిటర్నులను సమర్పించాలని స్పష్టం చేసింది.ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం పన్ను చెల్లింపుదారుల నుంచి ఐటీఆర్ దాఖలుకు విశేష స్పందన లభిస్తోంది. 2026 ఆగస్టు 20 నాటికి మొత్తం 6.5 కోట్లకు పైగా రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది. బిజినెస్, వృత్తిపరమైన ఆదాయం కలిగిన నిపుణులు, వ్యాపారవేత్తలు దాఖలు చేసే ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 ల సంఖ్యనే 2 కోట్లకు పైగా నమోదు కావడం విశేషం.ఆగస్టు 31 గడువు ఎవరెవరికి వర్తిస్తుంది?ఖాతాల ఆడిటింగ్ అవసరం లేని వ్యక్తులు, హిందూ ఆవిభాజ్య కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు, ఇతర ట్రస్టులకు ఐటీఆర్-3, ఐటీఆర్-4, ఐటీఆర్-5, ఐటీఆర్-7 ఫారాలను సమర్పంచేందుకు ఆగస్టు 31, 2026 వరకు తుది గడువు ఉంటుంది. గడువు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఒకేసారి పోర్టల్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది.ఇ-ఫైలింగ్ పోర్టల్ నెమ్మదించడం లేదా ఓటీపీలు రాకపోవడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఆగస్టు 31వ తేదీ దాటితే సెక్షన్ 234F ప్రకారం రూ.1000 నుంచి రూ.5000 వరకు పెనాల్టీలు చెల్లించాల్సి రావచ్చు. చెల్లించాల్సిన పన్ను బాధ్యత ఉంటే సెక్షన్ 234A కింద అదనపు వడ్డీ పడుతుంది. ఆదాయపు పన్ను శాఖ సూచించినట్లుగా ఎలాంటి రుసుములు, సాంకేతిక అంతరాయాలు లేకుండా ఉండటానికి ఇన్వెస్ట్మెంట్ ఫ్రూఫ్స్లు, వార్షిక సమాచార నివేదిక, ఫారం 26ఏఎస్ లను ముందే సరిచూసుకుని ఐటీఆర్ సమర్పించడం శ్రేయస్కరం

మేషం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాలు గజకేసరి యోగం, అధియోగాలతో పటిష్ఠమైనందువల్ల ఎటు వంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు పడ తాయి. ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. తప్పకుండా లక్ష్మీ కటా క్షం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల గజకేసరి యోగం, అధియోగం యోగం కలగడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం చేపట్టినా అంచనాలను మించి విజయవంతం అవుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన రాబడి లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. కర్కాటకం: సప్తమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి చంద్రుడికి గజకేసరి యోగం, అధియోగం కలగడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవ కాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, అంచనాలను మించి లాభి స్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. సంతాన యోగం కలగడానికి అవకాశముంది. తుల: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో ఈ గజకేసరి, అధి ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలుగా భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆస్తి లాభానికి, భూ లాభానికి అవకాశం ఉంది. కొత్వరలో సొంత ఇంటి కల నెర వేరుతుంది. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో

భోగి సినిమా బృందం నటి డింపుల్ హయాతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ డింపుల్ హయాతి ఈ సినిమాలో ఒక కొత్త అవతార్‌లో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వెండితెరపై ఆమె పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో డింపుల్ హయాతి మందారం అనే కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆమె ఫైరీ రెడ్ సారీ ధరించి చాలా బోల్డ్‌గా మరియు ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. ఆమె లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న భోగి సినిమాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా డింపుల్ హయాతి గ్లామరస్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. డింపుల్ హయాతి పుట్టినరోజును పురస్కరించుకుని స్కైసి మీడియా ప్రతినిధులు కూడా ఆమెకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఫలితంగా ఆమె అభిమానులు మరియు నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విష్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో భోగి చిత్రంలో ఆమె నటన మరియు లుక్ ఏ స్థాయిలో అలరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండగా విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించింది. వచ్చే ఆగస్టు 28న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేలా దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భోగి సినిమాతో డింపుల్ హయాతి కెరీర్‌కు మంచి
బుల్లితెరపై 24 గంటలు వినోదానికి కొరత ఉండదు. ఎప్పుడు ఏ ఛానెల్ పెట్టినా ఏదో ఒక సినిమా ఛానెల్లో వస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు టీవీ అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్‌ను ఇస్తుంది. ఇక సపరేట్గా సినిమాల కోసమే కొన్ని ఛానెల్స్ ఉంటాయి. మరి రేపు అంటే శనివారం (ఆగస్ట్ 22) ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ పారాడాక్స్ ఎఫెక్ట్, రెండు గంటలకు కొండవీటి దొంగ రానుంది. ఈటీవీలో 9 గంటలకు, 12 గంటలకు కూడా శ్రీ మంజునాథ రిపీట్ మోడ్‌లో రానున్నాయి. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మహానగరంలో మాయగాడు, రాత్రి తొమ్మిదిన్నరకి మా ఆవిడ కలెక్టర్ రానుంది. ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు చంటబ్బాయ్, 10 గంటలకు రిక్షావోడు, ఒంటి గంటకు దొంగ మొగుడు, 4 గంటలకు కొదమ సింహం, 7 గంటలకు శ్రీ మంజునాథ, 10 గంటలకు రుస్తుం, మిడ్ నైట్ ఒంటి గంటకు చంటబ్బాయ్ రానుంది.జెమినీ టీవీలో ఉదయం 9 గంటలకు శంకర్ దాదా ఎంబీబీఎస్, మూడున్నరకి గ్యాంగ్ లీడర్.. జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు గూఢాచారి నంబర్ 1, నాలుగున్నరకి ప్రేమగోల, జెమినీ మూవీస్‌లో మిడ్ నైట్ ఒకటిన్నరకి మూగ నోము, ఉదయం నాలుగున్నరకి చాణక్య శపథం, 7 గంటలకు స్వయం కృషి, 10 గంటలకు బిందాస్, ఒంటి గంటకు మనసంతా నువ్వే, నాలుగు గంటలకు లంకేశ్వరుడు, 7 గంటలకు బావగారు బాగున్నారా, 10 గంటలకు గాయం ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం మూడు గంటలకు సుప్రీమ్, 9 గంటలకు సిరై రానుంది. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 3 గంటలకు రెడీ, 7 గంటలకు సుడిగాడు, 9 గంటలకు అఆ, 12 గంటలకు హత్య, 3 గంటలకు తంత్ర, ఆరుగంటలకు ఇంద్ర

