నా పెంపకంలో తప్పు ఉందా? నేను తప్పు చేశానా? అని శేఖరం అడుగుతాడు. లేదు నాన్నా అని శైలు అంటుంది. మరి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశావ్.. పెళ్లికి ముందే ఇలాంటి తప్పు చేశావ్ అని అందరికీ తెలిస్తే మన పరువు ఏం అవుతుంది.. నీకు కావాల్సినంత స్వేచ్చ ఇచ్చాను.. అమ్మాయిలు చదువుకోవాలి అని.. నిన్ను కాలేజీకి పంపిస్తే కడుపు చేసుకుని వస్తావా? అని శేఖరం అడుగుతాడు. నాన్నా.. అని శైలు అంటుంది. అవునమ్మా.. నాన్ననే.. నాన్ననే అంటున్నాను.. చెప్పమ్మా అని అంటాడు శేఖరం. ఎందుకే మా పరువుతీశావ్.. మీ నాన్న నీ గురించి ఎంతో గొప్పగా చెబుతూ తలెత్తుకుని తిరిగేవాడు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బయటకు వెళ్లమంటావే.. పరువు తీశావ్ కదే అని చితక్కొడుతుంది వరాలు. ఇది అబద్దమే కదా.. అని వరాలు అంటే.. ఇది అబద్దమే, నేను ఏ తప్పు చేయలేదు.. కానీ ఈ విషయం ఇప్పుడు మీకు చెప్తే మీరు మళ్లీ పెళ్లి అంటారు.. కేశవ వచ్చాకే ఈ నిజం చెప్పాలి అని శైలు తన లోలోపల అనుకుంటుంది. ఇంతలో కేశవకి సురేష్ గాడు ఫోన్ చేసి.. మా చెల్లికి కడుపు చేస్తావా? ఇక్కడకు రారా నిన్ను నరికేస్తా అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. కడుపు ఏంట్రా అని కేశవ అడిగే లోపు కట్ చేసేస్తాడు.పోలీసు కేసు పెడతా మాధవకి ఫోన్ చేస్తుంది వరాలు. ఎవరు అని మాధవ అడుగుతాడు. నేను శైలు మహామ్మారిని కన్నా అమ్మని,.. అమ్మమ్మని అవుతున్నాను అని గర్వంగా చెప్పుకోవాలా? పెళ్లికి ముందే ఇలా చేసిందని చెప్పుకోవాలా? ఇదంతా మీ తమ్ముడి పుణ్యమే అని చెప్పుకోవాలా? అని ఏడ్చేస్తుంటుంది. మా తమ్ముడు అలాంటివాడు కాదండి అని మాధవ అంటాడు. మా కూతురు అంత పెద్ద నోరు వేసుకుని, అందరికీ వినిపించేలా చెబుతోంది.. దానికి మాయ మాటలు చెప్పి మోసం చేశాడు.. మీ అందరినీ వదిలి పెట్టను.. పోలీసు కేసు పెడతాను అని ఫోన్ పెట్టేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది వరాలు.కేశవను కొట్టిన మాధవ.. ఆ మాటలు విన్న మాధవ ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతాడు. ఏమైంది అన్నయ్య.. మన కేవశ తండ్రి కాబోతోన్నాడా? అని చక్రి సంబరంగా అడుగుతాడు. మన కేశవ తప్పు చేశాడు అని మాధవ అంటాడు. అదే టైంలో కేశవ వచ్చి మన శైలు అని ఏదో చెప్పబోతాడు. కానీ కేశవ చెప్పేది వినకుండా.. కొడుతూనే ఉంటాడు. అమ్మాయిని పెళ్లి కాక ముందే తల్లిని చేస్తావా? తొందర పడతావా? రెండు కుటుంబాల పరువు తీస్తావా? అని కొడుతూనే ఉంటాడు. అన్నయ్య కాస్త శాంతించు.. నువ్వు ముందు లోపలకు వెళ్లు అని మాధవను పంపిస్తాడు చక్రి.నువ్వు తొందర పడ్డావ్ నువ్వు తొందర పడ్డావ్ కాబట్టే ఆ రోజు ఆ అమ్మాయి బ్యాగ్ పట్టుకుని ఇంటికి వచ్చి ఉంటుంది అంతేనా? అని తిడతాడు మాధవ. కానీ కేశవ సైలెంట్‌గానే ఉంటాడు. మాధవను పంపించిన చక్రి.. రేయ్ కంగ్రాట్స్ రా నన్ను పెదనాన్నని చేశావ్ అని అంటాడు. నన్ను బాబాయ్‌ని చేశావ్ అన్నయ్య అని కన్నా అంటాడు. కేశవ అలా బయటకు వచ్చి.. ముద్దు పెట్టుకుంటేనే కడుపు వస్తుందా.. అసలు ఇది ఎందుకు అలా చెప్పింది అని ఫోన్ చేస్తాడు. కానీ అది స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలేం జరిగి ఉంటుంది అని కేశవ అనుకుంటూ ఉంటాడు.