
కావలి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కావలి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద తెదేపా నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి తటవర్తి రమేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 5,000 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ.. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్ఫూర్తితో గత మూడేళ్లుగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులుగా ప్రకృతికి మేలు చేసే మట్టి గణపతులనే పూజించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ ఆర్యవైశ్య సంఘం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తటవర్తి రమేష్ కుటుంబ సభ్యులు తటవర్తి శిరీష, పవన్, రాహుల్, వేముల సునీల్ కుటుంబ సభ్యులతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