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు. స్పోర్ట్స్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'ముత్యాలమ్మ' (IND-AP-E8-MO-135) బోటులో ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఒడిశాలోని పారాదీప్ తీరం వద్ద ఒక పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, ఒక ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన బోటు వివరాలను మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా పంపించామని, సరిహద్దు తీరప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులతో ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ నెల 24 తర్వాత కొత్త అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ గాలింపు చర్యలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారి రక్షణకు అన్ని విధాలుగా కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు
Dividend: మిడ్ క్యాప్ విభాగంలో బలమైన ఆర్థిక ప్రదర్శన కనబరుస్తున్న జిల్లెట్ ఇండియా ( Gillette India Share Price ) తమ ఇన్వెస్టర్లకు నిలకడగా రాబడులు అందిస్తోంది. ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించిన ప్రతిపాదన ప్రకారం రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుపై 600 శాతం మేర డివిడెండ్ చెల్లిస్తోంది. అంటే ఒక్కో షేరుకు రూ.60 చొప్పున డివిడెండ్ డబ్బులు అర్హులైన ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి వస్తాయి. షేరు ధరతో సంబంధం లేకుండా ఈ డబ్బులు చెల్లిస్తారు. మరి ఈ డివిడెండ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.డివిడెండ్ అర్హత, రికార్డ్ తేదీ వివరాలు డివిడెండ్ మొత్తం: ఒక్కో షేరుకు 600 శాతం అంటే రూ.60 చొప్పున చెల్లించనున్నారు. రికార్డ్ తేదీ: ఆగస్టు 24, 2026ను రికార్డ్ తేదీగా నిర్ణయించారు. ఎవరికి అర్హత ఉంటుంది ?: ఆగస్టు 24వ తేదీ లోపు కంపెనీ డీమ్యాట్ ఖాతా రికార్డులలో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఈ డివిడెండ్‌ను పొందడానికి అర్హులు. ఎక్స్-డివిడెండ్ తేదీ: సాధారణంగా రికార్డ్ తేదీకి ఒక రోజు ముందు లేదా అదే రోజు (T+1) సెటిల్మెంట్ ప్రకారం ఎక్స్ డివిడెండ్ తేదీగా మారుతుంది. అంటే ఆగస్టు 21వ తేదీన మార్కెట్లు ముగిసే నాటికి షేర్లు కొన్నవారికే అర్హత లభిస్తుంది.జిల్లెట్ ఇండియా వ్యాపార బలంప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ సమూహానికి చెందిన జిల్లెట్ ఇండియా, దేశీయంగా షేవింగ్ ప్రొడక్ట్స్, రేజర్లు, బ్లేడ్లు, పర్సనల్ కేర్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది. కంపెనీ వద్ద ఉన్న బలమైన బ్రాండ్ వాల్యూ, మెరుగైన త్రైమాసిక లాభాలు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ నిర్ణయాలు ఈ స్టాక్‌ను దీర్ఘకాలికంగా బలంగా ఉంచుతున్నాయి.స్టాక్ పనితీరుజిల్లెట్ ఇండియా కంపెనీ స్టాక్ ఈరోజు రూ. 7515 వద్ద లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఒక దశలో రూ. 7555 గరిష్ఠ స్థాయిని తాకింది. ఈ వార్త రాసే సమయానికి స్వల్ప లాభంతో రూ. 7529

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా.. ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘మెగా158’ చిత్ర బృందం సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘మెగా158’ చిత్ర బృందం సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ టీజర్‌ను చిరంజీవి జన్మదిన కానుకగా (Chiranjeevi Birthday Special) ఆగస్ట్ 22న అధికారికంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు బాబీ కొల్లి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గ్లింప్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ దర్శకుడు బాబీ ఓ పవర్ఫుల్ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో చిరంజీవి సరికొత్త యాటిట్యూడ్, ఇంటెన్స్ స్వాగ్తో కూడిన సిల్హౌట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘‘మెగాస్టార్‌కు ప్రత్యేకమైన రోజున ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న వెయిటింగ్‌కు ఫుల్స్టాప్ పడనుంది. ఆగస్టు 22న Mega158 టైటిల్ గ్లింప్స్ వచ్చేస్తోంది. ఇదొక న్యూ చాప్టర్.. న్యూ ఫోర్స్.. సరికొత్త మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. మునుపెన్నడూ చూడని రీతిలో సాగే మెగా బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి’’ అంటూ బాబీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో కలిసి టీజర్ అవుట్‌పుట్ చూస్తున్న వర్కింగ్ స్టిల్‌ను, చిరంజీవి ఇంటెన్స్ సిల్హౌట్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరును వింటేజ్ మాస్ లుక్‌లో

దేశంలో మొబైల్ కనెక్షన్ల జారీలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వీటిని అమల్లోకి తీసుకుని రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు సైతం రూపొందించింది.. టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ. సిమ్ కార్డుల జారీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే కఠినంగా ఈ నూతన నిబంధనలను అమలులోకి తేబోతోంది.మొబైల్ కనెక్షన్లు, సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒక వ్యక్తి తన పేరు మీద నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు కలిగి ఉంటే, వారికి నూతనంగా మరో సిమ్ కార్డు జారీ చేయకూడదని కేంద్రం టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. అంటే.. పరిమితి మించిన వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన సిమ్ అనేది ఇవ్వరు. వీటిని పూర్తిగా నిలిపివేయనున్నారు.తాజా టెలికాం నిబంధనల ప్రకారం.. దేశంలో ఒక పౌరుడు తన ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలపై గరిష్టంగా తొమ్మిది మొబైల్ కనెక్షన్లను మాత్రమే పొందేందుకు అనుమతి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రత కారణాల రీత్యా ఈ పరిమితిని గరిష్టంగా ఆరు సిమ్ కార్డులుగా నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల యూజర్లు ఆరుకు మించి ఎక్కువ సిమ్ కార్డులను పొందలేరు. వేర్వేరు టెలికాం కంపెనీల సిమ్ కార్డులను వాడుతున్నప్పటికీ కూడా మొత్తంగా ఉండాల్సిన కనెక్షన్ల సంఖ్య ఈ లిమిట్ దాటకూడదు.వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్వినియోగదారులకు ఇప్పటికే వివిధ నెట్వర్క్ లలో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని రియల్ టైమ్ లో సరిపోల్చుకోవడానికి టెలికాం కంపెనీలన్నీ కూడా డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ డిజిటల్ డేటాబేస్ ఆధారంగానే నూతన కనెక్షన్లు కోరేవారి అర్హతను ఆపరేటర్లు పరిశీలిస్తారు. ఇప్పటికే గరిష్ట పరిమితిని దాటిన వినియోగదారులు మరో
వామ్మో.. ఇంటింటి రామాయణం సీరియల్లో ప్రేమ మామూలుగా పొంగటం లేదు. అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ఉంటే ప్రేమని తెగ పొంగిచేస్తారు.. లేదంటే పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. పల్లవి మారిన తరువాత ఆమెపై తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. అవని, మీనాక్షి, పార్వతి, శ్రియ, భానుమతి, చక్రధర్.. వీళ్లంతా ప్రేమ కురిపించడంలో తెగ పోటీపడుతున్నారు. అయితే చూసి చూసి పల్లవి అందర్నీ మడతపెట్టేసే రోజు దగ్గర్లోనే కనిపిస్తుంది కానీ.. ఈరోజు (ఆగస్టు 21) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. శ్రియ, మీనాక్షిలు తెగ ప్రేమ కురిపించుకుంటారు. ఒకర్నొకరు పట్టుకుని తెగ ఎమోషనల్ అయిపోతారు. సొంత అనుకోవడానికి రక్త సంబంధాలే ఉండాల్సిన అవసరం లేదు శ్రియ.. ప్రేమ పంచితే మామూలు సంబంధాలే అనుబంధాలు బలపడతాయి అంటూ శ్రియని పట్టుకుని తెగ ఏడ్చేస్తుంది మీనాక్షి.ఇక ఊ అంటే చాలు పార్వతి.. అవని భజన చేస్తూ ఉంటుంది కదా.. అది చూసీ చూసి భానుమతి ఒళ్లు మండింది. ‘ఈ ఇంట్లో అవని ఒక్కతే మనిషా.. మిగిలిన వాళ్లెవ్వరూ మనుషులు కాదా? ఊ అంటే చాలు అన్నింటికీ అవనే అంటావ్ ఏంటీ’ అంటూ దులిపేస్తుంది భానుమతి. ఆ తరువాత పల్లవి.. ఏదో బిజినెస్ చేయాలని అనుకుంటుంది కదా.. ఏం చేస్తుందో అడగొచ్చు కదా అని అంటుంది భానుమతి. అంతా అవని చూసుకుంటుంది అని పార్వతి అనడంతో.. ఇంకా మండిపోతుంది భానుమతికి. ఇంతలో పల్లవికి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది మీనాక్షి. ఇది కాఫీలా లేదు.. అమ్మ ప్రేమలా చాలా బావుంది అని తెగ పొగిడేస్తుంది పల్లవి. వీళ్లిద్దరి మధ్య నాటకీయం మామూలుగా లేదు. ఆపండి తల్లో చూడలేక చేస్తున్నాం అనేట్టుగానే ఉంది.మరో వైపు జైల్లో ఉన్న అశ్విన్ పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్ఐ వచ్చి.. అశ్విన్‌ని అవమానిస్తూ మాట్లాడతాడు. ‘ఆడదాని మాటల్ని నమ్మి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు.. ఆ పల్లవికి నాకు మధ్య అసలు స్టోరీ ఏంటనేది

