
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Hardik Pandya Trade 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొంతకాలంగా గందరగోళం కొనసాగుతోంది. ముంబై ఫ్రాంచైజీని పాండ్యా వీడనున్నాడని సమాచారం అందుతున్న నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) లేదా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లోకి మారనున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే, 'క్రిక్‌బజ్' నివేదిక ప్రకారం ముంబై ఇండియన్స్ అతన్ని వేరే జట్టుకు బదిలీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
కోల్‌కతా, చెన్నై ఫ్రాంఛైజీలతో చర్చలు! గత కొన్ని వారాలుగా హార్దిక్ పాండ్యా కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు పోటీ పడుతున్నాయని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేలింది.
మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా జట్టు హార్దిక్‌పై ఆసక్తి చూపుతున్నప్పటికీ, తమ కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరోవైపు, తమ జట్టు కోచ్ నియామకం పూర్తయిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెన్నై సూపర్‌కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా, చెన్నై టీమ్స్‌తో జరుగుతున్న ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబై ఇండియన్స్ ప్రదర్శన-హార్దిక్ గణాంకాలు 2024లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ కెప్టెన్సీ జట్టుకు పెద్దగా కలిసిరాలేదు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు, 2024లో చివరి స్థానంలో నిలవగా, 2026 సీజన్లో తొమ్మిదవ స్థానానికి పరిమితమైంది. కేవలం 2025లో మాత్రమే జట్టు 'క్వాలిఫైయర్ 2' వరకు వెళ్లగలిగింది.
ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే, 2024 నుంచి హార్దిక్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ప్రతి సీజన్లోనూ అతను 25 కంటే తక్కువ సగటుతో 225 పరుగుల కంటే తక్కువే చేశాడు. అలాగే అతని స్ట్రైక్ రేట్ కూడా 150 లోపే ఉంది. బౌలింగ్ పరంగా మాత్రం అతను మొత్తంగా 29 వికెట్లు పడగొట్టగలిగాడు.
ఫిట్‌నెస్‌పై దృష్టి 2026 IPL సీజన్ ముగిసిన తర్వాత ఆటకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE)లో శిక్షణ పొందుతున్నాడు. తన పూర్తి ఫిట్నెస్ను సాధించే దిశగా ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, రాబోయే సీజన్లో హార్దిక్ ముంబై ఇండియన్స్ జట్టులోనే కొనసాగుతాడా లేదా అన్నదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





