
© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా పవన్ కల్యాణ్ అండగా నిలుస్తున్నాడని చిరంజీవి అన్నారు. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ వేదికగా చిరు (Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. తమ్ముడిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. పవన్ సంకల్ప సాధకుడని ప్రశంసించారు.
‘‘నిబద్ధత, బాధ్యత, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి.. ఇవన్నీ మా కల్యాణ్ బాబులో (Pawan Kalyan) చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు. మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో.. తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ.. పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాడు. పవన్‌ను ఇలా చూస్తుంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కల్యాణ్ బాబు.. ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Help others stay updated with verified breaking news and insights.