అణగారిన ప్రజల కష్టాలు, వారి జీవిత గాథలను చెప్పే చిత్రంగా ‘అమరం’ రూపొందించినట్టు ఆ చిత్ర దర్శకుడు తిరు అరుల్ కృష్ణన్ చెప్పారు. తాజాగా ఈ మూవీ ఆడియో వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. అణగారిన ప్రజల కష్టాలు, వారి జీవిత గాథలను చెప్పే చిత్రంగా ‘అమరం’ (Amaram) రూపొందించినట్టు ఆ చిత్ర దర్శకుడు తిరు అరుల్ కృష్ణన్ (Arul Krishnan) చెప్పారు. దివ్య నేత్ర ఫిలిమ్స్ పతాకంపై సీఆర్ రాజన్ నిర్మించిన ఈ చిత్రంలో తేజస్ రాజన్ హీరోగా నటించగా, ఐరా అగర్వాల్ హీరోయిన్. ఇతర పాత్రల్లో జార్జ్, సాయిదీనా, నాగినీడు, కల్కిరాజన్, హరీష్ పేరడి, వాసుదేవన్ మురళి తదితరులు నటించారు. కథ, స్ర్కీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం తిరు అరుల్ కృష్ణన్. సంగీతం మిక్కీ జే మేయర్. ఈ నెల 28వ తేదీ విడుదలకానున్న ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక తాజాగా చెన్నై నగరంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సీఆర్ రాజన్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ సినిమా తీయాలని కోరుకుంటారు. కానీ, అనేక మంది కళాకారుల కృషి, అంకితభావం అవసరం. అది కొన్ని సినిమాల విషయంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ కోణంలో చూస్తే మా సినిమాకు అన్ని పుష్కలంగా లభించాయి. అందుకే ఒక అద్భుతమైన మూవీగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు. హీరో తేజస్ రాజన్ మాట్లాడుతూ.. మా అందరి కృషి ఫలితంగా ఓ చిత్రం రూపుదిద్దుకుని మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. 330 మందికిపైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు అంకితభావంతో ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. దర్శకుడు అరుల్ కృష్ణన్ చాలా చక్కగా తెరకెక్కించారని పేర్కొన్నారు. దర్శకుడు అరుల్ కృష్ణన్ మాట్లాడుతూ.. ‘‘ఈ స్టోరీ సమాజం తిరస్కరించిన వారి జీవితాల గురించి మాట్లాడుతుంది. ఇలాంటి కథ సృష్టించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం నిర్మాతలో ఉండటం వల్లే ఈ సినిమా సకాలంలో

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. AP Weather Alert: కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన కోస్తా జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలే కురుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది ఏపీలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణం ఇలా ఉందని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించినప్పటికీ, వర్షాలు అక్కడక్కడే కురుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల పగటిపూట కూడా ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జూన్ మాసంలో నైరుతి రుతుపవనాలు విస్తరించి రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయి.. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు పడటం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావాలు ఉన్నప్పటికీ, తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ రైతులకు ఏ పంటలు సాగు చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తూ ముందస్తు సూచనలు ఇస్తోంది. నేడు కూడా పోలవరం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న
అంతా నువ్వే చేసి ఇప్పుడు ఏం చేయనట్టు, తెలీనట్టు అడుగుతున్నావ్ అని శైలు ఆట పట్టిస్తుంది. అసలు ఇదెలా జరిగింది? అని కేశవ అంటే.. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మా వాళ్లు ముందే చెప్పార్రా నీ గురించి.. నిన్ను నమ్మొద్దు, నాకు సంబంధం లేదు అని మధ్యలోనే వదిలేస్తాడు అని.. కానీ నేనే నా కేశవ అలాంటి వాడు కాదని అన్నాను.. కానీ నువ్వేం చేశావ్.. వాళ్లే రైట్ అని నిరూపించావ్ అని కోపంగా ఉన్నట్టు ఫోన్ కట్ చేస్తుంది. దీంతో కేశవ అయోమయంలో పడిపోతాడు. ఇంతలో చక్రి వచ్చి కాబోయే తండ్రి అని ఆట పట్టిస్తుంది. అలా ఎలా.. ఇలా ఎలా.. ఇదంతా కల అంటూ నేనేం చేయలేదురా అని అంటాడు కేశవ. నువ్వేం చేయకపోతే పై నుంచి ఎవరైనా వచ్చి మంత్రం వేశార్రా.. ఊరుకోరా.. ఏం కాదు.. మనం వెళ్లిన తర్వాత మాట్లాడి పెళ్లి చేద్దాం.. ఇక మీ అత్త, మీ బామ్మర్ది గాడు కూడా ఏం చేయలేడు.. అని అంటాడు చక్రి. మరి మాట అని కేశవ అంటే.. ఇంకేం మాటలు రా.. వరాల మూట పుడుతుంటే అని చక్రి అంటాడు.నీకు నరకం చూపిస్తా.. కొడుతుంటే బాధగా ఉందా, నొప్పిగా ఉందా?.. నువ్వు మా అక్కని చంపేటప్పుడు కూడా మా అక్క ఇలానే బాధ పడి ఉంటుంది కదా.. ఇప్పుడు నీకు నరకం చూపిస్తా.. పైకి వెళ్లాక మా అక్క ఏ శిక్ష వేస్తుందో.. తన ఇష్టం.. నేను మాత్రం ఇక్కడ నీకు మరణ శిక్ష వేస్తాను.. నీకు ఎంత ధైర్యం ఉంటే.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నా ఊరికి వస్తావ్.. నిన్ను వదిలి పెడతాను అని ఎలా అనుకున్నావ్ రా.. వీడ్ని కొట్టండి.. నరకం అంటే ఏంటో చూపించిండి అని దుర్గా ప్రసాద్ ఆగ్రహిస్తాడు.నా కొడుకులు వస్తే.. ఇలా కట్టేసి కొడుతున్నారు.. మీరు మగాళ్లేనారా.. ఒకసారి కట్లు
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆగస్టు(August) 21వ తేదీన నవమి తిథి, బ్రహ్మ ముహుర్తం, రాహుకాలం, వైధ్రుతి, విష్కంభ యోగాలు ఎప్పుడొచ్చాయి. దీంతో పాటు అనురాధ నక్షత్రాలకి సంబంధించి పూర్తి వివరాలను ప్రముఖ పండితులు చింతాడ మణికంఠ స్వామి మాటల్లో తెలుసుకుందాం.వృశ్చిక రాశిలో చంద్రుడి సంచారంరాష్ట్రీయ మితి శ్రావణం 09, శాఖ సంవత్సరం 1945, శ్రావణ మాసం, శుక్ల పక్షం, నవమి తిథి, విక్రమ సంవత్సరం 2080. AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 21 ఆగస్టు 2026 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం ఉదయం 10:26 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నవమి తిథి రాత్రి 11:33 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:17 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు బలవ కాలం ఉదయం 10:26 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత కౌలవ కాలం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 11:36 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత తైతిల కాలం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 12:48 గంటల వరకు ఉంటుంది. ఈరోజు వైధ్రుతి యోగం తెల్లవారుజామున 5:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత విష్కంభ యోగం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 6:13 గంటల వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు.నేడు శుభ ముహుర్తాలివే బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:28 గంటల నుంచి ఉదయం 5:16 గంటల వరకు అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:54 గంటల నుంచి మధ్యాహ్నం 12:44 గంటల వరకు అమృత ఘడియలు : తెల్లవారుజామున 4:55 గంటల నుంచి ఉదయం 6:43 గంటల వరకు సూర్యోదయం సమయం 21 ఆగస్టు 2026 : ఉదయం