పెళ్లి చేసేద్దాం.. ఏం ఆలోచిస్తున్నావ్ అన్నయ్య అని పెద్ది దగ్గరకు వచ్చి అంటాడు చక్రి. ఏం తోచడం లేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని పెద్ది అంటాడు. ఈ ఇద్దరూ ఇష్టపడ్డారు.. ఆ విషయం అందరికీ తెలుసు.. మన కేశవ తొందర పడడు.. ఒక వేళ పడి ఉంటే.. మనం పెళ్లి చేసేద్దాం అని చక్రి అంటాడు. అవతలి వాళ్లు ఏం అనుకుంటున్నారో.. వాళ్ల నిర్ణయం ఏంటో తెలీదు కదా అని అంటాడు పెద్ది. పోలీసులు, కౌన్సిలర్, వీధిలోని జనాలు అందరికీ ప్రేమ గురించి తెలుసు.. పెళ్లి చేసినా ఎవ్వరూ ఏం అనుకోరు కదా అని చక్రి అంటాడు.మీలో మంచి ఉంటే అంటాను కదా.. ఏంటి.. ఏం అయింది అని పెద్ది వెళ్లపోవడం చూసి చక్రిని అడుగుతుంది మహా. ఏం లేదు వాళ్ల పెళ్లి గురించి ఏం తోచడం, ఆలోచన రావడం లేదని అంటున్నాడు అని చక్రి అంటాడు. నాకు తెలిసి.. కేశవ అలాంటి పని చేయడు.. మంచివాడు.. ఎక్కడో ఏదో తప్పు ఉంది అని మహా అంటుంది. నా గురించి ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? అని మహాని చక్రి అడుగుతాడు. మీలో మంచి ఉంటే అంటాను కదా.. ఒక్కటైనా మంచి చెప్పండి అని మహా అంటుంది. రాక్షసి మాట వరసకు అయినా మంచివాడ్ని అని చెప్పదు అని చక్రి అనుకుంటాడు.బావబామ్మర్దుల పోట్లాట నారాయణ తన ఓల్డ్ ఫ్రెండ్స్‌తో కలిసి పేకాట ఆడుతుంటాాడు. ఇంతలో దుర్గ ప్రసాద్ తన మనుషులతో వచ్చి రెచ్చగొడతాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఊర్లోకి వస్తావ్ అని అంటాడు దుర్గ ప్రసాద్. ఇది నీ ఊరే కాదు.. నా ఊరు కూడా అని అంటాడు నారాయణ. ఇక్కడ నిన్ను పాతి పెట్టడానికి బెత్తెడు జాగ అయినా ఉందా? అని అంటాడు దుర్గ ప్రసాద్. అసలు నిన్ను ఎలా వదిలేస్తానని అనుకున్నావ్ అని తన మనుషులతో దాడి చేయిస్తాడు దుర్గ ప్రసాద్. అందరినీ చితక్కొట్టేస్తుంటాడు నారాయణ.ఎత్తుకెళ్లిన దుర్గా ప్రసాద్ ఏడాదికి ఓసారి వచ్చి వెళ్లిపోతారు.. వాళ్లతో ఎందుకు దుర్గ అని ఓ పెద్దాయన అంటాడు. అసలు మీకు ఏంట్రా పని.. పక్కకి వెళ్లండి అని నారాయణ మీద దాడి చేస్తుంటారు. ఇక నారాయణ ఆ రౌడీలను కొడుతూ ఉంటే.. దుర్గ ప్రసాద్ దొంగ దెబ్బ తీస్తాడు. కర్రతో నెత్తి మీద కొడతాడు. దీంతో నారాయణ డౌన్ అవుతాడు. నారాయణ ఆ రౌడీలంతా పట్టుకుని కారులో ఎక్కిస్తారు. ఇదంతా కూడా సతీష్ దూరం నుంచి చూస్తే ఉంటాడు. ఈ విషయాన్ని మాధవకి, చక్రికి చెప్పాలని బయల్దేరుతాడుకేశవను ఆడుకున్న శైలు.. విషయం ఏంటో కనుక్కుందాం అని కేశవ మళ్లీ శైలుకి ఫోన్ చేస్తాడు. కాసేపు ఆడుకుందాం అని కేశవను ఇంకా భయపెడుతుంది శైలు. నీకు కడుపు అని, ప్రెగ్నెంట్ అని మీ అన్న గాడు ఏదేదో అంటున్నాడు అని కేశవ అంటాడు. అవును.. నీకు తెలీదా? అంతా చేసింది నువ్వే కదా.. నీ వల్లే కదా.. నువ్వు తండ్రివి కాబోతోన్నావు అని శైలు ఆట పట్టిస్తుంది. దీంతో కేశవ షాక్‌లో ఉండిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడటం లేదు.. అన్నీ మర్చిపోయావా? అని అంటుంది శైలు. నేనే చేశానా? ఇవన్నీ నాకు గుర్తు లేవే అని అంటాడు కేశవ. శైలు మాటలకు కేశవ అలా కంగారు పడుతుంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.




