
బీర్కూర్: బాధితులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను బరంగ్ ఎడిగీ గ్రామంలో ఆదివారం ఆ గ్రామ సర్పంచి రెంజర్ల అనిల్ కుమార్ అందజేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ.. తమ గ్రామానికి చెందిన రెంజర్ల సాయిలు, కోటగిరి మొగులవ్వ, బాగ్గొండ సాయిలు గత ఏడాది అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ముగ్గురికి మంజూరైన రూ. 82 వేల చెక్కులను బాధిత కుటుంబాలకు అందించినట్లు సర్పంచ్‌ తెలిపారు.
300 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
బీర్కూర్: రైతునగర్ గ్రామానికి చెందిన వెంకట్రావు, సత్యనారాయణ, శోభన్ బాబు, ఆంజనేయులు, రాజేష్ దాతలు కలిసి ఆదివారం ఆ గ్రామ సర్పంచ్‌ నాగరాజ కుమారి చేతుల మీదుగా గ్రామస్థులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. అన్నారం, చించోల్లి, దామరంచ, రైతునగర్, కొల్లూరు గ్రామాలకు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల ద్వారా 300 మందికి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలనే ఉద్దేశంతో మట్టి ప్రతిమలను అందజేసినట్లు దాతలు తెలిపారు. మాజీ సర్పంచ్‌ నాగేశ్వరరావు, గోపాలమిత్ర అంజని కుమార్, తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