ఆగస్టు 21 2026 శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహత్తరమైన రోజు ఈ రోజు. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడు మిధున రాశిలో, గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. దీని ఫలితంగా ద్వాదశ రాశుల వారి జీవితాలలో అనేక మార్పులు జరగబోతున్నాయి. ఇక నేడు వరలక్ష్మీ వ్రతం నాడు 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో చూద్దాంమేషం: మేష రాశి జాతకులకు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండండి.వృషభం: వృషభ రాశి జాతకులకు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.మిథునం: మిధున రాశి జాతకులకు వృత్తిపరమైన ఒత్తిడి తగ్గుతుంది. కొత్త పరిచయాలు లాభాన్నిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.కర్కాటకం: కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.సింహం: నేడు సింహరాశి జాతకులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.కన్య: కన్యా రాశి వారికి నేడు అనుకోని ధనలాభం ఉంటుంది. మిత్రుల ద్వారా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.తుల: సమాజంలో తులా రాశి జాతకుల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాముల నుండి మంచి సహకారం అందుతుంది.వృశ్చికం: చంద్రుని సంచారం ఈ రాశిలోనే ఉన్నందున వృశ్చిక రాశి జాతకాలు ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు.ధనుస్సు: వృత్తి మరియు ఆర్థిక రంగాల వారికి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నేడు మహాలక్ష్మీ యోగం: సింహ, మకర రాశులతో పాటు వీరికి తిరుగే లేదు!మకరం: మకర రాశి వారికి నేడు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.కుంభం: కుంభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి

2026 వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21న జరుగుతుంది. సంపద, సమృద్ధి, కుటుంబ శ్రేయస్సు కోసం మహాలక్ష్మిని ఆరాధించే ఈ పుణ్యదినం జ్యోతిష్యపరంగా కూడా ప్రత్యేకమైనది. ఈ రోజు ఏర్పడే సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం వల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా అనుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుంభ రాశితో పాటు మరో ఐదు రాశులవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద, సుఖసౌఖ్యాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.వృషభ రాశి: వృషభ రాశి జాతకులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు చేతికి రావచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, లాభదాయక ఒప్పందాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెంపు సాధ్యం అవుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనవసర ఖర్చులు నియంత్రించి పొదుపు చెయ్యాల్సిన అవసరం ఉంది.కుంభ రాశి: కుంభరాశి వారికి నేడు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు లేదా ప్రమోషన్ రావచ్చు. వ్యాపారులకు లాభదాయక ఒప్పందాలు, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. గత పెట్టుబడుల నుంచి లాభాలు రావచ్చు. ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి.ధనుస్సు రాశి: నేడు ధనుస్సు రాశి వారికి బాగుంటుంది. పాత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. వ్యాపార విస్తరణ, కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి.నేడు మహాలక్ష్మీ యోగం: సింహ, మకర రాశులతో పాటు వీరికి తిరుగే లేదు!సింహ రాశి: సింహరాశి జాతకులకు ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వృత్తి విషయాల్లో సానుకూల మార్పులు. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అనూహ్యంగా డబ్బు చేతికి రావచ్చు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరగవచ్చు.మిథున రాశి: మిధున రాశి వారికి ఆర్థికంగా అనుకూల సమయం. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల లాభాలు. కొత్త అవకాశాలు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది.ఈ వ్రత కాలంలో భక్తితో పూజలు

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఆగస్ట్ 21న విడుదలయ్యేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Director Ramana Reddy Soma) దర్శకత్వం వహించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా.. ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ సినిమాను ఇప్పటికి చాలా సార్లు చూశాం. కచ్చితంగా హిట్టు బొమ్మ అనే ఫీల్నే ఇస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదని చెప్పగలను. అలాంటి ఓ గొప్ప అటెంప్ట్ నేను చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేం హిట్ కొట్టేశాం, మేం అనుకున్నది సాధించేశామనేది అర్థమైంది. మలయాళంలో తీసినట్టుగా మన దగ్గర రావడం లేదని అంటుంటారు కదా.. ఇకపై హైదరాబాద్ ఎరా స్టార్ట్ అయింది. ఆగస్ట్ 21న నైజాంలో స్టార్ట్ అయ్యే సౌండ్.. అన్ని వుడ్లకు చేరుకుంటుందని అన్నారు. నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ.. నన్ను ముందు నిలబెట్టి నడిపిస్తోన్న నా భర్త రమణకు థాంక్స్. ఆయనే రైటర్, డైరెక్టర్, నిర్మాతగా అన్నీ పనులు చూసుకున్నారు. ఆయన ఈ ‘అమీర్ లోగ్’ సినిమాను అందమైన పెయింటింగ్‌గా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూసి బయటకు వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకెళ్తారని తెలిపారు. కో ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా నుంచి రీసెంట్‌గానే వచ్చాను. అమెరికాలో కూడా

