
చికిత్స పొందడం కోసం కేరళం వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరిగి వచ్చే సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. కేరళం ప్రజలు చూపిన ఆప్యాయత తనను కదిలించింది అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేరళంలోని ఆలయాల సందర్శన గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ పోస్టు పట్ల స్పందించిన కేరళం సీఎం.. ఏపీ డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి పవన్ కళ్యాణ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నామంటూ సతీశన్ ఎక్స్‌లో పోస్టు చేశారు.




