పల్లవి మారింది అనుకునే లూపే ఆమెలో విషం నింపుతూ ఉంది భానుమతి. ఈరోజు (ఆగస్టు 19) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. అవని ఆఫీస్‌కి వెళ్తానంటోంది.. శ్రియ కూడా జాబ్ చేస్తుంది. నువ్వు మాత్రం ఇంట్లో వంటింటి కుందేలులా ఉంటున్నావ్. నీకెలా ఉందో కానీ.. నాకు మాత్రం సిగ్గుగా ఉంది.. నువ్వూ చదువుకున్నావ్ కదా.. నీ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలని లేదా? బాగా ఆలోచించుకో’ అంటూ పల్లవికి ఎక్కిస్తుంటుంది భానుమతి. అయితే భానుమతి మాటల్ని మీనాక్షి వినేస్తుంది. పల్లవి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక మీనాక్షి.. అవనిని తీసుకుని వెళ్లి చక్రధర్‌ని కలుస్తుంది. కుశల ప్రశ్నల తరువాత అసలు మ్యాటర్‌కి వస్తుంది మీనాక్షి. ‘మీతో పల్లవి గురించి మాట్లాడాలి.. పల్లవి మారిందంటే మీరు చాలా సంతోషపడ్డారు. మీకంటే, అవనికంటే కూడా నేను ఎక్కువ సంతోషపడ్డాను. కానీ మనం సంతోషపడటం వల్ల పల్లవికి ఏ ఉపయోగం లేదు. మనందరం కోరుకున్నట్టుగానే పల్లవి మారింది.. కానీ మంచిగా మారిన పల్లవి మాత్రం సంతోషంగా లేదండీ’ అని అంటుంది మీనాక్షి.పల్లవి సంతోషంగా లేకపోవడం ఏంటి? అని చక్రధర్ అడిగితే.. తను మారింది కానీ తలెత్తుకుని బతకలేకపోతుంది అని అంటుంది మీనాక్షి. తను ఎవరికీ తక్కువ కాదు అనేట్టుగా పల్లవి ఉండాలి.. అప్పుడే కదా తనకి నిజమైన సంతోషం అని అంటుంది మీనాక్షి. దాంతో అవని.. ‘నిజమేనమ్మా.. నువ్వు చెప్పిందీ.. పల్లవి సంతోషం కోసం నేను కానీ నాన్న కానీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని అంటుంది. చెప్పు అవనీ.. పల్లవికి డబ్బు అవసరమా? ఎంతైనా ఇస్తాను అని అంటాడు చక్రధర్. ‘మీరు ఇచ్చే ఆమె అవసరాన్ని తీర్చుతుందేమో కానీ.. గుర్తింపుని తీసుకుని రాదు’ అని అంటుంది మీనాక్షి. మరి ఏం చేయాలి? అని చక్రధర్, అవనిలు అడగడంతో.. ‘పల్లవి అంత పెద్ద చదువులు చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉంటుంది.. అవని, శ్రీయలు ఆఫీస్‌లకు వెళ్తున్నారు.. తనకీ ఏదైనా చేయాలని అనుకుంటుంది కదా’ అని అంటుంది మీనాక్షి.నిజమే అమ్మా.. పల్లవి ఏమీ అడగలేకపోవచ్చు.. కాబట్టి మనమే ఓ నిర్ణయం తీసుకోవాలి అని అంటుంది అవని. దాంతో చక్రధర్.. నా బిజినెస్‌లు చూసుకోమని పల్లవికి బాధ్యతలు అప్పగిస్తా.. అని అంటాడు చక్రధర్. ఇక అవని, మీనాక్షిలను వెంటపట్టుకుని వచ్చిన చక్రధర్.. నా కూతురు ఎక్కడా అని అంటాడు. ఇంతలో పల్లవి వస్తుంది. డాడ్ అంటూ ప్రేమగా పలకరిస్తుంది. పల్లవి ప్రేమను చూసి మురిసిపోతాడు చక్రధర్. ‘నన్ను క్షమించండి డాడ్’ అని అంటుంది పల్లవి. నా ఆశ నిజమైనందుకు చాలా ఆనందంగా ఉందమ్మా అంటూ ఎమోషనల్ అవుతాడు చక్రధర్.ఈ సంతోషసమయంలో అందరికీ ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీనాక్షి నీ నోటితో నువ్వే చెప్పు అని అంటాడు చక్రధర్. అది మీరు చెప్తేనే బావుంటుంది.. మీరే చెప్పండి అని అంటుంది మీనాక్షి. ఎవరొకరు చెప్పెండెహే అన్నట్టుగా చూస్తారు వాళ్లంతా. దాంతో చక్రధర్.. ‘నా తరువాత నా బాధ్యతల్ని తీసుకోవాల్సింది నా కూతురు పల్లవే కాబట్టి.. నా బిజినెస్లన్నింటికీ నిన్ను చైర్మన్‌ని చేస్తున్నా పల్లవీ’ అని అంటాడు చక్రధర్. దాంతో అందరూ పల్లవికి కంగ్రాట్స్ చెప్తారు. అందరూ తెగ సంబరపడిపోతారు. పల్లవి మాత్రం మౌనంగా ఉండిపోవడం చూసిన అవని.. ‘ఏమైంది మేమంతా ఇంత సంతోషంగా ఉంటే.. నువ్వేం ఆలోచిస్తున్నావ్’ అని అంటుంది.నాకు ఈ ఆస్తులు, పదవులు, హోదా ఇవేం వద్దు అక్కా.. నేను చైర్మన్‌గా ఆ కుర్చీలో కూర్చుంటే.. ఆ పదవి నాకు తండ్రి వారసత్వంగా వచ్చిందని అనుకుంటారు తప్ప.. నా అర్హతకి వచ్చిందని అనుకోరు. గుర్తింపు అయినా గౌరవం అయినా.. నాకు ఉన్న అర్హతతో.. నా ప్రతిభతో సొంతంగా దక్కించుకోవాలని అనుకుంటున్నాను. నా కాళ్లపై నేను నిలబడాలని అనుకుంటున్నా. నేను ఏం సాధించినా కూడా నా స్వయంకృషితోనే సాధించాలి. ఆ ఆశయం తప్ప.. నాకు ఈ ఆస్తులు, పదవులపై నాకు ఎలాంటి ఆశలు లేవు’ అని అంటుంది పల్లవి. ఇది పదవి కాదు.. బాధ్యత అనుకో చెల్లే అని అంటుంది అవని. ‘లేదక్కా.. డాడ్ ఇచ్చారంటే నాకు దానంలా కనిపిస్తుంది.. నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి.. గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా కల, ఆశ. వీలైతే దానికి సాయం చేయండి.. ఉత్తిగా వచ్చే పదవులు ఆస్తులు నాకు వద్దు.. మీరేం చెప్పినా నా నిర్ణయం మారదు’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది పల్లవి. ఇక ఆమె మాటలకు అక్కడున్న వాళ్లంతా సర్ ప్రైజ్ అయిపోతారు. ఇక అవని.. పల్లవి చేయాలనుకుంటున్న బిజినెస్ కోసం డబ్బులు సమకూర్చే పనిలో పడింది అవని.