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ఇందులో రవితేజ కుమార్తెగా నటించిన బేబి నక్షత్ర చిత్ర విశేషాలను తెలిపారు. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ (Irumudi). ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్ట్ 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో ఓ రేంజ్లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర (Baby Nakshathra), మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ‘‘నా పేరు నక్షత్ర. మాది కేరళ. ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పటివరకు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేశాను. తెలుగులో ఇదే నా మొదటి చిత్రం. దర్శకుడు శివ నిర్వాణ ఇన్‌స్టాగ్రామ్‌లో నా రీల్స్ చూసి ముందుగా.. మా అమ్మను సంప్రదించారు. ‘ఇరుముడి’ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఒకే ఒక్కసారి శబరిమల వెళ్లాను. రవితేజ సార్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటించిన ‘విక్రమార్కుడు’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘ఇరుముడి’ చిత్రంలో నా పాత్ర పేరు మణికంఠ. నేను రవితేజ సార్ కూతురిగా కనిపించబోతున్నాను. ప్రియా మేడమ్ నా తల్లి పాత్రలో నటించారు. ఇద్దరూ నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ సినిమాకి నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పాను. నా కెరీర్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సందర్భంగా మా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. School Holidays Tomorrow August 21 TO 28: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆగస్టు చివరి వారంలో విద్యార్థులకు పండగల కారణంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఆగస్టు 21, ఆగస్టు 25, ఆగస్టు 26, ఆగస్టు 28వ తేదీల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. అయితే ప్రతి రాష్ట్రంలో సెలవులు ఒకే తేదీల్లో ఉండవు. ముఖ్యంగా మిలాద్ ఉన్న నబీ, ఓనం, రక్షాబంధన్, వరలక్ష్మీ వ్రతం వంటి పండగల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తమ రాష్ట్రం, పాఠశాల అధికారిక సెలవు క్యాలెండర్ పరిశీలించడం చాలా ముఖ్యం. ఆగస్టు 21వ తేదీ: ఆగస్టు 21వ తేదీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవు ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ సెలవులు ప్రకటిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉత్తర్వులను జారీ చేశాయి. శ్రావణ మాసంలో నిర్వహించే ముఖ్యమైన పండగల్లో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని తెలిసిన సంగతే. ముఖ్యంగా మహిళలు ఈ రోజు వరలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పండగ ప్రాధాన్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సెలవును ప్రకటించింది. ఆగస్టు25వ తేదీన సెలవు: ఆగస్టు 25వ తేదీన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంది. అదే సమయంలో కేరళలో జరుపుకునే మొదటి పండగ ఓనం సందర్భంగా కూడా సెలవు ఉంది. అయితే అయితే ఈ సెలవు అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా వర్తించదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన అధికారిక సెలవుల

మిలాద్-ఉన్-నబి పండుగకు సంబంధించిన సెలవు తేదీని మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన ఆగస్టు 25కు బదులుగా ఆగస్టు 26వ తేదీని(బుధవారం) సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. అమరావతి, ఆగస్టు 20: మిలాద్-ఉన్-నబి పండుగకు సంబంధించిన సెలవు తేదీని మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన ఆగస్టు 25కు బదులుగా ఆగస్టు 26వ తేదీని(బుధవారం) సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. చంద్ర దర్శనం ఆధారంగా ఈ ఏడాది మిలాద్-ఉన్-నబి పండుగ ఆగస్టు 26న వస్తుందని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి తెలియజేసింది. సెలవు తేదీని సవరించాలని వక్ఫ్ బోర్డు సీఈఓ చేసిన విజ్ఞప్తి మేరకు సెలవు తేదీని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 26ను సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. శ్యామల రావు అధికారికంగా జీవో జారీ చేశారు. అయ్యో పాపం.. ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కుని అనకాపల్లి జిల్లాలో BARC ప్రాజెక్టుకు రిలీఫ్.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు

ఈ నెల(ఆగస్టు) 28న, శ్రావణ పౌర్ణమి రోజున కుంభ రాశిలో చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, ఆ రోజున కుంభ రాశిలో ఉన్న చంద్ర రాహువులకు, సింహ రాశిలో ఉన్న రవి కేతువులకు మధ్య సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల పాక్షికంగా గ్రహణ ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణ ప్రభావం పక్షం రోజులకు పైగా ఉంటుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు ధన యోగాలు, రాజయోగాలు పట్టే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వినడం, ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం కావడం, ఆదాయం వృద్ధి చెందడం, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. మేషం: ఈ రాశివారికి లాభస్థానంలో చంద్ర గ్రహణం పడుతున్నందువల్ల గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండక పోవచ్చు. చాలావరకు అనుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆశించిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల విదేశాల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో సానుకూల స్పందన లభిస్తుంది.. కొత్త ప్రయత్నాలు చేపట్టడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. కన్య: ఈ రాశికి షష్ట స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల సమస్యలు, ఒత్తిళ్లు పూర్తిగా తగ్గు ముఖం పడతాయి. ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి బయటపడతారు. సాధారణంగా ఏ సమస్యా ఉండే అవకాశం లేదు. శత్రువులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు

TSCPSEU: నల్లగొండ జిల్లాలో సీపీఎస్ (CPS) రద్దు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పాత పింఛను విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) పిలుపునిచ్చింది. ఈ నెల 23న చేపడుతున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లాలోని గుర్రంపోడు, కనగల్, చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాలలో గురువారం ఆవిష్కరించారు. TSCPSEU: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సీపీఎస్ (CPS) పింఛను విధానాన్ని రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) పిలుపునిచ్చిన 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని గుర్రంపోడు, కనగల్, చండూరు, మునుగోడు, మర్రిగూడ మండలాలలో గురువారం 'చలో హైదరాబాద్' గోడ ప్రతుల (పోస్టర్) ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఉడావత్ లచ్చిరాం, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు భద్రయ్య, మురళి మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటం ఆగదని స్పష్టం చేశారు. భాగస్వామ్య పింఛను విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానమే ఉద్యోగులకు నిజమైన భద్రత ఇస్తుందన్నారు. పెట్టుబడుల ఆధారిత పెన్షన్ ఉద్యోగులకు టెన్షన్ గా మారిందని అన్నారు. మార్కెట్లో మార్పులు వల్ల ఇప్పటికే సుమారు రూ. 1800 కోట్ల సొమ్ము ఉద్యోగులు నష్టపోయారని తెలిపారు ఆగస్టు 23న హైదరాబాద్‌లో చేపట్టే మహాధర్నా.. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. భాగస్వామ్య పింఛను విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని, పాత పింఛన్ విధానమే ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను ఇస్తుందని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఉడావత్ లచ్చిరాం

