
పొట్టి ఫార్మాట్ అని పిలిచే టీ20 క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. పరిమిత ఓవర్లు, తీవ్రమైన ఒత్తిడి మధ్య వంద పరుగులు పూర్తి చేయడం బాటన్స్కు పెద్ద సవాల్. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లలో కొందరు బ్యాటర్లు మైదానంలో విరుచుకుపడుతూ వరుసగా సెంచరీలు బాదారు. ప్రపంచ టీ20 లీగ్‌లు, ఇంటర్నేషనల్ మ్యాచులలో అత్యధికంగా సెంచరీలు చేసిన టాప్ 7 బ్యాటర్ల రికార్డులను ఇప్పుడు చూద్దాం.
టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ తన సుదీర్ఘ టీ20 కెరీర్లో ఏకంగా 22 సెంచరీలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. తన కెరీర్లో మొత్తం 463 టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్ 14,562 పరుగులు చేశారు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానంలో పరుగుల సునామీ సృష్టించడంలో గేల్ తనదైన ముద్ర వేశాడు. అందుకే ఈ ఫార్మాట్లో ఇప్పటికీ మోస్ట్ సెంచరీల వరల్డ్ రికార్డు గేల్ పేరిటే పదిలంగా ఉంది.
అత్యధిక సెంచరీల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానంలో ఉన్నారు. తన నిలకడైన బ్యాటింగ్‌తో సుదీర్ఘ కాలంగా పరుగులు సాధిస్తున్న బాబర్, టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 13 సెంచరీలు సాధించారు. మొత్తం 359 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజమ్ 12,493 పరుగులు చేసి తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. తక్కువ మ్యాచుల్లోనే అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో బాబర్ ఒకరిగా నిలిచారు.
టీ20 క్రికెట్లో పదేసి సెంచరీలతో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో 430 టీ20 మ్యాచ్‌లు ఆడి 10 సెంచరీలు సాధించారు. కోహ్లీ మొత్తం 14,218 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 10 సెంచరీలతో సమానంగా ఉన్నారు. వార్నర్ 439 మ్యాచుల్లో 14,284 పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ కింటన్ డికాక్ ఇటీవల క్యారీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2026 లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఆడుతూ తన 10వ టీ20 సెంచరీని బాదారు. డికాక్ ఇప్పటివరకు 457 టీ20 మ్యాచుల్లో 12,867 పరుగులు సాధించారు.
పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అత్యంత వేగంగా సెంచరీలు బాది ఈ జాబితాలో ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. కేవలం 181 టీ20 మ్యాచ్‌లలోనే ఫర్హాత్ 9 సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. అతి తక్కువ మ్యాచ్‌లలో ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫర్హాత్ మొత్తం 5,526 పరుగులు చేశారు.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటివరకు 206 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 9 సెంచరీలు బాది ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. మొత్తం 5,995 పరుగులు చేసి తన నిలకడను నిరూపించుకున్నారు. యంగ్ ఏజ్‌లోనే ఈ రేంజ్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం.
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.
Share this story
Help others stay updated with verified breaking news and insights.
Recommended for you