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం, త్వరలో ముఖ్యమైన పండుగలు వస్తున్న క్రమంలో ధరలు అమాంతం పెరగడం కొనుగోలు చేయాలనుకునేవారిని నిరాశపరుస్తోంది. ఆగస్ట్ 20న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,59,270కి చేరుకుంది. ఒక్కరోజే రూ.4300 పెరిగింది. 22 క్యారెట్ల ధర రూ.1,46,000 పలుకుతుండగా.. ఇవాళ రూ.3950 హైక్ అయింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 వద్ద ట్రేడవుతుండగా.. గురువారం రూ.2180 పెరిగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000గా ఉండగా.. నేడు రూ.2 వేలు పెరిగి నిరాశకు గురి చేసింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,270 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,000 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,420గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,150 వద్ద కొనసాగుతున్నాయి. అటు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలు ప్రస్తుతం పలుకుతోంది. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పెరిగి షాకిచ్చింది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. గురువారం రోజే ఒకేసారి రూ.10 వేలు పెరిగింది. చెన్నైలో కిలో వెండి రూ.2.60 లక్షలు, బెంగళూరులో రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది
నీ భార్య నీ పక్కన లేకపోతే నువ్వు జీరో.. మీ ఆవిడను ఈ షాప్‌లో మళ్లీ పెట్టు.. అని మణికంఠ చెబుతుంటాడు. ఇలా చెప్పడానికి మా ఆవిడ నీకు ఎంత ఇచ్చింది.. అని మనోజ్ అంటాడు. నేను అమ్ముడు పోను అని మణికంఠ అంటాడు. అదే టైంలో రోహిణి వస్తుంటుంది. చూశావా.. మాటల్లోనే వస్తోంది.. నూరేళ్లు ఉంటుంది అని మణికంఠ అంటే.. ఇంకెంత మందిని మోసం చేయడానికి అని మనోజ్ అంటాడు. ఆ మాటలు రోహిణి వింటుంది. మా ఆవిడ ఓ స్టూల్ తీసుకు రమ్మంది.. కొంటాను.. అని అంటాడు. చూశావా ఇప్పటి వరకు నేను ఫ్రెండ్‌గా ఉన్నా.. మీ ఆవిడ రాగానే నేను కస్టమర్‌ను అయ్యా అంటాడు మణికంఠ. కానీ రోహిణి పిలుస్తుంటే మనోజ్ పట్టించుకోడు. ఇంతలో ఓ కస్టమర్ వచ్చి.. భారీ ఆర్డర్ ఇస్తాడు. కాకపోతే అది మలేషియాకి పార్శిల్ చేయాలని అంటాడు. మలేషియా తప్పా ప్రపంచంలో ఎక్కడికైనా డెలివరీ చేస్తా అంటాడు మనోజ్. ఏం నీకు తిక్కనా.. ఇంత పెద్ద ఆర్డర్ వద్దంటున్నావ్ అని అంటాడు. తిక్క లేదు.. ఫ్రాడ్ వైఫ్ ఉందని ఆ కస్టమర్‌ని పంపిస్తాడు మనోజ్.బాలుకే ముందు తెలుస్తుంది.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు.. ఇక్కడికి వచ్చావ్ అని అమ్మకి తెలిస్తే.. నిన్ను కొట్టినట్టే నన్ను కూడా కొడుతుంది.. అని మనోజ్ అంటాడు. నేను వచ్చాను అన్న విషయం ఎవరు చెప్తారు.. ఎవరికి తెలుస్తుంది.. అని రోహిణి అంటుంది. ఆ బాలు గాడికి తెలుస్తుంది.. మనం ఏం మింగినా, నువ్వేం మోసం చేసినా ముందు వాడికే కదా తెలుస్తుంది అని అంటాడు మనోజ్. నా మీద ఇష్టం లేక ఇలా అంటున్నావా? మీ అమ్మకి భయపడి అంటున్నావా? అని రోహిణి అడుగుతుంది. ఇలాంటి లాజిక్స్ అడగకు అని అంటాడు మనోజ్.ఇలా దూరం పెట్టకు.. నేను ఇలా ఎందుకు చేశానో అర్థం చేసుకో మనోజ్.. నీ కోసమే కదా

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, తాళ్లబస్తీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పోస్టాఫీస్ పరిధిలో మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈలు కోరారు. కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో జలమండలి పనుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేపీహెచ్‌బీ లోధా అపార్ట్మెంట్స్, ఇందూ అపార్ట్మెంట్స్, బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, ఫిష్ మార్కెట్, ఎన్ఎస్ఎల్ మాల్, డీమార్ట్ ఏరియా, ఐదోఫేజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు
నా పెంపకంలో తప్పు ఉందా? నేను తప్పు చేశానా? అని శేఖరం అడుగుతాడు. లేదు నాన్నా అని శైలు అంటుంది. మరి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశావ్.. పెళ్లికి ముందే ఇలాంటి తప్పు చేశావ్ అని అందరికీ తెలిస్తే మన పరువు ఏం అవుతుంది.. నీకు కావాల్సినంత స్వేచ్చ ఇచ్చాను.. అమ్మాయిలు చదువుకోవాలి అని.. నిన్ను కాలేజీకి పంపిస్తే కడుపు చేసుకుని వస్తావా? అని శేఖరం అడుగుతాడు. నాన్నా.. అని శైలు అంటుంది. అవునమ్మా.. నాన్ననే.. నాన్ననే అంటున్నాను.. చెప్పమ్మా అని అంటాడు శేఖరం. ఎందుకే మా పరువుతీశావ్.. మీ నాన్న నీ గురించి ఎంతో గొప్పగా చెబుతూ తలెత్తుకుని తిరిగేవాడు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బయటకు వెళ్లమంటావే.. పరువు తీశావ్ కదే అని చితక్కొడుతుంది వరాలు. ఇది అబద్దమే కదా.. అని వరాలు అంటే.. ఇది అబద్దమే, నేను ఏ తప్పు చేయలేదు.. కానీ ఈ విషయం ఇప్పుడు మీకు చెప్తే మీరు మళ్లీ పెళ్లి అంటారు.. కేశవ వచ్చాకే ఈ నిజం చెప్పాలి అని శైలు తన లోలోపల అనుకుంటుంది. ఇంతలో కేశవకి సురేష్ గాడు ఫోన్ చేసి.. మా చెల్లికి కడుపు చేస్తావా? ఇక్కడకు రారా నిన్ను నరికేస్తా అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. కడుపు ఏంట్రా అని కేశవ అడిగే లోపు కట్ చేసేస్తాడు.పోలీసు కేసు పెడతా మాధవకి ఫోన్ చేస్తుంది వరాలు. ఎవరు అని మాధవ అడుగుతాడు. నేను శైలు మహామ్మారిని కన్నా అమ్మని,.. అమ్మమ్మని అవుతున్నాను అని గర్వంగా చెప్పుకోవాలా? పెళ్లికి ముందే ఇలా చేసిందని చెప్పుకోవాలా? ఇదంతా మీ తమ్ముడి పుణ్యమే అని చెప్పుకోవాలా? అని ఏడ్చేస్తుంటుంది. మా తమ్ముడు అలాంటివాడు కాదండి అని మాధవ అంటాడు. మా కూతురు అంత పెద్ద నోరు వేసుకుని, అందరికీ వినిపించేలా చెబుతోంది.. దానికి మాయ మాటలు చెప్పి మోసం చేశాడు.. మీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Uttarakhand School Holidays: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా నారాయణ్‌బగడ్ ప్రాంతంలో హింసాత్మక కుక్కల బెడద విపరీతంగా పెరుగుతున్న తరుణంలో స్థానిక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ్ బాగ్‌లోని 10 పాఠశాలలకు ఏకంగా నాలుగు రోజులను సెలవులుగా మంజూరు చేశారు. అయితే ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు ఆన్లైన్లో తరగతులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ మధ్య నారాయణబగడ్ వరుసగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా స్థానికుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే తమ పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, కొన్ని రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. పాఠశాలకు రాకపోకలు సాగించేటప్పుడు పిల్లలను ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించడమే థ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు మూసివేసినప్పటికీ విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఆన్లైన్ తరగతులను ప్రతిపాదించడం జరిగింది. అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలను నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులు ఆన్లైన్లో విద్యార్థులతో అనుసంధానమై వారికి బోధిస్తారు. దీనివల్ల సాధారణ తరగతులు మూసివేసినప్పటికీ పిల్లలు తమ విద్యను కొనసాగించడానికి వీలవుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని అనవసరంగా బయటకు వెళ్లనివ్వవద్దని కూడా కోరారు. దూకుడు స్వభావం గల కుక్కల ఉనికి పాఠశాల విద్యార్థులకే కాకుండా స్థానిక నివాసితులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. పర్వత ప్రాంతాలలో ప్రజలు
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆగస్టు(August) 20వ తేదీన అష్టమి తిథి, బ్రహ్మ ముహుర్తం, రాహుకాలం, ఇంద్ర యోగాలు ఎప్పుడొచ్చాయి. దీంతో పాటు విశాఖ, అనురాధ నక్షత్రాలకి సంబంధించి పూర్తి వివరాలను ప్రముఖ పండితులు చింతాడ మణికంఠ స్వామి మాటల్లో తెలుసుకుందాం.తులా రాశిలో చంద్రుడి సంచారంరాష్ట్రీయ మితి శ్రావణం 08, శాఖ సంవత్సరం 1945, శ్రావణ మాసం, శుక్ల పక్షం, అష్టమి తిథి,విక్రమ సంవత్సరం 2080. AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 20 ఆగస్టు 2026 సూర్యుడు దక్షిణయానం, రాహుకాలం మధ్యాహ్నం 1:53 గంటల నుంచి మధ్యాహ్నం 3:27 గంటల వరకు, అష్టమి తిథి రాత్రి 9:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు విశాఖ నక్షత్రం ఉదయం 9:08 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు విష్టి కాలం ఉదయం 8:16 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత బవ కాలం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 9:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత బలవ కాలం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 10:26 గంటల వరకు ఉంటుంది. ఈరోజు ఇంద్ర యోగం తెల్లవారుజామున 4:24 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత వైధ్రుతి యోగం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 5:18 గంటల వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు.నేడు శుభ ముహుర్తాలివే బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:28 గంటల నుంచి ఉదయం 5:16 గంటల వరకు అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:54 గంటల నుంచి మధ్యాహ్నం 12:44 గంటల వరకు అమృత ఘడియలు : అర్ధరాత్రి 12:16 గంటల నుంచి రాత్రి 2:03 గంటల వరకు సూర్యోదయం సమయం 20 ఆగస్టు 2026 : ఉదయం 5:19

2026 ఆగస్టు 22వ తేదీన జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సంఘటన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఆగస్టు 22వ తేదీన రాత్రి 7 గంటల 32 నిమిషాలకు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం చేస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం జరిగే సమయానికే అప్పటికే అందులో ఉన్న సూర్యుడు బుధుడి తోటి సంయోగం జరిపి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు రానున్నాయి.బుధాదిత్య రాజయోగంఈ బుధాదిత్య రాజయోగం కారణంగా బుద్ధి, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యాపారం, ఉద్యోగం మరియు ఆర్థిక వృద్ధికి అనుకూలంగా పనిచేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు అధికారాన్ని సూచిస్తే, బుధుడు తర్కం, కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యాలకు ప్రతీకగా ఉన్నాడు. వీరి కలయిక వల్ల అనేక మందికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు.కుంభరాశిముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ కాలం చాలా శుభకరం. వారి జీవితంలో కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి మరియు సామాజిక గౌరవం పెరగవచ్చు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుంభరాశి వారి సంపదలు పెరుగుతాయి. సామాజికంగా పురోగతి కనిపిస్తుంది.మేషరాశిమేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయంగా ఉంటుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారి వర్తక వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.కర్కాటక రాశికర్కాటక రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అన్ని విధాల శుభయోగం. ఈ సమయంలో కర్కాటక రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు, వ్యాపార విస్తరణ సాధ్యమవుతుందితులారాశితులా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఆదాయం

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ ఈ చిత్ర విశేషాలకు మీడియాకు తెలియజేశారు అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Ramana Reddy Soma) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ (Vedha Jalandhar) ఈ చిత్ర విశేషాలకు మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘2019లో నా కెరీర్ ప్రారంభించాను. నేను చేసిన ఓ రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా వెళ్లాయి. కానీ అవి రిలీజ్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోసం థియేటర్ కూడా నేర్చుకున్నాను. ‘అమీర్ లోగ్’ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. మహిళలకు స్పూర్తినిచ్చేలా నా పాత్రను దర్శకుడు డిజైన్ చేశారు. ఈ జర్నీలో అమ్మే నాకు స్పూర్తి. ఈ సినిమాలోని పాత్ర కూడా అలానే ఉంటుంది. ముక్కు సూటిగా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. ఈ సినిమాలో నేను చేసిన పాత్రలో కూడా ఇలానే ఉంటాను. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చేసినట్టుగా మా దర్శకుడు రమణకు తెలీదు. బషీర్ మాస్టర్ మాకు ఈ మూవీ ఆడిషన్స్ గురించి చెప్పారు. నేను ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడ నేను బాగా పర్ఫామ్ చేయడంతో దర్శకుడు వెంటనే ఓకే చెప్పారు. ‘అమీర్ లోగ్’ సినిమా చూసిన

భారతీయ పురాణ ఇతిహాసాల స్ఫూర్తితో దేశీ సూపర్ హీరో కథలను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ వర్మ, తన యూనివర్స్ నుంచి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మహాకాళి’. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రాబోతోంది. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanuman) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను విస్తరిస్తూ ముందుకు సాగుతోన్న విషయం తెలిసిందే. భారతీయ పురాణ ఇతిహాసాల స్ఫూర్తితో దేశీ సూపర్ హీరో కథలను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma), తన యూనివర్స్ నుంచి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మహాకాళి’ (Mahakali). భారతదేశపు మొట్టమొదటి ఫిమేల్ సూపర్ హీరో చిత్రంగా భారీ కాన్వాస్‌పై రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి తాజాగా మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ అందించారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna).. ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అక్షయ్ ఖన్నా రాక్షసుల గురువైన ‘శుక్రాచార్య’ అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను పరిచయం చేస్తూ ఆగస్ట్ 24న చిత్ర బృందం ‘ఫస్ట్ గ్లింప్స్’ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘ఆగస్టు 24 - ది ఎండ్ బిగిన్స్’ అంటూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటన సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఒక పురాణ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రోహిత్ సరాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ, మూల కాన్సెప్ట్ అందించగా, ప్రతిభావంతురాలైన పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే

మన దేశమంతా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటాము. కానీ పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆరోజు నిర్వహించుకోరు. వారికి ఆగస్టు 18న స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకుంటారు. అందుకే ఆ రోజే నిర్వహించుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాలు ఆగస్టు 18నే స్వాతంత్య్ర దినోత్సవం సెలెబ్రేట్ చేసుకుంటాయి. అలా ఎందుకు చేసుకుంటారో తెలుసుకోండి. 1947లో భారత విభజన సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం సరిహద్దుల విభజన బాధ్యతను లండన్‌కు చెందిన న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ కు అప్పగించింది. అంతకుముందు ఎన్నడూ భారతదేశానికి రాని రాడ్‌క్లిఫ్, సరిహద్దు కమిషన్లకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. వారు గీసిన ప్రాథమిక మ్యాప్ ప్రకారం పశ్చిమ బెంగాల్ లోని హిందూ జనాభా ఎక్కువగా ఉన్న నదియా, మాల్దా, ముర్షిదాబాద్, దినాజ్‌పూర్ వంటి ప్రాంతాలను పొరపాటున తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) భూభాగంలో చూపించారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే, ఈ ప్రాంతాల ప్రజలు తాము ఏ దేశంలో ఉన్నామో తెలియక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తాత్కాలిక మ్యాప్ ఆధారంగా ఆగస్టు 14, 15 తేదీలలో నదియాలోని కృష్ణనగర్, మాల్దాలోని ఇంగ్లీష్ బజార్ వంటి ప్రభుత్వ భవనాలపై పాకిస్తాన్ జాతీయ జెండాలను కూడా ఎగురవేశారు. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, హిందూ మహాసభ నాయకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, నదియా రాజకుటుంబీకులు తీవ్ర నిరసనలు వ్యక్తంచేసి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన మౌంట్‌బాటన్, రాడ్‌క్లిఫ్‌ను సరిహద్దులను సరిచేయాల్సిందిగా ఆదేశించారు. ఆగస్టు 17 రాత్రి ఆల్ ఇండియా రేడియో ద్వారా సవరించిన మ్యాప్ వివరాలను ప్రకటించారు. దీని ప్రకారం ఈ ముస్లిమేతర మెజారిటీ ప్రాంతాలు భారతదేశంలోనే ఉంటాయని స్పష్టమైంది. రేడియో ప్రకటన తర్వాత, 1947 ఆగస్టు 18 మధ్యాహ్నం ఆయా ప్రాంతాల్లోని పాకిస్తాన్ జెండాలను తొలగించి, మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఎగురవేశారు

గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై హాలీవుడ్ చిత్రాల జోరు మామూలుగా లేదు. ఇండియన్ స్ట్రెయిట్ చిత్రాలను తరహాలో కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. మన ఆడియన్స్‌కు హాలీవుడ్ మేకింగ్, అక్కడి విజువల్స్ విపరీతంగా నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలకైతే మన దగ్గర ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. భాషతో సంబంధం లేకుండా సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చే సినిమాలను మన ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన పలు హారర్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది. 'ది కంజూరింగ్: ది లాస్ట్ రైట్స్', అలానే 'ఈవిల్ డెడ్ బర్న్' లాంటి సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించాయి. ఈ సినిమాలు కేవలం భయపెట్టడమే కాకుండా, థియేటర్లకు భారీగా జనాలను రప్పించి వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించాయి. లోకల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్ సైతం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ఇండియన్ సినిమా లవర్స్ ఇప్పుడు సరికొత్త హారర్ వరల్డ్‌ను ఎంతలా ఆస్వాదిస్తున్నారో ఈ కలెక్షన్లే నిరూపించాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే బాటలో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు మరో భయంకరమైన మూవీ సిద్ధమైంది. అదే ఇన్సీడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (Insidious: Out of the Further). హారర్ సినిమా ప్రియులకు ఇన్సిడియస్ ఫ్రాంచైజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దెయ్యాలు, ఆత్మలు తిరిగే ది ఫర్దర్ అనే డార్క్ డైమెన్షన్ కాన్సెప్ట్‌తో వచ్చిన మునుపటి భాగాలు ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా, మన ఇండియాలోనూ కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాయి. జంప్ స్కేర్స్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో కూర్చున్న
పల్లవి మారింది అనుకునే లూపే ఆమెలో విషం నింపుతూ ఉంది భానుమతి. ఈరోజు (ఆగస్టు 19) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. అవని ఆఫీస్‌కి వెళ్తానంటోంది.. శ్రియ కూడా జాబ్ చేస్తుంది. నువ్వు మాత్రం ఇంట్లో వంటింటి కుందేలులా ఉంటున్నావ్. నీకెలా ఉందో కానీ.. నాకు మాత్రం సిగ్గుగా ఉంది.. నువ్వూ చదువుకున్నావ్ కదా.. నీ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలని లేదా? బాగా ఆలోచించుకో’ అంటూ పల్లవికి ఎక్కిస్తుంటుంది భానుమతి. అయితే భానుమతి మాటల్ని మీనాక్షి వినేస్తుంది. పల్లవి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక మీనాక్షి.. అవనిని తీసుకుని వెళ్లి చక్రధర్‌ని కలుస్తుంది. కుశల ప్రశ్నల తరువాత అసలు మ్యాటర్‌కి వస్తుంది మీనాక్షి. ‘మీతో పల్లవి గురించి మాట్లాడాలి.. పల్లవి మారిందంటే మీరు చాలా సంతోషపడ్డారు. మీకంటే, అవనికంటే కూడా నేను ఎక్కువ సంతోషపడ్డాను. కానీ మనం సంతోషపడటం వల్ల పల్లవికి ఏ ఉపయోగం లేదు. మనందరం కోరుకున్నట్టుగానే పల్లవి మారింది.. కానీ మంచిగా మారిన పల్లవి మాత్రం సంతోషంగా లేదండీ’ అని అంటుంది మీనాక్షి.పల్లవి సంతోషంగా లేకపోవడం ఏంటి? అని చక్రధర్ అడిగితే.. తను మారింది కానీ తలెత్తుకుని బతకలేకపోతుంది అని అంటుంది మీనాక్షి. తను ఎవరికీ తక్కువ కాదు అనేట్టుగా పల్లవి ఉండాలి.. అప్పుడే కదా తనకి నిజమైన సంతోషం అని అంటుంది మీనాక్షి. దాంతో అవని.. ‘నిజమేనమ్మా.. నువ్వు చెప్పిందీ.. పల్లవి సంతోషం కోసం నేను కానీ నాన్న కానీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని అంటుంది. చెప్పు అవనీ.. పల్లవికి డబ్బు అవసరమా? ఎంతైనా ఇస్తాను అని అంటాడు చక్రధర్. ‘మీరు ఇచ్చే ఆమె అవసరాన్ని తీర్చుతుందేమో కానీ.. గుర్తింపుని తీసుకుని రాదు’ అని అంటుంది మీనాక్షి. మరి ఏం చేయాలి? అని చక్రధర్, అవనిలు అడగడంతో.. ‘పల్లవి అంత పెద్ద చదువులు చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉంటుంది.. అవని, శ్రీయలు

వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి అనుగుణంగా గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తోన్నారు. ప్రయాణికుల నుంచి అందుతున్న ఆదరణ నేపథ్యంలో వాటిని రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ గా మార్పు సైతం చేస్తోన్నారు.ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి. తాజాగా మరో వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్దీకరించారు. ఆగస్టు 20వ తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి రానుంది. తెలంగాణ, ఏపీ నుంచి తిరుపతికి వెళ్లే వారికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 07607 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు తిరుచానూర్ కు చేరుకుంటుంది.ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తిరుచానూర్ నుంచి బయలుదేరే నంబర్ 07608 ఎక్స్ ప్రెస్.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.మొత్తం 20 బోగీలతో కూడిన రైలు ఇది. వీటిల్లో 2ఏ- 2, 3ఏ- 8, స్లీపర్- 6, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లు- 4 ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
తిరుమల శ్రీవారి దర్శనానికి ఐదారు నెలలుగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. మార్చి నెల నుంచి భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలో శుక్రవారం నుంచి సోమవారం వరకు రద్దీ కనిపిస్తోంది. ఐదారు నెలలుగా రోజువారీ 60వేల నుంచి లక్ష వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. చాలా కాలం తర్వాత శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనా సమయంలోనే ఇంత భారీగా ఆదాయం వస్తుంది. ఈసారి మాత్రం సాధారణ రోజులోనే భారీగా ఆదాయం రావడం విశేషం.మంగళవారం తిరుమల శ్రీవారిని 80,905మంది భక్తులు దర్శించుకున్నారు.. 33,539 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీకి రూ.6.12 కోట్లు ఆదాయం వచ్చింది. మంగళవారం రోజు 4.16 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా.. అన్నప్రసాదాలను 2.88 లక్షలమంది స్వీకరించారు. తిరుమలలో 3546మంది భక్తులు వైద్య చికిత్స పొందారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందంటున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది.శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలుతిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులు సంసార బంధాల నుంచి విముక్తి పొంది.. భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారనే సందేశాన్ని ధాటీపంచకం అందిస్తుందని భద్రాచలానికి చెందిన స్థలశాయీ స్వామి అన్నారు. దాశరథి